selections
-
‘ఖాకీ’ కొలువుల్లో ‘ఏజ్’ మెలిక!
చిత్తూరు అర్బన్: పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల పట్ల కూటమి సర్కారు నిర్దయతో వ్యవహరిస్తోంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన పలువురిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించకుండా తీరని అన్యాయం చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్నాటికి వారు వయసు రీత్యా కూడా అర్హులే. కానీ, కోర్టులో కేసు, ఎన్నికల కారణంగా దేహదారుఢ్య పరీక్షలు ఆగిపోయాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే ఈవెంట్స్ పెట్టి, నియామకాలు చేపట్టకుండా ఆరు నెలలు సాగదీసి, ఇప్పుడు వయసు పెరిగిందంటూ అనేక మందిని ఇళ్లకు పంపేస్తోంది. వారి తప్పేమీ లేకపోయినా నిర్దయగా తిరస్కరిస్తోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఇదేమిటని అభ్యర్థులు అడిగితే తామేమీ చేయలేమని, ఏదైనా ఉంటే రిక్రూట్మెంట్ బోర్డుతో తేల్చుకోండని జిల్లా ఎస్పీలు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 2022లో రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ పోస్టులకు ప్రిలిమ్స్, దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. కానిస్టేబుల్ పోస్టులకు 5,03,487 మంది దరఖాస్తు చేసుకోగా 4,58,219 మంది ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యారు. 2023 జనవరి 22న జరిగిన ప్రిలిమ్స్‌లో 91,507 మంది అర్హత సాధించారు. తమ సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలంటూ హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈవెంట్స్ నిలిచిపోయాయి. తరువాత రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలలు ఈ పోస్టులను పట్టించుకోలేదు. ప్రిలిమ్స్‌లో అర్హత పొందిన అభ్యర్థులంతా మళ్లీ ఆన్లైన్లో ఈవెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రెండు నెలల క్రితం ప్రకటించింది. రెండేళ్లుగా రన్నింగ్, హైజంప్‌పై దృష్టి సారించిన అభ్యర్థులు తుది ఈవెంట్స్‌కు సిద్ధమయ్యారు. అందరికీ కాల్ లెటర్లు వచ్చాయి. వారంతా చిత్తూరులో దేహదారుఢ్య పరీక్షలకు హాజరవుతున్నారు. నోటిఫికేషన్ నాటికి, ఇప్పటికి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. దీంతో వయస్సు పైబడిందంటూ కొందరిని ఈవెంట్స్‌కు అనుమతించడంలేదు. వీరిని గ్రౌండ్లో ఓ పక్కన కూర్చోబెట్టి, ఈవెంట్స్ ముగిసిన తర్వాత వయసు పెరిగినందున మీరు అర్హులు కారంటూ ఓ కాగితం చేతిలో పెడుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగార్హత కోల్పోయారు. రెండేళ్ల కిందట ఇచ్చిన నోటిఫికేషన్ సమయంలో తాము అర్హులమేనని, ఇప్పుడు కాదనడం అన్యాయమని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా కష్టపడి దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమైన తమను అనుమతించకపోవడం ఏమి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.ఇది దారుణం.. నోటిఫికేషన్ ఇచ్చేనాటికి నాకు ఏజ్ సరిపోయింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి రెండేళ్లుగా ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు వయస్సు పైబడి 33 రోజులైపోయింది, ఈవెంట్స్‌లో అనుమతించడం కుదరదని అంటున్నారు. ఇది దారుణం. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం. – వి.రాజేష్, పుత్తూరు, తిరుపతి జిల్లా తప్పు మాదికాదు.. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యాక ఫిజికల్ ఈవెంట్స్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమన్నారు. అప్పుడే ఏజ్ లేదని చెబితే సైలెంట్ అయిపోదుము. కానీ కాల్ లెటర్ కూడా పంపించి, ఇప్పుడు ఫిజికల్స్కు పంపబోమంటున్నారు. అసలు టైమ్‌లో ఈవెంట్స్ పెట్టకపోవడం మా తప్పా? బోర్డు తప్పా? – కె.కన్యాకుమారి, అనంతపురం ఏడాది ముందే పెట్టుంటే.. నాకు ఇప్పుడు 32 ఏళ్లు. ఫిజికల్ ఈవెంట్స్‌కు అనుమతించలేదు. అడిగితే ఏజ్ పైబడి ఏడాది అయ్యిందన్నారు. ఏడాది ముందే ఈవెంట్స్ పెట్టొచ్చు కదా? కాల్ లెటర్లు పంపిన ప్రతి ఒక్కరినీ ఈవెంట్స్‌కు అనుమతించాలి. – కె.దిలీప్‌కుమార్, శ్రీకాకుళం జిల్లా -
ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగ విప్లవం
-
నా తొలి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అదే: సచిన్
ముంబై : ఏ కంటి వెనుక ఏ కన్నీరు దాగుందో ఎవరికి తెలుసు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అనగానే అత్యధిక పరుగులు, ఎక్కువ సెంచరీలు, సుదీర్ఘ క్రికెట్, క్రికెట్ గాడ్, విజయాలకు కేరాఫ్ ఆడ్రస్ ఇవి మాత్రమే అందరికీ తెలుసు. అయితే సచిన్ జీవితం పూల బాట కాదని ముళ్లదారని కొందరికి మాత్రమే తెలుసు. క్రికెట్లో, లైఫ్‌లో విజయం తప్ప అపజయం లేదని అందరూ భావిస్తారు. కానీ తన జీవితానికి సంబంధించి తొలి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్‌ను సచిన్ తెలిపాడు. పశ్చిమ మహారాష్ట్రలోని ఓ పాఠశాలకు సచిన్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో మూడు కొత్త తరగతి గదులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు స్టేజ్, గ్రౌండ్ నిర్మాణం కోసం తన ఎంపీ నిధులను మంజూరు చేశాడు. కాగా ఆ పాఠశాలలోని కొత్త తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సచిన్ విద్యార్దులతో సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓటములు ఎదురైనప్పుడు నిరుత్సాహపడుకుండా ధైర్యంగా ముందుకెళ్లాలన్నాడు. తన తొలి సెలక్షన్ ట్రయల్స్‌లోనే తీవ్ర నిరాశ ఎదురైందని పేర్కొంటూ తన చిన్నతనంలో జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. ఫైల్ ఫోటో ‘నాకు ఊహతెలిసినప్పట్నుంచి భారత్ తరుపున క్రికెట్ ఆడాలనేది నా కల. అందుకోసం నిరంతరం శ్రమించాను. నాపై నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే అప్పటికీ బ్యాటింగ్ బాగా చేస్తున్నావని కోచ్‌లతో సహా సీనియర్లు మెచ్చుకున్నారు. దీంతో సులువుగా అండర్-11కు సెలక్ట్ అవుతానని భావించాను. కానీ నా ఆట ఇంకా పరిణితి చెందలేదని, ఇంకా తీవ్రంగా కష్టపడాలని సెలక్టర్లు నన్ను పక్కకు పెట్టారు. దీంతో తొలి సెలక్షన్ ట్రయల్స్‌లోనే నిరాశ ఎదురవడంతో.. టీమిండియాకు ఆడతానా లేదా అనే భయం మనసులో కలిగింది. తీవ్ర నిరాశకు గురయ్యాను. అయితే బాధపడుతూ కూర్చోకుండా నా బ్యాటింగ్ లోపాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇంకాస్త ఎక్కువగా కష్టపడ్డాను. టీమిండియాకు ఆడాను విజయం సాధించాను. ఈ విజయాల పరంపరలో నా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్యా పిల్లల సహకారం మర్చిపోలేనిది. నా సోదరి బహుమతిగా ఇచ్చిన బ్యాట్ ఇప్పటికీ నాకు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తాను. గురువు ఆచ్రేకర్ లేనిదే నేను ఈ స్థాయికి వచ్చే వాడిని కాదు. ఫైనల్‌గా విద్యార్థులందరికీ చెప్పదల్చుకునేది ఒకటే. విజయం సాధించాలంటే నిరంతరం కష్టపడాల్సిందే.. విజయానికి షార్ట్ కట్స్ ఉండవు’అంటూ సచిన్ పేర్కొన్నాడు. -
ఈ నెల 8న భారత జట్ల ఎంపిక
న్యూఢిల్లీ: వచ్చే నెల అఫ్గానిస్తాన్‌తో జరుగనున్న ఏకైక టెస్టు కోసం ఈ నెల 8న భారత జట్టును ప్రకటించనున్నారు. జూన్ 14 నుంచి బెంగళూ రు వేదికగా ప్రారంభం కానున్న చారిత్రాత్మక టెస్టుతో పాటు ఐర్లాండ్‌తో రెండు వన్డేల సిరీస్‌కు అదే రోజు జట్టును ప్రకటించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కోహ్లి కౌంటీ క్రికెట్ ఆడటం ఖాయం కావడంతో అఫ్గానిస్తాన్‌తో టెస్టుకు అతను దూరం కానున్నాడు. ‘మే 8న జరుగనున్న సెలెక్షన్స్‌లో మూడు జట్ల ఎంపిక జరుగుతుంది. అఫ్గాన్ టెస్టు కోసం బరిలో దిగే టెస్టు జట్టు, ఇంగ్లండ్ టూర్‌కు ముందు ఐర్లాండ్‌లో జరుగనున్న రెండు వన్డేల సిరీస్ కోసం వన్డే జట్టుతో పాటు ఇంగ్లండ్‌లో పర్యటించనున్న భారత ‘ఎ’ జట్టును కూడా ప్రకటిస్తాం’ అని బీసీసీఐ పేర్కొంది. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ టూర్ కు ముందు మన ఆటగాళ్లకు అక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చేందుకు ‘ఎ’ జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. రహానే, మురళీ విజయ్, రోహిత్, హార్దిక్ పాండ్యాలను ‘ఎ’ జట్టుతో పాటు అక్కడికి పంపితే స్థానిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోంది. -
ఎవరెస్ట్ అధిరోహణకు ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: మిషన్ మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణకు ఔత్సాహికులైన అభ్యర్థులకు శుక్రవారం ఎంపికలు నిర్వహించారు. సెట్ శ్రీ ఆధ్వర్యంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సహకారంతో కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఎంపికలకు 47 మంది హాజరయ్యారు. ఇందులో ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరికి పలు పరీక్షల అనంతరం.. 100 మీటర్ల పరుగు, 2.4 కిలోమీటర్ల పరుగు, లాంగ్‌జంప్ ఈవెంట్స్ నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థుల వివరాలు నమోదు చేసుకున్నారు. డీఎస్డీఓ బి.శ్రీనివాస్‌కుమార్ ఎంపికలను నిర్వహించారు. సెట్ శ్రీ సీఈవో బి.వి.ప్రసాదరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన 10 మందిని ఎంపిక చేస్తామన్నారు. త్వరలో విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ అధికారి నారాయణరావు, డీఎం అండ్ హెచ్‌వో మెడికల్ స్టాఫ్, పాల్గొన్నారు. -
18 న మహిళల క్రికెట్ జట్ల ఎంపిక
కర్నూలు(టౌన్): ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ ఆదివారం 10 గంటలకు అవుట్డోర్ స్టేడియంలో అండర్–16, అండర్–19, సీనియర్ క్రికెట్ జట్ల ఎంపిక ఉంటుందని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కె. దేవేంద్రగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన మహిళ క్రికెట్ జట్లు వచ్చేనెల 17వ తేదీ కడప జిల్లాలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంటులో పాల్గొంటారని తెలిపారు. -
రేపు కాకినాడలో జిల్లా స్థాయి విలువిద్య ఎంపికలు
మామిడికుదురు : కాకినాడ డీఎస్ఏ స్టేడియంలో గురువారం జిల్లా స్థాయి విలువిద్య ఎంపిక జరగుతాయని జిల్లా ఆర్చరీ అసోసియేష¯ŒS అధ్యక్షుడు జేఎ¯ŒSఎస్ గోపాలకృష్ణ మంగళవారం తెలిపారు. ఉదయం పది గంటలకు జరిగే సెలక్షన్లకు నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో అభ్యర్థులు హాజరుకావాలన్నారు. గ్రామ కార్యదర్శి, మున్సిపల్ అధికారులు జారీ చేసిన జనన ధ్రువపత్రం తీసుకురావాలన్నారు. 1996 జనవరి ఒకటో తేదీ తరువాత పుట్టిన వారు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని చెప్పారు. ఇండియ¯ŒS రౌండ్స్, రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. జిల్లా స్థాయి సెలక్ష¯Œ్సలో ఎంపికైన వారు ఫిబ్రవరి 9,10 తేదీల్లో కడప జిల్లా పొద్దుటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం సెల్ నెంబర్లు 9491575616, 9396265791కు సంప్రదించాలన్నారు. -
విజయనగరంలో మిస్టర్ ఆంధ్రా పోటీలు
-
ఉత్సాహంగా పోలీస్ సెలెక్షన్స్
కాకినాడ క్రైం : జిల్లా పోలీస్ పెరేడ్ మైదానం మహిళలతో కిటకిటలాడింది. పలు రకాల రంగుల ట్రాక్ సూట్లతో బృందాలుగా ఏర్పడి హుషారుగా పోలీస్ మైదానంలోకి తరలివచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేపట్టేందుకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొని తమ సత్తా చాటారు. 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగును నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేశారు. ఇక లాంగ్ జంప్ విషయానికి వస్తే కళ్లు మిరిమిట్లు గొలిపేలా పరుగెత్తుకొచ్చి రివ్వున గాల్లోకి ఎగురుతూ సునాయాసంగా లక్ష్యాన్ని సాధించారు. కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో నాలుగు రోజులుగా జరుగుతున్న పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా శుక్రవారం మహిళా అభ్యర్థులకు ఏఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో జరిగాయి. మూడో రోజు నిర్వహించిన పరీక్షల్లో 754 మంది అర్హత సాధించినట్టు తెలిపారు. నాలుగోరోజు నిర్వహించిన పరీక్షల్లో 1,101 మహిళలు హాజరు కావాల్సి ఉండగా, 723 మంది పాల్గొన్నారన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఒరిజినల్ సర్టిఫికెట్ల స్కానింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఏఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఈవెంట్ల నిర్వహణ సజావుగా జరిగి మహిళలు ఊపిరిపీల్చుకున్నారు. ఈవెంట్లలో పాల్గొనేందుకు వచ్చిన మహిళలు తమ బంధువులను వెంటబెట్టుకుని పోలీస్ పెరేడ్ మైదానానికి వచ్చారు. మహిళల్లో ఉత్తేజాన్ని నింపిన పోలీస్‌లు నీ చూపు లక్ష్యంపై పెట్టు, ఒకటో లైన్లో అమ్మాయి స్పీడు పెంచు, రెండో లైన్లో అమ్మాయి ఇంకా జోరు పెంచాలి. అయిదో లైన్లో అమ్మాయి బాగా వెనకబడిపోయావు రెండు చేతులు ఊపుతూ లక్ష్యాన్ని అధిగమించంటూ మహిళా అభ్యర్థులను పోలీస్‌లు ప్రోత్సహించారు. పరుగు పందెంలో పోలీస్లిచ్చిన ప్రోత్సాహంతో ఎక్కడలేని ఓపిక తెచ్చుకున్న మహిళలు లక్ష్యాన్ని అధిగమించడం కనిపించింది. పరుగులో అలసటకు లోనైన పలువురిని మహిళా పోలీసులు చేరదీసి సేవలందించారు. దేహదారుఢ్య పరీక్షల్లో 723 మంది పాల్గొన్నారు.ఫైనల్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల మనోగతం ఇలా ఉంది. ఒరిజినల్ సర్టిఫికెట్ల లేక నిరాశగా అభ్యర్థులు వెనక్కి దేహదారుఢ్య పరీక్షల్లో తప్పనిసరిగా అభ్యర్థుల అర్హతలను తెలియజేసే ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకురావాలని ముందుగా జిల్లా ఎస్పీ తెలిపినా కొంతమంది మహిళా అభ్యర్థులు వాటిని తీసుకురాకపోవడంతో సమస్య తలెత్తింది. పత్రాల పరిశీలన సందర్భంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకపోవడంతో ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో అభ్యర్థులు నిరాశకు లోనయ్యారు. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ఉన్నత చదువులు కొనసాగించేందుకు వీలుగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను కళాశాలల్లో ఇచ్చామని, దాంతో సమయానికి వెంట తీసుకురాకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓఎస్డీ వై.రవిశంకరరెడ్డితో పాటూ పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, రిజర్వు పోలీస్ అధికారులు, మహిళా పోలీస్‌లు బందోబస్తు నిర్వహించారు. నాన్న ప్రోత్సాహంతో.... నాన్న ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ కష్టపడి చదివిస్తున్నాడు. నేను ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన తర్వాత డీఎడ్ పూర్తి చేశా. కొద్ది మార్కుల తేడాతో ఉపాధ్యాయ ఉద్యోగం తప్పిపోయింది. రెండో ప్రయత్నంగా నాన్న,అన్నయ్యల ప్రోత్సాహంతో మహిళా పోలీస్ పోస్టుకి దరఖాస్తు చేశా. నలభై అయిదు రోజులుగా జగన్నాథపురం జీపీటీ పాలిటెక్నిక్ కళాశాలలో సాయంత్రం గంటన్నరసేపు పరుగు, ఈవెంట్లపై ప్రాక్టీసు చేస్తున్నా. రెండో దశలో జరిగిన దేహదారుఢ్య పరీక్షల్లో పాసయి, ఫైనల్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించా. – వారుపిల్లి పద్మ, తూరంగి డ్రైవర్స్‌కాలనీ అభిరుచిని తెలుసుకుని... నా భర్త శివకుమార్ కర్నూలు సెంట్రల్ జైల్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. రెండేళ్ల కిందట మాకు వివాహం జరిగింది. నాకు పోలీస్ ఉద్యోగం అంటే ఇష్టం. నాభర్త నా అభిరుచిని తెలుసుకుని ప్రత్యేక శిక్షణకు పంపారు. కష్టపడి చదవడం, ఈవెంట్లలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షల్లో రాణించగలిగా. ఫైనల్ పరీక్షలో తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. – సీహెచ్.స్వాతి, రాజమండ్రి -
ఎన్ఆర్ఐలో అంతర్ కళాశాలల హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక
పోతవరప్పాడు (ఆగిరిపల్లి) : కాకినాడ జేఎన్టీయూ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లోని కళాశాలలకు చెందిన బాలబాలికలకు హ్యాండ్‌బాల్ ఆటల పోటీలకు సంబంధించి ఎంపిక పోతవరప్పాడులోని ఎన్ఆర్ఐ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించారు. కాకినాడ జేఎన్టీయూ స్పోర్ట్స్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపికల్లో 225 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఆర్.వెంకట్రావు మాట్లాడుతూ నేటి యువతకు విద్యతో పాటు క్రీడలు అవసరమన్నారు. పోటీ ప్రపంచంలో క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని ప్రిన్సిపాల్ సి.నాగభాస్కర్ సూచించారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని జేఎన్టీయూకే క్రీడా కార్యదర్శి శ్యామ్‌కుమార్, సెలక్షన్ కమిటీ బృందం సభ్యుడు డి.హేమంద్రరావు, ఎ.సుధాకరరావు పరీక్షించి 16 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేశారు. ఈ ఎంపికల్లో ఎన్ఆర్ఐ కళాశాలకు చెందిన నలుగురు బాలురు, ఐదుగురు బాలికలు తుది జట్టులోకి ఎంపికైనట్లు కళాశాల పీడీ పి.గౌతు పేర్కొన్నారు. -
మూడో రోజు 791 మంది ఎంపిక
– కొనసాగుతున్న కానిస్టేబుల్ సామర్థ్య పరీక్షలు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల సామర్థ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. మూడో రోజు 791 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఉదయం 5 నుంచి రాత్రి 9.45 గంటల వరకు కొనసాగిన సామర్థ్య పరీక్షలను జిల్లా ఎస్పీ ఆకు రవికృష్ణ స్వయంగా పర్యవేక్షించారు. సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా వ్యవహరించాలని ఆదేశించారు. మొత్తం 1,305 మంది హాజరు కాగా.. సర్టిఫికెట్లు లేకపోవడంతో 150 మందిని వెనక్కు పంపారు. -
రేపు జిల్లా మహిళా హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక
కర్నూలు (టౌన్): ఈ నెల 5 వ తేదీన స్థానిక బి. క్యాంపు క్రీడా మైదానంలో జిల్లా స్థాయి సీనియర్ మహిళా హ్యాండ్‌బాల్ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి సి. రామాంజనేయులు శనివారం ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 13, 14 తేదీలలో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి మహిళా హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు రూ.10 దరఖాస్తు రుసుం చెల్లించాలన్నారు. వివరాలకు సెల్: 9393 827 585 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. -
కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం
ఏలూరు అర్బన్ : ఏలూరు రేంజిలోని మూడు జిల్లాలకు సంబంధించి కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల ఎంపికలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించామని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపారు. సోమవారం కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ ఏలూరులో ప్రారంభమైంది. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసు అధికారులు అభ్యర్థులకు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఫిజికల్ మెజర్మెంట్, ఎబిలిటీ టెస్ట్‌లను నిర్వహించారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు ఎంపిక పరీక్షల్లో తొలిసారిగా పూర్తి పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎంపిక విధానానికి సంబంధించి బయోమెట్రిక్, రేడియో ఫ్రీక్వెన్సీ వంటి ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నందున ఎంపిక ప్రక్రియ యావత్తూ పూర్తి నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు. అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ పరీక్షలకు ఏలూరు రేంజిలో 14,700 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు. డిసెంబర్ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇచ్చిన గడువు తేదీన ఏ కారణంగానైనా పరీక్షలకు హాజరుకాలేకపోతే వారికి తిరిగి నవంబర్ 28న ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. -
10 నుంచి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు
ఏలూరు రూరల్ : గుంటూరులో ఈనెల 10, 11 తేదీల్లో 36వ అంతర్ జిల్లాల మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారని జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేష¯ŒS కార్యదర్శి బీడీ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా మాస్టర్స్ జట్టు ఎంపిక పోటీలు ఈనెల 6న నిర్వహించనున్నామని పేర్కొన్నారు. 35 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఏలూరు ప్రశాంతి వాకర్స్ అసోసియేష¯ŒS భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన తర్వాత పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు సెల్ 98852 74122లో సంప్రదించాలని సూచించారు. ప ల -
తైక్వాండో పోటీలకు 40 మంది ఎంపిక
కాకినాడ సిటీ : తైక్వాండో అసోసియేష¯ŒS రాష్ట్రస్థాయి పోటీలకు వివిధ వెయిట్లలో జిల్లా నుంచి 40 మంది ఎంపికయ్యారు. స్థానిక జిల్లా క్రీడామైదానంలో వివిధ కేటగిరీల్లో జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు ఆదివారం జరిగాయి. జిల్లా అసోసియేష¯ŒS ఆధ్వర్యాన నిర్వహించిన ఈ పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మురళీధరరావు, సీబీసీఎ¯ŒSసీ అధ్యక్షుడు ఎం.రత్నకుమార్ ప్రారంభించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ పోటీల్లో 20 వెయిట్లలో బాల బాలికల విభాగాల్లో 160 మంది క్రీడాకారులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు. స్వర్ణ పతకాలు సాధించినవారు నవంబర్ 11, 12, 13 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని జిల్లా తైక్వాండో అసోసియేష¯ŒS కార్యదర్శి బి.అర్జు¯ŒSరావు తెలిపారు. -
వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక
తెనాలి: కడపలో నవంబరు 3–6 తేదీల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల జూనియర్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్లను ఆదివారం తెనాలిలో ఎంపిక చేశారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ క్రీడామైదానంలో ఈ ఎంపికలు చేశారు. ఎంపిక కమిటీ సభ్యులుగా ఎస్.నిరంజనరావు, జీకేఎస్ విజయ్‌చంద్, కె.రజనీనాయక్, షేక్ కరిముల్లా, రవి వ్యవహరించారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.గోపీచంద్ పర్యవేక్షించారు. బాలుర జట్టు: కె.రాజేష్ (తెనాలి), ఎస్.శేషగిరి, పి.కిరణ్‌కుమార్ (నిజాంపట్నం), టి.మణికంఠ (ఈమని), పృథ్వీరామ్ (వడ్లమూడి), సీహెచ్ రవితేజ (పల్లపట్ల), పి.తిరుపతిరెడ్డి, డి.మల్లేష్‌రెడ్డి, ఎస్.పవన్‌కళ్యాణ్, జి.సాయిరామ్ (వెదుళ్లపల్లి), డి.ఏడుకొండలు, ఎం.మనోజ్‌కుమార్ (మంగళగిరి), పి.వినయ్‌కుమార్ (హాఫ్‌పేట), ఎ.సాయికిరణ్ (చిలకలూరిపేట), జి.నవీన్ (జముడుపాడు). కోచ్: కె.రజనీనాయక్ (వెదుళ్లపల్లి). బాలికల జట్టు: ఏవీఎస్ పార్వతి, కె.జీవననాగజ్యోతి, బి.మదర్‌థెరిసా (అల్లూరు), బి.బిందుమాధవి (సూరేపల్లి), ఎ.కావ్య, ఆర్.అఖిల (అమృతలూరు), సీహెచ్ హేమప్రియాంక, టి.లక్ష్మి (తాడేపల్లి), వి.విజయలక్ష్మి (అడవులదీవి), ఎం.సింధు (పిరాట్లంక), ఎన్.నవ్య (రేపల్లె), కె.ఉమామహేశ్వరి, ఎం.ప్రసన్న (ఖాజీపాలెం), టి.శృతి (పిట్టలవానిపాలెం). కోచ్: షేక్ కరీముల్లా (అమృతలూరు) -
అండర్ 17 బాస్కెట్ బాల్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు
రామచంద్రపురం: అండర్ 17 జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడాప్రాంగణంలో నిర్వహించారు. బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి. స్టాలిన్ ఈపోటీలను ప్రారంభించారు. రాష్ట్ర అసోసియేషన్ కోశాధికారి గన్నమని చక్రవర్తి మాట్లాడుతూ ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు ముమ్మిడివరంలో జరిగే అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా బాలుర, బాలికల జట్ల ప్రాపబుల్స్ను ఎంపిక చేసినట్టు తెలిపారు. బాలుర, బాలికల జట్లకు 20 మంది చొప్పున ఎంపిక చేశామన్నారు. వీరికి ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తామన్నారు. శిక్షణానంతరం ఫైనల్ జట్టును ప్రకటిస్తామన్నారు. అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐ. భీమేష్, సంయుక్త కార్యదర్శి ఎం. ఉపేంద్ర, కోశాధికారి ఎన్వీవీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జీడీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నిష్పక్షపాతంగా క్రీడాకారులను ఎంపిక చేయాలి
అకాడమీలు అందుబాటులో ఉండాలి రాష్ట్రస్పోర్ట్సు అథారిటీ చైర్మన్ మోహన్ సామర్లకోట : క్రీడాకారులకు అకాడమీలు అందుబాటులో ఉన్నప్పుడే ఉత్తమంగా తయారవుతారని రాష్ట్ర స్పోర్ట్సు అథారిటీ చైర్మన్ పీఆర్ మోహన్ పేర్కొన్నారు. సామర్లకోటలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల సందర్భంగా శనివారం కబడ్డీ కోర్టులను ఆయన పరిశీలించారు. కోర్టు ఆవరణలో ఆయన మాట్లాడుతూ పల్లం బీడు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉందని చెప్పారు. ఆ స్థలం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి స్టేడియం నిర్మాణం చేసుకోవడానికి స్థలం ఇస్తే దాత ఫొటోతో స్టేడియం పేరు ఏర్పాటు చేస్తామని చెప్పారు. క్రీడాకారుల ఎంపిక అవినీతి, పక్షపాతం, సిఫారసులు లేకుండా జరిగితే నిజమైన క్రీడాకారులకు అవకాశం ఉంటుందని చెప్పారు. జాతీయ స్థాయిలో గోల్డు మెడల్ సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. ఏడు లక్షలు నగదు బహుమతి ఇవ్వడానికి నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్రం విడిపోవడంతో స్టేడియాలు లేని పరిస్థితి ఏర్పడిందని, దాంతో రూ. 70 కోట్లతో స్టేడియం నిర్మించాలని నిర్ణయించిన్నట్లు చెప్పారు. పదేళ్లక్రితం టోర్నమెంట్‌కు నిధులిచ్చేవారు రాష్ట్రంలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా పదేళ్ల క్రితం ప్రతి క్రీడాకారుడికి రూ.50 వంతున నిధులు కేటాయించేవారని ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వి.వీరలంకయ్య అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రం నుంచి ఐదుగురు కబడ్డీ క్రీడాకారులు వియత్నాంలో జరిగిన పోటీల్లో బంగారు, వెండి పతకాలను సాధించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సొంత ఖర్చులు, దాత సహకారంతోనే టోర్నమెంటులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సమావేశంలో జాతీయ కబడ్డీ కోచ్ పోతుల సాయి, రాష్ట్ర కోశాధికారి ఎం.రంగారావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, పోటీల నిర్వాహక కార్యదర్శి బోగిళ్ల మురళీ కుమార్, కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
కొలువే లక్ష్యంగా..
రెండోరోజు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి 2771 హాజరు.. మెడికల్ టెస్ట్‌కు 567 మంది ఎంపిక బోట్‌క్లబ్(కాకినాడ) : స్థానిక జిల్లా క్రీడా మైదానంలో గురువారం కూడా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కొనసాగింది. ఆరు జిల్లాల నుంచి 2771 మంది పాల్గొనగా.. కేవలం 567 మంది మాత్రమే మెడికల్ టెస్ట్‌కు ఎంపికయ్యారు. పరుగుపందెంలోని చాలా మంది అభ్యర్థులు డీలాపడ్డారు. పరుగు పందెంలో సత్తా చాటిన అభ్యర్థులకు జిగ్‌జాగ్, లాంగ్‌జంప్, పులప్స్, షాట్‌పుట్ పరీక్షలు నిర్వహించారు. వీటిలో విజయం సాధించిన అభ్యర్థులకు ఎత్తు, బరువు పరీక్షలు నిర్వహించారు. శిక్షణ లేకుండా రావడంతో అవస్థలు కొందరు అభ్యర్థులు ఎటువంటి శిక్షణ తీసుకోకుండా నేరుగా ర్యాలీ పాల్గొని అవస్థలు పడ్డారు. క్రీడా మైదానంలో 1600 మీటర్లు పరుగుపందెంలో పరుగెత్త లేక మధ్యలో కుప్పకూలారు. 1600 మీటర్ల పరుగును ఆరునిమిషాల్లో పూర్తి చేసిన వారికి బోనస్ పాయింట్స్ ఇస్తున్నారు. దీంతో కొందరు అభ్యర్థులు వేగంగా పరుగుపెట్టి ఇబ్బందులు పడ్డారు. గమ్యం చేరకుండానే డీలాపడ్డారు. ఆరునిమిషాల్లోపు గమ్యం చేరిన వారికి ఆర్మీ అధికారులు సిరాతో చెస్ట్‌పై మార్కు వేస్తున్నారు. వర్షంతో అవస్థలు వివిధ జిల్లాల నుంచి శుక్రవారం జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన అభ్యర్థులు గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో అవస్థలు పడ్డారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులకు స్థానిక శ్రీరామ్‌నగర్ మున్సిపల్ స్కూల్ సదుపాయాలు కల్పించినా, క్రీడా మైదానం సమీపంలోనే అభ్యర్థులు సేదతీరుతున్నారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు తెల్లవారుజామున హాజరుకావాల్సి రావడంతో స్కూల్‌కు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఎన్ఎఫ్సీఎల్æరోడ్డులోని పలు జిల్లా కార్యాలయాలు, క్రీడామైదానం బయట ఉన్న దుకాణ సముదాయం వద్ద, పుట్‌పాత్‌లపైన నిద్రిస్తున్నారు. -
అసౌకర్యాల మధ్య నేటి నుంచి సైనిక నియామకాలు
వివిధ జిల్లాలు నుంచి వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు నివాస ఏర్పాట్లు లేక పుట్‌పాత్‌లపైనే జాగారం ఇంకా చదును చేయని ఎంపిక ప్రాంగణం బోట్‌క్లబ్ (కాకినాడ) : భారత సైన్యంలో వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ముహూర్తం దగ్గరపడినా ఏర్పాట్లు మాత్రం అరకొరగానే ఉన్నాయి. బుధవారం నుంచి కాకినాడలోని జిల్లా క్రీడా మైదానం ఇందుకు ఎంపిక చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 15 వరకూ ఆరు జిల్లాల నుంచి 40,495 మంది ఉభయగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. పాల్గొనే అభ్యర్థులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్మీ అధికారులు, జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పరిశీలిస్తున్నా లోటుపాట్లు వెంటాడుతునే ఉన్నాయి. క్రీడా మైదానం రోడ్డు కూడా చదును చేయలేదు...అభ్యర్థులకు ఫుట్‌పాత్‌లే వసతి గృహాలయ్యాయి. ఎంపిక సమయానికి అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. -
బ్యాడ్మింటన్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
కొత్తపేట : సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల క్రీడాకారుల ఎంపికలో తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల క్రీడాకారుల హవా నడిచింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఈ నెల 21 నుంచి 24 వరకూ రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2016 పోటీలు జరిగాయి. ఫైనల్స్ అనంతరం సౌత్ జోన్ క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ రెండు జిల్లాల క్రీడాకారులు సీనియర్, జూనియర్స్ విభాగాల్లో ఐదుగురు చొప్పున ఎంపికయ్యారు. వీరిలో నలుగురు చొప్పున రెగ్యులర్ క్రీడాకారులు కాగా, ఒక్కొక్కొరు రిజర్వ్ క్రీడాకారులు ఉండడం గమనార్హం. కేరళలోని ఒట్టుపాలెంలో ఈనెల 29 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే సౌత్‌జోన్ పోటీలకు 24 మందిని ఎంపిక చేశారు. పురుషుల విభాగంలో ఎం.కనిష్క(గుంటూరు), సాత్విక్ సాయిరాజ్ (తూర్పుగోదావరి), కృష్ణ ప్రసాద్ (తూర్పు గోదావరి), కె.పి.చైతన్య (శ్రీకాకుళం), కిరణ్మౌళి (తూర్పుగోదావరి) ఎంపిక కాగా, రిజర్వ్ సభ్యులుగా బి.కిరణ్‌కుమార్ (విశాఖపట్నం), వి.గంగాధర్ (కృష్ణా)లను ఎంపిక చేశారు. ‘మహిళల విభాగంలో తనిష్క (గుంటూరు), బి.నిషితావర్మ (విశాఖపట్నం), డి.సుధా కళ్యాణి (తూర్పుగోదావరి), వి.హరికా (పశ్చిమ గోదావరి), పి.సోనికా (కృష్ణా)లు ఎంపికయ్యారు. జూనియర్స్ బాలుర విభాగంలో డి.జశ్వంత్ (చిత్తూరు), ఎం.కనిష్క (గుంటూరు), ఎ.వేదవ్యాససాయి (ప్రకాశం), బషీర్, గౌస్ (నెల్లూరు)లు రిజర్వ్ ఆటగాళ్లుగా ఎస్వీ రాయుడు (తూర్పు గోదావరి), పి.చంద్రగోపీనాథ్(గుంటూరు), బాలికల విభాగంలో ఎం.తనిష్క(గుంటూరు), కె.ప్రీతి(విజయనగరం), ఎ.అక్షిత (తూర్పుగోదావరి), రిజర్వ్ స్థానాలకు డి.ఆసియా(కర్నూలు), డి.షబ్నాబేగమ్(కర్నూలు)లు ఎంపికయ్యారని ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి ప్రకటించారు. జట్టుకు శాప్‌కు చెందిన జి.సుధాకర్‌రెడ్డి, ఏపీబీఏకు చెందిన జె.బి.ఎస్. విద్యాధర్‌లు కోచ్‌లుగా, ఎం.సుధాకర్‌రెడ్డి మేనేజర్‌గా సేవలందించనున్నారు. -
20 నుంచి మహిళల క్రికెట్ సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మహిళల క్రికెట్ జట్టు కోసం ఈనెల 20 నుంచి సెలక్షన్స్ ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లి ప్లేగ్రౌండ్సలో మూడు రోజుల పాటు ఈ ఎంపిక పోటీలు జరుగుతాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు సౌత్‌జోన్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఓయూ జట్టుకు ఎంపికవుతారు. -
క్రీడా సందడి
ఉత్సాహంగా ఎస్జేఎఫ్ఐ ఎంపికలు అమలాపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జేఎఫ్ఐ) ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. అండర్–14, అండర్–17 బాలురు, బాలికలకు షటిల్ బ్యాడ్మింటన్, ఫెన్సింగ్, బాక్సింగ్ విభాగాల్లో స్థానిక బాలయోగి స్టేడియంలో శుక్రవారం ఈ ఎంపికలు నిర్వహించారు. దీనికి జిల్లా నలుమూలల నుంచీ 310 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపిక పోటీలను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మెట్ల వెంకట సూర్యనారాయణ, కోనసీమ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, ఎస్జేఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు) లాంఛనంగా ఆరంభించారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ, అమలాపురం నియోజకవర్గంలో నాలుగుచోట్ల క్రీడా మైదానాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లా పోటీల్లో ఎంపికైనవారు రాష్ట్రస్థాయికి, అక్కడ ఎంపికైనవారు జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని రాంబాబు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఎంపికకు వచ్చే విద్యార్థులకు తొలిసారి భోజన సదుపాయం కల్పించామని చెప్పారు. అనంతరం షటిల్ బ్యాడ్మింటన్, ఫెన్సింగ్, బాక్సింగ్ విభాగాల్లో గెలుపుకోసం క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. ప్రధానోపాధ్యాయులు రంకిరెడ్డి కాశీ విశ్వనాథం, జొన్నలగడ్డ గోపాలకృష్ణ పరిశీలకులుగా వ్యవహరించారు. పీడీ, పీఈటీలు అడబాల శ్రీనివాస్, పాయసం శ్రీనివాస్, కాకిలేటి సూరిబాబు, గొలకోటి నారాయణరావు, గొలకోటి శ్రీనివాస్, కుంపట్ల ఆదిలక్ష్మి, ప్రసాద్, చంద్రశేఖర్, విత్తనాల శ్రీనివాస్, స్టేడియం కోచ్ ఐ.భీమేష్ పాల్గొన్నారు. -
19న సీనియర్ తైక్వాండో సెలక్షన్స్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లా స్థాయి సీనియర్ కొరిగి తైక్వాండో సెలక్షన్స్ పోటీలు ఈ నెల 19 న నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో అధ్యక్ష, కార్యదర్శులు గురుస్వామి, గోపాల్‌రెడ్డి లు ఓ ప్రకటన లో తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ స్థానిక ఇండోర్ స్టేడియం లో నిర్వహిస్తున్నామన్నారు. 31 డిసెంబర్ 1998 కి ముందు జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు జనన ధృవీకరణ పత్రం(ఈ–సేవ), ఆధార్‌కార్డ్, బ్లాక్‌బెల్ట్ సర్టిఫికెట్ తో హాజరుకావాలన్నారు. ఎంపికైన క్రీడాకారులను అక్టోబర్‌లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగే అంతర్ జిల్లాల పోటీలకు పంపుతామన్నారు. -
రేపు సీనియర్స్ కబడ్డీ జట్ల ఎంపిక
కాకినాడ సిటీ: సామర్లకోటలోని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో ఈ నెల 11న జిల్లా సీనియర్స్ స్త్రీ, పురుషుల కబడ్డీ జట్లను ఎంపిక చేయనున్నట్టు జిల్లా కబడ్డీ సంఘ కార్యదర్శి ఎం.శ్రీనివాసకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారుల్లో పురుషుల బరువు 80 కేజీల లోపు, స్త్రీల బరువు 70 కేజీల లోపు ఉండాలన్నారు. ఎంపికైన క్రీడాకారులు 64వ రాష్ట్ర సీనియర్స్ స్త్రీ, పురుషుల కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలలో జిల్లా తరఫున పాల్గొంటారన్నారు. ఆసక్తిగల క్రీడాకారులుటి.వైకుంఠం (పీఈటీ, సామర్లకోట)ను 99590 27375 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
రేపటి నుంచి జట్ల ఎంపిక
ఉయ్యూరు : కృష్ణాజిల్లా స్కూల్ గేమ్స్ జట్ల ఎంపిక ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నామని గేమ్స్ నిర్వహణా కమిటీ ప్రతినిధి బాలు తెలిపారు. స్థానిక విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 8న షటిల్, బ్యాడ్మింటన్, 9న అథ్లెటిక్స్ జట్ల ఎంపిక చేస్తామన్నారు. ఏజీఅండ్‌ఎస్‌జీ సిద్ధార్థ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించే ఈ ఎంపికకు ధృవపత్రాలతో విద్యార్థులు హాజరుకావాలని కోరారు. -
జిల్లా సీనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్ : సామర్లకోట(తూర్పుగోదావరి)లో అక్టోబరు 6 నుంచి 9వ తేదీ వరకూ జరిగే ఏపీ స్టేట్ సీనియర్ కబడ్డీ మీట్లో పాల్గొనే జిల్లా జట్లను ఆదివారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఎంపిక చేశారు. ఎంపికైన జట్లకు ఈనెల 10 నుంచి కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ తెలిపారు. పురుషుల జట్టు : టి.బసవయ్య (కెప్టెన్, ఎక్సైజ్ కానిస్టేబుల్), ఎన్.నాగార్జున (ఇన్‌కం ట్యాక్స్), ఎంసీహెచ్ వెంకటేశ్వరరావు (ఈఎస్ఐ), సీహెచ్ మనోజ్‌కుమార్ (సీఆర్పీఎఫ్), జె.అంకాలు (ఉయ్యూరు, ఏజీఎస్‌జీఎస్), కె.బాలాజీ (తాడిగడప), ఎంవీ నరేంద్ర (ఏజీఎస్‌జీఎస్), ఎం.చినబాబు (సెయింట్ జాన్స్ హైస్కూల్, విజయవాడ), జి.రఘురామ్, జి.నరేష్ (బుడవాడ), పి.సుధాకర్‌రావు (పెనుగంచిప్రోలు), డి.హనుమంతరావు (ఏఎన్‌యూ క్యాంపస్), వి.ప్రభుకరుణ (నాగాయలంక), ఎస్.మోహనకృష్ణ (విజయవాడ), కె.రవిబాబు (ఏపీ పోలీస్, విజయవాడ), బి.సుధీర్ (ఉప్పులూరు) ఎంపికయ్యారు. కోచ్‌గా కె.బాలస్వామి (ఉయ్యూరు జెడ్పీ స్కూల్ పీఈటీ), మేనేజర్‌గా వి.వెంకటేశ్వరరావు (పీఈటీ జెడ్పీస్కూల్, మొవ్వ) వ్యవహరిస్తారు. మహిళా జట్టు : ఎండీ నసీమా సుల్తానా (కెప్టెన్, గన్నవరం), ఎం.నవ్య, ఎన్.తిరుపతమ్మ (నాగాయలంక), ఎం.మరియమౌనిక (ఎస్సీ రైల్వే సికింద్రాబాద్), కేఎల్వీ రమణ (కోడూరు), పి.దేవి, బి.ఎస్తేర్‌రాణి, వి.యశస్విని (ఉయ్యూరు, ఏజీఎస్‌జీఎస్), డి.సునీత (కేవీఆర్ కళాశాల, నందిగామ), వి.రమణ (పీవీపీ సిద్ధార్థ కళాశాల, కానూరు), కె.కోటేశ్వరమ్మ (ఎస్వీఎల్ క్రాంతి కళాశాల, అవనిగడ్డ), డి.వెంకటలక్ష్మి (ఏజీఎస్‌జీఎస్), వి.ప్రీతి (కపిలేశ్వరపురం), బి.దుర్గాభవాని (తాడంకి), జి.శిరీష (ఇబ్రహీంపట్నం), కె.భార్గవి (తాడంకి, జెడ్పీ హైస్కూల్), ఎ.చిన్మయి శ్రీజా (కానూరు), కె.ప్రత్యూష (నందిగామ) ఎంపికయ్యారు. కోచ్‌గా జి.రమేష్ (తాడంకి జెడ్పీ హైస్కూల్ పీఈటీ), ఎ.సీతాకుమారి (ఏపీఎస్ఆర్జేసీ నందిగామ పీడీ) వ్యవహరిస్తారు. -
3న జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ సెలక్షన్స్
వరంగల్: హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సెప్టెంబర్ 3న జిల్లా స్థాయి సీనియర్స్ సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి టి.రాజేందర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు సెప్టెంబర్ 9 నుంచి నల్గొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
ప్రతిభావంతులకే పెద్దపీట
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రతిభావంతులకే జిల్లా జట్లలో స్థానం కల్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డి.దేవానందరెడ్డి కోరారు. జిల్లా పాఠశాలల క్రీడల సమాఖ్య(స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో మూడు రోజులపాటు జరగనున్న ప్రతిష్టాత్మక జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ ఎంపిక పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంపికలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా జట్లకు ఎంపికయ్యే క్రీడాకారులకు రాష్ట్ర పోటీలకు వెళ్లేముందు శిక్షణా శిబిరాలను నిర్వహించేందుకు కలెక్టర్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెప్పారు. త్వరలో కామన్ ఎగ్జామినేషన్ ఫీజు కింద హైస్కూల్ విద్యార్థుల నుంచి వసూలు చేసే (రూ.80, రూ.100) మొత్తంలో 3 రూపాయలను క్రీడలకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం డివిజన్ డిప్యూటీ ఈఓ వి.సుబ్బారావు, ఆర్‌ఎంఎస్‌ఏ డిప్యూటీ ఈఓ ఎ.ప్రభాకరరావు మాట్లాడుతూ పాఠశాలల క్రీడలు విద్యార్థి జీవితంలో చాలా కీలకమని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్ మాట్లాడుతూ స్కూల్‌గేమ్స్ ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచైనా భోజనాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో క్రీడల సమాఖ్య కార్యనిర్వహణ కార్యదర్శి ఎమ్మెస్సీ శేఖర్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, పీఈటీ సంఘ సలహాదారు కె.రాజారావు, జిల్లా పీఈటీ సంఘం అధ్యక్షులు ఎం.వి.రమణ, కార్యదర్శి ఎం.సాంబమూర్తి, పాఠశాల క్రీడల సంఘం సంయుక్తకార్యదర్శి ఎస్.శ్రీనివాసరావు, సంపతిరావు సూరిబాబు, పోలినాయుడు, కామయ్య, తవిటయ్య, ఆర్సీ రెడ్డి జగదీష్, వాసు, రాజశేఖర్, వెంకటరమణ, రవి, సుజాత, మాధురి, ఉష, విజయ, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా.. జిల్లాస్థాయి పాఠశాలల క్రీడల సమాఖ్య ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి రికార్డుస్థాయిలో 3వేల మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. కోడిరామ్మూర్తి స్టేడియంతోపాటు.. హాకీ, ఫుట్‌బాల్ ఎంపికలను సమీపంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించారు. రంగురంగుల దుస్తుల ధరించి హాజరైన బాలబాలికలతో క్రీడాప్రాంగణం కళకళలాడింది. అయితే మండే ఎండతో క్రీడాకారులు ఇక్కట్లకు గురయ్యారు. అయితే సాయంత్రం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో ఎంపికల్లో పాల్గొన్నారు. అంతకుముందు డీఈఓ దేవానందరెడ్డి వాలీబాల్ ఆడి ఎంపికలను ప్రారంభించారు. తొలిరోజు ఇలా.. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, ఆర్చరీ క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాంశాలకు క్రీడాకారులు పోటెత్తారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ క్రీడాంశాల్లో ప్రాథమికంగా ఎంపికలు జరిపారు. మిగిలిన తుది ఎంపికలను బుధవారం నిర్వహించనున్నారు. మూడు రోజుల ఎంపికలన్నీ ముగిసిన తర్వాత జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారులు జాబితాలను ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. భోజన ఏర్పాట్ల లేమితో బాలబాలికలకు అవస్థలు పడ్డారు. దీనిపై సమాచారం లేకపోవడంతో అగచాట్లు పడ్డారు. నేడు జరగనున్న ఎంపికలు ఇవే.. అండర్–14, 17 వయస్సుల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ తుది ఎంపికలతోపాటు బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, సాఫ్ట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, తైక్వాండో, స్విమ్మింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, చెస్, లాన్‌టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, కరాటే, యోగ ఎంపికలను నిర్వహించనున్నారు. -
3న సైకిల్‌పోలో జిల్లా జట్ల ఎంపికలు
వీరపనేనిగూడెం (గన్నవరం రూరల్) : సైకిల్ పోలో కృష్ణాజిల్లా సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం.10గంటలకు గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ బాలుర జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనియాల నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు వయస్సు «ధ్రువీకరణ పత్రం, క్రీడాదుస్తులు, షూస్‌తో క్రీడా మైదానంలో హాజరు కావాలని చెప్పారు. ఎంపికైన జట్లు సెప్టెంబర్ 11, 12వ తేదీలలో కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగే ఏపీ అంతర్ జిల్లాల సైకిల్ పోలో ఛాంపియన్ షిప్ పోటీలకు పంపటం జరుగుతుందని చెప్పారు. -
సెప్టెంబర్ 2న బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
టూటౌన్ : సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు మెదక్ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు వచ్చే నెల 2వ తేదిన నల్లగొండలోని సెయింట్ ఆల్ఫెన్సస్ స్కూల్లో ఎంపిక జరపనున్నారు. బాస్కెట్‌బాల్ అండర్–14 బాల బాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కరెంట్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వయసు ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకోని రావాలని కోరారు. ఇతర వివరాల కొరకు 9848432182 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. -
నేడు హాకీ జిల్లా జట్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : వరంగల్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొనడానికి జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ ఔట్ డోర్ స్టేడియంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా జట్ల ఎంపిక కార్యక్రమం ఉంటుందని హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎండీ ఇమామ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలకు సెప్టెంబర్ 2 నుంచి 4వ వరకు, బాలురకు సెప్టెంబర్ 16 నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయన్నారు. 18 సంవత్సరాల లోపు బాల బాలికలు ఆధార్ కార్డు, వయసు దృవీకరణ పత్రాలతో ఎంపికలకు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు 9490061616 నెంబర్లో సంప్రదించాలన్నారు. -
సెప్టెంబర్ 4న సాఫ్ట్‌బాల్ జిల్లాస్థాయి ఎంపికలు
నార్కట్‌పల్లి : జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్ సీనియర్స్ పురుషులు, మహిళా క్రీడాకారుల ఎంపికలను సెస్టెంబర్ 4వ తేదీన నార్కట్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించనున్నటు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగిరెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగా క్రీడాకారులు ఉదయమే పాఠశాల ఆవరణకు చేరుకోవాలని సూచించారు. -
28న జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఎంపికలు
కాకినాడ సిటీ : బిక్కవోలు జెడ్పీ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఈ నెల 28న జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ముప్పన వీర్రాజు, వీకేఆర్ తంబి తెలిపారు. పోటీల్లో పాల్గొనే బాలబాలికలు 1997 జనవరి 2 తరువాత పుట్టినవారై ఉండాలన్నారు. వయస్సు ధృవీకరణ పత్రం, యూనిఫాంతో హాజరు కావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు కాకినాడలో జరిగే 2వ అంతర్‌జిల్లాల పోటీలలో పాల్గొంటారన్నారు. వివరాలకు 98663 03893లో సంప్రదించాలని సూచించారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
కడప స్పోర్ట్స్ : నగరంలోని మస్తాన్‌వలి వీధిలోని అనీస్ దర్బారీ చెస్ కోచింగ్ సెంటర్లో జిల్లాస్థాయి అండర్–17 బాలబాలికల చెస్ ఛాంపియన్షిప్ పోటీలు, ఎంపికలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ అనీస్ దర్బారీ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26 నుంచి నెల్లూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని సూచించారు. అనంతరం విజేతలుగా నిలిచిన ప్రేమ్‌సాయి, వంశీకృష్ణ, బాలికల విభాగంలో యాఫియాలకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో నందలూరు రైల్వేస్టేషన్ మేనేజర్ కిషోర్‌దాస్ పాల్గొన్నారు. -
24, 25 తేదీల్లో క్రికెటర్ల ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో వివిధ వయో విభాగాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) నడుంబిగించింది. ఈ నెల 24, 25 తేదీల్లో నాలుగు విభాగాల్లో టాలెంట్ సెర్చ్ పేరిట ఎంపిక పోటీలు నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. గతంలో ఆడినవారికి పోటీల్లో పాల్గొనే అవకాశం లేదు. కొత్తవారు మాత్రమే ఆర్ట్స్‌కళాశాల మైదానంలో జరిగే ఎంపిక పోటీల్లో పాల్గొనాలని ఏసీఏ అధికారులు కోరారు. నాలుగు వయో విభాగాల్లో ఎంపికలు.. అండర్–14, 16, 19, 23 వయో విభాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. 24వ తేదీన అండర్–16, అండర్–19 ఎంపికపోటీలు నిర్వహిస్తుండగా, 25న అండర్–14, అండర్–23 ఎంపిక పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో (అండర్–14కు మినహా) జిల్లా, అంతర్ జోనల్, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు ప్రవేశం లేదని నార్తజోన్ క్రికెట్ కార్యదర్శి జీ.వి.సన్యాసిరాజు స్పష్టం చేశారు. ఈ వయసువారే అర్హులు.. అండర్–14 ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు సెప్టెంబర్ 1, 2002 తర్వాత జన్మించి ఉండాలి. అండర్–16కు సెప్టెంబర్ 1, 2000 తర్వాత, అండర్–19కు సెప్టెంబర్ 1, 1997 తర్వాత, అండర్–23కు సెప్టెంబర్ 1, 1993 తర్వాత జన్మించిన క్రీడాకారులు మాత్రమే అర్హులని నిర్వాహకులు తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సన్యాసిరాజు కోరారు. ఎంపికైన వారికి క్రికెట్లో ప్రత్యేక తర్ఫీదునిస్తామని, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దుతామన్నారు. -
క్రీడలు జీవితంలో భాగం కావాలి
సింధూ క్రీడాజీవితం స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ నెల్లూరు(బృందావనం): క్రీడలు ప్రతి ఒక్కరి జీవితం లో భాగం కావాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెక్లీన్స్ క్లబ్ ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో రెండు రోజులు జరగనున్న జిల్లా, రాష్ట్రస్థాయి పోటీ ల ఎంపికల టోర్నమెంట్‌ను శుక్రవారం ప్రారంభిం చిన అనంతరం ఆయన మాట్లాడారు. బ్యాడ్మింటన్ పోటీలకు నెల్లూరు నుంచి క్రీడాప్రస్థానాన్ని ప్రారంభించిన పీవీ సింధూ రియో ఒలింపిక్స్‌లో రాణిం చడం హర్షణీయమని పేర్కొన్నారు. దేశంలోని యువతకు సింధూ క్రీడాజీవితం ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు నామమాత్ర నిధుల కేటాయింపు దారుణమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మెండుగా నిధులను కేటాయించి క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో బ్యాడ్మింటన్ ప్రగతికి అసోసియేషన్ పదేళ్లుగా చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. నిర్వాహకుడు ద్వారకానాథ్‌ను ప్రశంసించారు. బ్యాడ్మింటన్ అకాడమీని కేటాయించాలి నెల్లూరులో బ్యాడ్మింటన్ అకాడమీని ప్రభుత్వం కేటాయిస్తే తన వంతు తోడ్పాటును అందిస్తానని డిప్యూటీ మేయర్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముక్కాల ద్వారకానాథ్ పేర్కొన్నారు. నెల్లూరులో క్రీడాఅకాడమీలను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొందని, అయితే ఎన్నో వసతులు ఉన్న నెల్లూరు బ్యాడ్మింటన్ క్రీడాఅకాడమీకి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడం శోచనీయమన్నారు. అండర్ - 13, 15, 19, వెటరన్, మెన్స్, ఉమెన్స్, బాలబాలికల సింగిల్స్, డబుల్స్ పోటీలకు అత్యధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం హర్షణీయమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాసయాదవ్, ఓబిలి రవిచంద్ర, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వాహకులు చంద్రారెడ్డి, బేగ్, అర్జున్‌రావు, వెంకట్, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు రేపు
అండర్–14, 16, 18, 20 విభాగాల్లో ఎంపికలు రన్స్,త్రోస్, జంప్స్ ఈవెంట్స్‌లో పోరు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలకు రంగం సిద్ధమైంది. త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి సౌత్‌జోన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల సెలక్షన్స్‌లో పాల్గొనే శ్రీకాకుళం జిల్లా క్రీడాకారుల ఎంపికలను ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, ఎన్.విజయ్‌కుమార్ తెలిపారు. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జరగనున్న ఈ ఎంపికలు ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమౌతాయన్నారు. అండర్–14, 16, 18, 20 ఏళ్ల విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా ఎంపికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 100, 200, 400, 800, 1500, 3వేలు మీటర్ల పరుగు పందాలు, రిలే పరుగు, హార్టిల్స్, హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, జావెలిన్‌త్రో, హేమర్‌త్రో, పోల్‌వాల్ట్ తదితర కేటగిరీల్లో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పంపిస్తామని చెప్పారు. ఎంపికల్లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో ఆ రోజ ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు చేరుకోవాలని వారు సూచించారు. మరిన్ని వివరాలకు సంఘ కార్యనిర్వహన కార్యదర్శి ఎం.సాంబమూర్తి (సెల్: 8500271575)ని సంప్రదించాలి. -
బ్యాడ్మింటన్ పోటీలకు సై
– నేడు, రేపు జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు – ఏర్పాట్లు పూర్తి చేసిన బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు శ్రీకాకుళం న్యూకాలనీ: బ్యాడ్మింటన్ పోటీలకు రంగం సిద్ధమైంది. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి ఇండోర్ స్టేడియం వేదికగా శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జరగనున్న జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నారు. దీని కోసమే కొద్దిరోజులుగా ఇండోర్ స్టేడియంలోని ఉడెన్ కోర్టుల పనులను నిర్వహిస్తున్నారు. ఆ పనులు శుక్రవారానికి పూర్తయ్యాయి. సాయంత్రం సంఘ కోశాధికారి ఎం.ఇ.రత్నాజీ నేతృత్వంలో తుది మెరుగులు దిద్దారు. ఇండోర్ స్టేడియంను కూడా నేలమట్టం చేయనున్న నేప«థ్యంలో జరగనున్న ఆఖరి టోర్నీ కావడంతో బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు మౌలిక సదుపాయాలతోపాటు భోజన ఏర్పాట్లను కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాడ్మింటన్ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.సూరిబాబు తెలిపారు. ఐదు విభాగాల్లో పోటీలు... రెండు రోజులపాటు జరగనున్న జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీల్లో మొత్తం ఐదు విభాగాలు ఉన్నాయి. అండర్–13, అండర్–15 బాలబాలికలకు, సీనియర్స్(పురుషులు, మహిళలు), 45ప్లస్, 55ప్లస్ వయస్సు కలిగిన వారికి వేరువేరుగా ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగిల్స్, డబుల్స్‌లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఆదివారం సాయంత్రం బహుమతులు అందిస్తారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు రాష్ట్రపోటీలకు అర్హత సాధించనున్నారు. ఎంట్రీలను నమోదుచేసుకున్న క్రీడాకారులంతా శనివారం ఉదయం 9 గంటలకు చేరుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. అంతా సహకరించాలి.. జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇండోర్ స్టేడియం నేలమట్టం చేయనున్న నేపథ్యంలో శ్రీకాకుళంలో జరగనున్న ఆఖరి పోటీలను అంతా విజయవంతం చేయాలి. సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారుంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. –కిల్లంశెట్టి సాగర్, ఏపీ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘ సంయుక్త కార్యదర్శి -
నేడు, రేపు దేహదారుఢ్య పరీక్షలకు విరామం
ఖమ్మంక్రైం: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్స్ శారీరక దారుఢ్య పరీక్షలకు ఆదివారం, సోమవారం విరామం ఇవ్వనున్నట్లు ఎస్పీ షానవాజ్ ఖాసీం తెలిపారు. ఆగస్టు 2 నుంచి పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కొనసాగుతుందని పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 1200 మందికి గాను 950 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పురుష అభ్యర్థులకు 800 మీటర్ల పరుగును నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు, ఛాతి ఎత్తు కొలతలను పరిశీలించారు. ఈ అభ్యర్థులకు ఆగస్టు 2న ఈవెంట్లను నిర్వహిస్తారు. అలాగే మహిళా అభ్యర్థులకు బయోమెట్రì క్, అభ్యర్థుల ఆధార్ కార్డు, సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేశారు. ఎత్తులో అర్హత సాధించిన వారికి 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్ నిర్వహించారు. తప్పిదాలు, అవకతవకలు జరగకుండా అదనపు ఎస్పీ సాయికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయ, ఐటీ కోర్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచి డీఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రాంరెడ్డి, నరేందర్‌రావు, వీరేశ్వరరావు, సాయిశ్రీ, సురేష్‌కుమార్, ఏఆర్ డీఎస్పీలు సంజీవ్, మాణిక్‌రాజ్, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, వైద్యులు పాల్గొన్నారు. -
క్రీడా పాఠశాలకు ఎంపికలు
గుంటూరు స్పోర్ట్స్ : ఆంధ్రప్రదేశ్ క్రీడా పాఠశాలలో నాల్గవ తరగతిలో ప్రవేశాలకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం బ్రహ్మానందరెడ్డి స్డేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు జరిగాయి. ఈ ఎంపికలలో 89 మంది బాలబాలికలు పాల్గొన్నారు. శాప్ పాలకమండలి సభ్యురాలు సత్తి గీత ముఖ్యఅతిథిగా హాజరై ఎంపికలను ప్రారంభించారు. శాప్ ఓఎస్డీ, జిల్లా ఇన్చార్జ్ డీఎస్డీఓ ప్రత్తిపాటి రామకృష్ణ క్రీడా ఎంపికలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా స్థాయి క్రీడా ప్రవేశ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన బాలబాలికలను ఎంపిక చేసి, రాష్ట్ర స్థాయి ఎంపికకు పంపుతామన్నారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్ శిక్షకుడు పాండురంగారావు, జిమ్నాస్టిక్స్ శిక్షకుడు సురేష్, టేబుల్ టెన్నిస్ శిక్షకుడు రాజేష్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యయులు మైనేని నాగేశ్వరరావు, వై.శ్రీనివాసరావు, కె.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు జిల్లా వాసులు
– రికార్డు స్థాయిలో నలుగురి ఎంపికS – ఆగస్టు 5 నుంచి పంజాబ్‌లో జాతీయ పోటీలు – రేపటి నుంచి అనంతపురంలో శిక్షణ శిబిరాలు శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి రికార్డు స్థాయిలో నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. పంజాబ్‌లోని జలందర్‌లో లౌలీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఆగస్ట్ 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే జాతీయ జూనియర్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా నుంచి నలుగురు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరంతా ఆంధ్రా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. వీరిలో బాలుర జట్టుకు సీహెచ్ గోవిందరావు (జెడ్పీహెచ్‌స్కూల్, ఇప్పిలి), కె.విక్రమ్ (జెడ్పీహెచ్‌స్కూల్, చిన్నబాడాం), జి.నర్సింహనాయుడు (జెడ్పీహెచ్‌స్కూల్, తొగరాం) ఎంపికయ్యారు. బాలికల జట్టుకు కమిలీ గౌడో (జెడ్పీహెచ్‌స్కూల్, మందస) ఎంపికైంది. వీరంతా ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జరిగిన 3వ రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మీట్లో సిక్కోలు బాలుర జట్టు 3వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. రేపటి నుంచి శిక్షణ శిబిరాలు ఇదిలా ఉండగా ఈ పోటీలకు ముందు ఆంధ్రా జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ స్టేడియంలో ఈనెల 23 నుంచి పది రోజులపాటు నిర్వహించే శిక్షణ శిబిరాలకు వీరంతా హాజరవుతున్నారు. ఇందుకోసం గురువారం ఇక్కడ నుంచి పయనమయ్యారు. వీరికి సంఘ ప్రతినిధులు వీడ్కోలు పలికారు. శిబిరాల్లో కఠోర సాధన చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ పోటీల్లో ఆంధ్రరాష్ట్ర జట్టు ముందంజలో నిలిపేలా సర్వశక్తులూ ఒడ్డాలని సూచించారు. కాగా, జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు జిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపిక కావడం పట్ల జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, అధ్యక్షుడు బడగల హరిధరరావు, కన్వీనర్ కె.సురేష్‌కుమార్ గుప్త, ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటరమణ, ప్రతినిధులు కె.రవికుమార్, ఎం.ఆనంద్‌కిరణ్, సతీష్‌రాయుడు, రాజశేఖర్, జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ధర్మాన కృష్ణదాస్, పి.సుందరరావు, డీఎస్డీఓ బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా పీఈటీ సంఘ ప్రతినిధులు పోలినాయుడు, సాంబమూర్తి, రాజారావు, సూరిబాబు, శేఖర్, పీఈటీలు హర్షం వ్యక్తం చేశారు. -
సెంట్రల్‌జోన్ సీనియర్ ఉమన్ క్రికెట్ టీం ఎంపిక
ఒంగోలు: సెంట్రల్ జోన్ సెక్రటరీ కోకా రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం సెంట్రల్ జోన్ ఉమన్ క్రికెట్ టీం ఎంపిక చేశారు. స్థానిక శర్మ కాలేజీ గ్రౌండ్లో ప్రారంభమైన ఈ సెంట్రల్ జోన్ పరిధిలోని ప్రకాశం, కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జట్ల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న మ్యాచ్‌లలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో టీం ఎంపిక పూర్తి చేశారు. ఎంపికలో సెలక్షన్ కమిటీ చైర్మన్ సయ్యద్ ఆలీ, కోకా రమేష్, ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చింతపల్లి ప్రతాప్కుమార్లతోపాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉమన్ టీం కోచ్ ఎస్.శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సెంట్రల్ జోన్ టీం : ఎస్.మేఘన(కెప్టెన్–కృష్ణా జిల్లా), ఆర్.కల్పన–వికెట్ కీపర్ (వైస్ కెప్టెన్–కృష్ణా జిల్లా), పీవీ సుధారాణి, టి.మల్లిక(ప్రకాశం), సీహెచ్.ఝాన్సీలక్ష్మి(గుంటూరు), జి.స్నేహ, ఎం.భావన,కె.థాత్రి, ఎల్ఎస్ఎస్ తేజస్విని(కృష్ణా), జి.నవ్యదుర్గ, సీహెచ్.కవిత, వికెట్ కీపర్ కె.హెప్సీబా, ఇ.సత్యవాణి, ఎం.లావణ్య(పశ్చిమ గోదావరి)లను ఎంపిక చేశారు. స్టాండ్‌బైలుగా టి.ఉమాదేవి(పశ్చిమగోదావరి), ఎన్.జ్యోతిర్మయి, కె.ఆకాంక్ష(కృష్ణా), కె.శ్రీఅమృత(గుంటూరు), పి.కల్పన, సింధుశ్రీ(ప్రకాశం జిల్లా)లు ఎంపికయ్యారు. ఈ జట్టుకు కోచ్‌గా ఎస్.రమాదేవి, డి.చంద్రికలు ఎంపికయ్యారు.