raghurama krishnamraju
-
విజయపాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
గుంటూరు లీగల్: సీఐడీ విశ్రాంత అధికారి ఆర్.విజయపాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరయింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీసులు విజయపాల్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. బుధవారం గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో రెండో అడిషనల్ జిల్లా సెషన్ జడ్జి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను ఆయనకు మంజూరు చేసింది. -
రూ.947 కోట్ల మోసం.. త్వరలో బిల్డప్ బాబాయ్ ఆస్తుల వేలం.. ఎన్సీఎల్టీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ ఆస్తుల వేలం జరగబోతుంది. ఈమేరకు కంపెనీ స్థిరచరాస్తులను వేలం వేస్తున్నట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రకటించింది. నోటీసులో తెలిపిన వివరాల ప్రకారం..రూ.360 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేయనున్నారు.కంపెనీ బ్యాంకుల కన్సార్టియం వద్ద దాదాపు రూ.947 కోట్లు అప్పు చేసింది. దాన్ని తిరిగి తిరిగిచెల్లించకపోవడంతో నిరర్థక ఆస్తిగా మారింది. ఎలాగైనా ఆ డబ్బును రాబట్టుకునేందుకు బ్యాంకులు కేంద్రాన్ని ఆశ్రయించాయి. దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఆ కేసును సీబీఐకు అప్పగించింది. 2019లోనే ఈ కంపెనీ డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. బ్యాంక్రప్సీ బోర్డు(ఐబీబీఐ) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) తాజాగా ఆస్తులు వేలం వేయాలని నిర్ణయించింది. దాంతో కంపెనీ చేసిన అప్పులను కొద్ది మొత్తంలో తగ్గించవచ్చనే ఉద్దేశంతో ఎన్సీఎల్టీ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.సీబీఐ ఛార్జ్‌షీట్..రూ.947.70 కోట్ల రుణాల మోసానికి సంబంధించి రఘురామకృష్ణంరాజు, ఆయన కంపెనీ ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌తో పాటు మరో 15 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) 2019లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇండ్-భారత్ రుణదాతల కన్సార్టియం నుంచి రూ.947 కోట్లు తీసుకుని చెల్లించకుండా మోసం చేస్తున్నట్లు సీబీఐ తెలిపింది. ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(పీఎఫ్సీ) రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ), ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) నుంచి కంపెనీకు చెందిన తమిళనాడులోని టుటికోరిన్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అప్పు చేసినట్లు చెప్పింది.ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ (రామేశ్వరం), సిబా సీబేస్, ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్, ఇండ్ భారత్ ఎనర్జీ ఉత్కల్, ఇండ్ భారత్ పవర్ వంటి కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన మధుసూధన్ రెడ్డి పేరును కూడా సీబీఐ ఛార్జ్షీటులో పేర్కొంది. కంపెనీ కాంట్రాక్టర్లు సోకియో పవర్ ప్రైవేట్ లిమిటెడ్, వై.నాగార్జున రావు, సీఏలు ఎంఎస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ జాబాద్తో పాటు కంపెనీ భాగస్వామ్యంలో ఉన్న టిఆర్ చద్దా అండ్ కంపెనీ, ఇండ్ భారత్ గ్రూప్‌కు చెందిన సి.వేణును నిందితులుగా చేర్చారు.ఇదిలాఉండగా, ఐబీబీఐ-ఎన్సీఎల్టీ ఆధ్వర్యంలో ఆస్తుల వేలానికి వెళ్తున్న కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా తమ బినామీల ద్వారా తిరిగి వాటిని దక్కించుకునే ప్రమాదం ఉంది. ముందుగా అప్పుచేసి కొనుగోలు చేసిన ఆస్తుల విలువతో పోలిస్తే ఆక్షన్‌లో దక్కించుకున్న వాటికి వ్యత్యాసం ఉంటుంది. దాంతో భారీగా లాభపడవచ్చని కొన్ని కంపెనీలు దురుద్దేశంతోనే దివాలా ప్రక్రియకు నమోదు చేసుకుంటాయి. రాజకీయమైనా, వ్యాపారమైనా సమర్థంగా నిర్వహించే సత్తా ఉంటేనే విజయం సాధిస్తారు. రాజకీయ ప్రచారంలో భాగంగా నీతులు చెబుతున్న రఘురామ వాటిని పాటించడేమో. బ్యాంకులకు అప్పులు కట్టకుండా ఎగనామం పెడితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలను మోసం చేసినట్లే. ఈ విషయాన్ని ప్రజలు గమనించరని భావిస్తున్నాడేమో పాపం. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో ప్రజలు తనకు సరైన గుణపాఠం చెబుతారని తెలుస్తుంది.ఇదీ చదవండి: గోల్డ్‌ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో బిల్డప్బాబాయ్గా పేరున్న రఘురామకృష్ణరాజుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దిల్లీ, మహారాష్ట్రల్లో 19 కేసులు నమోదయ్యాయి. ఆయనపై దిల్లీలో సీబీఐ కేసులు కూడా ఉన్నాయి.ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్‌గా ఉండి ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించడం, రూ.25 కోట్ల చెల్లింపులు చేయకపోవడానికి సంబంధించి మహారాష్ట్రలోని థానేలో ఆర్థిక నేరాల విభాగం 2022 జనవరి 27న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ కోర్టులో రెండు కేసులు, ముంబై కోర్టులో ఒక కేసు కొనసాగుతున్నాయి. -
మూడు ముక్కలైన ‘ఉండి’ టీడీపీ
ఉండి రాజుల కోటలో అసమ్మతి సెగలు రగులు తున్నాయి. పార్టీని నమ్మిననేతలను చంద్రబాబు బలి పశువులను చేస్తుంటే.. కార్యకర్తల ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. నోట్ల కట్టలే పరమావదిగా రోజుల వ్యవధిలో పార్టీ కండువాలు మార్చే నేతలకు టిక్కెట్లు కేటాయిస్తుండటంతో.. సిట్టింగ్ నేతకు సైతం సీటు బెంగ పట్టుకుంది. ఉండి.. సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకి ఎసరు పెట్టింది ఎవరు...? టీడీపీ మూడు ముక్కలు అవడానికి అసలు కారణాలేంటి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతిపక్ష కూటమి బీటలు వారుతోంది. నేతలు తలోదారి అన్నట్లుగా ఉండడంతో గెలుపు అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. ఇంతలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లా పర్యటన మరింత చిచ్చు రాజేసింది. ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు చంద్రబాబు షాక్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. చంద్రబాబునాయుడు నర్సాపురం, పాలకొల్లులో పర్యటించి రఘురామకృష్ణరాజును టీడీపీలో చేర్చుకున్నారు. పాలకొల్లులో పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ అభ్యర్థులతో పాటు, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఉండి సీటును రఘురామకృష్ణరాజుకు ఖరారు చేసి రామరాజుకు హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తొలి జాబితాలో అభ్యర్థిగా ఖరారు చేయగా రామరాజు, ఆయన సతీమణి ఇద్దరూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రఘురామరాజుకు సీటు అనడంతో టీడీపీ కేడర్ పాలకొల్లులో చంద్రబాబు క్యాంపు వద్దకు చేరుకుని పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డగించి ఘెరావ్ చేశారు. రామరాజుకే సీటు ఇవ్వాలని, రఘురామకృష్ణరాజుకు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నినాదాలు చేశారు. దీంతో నియోజకవర్గమంతో టిక్కెట్ మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు టిక్కెట్ కేటాయిస్తారనీ అశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే శివ రామ రాజుకు చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడంతో రెబల్ అభ్యర్థిగా మారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పుడు రామరాజు టిక్కెట్ లేదనే సంకేతాలు ఇవ్వడంతో రామ రాజు వర్గంచంద్రబాబు పై కన్నెర్ర చేస్తుంది. ఉండిలో సైకిల్ పార్టీని భూ స్థాపితం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.రామ రాజు తన అనుచరులకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. రఘు రామ కృష్ణo రాజు ఉండికి వస్తే సహించే ప్రసక్తే లేదనీ... రామరాజు వర్గం స్పష్టం చేశారు. దీంతో పశ్చిమ టీడీపీ కూటమి రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటించాలని కార్యకర్తలు కాన్వాయ్కి అడ్డుగా వెళ్లి నిరసన తెలిపినా చంద్రబాబు నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో కార్యకర్తలు నిరాశతోనే వెను తిరిగారు...రఘురామకృష్ణ రాజు రాకతో ఇప్పుడు ఉండి టీడీపీ మూడు ముక్కలైంది.ఇంతకీ ఎన్నికల బరిలో ఎవరు నిలవనున్నారు... ఉండి టీడీపీలో కుంపట్లు ఎప్పుడు చల్లారతాయో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
అమిత్ షా ఇంటి గేటు బయట నిలబడ్డ రఘురామ కృష్ణంరాజు
-
రఘురామరాజు ఇంప్లీడ్ పిటిషన్‌పై తక్షణ విచారణ అవసరం లేదు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో తనను కూడా ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలు వినాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ విషయంలో హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని రఘురామకృష్ణరాజును ప్రశ్నించింది. పిటిషనర్ వంటి రాజకీయ నాయకుడు దాఖలు చేసిన ఈ ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతిస్తే ఈ వ్యవహారం రాజకీయరంగు పులుముకుంటుందని వ్యాఖ్యానించింది. ఈ ఇంప్లీడ్ పిటిషన్ విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఇదే సమయంలో ఏఏజీ సుధాకర్‌రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వివరాలను తర్జుమా చేసి తమ ముందు ఉంచకపోవడంపై పిటిషనర్‌ను హైకోర్టు నిలదీసింది. ఏఏజీ, సీఐడీ చీఫ్ ఏ నిబంధనలు ఉల్లంఘించారో, వారిపై ఏం చర్యలు కోరుతున్నారో చెప్పాలంది. నిబంధనల ప్రకారం వారిని తొలగించడమో, సస్పెండ్ చేయడమో చేయాలని పిటిషనర్ న్యాయవాది గిరిబాబు తెలిపారు. చంద్రబాబు కేసు వివరాలను వారు బహిర్గతం చేశారని, ఇది ఎంతమాత్రం సరికాదని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. స్కిల్ కుంభకోణం కేసు లేదా ఇతర ఏ కేసుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయకుండా, ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్‌లను ఆదేశించాలని కోరుతూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో తనను కూడా ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ రఘురామకృష్ణరాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ప్రజా సంక్షేమం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నిస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు తప్పుకున్నారు. దీంతో జస్టిస్ రఘునందన్‌రావు సభ్యుడిగా లేని బెంచ్ ముందు ఈ వ్యాజ్యాన్ని ఉంచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
రామచంద్ర భారతి, నందులతో ‘రఘురామ’ చెట్టపట్టాల్!
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందుకుమార్‌తో.. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సత్సంబంధాలు ఉన్నట్టుగా సిట్ గుర్తించినట్లు తెలిసింది. నిందితుల సెల్ఫోన్లలో రఘురామ కృష్ణరాజు దిగిన ఫొటోలు, ఇతర కీలక వివరాలు బయటపడినట్లు సమాచారం. దీంతో ఎంపీని విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 41–ఏ సీఆర్పీసీ కింద గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న ఉదయం 10:30 గంటలకు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపారు. సహేతుక కారణం లేకుండా గైర్హాజరైతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని ఎంపీకి పంపిన ఈ–మెయిల్లో విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ స్పష్టం చేశారు. మరోవైపు ఎంపీకి ప్రత్యక్షంగా నోటీసులు అందించేందుకు సిట్ అధికారులు గురువారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని రఘురామ నివాసానికి వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని, ఢిల్లీకి వెళ్లారని సిబ్బంది తెలిపినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ వెళ్లిన సిట్ బృందం ఆయన నివాసంలో నోటీ సులు అందజేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి రఘురామ కృష్ణరాజుకు ముందే సమాచారం ఉందేమోనని, ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిన నగదు సమకూర్చడంలో ఎంపీ పాత్ర ఉందేమోనని సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనను విచారించాలని నిర్ణయించింది. ఏడుకు చేరిన నిందితుల సంఖ్య ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తాజాగా మరో నలుగురిని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతో‹Ù, కర్ణాటక బీడీజేఎస్ చీఫ్ తుషార్ వెల్లపల్లి, కేరళ వైద్యుడు కొట్టిలిల్ నారాయణ జగ్గు అలియాస్ జగ్గు స్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా పేర్కొన్నారు. ఈ మేరకు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేశారు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న హైకోర్టు సింగిల్ జడ్జికి కూడా ఈ సమాచారం అందజేసినట్లు తెలిసింది. దీంతో ఈ కేసులో మొత్తం నిందితులు సంఖ్య ఏడుకు చేరుకుంది. ఇప్పటికే నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలు అరెస్టయి, చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజా నలుగురు నిందితులకు కూడా 120–బీ, 171–బీ రెడ్ విత్ 171–ఈ, 506 రెడ్ విత్ 34 ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం–1988 సెక్షన్–8 కేసులు వర్తిస్తాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరో ఐదుగురికి మళ్లీ నోటీసులు.. ఈ కేసు వెలుగులోకి వచి్చనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్ అలాగే జగ్గు పనిచేస్తున్న అమృత ఆసుపత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్ఓ) ప్రతాపన్లను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆ నలుగురు సాక్షులకు సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. అయితే వారు విచారణకు గైర్హాజరు కావటంతో తాజాగా 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈసారి కూడా హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ‘అమృత’తో జగ్గుస్వామి సంబంధాలు నిర్ధారణ! జగ్గు స్వామిని విచారించేందుకు కేరళ వెళ్లిన సిట్ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి బృందాన్ని .. అమృత ఆసుపత్రితో జగ్గుకు ఎలాంటి సంబంధాలు లేవంటూ ఆసుపత్రి సీఎస్ఓ తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. దీంతో సిట్ బృందం స్థానిక పోలీసుల సహకారంతో జగ్గు ఇళ్లు, ఆఫీసులపై సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా.. అమృత వైద్య విజ్ఞానసంస్థ (ఎయిమ్స్)లో పరిపాలన విభాగంలో డిప్యూటీ మేనేజర్‌గా జగ్గు స్వామి పనిచేస్తున్నారని తేలింది. ఆసుపత్రి తరఫున బ్యాంక్ చెక్‌లను జారీ చేసే అధికారం కూడా ఆయనకు ఉందని గుర్తించినట్టు తెలిసింది. ఇదీ చదవండి: కక్షతోనే ఆంక్షలు.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ. 40,000 కోట్ల గండి -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సిట్ నోటీసులు
-
చింతామణి నాటకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఓ వర్గం వారిని మరో వర్గం కించపరిచేందుకు అనుమతినిస్తే ఆ వర్గాల మధ్య ఘర్షణలకు ఆస్కారం కల్పించినట్లేనని, అందుకు తాము అంగీకరించబోమని హైకోర్టు స్పష్టం చేసింది. నాటకంలోని పాత్రల పేరుతో ఓ వర్గాన్ని కించపరిచేందుకు అనుమతించబోమని చెప్పింది. జీవనభృతి పేరుతో సామరస్యాన్ని దెబ్బతీయకూడదని స్పష్టం చేసింది. చింతామణి నాటకం ఒరిజినల్ తెలుగు పుస్తకం ఆన్లైన్ కాపీని ప్రభుత్వ న్యాయవాదులకు, ఆర్య వైశ్య సంఘాల తరఫు న్యాయవాదులకు అందజేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 26కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ద్వారా ఆర్యవైశ్యులను వేశ్యాలోలురుగా చూపుతున్నారని, అందువల్ల నాటకాన్ని నిషేధించాలన్న ఆర్యవైశ్య సంఘాల వినతి మేరకు ప్రభుత్వం ఆ నాటకం ప్రదర్శనపై నిషేధం విధించింది. దీనిని సవాలు చేస్తూ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, కళాకారుడు త్రినాథ్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ రెండు వ్యాజ్యాలు శుక్రవారం సీజే ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయన్న కారణంతో మొత్తం నాటకంపై నిషేధం తగదన్నారు. దీనివల్ల వేలాది కళాకారుల జీవనభృతి దెబ్బతిందని తెలిపారు. వ్యభిచారం కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తుందని చెప్పడమే ఆ నాటకం ప్రధాన ఉద్దేశమని, సుబ్బిశెట్టి పాత్రతో అదే చెప్పించారని ఉమేశ్ వివరించారు. ఓ వర్గం పేరు ప్రతిబింబించేలా మీరెందుకు నాటకం ప్రదర్శిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఓ వర్గాన్ని మరో వర్గం కించపరిచేందుకు అనుమతినిస్తే పౌర యుద్ధానికి దారి తీస్తుందని తెలిపింది. త్రినాథ్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ స్పందిస్తూ, 2002లో ఈ నాటకంపై విధించిన నిషేధాన్ని ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో తొలగించారని వివరించారు. ఈ నాటకం కల్పితమని, అభ్యంతరకర డైలాగుల్లేకుండా చూడాలని 2002లో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిందన్నారు. నాటకం మొత్తంపై నిషేధం వల్ల కళాకారుల జీవనభృతి దెబ్బతిందన్న శ్రవణ్ కుమార్ వాదనతో ధర్మాసనం విభేదించింది. పూర్తిస్థాయి వాదనల సమయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామంది. -
ఎంపీ రఘురామపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
పశ్చిమ గోదావరి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు శుక్రవారం తెలిపారు. సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషించడమే కాక కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చింతలపూడికి చెందిన గొంది రాజు, ఎయిమ్ సభ్యుడు కాకర్ల సత్యనారాయణ, ఎంఎస్ రాజేంద్ర, బుచ్చిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంబేడ్కర్ మిషన్ నాయకులు మాట్లాడుతూ.. బ్యాంకులను మోసం చేసి ప్రజల సొమ్మును దోచుకున్న రఘురామ నిజాయితీపరుడైన అధికారిని దూషించడాన్ని ఖండించారు. -
ఏపీ సీఐడీ అధికారులపై రఘురామకృష్ణరాజు చిందులు
-
ఎంపీ రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు
-
రఘురామ కృష్ణరాజు కంపెనీకి చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఎంపీ రాఘురామ కృష్ణరాజు కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పిటిషన్‌ను ఎన్సీఎల్టీ తిరస్కరించింది. వివిధ బ్యాంకుల నుంచి ఇండ్ భారత్ కంపెనీ మొత్తం రూ. 1383 కోట్ల రుణం తీసుకుంది. అయితే రికవరీ కోసం ఢిల్లీలోని డెబిట్ ట్రిబ్యునల్‌ను బ్యాంకుల కన్సార్షియం అశ్రయించింది. రూ.1327 కోట్ల అప్పులకు గాను తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ. 872 కోట్లే ఉంది. దివాళా అయిన కంపెనీ పరిష్కార ప్రక్రియ చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోరింది. దివాలా ప్రక్రియకు అనుమతించవద్దంటూ రఘురామ కంపెనీ వాదించింది. పరిష్కార ప్రక్రియ ఆపాలంటూ ఎన్సీఎల్టీలో రఘురామ కంపెనీ వాదనలు వినిపించింది. అయితే రఘురామ కంపెనీ వాదనలతో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏకీభవించలేదు. ఆ వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి.. దివాలా ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దివాలా పరిష్కార నిపుణుడిని నియమించి, మూడు రోజుల్లో దివాలా ప్రక్రియ గడువుతో సహా వివరాలన్నీ తెలియజేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఫారం–2 దాఖలు చేయాలని స్పష్టం చేశారు. కంపెనీ ఆస్తులపై రఘురామకు ఎలాంటి అధికారం లేదని ట్రిబ్యునల్ పేర్కొంది. మధ్యంతర పరిష్కార ప్రక్రియ పూర్తి చేసే అధికారాన్ని శ్రీకాకుళం వంశీకృష్ణకు అప్పగించింది. మూడు రోజుల్లో ఇండ్ భారత్ కంపెనీని రిజల్యూషన్ స్వాధీనం చేసుకోనుంది. -
రఘురామ కృష్ణరాజుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: ఏపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎలా కోరతారంటూ మండిపడింది ఉన్నత న్యాయస్థానం. కేసు దర్యాప్తుతో సంబంధం లేని వ్యక్తులు ఇప్పుడెలా పిటిషన్ వేస్తారు? ముఖ్యమంత్రి జగన్ సాక్షులను ఏమైనా ప్రభావితం చేశారా? అసలు పిటిషన్‌కు ఏ రకంగా విచారణకు అర్హత ఉందంటూ సోమవారం విచారణ సందర్భంగా పిటిషనర్ రఘురామ కృష్ణరాజును హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు సీఎం జగన్‌కు నోటీసులివ్వాలన్న అభ్యర్థనను సైతం కోర్టు తిరస్కరించింది. తుది తీర్పును రిజర్వ్‌లో పెట్టింది తెలంగాణ హైకోర్టు. -
ఎం పీ రఘురామకృష్ణరాజు అనర్హత వేటుపై స్పీకర్ ను వివరణ అడిగిన సాక్షి టీవీ
-
రఘురామకృష్ణంరాజు అనర్హత పిటిషన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి
-
రఘురామకృష్ణరాజు రిమాండ్ పొడిగింపు
సాక్షి, అమరావతి: అసత్య ప్రచారంతో సమాజంలో విద్వేషాలు రేకెత్తించి, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్న కేసులో నిందితుడైన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ నిబంధనల్ని ఉల్లంఘించారని సీఐడీ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన జ్యుడిషియల్ రిమాండ్‌ను ఈ నెల 25 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ వెళ్లిపోయిన రఘురామకృష్ణరాజు మళ్లీ గుంటూరు జైలుకు రావల్సిన అనివార్యత ఏర్పడింది. గుండెకు శస్త్ర చికిత్స జరిగినందున రఘురామకృష్ణరాజుకు మే 21న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, నిబంధనల ప్రకారం ఆయన గుంటూరు జైలుకు వచ్చి బెయిల్ పత్రాలపై సంతకం చేసి బెయిల్‌పై విడుదల కావాల్సి ఉంది. బెయిల్ షరతుల ప్రకారం గతనెల 28న రూ.లక్ష విలువైన రెండు ష్యూరిటీలను సీఐడీ న్యాయస్థానంలో సమర్పించారు. వాటిని అదేరోజున న్యాయస్థానం ఫారం–43తో సహా గుంటూరు జైలుకు పంపించింది. వాటిపై నిందితుడి సంతకం తీసుకుని సమర్పించాలని ఆదేశించింది. అందుకోసం రఘురామకృష్ణరాజు గుంటూరు జైలుకు రావాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఆయన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు. దాంతో రఘురామ సంతకం లేని పత్రాలను గుంటూరు జైలు సూపరింటెండెంట్ ఈ నెల 10న సీఐడీ న్యాయస్థానానికి సమర్పించారు. బాండ్ పత్రాలపై నిందితుడు సంతకం చేయనందున ఆయన జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయినట్టు కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయనపై రిమాండ్ వారెంట్ మనుగడలో ఉన్నట్టుగానే భావిస్తున్నామని కూడా తేల్చిచెప్పింది. కాబట్టి ఎంపీ రఘురామ రిమాండ్‌ను ఈ నెల 25వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది. చదవండి: దొంగ జీవోలు తెచ్చి ఆ భూములు అమ్మారు: విజయసాయిరెడ్డి -
రఘురామకృష్ణరాజు టీడీపీ ఏజెంట్‌గా మారారు: అనిల్
సాక్షి, విజయవాడ: ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీకి ఏజెంట్‌గా మారారు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో టీడీపీ చేసిన తప్పులను తాము చేయమని స్పష్టం చేశారు. అలానే లోకేశ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి అనిల్. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. ‘‘పోలవరం ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని టీడీపీ కుట్ర చేస్తోంది. రైతుల కళ్లలో ఆనందాన్ని టీడీపీ చూడలేకపోతోంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పోలవరం పనులు కొనసాగుతున్నాయి ఎదో ఒక రకంగా దాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అది పూర్తి అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్‌కి మంచి పేరు వస్తుందని వారి భయం. అందుకే రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు’’ అని మంత్రి అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చినబాబు ఫ్రస్టేషన్ పీక్స్‌కి వెళుతోంది. మూడు శాఖలకు మంత్రిగా చేసినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. ఉన్న ఎమ్మెల్సీ కూడా ఓ ఏడాదిలో పూర్తి అయిపోతుంది. అందుకే బయట తిరగలేక ఇంట్లో కూర్చుని జూమ్‌లో సీఎం జగన్ గురించి మాట్లాడుతున్నాడు.. కానీ వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత నీకు ఒక్క శాతమైనా ఉందా. మా తాత సీఎం, మా నాన్న సీఎం అని చెప్పుకున్నా నువ్వు గెలవలేక పోయావ్. కనుచూపు మేరలో నీ పార్టీ జగన్ సంక్షేమ పథకాలతో కొట్టుకుపోయే పరిస్థితి. జగన్ అముల్ బేబీ అయితే.. నువ్వు హెరిటేజ్ దున్నపోతువా. మాటలు నీకే కాదు...మాకు వచ్చు’’ అని మంత్రి అనిల్, లోకేశ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. ‘‘గూగుల్‌లో కొడితే నీ పేరు పప్పు అని వచ్చింది. నువ్వు గడ్డం పెంచగానే ఏదో జరగదు. ధైర్యం బై బర్త్ బ్లడ్‌లో ఉండాలి. ఆత్మగౌరవం లేకనే మీ నాన్న హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నాడు. ఏ మాత్రం ఆంధ్ర ప్రజలపై ప్రేమ ఉన్నా గత ఐదేళ్లలో ఏపీలో ఇల్లు కట్టుకునే వాడు. పునరావాసం విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నాము. 2022 ఖరీఫ్ నాటికీ తప్పనిసరిగా సాగునీరు అందిస్తాం. స్పిల్ వే పూర్తి చేయకుండా కాపర్ డ్యామ్ ఎలా కడతారు. వీళ్ళు చేసిన తప్పులను మాపై రుద్దాలని చూస్తున్నారు. సీఎం జగన్ పోలవరం కోసం రావాల్సిన నిధుల విషయంపై ఢిల్లీలో చర్చిస్తారు’’ అని మంత్రి అనిల్ తెలిపారు. చదవండి: సీఎం ఢిల్లీ పర్యటనపై ఎల్లోమీడియా రాద్ధాంతం : బొత్స రివర్స్ టెండరింగ్‌లో మరో మైలురాయి -
రఘురామకేసు : స్వాధీనం చేసుకున్న వస్తువులపై మాట్లాడే హక్కు లేదు
సాక్షి, విజయవాడ: రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై న్యాయవాది కోటంరాజు శర్మ స్పందించారు. సీఆర్పీసీ 102, 165 సెక్షన్ల ప్రకారం నిందితుల నుంచి వస్తువులను విచారణాదికారి స్వాధీనం చేసుకోవచ్చన్నారు. అలా స్వాధీనం చేసుకున్న వస్తువుల గురించి మాట్లాడే అధికారం నిందితులకు లేదన్నారు. ఒకవేళ అలా మాట్లాడితే కేసును ప్రభావితం చేయడమే అవుతుందన్నారు. -
రఘురామకృష్ణరాజుపై మరో ఫిర్యాదు
హైదరాబాద్ : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే సీఐడీ కేసులకు సంబంధించి ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఇంతలో మరో ఫిర్యాదు ఆయనపై నమోదు అయ్యింది. రెడ్డి సామాజికవర్గాన్ని దూషించారంటూ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. హెచ్చార్సీకి ఫిర్యాదు ఇటీవల రఘురామకృష్ణ రాజు మీడియాతో మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా పలు వ్యాఖ్యలు చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ మానవ హక్కుల కమిషన్‌కి ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజు మాట్లాడిన వీడియోలను సైతం ఫిర్యాదుతో జత చేశారు. కరుణాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. దీనిపై త్వరలోనే రఘురామకి ఎన్‌హెచ్చార్సీ నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. బెయిల్‌పై రఘురామ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఇటీవల రఘురామకృష్ణరాజుపై సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే విచారణ సందర్భంగా ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రఘురామ బెయిల్‌పై విడుదల అయ్యారు. తాజాగా మరో సమస్య ఆయన్ని చుట్టుముట్టింది. -
రఘురామ కృష్ణరాజు: పిటిషన్ 6 వారాలు వాయిదా
న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును కొట్టారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. అయితే తన పిటిషన్‌ను సవరించుకున్న రఘురామ తరఫు న్యాయవాది రోహత్గీ సవరించుకున్నారు. ప్రతివాదులుగా కేవలం కేంద్రం, సీబీఐ మాత్రమే కావాలనే విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయంపై న్యాయవాది దవే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ సర్కారు వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆ కేసును ఆరు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
‘రఘురామకృష్ణరాజు ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు’
సాక్షి, అమరావతి: జీజీహెచ్‌లో ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య నిపుణుల కమిటీ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. అందులో రఘురామ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని వైద్య బృందం నివేదికలో తెలిపింది. ఈ మేరకు వైద్య నిపుణులు ఆ రిపోర్ట్‌ను చదివి న్యాయమూర్తులకు వినిపించారు. రఘురామకు అన్ని పరీక్షలు చేసినట్టు కోర్టుకు వైద్య బృందం తెలిపింది. పరీక్షల్లో రఘురామ ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు పేర్కొన్నారు. ( చదవండి: రఘురామకృష్ణరాజు తీరుపై మండిపడ్డ క్షత్రియ నేతలు ) -
కుట్రలు బయటపడతాయని బాబు గగ్గోలు
సాక్షి, అమరావతి: రఘురామకృష్ణరాజుతో ఉన్న అపవిత్ర బంధం, ఇన్నాళ్లూ కలిసి చేసిన కుట్రలు ఎక్కడ బయటపడతాయోనని ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎల్లో మీడియా పెద్దలు కలవరపడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అందుకే ఆయన అరెస్టుపై రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణరాజు ఏ విధంగా రాజద్రోహానికి పాల్పడ్డాడో వివరిస్తూ కోర్టు ముందు 46 సీడీలను సీఐడీ ఉంచిందన్నారు. ఈ మేరకు అంబటి రాంబాబు శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణరాజులాంటి చీడపురుగును వెనకేసుకొస్తున్న చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు. రచ్చబండ పేరుతో రోజూ రెండు గంటలు బూతులు తిట్టించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలతో డ్రామా నడపటం చంద్రబాబు, లోకేష్, టీవీ5, ఏబీఎన్‌లకు అలవాటైందని మండిపడ్డారు. కథ నడిపిస్తున్నది చంద్రబాబే.. వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికైన రఘురామకృష్ణరాజు పిచ్చి వాగుడు వాగుతుంటే చంద్రబాబు సంతోషంతో ఆయన వెనుక ఉండి మరీ కథ నడిపిస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన అరెస్టుతో చంద్రబాబు గొంతులో పచ్చివెలక్కాయ పడిందన్నారు. తనకూ ఇదే గతి పడుతుందన్న భయం, ఆందోళన ఆయనలో కనిపిస్తున్నాయన్నారు. కృష్ణరాజుతో నిజాలు చెప్పిస్తే తమ ఇంటిగుట్టు, కుట్రలు బయటపడతాయన్న భయంతోనే నిన్న టీడీపీ, దాని అనుబంధ చానెళ్లు ఆయనకు వత్తాసు పలికాయన్నారు. కోర్టు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన వెంటనే కృష్ణరాజులో ఎంత మార్పు వచ్చిందో, ఎలాంటిæ డ్రామా ఆడారో అదనపు అడ్వొకేట్ జనరల్ వివరించారని తెలిపారు. కృష్ణరాజు మహానటుడని, తనకు తాను గాయాలు చేసుకొని మరీ బయటపడాలని ప్రయత్నించగల సమర్థుడని చెప్పారు. బాబు దర్శకత్వంలోనే స్కెచ్ చంద్రబాబు దర్శకత్వంలోనే కృష్ణరాజు స్కెచ్ వేసి ఉంటారని అంబటి అభిప్రాయపడ్డారు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లు.. ఆయనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర నేరమని చంద్రబాబు అనడం ఆయనలో భయాన్ని చూపిస్తోందని ఎద్దేవా చేశారు. పురందేశ్వరి వంటి బీజేపీ నేతలు కూడా బాబు వాదనకు మద్దతు పలకడం సిగ్గుచేటన్నారు. కృష్ణరాజు వ్యాఖ్యలు.. రాజద్రోహమో, కాదో చెప్పాల్సింది కోర్టులే తప్ప చంద్రబాబు కాదని తేల్చిచెప్పారు. ఆయనపై ఎవరూ రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడలేదన్నారు. కృష్ణరాజు టీడీపీతో జతకట్టి ఏడాదిగా ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో చంద్రబాబు పాత్ర కూడా తేలాల్సి ఉందన్నారు. దీన్ని అడ్డుకునే ప్రతి ప్రయత్నం ఆయన భయంతో చేస్తున్నదే తప్ప ప్రజాస్వామ్యం మీద గౌరవంతో చేస్తున్నది కాదన్నారు. ఎన్నికల్లో గెలవలేని బాబు ఏదో రకమైన మేనేజ్మెంట్ మీదే 100 శాతం నమ్మకాలు పెట్టుకొని రఘురామరాజుతో అంటకాగుతున్నాడని విమర్శించారు. ఇంతకాలం అందరూ అనుమానించిందే నిజమైందని.. తోడు దొంగల ముసుగు ఇప్పుడు తొలగిందన్నారు. ( చదవండి: రఘురామకృష్ణరాజుకు రిమాండ్ ) -
రఘురామకృష్ణరాజుకు రిమాండ్
సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు సీబీసీఐడీ కోర్టు రిమాండ్‌ను విధించింది. ఈ నెల 28 వరకు రఘురామకృష్ణరాజు రిమాండ్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయనను జీజీహెచ్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. ఈ సాయంత్రం రఘురామకృష్ణరాజును అధికారులు సీబీసీఐడీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ న్యాయమూర్తి ముందు ఏ1గా ఆయన్ని ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తికి అందజేశారు. ఈ ఉదయం రఘురామ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. రఘురామ అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అదే సమయంలో రఘురామకృష్ణరాజుతో పాటు TV5, ABNలపై కూడా సీఐడీ కేసులు నమోదు చేసింది. A1గా రఘురామకృష్ణరాజు, A2గా TV5, A3గా ABNలపై కేసులు ఫైల్ చేశారు. -
పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథ అల్లారు: ఏఏజీ పొన్నవోలు
-
రఘురామ కొత్త నాటకానికి తెరతీశారు: ఏఏజీ పొన్నవోలు
సాక్షి, అమరావతి : ఎంపీ రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ అవ్వగానే కొత్త నాటకానికి తెరతీశారని, పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథ అల్లారని పేర్కొన్నారు. మధ్యాహ్నం రఘురామకృష్ణరాజుకు కుటుంబసభ్యులు భోజనం తీసుకొచ్చారని, అప్పటివరకు కూడా ఆయన మామూలుగానే ఉన్నారని చెప్పారు. రఘురామ ఆరోపణలపై కోర్టు మెడికల్ కమిటీ వేసిందని, రేపు మధ్యాహ్నంలోగా పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని సూచించిందని తెలిపారు. కాగా, ఎంపీ రఘురామకృష్ణరాజును అధికారులు ఈ సాయంత్రం సీబీసీఐడీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ న్యాయమూర్తి ముందు ఏ1గా ఆయన్ని ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తికి అందజేశారు. ఇక్కడ చదవండి: రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు -
సీబీసీఐడీ స్పెషల్ కోర్టుకు ఎంపీ రఘురామకృష్ణరాజు
-
రఘురామకృష్ణరాజును ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది: మంత్రి బాలినేని
-
రఘురామకృష్ణరాజు విలువలేని రాజకీయాలు చేశాడు: ఆదిమూలపు సురేష్
-
సీబీసీఐడీ స్పెషల్ కోర్టుకు ఎంపీ రఘురామ
సాక్షి, అమరావతి : ఎంపీ రఘురామకృష్ణరాజును అధికారులు సీబీసీఐడీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ న్యాయమూర్తి ముందు ఏ1గా ఆయన్ని ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తికి అందజేశారు. ఈ ఉదయం రఘురామ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. రఘురామ అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అదే సమయంలో రఘురామకృష్ణరాజుతో పాటు TV5, ABNలపై కూడా సీఐడీ కేసులు నమోదు చేసింది. A1గా రఘురామకృష్ణరాజు, A2గా TV5, A3గా ABNలపై కేసులు ఫైల్ చేసింది. చదవండి: రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు ఎవరి ప్రోదల్బంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు: సీఐడీ -
ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురు
-
రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి : ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. రఘురామ అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. కాగా, పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ 12/2021 నమోదు చేశారు. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్ ఛానల్‌ను సీఐడీ ఎఫ్ఐర్లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. చదవండి: ఎవరి ప్రోదల్బంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు: సీఐడీ -
‘రఘురామను అరెస్ట్ చేయటంలో ఎలాంటి తప్పులేదు’
సాక్షి, అమరావతి : ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయటంలో ఎలాంటి తప్పులేదని, ఆయన్ని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సిందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, సీఎంను ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తే ప్రజలు సహించరని అన్నారు. ఎంపీ రఘురామ అరెస్ట్ అనంతరం మంత్రి బాలినేని స్పందించారు. రఘురామలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోందంటూ మండిపడ్డారు. తన నియోజకవర్గానికి వెళ్లి అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీ ఎక్కడో ఉండి తన ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించడం సరైంది కాదన్నారు. రఘురామకృష్ణరాజుపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి: శ్రీరంగనాథరాజు ‘‘ఎంపీ రఘురామకృష్ణరాజు గత 13 నెలలుగా నరసాపురం పార్లమెంట్ ప్రజలను వదిలేసి.. ఢిల్లీ, హైదరాబాద్‌లలో మకాం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. నరసాపురం పరిధిలో నమోదైన కేసులపై కూడా పోలీసులు విచారణ చేయాలి. రఘురామకృష్ణరాజుపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు. చదవండి : ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ -
తాగటం .. వాగటం
సాక్షి,అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు రోజూ తాగటం, వాగటమే పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. ఆయనకు నైతిక విలువలు, ధైర్యం, రోషం ఉంటే రాష్ట్రంలోకి వచ్చి ప్రజల మధ్య తిరగాలని సూచించారు. త్వరలోనే ఆయన పాపం పండుతుందన్నారు. బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లు దోచుకుతిన్న రఘురామ కృష్ణరాజు నీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ నందిగం సురేష్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ స్పీకర్ తక్షణమే ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు. అనర్హత వేటు నోటీస్ ఇచ్చినప్పుడల్లా తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం లేదని, ఏ తప్పూ చేయలేదని నమ్మబలుకుతున్నారని, ఢిల్లీలో ఎల్లో మీడియాతో నిర్వహించిన ప్రెస్‌మీట్‌తో ఆయన నిజ స్వరూపం బయటపడిందన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనతోపాటు ఒక పద్ధతి, విధానం లేని రఘురామకృష్ణరాజుకు బుద్ధి చెప్పేలా స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే వైఎస్సార్సీపీ ఆయన్ను విడిచిపెట్టబోదని హెచ్చరించారు. దిగజారుడు వ్యక్తి.. రఘురామకృష్ణరాజు రాక్షస బ్యాచ్‌తో చేరి శునకానందం పొందుతున్నారని నందిగం సురేష్ ధ్వజమెత్తారు. ఆయన ఓ నయవంచకుడు, దిగజారిన మనిషి అని మండిపడ్డారు. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే రాజకీయాలు ప్రమాదకరంగా మారుతాయన్నారు. ఆయనపై సీబీఐ, ఏసీబీ కేసులున్నాయని, వాటి నుంచి బయటపడేందుకు ఇతర పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అయితే ఆయన్ను ఎవరూ కాపాడలేరని, జైలుకెళ్లక తప్పదన్నారు. రఘురామకృష్ణరాజుకు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సూచించారు. ఢిల్లీలో మకాం వేసిన పిచ్చి కుక్క లాంటి ఆయన్ను అంతమొందించాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. సీఎం జగన్ బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సాయంత్రానికే కొట్టివేశారని తెలిపారు. సీఎం జగన్ రాముడు లాంటి వ్యక్తి కాబట్టే ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. రాజకీయ వ్యభిచారి .. రఘురామకృష్ణరాజు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, బ్యాంకులను మోసగించిన ఆయనకు రుణాలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసని ఎంపీ సురేష్ చెప్పారు. ఢిల్లీలో కూర్చుని ప్రెస్మీట్లు కాకుండా రోషం, ఆత్మగౌరవం, పౌరుషం ఉంటే ఏపీకి వచ్చి మాట్లాడాలన్నారు. అవకాశం రావడంతో మూడేళ్లు పబ్బం గడుపుకునేందుకు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్నీ గాలికి వదిలేసిన చంద్రబాబు, రాఘురామ, ఎల్లో మీడియాను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలేదన్నారు. పరిషత్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి వారిని ఛీ కొట్టడం ఖాయమన్నారు. -
నా మాటల్ని 100శాతం వక్రీకరించారు: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: ‘‘ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప.. ఎల్లో మీడియాకు మరోకటి రాయాలనిపించడం లేదు.. నేను మాట్లాడింది కాకుండా.. ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్లు రాసింది.. నా మాటల్ని 100 శాతం వక్రీకరించింది’’ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎల్లో మీడియా దివాళాకోరుతనంగా వ్యవహరిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపును ఓర్చుకోలేక పోతున్నారు. చంద్రబాబు చెప్పిందే ఎల్లో మీడియా రాస్తోంది. బాబు, ఎల్లో మీడియా కలిసి కుట్రలు పన్నుతున్నారు’’ అంటూ మండిపడ్డారు. రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఆయన ఎల్లో మీడియాకు బంట్రోతుగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘రఘురామకృష్ణంరాజు సిగ్గులేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సిగ్గుంటే ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. వార్డు మెంబర్ కాని రఘురామ కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎంపీ అయ్యారు. కొమ్ములు లేని దున్నపోతుతో ఆయనను పోల్చవచ్చు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి. ‘‘చంద్రబాబు స్క్రిప్ట్‌నే ఆయన చదువుతున్నారు. బ్యాంకులను వేల కోట్లు మోసం చేసిన చరిత్ర రఘురామ కృష్ణంరాజుది. దమ్ముంటే ఆయన తన పదవికి రాజీనామా చేసి గెలవాలి. ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు హుందాగా వ్యవహరించాలి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దయతో రఘురామ కృష్ణంరాజు ఎంపీగా గెలిచారు.. సీఎం జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు తనకు లేదు. చంద్రబాబు వ్యవహారమంతా చీకటి ఒప్పందాలు చేసుకోవడమే’’ అంటూ పెద్దిరెడ్డి మండిపడ్డారు. చదవండి: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి పెద్దిరెడ్డి ‘రఘురామ కృష్ణంరాజు ముక్కు నేలకు రాయాలి’ -
సీబీఐ కేసు: రఘురామకృష్ణం రాజు ఔట్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ రఘురామకృష్ణం రాజుపై వేటుపడింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి అతన్ని తప్పించారు. సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌గా వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు. అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని శుక్రవారం లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రుణాల ఎగవేత కేసులో రాఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు) పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు, నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నందున అతన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. -
బ్యాంకు రుణం ఎగ్గొట్టి సొంత ఖాతాలకు..
-
బ్యాంకు రుణం ఎగ్గొట్టి సొంత ఖాతాలకు..
సాక్షి, అమరావతి/హైదరాబాద్: జాతీయ బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాలు తీసుకుని.. కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా ఆ నిధుల్ని అక్రమంగా తన వారి ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు గురువారం సోదాలు చేశాయి. ఏపీ, హైదరాబాద్, ముంబై సహా ఇతర ప్రాంతాల్లో ఆయన, ఆయన కంపెనీల డైరెక్టర్లకు చెందిన ఆస్తులపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయి. ఉదయం 6 గంటలకే మొదలైన ఈ సోదాల్లో ఏకంగా 11 బృందాలు పాల్గొన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు వడ్డీ కూడా చెల్లించకుండా బ్యాంకును మోసం చేయటం... తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేసుకోవటం, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేయటం వంటి అంశాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు చేయటంతో సీబీఐ కేసు నమోదు చేసి సోదాలకు దిగింది. సంస్థకు చైర్మన్‌గా ఉన్న రఘురాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేసింది. దాడుల సందర్భంగా పలు ఫైళ్లు, హార్డ్ డిస్కులను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రల్లో సోదాలు.. సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్,శ్రీనగర్‌కాలనీ, చందానగర్, ముంబైలోని మధువన్, పశ్చిమ గోదావరిలోని కొవ్వూరు కలిపి ఏకకాలంలో 11 ప్రాంతాల్లోని ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కార్యాలయాలు, నివాసాలపై దాడులు జరిపింది. రఘురామకృష్ణరాజు కంపెనీలో అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న కొవ్వూరుకు చెందిన ఓ మహిళ ఇంట్లో కూడా సీబీఐ తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. భీమవరంలోని రఘురాజు నివాసానికి తాళం వేసి ఉండటంతో అధికారులు వెనుతిరిగారు. అప్పు తీసుకుని... తన వారి ఖాతాలకు కర్ణాటకలోని తమ పవర్ ప్రాజెక్టుకు రుణం కావాలని దరఖాస్తు చేసుకున్న ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్... పర్యావరణ అనుమతుల కారణంగా అక్కడ కాకుండా ప్లాంటును తమిళనాడులోని ట్యూటికోరిన్‌కు మార్చింది. బ్యాంకు ఆఫ్ బరోడా, దేనాబ్యాంకు, స్టేబ్‌బ్యాంక్ ఆఫ్ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ఆఫ్ ఇండియా బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.826.17 కోట్ల మేర భారీ రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదు. దీనిపై కన్సార్షియం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించగా వివిధ దశల్లో రూ.826.17 కోట్లు తనకు సంబంధించిన వారికి వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా తరలించినట్లు వెల్లడైంది. విదేశాలకు పారిపోతారేమో..! అప్పులను రాబట్టుకునేందుకు బ్యాంకులన్నీ ఢిల్లీలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్, హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించాయి. నిందితులు అప్పులు ఎగ్గొట్టి న్యాయవిచారణ నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. చీటింగ్ కేసు నమోదు తీసుకున్న రుణాన్ని ఇతర మార్గాల్లో మళ్లించి ఉద్దేశపూర్వకంగా మోసగించారని పంజాబ్ నేషనల్ బ్యాంకు చీఫ్‌మేనేజర్ సౌరభ్ మల్హోత్రా, ఇతర బ్యాంకులు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాయి. నేరపూరిత కుట్ర, మోసం తదితర అభియోగాలతో ఐపీసీ 120బి, 420, పీసీ యాక్ట్ 13(2), రెడ్‌విత్ 13(1),(డి) సెక్షన్ల ప్రకారం రఘురామకృష్ణరాజుతోపాటు 9 మంది డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లతోపాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 22 పేజీల ఎఫ్ఐఆర్లో సీబీఐ పలు సంచలన విషయాలను పొందుపరిచింది. సీబీఐ ఎఫ్ఐఆర్లో నిందితుల జాబితా.. 1. ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్, ఓల్డ్ బోయిన్పల్లి, 2. కనుమూరు రమాదేవి, 3. కనుమూరు రఘురామకృష్ణరాజు (చైర్మన్) 4. కోటగిరి ఇందిరా ప్రియదర్శిని, 5. గోపాలన్ మనోహరన్, 6. కొమరిగిరి సీతారామ్ 7. భాగవతుల నారాయణ ప్రసాద్, 8. నంబూరి కుమారస్వామి 9. బోపన్న సౌజన్య 10. వడ్లమాని వీరవెంకట సత్యనారాయణరావు, 11. విస్ప్రగడ్డ పేర్రాజు 12. గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు మీడియాపై ఎంపీ చిందులు.. ఒకవైపు ఉదయం నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ, కార్యాలయాలు, డైరెక్టర్ల కార్యాలయాలపై సీబీఐ దాడులు జరుగుతున్నా అవన్నీ అసత్యాలని ఎంపీ రఘురాజు ఖండిస్తూ వచ్చారు. అదంతా అసత్యమంటూ బుకాయించారు. సాయంత్రం సీబీఐ ఢిల్లీ విభాగం ప్రెస్‌నోట్ విడుదల చేసే వరకూ వాస్తవాలను కప్పిపుచ్చి తనను సంప్రదించేందుకు ప్రయత్నించిన మీడియాపై చిందులు తొక్కారు. “రాజు’ అప్పు రూ.23,608 కోట్లు! ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన పలు కంపెనీలకు దాదాపు రూ.23,608 కోట్ల మేర అప్పులున్నట్లు స్పష్టమవుతోంది. ఆయనకు హైదరాబాద్, చెన్నై ఆర్వోసీ పరిధిలో పలు కంపెనీలున్నాయి. కానీ వీటిల్లో ఏ కంపెనీకీ అప్డేటెడ్ ఫైలింగ్స్ లేవు. పలు కంపెనీలకు 2016 మార్చి నుంచి బ్యాలెన్స్ షీట్లను సమర్పించలేదు. ఇక ఇండ్–భారత్ ఎనర్జీ (ఉత్కల్), ఇండ్–భారత్ పవర్ (మద్రాస్), ఇండ్–భారత్ పవర్ జెన్‌కామ్ కంపెనీలు కార్పొరేట్ దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. ఇదీ... అప్పుల చిట్టా ఇండ్–భారత్ ఎనర్జీస్ లిమిటెడ్: రూ.3.25 కోట్లు ఇండ్–భారత్ ఎనర్జీ (ఉత్కల్): రూ.5,605.61 కోట్లు ఇండ్–భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్: రూ.2,655 కోట్లు ఇండ్–భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్: రూ.1,231.27 కోట్లు ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్: రూ.2,455.65 కోట్లు ఇండ్–భారత్ థర్మోటెక్ ప్రై .లి: రూ.2,968.91 కోట్లు చెన్నై ఆర్వోసీ పరిధిలోని ఇండ్–భారత్ పవర్ ఇన్ప్రా లిమిటెడ్: రూ.8,688.27 కోట్లు -
రఘురామకృష్ణంరాజు: సోదాలపై సీబీఐ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులను మోసగించిన వ్యవహారంపై ఎంపీ రఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలపై గురువారం సీబీఐ మీడియాకు ప్రెస్‌నోట్ విడుదల చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొంది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు తెలిపింది. నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. దీనిలో భాగంగానే హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. కంపెనీ కార్యాలయాలు, యజమాని నివాసాలు, ఇతర ప్రదేశాలపై సోదాలు జరిపినట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. (రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు) -
రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు
-
రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు
సాక్షి, హైదరాబాద్ : నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై కేంద్ర దర్యాప్త సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. బ్యాంక్ లోన్ బకాయిలపై కేసు నమోదు చేసిన సీబీఐ గురువారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈనెల 6న హైదరాబాద్, ముంబై సహా 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. రఘురామకృష్ణంరాజు సహా 9 మందిపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టారు. ఇండ్-భారత్ కంపెనీతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేసింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. ఈ దాడుల్లో పలు కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఏప్రిల్ 30న బ్యాంక్ లోన్ బకాయిలు పడిన కేసులో సైతం హైదరాబాద్, భీమవరంలోని రఘురామకృష్ణంరాజు కంపెనీల్లో సోదాలు చేపట్టారు. వివిధ ప్రాజెక్ట్‌లకు సంబంధించి రూ.600 కోట్ల మేర ఆయన రుణాలు తీసుకున్నారు. ఇక ఇండ్-భారత్ పవర్ లిమిటెడ్‌కు సంబంధించి రూ.947 కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగ్గవేయగా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్ల నుంచి రూ.2655 కోట్ల మేర రఘురామకృష్ణంరాజు లోన్ తీసుకున్నారు. ఈ సోదాల్లో 11 నుంచి 14 సీబీఐ బృందాలు పాల్గొన్నట్టు సమాచారం. బ్యాంకులకు ఎగవేతపై రఘురామకృష్ణంపై సీబీఐ దాడులు ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా సీబీఐ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించింది. -
రఘురామరాజు సెక్యూరిటీ తొలగించండి
సాక్షి, న్యూఢిల్లీ : తనను అసభ్య పదజాలంతో దూషించారని రఘురామకృష్ణంరాజుపై వైఎస్సార్సీపీ ఎంపీ నందిగాం సురేష్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. కులం పేరుతో కించపరుస్తూ దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రఘరామకృష్ణం రాజు పదవిని, సెక్యూరిటీని అడ్డంపెట్టుకుని ఎస్సీ వర్గాన్ని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆయనపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని గురువారం వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీని దుర్వినియోగం చేస్తున్నారని సెక్యూరిటీ తొలగించాలని వివరించారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం ఇదివరకే రఘురామకృష్ణం రాజుపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
పర్యటనకు అడ్డు తగిలితే గన్‌తో కాల్చి పారేస్తా
పశ్చిమగోదావరి ,పాలకొల్లు అర్బన్: తన పర్యటనకు అడ్డు తగిలితే గన్‌తో కాల్చి పారేస్తానని బహిరంగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని బెదిరిస్తున్న నరసాపురం పార్లమెంట్ సభ్యుడు కనుమూరు రఘురామకృష్ణరాజుపై హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుని సుమోటోగా అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లెం ఆనందప్రకాష్ డిమాండ్ చేశారు. పాలకొల్లు ఏఎంసీ ఆవరణలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవిలో ఉంటూ శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తూ టీవీల్లోనూ, సోషల్ మీడియాలో ఇలాంటి ప్రకటనలు చేస్తున్న ఎంపీ తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించిందని త్వరలోనే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పుకుంటున్న ఎంపీ దమ్ముంటే నియోజకవర్గ పర్యటనకు రావాలని ఆనందప్రకాష్ సవాల్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహ జ్వాలలకు ఎంపీ కనుమూరు గురికాక తప్పదని హెచ్చరించారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రోజుకో కులాన్ని విమర్శిస్తూ తాను ఎంపీనని మరచిపోయి మాట్లాడడం విచారకరమన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ఎం మైఖేల్‌రాజు, జడ్పీటీసీ అభ్యర్థి నడపన గోవింరాజుల నాయుడు, పార్టీ నాయకులు చినిమిల్లి గణపతిరావు, కోరాడ శ్రీనివాసరావు, సాలా నరసయ్య, కుంచిలపల్లి వినిస్టన్‌బాబు, కొర్రగింజల హనుమంతరావు, ఉండ్రాజవరపు రవిబాబు, సనమండ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రఘురామకృష్ణంరాజుపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు
సాక్షి, తణుకు: తమ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాద్‌రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను జంతువులతో పోల్చారని ఎమ్మెల్యేలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు వేర్వేరుగా తణుకు, నరసాపురం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. (ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి ఫిర్యాదు) ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం రఘురామకృష్ణంరాజు ఉద్దేశపూర్వకంగానే తనపై బురద చల్లుతున్నారంటూ ఆచంట నియోజకవర్గంలోని పోడూరు మండలం పోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
రఘురామకృష్ణంరాజుపై మంత్రి ఫిర్యాదు
సాక్షి, పశ్చిమ గోదావరి: తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం రఘురామకృష్ణంరాజు ఉద్దేశపూర్వకంగానే తనపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. నిజాయితీ పరుడిగా, సేవా భావం కలిగిన వ్యక్తిగా, వివాదరహితుడిగా సమాజంలో తాను సంపాదించుకున్న మంచి పేరును చెడగొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా తనపై ఆరోపణలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై శ్రీరంగనాథ రాజు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పోడూరు మండలం పోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.(‘మనసా, వాచా ఆయన వైఎస్సార్సీపీతో లేరు’) ఈ నేపథ్యంలో శ్రీరంగనాథ రాజు మాట్లాడుతూ.. రఘురామకృష్ణంరాజు తనను, తన కుమారుడిని వ్యక్తిగతంగా దూషించడం సహా దొంగలు అని సంబోధించారంటూ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తాను, తోటి ఎమ్మెల్యేలు, మరో మంత్రి పేర్ని నానితో కలిసి ప్రెస్మీట్లో మాట్లాడిన విషయాన్ని ఉదాహరిస్తూ.. "పందులే గుంపులుగా వస్తాయి" అని వ్యాఖ్యానించటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘రాజకీయ, ప్రజా జీవితంలో విమర్శలు సహజం. కానీ ఒక అవకాశవాది తన వ్యక్తిగత, స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటి వారి వ్యక్తిత్వంపై దాడి చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదలుచుకోలేదు. ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మద్దతుదారులు నా దిష్టిబొమ్మలు తగలబెట్టి వర్గ వైషమ్యాలు సృష్టించి శాంతి భద్రతలకు అవరోధం కలిగించారు. అదే విధంగా పదే పదే మీడియా ముందు, న్యూస్ డిబేట్లలో, సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. అయినా పది సార్లు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. కానీ అబద్దం చెప్పిన వ్యక్తిపై ఏ చర్య తీసుకోకపోతే అది సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఈ వివాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని భావించాను. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా.. చట్టాలను గౌరవించే వ్యక్తిగా.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుతో.. న్యాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను’’అని మంత్రి పేర్కొన్నారు. -
అనర్హత వేటు విధించండి
సాక్షి, న్యూఢిల్లీ: తమ పార్టీ టికెట్‌తో ఎన్నికల్లో గెలిచిన ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రవర్తిస్తున్న తీరుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుందన్న విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అధినాయకత్వం గురించి ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను లోక్‌సభ స్పీకర్ దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. శుక్రవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామకృష్ణరాజుపై అనర్హత విధించాలని పిటిషన్ సమర్పించిన అనంతరం వైఎస్సార్ సీపీ ఎంపీలు ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. పార్టీ వ్యతిరేక చర్యల వల్లే పిటిషన్: విజయసాయిరెడ్డి ► ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్‌కు సంబంధించి అన్ని విషయాలను పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటామని సభాపతి హామీ ఇచ్చారు. ఆర్టికల్ 102 (2) ప్రకారం, పదో షెడ్యూల్ పేరా 2, సబ్ పేరా 1(ఏ) ప్రకారం అనర్హత పిటిషన్ తయారుచేసి స్పీకర్‌కు ఇచ్చాం. ► ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అనేది ఒక పునాది లాంటిది. రఘురామకృష్ణరాజు దానిని కదిలించేలా, ప్రజాస్వామ్యాన్ని కూలదోసేలా వ్యవహరించారు. ఆయన చర్యలు, మాట్లాడిన తీరు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, ఒక పార్టీ టికెట్‌పై ఎన్నికై అందుకు అనుగుణంగా నడుచుకోకుండా క్రమశిక్షణను ఉల్లంఘించి అసభ్యకరంగా, అన్‌పార్లమెంటరీ పదాలతో మాట్లాడిన మాటలు, స్వపక్షంలో విపక్షంలా వ్యవహరించిన తీరు, వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే ఉంటూనే ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన నేపథ్యంలో అనర్హత పిటిషన్‌ను ఫైల్ చేశాం. ► ఆయనపై ఉన్న కేసులు గానీ, ఇతరత్రా ఏ లాభాపేక్షతో మిగతా పార్టీలతో కుమ్మక్కై ఆయన ఈ చర్యలకు పాల్పడ్డారో అందరికీ తెలుసు. ► పదో షెడ్యూలు ప్రకారం స్వచ్ఛందంగా సభ్యత్వం వదులుకోవడం అంటే రాజీనామా చేయడం అని అర్థం కాదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు సహా వివిధ న్యాయస్థానాల తీర్పులున్నాయి. సభ్యుడు తన ప్రవర్తన ద్వారా సభ్యత్వాన్ని వదులుకున్నట్టు చెప్పడమని న్యాయస్థానాల తీర్పులున్నాయి. ► రఘురామకృష్ణరాజు విషయంలో రాజకీయ, వ్యక్తిగత ప్రవర్తన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించేలా ఉందన్న విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇతరులను విమర్శించడం, పార్టీని దూషించడం కారణంగా ఆయనకు ఈ చట్టం వర్తిస్తుందనడంలో అనుమానం లేదు. ► ధిక్కరణ అనేది క్రమశిక్షణ ఉల్లంఘనే. పార్టీ నాయకత్వం గురించి ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం. ఆ వ్యాఖ్యల విషయంలో ప్రజలు కూడా నిర్ణయిస్తారు. కోవర్టు రాజకీయాలు: చీఫ్ విప్ మార్గాని భరత్ ► మా పార్టీ నుంచి లోక్‌సభ స్పీకర్‌కు ఇచ్చిన లేఖ ఆధారంగానే రఘురామకృష్ణరాజుకు పదవి వచ్చిన విషయం వాస్తవం కాదా? టీటీడీ భూముల విషయంలో తెలుగుదేశం హయాంలో నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? ► ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. ► రఘురామకృష్ణరాజు ఇంగ్లీష్ మీడియం గురించి కూడా వివాదాస్పదంగా మాట్లాడారు. మాతృభాషను కాపాడుకుంటూనే పేద పిల్లల ఉన్నతిని కాంక్షించి ముఖ్యమంత్రి దూరదృష్టితో ఇంగ్లీష్ మీడియం తెచ్చారు. ► పార్టీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా కోవర్టు రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్సార్ సీపీని దూషించడం లేదని చెబుతూనే ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి ఆయన చేసిన నిర్వాకం ఏమిటో ప్రజలు గమనించారు. త్వరలోనే ఆయనపై అనర్హత వేటు పడటం ఖాయం. విలువను కాపాడుకోలేకపోయారు: పీవీ మిథున్‌రెడ్డి ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రఘురామకృష్ణరాజుకు సముచిత స్థానం ఇచ్చారు. తొలిసారి ఎంపీ అయినా ప్రాధాన్యం, విలువ ఇచ్చారు. ► నాలుగుసార్లు ఎంపీ అయిన మాగుంట శ్రీనివాసులరెడ్డి, రెండుసార్లు ఎంపీ అయిన బాలశౌరి, వంగా గీత లాంటి సీనియర్లు ఉన్నా రఘురామకృష్ణరాజు కోరిన వెంటనే సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్‌గా ప్రతిపాదన ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పడంతో సభాపతిని అభ్యర్థించాం. ► టీటీడీ భూములు అమ్మాలని టీడీపీ, బీజేపీ హయాంలో నిర్ణయం తీసుకున్నప్పుడు రఘురామకృష్ణరాజు ఏరోజూ ప్రశ్నించలేదు. ఈరోజు ఒక అంగుళం భూమి కూడా అమ్మకున్నా తానేదో అడ్డుకున్నట్టు టీవీ చర్చల్లో చెప్పారు. ఇచ్చిన విలువను, గౌరవాన్ని ఆయన కాపాడుకోలేకపోయారు. ► టీడీపీ ప్రోత్సాహం, బీజేపీలోకి వలస వెళ్లిన నేతల ప్రోద్బలంతో పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. షోకాజ్ నోటీస్‌కు ఆయన ఇచ్చిన జవాబు కూడా సరైన పద్ధతిలో లేదు. ► టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీయేనని, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీయేనని, వైఎస్సార్సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే విషయం అందరికీ తెలుసు. ఉప ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇస్తారు. ఏం సాధించారు?: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ► అధినాయకత్వం, పార్టీ ఎమ్మెల్యేలతో వివాదాలు పెట్టుకుని తనకు ఓటు వేసిన ప్రజలకు ఏమీ చేయలేని స్థితిలో రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఈ వివాదాలతో ఆయన సాధించింది ఏమిటో ప్రశ్నించుకోవాలి. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి సొంతంగా పోటీ చేయాలి. కోవర్టు రాజకీయాలు: చీఫ్ విప్ మార్గాని భరత్ ► మా పార్టీ నుంచి లోక్‌సభ స్పీకర్‌కు ఇచ్చిన లేఖ ఆధారంగానే రఘురామకృష్ణరాజుకు పదవి వచ్చిన విషయం వాస్తవం కాదా? టీటీడీ భూముల విషయంలో తెలుగుదేశం హయాంలో నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? ► ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. ► రఘురామకృష్ణరాజు ఇంగ్లీష్ మీడియం గురించి కూడా వివాదాస్పదంగా మాట్లాడారు. మాతృభాషను కాపాడుకుంటూనే పేద పిల్లల ఉన్నతిని కాంక్షించి ముఖ్యమంత్రి దూరదృష్టితో ఇంగ్లీష్ మీడియం తెచ్చారు. ► పార్టీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా కోవర్టు రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్సార్ సీపీని దూషించడం లేదని చెబుతూనే ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి ఆయన చేసిన నిర్వాకం ఏమిటో ప్రజలు గమనించారు. త్వరలోనే ఆయనపై అనర్హత వేటు పడటం ఖాయం. సొంత బొమ్మతో గెలవాలి: నందిగం సురేష్ ► సొంత టాలెంట్‌తో గెలిచానంటున్న రఘురామకృష్ణరాజుకు అంత నమ్మకముంటే రాజీనామా చేసి సొంత బొమ్మతో గెలవాలి. సాకులు చెప్పకుండా రాజీనామా చేయాలి. ► ఆయన ఇప్పటికే మూడు పార్టీలు మారారు. ఇప్పుడు వెళ్లబోయే పార్టీలో అయినా ఉంటారా? అనేది అనుమానమే. ► కన్నతల్లి లాంటి పార్టీని విమర్శించడం తగదు. ఆయనది ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీవైపు దొంగచూపులు చూసే బుద్ధి. బ్యాంకులకు ఎగనామం పెట్టి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారంతా తమతో కలసిపోవాలని ఆయన్ను ఆహ్వానిస్తున్నారు. ► టీడీపీతో కుమ్మక్కై పార్టీపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు. నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయనకు ఇబ్బంది కలిగించే విషయాలు త్వరలో బయటకు రాబోతున్నాయి కాబట్టి టీడీపీ సహకారంతో బీజేపీ వైపు వెళ్తే బయటపడతానని అనుకుంటున్నారు. సభాపతిదే నిర్ణయం... పార్టీ షోకాజ్ నోటీస్‌ను సవాల్ చేస్తూ రఘురామకృష్ణరాజు కోర్టును ఆశ్రయించారని విలేకరులు పేర్కొనటంపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ అన్ని ప్రొసీజర్స్ అనుసరించే షోకాజ్ నోటీస్ జారీ చేశామని వివరించారు. ‘స్పీకర్‌కు అనర్హత పిటిషన్ అందచేశాం. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా స్పీకర్‌కే ఉంటుంది. స్పీకర్ తీసుకునే నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనే అంశాలను కోర్టులు పరిశీలిస్తాయి’ అని చెప్పారు. అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం లోక్‌సభ స్పీకర్ కూడా వ్యవహరిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. అనర్హత వేటు విధించండి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామ కృష్ణరాజుపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూలును అనుసరించి అనర్హత వేటు విధించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం శుక్రవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పిటిషన్‌ను అందచేసింది. ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహరించిన తీరుకు పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలో అనర్హత కచ్చితంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్, లోక్‌సభాపక్ష ఉపనేత నందిగం సురేష్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కూడిన ఎంపీల బృందం సభాపతిని కలిసింది. మార్గాని భరత్ ఈ మేరకు సభాపతికి పిటిషన్‌ను సమర్పించారు. -
రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు
సాక్షి, తాడేపల్లి : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు.. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై 2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి మీరు గెలుపొందారు. అంతేగాక సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో పార్టీ, ప్రభుత్వంపై మీరు చేసిన వ్యాఖ్యలు ప్రకటనలు.. పార్టీ సభ్యుడిగా ఉండటం పట్ల మీ అయిష్టతను తెలియజేస్తున్నాయి. పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండకుండా.. వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్గానం చేసింది. మెజారిటీ ప్రజలు ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. అయితే మీరు మాత్రం ఎన్నికల మేనిఫెస్టోకు విరుద్ధంగా.. ఈ విషయంలో వైస్సార్సీపీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించారని ఈనాడు, ఆంధ్రజ్యోతి వరుసగా నవంబరు 19, నవంబరు 20, 2019 తేదీల్లో పత్రికల్లో ప్రచురించాయి. ఈ విషయంపై వివిధ స్థాయిల్లో పార్టీ వివరణ కోరింది. ఇక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోచుకుంటున్నారంటూ మీరు చేసిన నిరాధార వ్యాఖ్యలను ఈనాడు జూన్ 16, 2020న ప్రచురించింది. అదే విధంగా ఆంధ్రజ్యోతి సైతం జూన్ 15, 2020న మీ పేరును ఆపాదిస్తూ ఓ కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. ఎంపీగా మీ విజయానికి వైఎస్సార్సీపీ లేదా వైఎస్ జగన్మోహన్రెడ్డి కారణం కాదని మీరు అన్నారు. బతిమిలాడితేనే పార్టీలో చేరానని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ‘‘ఎవ్వరి నాయకత్వం నాకు కావాలి? బొచ్చులో నాయకత్వం?’’ వంటి పదాలు ఉపయోగించి ప్రాథమిక నిబంధనలు అతిక్రమించారు. ఈ పరిణామాలన్నీ మీరు పార్టీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుపుతున్నాయి. అదే విధంగా అధికార వికేంద్రీకరణ నేపథ్యంలో మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా మీరు వివిధ టీవీ షోల్లో విమర్శించారు. అంతేగాక సొంతపార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఓ టీవీ డిబేట్లో మిమ్మల్ని మీరు సింహంగా అభివర్ణించుకోవడమే గాకుండా.. విశ్వసనీయత ప్రదర్శిస్తున్న ప్రజాప్రతినిధులను పందులతో పోల్చారు. సహచర సభ్యులను తక్కువ చేసి మాట్లాడారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీరు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్చందంగా వదులుకోవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మీ మాటలు, చేతలను బట్టి ఇలా భావించాల్సి వస్తోంది. కాబట్టి ఈ విషయాలపై స్పందించేందుకు మీకు ఏడు రోజుల గడువు ఇస్తున్నాం. లేనిపక్షంలో పార్లమెంటరీ పార్టీ.. చట్ట ప్రకారం తదుపరి చర్యలకు సిద్ధమవుతుంది’’ అని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నాయకుడు, పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి పేరిట జారీ చేసిన షోకాజ్ నోటీసులో పేర్కొంది. ఇందుకు వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగులను కూడా జోడించారు. -
సీఎం జగన్ అంగీకరిస్తే సుజనా మా పార్టీలోకి...
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరిస్తే సుజనా చౌదరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అనుకుంటున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన బీజేపీతో టచ్‌లో ఉన్నారని అనడం భావ్యం కాదని ఆయన పేర్కరొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఎవరూ కూడా పార్టీ మారరని స్పష్టం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. 20మంది టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకువెళ్లాలని ఆయన ఈ సందర్భంగా సుజనా చౌదరికి సూచించారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని సుజనా చౌదరి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేనందునే తాను వివరణ ఇస్తున్నానని అన్నారు. ఊహాజనితంగా మాట్లాడటం సబుబు కాదని, ఎవరైనా టచ్‌లో ఉంటే వారి పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్‌పై ప్రజల్లో బలమైన విశ్వాసం ఉందన్నారు. పరిణితి చెందిన ఏ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దూరం కారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కాగా టీ కప్పులో తుఫాన్‌లాంటి ఘటనలు జరిగాయని, తెలుగు భాషపై దుమారం చెలరేగిందని, నిన్న ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చినట్లు రఘురామకృష్ణంరాజు అన్నారు. -
పది రోజుల్లో ఇసుక సమస్యకు పరిష్కారం : ఎంపీ
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా : గత ప్రభుత్వం ఎక్కడా లేని అప్పులు చేసి అంతా కన్ఫ్యూజ్ చేసి పెట్టారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. గురువారం పాలకోడేరు మండలం వేండ్రలో టీడీపీ కార్యకర్తలు, మహిళలు వైఎస్సార్సీపీలోకి చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వారం, పది రోజుల్లో ఇసుక కొరత లేదు అనే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మూడు నెలల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం అసాధారణ నిర్ణయమని తెలిపారు. దేవాలయ కమిటీల్లో, మార్కెట్ యార్డు చైర్మన్ పదవుల్లో 50 శాతం మహిళలకే ప్రకటించిన మహిళా పక్షపాతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ముఖ్యమంత్రిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, ఉండి నియోజకవర్గ కన్వీనర్ పివిఎల్ నరసింహరాజు, పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ కౌరు శ్రీనివాస్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మంతెన యోగేంద్రబాబు, భూపతిరాజు, సత్యనారాయణరాజు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌తోనే మైనార్టీల అభివృద్ధి సాధ్యం
సాక్షి, గుంటూరు : జిల్లాలోని వినుకొండలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. వైఎస్ఆర్ సీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మైనార్టీ సెల్ జాతీయ అధ్యక్షులు రెహమాన్, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా, ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ నేతలు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగించారు. వైఎస్ జగన్‌తోనే మైనార్టీల అభివృద్ధి సాధ్యమని నేతలు అన్నారు. మైనార్టీలందరూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యకర్తల ఆత్మీయ సమావేశం పశ్చిమ గోదావరి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఓంట్లో, ఇంట్లో ఉంటారని, అందుకే తన మనవడికి వైఎస్సార్ పేరు పెట్టుకున్నానని వైఎస్సార్సీపీ నేత రఘురామ కృష్టంరాజు తెలిపారు. ఆదివారం కాళ్ల మండలంలో రఘురామ కృష్టంరాజు ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు గ్రంధి శ్రీనివాస్ మోసేన్‌రాజుతో పాటు పలువురు నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘురామ కృష్టంరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుకి ఓటమి అర్థమయ్యే.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఫారం- 7 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతి ఒక్కరు గమనించి, తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని రఘురామ సూచించారు. ప్రతి ఒక్కరు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు రఘురామ పిలుపునిచ్చారు. -
మరో పార్టీలోకి రఘురామ కృష్ణంరాజు జంప్
ఏలూరు : నామినేషన్ల గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన రఘురామ కృష్ణంరాజు మరోసారి పార్టీ మారారు. ఈసారి ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నరసాపురం లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఈరోజు ఉదయం రఘురామ కృష్ణంరాజు ఏలూరులో మంతనాలు జరిపారు. కాగా నరసాపురం ఎంపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న రఘురామ కృష్ణంరాజుకు బీజేపీ మొండిచెయి చూపించటంతో ఆయన సైకిల్ ఎక్కారు. కాగా మూడు వారాలు తిరగకుండానే మూడో పార్టీలోకి రఘురామ కృష్ణంరాజు జంప్ కావటం విశేషం. -
'తెలంగాణ బిల్లు'పై 8న సుప్రీం కోర్టులో విచారణ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వీలుగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజిత వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. పిల్‌ను ఈ నెల 8న విచారించనున్నట్టు చీఫ్ జస్టిస్ సదాశివంతో కూడా ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టవచ్చా అన్న విషయంపై కోర్టు దృష్టి సారించనుంది. పార్లమెంట్ సమావేశాలు బుధవారం నుంచి జరగనున్నాయి. తెలంగాణ బిల్లును అసెంబ్లీ తిరస్కరిస్తూ రాష్ట్రపతికి పంపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన నిలిపి వేయాలంటూ సుప్రీంకోర్టులో ఏకంగా ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు పలు స్వచ్చంధ సంస్థలు ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ దేశ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుందంటూ వైఎస్ఆర్ సీపీ నేత సోమయాజులు వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం స్వీకరించింది. మరోవైపు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణను త్వరితగతిన చేపట్టాలని రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇక దేశరాజధాని ఢిల్లీ వేదికగా రాష్ట్ర విభజన హాట్ టాపిక్‌గా మారింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. -
సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది
సమైక్యవాద ముసుగులో ఉన్న విభజనవాది రఘురామ కృష్ణంరాజు అని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు. చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమని, తెలంగాణ ఏర్పాటుకు కూడా కట్టుబడి ఉన్నామని చెప్పిన బీజేపీలోకి ఇప్పుడు ఆయనెలా వెళ్లారని ప్రశ్నించారు. వ్యాపార భాగస్వాములను, ప్రజలను కూడా రఘురామ కృష్ణంరాజు మోసం చేస్తున్నారని, ఆయన నిజస్వరూపం ఇన్నాళ్లకు బయటపడిందని గ్రంధి శ్రీనివాస్ అన్నారు. -
'క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి'
ఉండి : క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కనుమూరి రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. క్రైస్తవులకు అండగా న్యాయ పోరాటం చేస్తామని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. ఉండిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవులు, పాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డెల్టా ఆధునీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. వైఎస్ఆర్ ఎప్పుడూ ప్రజల సంక్షేమాన్నే కాంక్షించేవారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందదన్నారు. బిల్లులో ఎన్నో తప్పులున్నాయని, విభజన జరగకుండా న్యాయపోరాటం చేస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలకు వెళతామని తాము ఆశిస్తున్నామన్నారు. కేంద్రంలో సమైక్యం కోరుకున్న వారితోనే పొత్తు ఉంటుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. -
విభజనపై సుప్రీంకోర్టులో రఘురాజు పిటిషన్
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ దేశ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రాల హక్కులను హరించారంటూ రఘురాజు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఉమ్మడి రాజధాని అంశం రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదని .... 371 (డి) రెండు రాష్ట్రాలకు ఎలా అమలు చేస్తారని ఆయన తన పిటిషన్లో కేంద్రాన్ని ప్రశ్నించారు.