క్రీడా సందడి
క్రీడా సందడి
Published Fri, Sep 16 2016 9:54 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
ఉత్సాహంగా ఎస్‌జేఎఫ్‌ఐ ఎంపికలు
అమలాపురం :
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జేఎఫ్‌ఐ) ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. అండర్–14, అండర్–17 బాలురు, బాలికలకు షటిల్ బ్యాడ్మింటన్, ఫెన్సింగ్, బాక్సింగ్ విభాగాల్లో స్థానిక బాలయోగి స్టేడియంలో శుక్రవారం ఈ ఎంపికలు నిర్వహించారు. దీనికి జిల్లా నలుమూలల నుంచీ 310 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపిక పోటీలను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మెట్ల వెంకట సూర్యనారాయణ, కోనసీమ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, ఎస్‌జేఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు) లాంఛనంగా ఆరంభించారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ, అమలాపురం నియోజకవర్గంలో నాలుగుచోట్ల క్రీడా మైదానాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లా పోటీల్లో ఎంపికైనవారు రాష్ట్రస్థాయికి, అక్కడ ఎంపికైనవారు జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని రాంబాబు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఎంపికకు వచ్చే విద్యార్థులకు తొలిసారి భోజన సదుపాయం కల్పించామని చెప్పారు. అనంతరం షటిల్ బ్యాడ్మింటన్, ఫెన్సింగ్, బాక్సింగ్ విభాగాల్లో గెలుపుకోసం క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. ప్రధానోపాధ్యాయులు రంకిరెడ్డి కాశీ విశ్వనాథం, జొన్నలగడ్డ గోపాలకృష్ణ పరిశీలకులుగా వ్యవహరించారు. పీడీ, పీఈటీలు అడబాల శ్రీనివాస్, పాయసం శ్రీనివాస్, కాకిలేటి సూరిబాబు, గొలకోటి నారాయణరావు, గొలకోటి శ్రీనివాస్, కుంపట్ల ఆదిలక్ష్మి, ప్రసాద్, చంద్రశేఖర్, విత్తనాల శ్రీనివాస్, స్టేడియం కోచ్ ఐ.భీమేష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement