under-12
-
World Cadets Chess Championship: శుభి, చార్వీలకు స్వర్ణాలు
బాతూమి (జార్జియా): ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో అండర్–12 బాలికల విభాగంలో శుభి గుప్తా... అండర్–8 బాలికల విభాగంలో చార్వీ విజేతలుగా నిలిచారు. ఘాజియాబాద్‌కు చెందిన శుభి గుప్తా నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 8.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించింది. బెంగళూరుకు చెందిన చార్వీ నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. సంహిత పుంగవనం 7.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. అండర్–8 ఓపెన్ కేటగిరీలో సఫిన్ సఫరుల్లాఖాన్ కాంస్య పతకం గెలిచాడు. కేరళకు చెందిన సఫిన్ తొమ్మిది పాయింట్లు స్కోరు చేశాడు. -
5న అండర్–12 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–12 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక ఈ నెల 5న అనంత క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. సెప్టెంబర్ 1, 2004 తరువాత పుట్టిన వారు, 7వ తరగతి లోపు చదువుతున్న వారు మాత్రమే అర్హులన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 10 నుంచి 15 వరకు వైఎస్సార్ కడప జిల్లాలో కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం క్రీడా మైదానంలో జరిగే ఆంధ్ర సౌత్‌జోన్ అండర్–12 బాలుర అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీ(ఫ్యూచర్ కప్)లో పాల్గొంటుందన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఒరిజినల్ కులధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలన్నారు. మ్యాచుల వివరాలు 10–02–2017 వైఎస్సార్ కడప -అనంతపురం 10–02–2017 నెల్లూరు - కర్నూలు 11–02–2017 వైఎస్సార్ కడప -నెల్లూరు 11–02–2017 చిత్తూరు - వైఎస్సార్ కడప 12–02–2017 కర్నూలు - అనంతపురం 12–02–2017 వైఎస్సార్ కడప - చిత్తూరు 13–02–2017 ================= 14–02–2017 కర్నూలు - చిత్తూరు 14–02–2017 అనంతపురం - నెల్లూరు 15–02–2017 నెల్లూరు -చిత్తూరు 15–02–2017 వైఎస్సార్ కడప - కర్నూలు -
ఆసియా ర్యాపిడ్ చాంప్ ప్రియాంక
సాక్షి, హైదరాబాద్: ఆసియా ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి నూతక్కి ప్రియాంక అండర్-12 విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఈ పోటీల్లో ప్రియాంక ఏడు రౌండ్లకుగాను ఆరున్నర పాయింట్లు సంపాదించింది. ఇక బ్లిట్జ్ విభాగంలో ఈ విజయవాడ అమ్మాయి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఏడు రౌండ్లకుగాను ఆమె ఐదున్నర పాయింట్లు సాధించింది. -
క్యాడెట్ టీటీ విజేతలు విష్ణు, కాజల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో జీటీటీఏకు చెందిన మినీ క్యాడెట్, క్యాడెట్ బాలుర విభాగంలో కేశవ్ ఖన్నా, బి.విష్ణు సత్తా చాటారు. ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈపోటీల్లో రెండో రోజు శనివారం అండర్-12 క్యాడెట్ బాలుర సింగిల్స్ ఫైనల్లో బి.విష్ణు 11-8,11-8,11-8 స్కోరుతో అద్వైత్(ఆనంద్ నగర్)పై ఘన విజయం సాధించాడు. క్యాడెట్ బాలికల సింగిల్స్ ఫైనల్లో కాజల్(విజయవాడ) 11-6,3-11,8-11,11-6,11-8తో ఆయుషి( జీఎస్ఎం)పై గెలిచింది. అండర్-10 మినీ క్యాడెట్ బాలుర సింగిల్స్ టైటిల్‌ను కేశవ్ ఖన్నా గెలిచాడు. ఫైనల్లో కేశవ్ 11-9,11-3,11-7 స్కోరుతో కార్తీక్(ఆవా)పై గెలిచాడు. బాలికల సింగిల్స్ ఫైనల్లో రుచిరారెడ్డి(ఎస్‌పీటీటీఏ) 13-11,13-11,13-11తో ఆదిలక్ష్మీ(విజయవాడ)పై గెలిచింది.