సీఎం జగన్‌ అంగీకరిస్తే సుజనా మా పార్టీలోకి... | YSRCP MP Raghu Rama Krishna Raju Rubbishes Sujana Chowdary Alegations | Sakshi
Sakshi News home page

సుజనా ఆరోపణల్లో నిజం లేదు: రఘురామకృష్ణంరాజు

Published Sat, Nov 23 2019 7:32 PM | Last Updated on Sat, Nov 23 2019 9:23 PM

YSRCP MP Raghu Rama Krishna Raju Rubbishes Sujana Chowdary Alegations - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరిస్తే  సుజనా చౌదరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తారని అనుకుంటున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన బీజేపీతో టచ్‌లో ఉన్నారని అనడం భావ్యం కాదని ఆయన పేర్కరొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు ఎవరూ కూడా పార్టీ మారరని స్పష్టం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. 20మంది టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకువెళ్లాలని ఆయన ఈ సందర్భంగా సుజనా చౌదరికి సూచించారు. 

వైఎస్సార్‌ సీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని సుజనా చౌదరి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేనందునే తాను వివరణ ఇస్తున్నానని అన్నారు. ఊహాజనితంగా మాట్లాడటం సబుబు కాదని, ఎవరైనా టచ్‌లో ఉంటే వారి పేర్లు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రజల్లో బలమైన విశ్వాసం ఉందన్నారు. పరిణితి చెందిన ఏ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దూరం కారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కాగా టీ కప్పులో తుఫాన్‌లాంటి ఘటనలు జరిగాయని, తెలుగు భాషపై దుమారం చెలరేగిందని, నిన్న ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చినట్లు రఘురామకృష్ణంరాజు అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement