సాక్షి, తాడేపల్లి : రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పనులు ఆగిపోయాయని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుల ఇళ్లల్లో జరుగుతున్న ఐటీ దాడులను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎల్లో మీడియాకు కనబడం లేదా అని సూటిగా ప్రశ్నించారు.
లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గత ఐదేళ్లలో ఒక్క మెగా పరిశ్రమను కూడా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి తీసుకురాలేదని తెలిపారు. ఇప్పుడు పరిశ్రమలు తరలిపోతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
చదవండి : కొనసాగుతున్న ఐటీ సోదాలు
Comments
Please login to add a commentAdd a comment