sports events
-
ATA Convention 2024: అదరహో అన్నట్టుగా సాగుతున్న ‘ఆటా’ ఆటల పోటీలు
కన్వెన్షన్ అంటే సాంస్కృతిక, నృత్య, సాహిత్య, సంగీత కలాపాలు, కొత్త పరిచయాలు, ప్రముఖ వ్యక్తుల సందడి, మంచి ఆహారం, జ్ఞానాన్ని పెంపొందించే సదస్సుల వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాల సమూహం. ఈ ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారు మామూలు వాళ్ళు కాదండోయ్.. ఆటపాటలతో పాటు ఆరోగ్యమే మహా భాగ్యమన్న రీతిలో అమెరికాలోని పలు నగరాలలో మెగాఆటా కన్వెన్షన్(18వ) నిర్వహించనుంది.యూత్ కాన్ఫరెన్స్‌లో భాగంగా అసాధారణమైన ప్రతిభ, క్రీడాస్ఫూర్తి, సమాజ స్ఫూర్తిని ప్రదర్శించే థ్రిల్లింగ్ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొన్న వారికి.. అదే విధంగా ప్రేక్షకులకు చిరస్మరణీయమైన క్షణాలను అందిస్తోంది. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారమ్స్, క్రికెట్, చెస్ వంటి పురుషులు / బాలురు మరియు మహిళలు / బాలికల కోసం చేస్తున్న వివిధ క్రీడలు వైవిధ్యభరితంగా, ఉత్సాహ పూరితంగా సాగడం ఆటా వారి బహుముఖ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఈ కన్వెన్షన్ ఈవెంట్ జూన్ 7న మొదలుకానుంది. అందరూ ఆహ్వానితులే, మరిన్ని వివరాలకు, టికెట్లకు www.ataconference.org ని సందర్శించాలని ఆటా తెలిపింది.కాగా ఆటా స్పోర్ట్స్ టీమ్ నేతృత్వంలో సువానీలోని ఏబిసి సెంటర్లో జరిగిన ఆటా బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టోర్నమెంట్లో వివిధ విభాగాల్లో దాదాపు 160 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్, ఓపెన్ సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో పోటీ తీవ్రంగా ఉండటం క్రీడాస్ఫూర్తిని మరింత పెంచింది.ఇక షేఖరాగ్ పార్క్‌లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ సరే సరి.. అధిక సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొనడం.. మునుపెన్నడూ లేనన్ని జట్లు ముందుకు రావడం వల్ల ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.అదే విధంగా... పలు రాష్ట్రాల నుండి దాదాపు 200 మందికి పైగా పిల్లలు, పెద్దలు పాల్గొన్న చదరంగం టోర్నమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది చెస్ట్రోనిక్స్ ద్వారా సులభతరం చేయబడింది. ఆటా కన్వెన్షన్‌లో భాగంగా చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఫౌలర్ పార్క్ రెక్ సెంటర్లో జరిగిన ఆటా మహిళల పికిల్ 8బాల్ టోర్నమెంట్ అన్ని ఈవెంట్లలోకి హైలైట్ అని చెప్పవచ్చు. నీతూ చౌహాన్ నేతృత్వంలో ఆటా మహిళా స్పోర్ట్స్ టీమ్ నిర్వహించిన ఈ టోర్నమెంట్లో సింగిల్స్, డబుల్స్ విభాగాలు అన్ని స్కిల్ లెవెల్స్ ప్లేయర్లకు జరిగాయి.ఆటా మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విభిన్న నేపథ్యాలు మరియు నైపుణ్య స్థాయిల క్రీడాకారులను ఒకచోట చేర్చింది. ఈ ఈవెంట్ ప్రారంభ మరియు మధ్య స్థాయిలలో సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాలను కలిగి ఉంది, పాల్గొన్న వారికి వ్యక్తిగతంగా, జట్టులో భాగంగా పోటీ చేసే అవకాశాన్ని అందించింది.స్పోర్ట్స్ కమిటీ ఛైర్ అనంత్ చిలుకూరి, ఉమెన్స్ స్పోర్ట్స్ ఛైర్ నీతూ మాట్లాడుతూ.. ‘‘ ఇటీవలి స్పోర్ట్స్ ఈవెంట్ల విజయంతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆటగాళ్ల ప్రతిభ, క్రీడాస్ఫూర్తి స్థాయి నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ ఈవెంట్లను అద్భుతంగా విజయవంతం చేసినందుకు క్రీడాకారులు, నిర్వాహకులు, వాలంటీర్లు, స్పాన్సర్లతో సహా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటివి మున్ముందు మరిన్ని జరగబోతున్నాయి’’ అని తెలిపారు.కాగా స్పోర్ట్స్ కమిటీలు, రీజనల్ కోఆర్డినేటర్లు అనంత్ చిలుకూరి, నీతూ చౌహాన్, శ్రీకాంత్ పాప, వెంకట్ రోహిత్, రంజిత్ చెన్నాడి, హరికృష్ణ సికాకొల్లి, సుభాష్ ఆర్ రెడ్డి, , శ్రీనివాస్ పసుపులేటి, సతీష్ రెడ్డి అవుతు, దివ్య నెట్టం, సరిత చెక్కిల, వాసవి చిత్తలూరి వంటి ఎంతో మంది అంకితభావం మరియు కృషి వల్లే సాధ్యమైంది. ఖచ్చితమైన ప్రణాళిక మరియు పకడ్బందీగా అమలు చేయడం వల్ల అందరికీ గొప్ప అనుభూతిని మిగులుస్తోంది.ఆటా కాన్ఫరెన్స్ బృందం భవిష్యత్తులో మరింత ఆకర్షణీయమైన మరియు పోటీతత్వ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహించడం, సంఘంలో స్నేహపూర్వక మరియు ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉంటుంది. బహుమతుల పంపిణీ కన్వెన్షన్ లో విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో, భారీ జనసందోహం ముందు జరగబోతున్నది. అలానే, ఆటా వారు అందరికీ స్నాక్స్, బెవరేజెస్ మరియు భోజనం అందించారు. అందరూ తప్పకుండా రండి, కలిసి మెలిసి మన ఆటా కన్వెన్షన్ ని ఆడుతూ, పాడుతూ జరుపుకుందామని ఆటా పిలుపునిస్తోంది. -
స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!
న్యూఢిల్లీ: ముంబైలో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లో బాలీవుడ్ లవబుల్ కపుల్ సందడి చేశారు. బ్రహ్మాస్త్ర జంట అలియా భట్, రణబీర్ కపూర్ తళుక్కున మెరిసారు. అదీ ISLని నిర్వహించే ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్పర్సన్ నీతా అంబానీతో కలిసి ఆదివారం సందడి చేశారు. ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ముంబై సిటీ FC vs కేరళ బ్లాస్టర్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు బాలీవుడ్ తారలతో పాటు, నీతా అంబానీ ,అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అలియా, రణబీర్ జంటను నీతా ప్రత్యేకంగా అభినందించారు. ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ ముంబై సిటీ FC సహ-యజమాని ఏ దిల్ హై ముష్కిల్ హీరో రణబీర్ తన జట్టుకు మద్దతుగా స్పోర్ట్స్ ఈవెంట్లో, ఇనీషియల్స్‌తో పాటు వెనుక ఎనిమిది నంబర్ ప్రింట్ చేసిన బ్లాక్ జెర్సీలో బ్యూటిఫుల్‌గా ఫ్యాన్స్‌ను అలరించాడు. బ్లాక్ కార్గో-స్టైల్ ప్యాంటు,మ్యాచింగ్ బ్లాక్ క్యాప్‌ను ధరించగా, ప్లస్ వన్ బ్లూ జెర్సీలో అలియా చేతులు పట్టుకుని స్టేడియంలోకి ప్రవేసించారు. అక్కడ ఫ్యాన్స్‌తో, సెల్పీలకు పోజులిచ్చారు. ఈ క్రమంలో ఒలింపిక్ అధ్యక్షురాలు నీతి అంబానీతో కలిసి పోజులివ్వడం విశేషంగా నిలిచింది. రణబీర్, అలియా జంట క్రీడాభిమాన్లు. గత నెలలో న్యూయార్క్‌లో విహారయాత్ర చేస్తున్నప్పుడు, ఈ జంట యూఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో కూడా మెరిసిన సంగతి తెలిసిందే . కాగా అంబానీ నివాసంలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు గత నెలలో, అలియా, బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీతో కలిసి హాజరయ్యారు. అయితే ఈ వేడుకుకు భర్త రణ్‌బీర్ ఈవెంట్‌కు మిస్సయ్యాడు. ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే నేషనల్ అవార్డు విన్నర్ అలియాస్వయంగా నిర్మిస్తున్న జిగ్రా అనే యాక్షన్ చిత్రంలోనూ నటిస్తూ, నిర్మిస్తోంది. రణవీర్ సింగ్‌తో కలిసి బైజు బావ్రా అనే పీరియాడికల్ డ్రామాలో నటిస్తోంది. అలాగే రణబీర్ కపూర్ యానిమల్ కోసం సిద్ధమవుతున్నాడు. బాబీ డియోల్, అనిల్ కపూర్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. -
ప్రపంచ ఛాంపియన్లు వీళ్లే.. ఓ క్రీడాంశంలో భారత్ కూడా..!
వివిధ క్రీడాంశాల్లో (పురుషులు) ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లపై (టీమ్ గేమ్స్) ఓ లుక్కేద్దాం. ప్రపంచవ్యాప్తంగా జరిగే 17 రకాల క్రీడల్లో 17 దేశాలకు చెందిన జట్లు జగజ్జేతలుగా ఉన్నాయి. ఈ లిస్ట్‌లో భారత్ కూడా ఉంది. క్యారమ్స్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా కొనసాగుతుంది. ఈ జాబితాలో యూఎస్ఏ అత్యధికంగా మూడు క్రీడాంశాల్లో వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. గోల్ఫ్, లాక్రాస్, అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాంశాల్లో యూఎస్ఏ డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. యూఎస్ఏ తర్వాత స్పెయిన్ అత్యధికంగా రెండు క్రీడాంశాల్లో ప్రపంచ ఛాంపియన్‌గా ఉంది. స్పెయిన్ బాస్కెట్‌బాల్, టెన్నిస్‌లలో వరల్డ్ ఛాంపియన్‌గా కొనసాగుతుంది. పాకిస్తాన్ సైతం ఓ క్రీడాంశంలో వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. కబడ్డీలో పాక్ జగజ్జేతగా ఉంది. వివిధ క్రీడల్లో వరల్డ్ ఛాంపియన్లు (పురుషులు).. క్యారమ్స్: భారత్ క్రికెట్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్: అర్జెంటీనా గోల్ఫ్: యూఎస్ఏ లాక్రాస్: యూఎస్ఏ అమెరికన్ ఫుట్‌బాల్: యూఎస్ఏ టెన్నిస్: స్పెయిన్ బాస్కెట్‌బాల్: స్పెయిన్ బ్యాడ్మింటన్: డెన్మార్క్ కబడ్డీ: పాకిస్తాన్ చెస్: నార్వే హాకీ: జర్మనీ వాలీబాల్: బ్రెజిల్ బేస్‌బాల్: జపాన్ రగ్భీ: సౌతాఫ్రికా సాఫ్ట్‌బాల్: ఆస్ట్రేలియా టేబుల్ టెన్నిస్: చైనా -
చరిత్రలో తొలిసారి.. 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో క్రీడా సంబరాలు
తిరుపతి: ఏపీ చరిత్రలోనే తొలిసారి క్రీడా సంబరాలు జరపాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్.కే రోజా పేర్కొన్నారు. తిరుపతిలో ఆమె మాట్లాడుతూ.. ఆడుదాం ఆంధ్ర" పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఆటల వల్ల ఆరోగ్యం, శారీరక దృఢత్వం వస్తుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభించనున్నాం. 15,004 గ్రామ, సచివాలయం పరిధిలో , మండల, జిల్లా,రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహణ. మొత్తం 2లక్షల94 వేల మ్యాచ్ లు నిర్వహిస్తాం. ఐదు కేటగిరిలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. వాటిలో క్రికెట్, వాలీబాల్,బ్యాడ్మింటన్, ఖోకో ఉన్నాయి. కాగా ప్రైజ్‌ల కోసం రూ.12 కోట్లు ఖర్చు చేయనున్నాం. రూ. 42 కోట్లతో క్రీడా సామగ్రి కిట్లు అందించనున్నాం. మొత్తంగా ఈ కార్యక్రమానికి రూ. 58.94 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 46 రోజులు పాటు ఒక పండగ వాతావరణంలో నిర్వహించనున్నాం. 17 ఏళ్లు పైబడిన వారు అందరూ పాల్గొనవచ్చు. యువతలో టాలెంట్ గుర్తించేందుకు ఇది మంచి అవకాశం'' అని మంత్రి రోజా పేర్కొన్నారు. -
106 ఏళ్ల వయసులో బంగారు పతకాలు సాధించిన బామ్మ
డెహ్రాడున్: హర్యానాలోని కద్మ అనే కుగ్రామానికి చెందిన రమాబాయి 18వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని 106 ఏళ్ల వయసులో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం తోపాటు షాట్ పుట్ లో కూడా బంగారు పతకాలను గెలుచుకున్నారు. నడుము వాల్చి సేదదీరాల్సిన వయస్సులో రమాబాయి సాధించిన ఈ ఫీట్ నడుమొంచని నేటి యువతకు చెంపపెట్టు లాంటిది. ప్రపంచ రికార్డుతో మొదలు.. రెండేళ్ల క్రితం అంటే బామ్మ వయసు 104 ఏళ్ళున్నప్పుడు మనవరాలు షర్మిలా సంగ్వాన్ నింపిన స్ఫూర్తితో అథ్లెటిక్స్ వైపు అడుగులేసింది. సరిగ్గా ఏడాది దాటేసరికి 85 ఏళ్ళు పైబడిన కేటగిరీలో 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకుంది. వడోదరలో జరిగిన ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగును 45.50 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డును సృష్టించింది. ఇక అక్కడి నుండి బామ్మ వెనుదిరిగి చూడలేదు. ఈ వ్యవధిలో రమాబాయి మొత్తం 14 ఈవెంట్లలో సుమారు 200 మెడల్స్ సాధించింది. తాజాగా జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ లో ఏకంగా మూడు బంగారు పతకాలను చేజిక్కించుకుని యువతకు ఆదర్శప్రాయంగా నిలిచింది. పతకాలను అందుకోవడానికి పోడియం వద్దకు వెళ్లిన బామ్మ తన కాళ్లకు శక్తినిచ్చిన మనవరాలికి కృతఙ్ఞతలు చెప్పారు. అలా మొదలైంది.. 2016లో వాంకోవర్‌లో జరిగిన అమెరికన్ మాస్టర్స్ గేమ్ ఈవెంట్లో పంజాబ్ కు చెందిన కౌర్ అనే బామ్మ 100 ఏళ్ల వయసులో 100 మీటర్ల పరుగుని 1 నిముషం 26 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కౌర్ ఆ తర్వాత ఏడాదే ఆక్లాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ ఈవెంట్లో మరో ఏడు సెకన్లను తగ్గిస్తూ తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది. రమాబాయి మనవరాలు కౌర్ గురించి చెప్పినప్పుడు మొట్టమొదటిసారి రమాబాయికి కూడా అథ్లెటిక్స్ లో పాల్గొనాలన్న తృష్ణ కలిగింది. ఫిట్నెస్ కోసం.. అప్పటివరకు గృహిణి గాను, ఎప్పుడైనా వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీసిన బామ్మ రూటు మార్చింది. మైదానంలో అడుగుపెట్టి వయసు అడ్డంకులన్నిటినీ చెరిపేసి సాధన చేసింది. ఫిట్నెస్ కోసం పాలు, పాల ఉత్పత్తులు, తాజా ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుంది. భారీ వాహనాన్ని నడిపే రమాబాయి మనవరాలు షర్మిల మొదట తన బామ్మకు క్రీడలవైపు వెళ్లాల్సిందిగా సలహా ఇచ్చినప్పుడు మొత్తం కుటుంబం భయపడింది... ఈ వయసులో బామ్మను సరిగ్గా చూసుకోకపోతే గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తారని భయపడినట్లు వెల్లడించారు. కానీ తన బామ్మ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లేటు వయసులో చాంపియన్ గా అవతరించి మొత్తం గ్రామానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇది కూడా చదవండి: వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం? -
Roundup 2022: సిటీలో మొట్టమొదటిసారి కార్ రేసింగ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం ఈ ఏడాది మొట్టమొదటిసారి మోటారు క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో రెండు దఫాలుగా జరిగిన ఈ రేసింగ్‌లు మోటార్ స్పోర్ట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ► నవంబర్ 19, 20 తేదీల్లో సాంకేతిక కారణాల దృష్ట్యా పోటీలను నిర్వహించలేకపోయినా రెండు రోజుల ట్రయల్స్ హైదరాబాద్ నగరానికి ఒక కొత్త క్రీడను పరిచయం చేశాయి. ► వచ్చే ఏడాది అంటే 2023 ఫిబ్రవరి 11వ తేదీన జరుగనున్న అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహనాల రేసింగ్ పోటీలు ఫార్ములా–ఈ కి సన్నాహకంగా భావించే ఇండియన్ రేసింగ్ కార్కు నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్ వేదికైంది. ► ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీల కోసం సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ ఈ ట్రాక్‌ను నిర్మించింది. ఇదే ట్రాక్‌పై నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇండియన్ రేసింగ్ కారు పోటీలను నిర్వహించారు. హోరెత్తిన పోరు... ► హుస్సేన్‌సాగర్ తీరంలో రయ్‌మంటూ భారీ శబ్దంతో దూసుకెళ్లిన కార్లు నగరవాసులకు కొత్త పరిచయం. నవంబర్‌లో ఒక కారు ప్రమాదానికి గురికావడం, తరచు బ్రేక్‌డౌన్స్ చోటుచేసుకోవడం, రేసర్లు సన్నద్ధంగా లేకపోవడంతో ఈ నెలలో పోటీలను నిర్వహించలేదు. ► హైదరాబాద్‌కు చెందిన బ్లాక్బర్డ్స్తో పాటు చెన్నై, బెంగళూరు, కొచ్చి, ఢిల్లీ, ప్యారిస్, ఇటలీ తదితర నగరాలకు చెందిన 12 బృందాలు, 22 మంది రేసర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ► వాహనాల నిర్వహణ కోసం మెకానిక్‌లు, సాంకేతిక నిపుణులు, వివిధ విభాగాలకు చెందిన బృందాలతో నెక్లెస్ రోడ్డు కోలాహలంగా మారింది. ► డిసెంబర్లో రెండవ దఫా నిర్వహించిన పోటీల్లో కొచ్చి టీమ్ విజేతగా గెలిచింది. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రన్నరప్‌గా నిలిచింది. ► యువతను ముఖ్యంగా మోటార్ స్పోర్ట్స్ అభిమానులను అలరించిన ఈ పోటీలతో హైదరాబాద్ నగరం ఈ రంగలో మొట్టమొదటిసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ► ఈ పోటీల వల్ల నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ రద్దీ నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరానికి వెలుపల పోటీలను నిర్వహించాలని వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చింది. ► ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీలతో అంతర్జాతీయంగా హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని ఈ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: TS: సంక్షేమ శాఖల్లో 581 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ -
కొత్తగా.. సరికొత్తగా.. చూస్తే ఆశ్చర్యపోతారు!
అడ్వర్టైజింగ్ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ ఈవెంట్స్ వేదికగా సరికొత్తగా యాడ్స్‌ను ప్రజెంట్ చేస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి ఏజెన్సీలు. వేల కోట్ల రూపాయలు నవంబరులో జరగబోయే 20 ట్వంటీ వరల్డ్ కప్ డిజిటల్ మీడియా హక్కులు సుమారు రూ.800 కోట్ల రూపాయలని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఇదే సమయంలో టెలివిజన్ ప్రసార హక్కులైతే ఏకంగా వేల కోట్ల రూపాయల్లోనే పలుకుతున్నాయి. ఇలా కోట్లాది రూపాయల డబ్బులు చెల్లించి స్పోర్ట్స్ ఈవెంట్ ప్రసార హక్కులు దక్కించుకున్న టీవీ ఛానల్స్, డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ తమ పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవడంతో పాటు అధిక లాభాలు పొందేందుకు నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. తగ్గని డిమాండ్ క్రికెట్ మ్యాచ్‌లు వస్తుంటే ప్రతీ ఓవర్ మధ్యలో, వికెట్ పడ్డప్పుడు యాడ్స్ వస్తూనే ఉంటాయి. ఈ టైంలో పది సెకన్ల పాటు ఒక యాడ్ ప్రసారం చేసేందుకు పది లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేస్తుంటారు. అయినా సరే క్రేజ్ ఉన్న స్పోర్ట్స్, గేమ్స్ విషయంలో ఎంతైనా చెల్లించడానికి కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతుంటాయి. కోట్ల రూపాయల డబ్బులు వచ్చి పడుతున్నా.. సరే ఒకేసారి పలు రకాల యాడ్స్ ప్రసారం చేసే అవకాశం ఇప్పటి వరకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వేదిక అదే, గేమ్ అదే, అక్కడ ఆటగాళ్లు వాళ్లే కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించేది మాత్రం వేరే. వర్చువల్ రీప్లేస్మెంట్.. స్పోర్ట్స్ ఈవెంట్స్ ద్వారా అధిక ఆదాయం పొందేందుకు టెలివిజన్ కంపెనీలు, డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ వర్చువల్ రీప్లేస్మెంట్ పెరిమీటర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఈ సరికొత్త టెక్నాలజీని సపోర్ట్ చేసే కెమెరాలు ముందుగా ‘వర్చువల్ హెడ్’ (సాధారణంగా ఆటగాడు)ని గుర్తిస్తాయి. అతని కదలికలకు అనుగుణంగా బ్యాక్‌గ్రౌండ్‌లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు వీలుగా వీడియోను చిత్రీకరిస్తాయి. మార్చేస్తుంది సింపుల్‌గా చెప్పాలంటే క్రికెట్ మ్యాచ్‌లో బాల్ బౌండరీ లైను దగ్గరికి వెళ్లినప్పుడు లైన్ అవతల మనకు వివిధ కంపెనీలు సైనుబోర్డులు, హోర్డింగులు కనపిస్తుంటాయి. ఇప్పటి వరకు ఉన్న పద్దతి ప్రకారం ఏ దేశంలో ఆ ఫుటేజీ ప్రసారమైనా బౌండరీ లైను ఆవల ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఒక్కటే. కానీ వర్చువల్ రీప్లేస్మెంట్ పెరిమీటర్ టెక్నాలజీలో వివిధ ప్రాంతాలను, అక్కడ కుదుర్చుకున్న ప్రసార ఒప్పందాలను బట్టి బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్ ఛేంజ్ అవుతుంది. ఎక్కడిదక్కడే ఉదాహరణకి ఇండియా - ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరిగితే గతంలో బౌండరీ లైను దగ్గర ఎక్స్ అనే కంపెనీకి చెందిన బోర్డు ఉంటే ఇటు ఇండియా అటు ఆస్ట్రేలియాలలో టీవీలో ప్రసారమయ్యే మ్యాచ్‌లో ఎక్స్ కంపెనీ బోర్డు మాత్రమే కనిపించేది. కానీ కొత్తగా వచ్చిన టెక్నాలజీ పుణ్యమా అని ఆస్ట్రేలియాలో ఒక రకమైన బోర్డు కనిపిస్తే, ఇండియాలో మరో రకం కంపెనీ బోర్డు కనిపిస్తుంది. ఆగేది లేదు వేర్వేరు దేశాల్లో ఆయా క్రీడలకు ఉండే డిమాండ్, అక్కడి మార్కెట్ తదితర అంశాలను బేరీజు వేసుకుని యాడ్ స్లాట్ రేట్లలో హెచ్చు తగ్గులు చేసేందుకు వీలుగా యాడ్ ఏజెన్సీలు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం స్పోర్ట్స్‌లో ఫుట్‌బాల్‌లో ఈ టెక్నాలజీ ఎక్కువగా వాడుతున్నారు. త్వరలోనే క్రికెట్ ప్రసారాల్లో కూడా తేనున్నారు. ఆ తర్వాత ఈ టెక్నాలజీని త్వరలో సినిమా ఫంక్షన్లు, ఆథ్యాత్మిక కార్యక్రమాలు, లాంఛింగ్ ఈవెంట్స్ కూడా విస్తరించే పనిలో ఉన్నాయి యాడ్ ఏజెన్సీలు. This is how advertising will go in the future https://t.co/MtZz0spC9i — Harsh Goenka (@hvgoenka) October 7, 2021 చదవండి : థియేటర్స్ Vs హోమ్ థియేటర్స్ -
క్రీడలకు ‘కరోనా’ అంతరాయం
బీజింగ్ : కరోనా వైరస్ విజృంభణతో చైనా సతమతమవుతోంది. దీంతో విదేశీయులు చైనా వెళ్లాలంటే హడలిపోతున్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి చైనాకు వచ్చేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. మరోవైపు వచ్చే రెండు నెలల్లో చైనాలో జరగాల్సిన పలు అంతర్జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వాహకులు వాయిదా వేస్తున్నారు. మార్చి నెలలో నాన్జింగ్లో జరిగే వరల్డ్ ఇండోర్ చాంపియన్‌షిప్‌ను వాయిదా వేసుకుంటున్నట్టు అంతర్జాతీయ ట్రాక్ సమాఖ్య ప్రకటించింది. తమ వైద్య బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్ట ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే అంతర్జాతీయ స్కీ ప్రతినిధులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఫిబ్రవరి నెలలో నిర్వహించాల్సిన డౌన్‌హిల్, సూపర్ జీ ఈవెంట్లను వాయిదా వేస్తున్నామని.. కొత్త తేదీలను ఇంకా ప్రకటించలేదని తెలిపారు. అంతర్జాతీయ స్కీ సమాఖ్య అధ్యక్షుడు జియాన్ ఫ్రాంకో కాస్పర్ మాట్లాడుతూ.. ఆటగాళ్ల ఆరోగ్యం, సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య కూడా ఇదే రకంగా స్పందించింది. చైనా, బెల్జియం జాతీయ జట్ల మధ్య చ్యాగ్స్యూలో జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. చైనాలోని పరిస్థితులను పరిశీలిస్తున్నామని.. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. మరోవైపు వైరస్ కారణంగా చైనాలో ఇప్పటికే 170 మంది చనిపోయారు. తీవ్రత ఎక్కువగా ఉన్న వుహాన్ నగరంలో ప్రజారవాణాను నిలిపివేశారు. వైరస్‌ను నియంత్రణలోకి తెచ్చేందుకు చైనా ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్‌తో భేటీ అయ్యారు. -
హోరాహోరీగా క్రీడాపోటీలు
డక్కిలి: డక్కిలి గురుకుల పాఠశాల, కళాశాల క్రీడా ప్రాంగణంలో బుధవారం గుంటూరు జోనల్ స్థాయి మూడో జోన్ గురుకుల పాఠశాల, కళాశాలల పోటీలు హోరాహోరీగా సాగాయి. పలు క్రీడా పోటీల్లో విద్యార్థులు పోటాపోటీగా ఆడారు. ఉదయం 7 నుంచి 11 గంటలు వరకు పోటీలు జరిగాయి. అనంతరం వర్షం జోరుగా కురవడంతో సాయంత్రం ప్రారంభమైన క్రీడా పోటీలు రాత్రి ఏడు గంటలు వరుకు సాగాయి. సీనియర్ హైజంప్ విభాగంలో సుప్రియ (నాగులపాళెం, ప్రకాశం జిల్లా), దీపిక (నాగులపాళెం, ప్రకాశం జిల్లా), రేవతి (పుదూరు) గెలుపొందారు. ట్రిపుల్ జంప్ విభాగంలో సుప్రజ (అద్దంకి, ప్రకాశం జిల్లా), తనుజా (సంగం), సంధ్య (ముత్తుకూరు), వాలీబాల్ సీనియర్స్ విభాగంలో కండలేరు – అమరావతి మధ్య జరిగిన పోరులో అమరావతి విజయం సాధించింది. నాగార్జునసాగర్–సూళ్లూరుపేట మధ్య జరిగిన పోటీల్లో నాగార్జునసాగర్ గెలిచింది. వినుకొండ – కొత్తకోడూరు జరిగిన మధ్య పోటీల్లో వినుకొండ విజయం పొందింది. పెద్దపావని – చీమకుర్తి మధ్య జరిగిన పోటీల్లో పెద్దపావని జట్టు గెలుపొందింది. ఖోఖో జూనియర్స్ విభాగంలో ఉప్పలపాడు – ఆర్కేపురం మధ్య జరిగిన పోటీల్లో ఆర్కేపురం గెలిచింది. సీనియర్స్ ఖోఖో విభాగంలో ముత్తుకూరు – నాగార్జునసాగర్ మధ్య జరిగిన పోటీల్లో నాగార్జునసాగర్ గెలుపొందింది. త్రోబాల్ జూనియర్ విభాగంలో కండలేరు – అమరావతి మధ్య జరిగిన పోటీల్లో కండలేరు జట్టు గెలుపొందింది. నాగార్జునసాగర్ – రాచర్ల మధ్య జరిగిన పోటీల్లో నాగార్జునసాగర్ గెలుపొందింది. పెద్దపావని – పుదూరు మధ్య జరిగిన పోటీల్లో పుదూరు జట్టు గెలుపొందింది. వినుకొండ – నాగార్జునసాగర్ మధ్య జరిగిన పోటీల్లో వినుకొండ గెలుచింది. సింగరాయకొండ – సంగం మధ్య జరిగిన పోటీల్లో సంగం గెలుపొందింది. బోగోలు – కండలేరు జట్ల మధ్య జరిగిన పోటీల్లో కండలేరు జట్టు విజయం సాధించింది. కబడ్డీ జూనియర్స్ విభాగంలో డక్కిలి – బోగోలు మధ్య జరిగిన పోటీల్లో డక్కిలి జట్టు గెలిచింది. సూళ్లూరుపేట – బుచ్చిరెడ్డిపాళెం జట్ల మధ్య జరిగిన పోటీల్లో సూళ్లూరుపేట జట్టు గెలిచింది. ఉప్పలపాడు – అమరావతి జట్ల మధ్య జరిగిన పోటీల్లో ఉప్పలపాడు గెలిచింది. పుదూరు–కొండెపి జట్ల మధ్య జరిగిన పోటీల్లో పుదూరు జట్టు గెలిచింది. కబడ్డీ సీనియర్స్ విభాగంలో రాచర్ల – బాపట్ల జట్ల మధ్య జరిగిన పోటీల్లో బాపట్ల జట్టు విజయం సాధించింది. సూళ్లూరుపేట – నాగులపాళెం జట్ల మధ్య జరిగిన పోటీల్లో సూళ్లూరుపేట జట్టు విజయం సాధించింది. -
క్రీడా సందడి
ఉత్సాహంగా ఎస్జేఎఫ్ఐ ఎంపికలు అమలాపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జేఎఫ్ఐ) ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. అండర్–14, అండర్–17 బాలురు, బాలికలకు షటిల్ బ్యాడ్మింటన్, ఫెన్సింగ్, బాక్సింగ్ విభాగాల్లో స్థానిక బాలయోగి స్టేడియంలో శుక్రవారం ఈ ఎంపికలు నిర్వహించారు. దీనికి జిల్లా నలుమూలల నుంచీ 310 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపిక పోటీలను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మెట్ల వెంకట సూర్యనారాయణ, కోనసీమ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, ఎస్జేఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు) లాంఛనంగా ఆరంభించారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ, అమలాపురం నియోజకవర్గంలో నాలుగుచోట్ల క్రీడా మైదానాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లా పోటీల్లో ఎంపికైనవారు రాష్ట్రస్థాయికి, అక్కడ ఎంపికైనవారు జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని రాంబాబు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఎంపికకు వచ్చే విద్యార్థులకు తొలిసారి భోజన సదుపాయం కల్పించామని చెప్పారు. అనంతరం షటిల్ బ్యాడ్మింటన్, ఫెన్సింగ్, బాక్సింగ్ విభాగాల్లో గెలుపుకోసం క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. ప్రధానోపాధ్యాయులు రంకిరెడ్డి కాశీ విశ్వనాథం, జొన్నలగడ్డ గోపాలకృష్ణ పరిశీలకులుగా వ్యవహరించారు. పీడీ, పీఈటీలు అడబాల శ్రీనివాస్, పాయసం శ్రీనివాస్, కాకిలేటి సూరిబాబు, గొలకోటి నారాయణరావు, గొలకోటి శ్రీనివాస్, కుంపట్ల ఆదిలక్ష్మి, ప్రసాద్, చంద్రశేఖర్, విత్తనాల శ్రీనివాస్, స్టేడియం కోచ్ ఐ.భీమేష్ పాల్గొన్నారు. -
జిహాదీల మధ్య ఆటల పోటీలు
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఇటీవలే బాంబులతో మారణహోమం సృష్టించిన ఐసిస్ టెర్రరిస్టులు ప్రజలను ఆకర్షించేందుకు మరో కొత్త అవతారం ఎత్తారు. తమలో కరుడుగట్టిన కాఠిన్యంతోపాటు క్రీడాస్ఫూర్తి కూడా ఉందని నిరూపించుకునేందుకు మినీ జిహాదీ ఒలింపిక్స్‌ను నిర్వహించారు. జిహాదీల మధ్య ‘టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చెయిర్స్’ లాంటి ఆటల పోటీలను నిర్వహించారు. ఇరాక్‌లోని తమ ఆధీనంలోని తల్ అఫర్ పట్టణంలో ఇటీవల నిర్వహించిన ఆటల పోటీలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పిల్లలకు గాలి బుడగలు ఊదడం లాంటి పోటీలు కూడా నిర్వహించారు. విజేతలందరికి పోటీల తర్వత స్వీటు ప్యాకెట్లను పంచిపెట్టారు. ఈ పోటీల్లో ఐదేళ్ల బాలలు కూడా పాల్గొనడం విశేషం. ఈ పోటీల్లో పాల్గొనాలంటూ స్థానిక ప్రజలను ప్రోత్సహించారు. స్థానికుల్లో పిల్లలు తప్ప పెద్దలెవరూ హాజరు కాకపోయినా, వారంతా వచ్చి జీహాదిల మధ్య జరిగిన పోటీలను ప్రోత్సహించారు. జీహాదీలు బ్రిటిష్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల షర్టులను ధరించి మరీ పోటీల్లో పాల్గొన్నారు. ఇరాక్, సిరియా దేశాల్లో తమ ఆధీనంలోని నగరాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చాటుకునేందుకే ఈ ఆటల పోటీలను నిర్వహించారని స్థానిక ప్రజలు వ్యాఖ్యానించారు. ఐసిస్ టెర్రరిస్టుల ట్విట్టర్ వినియోగం గత రెండేళ్లలో 45 శాతం తగ్గిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే జీహాదీ ఒలింపిక్స్ పోటీలకు సంబంధించిన ఫొటోలు ట్విట్టర్లో పోస్ట్ అయ్యాయి. -
ఈ పతకాలు మాకొద్దు!
తిరిగిచ్చేసిన గోవా అథ్లెట్లు మార్గోవా: క్రీడా ఈవెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఆయా ఆటగాళ్లకు పతకాలు అందజేయడం పరిపాటి. అయితే తమ ఆటతీరుకు పురస్కారంగా లభించిన ఈ పతకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని వాటిని తిరిగి ఇచ్చేసిన ఘటన ఇది. జనవరిలో గోవాలో లూసోఫోనియా గేమ్స్ జరిగాయి. ఈ టోర్నీలో అదే రాష్ట్రానికి చెందిన అనిక్ (రజతం), పెరీరా (కాంస్యం), హిమాన్షు (కాంస్యం) పతకాలు నెగ్గారు. అయితే పతకాలు అందుకొని నెల కూడా గడవకముందే వాటిపై మెరుపు మాయమైంది. రజత పతకం క్రమేణా మసకబారింది. కాంస్య పతకాలపై మొత్తం నల్ల మచ్చలు ఏర్పడ్డాయి. దీంతో ఇంత నాసిరకం పతకాలు అంటగడతారా అంటూ అథ్లెట్లు వాటిని నిర్వాహకులకు తిరిగిచ్చేశారు. అనధికారిక ఫిర్యాదు మేరకు లూసోఫోనియా గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ వాటిని తనిఖీ చేసిందని, పతకాల స్వరూపం చూసి వారు షాక్ తిన్నారని గోవా డెరైక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ వీఎం ప్రభుదేశాయ్ అన్నారు.