sainik
-
‘తల్ సైనిక్’లో వెల్డన్
రాష్ట్రస్థాయిలో నాల్గవ స్థానం సాధించిన వేళంగి విద్యార్థి ఏడు క్యాంపుల్లో 70 రోజులపాటు శిక్షణ వేళంగి(కరప): కరప మండలం వేళంగిలోని మెర్లాస్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఎన్సీసీ క్యాడెట్ శీలం వీరవెంకటసత్యనారాయణ జూనియర్ డివిజన్ ఫైరింగ్ విభాగంలో ప్రతిభ కనబరచడంతో తల్ సైనిక్–2016కు ఎంపికై ఏడు క్యాంపుల్లో శిక్షణ పొంది తిరిగి వచ్చాడు. గతనెలలో ఢిల్లీలో జరిగిన చివరి క్యాంపులో రాష్ట్రస్థాయిలో నాల్గవ స్థానం పొందినట్టు హెచ్ఎం బి.వెంకటశివప్రసాద్, ఎన్సీసీ ఉపాధ్యాయుడు వెలుగుబంట్ల వీరవెంకట రమణమూర్తి తెలిపారు. తల్ సైనిక్కు ఎంపిక ఇలా కృష్ణాజిల్లా నూజివీడులో 40 రోజులపాటు మూడుచోట్ల జరిగిన ఫైరింగ్ క్యాంప్‌లో ప్రతిభ కనబరచడంతో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థి వీరవెంకటసత్యనారాయణ ఒక్కడే. అక్కడ నుంచి సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో నాలుగు క్యాంప్‌లు జరిగాయి. నిజామాబాద్ క్యాంప్ ఫైనల్లో ప్రతిభ కనబరచడంతో ఢిల్లీ క్యాంప్‌కు ఎంపికయ్యాడు. ఢిల్లీలోని ఎన్సీసీ హెడ్‌క్వార్టర్‌లో గతనెల 19 నుంచి 30వ తేదీ వరకు 12 రోజులు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో మ్యాప్‌రీడింగ్, ఆయుధాలపై ఇచ్చిన శిక్షణలో 19వ ఆంధ్రా బెటాలియన్ నుంచి జూనియర్ విభాగంలో వెళ్లిన సత్యనారాయణ నాల్గవ స్థానంలో నిలిచాడు. ఈ శిక్షణ భవిష్యత్‌లో ఉపయోగపడుతుందని, రిజర్వేషన్ కోటా కూడా వర్తిస్తుందని ఎన్సీసీ ఉపాధ్యాయుడు తెలిపారు. పాఠశాల స్థాయిలో ఫైరింగ్‌లో శిక్షణ ఇచ్చినప్పుడు ఏకాగ్రతతో నేర్చుకునేవాడని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఎన్సీసీ ఉపాధ్యాయుడిని, శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన ఎన్సీసీ క్యాడెట్ సత్యనారాయణను పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మెర్ల వీరయ్యచౌదరి, సర్పంచ్ కె.చంద్రకుమారి, హెచ్ఎం బి.వెంకటశివప్రసాద్ అభినందించారు. ఎన్సీసీ మాస్టారు ప్రోత్సాహం మరువలేనిది తల్ సైనిక్కు ఎంపికై, ఢిల్లీ స్థాయిలో శిక్షణ పొందడానికి కారకులైన ఎ¯ŒSసీసీ మాస్టారు వీవీవీ రమణమూర్తి, హెచ్ఎం బి.వెంకటశివప్రసాద్ల ప్రోత్సాహం మరువలేనిదని శిక్షణ నుంచి తిరిగి వచ్చిన శీలం వీరవెంకటసత్యనారాయణ తెలిపాడు. చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎ¯ŒSసీసీ మాస్టారు ఎయిర్ రైఫిల్ కొనిచ్చి, శిక్షణ ఇచ్చారని, అదే తనను ఢిల్లీ వరకు తీసుకెళ్లిందన్నాడు.ఆర్మీలో మంచిపోస్టు సాధించాలన్నది లక్ష్యమని శిక్షణలో నాల్గవ స్థానంలో నిలిచిన ఎ¯ŒSసీసీ విద్యార్థి శీలం వీరవెంకట సత్యనారాయణ తెలిపారు.ఎ¯ŒSసీసీ ఉపాధ్యాయుడు వెలుగుబంట్ల రమణమూర్తి ఇస్తున్న శిక్షణతోనే మెళుకువలు నేర్చుకుని, ఫైరింగ్‌లో తల్ సైనిక్–2016కు ఎంపికై ఈ ఘనత సాధించానన్నాడు. -
అసౌకర్యాల మధ్య నేటి నుంచి సైనిక నియామకాలు
వివిధ జిల్లాలు నుంచి వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు నివాస ఏర్పాట్లు లేక పుట్‌పాత్‌లపైనే జాగారం ఇంకా చదును చేయని ఎంపిక ప్రాంగణం బోట్‌క్లబ్ (కాకినాడ) : భారత సైన్యంలో వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ముహూర్తం దగ్గరపడినా ఏర్పాట్లు మాత్రం అరకొరగానే ఉన్నాయి. బుధవారం నుంచి కాకినాడలోని జిల్లా క్రీడా మైదానం ఇందుకు ఎంపిక చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 15 వరకూ ఆరు జిల్లాల నుంచి 40,495 మంది ఉభయగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. పాల్గొనే అభ్యర్థులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్మీ అధికారులు, జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పరిశీలిస్తున్నా లోటుపాట్లు వెంటాడుతునే ఉన్నాయి. క్రీడా మైదానం రోడ్డు కూడా చదును చేయలేదు...అభ్యర్థులకు ఫుట్‌పాత్‌లే వసతి గృహాలయ్యాయి. ఎంపిక సమయానికి అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. -
సైనిక స్కూళ్ల ఏర్పాటుకు అంగీకారం!
ఇటానగర్ః అరుణాచల్ ప్రదేశ్ లో రెండు సైనిక పాఠశాలలు సహా రెండు పర్మనెంట్ రిక్రూట్ మెంట్ సెంటర్ల స్థాపనకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అంగీకరించారు. రాష్ట్రంలో రక్షణ దళాల నియామకాలను మరింతగా పెంచేందుకు వీలుగా రిక్రూట్ మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అరుణాచల్ ముఖ్యమంత్రి కలిఖో పుల్ ప్రతిపాదనను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అంగీకరించారు. గురువారం రక్షణ మంత్రితో ఢిల్లీలో సమావేశమైన కలిఖో... సైనిక పాఠశాలల స్థాపన విషయాన్ని ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆర్మీ స్టాఫ్ జనరల్ దల్బీర్ సింగ్ ను కూడ ముఖ్యమంత్రి కలిఖో కలుసుకున్నారు. తాజా ప్రతిపాదన ప్రకారం ఒక పాఠశాలను పశ్చిమ ప్రాంతంలోని షెర్గాన్ లోనూ, మరొకటి తూర్పు ప్రాంతంలోని తెజు లోనూ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అయితే పర్మనెంట్ రిక్రూట్ మెంట్ సెంటర్లను మాత్రం పశ్చిమ ప్రాంతంలోని తవాంగ్ లో ఒకటి, తూర్పు ప్రాంతంలోని తెజులో ఒకటి స్థాపించేందుకు రక్షణ మంత్రి అంగీకరించినట్లు తెలిపారు. అంతేకాక, పౌర అవసరాల కోసం రక్షణ దళాలు వినియోగించే అత్యవసర హెలికాప్టర్ల విస్తరణను సులభతరం చేసేందుకు అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ (ఏఎల్జీ) ఎంవోఏ ను కూడ పునరుద్ధరించేందుకు రక్షణమంత్రి పారికర్ అంగీకరించారు. అయితే బోర్డర్ రోడ్స్ అర్గనైజేషన్ ద్వారా సరిహద్దు రోడ్ల నిర్మాణం, నిర్వహణ విషయాన్నికూడ కలిఖో పాల్ రక్షణమంత్రిని కోరినట్లు తెలుస్తోంది.