‘తల్ సైనిక్’లో వెల్‌డన్
‘తల్ సైనిక్’లో వెల్‌డన్
Published Wed, Oct 26 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
రాష్ట్రస్థాయిలో నాల్గవ స్థానం సాధించిన వేళంగి విద్యార్థి
ఏడు క్యాంపుల్లో 70 రోజులపాటు శిక్షణ
వేళంగి(కరప): కరప మండలం వేళంగిలోని మెర్లాస్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఎన్‌సీసీ క్యాడెట్ శీలం వీరవెంకటసత్యనారాయణ జూనియర్ డివిజన్ ఫైరింగ్ విభాగంలో ప్రతిభ కనబరచడంతో తల్ సైనిక్–2016కు ఎంపికై ఏడు క్యాంపుల్లో శిక్షణ పొంది తిరిగి వచ్చాడు. గతనెలలో ఢిల్లీలో జరిగిన చివరి క్యాంపులో రాష్ట్రస్థాయిలో నాల్గవ స్థానం పొందినట్టు హెచ్‌ఎం బి.వెంకటశివప్రసాద్, ఎన్‌సీసీ ఉపాధ్యాయుడు వెలుగుబంట్ల వీరవెంకట రమణమూర్తి తెలిపారు.
తల్ సైనిక్‌కు ఎంపిక ఇలా
కృష్ణాజిల్లా నూజివీడులో 40 రోజులపాటు మూడుచోట్ల జరిగిన ఫైరింగ్ క్యాంప్‌లో ప్రతిభ కనబరచడంతో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థి వీరవెంకటసత్యనారాయణ ఒక్కడే. అక్కడ నుంచి సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో నాలుగు క్యాంప్‌లు జరిగాయి. నిజామాబాద్ క్యాంప్ ఫైనల్‌లో ప్రతిభ కనబరచడంతో ఢిల్లీ క్యాంప్‌కు ఎంపికయ్యాడు. ఢిల్లీలోని ఎన్‌సీసీ హెడ్‌క్వార్టర్‌లో గతనెల 19 నుంచి 30వ తేదీ వరకు 12 రోజులు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో మ్యాప్‌రీడింగ్, ఆయుధాలపై ఇచ్చిన శిక్షణలో 19వ ఆంధ్రా బెటాలియన్ నుంచి జూనియర్ విభాగంలో వెళ్లిన సత్యనారాయణ నాల్గవ స్థానంలో నిలిచాడు. ఈ శిక్షణ భవిష్యత్‌లో ఉపయోగపడుతుందని, రిజర్వేషన్ కోటా కూడా వర్తిస్తుందని ఎన్‌సీసీ ఉపాధ్యాయుడు తెలిపారు. పాఠశాల స్థాయిలో ఫైరింగ్‌లో శిక్షణ ఇచ్చినప్పుడు ఏకాగ్రతతో నేర్చుకునేవాడని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఎన్‌సీసీ ఉపాధ్యాయుడిని, శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన ఎన్‌సీసీ క్యాడెట్ సత్యనారాయణను పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మెర్ల వీరయ్యచౌదరి, సర్పంచ్ కె.చంద్రకుమారి, హెచ్‌ఎం బి.వెంకటశివప్రసాద్ అభినందించారు.
ఎన్‌సీసీ మాస్టారు ప్రోత్సాహం మరువలేనిది
తల్ సైనిక్‌కు ఎంపికై, ఢిల్లీ స్థాయిలో శిక్షణ పొందడానికి కారకులైన ఎ¯ŒSసీసీ మాస్టారు వీవీవీ రమణమూర్తి, హెచ్‌ఎం బి.వెంకటశివప్రసాద్‌ల ప్రోత్సాహం మరువలేనిదని శిక్షణ నుంచి తిరిగి వచ్చిన శీలం వీరవెంకటసత్యనారాయణ తెలిపాడు. చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎ¯ŒSసీసీ మాస్టారు ఎయిర్ రైఫిల్ కొనిచ్చి, శిక్షణ ఇచ్చారని, అదే తనను ఢిల్లీ వరకు తీసుకెళ్లిందన్నాడు.ఆర్మీలో మంచిపోస్టు సాధించాలన్నది లక్ష్యమని శిక్షణలో నాల్గవ స్థానంలో నిలిచిన ఎ¯ŒSసీసీ విద్యార్థి శీలం వీరవెంకట సత్యనారాయణ తెలిపారు.ఎ¯ŒSసీసీ ఉపాధ్యాయుడు వెలుగుబంట్ల రమణమూర్తి ఇస్తున్న శిక్షణతోనే మెళుకువలు నేర్చుకుని, ఫైరింగ్‌లో తల్ సైనిక్–2016కు ఎంపికై ఈ ఘనత సాధించానన్నాడు.
Advertisement