
సాక్షి, తిరుపతి: రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అనైతిక కార్యక్రమాలకు పాల్పడటం దారుణమని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌లతో.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కలవడం వెనుక కుట్ర ఉందని రోజా విమర్శించారు. దీనిని ఎల్లో మీడియా ఎందుకు ప్రశ్నించలేదని ఆమె నిలదీశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన పత్రికలో ఇలాంటి వార్తలు రాయరని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయాలని ఎల్లోమీడియా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాదరణ ఉన్న ప్రభుత్వాన్ని ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేవన్నారు. కాపులకు కొండంత అండగా సీఎం జగన్ ఉన్నారని, చంద్రబాబులో మార్పు రాకపోతే వచ్చే ఎన్నికల్లో మూడు సీట్లు కూడా రావని ఆర్‌కే రోజా ఎద్దేవా చేశారు. (‘వైఎస్సార్ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment