గణతంత్ర వేడుకల్లో ఈశాన్య విద్యార్థినుల బ్యాండ్‌! | 907 Girls To Take Part In NCC Republic Day Camp 2024 - Sakshi
Sakshi News home page

Republic Day: గణతంత్ర వేడుకల్లో ఈశాన్య విద్యార్థినుల బ్యాండ్‌!

Published Thu, Jan 4 2024 8:23 AM | Last Updated on Thu, Jan 4 2024 9:06 AM

907 Girls NCC Cadets in Republic Day Camp - Sakshi

ఈ ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) క్యాంప్‌లో మొత్తం 2,274 మంది క్యాడెట్లు పాల్గొననున్నారు. వీరిలో యువతుల భాగస్వామ్యం అధికంగా ఉండనుంది. ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌పాల్ సింగ్ ఈ వివరాలను తెలియజేశారు. ఎన్‌సీసీలో యువతుల భాగస్వామ్యం ప్రతి సంవత్సరం పెరుగుతోందని అన్నారు.

ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌పాల్ సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శిబిరానికి హాజరవుతున్న క్యాడెట్‌లలో జమ్మూ కాశ్మీర్, లడఖ్‌కు చెందిన 122 మంది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 177 మంది ఉన్నారని సింగ్ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 45 మంది యువతుల బృందం తొలిసారిగా ఎన్‌సీసీ రిపబ్లిక్ డే క్యాంప్‌లో పాల్గొంటున్నదన్నారు. వీరి బ్యాండ్‌ తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో అలరించనున్నదని తెలిపారు.

ఈ సందర్భంగా బెస్ట్ టీమ్, బెస్ట్ క్యాడెట్, హార్స్ రైడింగ్ మొదలైన పోటీలు నిర్వహించనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ సింగ్ తెలిపారు. కాగా 2023లో దాదాపు నెల రోజులపాటు జరిగిన ఎన్‌సీసీ శిబిరంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 710 మంది యువతులతో సహా మొత్తం 2,155 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. 

ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కవాతు చేయబోతున్నాయి. ఒక్కో బృందంలో 144 మంది మహిళా సైనికులు ఉండనున్నారు. వీరిలో 60 మంది ఆర్మీకి చెందిన వారు కాగా, మిగిలిన వారు భారత వైమానిక దళం, భారత నౌకాదళానికి చెందిన వారు ఉంటారని రక్షణ అధికారులు తెలిపారు. ఈ బృందంలో నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మహిళా అగ్నివీర్ సైనికులు కూడా ఉండనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement