సాక్షి, గుంటూరు: ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వీఎం రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. విపత్తు నిర్వహణలో ఎన్‌సీసీ క్యాడెట్‌ల పాత్ర, బాధ్యతలు, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించారు.
ఏపీలో ఎన్‌సీసీ విస్తరణ ప్రణాళికపై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అదనంగా 60 వేల మంది ఎన్‌సీసీ క్యాడెట్‌లను రిక్రూట్ చేయడం ద్వారా ప్రతి జిల్లాలో ఎన్‌సీసీ క్యాడెట్‌లు అందుబాటులో ఉంటారని సీఎం జగన్‌కు డీడీజీ వీఎంరెడ్డి వివరించారు. ఏపీ విద్యార్ధులకు సమర్ధవంతమైన శిక్షణను అందించేందుకు వీలుగా ఏపీలో సెంట్రల్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు.
ఎన్‌సీసీకి చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్ క్యాడెట్‌ల శిక్షణ కోసం అవసరమైన సహాయం చేసేందుకు సిద్దమని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆయనకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎన్‌సీసీ అసిస్టెంట్ డైరెక్టర్ కల్నల్ సంజయ్ గుప్తా, గ్రూప్ కమాండర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment