అసౌకర్యాల మధ్య నేటి నుంచి సైనిక నియామకాలు | sainik selections | Sakshi
Sakshi News home page

అసౌకర్యాల మధ్య నేటి నుంచి సైనిక నియామకాలు

Published Tue, Oct 4 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

అసౌకర్యాల మధ్య నేటి నుంచి సైనిక నియామకాలు

అసౌకర్యాల మధ్య నేటి నుంచి సైనిక నియామకాలు

  •  
  • వివిధ జిల్లాలు నుంచి  వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు 
  • నివాస ఏర్పాట్లు లేక పుట్‌పాత్‌లపైనే జాగారం
  • ఇంకా చదును చేయని ఎంపిక ప్రాంగణం
  •  
    బోట్‌క్లబ్‌ (కాకినాడ) :
    భారత సైన్యంలో వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ముహూర్తం దగ్గరపడినా ఏర్పాట్లు మాత్రం అరకొరగానే ఉన్నాయి. బుధవారం నుంచి కాకినాడలోని జిల్లా క్రీడా మైదానం ఇందుకు ఎంపిక చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 15 వరకూ ఆరు జిల్లాల నుంచి 40,495  మంది ఉభయగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొనున్నారు.  పాల్గొనే అభ్యర్థులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్మీ అధికారులు, జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పరిశీలిస్తున్నా లోటుపాట్లు వెంటాడుతునే ఉన్నాయి. క్రీడా మైదానం రోడ్డు కూడా చదును చేయలేదు...అభ్యర్థులకు ఫుట్‌పాత్‌లే వసతి గృహాలయ్యాయి. ఎంపిక సమయానికి అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement