Minister RK Roja Comments About 46 Days Sports Event From October 2nd - Sakshi
Sakshi News home page

RK Roja: చరిత్రలో తొలిసారి.. 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో క్రీడా సంబరాలు

Published Wed, Jul 5 2023 7:22 PM | Last Updated on Thu, Jul 6 2023 9:31 AM

Minister RK Roja Comments About 46 Days Sports Event-From-October 2nd - Sakshi

తిరుపతి: ఏపీ చరిత్రలోనే తొలిసారి క్రీడా సంబరాలు జరపాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్‌.కే రోజా పేర్కొన్నారు. తిరుపతిలో ఆమె మాట్లాడుతూ.. ఆడుదాం ఆంధ్ర" పేరుతో  రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఆటల వల్ల ఆరోగ్యం, శారీరక దృఢత్వం వస్తుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభించనున్నాం.

15,004 గ్రామ, సచివాలయం పరిధిలో , మండల, జిల్లా,రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహణ. మొత్తం 2లక్షల94 వేల మ్యాచ్ లు  నిర్వహిస్తాం. ఐదు కేటగిరిలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. వాటిలో  క్రికెట్, వాలీబాల్,బ్యాడ్మింటన్‌, ఖోకో ఉన్నాయి. కాగా ప్రైజ్‌ల కోసం రూ.12 కోట్లు ఖర్చు చేయనున్నాం. రూ. 42 కోట్లతో క్రీడా సామగ్రి కిట్లు అందించనున్నాం.

మొత్తంగా ఈ కార్యక్రమానికి రూ. 58.94 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 46 రోజులు పాటు ఒక పండగ వాతావరణంలో నిర్వహించనున్నాం. 17 ఏళ్లు పైబడిన వారు అందరూ పాల్గొనవచ్చు. యువతలో టాలెంట్ గుర్తించేందుకు ఇది మంచి అవకాశం'' అని మంత్రి రోజా పేర్కొన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement