Cadet
-
World Cadets Chess Championship: శుభి, చార్వీలకు స్వర్ణాలు
బాతూమి (జార్జియా): ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో అండర్–12 బాలికల విభాగంలో శుభి గుప్తా... అండర్–8 బాలికల విభాగంలో చార్వీ విజేతలుగా నిలిచారు. ఘాజియాబాద్‌కు చెందిన శుభి గుప్తా నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 8.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించింది. బెంగళూరుకు చెందిన చార్వీ నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. సంహిత పుంగవనం 7.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. అండర్–8 ఓపెన్ కేటగిరీలో సఫిన్ సఫరుల్లాఖాన్ కాంస్య పతకం గెలిచాడు. కేరళకు చెందిన సఫిన్ తొమ్మిది పాయింట్లు స్కోరు చేశాడు. -
ప్రపంచ చాంపియన్ లింథోయ్
సరజెవో (బోస్నియా అండ్ హెర్జిగొవినా): ప్రపంచ జూడో చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి లింథోయ్ చనంబమ్ సంచలనం సృష్టించింది. క్యాడెట్ విభాగంలో (57 కేజీల కేటగిరీ) ఆమె విజేతగా నిలిచింది. మణిపూర్‌కు చెందిన 15 ఏళ్ల లింథోయ్ శుక్రవారం జరిగిన ఫైనల్లో 1–0 తేడాతో రీస్ బియాంకా (బ్రెజిల్)ను ఓడించింది. 8 నిమిషాల 38 సెకన్ల పాటు సాగిన బౌట్లో భారత జుడోకా సత్తా చాటింది. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత జూడోకా ఒకరు ప్రపంచ చాంపియన్ కావడం ఇదే తొలిసారి. పురుషులు లేదా మహిళల విభాగాల్లో సీనియర్, జూనియర్, క్యాడెట్... ఇలా ఏ విభాగంలోనూ ఇప్పటి వరకు భారత్‌నుంచి ఎవరూ విజేతగా నిలవలేదు. గత జూలైలో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కేడెట్ జూడో చాంపియన్‌షిప్‌లో లింథోయ్ కూడా స్వర్ణం సాధించింది. -
క్యాడెట్ ఎంట్రీ స్కీమ్; సెలెక్ట్ అయితే చదువుతో పాటు జాబ్ పక్కా
త్రివిధ దళాల్లో కొలువు.. దేశంలో ఎంతోమంది యువత కల.ఎందుకంటే..సవాళ్లతోపాటు దేశ సేవలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగ భద్రత,ఆకర్షణీయ వేతనాలు, కెరీర్లో ఎదిగేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. అలాంటి చక్కటి కొలువును చిన్న వయసులోనే అందుకునే వీలు కల్పిస్తోంది.. ఇండియన్ నేవీ. ఇటీవల 2021 సంవత్సరానికి సంబంధించి ఇండియన్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సు 2022 జనవరిలో ప్రారంభమవుతుంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 35 (ఎడ్యుకేషన్ బ్రాంచ్–05, ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్–30). అర్హతలు ► ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో ఇంటర్మీడియెట్/10+2లో కనీసం 70 శాతం మార్కులు సాధించాలి. దీంతోపాటు పదో తరగతి లేదా ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు స్కోర్ చేయాలి. ► వయసు: 02.07.2002 నుంచి 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి. ► అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ► వీటితోపాటు జేఈఈ మెయిన్–2021(బీఈ/బీటెక్)కు హాజరై ఉండాలి. ఇందులో సాధించిన ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపిక విధానం ► జేఈఈ మెయిన్–2021 ర్యాంకు ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ సమాచారాన్ని ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ► ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలను బెంగళూరు/భోపాల్/కోల్‌కతా/విశాఖపట్నంల్లో ఏదోఒకచోట నిర్వహిస్తారు. ► ఈ ఇంటర్వ్యూలు 2021 అక్టోబర్/నవంబర్‌ల్లో జరిగే అవకాశం ఉంది. ► ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు మొత్తం ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ► తొలి రోజు స్టేజ్–1 ఉంటుంది. ఇందులో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. వీటిలో విజయం సాధించిన వారికే స్టేజ్ 2కు అనుమతిస్తారు. ► స్టేజ్ 2 నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఇందులో సైకలాజికల్ టెస్ట్‌లు, గ్రూప్ ఎక్సర్సైజ్లు, ముఖాముఖి పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్ 2లోనూ ప్రతిభ చూపిన వారికి మెడికల్ టెస్టులు ఉంటాయి. ఇందులోను గట్టెక్కితే తుది విజేతగా ప్రకటిస్తారు. శిక్షణ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ప్రక్రియలో విజయం సాధించి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులను ఇండియన్ నేవల్ అకాడెమీ, ఎజిమాల(కేరళ)లో బీటెక్ అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఈ శిక్షణ సమయంలో చదువుతోపాటు భోజనం, వసతి, బుక్స్, యూనిఫారం మొత్తం ఉచితంగా అందిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి జేఎన్‌యూ బీటెక్ డిగ్రీ ప్రదానం చేస్తుంది. అనంతరం సబ్ లెఫ్ట్నెట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. కెరీర్ స్కోప్ ఎంచుకున్న కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ లేదా ఎడ్యుకేషన్ బ్రాంచ్ విధులు కేటాయిస్తారు. ఉద్యోగంలో చేరితే ప్రారంభంలో లెవెల్–10 మూల వేతనం అంటే రూ.56100 అందుతుంది. దీంతోపాటు మిలిటరీ సర్వీస్ పే కింద రూ.15000 ఇస్తారు. అలాగే డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు లభిస్తాయి. ఈ సమయంలో అన్ని కలిపి నెలకు రూ.లక్ష వరకూ వేతనం అందుకునే అవకాశ ఉంది. ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది: 10.10.2021 వెబ్సైట్: www.joinindiannavy.gov.in -
పెద్దాపురంలో ముగిసిన ఎన్సీసీ శిక్షణ శిబిరం
–జాతీయ సమైక్యతకు ఎన్సీసీ దోహదమన్న వక్తలు పెద్దాపురం : కాకినాడ 18వ ఆంధ్రాబెటాలియన్ ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో పెద్దాపురం మహారాణి కళాశాలలో నిర్వహించిన ఎన్సీసీ శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. క్యాంప్ కమాండెంట్ మునీష్‌గౌర్ ఆధ్వర్యంలో క్యాంపు ముగింపు సభ నిర్వహించారు. ఈ సభకు సిక్స్ నేవల్ కమాండ్ అధికారి కెప్టెన్ వివేకానంద, కల్నల్ నీలేష్, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, శ్రీ ప్రకాష్ పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్‌ప్రకాష్, నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ వి.మునిరామయ్య ముఖ్యఅతిథలుగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. జాతీయ సమైక్యతను చాటేందుకు ఎన్సీసీ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నారు. క్యాంపు ఎన్సీసీ అధికారులు ఉప్పలపాటి మాచిరాజు ఆధ్వర్యంలో క్యాడెట్లు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం క్యాడెట్లకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ తాళ్లూరి వీరభద్రరావు, మాజీ ప్రిన్సిపాల్ ప్రభాకరరావు, ఎన్సీసీ అధికారులు కృష్ణారావు, సతీష్, సత్యనారాయణ, పిలిఫ్‌రాజు, వీవీవీ రమణమూర్తి, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. -
క్యాడెట్ బాలికల విజేత పలక్
స్టేట్ ర్యాంకింగ్ టీటీ టోర్నీ సాక్షి, హైదరాబాద్: స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పలక్ విజేతగా నిలిచింది. తెలంగాణ టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో స్టాగ్ అకాడమీ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన క్యాడెట్ బాలికల ఫైనల్లో పలక్ (జీఎస్ఎం) 11-7, 9-11, 11-4, 12-10తో హఫీఫా ఫాతిమా (డాన్‌బాస్కో)పై నెగ్గి టైటిల్‌ను కై వసం చేసుకుంది. మరోవైపు క్యాడెట్ బాలుర సెమీస్ మ్యాచ్‌ల్లో రాజు (ఏడబ్ల్యూఏ) 7-11, 11-3, 11-4, 9-11, 11-7తో త్రిశూల్ మెహ్రా (ఎల్బీఎస్)పై, రిత్విక్ (స్టాగ్ అకాడమీ) 11-2, 11-5, 11-2తో అథర్వ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల సెమీస్‌లో నైనా (ఎల్బీఎస్) 11-8, 4-11, 12-10, 8-11, 11-5, 11-6తో మోనిక (జీఎస్ఎం)పై, నిఖత్ బాను (జీఎస్ఎం) 11-8, 11-7, 11-4, 11-2తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించారు. అంతర్ జిల్లా మహిళల టీమ్ ఈవెంట్లో రంగారెడ్డి 3-1తో హైదరాబాద్‌పై నెగ్గి చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు సబ్ జూనియర్ బాలికల ప్రిక్వార్టర్స్: కీర్తన (హెచ్‌వీఎస్) 11-1, 11-6, 11-3తో చక్రిక రాజ్ (స్టాగ్ అకాడమీ)పై, నిఖిత (డాన్‌బాస్కో) 11-6, 11-4, 11-8తో దియా వోరా (హెచ్‌వీఎస్)పై, ప్రియాన్షి సింగ్ (జీఎస్ఎం) 7-11, 11-6, 11-7, 11-8తో అహ్మదీ నౌషీన్ (డాన్‌బాస్కో)పై, శరణ్య (జీఎస్ఎం) 11-3, 11-5, 13-11తో జ్యోత్స్న (నల్గొండ)పై, విధి జైన్ (జీఎస్ఎం) 11-4, 11-4, 11-7తో పూజ (ఏడబ్ల్యూఏ)పై, ఆయుషి (జీఎస్ఎం) 11-3, 11-5, 11-3తో కావ్య (ఏడబ్ల్యూఏ)పై, ఐశ్వర్య దాగ (ఏడబ్ల్యూఏ) 11-2, 11-2, 11-2తో అక్షర (స్టాగ్ అకాడమీ)పై, హఫీపా (డాన్‌బాస్కో) 11-9, 7-11, 11-9, 3-11, 11-9తో ప్రాచి (హెచ్‌వీఎస్)పై, తేజస్విని (నల్గొండ) 11-6, 11-5, 11-6తో నిఖిత (స్టాగ్ అకాడమీ)పై, శ్రీవల్లి రమ్య (స్టాగ్ అకాడమీ) 11-4, 11-9, 11-2తో అన్విత (హెచ్‌వీఎస్)పై, రుచిరా రెడ్డి (ఏడబ్ల్యూఏ) 11-8, 11-4, 11-4తో వైభవి (వైఎంసీఏ)పై గెలుపొందారు. మహిళల క్వార్టర్స్ ఫలితాలు: నిఖత్ బాను (జీఎస్ఎం) 11-4, 10-12, 11-6, 11-9, 4-11, 6-11, 11-6తో ప్రణీత (హెచ్‌వీఎస్)పై, లాస్య (ఏడబ్ల్యూఏ) 8-11, 11-9, 11-7, 12-10, 9-11, 11-7తో సస్య (ఏడబ్ల్యూఏ)పై, నైన (ఎల్బీఎస్) 11-7, 11-5, 6-11, 11-5, 12-10తో వరుణి జైశ్వాల్ (జీఎస్ఎం)పై, మోనిక (జీఎస్ఎం) 11-5, 14-12, 14-12, 11-6తో వినిచిత్ర (స్టాగ్ అకాడమీ)పై విజయం సాధించారు. -
‘తల్ సైనిక్’లో వెల్డన్
రాష్ట్రస్థాయిలో నాల్గవ స్థానం సాధించిన వేళంగి విద్యార్థి ఏడు క్యాంపుల్లో 70 రోజులపాటు శిక్షణ వేళంగి(కరప): కరప మండలం వేళంగిలోని మెర్లాస్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఎన్సీసీ క్యాడెట్ శీలం వీరవెంకటసత్యనారాయణ జూనియర్ డివిజన్ ఫైరింగ్ విభాగంలో ప్రతిభ కనబరచడంతో తల్ సైనిక్–2016కు ఎంపికై ఏడు క్యాంపుల్లో శిక్షణ పొంది తిరిగి వచ్చాడు. గతనెలలో ఢిల్లీలో జరిగిన చివరి క్యాంపులో రాష్ట్రస్థాయిలో నాల్గవ స్థానం పొందినట్టు హెచ్ఎం బి.వెంకటశివప్రసాద్, ఎన్సీసీ ఉపాధ్యాయుడు వెలుగుబంట్ల వీరవెంకట రమణమూర్తి తెలిపారు. తల్ సైనిక్కు ఎంపిక ఇలా కృష్ణాజిల్లా నూజివీడులో 40 రోజులపాటు మూడుచోట్ల జరిగిన ఫైరింగ్ క్యాంప్‌లో ప్రతిభ కనబరచడంతో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థి వీరవెంకటసత్యనారాయణ ఒక్కడే. అక్కడ నుంచి సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో నాలుగు క్యాంప్‌లు జరిగాయి. నిజామాబాద్ క్యాంప్ ఫైనల్లో ప్రతిభ కనబరచడంతో ఢిల్లీ క్యాంప్‌కు ఎంపికయ్యాడు. ఢిల్లీలోని ఎన్సీసీ హెడ్‌క్వార్టర్‌లో గతనెల 19 నుంచి 30వ తేదీ వరకు 12 రోజులు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో మ్యాప్‌రీడింగ్, ఆయుధాలపై ఇచ్చిన శిక్షణలో 19వ ఆంధ్రా బెటాలియన్ నుంచి జూనియర్ విభాగంలో వెళ్లిన సత్యనారాయణ నాల్గవ స్థానంలో నిలిచాడు. ఈ శిక్షణ భవిష్యత్‌లో ఉపయోగపడుతుందని, రిజర్వేషన్ కోటా కూడా వర్తిస్తుందని ఎన్సీసీ ఉపాధ్యాయుడు తెలిపారు. పాఠశాల స్థాయిలో ఫైరింగ్‌లో శిక్షణ ఇచ్చినప్పుడు ఏకాగ్రతతో నేర్చుకునేవాడని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఎన్సీసీ ఉపాధ్యాయుడిని, శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన ఎన్సీసీ క్యాడెట్ సత్యనారాయణను పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మెర్ల వీరయ్యచౌదరి, సర్పంచ్ కె.చంద్రకుమారి, హెచ్ఎం బి.వెంకటశివప్రసాద్ అభినందించారు. ఎన్సీసీ మాస్టారు ప్రోత్సాహం మరువలేనిది తల్ సైనిక్కు ఎంపికై, ఢిల్లీ స్థాయిలో శిక్షణ పొందడానికి కారకులైన ఎ¯ŒSసీసీ మాస్టారు వీవీవీ రమణమూర్తి, హెచ్ఎం బి.వెంకటశివప్రసాద్ల ప్రోత్సాహం మరువలేనిదని శిక్షణ నుంచి తిరిగి వచ్చిన శీలం వీరవెంకటసత్యనారాయణ తెలిపాడు. చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎ¯ŒSసీసీ మాస్టారు ఎయిర్ రైఫిల్ కొనిచ్చి, శిక్షణ ఇచ్చారని, అదే తనను ఢిల్లీ వరకు తీసుకెళ్లిందన్నాడు.ఆర్మీలో మంచిపోస్టు సాధించాలన్నది లక్ష్యమని శిక్షణలో నాల్గవ స్థానంలో నిలిచిన ఎ¯ŒSసీసీ విద్యార్థి శీలం వీరవెంకట సత్యనారాయణ తెలిపారు.ఎ¯ŒSసీసీ ఉపాధ్యాయుడు వెలుగుబంట్ల రమణమూర్తి ఇస్తున్న శిక్షణతోనే మెళుకువలు నేర్చుకుని, ఫైరింగ్‌లో తల్ సైనిక్–2016కు ఎంపికై ఈ ఘనత సాధించానన్నాడు. -
క్యాడెట్ టీటీ విజేతలు విష్ణు, కాజల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో జీటీటీఏకు చెందిన మినీ క్యాడెట్, క్యాడెట్ బాలుర విభాగంలో కేశవ్ ఖన్నా, బి.విష్ణు సత్తా చాటారు. ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈపోటీల్లో రెండో రోజు శనివారం అండర్-12 క్యాడెట్ బాలుర సింగిల్స్ ఫైనల్లో బి.విష్ణు 11-8,11-8,11-8 స్కోరుతో అద్వైత్(ఆనంద్ నగర్)పై ఘన విజయం సాధించాడు. క్యాడెట్ బాలికల సింగిల్స్ ఫైనల్లో కాజల్(విజయవాడ) 11-6,3-11,8-11,11-6,11-8తో ఆయుషి( జీఎస్ఎం)పై గెలిచింది. అండర్-10 మినీ క్యాడెట్ బాలుర సింగిల్స్ టైటిల్‌ను కేశవ్ ఖన్నా గెలిచాడు. ఫైనల్లో కేశవ్ 11-9,11-3,11-7 స్కోరుతో కార్తీక్(ఆవా)పై గెలిచాడు. బాలికల సింగిల్స్ ఫైనల్లో రుచిరారెడ్డి(ఎస్‌పీటీటీఏ) 13-11,13-11,13-11తో ఆదిలక్ష్మీ(విజయవాడ)పై గెలిచింది.