
ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండాలని సూచించారు.
సాక్షి, తిరుపతి: ఇటీవల చెన్నై అడయార్‌లోని ఫోర్టీస్ మలర్ ఆస్పత్రిలో సర్జరీలు చేయించుకున్న ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ఐదు రోజులుగా చెన్నైలో రోజా చికిత్స పొందుతున్నారు. రెండు మేజర్ ఆపరేషన్లు జరగడంతో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు.
చదవండి:
జగనన్నను కలిశాకే.. ఈ కాళ్లకు చెప్పులు
ఐటీ మౌలిక వసతుల కల్పనపై దృష్టి: గౌతమ్‌రెడ్డి