
సాక్షి, విజయవాడ: ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీకి ఏజెంట్‌గా మారారు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో టీడీపీ చేసిన తప్పులను తాము చేయమని స్పష్టం చేశారు. అలానే లోకేశ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి అనిల్.
ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. ‘‘పోలవరం ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని టీడీపీ కుట్ర చేస్తోంది. రైతుల కళ్లలో ఆనందాన్ని టీడీపీ చూడలేకపోతోంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పోలవరం పనులు కొనసాగుతున్నాయి ఎదో ఒక రకంగా దాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అది పూర్తి అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్సార్‌కి మంచి పేరు వస్తుందని వారి భయం. అందుకే రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు’’ అని మంత్రి అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘చినబాబు ఫ్రస్టేషన్ పీక్స్‌కి వెళుతోంది. మూడు శాఖలకు మంత్రిగా చేసినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. ఉన్న ఎమ్మెల్సీ కూడా ఓ ఏడాదిలో పూర్తి అయిపోతుంది. అందుకే బయట తిరగలేక ఇంట్లో కూర్చుని జూమ్‌లో సీఎం జగన్ గురించి మాట్లాడుతున్నాడు.. కానీ వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత నీకు ఒక్క శాతమైనా ఉందా. మా తాత సీఎం, మా నాన్న సీఎం అని చెప్పుకున్నా నువ్వు గెలవలేక పోయావ్. కనుచూపు మేరలో నీ పార్టీ జగన్ సంక్షేమ పథకాలతో కొట్టుకుపోయే పరిస్థితి. జగన్ అముల్ బేబీ అయితే.. నువ్వు హెరిటేజ్ దున్నపోతువా. మాటలు నీకే కాదు...మాకు వచ్చు’’ అని మంత్రి అనిల్, లోకేశ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు.
‘‘గూగుల్‌లో కొడితే నీ పేరు పప్పు అని వచ్చింది. నువ్వు గడ్డం పెంచగానే ఏదో జరగదు. ధైర్యం బై బర్త్ బ్లడ్‌లో ఉండాలి. ఆత్మగౌరవం లేకనే మీ నాన్న హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నాడు. ఏ మాత్రం ఆంధ్ర ప్రజలపై ప్రేమ ఉన్నా గత ఐదేళ్లలో ఏపీలో ఇల్లు కట్టుకునే వాడు. పునరావాసం విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నాము. 2022 ఖరీఫ్ నాటికీ తప్పనిసరిగా సాగునీరు అందిస్తాం. స్పిల్ వే పూర్తి చేయకుండా కాపర్ డ్యామ్ ఎలా కడతారు. వీళ్ళు చేసిన తప్పులను మాపై రుద్దాలని చూస్తున్నారు. సీఎం జగన్ పోలవరం కోసం రావాల్సిన నిధుల విషయంపై ఢిల్లీలో చర్చిస్తారు’’ అని మంత్రి అనిల్ తెలిపారు.
చదవండి:
సీఎం ఢిల్లీ పర్యటనపై ఎల్లోమీడియా రాద్ధాంతం : బొత్స
రివర్స్ టెండరింగ్‌లో మరో మైలురాయి
Comments
Please login to add a commentAdd a comment