క్యాడెట్ బాలికల విజేత పలక్ | cadet womens champion palak | Sakshi
Sakshi News home page

క్యాడెట్ బాలికల విజేత పలక్

Published Mon, Nov 21 2016 10:29 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

cadet womens champion palak

స్టేట్ ర్యాంకింగ్ టీటీ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్: స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పలక్ విజేతగా నిలిచింది. తెలంగాణ టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో స్టాగ్ అకాడమీ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన క్యాడెట్ బాలికల ఫైనల్లో పలక్ (జీఎస్‌ఎం) 11-7, 9-11, 11-4, 12-10తో హఫీఫా ఫాతిమా (డాన్‌బాస్కో)పై నెగ్గి టైటిల్‌ను కై వసం చేసుకుంది. మరోవైపు క్యాడెట్ బాలుర సెమీస్ మ్యాచ్‌ల్లో రాజు (ఏడబ్ల్యూఏ) 7-11, 11-3, 11-4, 9-11, 11-7తో త్రిశూల్ మెహ్రా (ఎల్‌బీఎస్)పై, రిత్విక్ (స్టాగ్ అకాడమీ) 11-2, 11-5, 11-2తో అథర్వ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల సెమీస్‌లో నైనా (ఎల్‌బీఎస్) 11-8, 4-11, 12-10, 8-11, 11-5, 11-6తో మోనిక (జీఎస్‌ఎం)పై, నిఖత్ బాను (జీఎస్‌ఎం) 11-8, 11-7, 11-4, 11-2తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించారు. అంతర్ జిల్లా మహిళల టీమ్ ఈవెంట్‌లో రంగారెడ్డి 3-1తో హైదరాబాద్‌పై నెగ్గి చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది.   

 ఇతర మ్యాచ్‌ల ఫలితాలు


 సబ్ జూనియర్ బాలికల ప్రిక్వార్టర్స్: కీర్తన (హెచ్‌వీఎస్) 11-1, 11-6, 11-3తో చక్రిక రాజ్ (స్టాగ్ అకాడమీ)పై, నిఖిత (డాన్‌బాస్కో) 11-6, 11-4, 11-8తో దియా వోరా (హెచ్‌వీఎస్)పై, ప్రియాన్షి సింగ్ (జీఎస్‌ఎం) 7-11, 11-6, 11-7, 11-8తో అహ్మదీ నౌషీన్ (డాన్‌బాస్కో)పై, శరణ్య (జీఎస్‌ఎం) 11-3, 11-5, 13-11తో జ్యోత్స్న (నల్గొండ)పై, విధి జైన్ (జీఎస్‌ఎం) 11-4, 11-4, 11-7తో పూజ (ఏడబ్ల్యూఏ)పై, ఆయుషి (జీఎస్‌ఎం) 11-3, 11-5, 11-3తో కావ్య (ఏడబ్ల్యూఏ)పై, ఐశ్వర్య దాగ (ఏడబ్ల్యూఏ) 11-2, 11-2, 11-2తో అక్షర (స్టాగ్ అకాడమీ)పై, హఫీపా (డాన్‌బాస్కో) 11-9, 7-11, 11-9, 3-11, 11-9తో ప్రాచి (హెచ్‌వీఎస్)పై, తేజస్విని (నల్గొండ) 11-6, 11-5, 11-6తో నిఖిత (స్టాగ్ అకాడమీ)పై, శ్రీవల్లి రమ్య (స్టాగ్ అకాడమీ) 11-4, 11-9, 11-2తో అన్విత (హెచ్‌వీఎస్)పై, రుచిరా రెడ్డి (ఏడబ్ల్యూఏ) 11-8, 11-4, 11-4తో వైభవి (వైఎంసీఏ)పై గెలుపొందారు.


 మహిళల క్వార్టర్స్ ఫలితాలు: నిఖత్ బాను (జీఎస్‌ఎం) 11-4, 10-12, 11-6, 11-9, 4-11, 6-11, 11-6తో ప్రణీత (హెచ్‌వీఎస్)పై, లాస్య (ఏడబ్ల్యూఏ) 8-11, 11-9, 11-7, 12-10, 9-11, 11-7తో సస్య (ఏడబ్ల్యూఏ)పై, నైన (ఎల్‌బీఎస్) 11-7, 11-5, 6-11, 11-5, 12-10తో వరుణి జైశ్వాల్ (జీఎస్‌ఎం)పై, మోనిక (జీఎస్‌ఎం) 11-5, 14-12, 14-12, 11-6తో వినిచిత్ర (స్టాగ్ అకాడమీ)పై విజయం సాధించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement