క్యాడెట్ టీటీ విజేతలు విష్ణు, కాజల్
క్యాడెట్ టీటీ విజేతలు విష్ణు, కాజల్
Published Sun, Aug 18 2013 12:16 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జీటీటీఏకు చెందిన మినీ క్యాడెట్, క్యాడెట్ బాలుర విభాగంలో కేశవ్ ఖన్నా, బి.విష్ణు సత్తా చాటారు. ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈపోటీల్లో రెండో రోజు శనివారం అండర్-12 క్యాడెట్ బాలుర సింగిల్స్ ఫైనల్లో బి.విష్ణు 11-8,11-8,11-8 స్కోరుతో అద్వైత్(ఆనంద్ నగర్)పై ఘన విజయం సాధించాడు.
క్యాడెట్ బాలికల సింగిల్స్ ఫైనల్లో కాజల్(విజయవాడ) 11-6,3-11,8-11,11-6,11-8తో ఆయుషి( జీఎస్‌ఎం)పై గెలిచింది. అండర్-10 మినీ క్యాడెట్ బాలుర సింగిల్స్ టైటిల్‌ను కేశవ్ ఖన్నా గెలిచాడు. ఫైనల్లో కేశవ్ 11-9,11-3,11-7 స్కోరుతో కార్తీక్(ఆవా)పై గెలిచాడు. బాలికల సింగిల్స్ ఫైనల్లో రుచిరారెడ్డి(ఎస్‌పీటీటీఏ) 13-11,13-11,13-11తో ఆదిలక్ష్మీ(విజయవాడ)పై గెలిచింది.
Advertisement
Advertisement