vishnu
-
తండ్రీకొడుకులను కబళించిన లారీ
దుబ్బాక : ఒడి బియ్యం పోసుకునేందుకు సంతోషంగా అత్తగారింటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని లారీ రూపంలో మృత్యువు కబలించింది. ఇద్దరు కుమారులతో కలిసి తండ్రి స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, పెద్ద కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన శనివారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీరాం ప్రేమ్‌దీప్ కథనం మేరకు.. దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్‌కు చెందిన చిట్యాల వేణు(41) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం వేణు ఇద్దరు కుమారులు శివ (15), విష్ణును స్కూటీపై ఎక్కించుకొని ఒడి బియ్యం పోసుకునేందుకు అత్తగారి గ్రామమైన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధరిపల్లికి బయలుదేరాడు. దౌల్తాబాద్ మండలంలోని చెట్టనర్సంపల్లి బైపాస్ రోడ్డు వద్దకు రాగానే గజ్వేల్ వైపు నుంచి అతి వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి వేణు, పెద్ద కుమారుడు శివ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్న కుమారుడు విష్ణు గాయాలతో బయటపడ్డాడు. తండ్రీకొడుకుల మృతదేహాలు రోడ్డుపై గుర్తు పట్టరాకుండా పడిపోయాయి. మృతుడు శివ తిర్మలాపూర్ జెడ్పీహెచ్ఎస్లో పదవ తరగతి చదువుతున్నాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ ముత్యంరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. -
కాంగ్రెస్‌ను చంపేస్తారా?.. ఏఐసీసీ కార్యదర్శిపై జగ్గారెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇన్ఛార్జ్లు పార్టీని చంపేయాలని చూస్తున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి ఓ ఫంక్షన్లో ఏఐసీసీ కార్యదర్శిపై ఆయన మాటల దాడి చేశారు. ఇంతకీ మీరు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా..? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా..? అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.మెదక్ జిల్లా కూడా నేనే చూస్తున్నానంటూ విష్ణు చెప్పగా, పార్టీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీ కూడా ఉన్నారా.. వేరే రాష్ట్రం పోయారా..?. అధికార పార్టీ అంటే ఎలా ఉండాలి? మీరేం చేస్తున్నారో అర్థం అవుతుందా? అంటూ జగ్గారెడ్డి నిలదీశారు. కొత్త వాళ్లకు పదవులు సిఫార్సు చేస్తున్నారు. వారు ఫైనల్ అయ్యే వరకు కూడా మాకు తెలియడం లేదంటూ కార్యదర్శికి జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: లగచర్ల రైతుకు సంకెళ్లు.. సీఎం రేవంత్ సీరియస్ -
పోలీసుల నోటీసులతో విచారణకు హాజరైన మంచు మనోజ్
-
మా బిల్డింగ్ గురించి రెండు నెలల్లో ప్రకటిస్తాం: మంచు విష్ణు
‘‘మేం ఏం అనుకుని వచ్చామో ఆ పనులన్నీ పూర్తి చేశాం. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) బిల్డింగ్ ఒక్కటే బాకీ ఉంది. ఈ అంశంపై కూడా రాబోయే రెండు నెలల్లో ఓ అద్భుతమైన ప్రకటన చేయబోతున్నాం’’ అని ‘మా’అధ్యక్షుడు విష్ణు మంచు అన్నారు. జీవీకే హెల్త్ హబ్ అసోసియేషన్‌తో ‘మా’ ఆధ్వర్యంలో సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అధ్యక్షుడు మంచు విష్ణు, ఉపాధ్యక్షుడు మాదాల రవి ఈ హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.ఈ హెల్త్ క్యాంప్‌లో ‘మా’ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘జీవీకే హెల్త్ హబ్ యాజమాన్యానికి, డాక్టర్ శాస్త్రిగారితో పాటు టీమ్ అందరికీ ధన్యవాదాలు. ‘మా’ సభ్యులందరికీ ఉచితంగా హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు’’ అని అన్నారు. ‘‘ఆదివారం వరల్డ్ హార్ట్ డే. ఆర్టిస్టులు ఎంతో ఒత్తిడితో ఉంటారు. అందుకే వీరి కోసం మాస్టర్ చెకప్ చేశాం’’ అన్నారు డా. శాస్త్రి. ‘మా’లోని సభ్యుల్లో దాదాపు నాలుగు వందల మంది ఈ హెల్త్ క్యాంప్‌లో పాల్గొని, చెకప్ చేయించుకున్నారని సమాచారం. -
ఆరంభం అదిరిపోవాలి
‘‘ఆరంభం’ మూవీలోని ఓ పాటని నేను రిలీజ్ చేశాను. అప్పుడు ఈ సినిమా టీజర్ కూడా చూశానుపాట, టీజర్ బాగున్నాయి. నా ఫ్రెండ్ ధీరజ్ మొగిలినేని ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ‘ఆరంభం’ అదిరిపోవాలి. మంచి కథ కుదిరితే ఈ టీమ్‌తో సినిమా చేయాలనిపిస్తోంది’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. మోహన్ భగత్, సుప్రితా సత్యనారాయణ్ జంటగా నటించిన సినిమా ‘ఆరంభం’. అజయ్ నాగ్ వి. దర్శకత్వంలో అభిషేక్ వీటీ నిర్మించిన ఈ మూవీ నేడు రిలీజ్ అవుతోంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిషేక్ వీటీ మాట్లాడుతూ– ‘‘సరికొత్త కథతో రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ‘‘మా మూవీ ఎలా ఉంటుందనే ప్రశ్నలకు ట్రైలర్‌తో సమాధానం దొరికిందని భావిస్తున్నాను’’ అన్నారు అజయ్ నాగ్. ‘‘మా అమ్మ ఇటీవలే దూరమయ్యారు. ఆమె ఓ శక్తిలా నన్ను ముందుకు నడిపిస్తోందని భావిస్తున్నాను’’ అన్నారు మోహన్ భగత్. -
చంద్రబాబుపై ఈసీకి ఎమ్మెల్యే విష్ణు ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ సోషల్ మీడియాపై ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు ఎక్కడా ఎన్నికల నియమావళిని పాటించడం లేదని చెప్పారు. ముఖ్యంగా బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రవర్తన జుగుప్సాకరమన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి బచ్చా అనడం, విషం చిమ్ముతున్నారంటూ మాట్లాడటం బాబు అనైతికతకు అద్దం పడుతోందని తెలిపారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఓటర్లలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిని వివరించి, తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు. సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారమే చేయడం చంద్రబాబు ఏకైక అజెండా అని, ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఆయనకు లేదని అన్నారు. ఎంతకాలం వైఎస్సార్సీపీపై బురదచల్లుతారని నిప్పులు చెరిగారు. కోర్టు పరిధిలో ఉన్న వివేకానందరెడ్డి కేసు గురించి చంద్రబాబు, లోకేశ్, షరి్మల, సునీత పదేపదే మాట్లాడుతున్నారని, పైగా హంతకుడంటూ వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఏ విధంగా విమర్శిస్తారని ప్రశ్నించారు. పింఛన్‌దారుల మృతిపైనా టీడీపీ వెబ్సైట్లలో ఏ విధంగా పోస్టులు పెడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. శవ రాజకీయాలను మానుకోవాలని సూచించారు. రాయలసీమలో పర్యటిస్తున్న సీఎం జగన్ ఓ పేద ముస్లిం సోదరుడి సమస్యను పరిష్కరిస్తే, వాహనం ఆపలేదని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం దిగజారుడుతనం కాదా అని ప్రశ్నించారు. మైనారీ్టలను కేబినెట్లో పక్కన కూర్చోబెట్టుకోలేని అసమర్థ నేత చంద్రబాబుకు మైనారీ్టల గూరించి మాట్లాడే అర్హత ఉందో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. టీటీడీపైనా రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. కలియుగ దైవం జోలికి వస్తే ఈసారి టీడీపీ పూర్తిగా భూస్థాపితం కావడం ఖాయమని చెప్పారు. కూటమి నేతలు కులాలు, మతాల ప్రస్తావన మానుకోవాలని సూచించారు. పవన్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి గుర్తింపు లేని జనసేనకు అధినేత, పోటీ చేసిన రెండు చోట్లా ఘోర పరాజయం పాలైన పవన్.. 151 స్థానాలతో అధికారంలోకి వచి్చన సీఎం జగన్‌ని దుర్భాషలాడతారా అంటూ విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన స్కాం స్టార్లు ఎవరో జనసేన నేతలే బయటకు వచ్చి చెబుతున్నారన్నారు. జనసేన అధినేత తన మాటలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఓట్లు నివాసాలలో ఉండాలనే నిబంధనకు విరుద్ధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ఓ కార్యాలయంలో ఓట్లు నమోదు చేసి ఉంచడాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మలసాని మనోహర్ రెడ్డి, నాగ నారాయణమూర్తి, శ్రీనివాసరెడ్డి, ఒగ్గు గవాస్కర్, కొండపల్లి బుజ్జి పాల్గొన్నారు. -
‘కృష్ణ’లో బాలరాముని పోలిన శ్రీమహావిష్ణువు!
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని ఒక గ్రామంలో కృష్ణా నదిలో శ్రీమహావిష్ణువు పురాతన విగ్రహం బయల్పడింది. విగ్రహం చుట్టూ దశావతారాలన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ విగ్రహంతో పాటు పురాతన శివలింగం కూడా బయల్పడింది. అయితే నదిలో బయట్పడిన ఈ శ్రీమహావిష్ణువు విగ్రహం ఇటీవల అయోధ్యలోని నూతన రామాలయంలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహాన్ని పోలివుండటం గమనార్హం. ఈ శ్రీ మహావిష్ణువు విగ్రహం గురించి రాయచూర్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు అధ్యాపకురాలు డాక్టర్ పద్మజా దేశాయ్ మాట్లాడుతూ కృష్ణానది పరీవాహక ప్రాంతంలో లభించిన ఈ విష్ణుమూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఈ విష్ణువు విగ్రహం చుట్టూ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి తదితర దశావతారాలు అందంగా మలిచారు. ఈ శ్రీమహా విష్ణువు విగ్రహ విశిష్టతల విషయానికొస్తే విష్ణుమూర్తి నిలువెత్తు భంగిమలో నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. అతని పైరెండు చేతులలో శంఖుచక్రాలు ఉండగా, దిగువ చేతులు (‘కటి హస్త’, ‘వరద హస్త’) ఆశీర్వాదాలను అందిస్తున్నట్లు ఉన్నాయి. ఈ విగ్రహం వేంకటేశ్వరుని కూడా పోలి ఉంది. అయితే ఈ విగ్రహంలో గరుడుడు లేడు. సాధారణంగా శ్రీమహా విష్ణువు విగ్రహాలలో గరుడుడు కనిపిస్తాడు. విష్ణువు అలంకార ప్రియుడు కావడంతో ఈ మందహాసధర విష్ణుమూర్తి విగ్రహంపై పూమాలలు కూడా కనిపిస్తాయి. -
ముక్కోటి ఏకాదశిన ఉత్తర ద్వార దర్శనమే మేలు.... ఎందుకు?
ప్రతినెలలోనూ ఏకాదశి ఉంటుంది కానీ... ఏడాదికి ఓ సారి వచ్చే వైకుంఠ ఏకాదశి మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకలా? ఈ ఏకాదశికే ప్రత్యేకంగా అన్ని పేర్లు ఎలా వచ్చాయి?. పైగా ఆరోజు ఉత్తరద్వారా దర్శనం చేసుకోవాలని అంటారు ఎందుకు?. ఆఖరికి భగవద్గీత పుట్టింది కూడా ఈ పర్వదినమే అని చెబుతుంటారు ఎందుకని? సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి లేదా మార్గశిర శుక్లపక్షంలో వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరం. అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహంతో రాక్షస పీడ నుంచి విముక్తులు అయ్యారు. ఏకాదశి తిధినాడు దేవతలందరూ ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశి అని అంటారు. దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రసాదించడం వల్ల ఈ రోజుని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే.. డిసెంబరు 22 శుక్రవారం ఉదయం 9 గంటల 39 నిమిషాల తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. 23 శనివారం ఉదయం 7 గంటల 56 నిముషాలకు పూర్తవుతుంది. అయితే.. సూర్యోదయ సమయంలో ఏకాదశి తిథి ఉన్నరోజునే లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి.. ఇవాళ(డిసెంబర్ 23వ తేదీన) ముక్కోటి ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు. ఆ రోజున తెల్లవారుజామునే ఏకాదశి ఘడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మంచిదని పండితుల వచనం. ఉత్తర ద్వారా దర్శనం ఎందుకంటే.. వికుంఠ అనే స్త్రీ నుండి అవతరించినందుకు శ్రీ మహావిష్ణువును వైకుంఠుడు అని పిలుస్తారు. ఉత్తర దిక్కున కుభేర స్వరూపంగా ఉండే అధిపతే శ్రీమహావిష్ణువు. విష్ణువు జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు. కాబట్టి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీమహావిష్ణువును దర్శించడం అంటే ఇంద్రియాలను అణచుకొని బ్రహ్మజ్ఞ్యానమును పొందుట అని అర్ధం. అందుచేత విశేషించి ఈ రోజున భక్తులందరూ వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా చేసే ప్రదక్షిణను ముక్కోటి ప్రదక్షిణ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. పూజా విధానం.. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి, మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫొటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరంమైన వారికి ఆహారం అందించాలి. ఈ రోజే గీతా జయంతి కూడా.. మార్గశిర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి నాడే గీతా జయంతి కూడా జరుపుకుంటాం. మహాభారతంలోని శ్రీ కృష్ణుడు అర్జునునికి భగవద్గీతను మార్గశిర శుక్ల ఏకాదశి తిథి నాడే భోదించాడు. ఈ రోజున ప్రముఖ దేవాలయాలన్నింటిలో భతవద్గీతను పఠిస్తారు. ఈ రోజు భక్తులు విశేషంగా గీతను, విష్ణువుని పూజిస్తారు.గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం. గీకారం త్యాగరూపం స్యాత్ తకారమ్ తత్వబోధకమ్ గీతా వాక్య మిదమ్ తత్వం జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి: గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. "గీ" అనే అక్షరం త్యాగాన్ని ను బోధించుచున్నది. "త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది. అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధం నుంచి విముక్తి కలగటం అనే అర్థం కూడా వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం ప్రారంభించండి. (చదవండి: భగవద్గీత: విజయవంతమైన జీవనానికి దివ్యౌషధం) -
విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్ ధర వింటే షాకవ్వుతారు!
మెరిసే కళ్ళు, సొట్ట బుగ్గలతో ముద్దొస్తున్న ఈ క్యూట్ గర్ల్ పేరు ఐరా! మంచు విష్ణు, విరానికాల చిన్న కూతురు. ఐరా.. బుజ్జి మోడల్‌గా .. అమ్మ విరానికా స్టార్ట్ చేసిన ఫ్యాషన్ బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తోంది. ఆ ఫ్యాషన్ బ్రాండ్ గురించి కొన్ని విషయాలు..అమ్మ విరానికా .. ఐరాను ప్రేమగా ‘చిన్న పుప్పిటా’ అని పిలిచుకుంటే .. నాన్న విష్ణు ‘బిగ్గెస్ట్ బ్లాక్‌మెయిలర్’ అంటూ ముద్దు చేస్తాడట. ఇల్లు.. పిల్లలు.. వ్యాపారం.. ఈ మల్టీటాస్క్ని తనకు ఫింగర్ టిప్‌తో సమానమని నిరూపిస్తోంది విరానికా మంచు. న్యూయార్క్‌లో పుట్టి, పెరిగిన ఆమె.. జెమాలజీ, జ్యూలరీ డిజైన్, ఫ్యాషన్ మార్కెటింగ్‌లో డిగ్రీ చేసింది. సినీ హీరో మంచు విష్ణుని పెళ్లి చేసుకున్నాక ఇండియా వచ్చేసింది. ఇంట్లో వాళ్లకి కావలసిన డ్రెస్‌లు, నగలను తనే డిజైన్ చేస్తుంది. ‘విరానికా’ అని తన పేరు మీదే ఒక బొటిక్నీ నడుపుతోంది. అయితే అమ్మ విరానికా కల మాత్రం లండన్‌లో ఫ్యాషన్ స్టోర్ పెట్టాలనే! దాని కోసం వర్క్ చేసింది.. చివరకు సాధించింది. తాజాగా చిన్న పిల్లల కోసం ‘మేసన్ అవా’ అనే బ్రాండ్‌ని క్రియేట్ చేసింది. దాని స్టోర్‌ని.. వరల్డ్ ఫేమస్ లగ్జరీ డిపార్మెంట్ స్టోర్ అయిన హారోడ్స్ (లండన్)లో ఓపెన్ చేసింది. ఇక్కడ 2–14 సంవత్సరాల పిల్లల కోసం సరికొత్త డిజైన్స్‌లో అన్ని రకాల దుస్తులు ఉంటాయి. చాలా వరకు హ్యాండ్ మేడ్ డ్రెసెసే ఉంటాయి. ఈ బ్రాండ్‌కి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు డిమాండ్ ఉంది. ఈ బ్రాండ్ డిజైన్ చేసిన గౌనును 2021లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ల కూతురు ఆరాధ్య బచ్చన్.. తన పుట్టినరోజు నాడు వేసుకుంది. అమెరికన్ మోడల్ ప్యారిస్ హిల్టన్ సైతం ‘మేసన్ అవా’ డ్రెస్ వేసుకుంది. ధరలు హై రేంజ్‌లోనే ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక విరానిక కూతురు ఐరా ధరించిన మేసన్ అవా డ్రస్ ధర ఏకంగా డ్రెస్ రూ. 99,520/- (చదవండి: దీపాలతోనే కాదు..సంప్రదాయ దుస్తులతో కూడా కాంతిని నింపొచ్చు!) -
టీటీడీ బస్సు చోరీ కేసు నిందితుడి అరెస్ట్
తిరుమల/తిరుపతి లీగల్ : టీటీడీ ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సు చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు నేరవిభాగం ఏఎస్పీ విమలకుమారి తెలిపారు. మంగళవారం స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్ మండలం అనంజపూర్ గ్రామంలోని నీలావర్ గణపతి కుమారుడు నీలావర్ విష్ణు (20) గతనెల 24వ తేదీన తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చాడు. టీటీడీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం దగ్గర ఉంచిన రూ.1.44 కోట్ల విలువైన టీటీడీ ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సును చోరీ చేసి తీసుకెళ్లాడు. నిందితుడు అదేరోజు పోలీసులకు భయపడి నాయుడుపేట చెన్నై రహదారిపై బస్సును వదిలి పారిపోయాడు. అతని కోసం పోలీసులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో గాలించి సోమవారం సాయంత్రం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో అరెస్టయిన నిలావర్ విష్ణు తల్లిదండ్రులు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వలసి వచ్చి జీవిస్తున్నారు. 2015లో విష్ణు తండ్రి భార్యను హత్యచేసి జైలుకు వెళ్లాడు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసులకు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి రివార్డులను ప్రకటించగా.. ఏఎస్పీ వారికి అందజేశారు.ఇదిలా ఉండగా నిందితుడు నీలావర్ విష్ణుకు ఈనెల 17వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. -
నారదుడు విష్ణుమూర్తిని ఎందుకు శపించాడు?స్వయంవరంలో ఏం జరిగింది?
నారదుడు ఒకసారి హిమాలయాలకు చేరుకుని తపస్సు ప్రారంభించాడు. ఏళ్ల తరబడి నారదుడి ఘోరతపస్సు కొనసాగుతుండటంతో ఇంద్రుడికి భయంవేసి, నారదుడి తపస్సును ఎలాగైనా భంగం చేయాలనే ఆలోచనతో రంభ మేనక ఊర్వశి తదితర అప్సరసలందరినీ పంపాడు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నారదుడి తపస్సును భంగపరచలేకపోయారు. కొన్నాళ్లు తపస్సు చేశాక, తన తపస్సు సిద్ధి పొందినట్లు అనిపించి, తపస్సును విరమించుకున్నాడు నారదుడు. బ్రహ్మ వద్దకు వెళ్లి, తన తపస్సు సిద్ధించిందని చెప్పి, అక్కడి నుంచి కైలాసానికి వెళ్లాడు. పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ‘నా తపస్సు సిద్ధించింది. ఇక శివమాయ నన్నేమీ చేయలేదు’ అన్నాడు. ‘నాయనా! శివమాయను నేనే ఇంకా తెలుసుకోలేదు. కాస్త జాగ్రత్తగా ఉండు’ అని హెచ్చరించాడు శివుడు.శివుడి హెచ్చరికను లక్ష్యపెట్టకుండా, నారదుడు వైకుంఠానికి వెళ్లాడు. లక్ష్మీ సమేతుడైన విష్ణువుకు నమస్కరించి, ‘లక్ష్మీ జనార్దనులారా! నేను తపస్సిద్ధి పొందాను. నన్ను శివమాయ, విష్ణుమాయ ఏమీ చేయలేవు’ అన్నాడు.‘నారదా! మాయ ప్రకృతి నుంచి పుట్టింది. అది శివకేశవులను ఆశ్రయించి తిరుగుతూ ఉంది. దానిని జయించడం ఎవరి వల్లా కాదు’ అని హెచ్చరించాడు విష్ణువు. నారదుడు విష్ణువు వద్ద సెలవు తీసుకుని, లోకసంచారానికి బయలుదేరాడు. కళ్యాణదుర్గం అనే నగరానికి చేరుకున్నాడు. నగరంలో ఏదో వేడుక జరుగుతున్నట్లుగా కోలాహలంగా ఉంది. ‘ఏమిటి విశేషం? ఈ సందడంతా దేనికి?’ అని తనకు తారసపడిన పురప్రజలను అడిగాడు నారదుడు. ‘రేపే మహారాజు కుమార్తె స్వయంవరం. అందుకే ఈ సందడి’ చెప్పారు వాళ్లు. నారదుడు నేరుగా రాజప్రాసాదానికి వెళ్లాడు. రాజు ఎదురేగి, నారదుడిని స్వాగత సత్కారాలు జరిపి, ఉన్నతాసనంపై ఆసీనుణ్ణి చేశాడు. పరిచారికలను పంపి, తన కుమార్తెను పిలిపించాడు. ఆమె చేత నారదుడికి నమస్కారం చేయించాడు. ‘మహర్షీ! ఈమె నా కుమార్తె రమాలక్ష్మి. రేపు ఈమెకు స్వయంవరం నిశ్చయించాను. మహావిష్ణువును తప్ప మరెవరినీ వరించనంటోంది’ అని చెప్పాడు. రాకుమార్తెను చూడగానే, నారదుడికి మాయ ఆవరించింది. ‘రాజా! నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి. నీ వంశం తరిస్తుంది’ అన్నాడు. ‘మునీశ్వరా! స్వయంవరంలో కన్య అభీష్టమే ప్రధానం కదా! రేపు మీరు కూడా దయచేసి స్వయంవరానికి రండి. మిమ్మల్నే కోరుకుంటుందేమో చూడండి’ అన్నాడు. ‘తప్పకుండా వస్తాను’ అని చెప్పి, నారదుడు తిన్నగా వైకుంఠానికి వెళ్లాడు. ‘రేపు కళ్యాణదుర్గ నగరంలో రాకుమార్తెకు స్వయంవరం జరగనుంది. ఆమె విష్ణువునే పెళ్లాడుతానంటోంది. నీ రూపు నాకు అనుగ్రహించావంటే, స్వయంవరంలో ఆమె నన్నే వరించగలదు’ అని విష్ణువుతో అన్నాడు. ‘నారదా! నువ్వు శివమాయలో పడ్డావు. కోరిక వదులుకుంటే గాని నీకు శాంతి దక్కదు. అయినా నీ కోరిక మేరకు రేపు నీకు నా రూపాన్ని అనుగ్రహిస్తున్నాను’ అన్నాడు విష్ణువు.నారదుడికి కోపం వచ్చింది. ‘శివమాయ, విష్ణుమాయ నన్నేమీ చేయలేవు’ అంటూ విసవిసా వెళ్లిపోయాడు. మర్నాడు స్వయంవరానికి వెళ్లాడు. ఎందరో రాజకుమారులు అక్కడికి అప్పటికే వచ్చి ఉన్నారు. రాకుమార్తె రమాలక్ష్మి వరమాలతో ఒక్కొక్కరినే పరికిస్తూ ముందుకు సాగుతోంది.సభా మధ్యంలోకి వచ్చేసరికి సమ్మోహనాకారంతో వెలిగిపోతున్న మహావిష్ణువు కనిపించాడు. ఆమె వరమాలను అతడి మెడలోనే వేసింది. మరుక్షణంలోనే రాకుమార్తెను గరుత్మంతునిపై ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు. సభాసదులంతా నిశ్చేష్టులయ్యారు. ‘రాకుమార్త ఏదీ?’ అని నారదుడు అడుగుతుంటే, సభాసదులంతా అతణ్ణి చూసి గొల్లున నవ్వసాగారు. ‘ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు’ ఉక్రోషంగా అడిగాడు నారదుడు. ‘నీ శరీరం విష్ణవులాగా ఉన్నా, ముఖం కోతిలాగ, భల్లూకంలాగ ఉంది’ అన్నారు.ఆగ్రహించిన నారదుడు హుటాహుటిన వైకుంఠానికి వెళ్లి విష్ణువుపై నిప్పులు చెరిగాడు.‘నువ్వు నన్ను మోసం చేశావు. నా ముఖాన్ని కోతిలాగ, భల్లూకంలాగ చేశావు గనుక నువ్వు కూడా కోతులను, భల్లూకాలను ఆశ్రయిస్తావు’ అని శపించాడు.‘నిన్ను నేను మోసం చేయలేదు. శివమాయలో చిక్కుకుని నువ్వే మోసపోయావు’ అన్నాడు విష్ణువు. తన దురుసుతనానికి చింతించిన నారదుడు విష్ణువును క్షమాపణ వేడుకుని లోక సంచారానికి బయలుదేరాడు. ∙సాంఖ్యాయన -
టీచర్ మందలించారని.. తండ్రి తిట్టారని..
తిరుమలాయపాలెం (ఖమ్మం జిల్లా)/ తాండూరు (వికారాబాద్ జిల్లా): బాగా చదువుకోవాలని టీచర్ మందలించడంతో మనస్తాపం చెందిన ఓ ఇంటర్ విద్యార్థి, చెడు సావాసాలకు వెళ్లొద్దంటూ తండ్రి హెచ్చరించడంతో అవమానంగా భావించిన ఓ టెన్త్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో వేర్వేరు చోట్ల శనివారం జరిగిన ఈ ఘటనల వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని హైదర్‌సాయిపేటకు చెందిన గుగులోత్ కృష్ణ – రమి కుమారుడు విష్ణు(17) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చేరాడు. ఈనెల 7న టీసీ, ఇతర సర్టిఫికెట్ల కోసం తండ్రి కృష్ణతో కలిసి పదో తరగతి చదివిన పాఠశాలకు వచ్చాడు. ఈ క్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ పదో తరగతిలో ప్రవర్తన సరిగ్గా లేదని చెబుతూ ఇంటర్‌లోనైనా బాగా చదువుకోవాలని విష్ణును మందలించారు. తండ్రి, ఉపాధ్యాయుల ముందే తనను అవమానించారని భావించిన విష్ణు మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయాన గడ్డి మందు తాగాడు. కాసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలించారు. వైద్యం చేసినా లాభం లేదని అక్కడి వైద్యులు చెప్పడంతో తిరిగి ఖమ్మం తీసుకురాగా ఆరోగ్యం విషమించి శనివారం మృతిచెందాడు. తండ్రి మందలించాడని... తాండూరు మండల పరిధిలోని జినుగుర్తి గ్రామానికి చెందిన కంబంలి నర్సింలు, యాదమ్మల కుతూరు(15).. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇంటి పక్కనే ఉండే ఓ బాలుడితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన తండ్రి.. పాఠశాలకు వెళ్లి అందరిముందూ బాలికపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీన్ని అవమానంగా భావించిన బాలిక ఇంట్లో ఉన్న మాత్రలు మింగింది. అస్వస్థతకు గురైన ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. యాదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
విజయవాడ: టూరిస్ట్ గైడ్ నందా విష్ణువర్ధన్‌పై దాడి
సాక్షి, విజయవాడ: టూరిస్ట్ గైడ్ నందా విష్ణువర్ధన్‌పై దాడి జరిగింది. నలుగురు వ్యక్తులు బందర్‌రోడ్డులోని ఆఫీసులో విష్ణును రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలోనే ఆఫీస్‌లోని ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఇక, దుండగుల దాడిలో విష్ణు తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్య చికిత్స అందిస్తున్నారు. కాగా, దాడి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని మాచవరం సీఐ గునరామ్ పరిశీలించారు. అయితే, దాడి సందర్భంగా అదంతా సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండగా నిందితులు జాగ్రత్తపడ్డారు. ఇదిలా ఉండగా.. ఆలిండియా హాస్టల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా విష్ణు ఉన్నాడు. ట్రెక్కింగ్ గైడ్, టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తున్నాడు. ఇక, మహిళల వ్యవహారం కారణంగానే విష్ణుపై దాడి జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రాజకీయాల్లో యాక్టివ్.. బీజేపీ నేత దారుణ హత్య.. -
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌కు మించి సౌకర్యాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా లేని అత్యాధునిక వైద్య సదుపాయాలను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతా శిశు విభాగంలో రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిన నవజాత శిశు వైద్య విభాగాలు ఎస్ఎన్సీయూ(స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్), ఎన్ఐసీయూ (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లను గురువారం మంత్రి ప్రారంభించారు. ప్రసూతి విభాగంలో ఇప్పటికే 250 పడకలు అందుబాటులో ఉండగా.. అదనంగా 40 పడకలను నవజాత శిశు వైద్యం కోసం అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి తెలిపారు. తక్కువ బరువు, కామెర్లు వంటి అనారోగ్య కారణాలతో అప్పుడే పుట్టిన శిశువులకు అత్యవసర విభాగ అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 ఎస్ఎన్సీయూలు, ఎన్ఐసీయూలు అందుబాటులో ఉన్నాయని, వాటికి అదనంగా రూ.31.51 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక్కడి ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణ పనులను సైతం త్వరలో ప్రారంభిస్తామని రజిని తెలిపారు. కాగా, రాజీవ్‌నగర్‌లోని ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాశ్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తొలి ఏకాదశి..శయన ఏకాదశి.. ఆరోజు విష్ణువు నిజంగానే..
హిందువుల తొట్టతొలి పండుగగా తొలి ఏకాదశిని పేర్కొంటారు. హిందువుల ప్రధానమైన పండుగలకు తొలి ఏకాదశితోనే శ్రీకారం చుడతారు. తొలి ఏకాదశి తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ప్రధాన పండగలు వస్తాయి. అందుకే హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశేష ప్రాధాన్యత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశికి విశేష ప్రాధాన్యతనిస్తారు. దీన్నే శయన ఏకాదశి, హరివాసరం, పేలాల పండగ’ అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఆషాడంలో వచ్చే శుక్ల ఏకాదశి నాడు ప్రజలందరూ ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటారు. జూన్ 29వ తేది గురువారం నాడు తొలి ఏకాదశి వస్తున్న నేపధ్యంలో ఈ పండగ విశేషాలు తెలుసుకుందాం. ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పేర్కొంటారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. తిరిగి అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ‘ప్రబోధినీ ఏకాదశి’ నాడు తిరిగి నిద్ర లేస్తాడు. చాతుర్మాస వ్రతం కూడా ఈ ఏకాదశి నాడు మొదలవుతుంది. దీనిని దేవ శయన ఏకాదశి లేదా హరి శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి దేవతలకు రాత్రిపూట మొదలవుతుంది, విష్ణువు పగటిపూట విశ్రాంతి తీసుకుంటాడని చెబుతారు. అంతేగాక ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. నిజంగానే విష్ణువు ఆ రోజు నిద్రపోతారా.. నిజంగా విష్ణువు నిద్రపోతారా లేదా నిద్రకు మరేదైనా అర్థం ఉందా అంటే..చైతన్య స్థాయిలో ఎప్పుడూ మెలకువగా ఉండే వ్యక్తిని దేవుడిగా భావిస్తారు. అలాంటి పరిస్థితిలో ఎప్పుడూ మెలకువగా ఉండే భగవంతుడు అంత కాలం ఎలా నిద్రపోతాడు? అంటే దీనిలో దాగి ఉన్న రహస్యం.. ప్రజలు సాంప్రదాయ ఆచారాలను అనుసరించి వారి జీవితాన్ని కాలానుగుణంగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో పెట్టినవి. ఆ రోజు నుంచి ఒంటి పూట భోజనం, జాగరణ వంటి వాటితో ఆరోగ్యంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాన్య ప్రజల కోసం ఋషులు ఏర్పాటు చేసినవి. నిశితంగా ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది. కొన్ని రోజుల తర్వాత.. శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం వర్షాకాల మాసం. వర్షాకాలం ముగిసిన తరువాత.. శరదృతువు ప్రారంభమవుతుంది. అంటే ఈ చాతుర్మాస్య దీక్ష స్వీకరించే నాలుగు మాసాలు రుతువులు మారే మాసాలు. వాతావరణం మారినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దగ్గు, జలుబు , ఫ్లూలతోపాటు ఇన్ఫెక్షన్ వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తి పెరుగుతుంది. అన్ని కూరగాయలు , పండ్లలో బ్యాక్టీరియా, కీటకాలు పెరగడం ప్రారంభిస్తాయి. వర్షం కారణంగా సాధారణ వ్యక్తి తన జీవితాన్ని ఇంటి వద్దనే ఎక్కువగా గడిపేస్తాడు. ఈ కారణంగా ఈ నాలుగు మాసాలలో శుభకార్యాలు చేయవద్దని.. ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సంయమనం పాటించేందుకు ఈ వ్రత నియమాలను ఏర్పాటు చేశారు. ఏకాదశి తిధి ఎలా వచ్చిందంటే.. తాళజంఘుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోయి శయనిస్తాడు. దేవదేవుడు యోగనిద్రలో ఉండడం అదునుగా భావించిన దానవులు దేవతలపై విజృంభించారు. దీంతో దేవతలు భయపడి వైకుంఠధామానికి పరుగులు తీయడంతో భగవానుడి శరీరం నుంచి ఉద్భవించిన ‘సత్త్వశక్తి’ దానవుల దాష్టీకాన్ని కట్టడి చేసింది. యోగనిద్ర నుంచి మేల్కొన్న పరంధాముడు ఆ శక్తికి ‘ఏకాదశి’ అని పేరుపెట్టాడు. ఆమె సమయస్ఫూర్తికి, సకాలంలో సహకరించి నందుకు సంతసించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకంలో పూజలు అందుకోవాలని కోరుకుందట. అప్పటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. వ్రతం ఆచరించు విధానం.. ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశినాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. అలాగే ఈ వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించ కూడదని పురాణాలు చెబుతున్నాయి. మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నట్లు పండితులు చెప్తుంటారు. తొలి ఏకాదశి రోజున పిండిదీపం పెట్టాలి. ఈ రోజు పేలాల పిండి తినడం ఆచారం. ఉపవాసం ఉండే వారి నియమాలు యథావిధి. అలా కాకుండా కొన్ని ప్రాంతాల్లో తొలి ఏకాదశిని పండుగులా జరుపుకునే ఆచారం కూడా ఉంది. రైతులకు కూడా పండుగే.. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ.. తొలి ఏకాదశి రోజున శేషసాయిని(విష్ణువు) పూజించి..అలా ప్రతినెలా వచ్చే ఏకాదశిని విడిచిపెట్టకుండా శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అంతేగాదు అనాదిగా సాధువులు, భక్తజనులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి శ్రీ విష్ణుసాయుజ్యం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. సూర్యవంశ చక్రవర్తి, సత్యసంధుడు మాంధాత, తన రాజ్యంలో అనావృష్టి నెలకొన్నప్పుడు అంగిరసుడి సూచనపై ‘శయనైక ఏకాదశి’ వ్రతాన్ని భక్తితో చేశాడని, ఫలితంగా వర్షాలు కురిసి పరిస్థితి చక్కబడిందని పురాణాలు చెపుతున్నాయి. పైగా సతీ సక్కుబాయి కూడా ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందారట. అలాగే ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు. (చదవండి: ఆత్మ అంతిమంగా ఎక్కడకు చేరుకుంటుందో అదే..!) -
సమాజవరగమన మూవీ టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
ముంబై ఆటగాడు అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలి సారి!
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు విష్ణు వినోద్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫియర్-2లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన విష్ణు వినోద్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముంబై వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కంటికి గాయమైంది. దీంతో కిషన్ బ్యాటింగ్ రాలేదు. ఈ క్రమంలో అతడి స్థానంలో విష్ణు వినోద్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. కాగా ఈ సబ్స్టిట్యూట్షన్ రూల్‌ను ఐపీఎల్-2020 సీజన్లో ప్రవేశపెట్టారు. ఇక సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన వినోద్ తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్ చేతిలో 62 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూసింది. తద్వారా ప్లేఆప్స్లోనే ముంబై కథముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుబ్‌మన్ గిల్(129) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో 171 పరుగులకే ముంబై ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్(61), తిలక్ వర్మ(43) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. తమ జట్టును గెలిపించుకోలేకపోయారు. ఇక గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ 5 వికెట్లు పడగొట్టగా.. షమీ, రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించాడు. మే28న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో సీఎస్కే, గుజరాత్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో సందడి చేసిన టీమిండియా యువ ఓపెనర్.. వీడియో వైరల్ -
ఏపీలో విష్ణు కెమికల్స్ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ విష్ణు కెమికల్స్ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తోంది. వచ్చే అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్లో స్పెషాలిటీ కెమికల్స్ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు బోర్డు సోమవారం ఆమోదముద్ర వేసినట్లు తెలిపింది. విష్ణు కెమికల్స్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా 57 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఆటోమొబైల్, ఫార్మా, ఉక్కు తదితర పరిశ్రమలకు ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. -
‘మా’ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న మంచు విష్ణు (ఫొటోలు)
-
పాన్ ఇండియా సినిమాల పై మంచు విష్ణు కామెంట్స్
-
ఒకపక్క ఉక్కుపాదం.. మరోపక్క గుప్పు గుప్పు
సాక్షి, నెట్వర్క్: ఎంత ఉక్కుపాదం మోపినా గంజాయి ఇంకా గుప్పుమంటూనే ఉంది. రవాణా చేస్తూ కొందరు.. పంట సాగుచేస్తూ ఇంకొందరు.. ఇంట్లోనే పెంచుతూ ఒకరు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఆయా దాడుల్లో దాదాపు 600 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకోగా, పదుల సంఖ్యలో మొక్కల్ని పోలీసులు ధ్వంసం చేశారు. గురువారం నమోదైన ఆయా కేసుల వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని మారేడుమిల్లి నుంచి రాజమండ్రి, అశ్వారావుపేట, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర తరలించేందుకు నిందితులు ట్రాలీ అడుగు భాగంలో ప్రత్యేక అరను తయారుచేసి 566 కేజీల గంజాయి ప్యాకెట్లను రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సత్తుపల్లిలో బుధవారం రాత్రి సదరు ట్రాలీని, అందులోని రూ.1.42 కోట్ల విలువైన 566 కేజీల ఎండు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు గురువారం ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్లు యోగేష్ లింబాజీ థోర్వ్, ఇర్ఫాన్ సదర్ పఠాన్‌ను అరెస్ట్చేశామని, మరో ప్రధాన నిందితుడు గణేష్ ఉబలే పరారీలో ఉన్నాడని తెలిపారు. దర్జాగా రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణం ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన నిలంచల పట్నాయక్, ప్రకాష్‌చంద్ర బెహర డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయిని ముంబైలో అమ్మాలనుకున్నారు. 20 కేజీల ఎండు గంజాయిని 4 ప్యాకెట్లుగా ప్యాక్‌చేసి రెండు క్లాత్‌బ్యాగుల్లో పెట్టి అనుమానం రాకుండా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. రైలు వరంగల్ రైల్వేస్టేషన్‌కు రాగానే పోలీసులు అనుమానంతో వీరిని తనిఖీచేయగా గుట్టురట్టయింది. గంజాయి విలువ రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు అమ్మకం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులోని మడద క్రాసింగ్ వద్ద వాహన తనిఖీల్లో ఇద్దరు యువకుల నుంచి పోలీసులు 280 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మెదక్ జిల్లా రామాయంపేటలో విద్యార్థులకు గంజాయి అమ్ముతున్న నవీన్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని 3 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. బయట దొరకట్లేదని ఇంట్లోనే సాగు మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధి అరుంధతినగర్‌లో ఉండే ఆయాజ్‌ఖాన్ అంబులెన్స్ డ్రైవర్. గంజాయి మత్తుకు అలవాటుపడిన అతడు.. బయట ఎక్కడా సరుకు దొరక్కపోవడంతో ఇల్లు అద్దెకు తీసుకొని మేకలను పెంపకం మాటున గంజాయి మొక్కల్ని పెంచుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం దాడిచేసి గంజాయి మొక్కలను, 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. పత్తిచేనులో ‘మత్తు’సాగు ఆదిలాబాద్ జిల్లా బొసార గ్రామంలో, బోథ్ మండలం పార్డి కె గ్రామ శివారులో పత్తిచేను మాటున గంజాయి సాగుచేస్తున్న క్షేత్రాలపై పోలీసులు దాడులు చేశారు. రెండుచోట్లా 80 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. సాగుచేస్తున్న రైతులు సీతారాం, ఈశ్వర్‌పై కేసు నమోదుచేశారు. -
మద్యంలో విషం కలిపి...
ఖమ్మం క్రైం: వారంతా అన్నదమ్ముల పిల్లలే. అయినా ఏళ్ల తరబడి కొనసాగుతున్న పాత కక్షలతో సొంత సోదరులనే అంతమొందించారు. సంచలనం సృష్టించిన ముగ్గురి హత్య మిస్టరీని పోలీసులు చేధించగా, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ సోమవారం వివరాలు వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో అన్నాదమ్ముళ్ల కుటుంబాలకు చెందిన బోడా మల్సూర్, బోడా హరిదాస్, బోడా భద్రు కలిసిమెలిసి జీవించేవారు. అయితే, వీరితో ఇదే తండాకు చెందిన బోడా బిచ్చా, ఆయన కుమారులు అర్జున్, చిన్నాకు పడేది కాదు. భూవివాదాలు మొదలు అనేక విషయాల్లో ఘర్షణలు ఉండగా పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. అన్ని విషయాల్లో మల్సూర్, హరిదాస్, భద్రు తమకంటే పైచేయిగా ఉన్నారని ఆక్రోశంతో బిచ్చా కుమారులు రగిలిపోయారు. ముగ్గురిని హతమారిస్తే తమదే పెత్తనమవుతుందని బోడా చిన్నా నిర్ణయించుకుని తండాకే చెందిన «తన బం«ధువు, స్నేహితుడైన ధరావత్ సింగ్‌కు చెప్పి సాయం కోరాడు. ఆయన చంద్రుగొండకు చెందిన నందనూరి సుదర్శన్‌ను చిన్నాకు పరిచయం చేయగా, బంగారం దుకాణంలో పనిచేసే భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ సలీం వద్దకు సుదర్శన్ తీసుకెళ్లాడు. అక్కడ రూ.15 వేలకు ఆభరణాల తయారీలో ఉపయోగించే సెనైడ్ కొనుగోలు చేశారు. కర్మకాండలే వేదికగా హత్యాపథకం ఆరు నెలలుగా హరిదాస్, మల్సూర్, భద్రులను హత్య చేసేందుకు సమయం కోసం చూస్తుండగా, బిచ్చా కుమారుడు అర్జున్ మరణించాడు. దీంతో ఈనెల 14వ తేదీన అర్జున్ కర్మకాండలకు ముగ్గురినీ ఆహ్వానించారు. అయితే మధ్యాహ్నం పొలం పనులకు వెళ్లిన కారణంగా వారు హాజరుకాలేదు. దీంతో చిన్నా అదేరోజు సాయంత్రం వారి ఇళ్లకు వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించడంతో హరిదాస్, మల్సూర్, భద్రుతో పాటు వారి కుటుంబసభ్యులు మరో ముగ్గురు వచ్చారు. ఈ మేరకు వారు భోజనానికి సిద్ధమవుతుండగా, చిన్నా ముందుగానే సైనేడ్ కలిపిన మద్యం తీసుకొచ్చి వారికి అందించడంతో ఆయన కుట్ర తెలియని ఆ ముగ్గురూ మద్యం సేవించారు. దీంతో హరిదాస్, మల్సూర్ అక్కడిక్కడే మృతిచెందగా, భద్రు ఖమ్మంలోని జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం బోడా చిన్నా, ధరావత్ సింగ్, నందనూరి సుదర్శన్, మహ్మద్ సలీంను అరెస్ట్ చేయగా బోడా బిచ్చా పరారీలో ఉన్నాడు. ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించిన కూసుమంచి సీఐ సతీశ్, ఎస్సైలు రఘు, నన్దీప్, అశోక్‌తోపాటు సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ స్నేహమోహ్రా, ఏసీపీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
ఇండస్ట్రీకి సేవ చేయడమే నా కర్తవ్యం: మంచు విష్ణు
-
మిస్ యు
లాక్ డౌన్ కారణంగా తనకి, విష్ణు విశాల్‌కి మధ్య ఏర్పడ్డ దూరాన్ని అయిష్టంగా భావిస్తున్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. ‘‘మిస్ యు’’ అంటూ బాయ్ ఫ్రెండ్ విష్ణు విశాల్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె. ఆ పోస్ట్‌కి స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం సామాజిక దూరం పాటించాలి’’ అని సరదాగా అన్నారు విష్ణు విశాల్. తమిళ నటుడు విష్ణు విశాల్, గుత్తా జ్వాల ప్రేమలో ఉన్నారు. ఆ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా చెప్పకపోయినా ఇలాంటి ట్వీట్లు చెబుతున్నాయి. ఈ ఇద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. -
శ్రీ గురుదత్తాత్రేయుడు
లోకానికి జ్ఞానకాంతులను ప్రసరింపజేసేందుకు అవతరించిన గురుమూర్తి దత్తాత్రేయుడు. జన్మసంసార బంధనాలను సులువుగా వదిలించి, జ్ఞానానందాన్ని పంచుతూ, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు. ఈయన అవతార వర్ణన నారదపురాణం, శాండిల్యోపనిషత్తు, అవధూతగీత, జీవన్ముక్తిగీత తదితరాలలో కనపడుతుంది. అత్రికుమారా.... దత్తాత్రేయ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు వేరుకారని నిరూపించిన సన్నివేశమే దత్తాత్రేయ ఆవిర్భావం. త్రిమూర్తులే తనకు పుత్రులుగా జన్మించాలంటూ అత్రిమహర్షి–అనసూయ దంపతులు చేసిన తపస్సుకు మెచ్చి బ్రహ్మ అంశతో చంద్రుడు, రుద్రాంశతో దూర్వాసుడు జన్మించగా, విష్ణు అంశతో అవతరించినవాడే దత్తాత్రేయుడు! ‘దత్తా’ అనే పదానికి ‘సమర్పించిన’ అని అర్థం. త్రిమూర్తులు అత్రి–అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక దత్తా అని పేరు వచ్చింది. అత్రిపుత్రుడు కాబట్టి ‘ఆత్రేయ’ అయింది. త్రిమూర్తులే శిరస్సులై... దిక్కులనే అంబరముగా చేసుకుని, భక్తులనుద్ధరించేందుకు అనేక రూపాలను ధరించిన దత్తాత్రేయుడి మూడుతలలలో నడిమి శిరస్సు విష్ణువుదికాగా.. కుడివైపున శివుడు సద్గురు స్వరూపంగా, ఎడమవైపు బ్రహ్మదేవుడు పరబ్రహ్మస్వరూపమైన శిరస్సుతో భాసిస్తారు. మధ్యభాగంలో అజ్ఞానాన్ని తొలగించే గురుమూర్తిగా శ్రీదత్తుడు ముల్లోకాలను రక్షిస్తాడు. ఆధ్యాత్మ సిద్ధి–నిష్కామబుద్ధి దేహంపై వ్యామోహాన్ని వదిలి, జడ పదార్థంలా ఉండేవారిని అవధూత అంటారు. ఈ పదానికి అసలైన నిర్వచనంగా మారి దత్తావధూత అయ్యాడు. ఒకానొక సందర్భంలో పద్మాసనుడై, ధ్యానముద్రలో ప్రకాశిస్తూ యోగవిద్యను సాంకృతిమహర్షికి ఉపదేశించి దానిని భోగ–విలాసాలకు ఉపయోగించకూడదని, పరబ్రహ్మను పొందడమే యోగం అంతిమలక్ష్యం అని వివరిస్తాడు. ఆధ్యాత్మ సిద్ధి, నిష్కామబుద్ధి, యోగవిద్య ఇవన్ని దత్తాత్రేయుని ఉపదేశాల్లో ప్రధానమైనవి. దత్తజయంతి దత్తుడు ఉదయించిన మార్గశిర పౌర్ణమినే దత్తజయంతిగా జరుపుకుంటారు.‘దిగంబరా దత్త దిగంబరా’ అంటూ దత్తనామ స్మరణలో గడుపుతారు. దత్తచరిత్ర, అవధూతగీత మొదలైన గ్రంథాల్ని పారాయణ చేస్తారు. భజనలు, సత్సంగాలు నిర్వహిస్తారు. త్రిపురారహస్యం పేరుతో పరశురాముడికి త్రిపురసుందరీ తత్త్వాన్ని ఉపదేశించాడు దత్తాత్రేయుడు. ఉపాసకులకు ఇది ఎంతో ఉపయుక్తమైన గ్రంథం. దత్తాత్రేయ వజ్రకవచం పఠించడం వలన అన్నిరకాల రక్షణ భిస్తుంది. దత్తుడి ఆరాధన పితృదోషాలను తొలగిస్తుంది. ధర్మబద్ధంగా ఇహలోక సుఖాలను కోరుకునేవారికి వాటిని అనుగ్రహిస్తూ, వారిని యోగమార్గంవైపు పయనింపజేసే విశ్వగురు దత్తాత్రేయడు. ఆయన అనుగ్రహిస్తే గురువుతోబాటుగా దైవానుగ్రహమూ లభించినట్లే! – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని వేదపండితులు -
కల్పవల్లి... ఆండాళ్ తల్లి
వైష్ణవసంప్రదాయంలో 108 దివ్య దేశాలున్నాయి. ఆ క్షేత్రాలలో విష్ణువు నెలకొని ఉంటాడు. వాటిలో ఒకటి శ్రీవిల్లిపుత్తూర్. ఇక్కడే విష్ణుచిత్తుడు అనే భక్తుడుండేవాడు. ఆయనకు తులసివనంలో ఒక బాలిక దొరుకుతుంది. ఆ బాలికకు పుష్పమాలిక అనే అర్థం వచ్చేట్టు కోదై అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ప్రతిరోజూ విష్ణువుకు సమర్పించే మాలలను సిద్ధం చేస్తుంటే తండ్రికి సహాయం చేసేది కోదై. విష్ణువుకు అలంకరించే మాలలు తాను ధరించి అద్దంలో చూసుకుని మురిసిపోయేది. ఒకసారి స్వామి వారికి మాలసమర్పిస్తుంటే పొడవైన కేశం విష్ణుచిత్తుడి కంటపడింది. విషయం గ్రహించి కూతుర్ని మందలించి మరునాటి మాలలను సిద్ధం చేసి తానే తీసుకుని వెళ్తే అది స్వామి స్వీకరించడు. గోదా అలంకరించుకున్న మాలే సమర్పించమంటాడు. ఇన్నాళ్లు తాను పెంచింది సాక్షాత్తు లక్ష్మీదేవినే అని గ్రహించి ఆమెను ఆండాళ్ తల్లి అని సంబోధిస్తాడు. పవిత్రధనుర్మాసంలో గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. ఆమెను వివాహం చేసుకోవడానికి తిరుమల నుంచి వేంకటేశ్వర స్వామి, కంచి నుండి వరదరాజస్వామి వస్తుండగా రంగనాథస్వామి గరుడవాహనంపై విచ్చేసి ఆమె చేయందుకుంటాడు. ఇందుకు ప్రతీకగా ఈ ఆలయ ప్రాంగణంలో వేంకటేశ్వర సన్నిధి ఉంది.గర్భాలయంలో గోదాదేవి, రంగనాథస్వామితోపాటు గరుత్మంతుడు కూడా ఉంటాడు. గోదాదేవి ఎడమచేతిలో చిలుకను ధరించి, చేతిని వంపుగా కిందికి వదిలి ఉంటే, రంగనాథస్వామి గోపాలకుడిగా చెర్నాకోలు, ముల్లుకర్ర ధరించి ఉంటాడు. గరుత్మంతుడు అంజలి బద్ధుడై వారిని సేవించుకుంటూ దర్శనమిస్తాడు. ఇటువంటి అపురూపమైన గోదాదేవి దర్శనాన్ని చేసుకుని భక్తులంతా తరిస్తారు. అయితే వటపత్రశాయి సన్నిధి దివ్యదేశం అనీ, ఇప్పటి గోదాదేవి ఆలయం పెరియాళ్వార్ గృహమనీ, అదే కాలక్రమంలో ఆలయంగా రూపుదిద్దుకుందని భక్తులు గ్రహించాలి. గోదాదేవి దర్శనం సకలశుభాలకు నెలవు. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
మీకు తెలుసా
సూర్యుడు ఏడాదిలో ప్రతినెలా ఒక్కో రాశిలో సంచరిస్తుంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే.. ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. ఆదిత్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి.. మళ్లీ మకర రాశిలోకి వెళ్లే వరకూ ఉన్న సమయమే ధనుర్మాసం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. ఉత్తరాయణం పగలు. ఉత్తరాయణం ముందు వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయం. ∙ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో గోదాదేవి విరచిత తమిళ పాశురాలు వినిపిస్తుంటాయి. శ్రీరంగనాథుడి భక్తురాలైన గోదాదేవి నెల రోజుల పాటు రోజుకో పాశురం చొప్పున కృష్ణలీలల్ని కీర్తిస్తూ శ్రీవ్రతం ఆచరించింది. ఈ 30 పాశురాలు ‘తిరుప్పావై’ పేరుతో ప్రఖ్యాతి గాంచాయి.ధనుర్మాసంలో విష్ణుభక్తులే కాదు, శివభక్తులు కూడా పాశురాలు పాడుకుంటారు. తమిళనాడులోని శివాలయాల్లో తిరువెంబావై పాశురాలు వినిపిస్తాయి. శైవ సిద్ధాంత కర్త మాణిక్య వాచకర్ ఈ పాశురాలను రాశారు. శివ తత్వాన్ని తెలిపే ఈ పాశురాల సంఖ్య కూడా 30. మదురై నగరానికి సమీపంలోని ఓ గ్రామంలో ఉండేవాడు మాణిక్య వాచకర్. చిన్ననాటి నుంచి శివ భక్తుడు. ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారు జామునే మదురైలోని సుందరేశ్వరుడి దర్శనానికి వచ్చేవాడు మాణిక్య వాచకర్. నగర వీధుల్లో నడుస్తూ తిరువెంబావై పాశురాలను రాగయుక్తంగా ఆలపించేవాడు. ఆ అమృతగానం విని మదురై వాసులంతా ఆయనతో గొంతు కలిపే వారు. అలా మొదలైన తిరువెంబావైని నేటికీ ఆచరిస్తూనే ఉన్నారు. తమకు మంచి భర్త రావాలని ఆకాంక్షిస్తూ ఆడపిల్లలు తిరువెంబావై పాశురాలను పాడుకోవడం పరిపాటి. తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో ధనుర్మాసమంతా సుప్రభాత సేవలో గోదాదేవి పాశురాలు ఆలపిస్తారు. గోదాదేవి కృష్ణభక్తికి ప్రతీకగా శ్రీవారి పవళింపు సేవ రజతకృష్ణస్వామి మూర్తికి నిర్వహిస్తారు. మనల్ని నీడలా అనుసరించేది వీరే..! చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత. కానీ.. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి. అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయసంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి. వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు. పండుగ పర్వం ఉత్తర ద్వారాన వైకుంఠ వాసుడు మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి గా చెప్తారు. ఇది శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా ప్రతీతి. దీనికే ముక్కోటి ఏకాదశి అని పేరు. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకొనే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు. (18, మంగళవారం ముక్కోటి) గీతాజయంతి మార్గశిర శుద్ద ఏకాదశి గీతా జయంతి. ఈవేళ భగవద్గీత పారాయణం, పార్ధసారధిని (కృష్ణుని) ఆరాధన చేయడం మంచిది. హనుమద్వ్రతం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమత్భక్తులు హనుమత్ వ్రతాన్ని ఆచరిస్తారు. సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుందని చెబుతారు. (20, గురువారం హనుమద్వ్రతం) దత్త జయంతి మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే త్రిమూర్తి స్వరూపం. ఈ వేళ అనఘావ్రతం ఆచరించి స్వామిని పూజిస్తే.. సకల పాపాలు తొలగుతాయి. కోరల పున్నమి కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రలుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకంగా ఈ దినం.. యమధర్మరాజుని ఆరాధిస్తారు. ఈ పౌర్ణమిని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. (22, శనివారం దత్త జయంతి, కోరల పున్నమి) -
కష్టాల్లో అన్నం పెట్టిన ఊరు.. వ్యాపారం చేసుకోలేను!
మనకెదురైన ఇబ్బంది మనలోని సామర్థ్యాన్ని బయటపెడితే ఎదుటి వాళ్లకు వచ్చిన కష్టం మనలోని మానవత్వాన్ని చూపెడుతుంది. ఈ నిజాన్ని ప్రకృతి వైపరీత్యాలెన్నో రుజువు చేశాయి. ఇప్పుడు కేరళ వరదలూ ఆ దృశ్యాలను చూపెడుతున్నాయి. వందేళ్ల కనివినీ ఎరుగని వరదలు కేరళను ముంచేస్తున్నాయి. దాదాపు 400 మందిని మింగేశాయి. ఇంకెంతోమంది జాడను గల్లంతు చేశాయి. ప్రకృతి చేస్తున్న ఆ బీభత్సాన్ని ఆపలేం. చేతుల్లో ఉన్నది.. సాయం చేయడమే. చేయందించి ఒడ్డుకు లాగడమే. ఆ పని రెస్క్యూ టీమ్ చేస్తోంది. జ్వరంతో ఒళ్లు కాలిపోతున్న పిల్లాడిని గుండెలకత్తుకొని... వరదపోటుకి కూలిపోతున్న బ్రిడ్జి మీద నుంచి పరిగెత్తి... ఆ పిల్లాడి ప్రాణాలు కాపాడిన రెస్క్యూ ఆఫీసర్ కన్నయ్య కుమార్ సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే... ఇంకో పేరు వినిపిస్తోంది.. మనిషీ కనిపిస్తున్నాడు. ఆయన విష్ణు కఛ్వా. మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. వ్యాపార నిమిత్తం కేరళలోని కన్నూర్ జిల్లా, ఇరిట్టీలో ఉంటున్నాడు భార్య, ఇద్దరు పిల్లలతో. నెలలో రెండుసార్లు హరియాణాకు వెళ్లి అక్కడి నుంచి బ్లాంకెట్స్ తెచ్చి ఇరిట్టీ, చుట్టుపక్కల ఊళ్లలో ఇంటింటికీ తిరిగి వాటిని అమ్ముతుంటాడు. ఎప్పటిలాగే ఈసారీ వెళ్లాడు హర్యానా దుప్పట్లు తేవడానికి. వెళ్లేముందు అంతా బాగానే ఉంది. దుప్పట్ల బేరం అయ్యాక హరియాణాలో రైలు ఎక్కి ఇక్కడ దిగేదాకా తెలియదు అంతా మునిగిపోయిందని. హతాశుడయ్యాడు. ఇల్లు, పొలం, పుట్రా, గొడ్డు, గోదా ఉన్న కుటుంబాలన్నీ దిక్కులేని వాళ్లయ్యారని, ఎక్కడో రెస్క్యూ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారని తెలిసి విలవిల్లాడాడు. వానకు తడిసి.. చలితో వణికిపోతున్న ముసలివాళ్లు, పిల్లలు కళ్లల్లో మెదిలారు. తను చేయదగ్గదొక్కటే.. బ్యాగ్‌లో ఉన్న బ్లాంకెట్స్‌ను వాళ్లకు అందివ్వడమే. వెంటనే కన్నూరు కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లి విషయం చెప్పాడు. అతని వివరాలు, జీవనాధారం అన్నీ తెలుసుకున్న కలెక్టర్.. ‘‘వీటిని పంచేస్తే నువ్వెలా బతుకుతావు.. వద్దు’’ అని సున్నితంగా వారించాడు. ‘‘నాకు అన్నం పెట్టిన ఊరు, ఉండడానికి చోటిచ్చిన నా మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ల బాధలతో నేను వ్యాపారం చేసుకోలేను సర్.. నేను చేయగలిగింది ఇదొక్కటే.. దయచేసి ఈ దుప్పట్లను వాళ్లకు ఇచ్చేయండి’’ అన్నాడట నీళ్లు నిండిన కళ్లతో బ్యాగ్‌ను కలెక్టర్ చేతుల్లో పెడుతూ. ఆ మాటలకు కలెక్టర్‌తో పాటు అక్కడున్న ప్రభుత్వ సిబ్బంది కళ్లూ చెమ్మగిల్లాయి. విష్ణును తీసుకొని అప్పుడే తెరిచిన అడిచుకూట్టి స్కూల్ శిబిరానికి వెళ్లాడు కలెక్టర్. విష్ణు చేతుల మీదుగానే ఆ దుప్పట్లను ఇప్పించాడు. అంత వైపరీత్యానికి విష్ణుది ఉడుత సాయమే కావచ్చు.. కానీ అది చేయూతనివ్వడానికి ముందుకొచ్చే వాళ్లకు అది కొండంత స్ఫూర్తి! మదరసా నిలిచింది.. అంతా బాగా ఉన్నప్పుడు.. అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నప్పుడు.. మనిషి, మనిషికీ మధ్య కులం, మతం, డబ్బు అన్నీ అడ్డుగోడలవుతాయి. వీటిని కూలగొట్టడానికేనేమో ప్రకృతి ఇలాంటిది సృష్టిస్తుంది అనిపిస్తోంది కోజికోడ్ జిల్లాలోని మదరసాను చూస్తుంటే. ఆ జిల్లాలోని హిందువులందరికీ ఆశ్రయమిస్తూ రక్షిస్తోంది ఈ మదరసానే! మనుషుల్లాగే ఉందాం.. అంతా బాగున్నప్పుడు కూడా! మానవత్వాన్ని నిద్రలేపడానికి వైపరీత్యాల అవసరం మనకొద్దు! కష్టానికి చలించడం మన నైజం. దాన్నెప్పుడూ జీవంతోనే ఉంచుదాం! -
విష్ణు సేనాపతి విష్వక్సేనుడు
శైవ సంప్రదాయంలో గణపతిని తలుచుకున్నట్లుగానే వైష్ణవులు తొలిగా విష్వక్సేనుని స్మరిస్తారు,ç పూజిస్తారు. ఈయన విష్ణుగణాలకు అధిపతి. వైకుంఠ సేనాని. సాక్షాత్తు విష్ణువులాగే చతుర్భుజాలతో ఉంటాడు. కుడిచేతిలో అభయముద్రనిస్తూ ఎడమచేతిని కటి వద్ద ఉంచుకుని, పర హస్తములలో శంఖు చక్రాలను ధరించి దర్శనమిస్తాడు. వైష్ణవులు స్మరించే గురుపరంపరలో ఈయన స్థానం మూడవది. మొదట విష్ణువు, రెండు లక్ష్మీ దేవి. విష్వక్సేనుల వారు భాద్రపద మాసంలో పూర్వాషాఢ నక్షత్రంలో ఆవిర్భవించారు. బంగారుశరీర వర్ణంతో విశాలమైన కనులతో పుట్టుకతోనే దేహంపై శంఖం, ఖడ్గం, ధనస్సు చిహ్నాలతో సేనాపతి అవుతాడనే సంకేతంగా పుడతాడు. ఈయనను కశ్యపమహర్షి పెంచి వేదాన్ని, మంత్రశాస్త్రాలను నేర్పిస్తాడు. తరువాత వృషభాద్రిపై 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి శ్రీనివాసుని అనుగ్రహంతో సేనాపతిగా అవతరిస్తాడు. తిరుమలలో వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య భాగంలో విష్వక్సేనుల వారి సన్నిధి ఉందనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. స్వామివారి ఆలయానికి చుట్టూ ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో ఈ సన్నిధి కనిపిస్తుంది. అయితే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఈ ముక్కోటి ప్రదక్షిణ ప్రాంతాన్ని తెరిచి ఉంచడం జరుగుతుంది. అప్పుడు కూడా భక్తుల రద్దీ వలన ఈ సన్నిధి దగ్గరికి వెళ్లడానికి అందరికీ అవకాశం ఉండదు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలలో ముందుగా సేనాపతి ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈయన నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా వచ్చిన తరువాత వెంకటేశ్వర స్వామి వారు వాహనంపై వేంచేస్తారు. విజ్ఞానాన్నిచ్చే విష్వక్సేన రూపం విష్వక్సేనుడు జ్ఞాన ప్రదాయకుడు. ఈయన నాలుగు చేతులతో పద్మపీఠంపై ఆసీనుడై నిజ హస్తాలతో కుడిచేత అభయ ముద్ర లేక సూచి హస్తం లేక పుష్పాన్ని ధరించి ఉంటాడు. కొన్నిచోట్ల దండాన్ని ధరించి కూడా కనిపిస్తాడు. ఎడమచేత కటి ముద్రను గాని, గదను గానీ ధరించి ఉంటాడు. పర హస్తాలలో శంఖు చక్రాలను ధరిస్తాడు. విష్ణు స్వరూపానికి ఈయనకు ఒకటే తేడా. మహావిష్ణువుకు శ్రీవత్సం బ్రహ్మసూత్రం ఉంటాయి. విష్వక్సేనుడికి అవి ఉండవు. వైష్ణవాగమాలైన పాంచరాత్రాగమం, వైఖానస ఆగమం విష్వక్సేన స్వరూపాన్ని చాలా చక్కగా వివరించాయి. ఈ స్వామి ముక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని పరాశర సంహిత చెప్పింది. – డా. ఛాయా కామాక్షీదేవి -
చాంప్స్ విష్ణు, దియా
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రీజినల్ ఐసీఎస్ఈ, ఐఎస్సీ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో బి. విష్ణు, దియా చాంపియన్లుగా నిలిచారు. సీనియర్ బాలుర ఫైనల్లో జ్ఞాన రేవంత్ (ఫ్యూచర్ కిడ్స్)పై విష్ణు (గీతాంజలి) గెలుపొందాడు. హృదయ్ షా (గీతాంజలి) మూడో స్థానంలో నిలిచాడు. బాలికల ఫైనల్లో మధుమాల (నాసర్ స్కూల్, ఖైరతాబాద్)పై దియా (నాసర్ స్కూల్) నెగ్గింది. సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ కింగ్‌కోఠికి చెందిన దిశా సంఘ్వి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు జూనియర్ బాలురు: 1. ఫణీంద్ర (సెయింట్ ఆన్స్, రాజమండ్రి), 2. ఒమర్ మంజూర్ ఖాన్ (నాసర్ స్కూల్, గచ్చిబౌలి), 3. రవివర్మ (సెయింట్ జాన్స్, వైజాగ్); బాలికలు: 1. ఛార్వి ఫల్గుణ్ (ఫ్యూచర్ కిడ్స్, రాజమండ్రి), 2. టి. అంకిత (టింపనీ స్కూల్, వైజాగ్), 3. టి. ఆశ్రిత (టింపనీ స్కూల్, వైజాగ్). జూనియర్ బాలుర డబుల్స్: 1. కృషాల్– లక్ష్య (ఫ్యూచర్‌కిడ్స్), 2. జి.మోహిత్– ఆకర్ష్ (ఫ్యూచర్‌కిడ్స్), 3. శ్రీవాస్తవ–మహంతి (హెచ్‌పీఎస్, బేగంపేట్); బాలికలు: ఫాతిమా–రషిక (నాస ర్ స్కూల్), 2. అమారా– ఈషా (నాసర్ స్కూల్), 3. హితశ్రీ–సాత్విక (టింపనీ స్కూల్). సీనియర్ బాలుర డబుల్స్: 1. ఆర్యన్–అనికేత్ (గీతాంజలి), 2. బిస్మాన్–గౌరవ్ (ఫ్యూచర్ కిడ్స్), 3. కుంజ్ గుప్తా–వన్‡్ష (గీతాంజలి); బాలికలు: ఉర్వా– హన్నా రెహమాన్ (నాసర్ స్కూల్), 2. ఖుషి–స్మృతి (నాసర్ స్కూల్), 3. ముస్కాన్–సంస్కృతి (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్). -
మైనర్‌పై టీడీపీ నేత కుమారుడి లైంగిక దాడి
సాక్షి, గుంటూరు : ‘మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలకు ఈ భూమి మీద అదే చివరి రోజు అవుతుంది.. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఉరిశిక్ష పడేలా చేస్తాం.. ఇలాంటి వారిని మహిళలు రోడ్లపైకి ఈడ్చి బుద్ధి చెప్పాలి..’ ఈ మాటలన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దాచేపల్లిలో మైనర్ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన సమయంలో గుంటూరు వచ్చిన ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో హెచ్చరికలు చేయడంతో అంతా నిజమని నమ్మారు. అయితే ఆయన హెచ్చరించిన వారం రోజులకే అదే దాచేపల్లిలో ఓ మైనర్ బాలికపై టీడీపీ మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా గర్భవతిని సైతం చేసిన దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారే తప్ప, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయాయి. మంత్రి నియోజకవర్గంలో మరో అమానుషం.. తాజాగా రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరులో 11 ఏళ్ల మైనర్ బాలికపై అధికార పార్టీ నేత తనయుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడ్డ మృగాడిని కఠినంగా శిక్షించాల్సిన అధికార పార్టీ నేతలే నిరుపేద బాధిత కుటుంబాన్ని డబ్బుతో మభ్యపెట్టి కేసు లేకుండా చేశారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కులం పరువు పోతుందంటూ కొందరు అధికార పార్టీ నేతలు పంచాయితీ చేసి బాలిక కుటుంబానికి కొంత డబ్బు ఇచ్చేలా మాట్లాడి కేసు లేకుండా రాజీ కుదిర్చారు. పోలీసులకు అత్యాచార ఘటన గురించి వివరాలు తెలిసినప్పటికీ అధికార పార్టీ నేత తనయుడు కావడంతో రాజీ పడ్డారంటూ కేసు నమోదు చేయకుండా వదిలేశారు. దీనిపై ఈనెల 13న‘మైనర్ బాలికపై టీడీపీ నేత తనయుడి లైంగిక దాడి’ శీర్షికతో ప్రచురించిన వార్తకు స్పందించిన ఎస్పీ వెంకటప్పలనాయుడు ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా శనివారం అమృతలూరు వెళ్ళిన సమయంలో బాలిక తల్లిదండ్రులను పిలిపించి విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ తెనాలి డీఎస్పీ స్నేహితను ఆదేశించారు. అమానుష ఘటన వివరాలివీ... అమృతలూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న 11 ఏళ్ళ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన శరణు విశ్వతేజ అనే యువకుడు ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం బాలికకు మాయమాటలు చెప్పి రామమందిరం వద్దకు తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. విష్ణుతేజ తండ్రి నాగేశ్వరరావు అధికార పార్టీ ముఖ్యనేత. గతంలో ఆయన కూచిపూడి నీటి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. మృగాడి బెదిరింపులతో విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు బాలిక భయపడింది. ఇది జరిగిన రెండు రోజులకు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుండగా అనుమానం వచ్చిన తల్లి గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఫిర్యాదు చేసేందుకు కుమార్తెతో కలసి పోలీసు స్టేషన్‌కు వెళుతుండగా, మృగాడి బంధువులు ఆమెను అడ్డుకుని కుల పెద్దలు, అధికార పార్టీ నేతలతో పంచాయితీ పెట్టారు. బాలిక కుటుంబం పూరిగుడిసెలో నివాసం ఉంటూ కటిక బీదరికంతో ఇబ్బందులు పడుతుండటాన్ని ఆసరాగా తీసుకుని బాలికపై అమానుషానికి వెలకట్టేందుకు వెనుకాడలేదు. చివరకు రూ.10 లక్షలు ఇచ్చేలా బేరం కుదుర్చుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా రాజీ కుదిర్చారు. పోలీసులకు తెలిసినా... అత్యాచార ఘటన విషయం పోలీసులకు తెలిసినప్పటికీ వారిద్దరూ రాజీ పడ్డారంటూ కేసు నమోదు చేయకుండా వదిలేశారు. బాలిక కుటుంబానికి మాత్రం కేవలం రూ.4 లక్షలు చెల్లించారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ‘సాక్షి’ దీనిని వెలుగులోకి తెచ్చింది. రూరల్ ఎస్పీ చొరవతో... విషయం తెలుసుకున్న రూరల్ ఎస్పీ సీహెచ్.వెంకటప్పలనాయుడు ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా శనివారం అమృతలూరుకు వెళ్ళిన సమయంలో బాలికను, ఆమె తల్లిని పిలిపించి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ తెనాలి డీఎస్పీ స్నేహితను ఆదేశించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం బాలికను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రిలో బాలిక, ఆమె తల్లితో డీఎస్పీ స్నేహిత మాట్లాడి సంఘటనపై ఆరా తీశారు. అధికార పార్టీ ముఖ్య నేతలు రాష్ట్రంలో ఎంత పెద్ద సంఘటన జరిగినా నష్టపరిహారం పేరుతో డబ్బులు ఇచ్చి తూతూ మంత్రపు చర్యలతో సరిపెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అమృతలూరు అధికార పార్టీ నేతలు సైతం ఇదే మార్గాన్ని ఎంచుకుని డబ్బుతో ఆడపిల్లపై అమానుషానికి పాల్పడితే దానికి వెలకట్టే దుశ్చర్యకు పాల్పడ్డారు. విషయం బయట పడడంతో కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసు అధికారులపై ఒత్తిడి పెంచే యత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు. -
ఫొటో’.. తలరాతను మార్చేసింది!
-
‘తలకిందులు ఫొటో’.. తలరాతను మార్చేసింది!
త్రిసూర్: ‘‘జీవితంలో మరుపురాని గుర్తులంటే పెళ్లి ఫొటోలే కదండి! అందుకే వాటిని మరికాస్త వినూత్నంగా తియ్యాలనుకుంటాను. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా కొత్త తరహాలో ఆలోచించక తప్పదుమరి!’’ అంటున్నాడు 23 ఏళ్ల విష్ణు. చెట్టు పైకెక్కి తలకిందులుగా వేలాడుతూ ఫొటోలు తీసిన ఆ వీడియో ఏ రేంజ్లో వైరల్ అయిందో మీరంతా చూసే ఉంటారు. విచిత్ర విన్యాసాలు చేస్తూ అతను తీసిన తలకిందులు ఫొటో.. ఇప్పుడతని తలరాతను మార్చేసింది. సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయిన విష్ణుకు ఇప్పుడు ఆఫర్లమీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయట! సరదాగా తీసిన వీడియో: విష్ణు స్వస్థలం కేరళలోని త్రిసూర్. ‘వైట్‌ర్యాంప్’ అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్స్ గ్రూప్‌లో సభ్యుడు. ఏప్రిల్ 15న త్రిసూర్‌కే చెందిన ‘షియాజ్-నవ్య’ల పెళ్లిని కవర్ చెయ్యడానికి వెళ్లాడు. కొత్త తరహాలో ఫొటోలు తీస్తానంటూ కొత్త జంటను కన్విన్స్ చేయడం, చెట్టుకొమ్మకు తలకిందులుగా వేలాడుతూ ఫొటోలు తీయడం.. అలా విష్ణు చేసిన విచిత్ర విన్యాసాలను వాళ్ల గ్రూప్ మెంబర్ ఒకరు షూట్ చేశారు. సరదాగా తీసిన ఆ వీడియోను త్రిసూర్ ఫొటోగ్రాఫర్స్ వాట్సప్ గ్రూప్‌లో అప్లోడ్ చేశారు. విపరీతంగా నవ్వుపుట్టించే ఆ వీడియో గంటల్లోనే వైరల్ అయింది. దాదాపు అన్ని సైట్లూ, పత్రికలూ ఫొటోగ్రాఫర్ విచిత్ర విన్యాసం గురించి వార్తలు రాశాయి. విష్ణు ది వివ్వల్ ఫొటోగ్రాఫర్: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయిన విష్ణును త్రిసూర్ వాసులంతా ముద్దుగా ‘వివ్వల్(గబ్బిలం) ఫొటోగ్రాఫర్’ అని పిలుచుకుంటున్నారట. ఫొటోలు బాగా రావడంతో షియాజ్-నవ్యలు కూడా ఫుల్‌ఖుష్. పైసా ప్రచారం ఖర్చు లేకుండా ఫేమస్ అయిపోయిన విష్ణు అండ్ గ్రూప్‌కి ఇప్పుడు ఆఫర్లమీద ఆఫర్లు వస్తున్నాయట. ‘‘నిజానికి ఇంతకు ముందు కూడా నేను చెట్లెక్కి ఫొటోలు తీశాను. చిన్నప్పుడు కోతికొమ్మచ్చి బాగా ఆడేవాణ్ని. ఆ ఎక్స్పీరియన్స్ బాగా కలిసొచ్చింది..’ అని నవ్వేస్తాడు విష్ణు. -
గుండె ఆగేవరకు బస్సు నడిచింది
కొందరు డ్యూటీ కోసం డ్యూటీ చేస్తారు.కొందరు ప్రాణం పెట్టి డ్యూటీ చేస్తారు.ప్రాణం ప్రధానమాడ్యూటీ ప్రధానమా అనడిగితేడ్యూటీ ప్రధానం అనేవారు ధన్యులు.విష్ణు అలాంటి ధన్యుడు.అందుకే అతడు జ్ఞాపకాలలో జీవించి ఉన్నాడు. సజీవంగా ఉన్నాడు. తండ్రి, కొడుకు ఒక ఏ.టి.ఎం ఎదుట ఉన్నారు.అప్పుడే ఒక ఆర్టీసి బస్సు వేగంగా పోయింది.‘రేయ్... ఎవడ్రా వీడు.. ఇలా నడుపుతున్నాడు. మనిషి ప్రాణం విలువ తెలియదులా ఉంది వీడికి’ అన్నాడు తండ్రి ఆ వెళ్లిన ఆర్టీసి బస్సు వైపు చూస్తూ.ఒక క్షణం ఆయనకు బాగా కోపం వచ్చింది. అంతలోనే సంభాళించుకుంటూ కొడుకుతో ‘స్వీటూ హాటూ తెస్తే సరిపోతది కదరా? లేకుంటే అక్కా వాళ్లను పిలిచి చిన్న ఫంక్షన్‌లాగా చేద్దామా?’ అన్నాడు.‘నీ ఇష్టం నాన్నా.. నువ్వెట్ల అంటే అట్లా’ అన్నాడు కొడుకు. ‘సరేలే.. ఇంకా రెండు రోజులు టైమ్ ఉంది కదా.. చూద్దాం. ఈ ఏటిఎంలో డబ్బు లేదు. నేను వెతికి తెస్తా నువ్వెళ్లు’ అని కొడుకును పంపించేశాడు.ఆ రోజు తేది జనవరి 28. సంవత్సరం 2017. అప్పటికే వెయ్యి, ఐదువందల నోట్లు రద్దయి రెండున్ననెలలు అయిపోయింది. ఏటీఎమ్‌లలో డబ్బులు లేవు. తండ్రి ఆ రోజు చాలా ఏటీఎమ్‌లు తిరిగి ఓ పదివేలు తెచ్చి కొడుక్కి ఇచ్చాడు. ‘ఒక వేళ ఫంక్షన్ అనుకుంటే కొన్నయినా డబ్బులుండాలి కదా సామాన్లు తేవడానికి. ఇవి నీ దగ్గర పెట్టుకో’ అన్నాడు.ఆయన పేరు కె.విష్ణు. ఆర్టీసీలో డ్రైవర్. నల్గొండ జిల్లా, చండూరులో ఉద్యోగం. కొడుకు పేరు వెంకట్. పైన ఏర్పాట్లన్నీ విష్ణు రిటైర్మెంట్ కోసం. ఇంకో రెండు రోజుల్లో అంటే జనవరి 31న రిటైర్మెంట్. విష్ణుతోపాటు ఇంకో ఇద్దరు కలీగ్స్ కూడా ఆ రోజే రిటైరవబోతున్నారు. ఆ ఇద్దరితో కలిసి సింపుల్ పార్టీ చేసుకోవాలా లేక సొంతగా ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు విష్ణు. చివరకు ఫంక్షన్‌కే ఫిక్స్ అయ్యాడు. పెళ్లి చేసి పంపిన ఇద్దరు ఆడపిల్లలను పిలిచి ముచ్చటగా ఈ ఫంక్షన్ చేసుకోవాలని కోరింది ఆయన మనసు. అందుకే ఇబ్బంది పడకుండా ముందస్తుగా పదివేలు తెచ్చి కొడుకు చేతిలో పెట్టాడు. ఉదయం ఐదు గంటలకు డ్యూటీ ఉంది. అంటే ఆ రాత్రే వెళ్లి డిపోలో పడుకోవాలి. డిన్నర్ ముగించుకొని డ్యూటీకి వెళుతుంటే కొడుకు అన్నాడు–‘రెండ్రోజుల్లో రిటైర్మెంట్ పెట్టుకుని ఇంకా డ్యూటీ ఏంటి నాన్నా’...తండ్రి నవ్వాడు.‘రేయ్.. మీ నాన్న దేన్నయినా కాదనగలడుగానీ డ్యూటీని కాదనలేడురా’...‘అది కాదు నాన్నా’...‘ఇది లాస్ట్ డ్యూటీ. కాదనకు’... వెళ్లిపోయాడు.జనవరి 29. తెల్లవారుజాము. ఫోన్ వచ్చింది వెంకట్‌కు.‘మీ నాన్న ఇప్పుడే డ్యూటీ ఎక్కాడు. కళ్లు తిరుగుతున్నాయి.. చక్కరొస్తుందని అంటున్నాడు. ఏవో టాబ్లెట్లున్నాయట కదా. తీసుకొని రా తొందరగా’ అని హడావిడిగా అన్నాడు కండక్టర్. వెంకట్ ఆగమేఘాల మీద బయలుదేరాడు కండక్టర్ చెప్పిన చోటికి. ఈ ఫోన్ రావడానికి కొద్దిసేపటి ముందు డిపో ఉంచి బస్సు తీశాడు విష్ణు. పదిమంది ప్యాసెంజర్లను ఎక్కించుకుని బస్‌ను బయల్దేరదీశాడు. కొంతదూరం వెళ్లింది బస్సు. సడన్‌గా ఏదో తేడా. తల తిప్పినట్టవడం.. గుండెలో నొప్పి మొదలయ్యాయి విష్ణుకి. అనీజీనెస్. అలాగే ఇంకొంత దూరం నడిపాడు. కాని వల్ల కాలేదు. బ్రేక్ మీద, ఎక్సలరేటర్ మీద కాళ్లు ఆనడం లేదు. తేలిపోతున్నాయి. బస్ కంట్రోల్ తప్పితే అందులో ఉన్న పదిమంది ప్రాణాలకూ ముప్పు. గుండెలో బాధ మెలిపెడుతున్నా మెదడు చురుగ్గా పనిచేస్తోంది. అప్పటికే టికెట్లు కొట్టేశాడు కండెక్టర్. తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులు చల్లగాలికి కునుకులోకి జారుకుంటున్నారు. కాని కండక్టర్ గమనించాడు. వెంటనే బ్యానెట్ దగ్గరకు వచ్చి.. ‘అన్నా.. ఏమైంది?’ అన్నాడు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమేమో అనుకొని. ఆపాటికే విష్ణుకు చమటలు పట్టేశాయి. సమాధానం చెప్పే స్థితిలో లేడు. రోడ్డు చుట్టుపక్కల చూస్తున్నాడు. బస్సు అటూ ఇటూ ఊగుతోంది. డ్రైవర్‌కు ప్రాణాల మీదకు వచ్చినట్టు కండక్టర్‌కు అర్థమైంది. ‘అన్నా.. నువ్వు జాగ్రత్త’ అన్నాడు వణుకుతూ.‘నా ప్రాణం కాదు.. పాసింజర్స్ ప్రాణాలు ముఖ్యం’ అతి కష్టం మీద అన్నాడు.బస్సు ఇంకా కంట్రోలు తప్పే స్థితికి వచ్చింది. కాని విష్ణు స్టీరింగ్ వదల్లేదు. ఓ చెట్టు కనపడింది. కాస్త రోడ్డు దిగి ఆ చెట్టును సపోర్ట్ చేసుకుంటూ ఆపేసి స్టీరింగ్ మీద తల వాల్చేశాడు. వెంకట్ వచ్చే సరికి అదీ దృశ్యం. ‘నాన్నా... నాన్నా’... పెద్దగా అరుస్తూ తండ్రిని లేపే ప్రయత్నం చేశాడు వెంకట్. అప్పటికే కండక్టర్, ఇంకో ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు కలిసి విష్ణును డ్రైవర్ సీటులో నుంచి బస్సులోకి తెచ్చి కాళ్లు, చేతులు రబ్ చేయసాగారు. వెంకట్ తండ్రి ఛాతిని చేతులతో అదమసాగాడు. ఈలోపే కండక్టర్ 108కి ఫోన్ చేశాడు. కాని అది వీళ్లకు అందుబాటులో లేకుండింది. వేరే వెహికిల్‌లో దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. విష్ణు ప్రాణాలు కాపాడలేకపోయారు. గుండెపోటుతో మరణించాడని ధృవీకరించారు. ఆయన లాస్ట్ డ్యూటీ చేయాలని కోరుకున్నాడు. లాస్ట్డ్యూటీని సక్రమంగా ముగించి శాశ్వత రిటైర్మెంట్ తీసుకున్నాడు. డ్యూటీయే ప్రాణం.. ‘నాన్నకు డ్యూటీ అంటే ప్రాణం. ఆయన 30 ఏళ్ల సర్వీస్‌లో ఆఫ్‌లు తప్ప ఏ రోజూ లీవ్ తీసుకోలేదు. జ్వరం వచ్చినా జలుబు చేసినా కొంచెం ఓపికున్నా చాలు డ్యూటీకి వెళ్లేవాడు. పర్సనల్ పనులు ఏమన్నా ఉంటే ఆఫ్ రోజు చూసుకునేవాడు తప్ప లీవ్ పెట్టేవాడు కాదు. బేసిగ్గా నాన్న మెకానిక్. జాబ్ రాకముందు మెకానిక్‌గానే ఉన్నాడు. బస్‌కు టెక్నికల్‌గా ఏ ప్రాబ్లమ్ వచ్చినా డిపో నుంచి మెకానిక్స్ వచ్చేదాకా చూసేవాడు కాదు. తనే రిపేర్ చేసేసి డిపోకు తీసుకెళ్లిపోయేవాడు. మా ఊళ్లో చాలామంది అబ్బాయిలకు మెకానిక్ పని నేర్పించాడు. ఊరికే పనీ పాటా లేకుండా తిరిగే బదులు పని నేర్చుకుండి అని. నాన్న చనిపోయాక నాకు ఆయన ప్లేస్‌లో కండక్టర్ జాబ్ ఇచ్చారు. రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి రెండుమూడు రోజులగా బాగా ఆలోచించాడు. బహుశా ఆ ఎక్సైట్మెంట్తోనే ఆయనకు హార్ట్ఎటాక్ వచ్చిందేమో. అసలు రిటైర్మెంట్కు ఆర్నెల్ల ముందు నుంచి డ్యూటీలు వేయరట. రెస్ట్ ఇస్తారట. మరెందుకో నాన్నకు అలా ఇవ్వలేదు. పైగా ఆయనకు కంట్రోలర్‌గా ప్రమోషన్ కూడా రావల్సి ఉండింది. ఇవ్వలేదు. నాన్న ప్లేస్‌లో ఇంకో వ్యక్తికి ఇచ్చారు. అదీ మనసులో పెట్టుకున్నాడేమో. బాధ పడి ఉండొచ్చు. ప్రెషర్ ఫీలై ఉండొచ్చు. మొత్తానికి డ్యూటీ డ్యూటీ అని డ్యూటీలోనే ప్రాణం ఒదిలిండు’ అంటూ తండ్రి గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు వెంకట్. -
‘గాయత్రి’ పైరసీపై మోహన్ బాబు ఆగ్రహం
-
‘గాయత్రి విషయంలో నా మనసు ఏడుస్తోంది’
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల విడుదలైన గాయత్రి చిత్రం పైరసీపై నటుడు మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీకి పాల్పడినవారిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘పైరసీ చేసినవారు, చూసినవారు నికృష్టులు. గాయత్రి సినిమా విషయంలో నా మనసు ఏడుస్తోంది. పైరసీకి పాల్పడినవారు పాపం అనుభవించకతప్పదు. సినిమా కోసం నిర్మాతగా ఎనిమిది నెలలు కష్టపడ్డా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మంచు విష్ణు, శ్రియ నటించిన ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించారు. చాలాకాలం తర్వాత మోహన్‌బాబు హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేశారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
విష్ణు ముందంజ
చెన్నై: హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు విజయం దూరంలో నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో విష్ణు 6–3, 6–0తో రామకృష్ణన్ రంగరాజు (భారత్)పై గెలుపొందాడు. ఆదివారం జరిగే క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో సిద్ధార్థ్ రావత్‌తో విష్ణు ఆడతాడు. మెయిన్ ‘డ్రా’లో నేరుగా చోటు సంపాదించిన సాకేత్ మైనేని, యూకీ బాంబ్రీ, సుమీత్ నాగల్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, శశికుమార్ ముకుంద్ శనివారం తీవ్రంగా సాధన చేశారు. -
మహానటుల్లో ఆయన ఉంటారు
‘‘గాయత్రి’ సినిమా తండ్రి, కూతుళ్ల కథ. పూర్తిగా వారి మధ్యన నడుస్తుంది. గాయత్రిగా నిఖిలా విమల్ నటించారు. మోహన్‌బాబుగారు ద్విపాత్రాభినయం చేశారు. ఒక పాత్ర పేరు గాయత్రీపటేల్.. మరొకటి శివాజీ. గాయత్రీపటేల్ పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది’’ అని దర్శకుడు మదన్ రామిగాని అన్నారు. మోహన్‌బాబు హీరోగా విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘గాయత్రి’. అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మదన్ చెప్పిన విశేషాలు.. ► మన జీవితంలో చాలా విషయాలు కష్టమైనవి, ఇష్టమైనవి ఉంటాయి. రెండూ ముడిపడి ఉండేదే గాయత్రి. ఓ విభిన్నమైన అంశం ఈ సినిమాలో ఉంటుంది. అదేంటన్నది తెరపై చూడాలి. ► ‘గాయత్రి’ సినిమా మోహన్‌బాబుగారికి రీ–లాంచ్ లాంటిది. ఆయన మంచి సలహాలు ఇచ్చారు. ఎవరు సలహా చెప్పినా ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తారు. అదే మోహన్బాబుగారిలోని గొప్పదనం. కేవలం ఒక్క సిట్టింగ్‌లో సినిమా ఓకే చేసేశారు. ఆయనతో పనిచేయడం గర్వంగా ఉంది. ► మోహన్‌బాబుగారు మహానటుడు. అంతటి నటుణ్ణి ఎలా హ్యాండిల్ చేయగలనా? అనిపించేది. ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్, ఏయన్నార్, శివాజీ గణేశన్ గార్లు మహానటులు. ఆ జాబితాలో ఆయనుంటారు. ఆయనకు గొప్ప పాత్రలు రాయాలంతే. విష్ణు పాత్ర ఇద్దరు మోహన్బాబుల్లో ఒకరికి యంగర్ వెర్షన్‌గా ఉంటుంది. ► ఫ్యామిలీ డ్రామాల్లో కొత్త.. పాత ఉండదు. అన్నిటిలోనూ ఎమోషన్ ఉంటుంది. ట్రెండ్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు తీసినా పండుతాయి. నేను తక్కువ సినిమాలు చేయడానికి ప్రత్యేక కారణం ఏం లేదు. ఎందుకో అలా కుదిరింది. కొత్త కథలు రాసుకుంటున్నా. ఈ ఏడాదే మరో చిత్రం ఉంటుంది. అది ఎవరితో అన్నది తర్వాత చెబుతా. -
నేను లక్కీ
‘‘డైరెక్టర్ మదన్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నా గత చిత్రాలతో పోలిస్తే ‘గాయత్రి’ సినిమాలో నా పాత్ర కూడా సహజంగా, అందంగా ఉంటుంది. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా’’ అని కథానాయిక శ్రియ అన్నారు. మోహన్‌బాబు హీరోగా విష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాయత్రి’. మదన్ రామిగాని దర్శకత్వంలో మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమాని ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రియ విలేకరులతో మాట్లాడారు. ► ‘గాయత్రి’ సినిమాలో నేను ఓ చిన్న పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తా. నా క్యారెక్టర్ చాలా అమాయకంగా, నిజాయితీగా, తెలివిగా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. మోహన్‌బాబుగారు గొప్ప నటుడు. విష్ణుతో యాక్ట్ చేయడం మంచి అనుభూతినిచ్చింది. ► మదన్ ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా కూల్‌గా ఉంటారు. ఎక్కడా ఇబ్బంది పడకుండా ఈ చిత్రం తీశారు. ఆయనతో పని చేయడం చాలా బాగుంది. షూటింగ్ చేసినన్ని రోజులు బాగా ఎంజాయ్ చేశా. నాపై ఓ బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంటుంది. ► దర్శకులు, రచయితలు మంచి కథలు, పాత్రలు రాస్తున్నారు కాబట్టి ఇన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నా. నేను ఎంపిక చేసుకునే సినిమాలు కూడా నాకు బాగా కలిసొచ్చాయి. ఒక మూసలో పడిపోకుండా ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు చేసే అవకాశం వస్తోంది. అందుకే నేను లక్కీ. ► ప్రస్తుతం తెలుగులో ‘వీరభోగ వసంతరాయలు’, తమిళంలో కార్తీక్ నరేన్‌తో ‘నరగసూరన్’ సినిమాలు చేస్తున్నా. ఆ తర్వాత ఓ లేడీ డైరెక్టర్ సినిమా చేయనున్నా. యువ దర్శకులతో వరుస సినిమాలు చేయడానికి కారణం వారి కథలే. చక్కగా, వైవిధ్యంగా రాసుకుంటున్నారు. అందుకే నేను వారి సినిమాల్లో చేయడానికి ఒప్పుకుంటున్నా. -
విర్రవీగితే తొక్కేస్తాడు – మోహన్‌బాబు
‘‘మాకు తెలిసిన ఫీల్డ్, వ్యాపారం సినిమా. నటుడిగా పుట్టా. నటుడిగా.. నిర్మాతగా తప్ప వేరే వ్యాపకాలు లేవు. భగవంతుడి ఆశీర్వాదాలతో విద్యాసంస్థ స్థాపించా’’ అని నటులు మంచు మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు హీరోగా విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘గాయత్రి’. మదన్ రామిగాని దర్శకత్వంలో అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మించారు. తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కష్టపడి సినిమా తీశాం. విజయం భగవంతుని ఆశీస్సులతో ఉంటుంది. అలా తీశాం.. ఇలా తీశాం.. అంటుంటాం. కానీ అన్నీ భగవంతుడు చూస్తుంటాడు. ఎంత అణిగి మణిగి ఉంటే అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన మనకు ఇస్తాడు. విర్రవీగినప్పుడు ఒక తొక్కు తొక్కుతాడు. దాదాపు 60పైన సినిమాలు తీశాం. జయాలు.. అపజయాలున్నాయి. విజయం వచ్చినప్పుడు విర్ర వీగలేదు.. అపజయం వచ్చినప్పుడు కుంగిపోలేదు. ఐదు సినిమాలు హిట్ అయినా.. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే.. ఐదు సినిమాల హిట్టూ పోతుంది. నన్ను నటుడిగా పరిచయం చేసిన మా గురువు దాసరి నారాయణరావుగారు ఎంత గొప్ప దర్శకుడో ఈ జనరేషన్‌కి తెలీదు. మహానటుడు ఎన్టీఆర్ తర్వాత డైలాగులు చెప్పగలడని నాకు పేరొచ్చిందంటే ఆ క్రెడిట్ మా గురువుగారిదే. నన్ను నా వైఫ్ నిర్మల ఎప్పుడూ ‘బావా’ అని ప్రేమగా పిలిచేది. కానీ.. ఈ మధ్య పిలవడం లేదు. ఎందుకంటే నాకు సక్సెస్ లేదు కదా. సక్సెస్ లేకపోతే ఎవరూ పిలవరు (నవ్వుతూ). ‘గాయత్రి’ సినిమాలో శ్రియ నటన చూసి నాకు కౌగిలించుకోవాలని కోరిక ఉండేది. కానీ విష్ణు ఎక్కడ సీరియస్ అవుతాడోనని ఊరుకున్నా (నవ్వుతూ). ‘గాయత్రి’ చిత్రంలో విష్ణు తన నటనతో కంటతడి పెట్టించాడు. సెన్సార్ కాకుండా ఫిబ్రవరి 9వ తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పకూడదు. సెన్సార్ పూర్తయి అదే తారీఖుకి సినిమా విడుదలవుతుందని.. అవ్వాలని కోరుకుందాం. మదన్ ‘గాయత్రి’ సినిమాను అద్భుతంగా తీశాడు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు’’ అన్నారు. ‘‘42 ఏళ్ల కెరీర్లో ఓ పాత్రకీ మరో పాత్రకీ సంబంధం లేని పాత్రలు చేశారు మోహన్‌బాబు’’ అన్నారు ఎంపీ, ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి. మదన్ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’ సినిమాలో ఓ డైలాగ్ రాశా. ‘మనుషులను చదివినవాడు వేదాంతి అయినా అవుతాడు లేదా వ్యాపారి అయినా అవుతాడు’ అని. ఈ సందర్భంలో ఆ డైలాగ్ రాయాల్సి వస్తే ‘మనుషులను చదివినవాడు వేదాంతి అయినా అవుతాడు.. వ్యాపారి అయినా అవుతాడు.. లేదా మోహన్బాబుగారిలాగా మహా నటుడైనా అవుతాడు’’ అన్నారు. ‘‘గాయత్రి’లో నా పాత్ర నా కెరీర్లో వన్నాఫ్ ది మోస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది’’ అన్నారు విష్ణు. నటులు కోటా శ్రీనివాసరావు, గిరిబాబు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, డైరెక్టర్ బి.గోపాల్, మంచు లక్ష్మి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
మిస్టరీ విడిన విష్ణు హత్య కేసు
-
అదిరిపోయే డైలాగ్స్!
డైలాగ్స్ చెప్పడంలో మోహన్‌బాబు స్టైలే డిఫరెంట్. స్క్రీన్‌పై ఆయన డైలాగ్స్ చెబుతుంటే ప్రేక్షకుల రెస్పాన్స్ ఓ రేంజ్లో ఉంటుంది. త్వరలో విడుదల కాబోతున్న ‘గాయత్రి’లో పవర్ఫుల్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. మోహన్‌బాబు, విష్ణు, శ్రియ, నిఖిలా విమల్ ముఖ్య తారలుగా ఆర్.మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాయత్రి’. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది. టీజర్లో మోహన్‌బాబు చెప్పిన డైలాగ్స్ అదిరిపోయేలా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. ‘‘మోహన్‌బాబుగారి నటన ఈ సినిమాకు కొండంత అండ’’ అని చిత్రబృందం చెబుతోంది. అనసూయ, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. ‘గాయత్రి’ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మాజీ ఎంపీ మనవడు విష్ణు కోసం ముమ్మర గాలింపు
సాక్షి, జయనగర: పోలీసుల కళ్లుగప్పి పరారైన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడి మనవడు విష్ణు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విష్ణు తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అతని ఆచూకీ కోసం మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్నారు. అక్క చేతన, గన్‌మెన్‌తో కలిసి విష్ణు కారులో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కాళహస్తికి చెందిన విష్ణు బావ రాజేశ్‌నాయుడు కూడా వాహనంలో ఉన్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా కనిపెట్టారు. దీంతో రాజేష్‌నాయుడును అరెస్ట్‌చేసి విష్ణు ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మితిమీరిన వేగంతో కారును నడుపుతూ.. మరో కారును ఢీకొని ముగ్గురు వ్యక్తులు గాయపడేందుకు విష్ణు కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో గాయపడిన విష్ణు బెంగళూరులోని మాల్యా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఈ కేసులో మాల్యా ఆస్పత్రి వ్యవస్థాపక డైరెక్టర్ అయిన విష్ణు తల్లి డాక్టర్ తేజశ్వరి, తండ్రి శ్రీనివాసమూర్తిని పోలీసులు విచారించారు. విష్ణు తన అక్క చేతనతో కలిసి శనివారం హైదరాబాద్‌లో ఉన్నట్లు పక్కాసమాచారం అందిందని, అక్కడికి పోలీసులు వెళ్లేలోపు ఇద్దరూ పారిపోయారని, సాధ్యమైనంత త్వరగా విష్ణును అరెస్ట్ చేస్తామని దక్షిణ వలయ డీసీపీ శరణప్ప తెలిపారు. విష్ణు కుటుంబసభ్యులు, అతని స్నేహితుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో గాలింపు చేపట్టినట్లు ఆయన తెలిపారు. విష్ణు కారులో గంజాయి లభించిన నేపథ్యంలో ఎన్డీపీఎస్ కేసుతోపాటు పోలీసుల అదుపులోనుంచి తప్పించుకున్న ఘటనకు సంబంధించి ఐపీఎస్ సెక్షన్ 224, 225 కింద కేసు నమోదుచే శామని శరణప్ప తెలిపారు. విష్ణు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందిందని, రేపటిలోగా విష్ణు జాడను కనిపెట్టి అరెస్ట్ చేస్తామన్నారు. పథకం ప్రకారమే పరారీ విష్ణు పథకం ప్రకార పరారీ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. విష్ణు కారులో లభించిన గంజాయి విషయంపై విచారణ చేపట్టేందుకు పోలీసులు గత నెల 28న మధ్యాహ్నం మాల్యా ఆస్పత్రికి వెళ్లారు. అయితే విష్ణుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చామని, పది గంటల విశ్రాంతి అవసరమని విష్ణు తల్లి తేజేశ్వరి, ఇతర వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు అదే రోజు అర్ధరాత్రి 12.30గంటల సమయంలో ఆస్పత్రికి వెళ్లగా విష్ణుకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో ఒక హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను బందోబస్తుగా ఉంచారు. అయితే 29వ తేదీ ఉదయం 6.15గంటల సమయంలో విష్ణు అత్యవసర ద్వారం నుంచి ఉడాయించాడు. -
అఅఆచారి మలేసియా యాత్ర
అదేంటి... ‘ఆచారి మలేసియా యాత్ర’ అంటున్నారు? మంచు విష్ణు కొత్త సినిమా పేరు ‘ఆచారి అమెరికా యాత్ర’ కదా! టైటిల్ ఏమైనా మారిందా? అనుకోవద్దు. ఎందుకంటే... టైటిల్ మారలేదు. జస్ట్... షూటింగ్ స్పాట్ మారిందంతే. మంచు విష్ణు హీరోగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తీ చౌదరి, కిట్టు నిర్మిస్తున్న సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. విష్ణుకు జోడీగా ప్రగ్యా జైశ్వాల్, కీలక పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నారు. ఈ సినిమా మూడో షెడ్యూల్ ఆదివారం మలేసియాలో మొదలైంది. ‘‘మల్లాది వెంకట కృష్ణమూర్తి అద్భుతమైన కథ అందించారు. విష్ణు–బ్రహ్మానందం కలయికలో సన్నివేశాలు విపరీతంగా నవ్విస్తాయి. ఈ మలేసియా షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై వినోదాత్మక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్ తర్వాత యూనిట్ అమెరికా వెళ్లనుంది. అక్కడ మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేశాం’’ అన్నారు నిర్మాతలు. తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, ఎల్బీ శ్రీరామ్, విద్యుల్లేఖా రామన్, ‘ప్రభాస్’ శీను, పోసాని తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మాటలు: ‘డార్లింగ్’ స్వామి, సంగీతం: ఎస్.ఎస్. తమన్, కూర్పు: ఎస్.ఆర్. శేఖర్, కళ: కిరణ్, కెమెరా: సిద్ధార్థ. -
తండ్రికి నిరంతరం కొడుకు ధ్యాసే!
మహానుభావుడు, ధర్మవేత్త, గొప్ప ఆచార్యుడు, మహా పరాక్రమవంతుడయిన ద్రోణుడు–చేతిలో ఆయుధం ఉన్నంతసేపు యుద్ధరంగంలో ఆయనను ఆపగలిగిన వాడు లేడు. అంత విలువిద్యను పొందిన అర్జునుడే సాక్షాత్తూ ఎదురుగా నిలబడినా ఆపడం అసాధ్యం.అంతటి ద్రోణాచార్యుడు ఒక్కమాటకి పడిపోయాడు. కారణజన్ముడైన ధృష్టద్యుమ్యుడు యుద్ధరంగంలో ఎదురుగా కాచుకుని ఉన్నాడు, ఆయనని చంపడానికి. కుదరడం లేదు. కారణం–ద్రోణుడి చేతిలో ఆయుధం ఉంది. అది విడిచిపెడితే తప్ప చంపడం కుదరదు. అసలు ద్రోణాచార్యుల వారితో యుద్ధమంటే మాటలు కాదు, మహాభారతం చదవాలి.. ఆహా...ఎంత వ్యూహరచన చేస్తాడో మహానుభావుడు... ధర్మజుణ్ణి పట్టిస్తానని మాటిచ్చాడు దుర్యోధనుడికి. ద్రోణాచార్యులవారు విజృంభించి యుద్ధం చేస్తుంటే ఎవరూ నిలబడలేక పోతున్నారు. ఇక ఇది సాగకూడదనుకున్న శ్రీకష్ణ భగవానుడు ధర్మం నిలబడాలి కనుక వ్యూహరచన చేసాడు. భీముడి చేత అశ్వత్థామ అనే ఏనుగుని పడగొట్టించేసాడు. ‘అశ్వత్థామ హతః కుంజరః’ అన్నాడు. చచ్చిపోయింది అశ్వత్థామ అనే ఏనుగయితే, ఏనుగు చచ్చిపోయిందని చెప్పకుండా ’అశ్వత్థామ చనిపోయాడు’ అన్నాడు. ద్రోణుడి కుమారుడి పేరు కూడా అశ్వత్థామ. అంతే! ద్రోణాచార్యుల వారు ముందు నమ్మలేదు. నిరుత్తరుడై పోయాడు. అయినా ఆయుధం ఇంకా చేతిలోనే ఉంది. అది నిర్ధరణ చేసుకోవడానికి ధర్మరాజువంక తిరిగాడు. ’నిజమా !’ అని అడిగాడు శిష్యుణ్ణి. ఎంత సంఘర్షణో !!! ఎదురుగా ఉన్నవాడు గురువు. గురుపుత్రుడు గురువుతో సమానం. అబద్ధం చెప్పడానికి నోరురావడం లేదు. నిన్నెవరు అబద్ధం చెప్పమన్నారయ్యా, నిజమే చెప్పు’ అన్నాడు శ్రీకష్ణ పరమాత్మ. ‘అశ్వత్థామ హతః కుంజరః’ అను. కుంజరః అన్నప్పుడు మేం భేరీలు మోగిస్తాం’ అన్నాడు. ఎంతయినా గురుపుత్రుడు చచ్చిపోయాడన్న భావన ఉంది అందులో. పైగా గురువుగారి మరణానికి కారణమవుతోందది. అయినా ధర్మరాజు ’అశ్వత్థామ హతః..కుంజరః’ అన్నాడు. ’కుంజరః’ అన్నప్పుడు భేరీలు మోగించారు. ’ అశ్వత్థామ హతః’ అన్నంత వరకే వినబడింది, కుంజరః అన్నది వినపడలేదు – ద్రోణా చార్యుల వారికి. అంతే ఆయుధం వదిలి పెట్టేసాడు. ఆయన ఎంతటి యోగమూర్తో తెలుసా! ఆయన ఆచార్య అనిపించుకున్నాడంటే కేవలం విలువిద్య ఒక్కటే కాదు ఆయన విశిష్టత. ఆయన ధర్మం అటువంటిది. ధర్మానికి నిలబడ్డవాడే ఆచార్యుడు తప్ప ప్రతి వాళ్లూ పేరు ముందు అసంబద్ధంగా తగిలించుకున్నంత మాత్రాన ఆచార్యులు కాలేరు. ఆయన అనుష్ఠానం అటువంటిది. ఆయుధాన్ని విడిచిపెట్టిన ఉత్తరక్షణంలో మూలాధార చక్రం దగ్గర్నుంచీ యోగవిద్యతో ప్రాణవాయువును పైకి లేపి బ్రహ్మరంధ్రంగుండా నిష్కమ్రింప చేసాడు. అప్పుడు ధృష్ట్టద్యుమ్నుడు దూకాడు. చచ్చిన ద్రోణుడిని చంపాడు. అర్జునుడు ఎంత బాధపడ్డాడో, ధర్మరాజు ఎంత ఏడ్చాడో ! అంతటి మహానుభావుడు, అంతటి పరాక్రమశీలి, అంతటి ఆచార్యుడు కేవలం కొడుకు పడిపోయాడన్న మాటకూడా వినలేకపోయాడు. ఆ ఒక్క చిన్న పలుకు చంపేసిందంతే. కొడుకు చచ్చిపోయాడన్న మాట వినడం తండ్రికి ఎంత బాధాకరమో, ఎంతటి వాడెంత నైరాశ్యానికి లోనయిపోతాడో, ఎంత బాధ పడిపోతాడో.. కొడుకు అంటే ప్రాణం వదిలి పెట్టేస్తాడు తండ్రి. సర్వకాలాల్లో కొడుకుకు రక్షణ కలిగించడం తప్ప, కొడుకు సంతోషపడాలని కోరుకోవడం తప్ప అసలు తన జీవితంలో మరొక ఆలోచన లేకుండా ఉండేవాడు ఎవడో ఆయనే తండ్రి. కొడుకు సంతోషం తప్ప మరో ధ్యాస ఉండదు. అందుకే తండ్రి – బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపాలుగా ప్రత్యక్ష దైవంగా ఉంటాడు. -
నైపుణ్యాల లేమితో ఉపాధిలో వెనుకబాటు
భీమవరం : ఇంజినీరింగ్ విద్యార్థుల్లో భాషాపరమైన, భావ ప్రకటనకు సంబంధించిన నైపుణ్యాలు తక్కువగా ఉండటంతో ఉపాధి అవకాశాలు పొందడంలో వెనుకబడిపోతున్నారని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ అన్నారు. భీమవరం బీవీ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో శనివారం జరిగిన విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువ ఇంజినీర్లు ఆంగ్లంపై పట్టు సాధించాలని, ఇందుకు దిన, వార పత్రికలు చదవాలని సూచించారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తితో పాటు సమస్య విశ్లేషణ, పరి ష్కార మార్గాల రూపకల్పన, సంక్లిష్ట సమస్యను పూర్తిగా అర్థం చేసుకో వడం, అత్యాధునిక పరికరాల విని యోగం, భావప్రకటన నైపుణ్యం, నా యకత్వ లక్షణాలు వంటివి కలిగి ఉండాలన్నారు. వాస్తవిక సమస్యలను పరిష్కరిస్తూ మౌలికాంశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలని సూచిం చారు. చదువుతో పాటు ప్రాజెక్ట్ రూపకల్పనలో ఆసక్తి చూపినప్పుడే భవిష్య త్ బాగుంటుందన్నారు. విట్ కళాశాల ప్రిన్సిపాల్ దశిక సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలన్నారు. సమాజంలో జరిగే అన్ని విషయాలపైఅవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సి పాల్ జి.శ్రీనివాసరావు మాట్లాడారు. అనంతరం కళాశాల యాజమాన్యం లక్ష్మీనారాయణను సత్కరించింది. కళాశాల డైరెక్టర్ జె.ప్రసాదరాజు, వైస్ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరాజు తదితరు లు పాల్గొన్నారు. -
భారీ స్కాంపై మంచు వారి సినిమా
వరుస ఫెయిల్యూర్స్ ఎదురవుతుండటంతో మంచు ఫ్యామిలీ హీరోలు కథల ఎంపికలో కొత్త దనం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎక్కువగా రొటీన్ కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తున్న వచ్చిన మంచు ఫ్యామిలీ హీరోలు ప్రస్తుతం రియలిస్ట్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ స్కాం నేపధ్యంలో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మంచు ఫ్యామిలీ హీరోలు. అమెరికా వాళ్లను మోసం చేసి కోట్ల కొద్ది డబ్బును వేనకేసుకున్న మీరా రోడ్ కాల్ సెంటర్ స్కాంను సినిమాగా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే ఈ స్కాంకు సంబంధించిన పూర్తి స్థాయి విషయాలు తెలుసుకునేందుకు మంచు టీం థానే పోలీసులను సంప్రదించింది. అయితే ఈ విషయంలో మంచు ఫ్యామిలీ నుంచి తెలుగు మీడియాకు సమాచారం అందకపోయినా బాలీవుడ్ మీడియాలో ఈ మేరకు కథనాలు వచ్చాయి. మరి ఈ సినిమాలో మంచు ఫ్యామిలీ నుంచి ఎవరు హీరోగా నటిస్తారో చూడాలి. -
హిట్ కాంబినేషన్ రిపీట్
‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’... మంచు విష్ణు హీరోగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ రెండు చిత్రాలూ హిట్. ఆ విధంగా ఈ ఇద్దరూ హిట్ కాంబినేషన్ అనిపించుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సినిమా చేయనున్నారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో కీర్తీ చౌదరి, కిట్టు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘ఆచారి ఆమెరికా యాత్ర’ అనే టైటిల్ నిర్ణయించారు. ‘‘ఇది హిలేరియస్ ఎంటర్టైనర్. ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలోనే జరుపుతాం. విష్ణు–బ్రహ్మానందం కాంబినేషన్ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ నెల 19న మోహన్‌బాబు గారి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆ రోజు ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో విష్ణు సరసన అమైరా దస్తుర్ కథానాయికగా నటించనున్నారట. ఈ చిత్రానికి కథ: మల్లిడి వెంకట కృష్ణమూర్తి, డైలాగ్స్: ‘డార్లింగ్’ స్వామి, సంగీతం: శేఖర్ చంద్ర. -
‘విష్ణు’దౌర్జన్యాలు అరికట్టండి
– వైఎస్ఆర్సీపీ సీఈసీ మెంబర్ కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ)/కల్లూరు(రూరల్): కర్నూలు మాజీ మండలాధ్యక్షుడు, టీడీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి డి.విష్ణువర్దన్‌రెడ్డి దౌర్జన్యాలు పెచ్చుమీరిపోతున్నాయని, టీడీపీ పాలకులు మేలుకుని వాటిని అరికట్టాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీఈసీ మెంబర్ కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన పార్టీ మండల నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భర్తలు బతికే చనిపోయినట్లు చిత్రీకరించి ఉల్చాల గ్రామంలో ఎనిమిది మంది లబ్ధిదారుల పేర్లు పెన్షన్ల జాబితాలో చేర్పించడం విడ్డూరమన్నారు. ఆ జాబితాలో ఉన్న వారికి పెన్షన్లు మంజూరు చేయాలనే అంశంపైనే విష్ణు మద్దతుదారులతో గురువారం భారీ ఊరేగింపు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. దేవాదాయ శాఖ నుంచి నిధులు రాబట్టుకునే దురుద్దేశంతో సి.బెళగల్ మండలం పోలకల్లు గ్రామంలోని చెన్నసోమేశ్వర ఆలయాన్ని పడగొట్టే పథకానికి ప్రణాళిక రూపొందించుకున్నారని ఆరోపించారు. మొదట వీఆర్వోగా పనిచేసిన విష్ణువర్దన్‌రెడ్డి..1985లో 20 ఎకరాల ఆస్తితో రాజకీయ జీవితం ప్రారంభించి నేడు కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలు పొందాలనుకుంటే పర్సెంటేజీలు ఇవ్వాల్సిందేనా అని ప్రశ్నించారు. పొలానికి నీళ్లు కావాలన్నా.. రైతులు రూ.2వేలు ఇచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విష్ణుపై పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అధికారులను బెదిరించడానికే ధర్నాలు చేయిస్తారని తెలిపారు. ఇతనికి డిప్యూటీ సీఎం కె.ఇ.కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, చివరికి ఎమ్మెల్యే మణిగాంధీతో కూడా సత్సంబంధాలు లేవన్నారు. మాతృమూర్తికి అన్నం పెట్టలేని ఇలాంటి వ్యక్తి అధికార పార్టీలో కొనసాగడం విచారకరమన్నారు. అవినీతిలో కర్నూలు మండల టీడీపీ నేతలు జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నారని, తర్వాతి స్థానంలో కోడుమూరు నిలిచిందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ కర్నూలు మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు, సి.బెళగల్ మండల కన్వీనర్ ఎర్రన్న, గూడూరు మండల కన్వీనర్ సుధాకర్, కర్నూలు మండల కార్యదర్శి సయ్యద్, నాయకులు ఎదురూరు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
భక్తి, జ్ఞాన కుసుమాల మాల విష్ణుసహస్రం
–వేలాది భక్తుల సమష్టి సహస్రనామ గానం –త్రిదండి చిన్న శ్రీమన్నారాయణరామానుజ జీయరుస్వామి ఉపదేశం రాజమహేంద్రవరం కల్చరల్ : విష్ణుసహస్రనామ స్తోత్రం జ్ఞానకుసుమాల మాల, ఒకో నామం ఒకో పారిజాత కుసుమమని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి పేర్కొన్నారు. మంగళవారం ఎస్.కె.వి.టి.డిగ్రీ కళాశాలలో శ్రీరంగధామం ఆధ్వర్యంలో జరిగిన విరాట్ విష్ణుసహస్రనామ పారాయణలో ఆయన పాల్గొని, అనుగ్రహభాషణం గావించారు. సాధారణంగా భక్తుడు భగవంతుని సన్నిధిని చేరుకోవడానికి తాపత్రయ పడతాడు, కానీ, స్వచ్ఛంద మరణాన్ని వరంగా కలిగిన భీష్ముడు ప్రాణం వదిలే సమయం కోసం నిరీక్షిస్తున్న తరుణంలో, శ్రీకృష్ణభగవానుడే స్వయంగా పాండవాగ్రజునితో అంపశయ్య మీద ఉన్న భీష్ముని వద్దకు వచ్చాడని జీయరు స్వామి వివరించారు. నేడు ప్రపంచమంతా అభద్రతాభావంలో మునిగి ఉంది. వ్యక్తుల మధ్య, మతాల మధ్య, ఒకే మతంలో విభిన్న విభాగాల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. ఉగ్రవాదం ఊపిరి పోసుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భయాలు తొలగాలంటే, ప్రేమ చిగురించాలి, మనమంతా ఒకే కుటుంబానికి చెందినవారమన్న భావన కలగాలి, విష్ణుసహస్రనామానికి ఆ శక్తి ఉన్నదని జీయరుస్వామి వివరించారు. భగవద్రామానుజాచార్యులు అవతరించిన సహస్రాబ్ధిలో మనం జన్మించడం, ఆయన్ను స్మరించుకుంటూ విష్ణుసహస్రనామాన్ని పారాయణ చేయడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. వికాసతరంగిణి ఆధ్వర్యంలో ప్రచురించిన శ్రీరామానుజ సంకీర్తన పుస్తకాన్ని జీయరు స్వామి ఆవిష్కరించారు. ప్రాచార్య శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ ఈ సృష్టిలో విష్ణుసహస్రనామాన్ని మించిన జ్ఞానపేటిక మరొకటి లేదని అన్నారు. వేయినామాలు చదవలేకపోయినవారు తొలి మూడు నామాలు చదివినా అనంత శుభఫలితాలు కలుగుతాయన్నారు. నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ భగవద్రామానుజాచార్యులు ప్రపంచానికి సోషలిజం బోధించిన తొలి వ్యక్తి అని అన్నారు. త్రిదండి దేవనాథజీయరుస్వామి, పులిగొల్ళ కృష్ణమాచార్యులు, సముద్రాల రంగరామానుజాచార్యులు ప్రసంగించారు. శతావధాని అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు భాగవతంలోని పద్యాలను రాగ, భావ యుక్తంగా గానం చేశారు. పొంగిపొరలిన భక్తిరసవాహిని వేలాది గళాలు భక్తి పారవశ్యంతో విష్ణుసహస్రనామాలను పారాయణ చేశారు. వేదవ్యాసభారతం, అనుశాసన పర్వంలో భీష్మాచార్యుడు శ్రీకృష్ణభగవానుని సన్నిధిలో ధర్మజునికి సహస్రనామాలు వినిపిస్తే, మంగళవారం త్రిదండి చిన్న జీయరుస్వామి సన్నిధిలో, వేలాది భక్తులు సహస్రనామాలను పారాయణ చేశారు. కళాశాల ఆవరణ అంతా దేవదేవుని నామస్మరణతో మారుమోగింది. -
రియల్ లైఫ్‌కి దగ్గరగా... రీల్ లైఫ్‌కి దూరంగా!
‘‘తెలుగు చిత్రసీమ నాకు తల్లితో సమానం. తల్లినీ, తెలుగు చిత్రసీమనీ ఎప్పుడూ మరువను. వరుస తమిళ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల తెలుగులో గ్యాప్ వస్తోంది’’ అన్నారు హన్సిక. మంచు విష్ణుకి జోడీగా ఆమె నటించిన ‘లక్కున్నోడు’ రిలీజ్ ఈ రోజే. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ – ‘‘మంచు విష్ణు మా ఫ్యామిలీ మెంబర్‌తో సమానం. తనతో నటించిన మూడో చిత్రమిది. ఇందులో పాజిటివ్ పద్మ పాత్ర చేశా. నా రియల్ లైఫ్‌కి దగ్గరగా, గత చిత్రాల్లో చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. దర్శకుడు రాజకిరణ్ చాలా ఫాస్ట్. 50 రోజుల్లో మంచి క్వాలిటీతో సిన్మా తీశారు. తండ్రి సెంటిమెంట్‌తో కూడిన చక్కని ప్రేమకథ. లక్కీగా భలే రిలీజ్ డేట్ దొరికింది. ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నా. ఇక, వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే... ఇప్పటివరకూ 31మందిని దత్తత తీసుకున్నా. రెండేళ్లలో ఓ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలనుంది’’ అన్నారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంతో పాటు మరికొన్ని తమిళ సినిమాల్లో హన్సిక నటిస్తున్నారు. ‘జయం’ రవికి జోడీగా ఆమె నటించిన తమిళ చిత్రం ‘బోగన్’ వచ్చె నెల 9న విడుదల కానుంది. -
సింగం వెనక్కి.. లక్కీ ముందుకి!
అతని పేరు లక్కీ. పేరులో ఉన్న అదృష్టం జీవితంలో లేదనుకుంటాడు. అయితే.. అనూహ్యంగా ఓ రోజు అతడి దగ్గరకి పాతిక కోట్లు వస్తాయి. ఆ డబ్బు ఎవరిది? చేతికి డబ్బు వచ్చిన తర్వాత లక్కీ ఏం చేశాడు? అసలు కథేంటో తెలుసుకోవాలంటే ‘లక్కున్నోడు’ చూడాల్సిందే. మంచు విష్ణు, హన్సిక జంటగా రాజకిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన సినిమా ‘లక్కున్నోడు’. ఈ నెల 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. మొదట ‘లక్కున్నోడు’ని ఫిబ్రవరి 3న రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ 26న రిలీజ్ కావాల్సిన సూర్య ‘సింగం–3’ వాయిదా పడడంతో లక్కీగా మంచు విష్ణు ముందుకి రావాలనే నిర్ణయం తీసుకున్నారు. చెన్నైలో ‘జల్లికట్టు’ ఉదంతం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ‘సింగం–3’ రిలీజ్‌కి ఇది సరైన సమయం కాదని భావించి వాయిదా వేశామని తెలుగు వెర్షన్ ‘ఎస్3–యముడు3’ నిర్మాత మల్కాపురం శివకుమార్ తెలిపారు. -
అమ్మ పరబ్రహ్మమే!
బ్రహ్మ, విష్ణు అంశలతోపాటూ అమ్మలో శివాంశ కూడా ఉంటుందనీ, అమ్మ శివస్వరూపమై ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతుందనీ, పరమ శివుడిలా నిత్య ప్రళయం చేస్తుందనీ తెలుసుకుంటున్నాం. అమ్మ పరమేశ్వరుడిలా ఆత్యంతిక ప్రళయం కూడా చేస్తుంది. అంటే జ్ఞానమివ్వడం. శిశువు పెరుగుతున్న దశలో అమ్మ వాడిని ఊయలలో పడుకోబెట్టి నిద్రపుచ్చడానికి జోలపాట పాడుతుంది. ఏవో నోటికొచ్చిన పాటలు పాడుతుంటే వాడవి వింటూ నిద్రలోకి జారుకుంటాడు. ఎంత పాటలు రాని తల్లయినా... ళొలబళొల... హాయీ అంటూ ఏవో శబ్దాలు చేస్తూ పాడుతుంది. ఏమిటా పాట? ‘‘ఓరి పిచ్చాడా, నేను నా నోటితో అమంగళం పలకకూడదు. నీకు ఈ తిరగడం (ఒక జన్మనుంచి మరొక జన్మకు) అలవాటయి పోయిందిరా. ప్రయోజనం లేని తిరుగుడు. పునరపి జననం, పునరపి... అక్కడ వదిలిపెట్టి ఇక్కడ పుట్టడం, ఇలా వెళ్ళడం... అలా రావడం.. ఇదే బాగుందని పడుకుని సుఖపడుతుండడం... ఇది కాదురా ళొలబళొలబ... హాయి...’’ అంటూ తొలి గురువై మొదటి వేదాంతం చెబుతుంది అమ్మ. బిడ్డ ఇంకొంచెం పెద్దయ్యాక... గోరుముద్దలు తినిపిస్తూ కథలు చెబుతుంది. అమ్మ అన్నం పెట్టినట్లుగా పెట్టగల వ్యక్తి ఈ సృష్టిలో మరొకరుండరు. ఒకసారి అమ్మ వెళ్ళిపోతే... ఇక అలా అన్న పెట్టడం కట్టుకున్న భార్యకు కూడా సాధ్యంకాదు. భార్యగా తనబిడ్డలకు పెట్టగలదేమో గానీ భర్తకు అలా పెట్టలేదు. అమ్మే పెట్టాలి అలా ఎందుచేతంటే... బిడ్డకు అన్నం పెడుతున్నప్పుడు ఎవరూ చూడక పోయినా చూశారేమోననే అనుమానంతో... ఎందుకైనా మంచిదని ఇంత ముద్ద తీసి గిరగిరతిప్పి అవతల పారేస్తుంది. ఎంత భయమంటే... ఈవేళ ఇంత అన్నం తిన్నాడని నేననుకున్నట్లే ఎవరైనా అనుకుంటారేమోనని భయం, తను కూడా అలా అనుకున్నందుకు భయం..ఈ లక్షణం కేవలం అమ్మలో మాత్రమే ఉంటుంది. అమ్మచేతి అన్నం అమృతంతో సమానం. అమ్మ గోరుముద్దలు తినిపించేటప్పుడు కూడా ఏవో కథలు చెబుతుంటుంది. పెద్ద పెద్ద కథలు చెప్పక్కర్లేదు. అవి రామాయణ, భారత, భాగవతాల కథలే కానక్కరలేదు.. ఏవో నోటికొచ్చిన మాటలను కథలుగా అల్లి... అనగనగనగా ఒక ఊళ్ళో ఒక ముసిలవ్వ ఉండేది రోయ్.. అని మొదలుపెడుతుంది... నిజంగా ఉండేదా ?... ఏమో.. వాడు మాత్రం అవి పరమ ఆసక్తిగా వింటూ ఊ..ఊ.. అంటూ ఊకొడుతూ.. తింటూంటాడు. ఇలా కథలు చెప్పే ఏ అమ్మ అయినా.. చివరన ఒక మాటంటుంది. ‘‘కథ కంచికి మనం ఇంటికి’’... అంటుంది. అంటే ??? అందులో అమంగళత్వాన్ని అమ్మ పలకదు. చెప్పదలచుకున్న విషయాన్ని ఎంత మంగళప్రదంగా చెబుతుందో! ‘‘ఎన్నోసార్లు పుట్టావు. ఎన్నోసార్లు పెరిగావు. ఎన్నోసార్లు శరీరం విడిచిపెట్టావు. లోపల జీవుడలా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఈసారి నీ కథ కంచికి చేరిపోవాలి. అంటే నీవు ఈ జన్మలో కామాక్షిలో ఐక్యమయిపోవాలి. నీవు మళ్ళీ రాకూడదు’’ అని చెప్పాలి. కానీ ఈ మాట నోటివెంట ఎలా పలుకుతుంది? తల్లి కనుక... అలా చెప్పలేని కథను కంచికి పంపుతుంది. చివరకు అన్ని కథలూ కంచికే చేరిపోవాలి. అంటే అందరం కామాక్షిలోనే ప్రవేశించాలి. ‘‘కానీ ఇప్పుడు కాదురోయ్! నేనుండగా కాదు. నువ్వు పండిన తర్వాత... అప్పుడు కూడా నేనే ముందు, ఆ తర్వాతే నువ్వు. ఎందువల్ల? తన కళ్ళముందు బిడ్డ అలా పండడాన్ని అమ్మగా చూడలేదు కనుక. అందుకని ‘‘నేను ముందు వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి రా.. మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం..’’ అనుకుంటూ లోపలికి తీసుకెళ్ళిపోతుంది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
విద్యుదాఘాతానికి యువరైతు బలి
జగిత్యాల: అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఓ యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలం శానబండలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విష్ణు(32) పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
నిషేధిత విక్రయాలపై నిఘా
ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ భెంసా: నిషేధిత విక్రయాలపై పకడ్బందీగా నిఘా సారిద్దామని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్. వారియర్ అన్నారు. శనివారం భైంసా డీఎస్పీ కార్యాలయంలో పట్టణవాసులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేదిత గుట్కా లు, అక్రమమధ్యం, మట్కా, జూదంలాంటి సమాచారం తెలిస్తే నేరుగా తనకు అందించవచ్చన్నారు. ప్ర భుత్వం నిషేదించిన వాటిని విక్రయించరాదని సూ చించారు. పట్టణ అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారిద్దామని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తామని, ఇం దుకు ప్రజలు పూర్తిగా సహకరించాలన్నారు. నిర్మల్ జిల్లాలో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ పన్ను లు చెల్లించకుండా దొడ్డిదారిన అక్రమంగా వెళ్లే వాహనాలపై ప్రజలు నిఘా ఉంచాలని, అట్టిసమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు తెలి యజేయాలని కోరారు. ప్రతీ ఒక్కరు మొక్కలు సంరక్షించాలి నిర్మల్ అర్బన్: ప్రతీ ఒక్కరు మొక్కలను సంరక్షించాలని ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని సా యుధ దళ కార్యాలయంలో శుక్రవారం ఆయన యూ నిట్ జెండాను ఎగురవేశారు. అనంతరం కార్యాల యూన్ని సందర్శించారు. పోలీసులకు విశ్రాంతి కోసం బ్యారక్‌ను మంజూరు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యాలయంలో జనరేటర్, ఇన్వర్టర్ను ఏర్పా టు చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్క లు నాటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఆర్ఐ సాయినాథ్, ఎంటీవో కృష్ణ, ఆర్ఎస్సైలు వినోద్, శ్రీకాంత్ , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
తీపి... చేదు మిశ్రమాల ఉగాది
2012లో రిలీజైన పవన్ కల్యాణ్ ‘గబ్బర్‌సింగ్’ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అందుకే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉగాదికి సందడి చేయడానికి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తెర మీదకొచ్చాడు. సినిమా మొత్తం ఆటాపాటలతో సందడి సందడిగానే సాగింది. కానీ, పవన్ నుంచి ఇంకా భారీగా ఎక్స్పెక్ట్ చేశారు. ఆ భారీ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. దాంతో చేదు అనుభవమే మిగిలింది. దాదాపు 75 కోట్లతో తీసిన ఈ సినిమా సుమారు 50 కోట్లు రాబట్టగలిగింది. ఆ తర్వాత వారం గ్యాప్‌తో మంచు విష్ణు, రాజ్ తరుణ్ ‘ఈడో రకం ఆడో రకం’ రిలీజైంది. మంచి ఎంటర్టైనర్ అనిపించుకుని, ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్‌గా నిలబడింది. అనంతరం వారం రోజులకు అల్లు అర్జున్ ‘సరైనోడు’వచ్చాడు. టైటిల్‌కి తగ్గట్టే వసూళ్ల పరంగా ‘సరైనోడు’ అనిపించుకున్నాడు. సుమారు రూ.50 కోట్లతో తీసిన ఈ సినిమా రూ.90 కోట్ల్ల వరకూ వసూలు చేసింది. అల్లు అర్జున్ కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్ ఇది. -
విద్యుధ్ఘాతానికి యువరైతు బలి
వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన ఓ యువరైతు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా వెంకటాపురం మండలం మరికల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విష్ణు(20) అనే యువరైతు వ్యవసాయ మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హాస్యభరితంగా ఇవన్ యారెండ్రు తెరిగిరదా
ప్రేక్షకుల మధ్య ఎవర్గ్రీన్ చిత్రాలంటే వినోదభరిత కథా చిత్రాలే. ఆ తరహాలో వస్తున్న చిత్రం ఇవన్ యారెండ్రు తిరిగిరదా. దర్శకుడు సుశీంద్రన్ శిష్యుడు ఎస్టీ.సురేశ్‌కుమార్ మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం ఇది. ఒన్ సినిమా పతాకంపై టీఈ.అశోక్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు, వర్ష, ఇషారానాయర్, కే.భాగ్యరాజ్, జయప్రకాశ్, అరుళ్దాస్, భగవతి పెరుమాళ్, రామ్, అర్జున్, రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ప్రేమికులరోజున పుట్టిన హీరో ప్రేమించడానికి ప్రియురాలు లభించిందా? లేదా? అన్న ఇతివృత్తంతో ప్రేమ, హాస్యానికి పెద్ద పీట వేసి తెరకెక్కించిన చిత్రం ఇవన్ యారెండ్రు తెరిగిరదా అని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ ధ్రువపత్రం పొందిందని చెప్పారు. చిత్రాన్ని వినోదపు పన్ను రద్దు కమిటీకి ప్రదర్శించగా వారు కడపుబ్బ నవ్వుకున్నట్లు ప్రశంసించారని తెలిపారు. ఆ కమిటీలో సభ్యులైన ప్రముఖ దర్శకుడు పి.వాసు చాలా కాలం తరువాత తనను తాను మరచేలా మీ చిత్రం నవ్వించిందని అభినందించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనికి పీ అండ్ జీ చాయాగ్రహణం, ఎన్ఆర్.రఘునందన్ సంగీతాన్ని, పాటలను యుగభారతి, ఎడిటింగ్‌ను గోపీకృష్ణ, ఫైట్స్ కంపోజింగ్‌ను కబాలి ఫేమ్ అన్బరివు నిర్వహించినట్లు దర్శకుడు వెల్లడించారు. -
మరో నయీమ్‌గా మారిన విష్ణు
- మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి ఆరోపణ - అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు గూడూరు(కర్నూలు జిల్లా): టీడీపీ కోడుమూరు ఇన్చార్జి విష్ణువర్దన్‌రెడ్డి అక్రమాలు, దౌర్జన్యాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతూ మరో నయీంను తలపిస్తున్నారని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ స్థానిక నాయకుడు డీటీ విఠల్ గహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలు, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. ప్రతి గ్రామంలో ఐదారుగురు రౌడీలను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దందాలు సాగిస్తున్నారన్నారు. విష్ణు అనుచరుడు, గూడూరు మున్సిపల్ చైర్పర్సన్ సుభాషిణి బావ కరుణాకరరాజు మున్సిపాల్టీలో పెత్తనం చెలాయిస్తున్నాడన్నారు. రూ.లక్ష ప్రకారం ఇప్పించుకుని 40 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించుకున్నాడని, అపర్డబుల్ హౌసింగ్ సొసైటీ పేరుతో 100 మంది నుంచి రూ. 50 వేల చొప్పున వసూలు చేశాడన్నారు. మునుగాల ఎత్తిపోతల పథకాన్ని చేతుల్లోకి తీసుకుని వసూళ్లు సాగిస్తున్నాడన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతూ ప్రశ్నించిన వారి నోరు మూయిస్తున్నాడని, చివరకు ఎల్లెల్సీ అధికారులనూ భయపెట్టి అధికారం చెలాయిస్తున్నాడని కొత్తకోట ఆందోళన వ్యక్తం చేశారు. విష్ణు అక్రమాలను నియంత్రించాల్సిన ఎమ్మెల్యే మణిగాంధీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా విష్ణు అక్రమాలను సీఎం దష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం విష్ణు అనుచరులు కరుణాకరరాజు, గుడిపాడు మహేశ్వరరెడ్డిపై కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతుల నుంచి డబ్బు వసూలు చేసిన రశీదులు, ఆధారాలతో ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. కొత్తకోట వెంట గూడూరు, సి.బెళగల్, కర్నూలు మండలాల పార్టీ కన్వీనర్లు ఎల్.భాస్కర్‌రెడ్డి, ఎర్రన్న, వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా కార్యదర్శి చనుగొండ్ల దౌలా, కర్నూలు మండల కార్యదర్శి ఎం.సయ్యద్‌సాహెబ్, స్థానిక నేతలున్నారు. -
ముచ్చటగా మూడోసారి
సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లను సెంటిమెంట్‌గా భావిస్తారు. హీరో, హీరోయిన్.. హీరో, దర్శకుడు... ఇలా అన్నమాట. ఇప్పుడు హీరో మంచు విష్ణు, హీరోయిన్ హన్సికలదీ అటువంటి కాంబినేషనే అని చెప్పాలి. ‘దేనికైనా రెడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రాలతో వీళ్లిద్దరూ హిట్ జోడీ అనిపించుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జోడీ కట్టారు. ‘గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి హార్రర్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాజాకిరణ్తో విష్ణు ‘లక్కున్నోడు’ పేరుతో ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విష్ణుకు జోడీగా హన్సికను ఎంపిక చేసినట్లు నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: పీజీ విందా, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, అచ్చు, సహ నిర్మాతలు: వీఎస్ఎన్ కుమార్, విజయ్‌కుమార్‌రెడ్డి. -
సెయిలింగ్ చాంప్స్ కౌషల్, విష్ణు జోడి
సాక్షి, హైదరాబాద్: హోబీ-16 ఓపెన్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో కౌషల్ కుమార్ యాదవ్, విష్ణు ప్రసాద్ జోడి విజేతగా నిలిచింది. శుక్రవారం హుస్సేన్‌సాగర్‌లో జరిగిన 10 రేసుల్లో ఈ జోడి 12 పాయింట్లు సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా... జస్ప్రీత్ సింగ్, నితీశ్ కుమార్ జోడి 26 పాయింట్లతో రెండో స్థానంలో, ఆశిష్ కుమార్, నగి బెహరా జోడి 29 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాయి. రెండో రోజు ఫలితాలు ఏడో రేసు: 1. కౌషల్ -విష్ణు ప్రసాద్, 2. దిలీప్ సర్మాహ్- దర్శన్ 3. జస్ప్రీత్ సింగ్-నితీశ్ కుమార్. ఎనిమిదో రేసు: 1. కౌషల్ -విష్ణు ప్రసాద్, 2. ఆశిష్ కుమార్- నగి బెహరా, 3. జస్ప్రీత్ సింగ్-నితీశ్ కుమార్. తొమ్మిదో రేసు: 1. జస్ప్రీత్ సింగ్-నితీశ్ కుమార్, 2. కౌషల్ -విష్ణు ప్రసాద్, 3. ఆశిష్ కుమార్- నగి బెహరా. పదో రేసు: 1. కౌషల్ -విష్ణు ప్రసాద్, 2. అమన్‌కుమార్- యాసన్ అలీ, 3. జస్ప్రీత్ సింగ్-నితీశ్ కుమార్. -
అమ్మా.. నాన్నా.. క్షమించండి!
రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): 'అమ్మా..నాన్నా..నన్ను క్షమించండి. నాన్నలా బ్రతకాలనుకున్నా కానీ బ్రతుకలేకపోతున్నా. మా ప్రెండ్స్ కలిసి మెలిసి తిరిగాం. ఎంతో ఎంజాయ్ చేశాం. వీడిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. చెల్లెళ్లూ.. ఒక అన్నయ్యలా మిమ్ముల్ని మందలించి ఉండవచ్చు నొచ్చుకుంటే క్షమించండి. వార్డన్ సార్.. మీరు నన్ను కన్నకొడుకులా చూసుకున్నారు. మీరు ఊహించి ఉండరు నేను ఇలా చేస్తానని క్షమించండి..'అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై ఎస్సై కృష్ణ మోహన్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం, తుజాల్పూర్ గ్రామానికి చెందిన గాలి వెంకటేశం, రుకుంబాయ్‌లకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు. కుమారుడు గాలి విష్ణు (21) నల్గొండ జిల్లా దేశ్ ముఖ్ గ్రామంలోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆనంద్ ధియేటర్ ఎదురుగా ఉండే వెస్లీ హాస్టల్ ఉంటూ చదివే వాడు. ఇక్కడ ఇంటర్ వరకే అనుమతి ఉంన్నా, హాస్టల్ వార్డన్ అనుమతితో ఇప్పటికీ అక్కడే ఉంటూ చదువుకొనసాగిస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉండే విష్ణు.. మంగళవారం రాత్రి 10.30గంటల సమయంలో భోజనం ముగించుకుని వేరే గదిలోకి వెళ్లి పడుకున్నాడు. బుధవారం ఉదయం 6.15 గంటలకు ఫ్యాన్‌కు ఉరివేసుకుని శవమై కనిపించాడు. హాస్టల్లో అందరిని లేపేందుకు వెళ్లిన శ్యామ్సన్ దీన్ని గమనించి వెంటనే హాస్టల్ వార్డన్ జాన్ వెస్లీకి విషయాన్ని చెప్పాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఎస్సై కృష్ణ మోహన్ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. విష్ణు సూసైడ్ నోట్ ఆధారంగా ఆత్మహత్యకు గల కారణాలు పరిశోధిస్తున్నామని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. -
విశాఖలో వైభవంగా...
నటుడిగా నలభై వసంతాల చరిత్ర మోహన్‌బాబుది. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు.నటనలోనూ, డైలాగులు చెప్పడంలోనూ మోహన్‌బాబుది ప్రత్యేకమైన శైలి. ఐదు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగా, నిర్మాతగా పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారాయన. అంతకు మించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. మోహన్‌బాబు నటుడిగా నలభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి సెప్టెంబర్ 17న విశాఖలో ఘనంగా వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. మోహన్‌బాబు వారసులు మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్నలు ఆ మధ్య ఎంబిః40 పేరుతో నలభై వసంతాల తండ్రి నట జీవితాన్ని సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఎంసెట్-2 లీకేజీ వ్యహారంలో ముగ్గురి అరెస్ట్
-
ఎంసెట్-2 లీకేజీ వ్యహారంలో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల వ్యవహారంలో ముగ్గురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసిన సీఐడీ.. హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెన్సీ నిర్వాహకుడు విష్ణుధర్, దళారీ తిరుమల్ అనే ఇద్దరు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరోక నిందితుడి వివరాలు ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ లీకేజీలో మొత్తం 30 మంది విద్యార్థులకు పేపర్ లీక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న కేసు దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ అధికారులు రెండు సెట్ల పేపర్లు లీక్ అయినట్టు నిర్ధారించారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 30 నుంచి రూ. 40 లక్షల చొప్పున వసూలు చేసినట్టు సీఐడీ పేర్కొంది. ఢిల్లీలో ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ లీక్ అయినట్టు వెల్లడించింది. ముంబై, బెంగళూరులో విద్యార్థులకు పేపర్ ఇచ్చినట్టు తెలిపింది. రెండు రోజుల ముందు పేపర్‌ను స్టూడెంట్స్‌కు ఇచ్చారని తెలిపింది. పేపర్ కొన్న విద్యార్థులు బెంగళూరు, ముంబైల్లో ప్రాక్టీస్ చేసినట్టు సీఐడీ వెల్లడించింది. రెండు సెట్లలోని మొత్తం 320 ప్రశ్నలపై ప్రాక్టీస్ చేయించారు. ప్రాక్టీస్ ముగియగానే తిరిగి విద్యార్థులను వెనక్కి పంపినట్టు సీఐడీ తెలిపింది. రాజగోపాల్ రెడ్డి విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించినట్టు పేర్కొంది. ఈ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని సీఐడీ భావిస్తోంది. తద్వారా లీకేజీ వ్యవహారంలో అనుమానితులను కస్టడీలోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేయనుంది. ఒకవైపు సీఐడీ నివేదిక కోసం ప్రభుత్వం కూడా వేచిచూస్తోంది. అయితే ఇప్పటివరకు లభించిన ఆధారాల మేరకు ఎంసెట్-1లో వేలకుపైగా ర్యాంకు వచ్చి, ఎంసెట్-2లో మెరుగైన ర్యాంకులు సాధించిన వారు 24 మంది ఉన్నట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు. బ్రోకర్‌గా చెలామణీ అవుతున్న వెంకట్రావు సెల్‌ఫోన్ నుంచి వీరిలో కొందరికి కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. సీఐడీ ప్రాథమిక విచారణను మూడు అంశాలుగా విభజించి దర్యాప్తు చేస్తోంది. పేపర్ తయారీ-ప్రింటింగ్, కోచింగ్ సెంటర్లు-పరీక్షకు హాజరైన విధానం, సెల్‌ఫోన్ కాల్స్-ఎంసెట్ ర్యాంకులుగా విభజించి విచారణ చేస్తున్నారు. కాగా, మరోవైపు డీజీపీ, సీఐడీ చీఫ్‌తో ఎంసెట్ కన్వీనర్ రమణారావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం. -
ఫిల్మ్ నగర్ క్లబ్ ఫర్నీచర్ ధ్వంసం
-
ఫిల్మ్ నగర్ క్లబ్ ఫర్నీచర్ ధ్వంసం
హైదరాబాద్: అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపడుతూ ఇద్దరు కార్మికులు మృతి చెందడానికి కారణమైన ఫిల్మ్ నగర్ క్లబ్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చాంబర్లోకి దూసుకెళ్లిన కార్యకర్తలు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో మాజీ ఎమ్మెల్యే కే లక్ష్మారెడ్డి వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుతో పాటు యూత్ కాంగ్రెస్ నేత అనిల్, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని.. లేదంటే నిరాహారదీక్ష చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఫిల్మ్ నగర్ ఘటనలో మృతులకు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ సంతాపం తెలిపింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని టీవైఎస్ఆర్ సీపీ అధ్యక్షడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
అప్పట్లో ‘అసెంబ్లీ రౌడీ’ని బ్యాన్ చేయాలన్నారు - మోహన్‌బాబు
‘‘అరిస్తే కరుస్తా.. కరిస్తే చరుస్తా..’’ అంటూ పాతికేళ్ల క్రితం కలక్షన్ కింగ్ మోహన్‌బాబు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ అందరికీ గుర్తే. ఆ డైలాగ్ మాత్రమే కాదు.. ‘అసెంబ్లీ రౌడీ’లో ఆయన చెప్పిన మిగతా డైలాగ్స్ కూడా చాలా పాపులర్. పాతికేళ్లయినా ఇంకా గుర్తుండిపోయిన చిత్రం అది. నేటితో ఈ చిత్రం విడుదలై పాతికేళ్లయ్యింది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రం ఆయన కెరీర్లో ఓ మైలు రాయిలా నిలిచిపోయింది. ఈ చిత్రం తాలూకు అనుభూతులను పంచుకోవడానికి శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మోహన్‌బాబు మాట్లాడుతూ - ‘‘కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అల్లుడుగారు’ సినిమా చేస్తున్న సమయంలో డెరైక్టర్ పి. వాసు ‘వేలై కిడైచాచ్చు’ అనే తమిళ సినిమా కథ వినిపించారు. తమిళంలో మంచి విజయం సాధించింది. కథ నచ్చి, రచయిత ఎమ్.డి.సుందర్‌ను సినిమా చూడమన్నా. ఆయనకు కూడా నచ్చేసింది. వెంటనే ఆ సినిమా హక్కులను తీసుకుని బి.గోపాల్ దర్శకునిగా ‘అసెంబ్లీ రౌడీ’ స్టార్ట్ చేశాం. మొత్తం 41 రోజుల్లో పూర్తి చేశాం. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ఓ సంఘటన జరిగింది. రోడ్డు మీద చిత్రీకరించడానికి అనుమతి తీసుకుని సీరియస్‌గా షూటింగ్ చేస్తున్నాం. ఇంతలో సడన్‌గా గుంపు నుంచి ఓ వ్యక్తి వచ్చి ‘‘ఎవర్రా ఇక్కడ ‘అసెంబ్లీ రౌడీ’ అనే షూటింగ్ చేస్తున్నా ర’ంటూ అక్కడ గస్తీ కాస్తున్న కానిస్టేబుల్ దగ్గర నుంచి లాఠీ లాక్కొని అతన్నే కొట్టబోయాడు. దాంతో అతని వెంట నేను కత్తి తీసుకుని పరిగెత్తా.. అలా అతన్ని వెంటాడి పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పా. అంతా బాగానే ఉందనుకునే టైమ్‌కి సడన్‌గా ఈ సినిమా టైటిల్ మీద అసెంబ్లీలో గొడవ చెలరేగింది. చాలా మంది ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలన్నారు. దాంతో అప్పటి అసెంబ్లీ స్పీకర్ ధర్మారావు సినిమా చూసి ఈ సినిమాను బ్యాన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇలా అన్నీ తట్టుకుని వెళ్లిన ఈ సినిమా 25 వారాల పాటు విజయవంతంగా ఆడింది. అన్ని చోట్లా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే, పరుచూరి గోపాలకృష్ణ రాసిన సంభాషణలు, బి. గోపాల్ దర్శకత్వ ప్రతిభే కారణం’’ అని చెప్పారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ- ‘‘నేను ఓ సినిమా షూటింగ్ నిమిత్తం తణుకులో ఉండగా మోహన్‌బాబు తమిళ సినిమా వీడియో క్యాసెట్ చూడమని చెప్పారు. చూస్తూ, మధ్యలోనే ఆపేసి ఈ సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అని చెప్పేశా. ఆ కథ సత్తా ఏంటో తెలిసిపోయింది. తెలుగుకు తగ్గట్టుగా మార్పులు చే యమని మా అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావుకి చెప్పారు. ఆయన అంతా క్లాస్ టచ్ ఇస్తూ రాసేసరికి మోహన్‌బాబు, గోపాల్‌లు షాక్ అయ్యారు. నేను తర్వాతి రోజు ఉదయం ఏడింటికి మొదలుపెట్టి మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ముగించేశాను. మోహన్‌బాబుకి ఫోన్ చేస్తే ‘ఏం స్క్రిప్ట్ టకటకా చుట్టేశావా’ అని అడిగారు. వెంటనే నేను ‘అరిస్తే...’ డైలాగ్ చెప్పాను. ఆయనకు నచ్చేసి స్క్రిప్ట్ చెప్పడానికి వెంటనే రమ్మన్నారు. అలా ఈ సినిమా స్క్రిప్ట్‌లో ఏదైతే ఉందో అదే తెరకెక్కింది. ‘అసెంబ్లీ రౌడీ’ ప్రివ్యూ చూసి చాలా మంది పెదవి విరిచారు. సినిమా మాత్రం సూపర్‌హిట్ అయింది. ఈ సినిమా విజయం తర్వాత మోహన్‌బాబు నన్ను ఏనాడూ పేరు పెట్టి పిలవలేదు. అగ్రజా.. అని పిలవడం స్టార్ట్ చేశారు. అలా మా ఇద్దరికీ ఉన్న అనుబంధం ఈ సినిమాతో మరింత రెట్టింపయింది’’ అని అన్నారు. దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ - ‘‘ ‘దేవత’ సినిమాకు కో-డెరైక్టర్‌గా పనిచేస్తున్న టైమ్ నుంచి నాకు మోహన్‌బాబుగారు తెలుసు. నాకు ఫోన్ చేసి ఈ సినిమా చేస్తున్నామనగానే వెంటనే ఓకే చెప్పాను. గోపాలకృష్ణగారు ఎంతో గొప్ప సంభాషణలు రాయడంతో పాటు తెలుగుకు తగ్గట్టు కొన్ని సీన్లు జత చేశారు. సంగీత దర్శకుడు కె.వి మహదేవన్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. నేను ఈ సినిమాను డెరైక్టర్‌గా కాకుండా ఓ ప్రేక్షకునిగా మోహన్‌బాబుగారి నటనను ఎంజాయ్ చేశాను. ఏడింటికే షూటింగ్ మొదలుపెట్టేవాళ్లం. అలా చాలా క్రమశిక్షణతో ఓ టీమ్‌గా కష్టపడి విజయం సాధించాం. నా కెరీర్లో మర్చిపోలేని సినిమా ఇది’’ అని చెప్పారు. అసెంబ్లీ రౌడీ రీమేక్‌లో విష్ణు హీరో! ‘‘ఈ సినిమా రీమేక్ గురించి ఎప్పటినుంచో అనుకుంటున్నాం. మళ్లీ బి.గోపాల్ మాత్రమే ఈ సినిమా చేయాలి. విష్ణు ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. త్వరలో ఈ రీమేక్ గురించి మరిన్ని విశేషాలు చెబుతాను’’ అని మోహన్‌బాబు చెప్పారు. -
పెళ్లికి సమయం కావాలన్నాడని..
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి సమయం కోరడంతో.. మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న స్వప్న(25)కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు ఓ కూతురు ఉంది. గత కొన్ని రోజులుగా భర్తతో గొడవపడి తల్లి వద్దే ఉంటున్న స్వప్న ఇంటి పక్కనే ఉంటున్న విష్ణు అనే యువకుడిని ప్రేమించింది. రెండేళ్లుగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో విష్ణు పెళ్లి ప్రయత్నాలు చేస్తుండటంతో.. ‘తననే పెళ్లి చేసుకోవాలని.. లేకపోతె చచ్చిపోతానని’ పలుమార్లు బెదిరించింది. ఈ విషయమై గతంలో పంచాయతి కూడా జరిగింది. అయినా తీరు మార్చుకోని స్వప్న పెళ్లి చేసుకోవాల్సిందిగా విష్ణు వెంటపడింది. దీనికి అతను తన ఇంట్లో పెళ్లి కావాల్సిన అన్నయ్య ఉన్నాడని అతని పెళ్లి తర్వాత పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అయినా సంతృప్తి చెందని స్వప్న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆమెను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
నారదుడి గర్వభంగం
పురానీతి బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షి నిరంతరం హరినామ సంకీర్తనం చేస్తూ త్రిలోక సంచారం చేసేవాడు. విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడిగా ముల్లోకాల్లో అందరూ ఆయనను గౌరవించేవారు. దాంతో లోకంలో తనను మించిన విష్ణుభక్తుడు ఎవరూ లేరనే గర్వం మొదలైంది నారదుడిలో. అయితే, ఆ మాటను సాక్షాత్తూ విష్ణువు నోటనే చెప్పించాలనుకున్నాడు నారదుడు. అనుకున్నదే తడవుగా వైకుంఠానికి వెళ్లాడు. శేషతల్పంపై విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును దర్శించుకుని, యథాప్రకారం హరినామ సంకీర్తనం ప్రారంభించాడు. మహావిష్ణువు మహదానందంగా నారదుడి సంకీర్తనను అరమోడ్పు కన్నులతో పరవశుడై ఆస్వాదించాడు. సంకీర్తనానంతరం నారదుడిని కుశల ప్రశ్నలు వేశాడు. కుశల ప్రశ్నలు పూర్తయ్యాక నారదుడు తన మనసులోని మాటను బయటపెట్టాడు. ‘దేవా! నాదో చిన్న సందేహం. మీరే దానిని తీర్చాలి’ అంటూ వినయంగా అర్థించాడు. ‘ఏమా సందేహం? సంకోచించకుండా అడుగు’ అన్నాడు విష్ణువు చిరునవ్వులు చిందిస్తూ. ‘ముల్లోకాల్లో మిమ్మల్ని కొలిచే భక్తులలో ఎవరు అగ్రగణ్యులో మీ నోటనే తెలుసుకోవాలని అనుకుంటున్నాను దేవా!’ అన్నాడు నారదుడు. ‘ఇదేమంత పెద్ద సందేహం... అదిగో! భూలోకంలో అటు చూడు... అక్కడ కనిపిస్తున్న పొలంలో పని చేసుకుంటున్నాడో రైతు..’ అన్నాడు. ‘చూశాను ప్రభూ!’ అన్నాడు నారదుడు. ‘అందరి కంటే అతడే నా భక్తుల్లో అగ్రగణ్యుడు’ అన్నాడు విష్ణువు. హతాశుడయ్యాడు నారదుడు. తన పేరే చెబుతాడనుకుంటే, ఎక్కడో మారుమూల గ్రామంలో పొలాన్ని సాగుచేసుకునే రైతు... రోజుకు నాలుగైదుసార్లు కంటే నారాయణుడిని తలచుకోని సామాన్యుడు.. తన భక్తుల్లో అగ్రగణ్యుడని చెప్పడానికి మహావిష్ణువుకు మనసెలా వచ్చిందని మథనపడసాగాడు. నారదుడి అంతర్మథనాన్ని గ్రహించిన విష్ణువు... ‘నారదా! నువ్వే అతడి వద్దకు వెళ్లు. అతడి భక్తి ఏపాటిదో నీకే తెలుస్తుంది’ అన్నాడు. ఇదేదో తేల్చుకోవాలనుకున్నాడు నారదుడు. ‘సరే’ అంటూ భూలోకానికి వెళ్లాడు. నేరుగా ఆ రైతు ముందు ప్రత్యక్షమయ్యాడు. తన ఎదుట సాక్షాత్తూ నారద మహర్షి ప్రత్యక్షమవడంతో ఆ రైతు పరమానందభరితుడయ్యాడు. ‘అయ్యా! మహా విష్ణువు ఎలా ఉన్నారు? వైకుంఠంలో ఆయన క్షేమమేనా..? అభాగ్యుడిని, ఎప్పుడో తప్ప ఆయనను తలచుకునే తీరికే ఉండదు నాకు. మీ దర్శనంతో సాక్షాత్తూ విష్ణువునే చూసినంత ఆనందం కలుగుతోంది’ అంటూ నారదుడికి అతిథి మర్యాదలు చేశాడు. నారదుడు తిరిగి బయలుదేరే ముందు... ‘అయ్యా! చిన్న కోరిక’ అన్నాడు ఆ రైతు. ఏంటో చెప్పమన్నట్లుగా చూశాడు నారదుడు. ఒక కుండలో పాలు తెచ్చి ఇచ్చాడు రైతు. ‘అయ్యా! నా కానుకగా ఈ పాలకుండను వైకుంఠానికి తీసుకువెళ్లి విష్ణుదేవులకు నివేదించండి’ అన్నాడు. ‘అదెంత పని’ అంటూ నారదుడు పాలకుండ తీసుకుని వైకుంఠానికి బయలుదేరాడు. అయితే, పాలెక్కడ తొణికిపోతాయోననే భయంతో జాగ్రత్తగా కుండను పొదివి పట్టుకున్నాడు. మొత్తానికి ఎలాగోలా వైకుంఠానికి చేరుకుని విష్ణువును దర్శించుకున్నాడు. రైతు ఇచ్చిన పాలకుండను అందించాడు. ‘దేవా! ఆ రైతుకు ఎప్పుడో తప్ప నిన్ను తలచుకునే తీరిక ఉండదట. రోజుకు ఏ నాలుగైదుసార్లో తలచుకుంటాడట’ అన్నాడు ఫిర్యాదు చేస్తున్నట్లుగా. ‘ఈ పాలకుండను తెస్తున్నప్పుడు నువ్వు నన్ను ఎన్నిసార్లు తలచుకున్నావు?’... ప్రశ్నించాడు విష్ణువు. ‘ఒక్కసారి కూడా తలచుకోలేదు. నా దృష్టి మొత్తం పాలకుండపైనే ఉంది. పాలెక్కడ తొణికిపోతాయోననే ఆందోళనే నా మనసంతా నిండిపోయింది’ అని తలదించుకుని బదులిచ్చాడు నారదుడు. ‘రోజంతా శ్రమిస్తూ ఉన్నప్పటికీ నన్ను మరచిపోకుండా రోజుకు కనీసం నాలుగైదుసార్లు అయినా తలచుకుంటున్నాడు కదా ఆ రైతు?’ అన్నాడు విష్ణువు. ఆ మాటలతో నారదుడి గర్వం నశించింది. ఆ రైతు తనకంటే ఎందుకు గొప్ప భక్తుడో అర్థమైంది. నీతి: ఎంతటి వాడికైనా గర్వం తగదు. గర్వంతో ప్రవర్తిస్తే భంగపడటమూ తప్పదు. -
వెంకన్న సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నటుడు మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. వారితో పాటు జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని, ఎంపీ రాయపాటి కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. -
'కార్టింగ్' ఛాంపియన్షిప్ పోటీలు
-
విష్ణు, రాజ్‌తరుణ్ నూతన చిత్రం ప్రారంభం
-
నవంబర్ 23న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: మంచు విష్ణు (హీరో), నాగచైతన్య (హీరో) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల వివాహ యత్నాలు ఫలిస్తాయి. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులకు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతుంది. అలంకరణ సామగ్రికి లేదా ఆభరణాల కొనుగోలుకు వెచ్చిస్తారు. అందరితోనూ మంచి సంబంధ బాంధవ్యాలు నెరపుతారు. కళాకారులకు, సినీనటులకు, సంగీతకారులకు, మీడియా రంగంలోని వారికీ, సినీ నిర్మాతలకు, నగల వ్యాపారులకు ఈ సంవత్సరం శుక్రుని శుభదృష్టి వల్ల చాలా బాగుంటుంది. విదేశీ ప్రయాణం చేయాలనే కోరిక తీరుతుంది. గ్రీన్ కార్డు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. పుట్టిన తేదీ 23. ఇది బుధునికి సంబంధించినది కావడం వల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తితో చాకచక్యంగా పనులు చక్కబెడతారు. ఎల్లప్పుడూ ప్రభుత్వ పరమైన సహకారం లేదా ప్రభుత్వోద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా గడుపుతారు. గౌరవం, పేరుప్రఖ్యాతులు పొందుతారు. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయం లభిస్తుంది. లక్కీ నంబర్స్: 2,3,5,6,9; లక్కీ కలర్స్: వైట్, గ్రీన్, సిల్వర్, పర్పుల్, రెడ్, ఆరంజ్, రోజ్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్ర వారాలు. సూచనలు: అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలో అన్నదానం, సేవాకార్యక్రమాలు చేయడం, పేద కన్యలకు వివాహ ఖర్చులు భరించడం, ఆవులకు ఆహారం పెట్టడం, తల్లిని, తత్సమానురాలైన వారిని ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
నారాయణ కాలేజీలో వార్డెన్ ఆత్మహత్య
- ప్రేమ వ్యవహారమే కారణమన్న పోలీసులు - యాజమాన్యం వేధింపులే అంటున్న సహ ఉద్యోగులు హైదరాబాద్: నారాయణ కళాశాలల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా అత్తాపూర్ హైదర్‌గూడ నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఓ వార్డెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమని పోలీసులు అంటుండగా... యాజమాన్యం వేధింపులే కారణమని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదర్‌గూడలోని నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో వరంగల్ జిల్లా కొత్తగూడకు చెందిన వేముల విష్ణు(27) రెండేళ్లుగా వార్డెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, శనివారం రాత్రి ఎవరూ లేని సమయంలో కళాశాలలోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం గమనించిన సిబ్బంది... విషయాన్ని కళాశాల నిర్వాహకులు, పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విష్ణు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఫేస్బుక్ అక్కౌంట్‌ను పరిశీలించిన పోలీసులు... ‘దిస్ ఈజ్ లాస్ట్ డే.. బాయ్ స్వాతి’ అనే పోస్టును గుర్తించారు. దీన్నిబట్టి అతడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమనే నిర్ధారణకు వచ్చారు. అయితే... దసరా సెలవుల్లో కూడా పనిభారం మోపి యాజమాన్యం ఒత్తిడి తేవడం వల్లనే విష్ణు ఆత్మహత్య చేసుకున్నాడని సహ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. విషయం తెలియగానే... ఈ కళాశాలలో ఉండే సిబ్బంది వెళ్లిపోయి వారి స్థానంలో వేరే బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగులు విధుల్లోకి రావడం, ఇంత జరిగినా ప్రిన్సిపాల్ కాలేజీకి రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డిసెంబర్ నెలాఖర్లో అల్లరోడి సినిమా
ఇటీవల వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. రొటీన్ కామెడీ సినిమాలతో పాటు, ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన సినిమాలు కూడా పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో కాస్త గ్యాప్ తీసుకున్న నరేష్, ఓ డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. సీనియర్ హీరో మోహన్ బాబుతో కలిసి 'మామ మంచు అల్లుడు కంచు' సినిమాలో నటిస్తున్నాడు. కామెడీ స్పెషలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మరో యంగ్ హీరో విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు నిర్మాత మంచు విష్ణు. దాదాపుగా షూటింగ్ పూర్తికావచ్చిన ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి డిసెంబర్ నెలాఖర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మోహన్ బాబు కాంబినేషన్లో వస్తున్న 'మామ మంచు అల్లుడు కంచు' సినిమాతో అయినా అల్లరి నరేష్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి. -
సరదా సరదాగా!
లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ, ప్రతి నిమిషం సరదాగా గడపాలనుకునే ఓ యువకుడు ప్రేమలో పడ్డాడు. మరి అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘సరదా’. విష్ణు, సోనారిక జంటగా జి. కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో సోమా విజయ్‌ప్రకాశ్, పల్లి కేశవరావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ప్రతి ఫ్రేములోనూ సరదా ఉంటుంది. ఆ సరదాను హైలైట్ చేస్తూ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇందులో విష్ణు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘సోనారికతో పాటు మరో ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అనూప్ మ్యూజిక్, విజయ్‌కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఫైట్స్: విజయ్, నిర్మాణ నిర్వహణ: సోమా విజయ్‌ప్రకాశ్. -
స్పీడు పెంచిన మనోజ్
టాలీవుడ్ కొత్త పెళ్లికొడుకు మంచు మనోజ్ స్పీడు పెంచాడు. తను లీడ్ రోల్లో నటించిన ఎటాక్ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరో రెండు సినిమాలను రెడీ చేస్తున్నాడు. పెళ్లి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి హానీమూన్ ట్రిప్‌కు వెళ్లిన మనోజ్, ఈ మధ్యే తిరిగి షూటింగ్‌లకు అటెండ్ అవుతున్నాడు. మనోజ్ ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో ఓ సాఫ్ట్ లవ్‌స్టోరిలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు మంచువారబ్బాయి. మనోజ్ కెరీర్లోనే బిందాస్ బిగెస్ట్ హిట్. ఈ యంగ్ హీరో ఎనర్జీకి పర్ఫెక్ట్గా సూట్ అయిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వల్ ను తెరకెక్కించాలని భావిస్తున్నాడు మనోజ్. ఇప్పటికే దర్శకుడు వీరుపోట్ల కథ కూడా రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తుంది. వీరుపోట్లకు కూడా మంచు ఫ్యామిలీతో మంచి ట్రాక్ రికార్డే ఉంది. మనోజ్ తో బిందాస్ తో పాటు విష్ణు హీరోగా దూసుకెళ్తా సినిమాలను తెరకెక్కించిన వీరుపోట్ల మంచి విజయాలు సాదించాడు. అందుకే మరోసారి వీరుపోట్ల దర్శకత్వంలో బిందాస్ 2 చేయడానికి రెడీ అవుతున్నాడు మనోజ్. -
డైనమైట్ .. భలే.. భలే... కొత్త సినిమాలు గురూ!
కొత్త సినిమాలు గురూ! ఈ యాక్షన్ సినిమా చూస్తూ కళ్లు తిప్పామంటే పళ్లు రాలతాయి... అంత స్పీడులో బ్రేకుల్లేకుండా పరుగెడుతుంది ఈ స్క్రీన్ ప్లే. ఇంకొక కామెడీ సినిమా చూస్తూ పళ్లు బిగపట్టకపోతే కళ్లూడతాయి నవ్వుతో... అంతగా బ్రేకు ఇవ్వకుండా మరీ గిలిగింతలు పెడుతుందీ స్టోరీ లైన్. మొత్తానికి ఈ వారం సినిమా స్కోపు డబులైంది. ఆకట్టుకున్న ఈ సినిమాలు డబ్బులు తెస్తాయి. ఈ శ్రావణంలో మన సినిమాకి మంచి రోజులూ, మంచి సినిమాకి వెలుగు జిగేళ్లూ ప్రాప్తమయ్యాయి. క్లాసూ మాసూ తేడా లేకుండా... దేవ కట్టా, మారుతి కట్టలు తెంచుకుని మరీ గంతులేశారు. డైనమైట్ యాక్షన్ బిట్లు భలే భలేగా ఆకట్టుకున్నాయి. భలే భలే కామెడీ బిట్లు డైనమైట్లా పేలాయి. దర్శకుడు శ్రీను వైట్ల తరహా వినోదభరిత సినిమాలకూ, రచయిత కోన వెంకట్ బాక్సాఫీస్ మంత్రమైన స్క్రీన్‌ప్లే విధానానికీ తెలుగు సినిమా బందీగా మారి కొన్నేళ్ళయింది. ఈ మధ్యే అడపాదడపా కొన్ని ఫ్యామిలీ కథలు, కొన్ని హార్రర్ - కామెడీలు అందుకు భిన్నంగా అలరిస్తున్నాయి. అయితే, వీటిలోనూ వినోదం కామనే. ఇప్పుడున్న ఈ ట్రెండ్లకు భిన్నంగా పూర్తి ఛేజింగ్ ఫార్ములా యాక్షన్ సినిమా తీస్తే? అలా వచ్చిందే - ‘డైనమైట్’. వైవిధ్యాన్ని ఆశ్రయించారు నట, నిర్మాత విష్ణు. ఇంతకీ కథేంటి? శివాజీ కృష్ణ (మంచు విష్ణు) డిజిటల్ మార్కెటింగ్ చేసే వ్యక్తి. అన్యాయం ఎదురైతే, ఎదిరించి పోరాడే తత్త్వమున్న మనిషి. ఆ క్రమంలో అతను అనుకోకుండా అనామిక (ప్రణీత)కు దగ్గరవుతాడు. ఆమె ‘చానల్ 24’ సి.ఇ.ఓ రంగనాథ్ (పరుచూరి వెంకటేశ్వరరావు) కూతురు. హీరో, హీరోయిన్లు ప్రేమలో పడీ పడగానే కథలో కుదుపు. దుండగులు కొందరు హీరోయిన్ను కిడ్నాప్ చేస్తారు. నేరస్థులను వెంటాడే క్రమంలో హీరోయిన్ తండ్రి ఇంటికి వెళతాడు హీరో. ఆయన దగ్గరున్న కీలకమైన వీడియో తాలూకు మెమొరీ కార్డ్ కోసం దుండగులు హీరోయిన్ను కిడ్నాప్ చేశారన్నమాట. అక్కడ జరిగిన కాల్పులు, ప్రతికాల్పుల్లో ఆయన చనిపోతాడు. దీని వెనక ఎవరో పెద్దలున్నారని హీరోకూ అర్థమైపోతుంది. కథ ముదిరి, పాకానపడుతుంది. కిడ్నాప్ చేసిన దుండగుల నుంచి హీరోయిన్ను హీరో తప్పిస్తాడు. అలాగే, దుండగులు తెచ్చిన వీడియో టేప్ మెమొరీకార్డ్ను కూడా సాధిస్తాడు. అయితే, ఆ కార్డ్ ఓపెన్ కాదు. అందులో ఏముందన్న సస్పెన్స్ కొనసాగుతుంది. కథ అక్కడ నుంచి కేంద్రంలో ఉన్న కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రిషిదేవ్ (జె.డి. చక్రవర్తి) దాకా వెళుతుంది. హీరో - హీరోయిన్లను చంపడానికి కూడా మంత్రి వెనకాడడు. ఇంతకీ ఆ కార్డ్‌లోని వీడియోలో ఉన్నదేమిటి, మంత్రికీ దానికీ సంబంధం ఏమిటీ అన్నది ఈ కాన్స్పిరసీ థ్రిల్లర్ మిగతాపార్ట. తమిళ కథ... తెలుగు యాక్షన్... ‘ఢీ’, ‘దేనికైనా రెఢీ’ లాంటి వినోదాత్మక చిత్రాలతో విజయాలు సాధించిన హీరో విష్ణు ఈసారి ట్రాక్ మార్చి, ఇలా యాక్షన్ బాట పట్టారు. రొటీన్‌కు భిన్నమైన ప్రయత్నం కాబట్టి అభినందించాలి. తమిళ చిత్రం ‘అరిమ నంబి’, దర్శక - రచయిత ఆనంద్ శంకర్ దానికి రాసుకున్న కథ - ఈ ‘డైనమైట్’కు ఆధారం. అయితే, తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు కొన్ని కొత్త సీన్లు కలుపుకొని, దర్శకుడు కొత్తగా వండి వడ్డించారు. ‘ప్రస్థానం’ ద్వారా చాలా పేరు తెచ్చుకున్న దేవ కట్ట ఈ కథను స్టయిలిష్‌గా ప్రెజెంట్ చేసేందుకు ప్రయత్నించారు. యాక్షన్ ప్రధాన చిత్రం కాబట్టి స్టంట్ మాస్టర్ విజయన్ దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా సినిమా మొత్తాన్నీ తన చేతుల మీదుగా నడిపించారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్న హీరో విష్ణు చేత థ్రిల్స్ బాగా చేయించారు. విష్ణు కూడా యాక్షన్ సన్నివేశాలకు బిలీవబుల్‌గా ఉన్నారు. డ్యాన్స్‌లకు పడిన కష్టమూ తక్కువేమీ కాదు. ప్రణీత అందంగా కనిపిస్తూ, యాక్షన్ సీన్లూ కష్టపడి చేశారు. జె.డితో విలనీ వెరైటీగా అనిపిస్తుంది. సందర్భం, సంభావ్యతల పని లేకుండా, మాస్ కోసం సినిమాలో ప్రత్యేక నృత్యగీతం పెట్టారు. హీరో, హీరోయిన్ల మధ్య కలర్‌ఫుల్ డ్యూయెట్లూ ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలాంటి సినిమాలకు కీలకం. ఆ పని చిన్నా బాగా చేశారు. కెమేరా వర్క్ కూడా భేష్. రెండు గంటల 22 నిమిషాల ఈ సినిమా హీరోయిన్ కిడ్నాప్ నుంచి పట్టాల మీద కెక్కి, వేగంగా నడుస్తుంటుంది. జనం ఆ మూడ్‌లో లీనమైపోతారు. ఫలితంగా, లోటుపాట్లేమైనా ఉన్నా గుర్తించే తీరిక, గుర్తుపెట్టుకొనే ఓపిక ఉండవు. ఆఖరి దాకా టెంపోలో సాగడంతో సినిమా ఎంతసేపటిగా చూస్తున్నామనే ఫీలింగే రాదు. అది సినిమాకు శ్రీరామరక్ష. యాక్షన్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకూ, మాస్కూ నచ్చే విషయం. వెరసి, సమష్టి కృషితో తెరపై ఇది అవుటండ్ అవుట్ యాక్షన్ దట్టించిన డైనమైట్. దర్శకుడు దేవ కట్ట భలే.. భలే తెలుగు తెరపై అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం కామన్. వాళ్ళకు విలన్ నుంచి ఇబ్బందులు ఎదురవడం కూడా కామనే. కొన్నిసార్లు... ఆ ప్రేమకూ, పెళ్ళికీ అడ్డంకి హీరోయిన్ తండ్రే కావడం మరీ కామన్. ఈ ఫార్ములా కథకు మతిమరుపనే పాయింట్‌తో కాస్తంత కొత్తదనం చేరిస్తే? దర్శకుడు మారుతి రాసుకున్న ‘భలే.. భలే మగాడివోయ్’ కథ అలాంటిదే! ఈ కథేంటి? శ్రీమతి, శ్రీఆంజనేయు లు (నరేశ్ - సితార) దంపతుల బిడ్డ లక్కరాజు అలియాస్ లక్కీ(నాని). మనవాడు మైండ్ ఆబ్సెంట్కి యూత్ ఐకాన్. మరో సైంటిస్ట్ పాండురంగారావు (మురళీశర్మ). ఆయన కూతురు కూచిపూడి డ్యాన్సర్ నందన (‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్యా త్రిపాఠీ). లక్కీని అల్లుడిగా చేసుకుందామనుకున్న టైమ్‌లో ఆయనకు ఈ ‘మతిమరపు మేళం’ సంగతి అర్థమై, పెళ్ళి కుదరదంటాడు. ఇంతలో పరధ్యానంలో చేసిన ప్రతి పొరపాటునూ ఏదో ఒక సామాజిక సేవకూ, మంచి పనికీ లింక్ చేస్తూ, హీరోయిన్ ప్రేమను పొందుతాడు హీరో. కూతురు ప్రేమిస్తున్నది తాను వద్దనుకున్న సంబంధం తాలూకు కుర్రాడినే అని తెలియక హీరోయిన్ తండ్రి కూడా ఓ.కే. అనేస్తాడు. ఇంతలో అసలు సంగతి హీరోకు అర్థమైపోతుంది. ఇక, అక్కడ నుంచి అమ్మానాన్న, ఫ్రెండ్స్‌తో కలసి హీరో ఆడే నాటకం. మరోపక్క పోలీస్ ఇన్స్పెక్టర్ అజయ్ (నటుడు అజయ్) ఎలాగైనా హీరోయిన్ను పెళ్ళి చేసుకోవాలని చూస్తుంటాడు. ఈ మొత్తం ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ తరహా ఎపిసోడ్ ఏయే మలుపులు తిరిగింది, చివరకు హీరో - హీరోయిన్ల ప్రేమ ఎలా సక్సెసైందన్నది మిగతా సినిమా. నేచురల్ యాక్టింగ్ ఆ మధ్య ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి విభిన్న తరహా ప్రయత్నం చేసిన హీరో నాని ఈసారి ‘మతిమరపు’ పాయింట్‌తో జనం ముందుకొచ్చారు. కామెడీ పండించడానికి మంచి స్కోపున్న విషయమిది. దాన్ని దర్శకుడు బాగానే వాడుకున్నారు. సహజంగా ప్రవర్తించినట్లుండే నాని తరహా నటన ఈ పాత్రకు మరో ప్లస్. కథాంశం చాలా చిన్నది కాబట్టి, ఎక్కువగా సీన్లు రాసుకొని, వాటితో నడిపించడం మీదే దర్శక - రచయితలు ఆధారపడ్డారు. ఆ పరిస్థితుల్లో నాని వినోదంతో సినిమాను ముందుకు నడిపే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. లావణ్యా త్రిపాఠీ చూడడానికి బాగుంది. హీరోయిన్ తండ్రిగా మురళీశర్మ మంచి క్యారెక్టర్ యాక్టర్‌నని ఋజువు చేసుకున్నాడు. అజయ్ విలనీ సరేసరి. నేషనల్ అవార్డ్ గెలుచుకున్న మలయాళ మ్యూజిక్ డెరైక్టర్ గోపీ సుందర్ (‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్) సంగీతం సినిమాకు మరో బలం. త్యాగరాయ కీర్తన ‘ఎందరో మహానుభావులు...’ను అనుకరిస్తూ, కథకూ, హీరో క్యారెక్టరైజేషన్‌కూ తగ్గట్లుగా సాహిత్యం మార్చుకొని, అదే ట్యూన్లో చేసిన ప్రయోగం బాగుంది (రచన రామజోగయ్య శాస్త్రి). రిచ్ ఫ్రేమింగ్స్తో నిజార్ షఫీ కెమేరా వర్క్ భేష్. ‘ముద్ర’కు దూరంగా.. ఫ్యామిలీస్‌కి దగ్గరగా.. హీరోకున్న మతిమరపు పాయింట్‌ను టైటిల్స్ వేస్తున్నప్పుడు వచ్చే చైల్డ్‌హుడ్ ఎపిసోడ్‌లోనే దర్శకుడు చెప్పేశారు. కానీ, ప్రేక్షకులు మర్చిపోతారనో ఏమో, ఫస్టాఫ్‌లో గంటకు పైగా అలాంటి సంఘటనలతో నడిపారు. అయితే, అవన్నీ వినోదం నింపే ఎపిసోడ్సే. చివరకొచ్చేసరికి అల్లుడే మామను జయించి, ఒప్పించినట్లు కాకుండా, మామే అల్లుడిని చాలాకాలంగా గమనిస్తూ, ఓ.కె. చెప్పినట్లు చూపడం కొంత అసంతృప్తి కలిగిస్తుంది. మొత్తం మీద, ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ లాంటి చిత్రాలతో ఒక ముద్ర వేయడమే కాకుండా, తెలియకుండానే తన మీద ఒక రకం ముద్ర వేయించుకున్న దర్శకుడు మారుతికి ఈ సినిమా ఒక పెద్ద రిలీఫ్. రెండర్థాల మాటలతో పని లేకుండా, క్లీన్ ఎంటర్టైనర్ను కూడా అందించగలనని ‘భలే.. భలే.. మగాడివోయ్’తో ఆయన ప్రూవ్ చేసుకున్నట్లయింది. తీరిక, ఓపిక తగ్గిన నవతరం ప్రేక్షకులు కోరుకుంటున్నదీ కాసేపు నవ్వుకోవడమే కాబట్టి, ఫ్యామిలీస్ ఈ సినిమా చూసి ‘భలే భలే.. సినిమావోయ్’ అంటే ఆశ్చర్యం లేదు. దర్శకుడు మారుతి తెర వెనుక ముచ్చట్లు ►‘డైనమైట్’ చిత్రం ఏడాది క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘అరిమ నంబి’కి రీమేక్. తమిళ సినిమా విడుదలైన నాలుగు రోజులకే దాని గురించి తెలిసి, రీమేక్ రైట్స్‌కి పోటీ ఎదురైంది. తమిళ నిర్మాత ఎస్. థానుకి, మోహన్‌బాబుకి మధ్య అనుబంధం వల్ల విష్ణుకు రైట్స్ దక్కాయి. ► ఈ చిత్రానికి మొదట ‘ఎదురీత’ అని టైటిల్ పెడదామనుకున్నారు. కానీ, హీరో క్యారెక్టరైజేషన్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి, ‘డైనమైట్’ టైటిల్ పెట్టాలన్నది విష్ణు ఆలోచన. యూనిట్ మొత్తానికి నచ్చడంతో చివరికి దాన్నే ఫైనలైజ్ చేశారు. ► తమిళ ఒరిజినల్‌కి ‘డ్రవ్ు్స’ శివమణి సంగీత దర్శకుడు. మ్యూజిక్ డెరైక్టర్‌గా అదే ఆయన తొలి సినిమా. తెలుగులో పాటలు అచ్చు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిన్నా అందించారు. ► షూటింగ్‌కి ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేశారు. ఎక్కడెక్కడ తీయాలో లొకేషన్స్ అన్నీ ఫైనలైజ్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని న్యాచురల్ లొకేషప్స్లో, సెట్స్ వేసి తీశారు. జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. 65 రోజుల్లో పూర్తి చేసేశారు. ► మొత్తం ఏడు ‘రెడ్ కెమెరా’లు వాడారు. యాక్షన్ సీక్వెన్సెస్‌కి ఐదు, టాకీకి రెండు. ► చేజింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ అన్నీ విష్ణు డూప్ లేకుండా చేశారు. విష్ణు సినిమాకు ఫైట్ మాస్టర్ విజయన్ పనిచేయడం ఇదే మొదటిసారి. ఫైట్స్ టైవ్‌ులో విష్ణుకి చిన్న గాయాలయ్యాయి. వాటి తాలూకు మచ్చలు ఈ సినిమాకి సంబంధించిన తీపి గుర్తులంటారు విష్ణు. ►‘భలే భలే మగాడివోయ్’ దర్శకుడు మారుతి డెరైక్టర్ కాక ముందు ‘బిబా సీడ్స్’ కంపెనీకి ప్రోమో చేసిచ్చారు. అప్పుడే మొక్కల పెంపకం నేపథ్యం కథ ఆలోచనొచ్చింది. అదే ఈ సినిమాకి వాడారు. ►మారుతికి కూడా ఏదైనా ఒక పనిలో పడితే మిగతా విషయాలు మర్చిపోతూంటాడు. ఆ మతిమరుపు డోస్ పెంచి హీరో క్యారెక్టైరె జేషన్ డిజైన్ చేస్తూ స్టోరీ లైన్ అల్లుకున్నారు. ఫస్ట్‌హాఫ్ రెడీ కాగానే నానీకి వినిపిస్తే ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ►‘మరోచరిత్ర’లోని భలే భలే మగాడివోయ్ పాట మారుతికిష్టం. నాలుగేళ్ల క్రితమే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు. అప్పటికి కథ లేదు. ఈ కథకు ఈ టైటిల్ యాప్ట్ అని పెట్టారు. ►ఈ సినిమాలో నాని ఉపయోగించే మొబైల్ ఫోన్ రింగ్‌టోన్ ‘భలే భలే మగాడి వోయ్’ పాట. దాన్ని ఇలా రింగ్‌టోన్ పెట్టాలని అనుకోలేదు. ఎడిటింగ్ టైమ్‌లో తీసుకున్న డెసిషన్ ఇది. ►‘హల్లో హల్లో’ అనే పాట మినహా ఈ సినిమా మొత్తం హైదరాబాద్ పరిసరాల్లోనే చిత్రీకరించారు. ‘హల్లో హలో’్ల పాట మాత్రం గోవాలో తీశారు. వర్కింగ్ డేస్ 50 రోజులు ►హీరోయిన్ ఫాదర్ పాత్రకు ‘మిర్చి’ సంపత్ లేదా మురళీ శర్మ అనుకున్నారు. ఫ్రెష్ ఫీల్ ఉంటుందని శర్మను ఎంపికచేశారు. మహేశ్‌బాబు ‘అతిథి’లో విలన్‌గా పరిచయమయ్యారు. ►ఓ రోజు టీవీలో ‘నాయిగళ్ జాగిరతై’ తమిళ సినిమా చూస్తున్నారు మారుతి. ఆ విజువల్స్ బాగా నచ్చాయి. కెమేరామ్యాన్ నిజార్ షఫీకదే తొలి సినిమా. ఆయన్ని ఈ సినిమాకు పెట్టారు. -
ఆ సీన్ కట్ చేయమన్నారు..
నాన్న నమ్మకం, అమ్మ అభిమానం, అక్కయ్య అభిరుచి, తమ్ముడి తెగువ..శ్రీమతి శ్రద్ధ... ఇద్దరు బంగారు బిడ్డల గారం... అన్నీ కలబోసిన డైనమైట్ విష్ణు!ఒక హీరోలో ఎక్సెంట్రిసిజమ్ చూసే ఈ కాలంలో ఒక బ్యాలెన్స్డ్ బ్రిలియన్స్ విష్ణులో కనబడుతుంది. చేసినవన్నీ మాస్, యాక్షన్ సినిమాలే అయినా ఎక్కడో ఒక తెలియని నాజూకు నిజాయితీ, అణకువగా ఉన్న అందం కనబడతాయి. మైట్ అంటే ఇంగ్లీషులో పవర్ అని! దమ్ముంటే ఫైట్ చేయొచ్చు... మైట్ ఉంటే ఫైట్ గెలవొచ్చు. ‘ఢీ’ అంటాడు... దేనికైనా రె‘డీ’ అంటాడు. డైనమిక్‌గా ఉంటాడు... డైనమైట్లా తెగబడతాడు. దేవా కట్టా, విష్ణు సత్తాతో వస్తుంది ‘డైనమైట్’ ‘డి’ ఫర్ డిసిప్లిన్ అని మీ నాన్నగారు అంటారు. ‘డి’ ఫర్ ‘డైనమైట్’ అంటున్నారు? అఫ్కోర్స్ డి ఫర్ డిసిప్లిన్ అంటూ నాన్ననే ఫాలో అవుతాను. ఇప్పుడు సినిమా చేశాను కాబట్టి, డి ఫర్ డైనమైట్ అనాలి. ఇది మంచి స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్. నమ్మినవాళ్ల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి వెనకాడని హీరో కథ. ఆ పాయింట్ నన్ను ఎగ్జయిట్ చేసింది. రియల్ లైఫ్‌లో కూడా నమ్మినవాళ్ల కోసం మీరు ఎంతదాకా అయినా వెళతారట కదా? అది నాన్నగారు నేర్పించింది. నమ్మినవాళ్ల కోసం నాన్నగారు ఎంత ప్రాబ్లమ్ అయినా వాళ్లను సపోర్ట్ చేస్తారు. ‘అవుట్ ఆఫ్ ది వే’ వెళతారు. చిన్నప్పట్నుంచీ నాన్నగార్ని చూశాం కాబట్టి, ‘ప్రాబ్లమ్ అవుతుందా.. అయితే ఏంటి? మనవాళ్ల కోసం ఏదైనా సరే చేయాల్సిందే’ అనే అభిప్రాయం బలపడింది. నాయకుడిగా, ప్రతి నాయకుడిగా, సహాయనటుడిగా.. వాట్ నాట్... మోహన్‌బాబుగారు ఏదైనా చేయగలరు. మరి మీకు ప్రెజర్‌గా ఉంటుందేమో? ప్రెజర్ హండ్రెడ్ పర్సంట్ ఉంది. ప్రతి ఒక్కరూ ఆయనతో పోల్చి, ‘విష్ణు వాళ్ల నాన్నలా డైలాగ్స్ చెప్పగలుగుతాడా? లేదు? వాళ్ల నాన్నలా నటిస్తాడా? లేదు’ అంటారు. అంత గ్రేట్ యాక్టర్‌తో పోల్చడం సరికాదు. నేను, మనోజ్ ఇంకా చిన్నవాళ్లమే. మేం మంచి నటులమో కాదో కాలం నిర్ణయిస్తుంది. ఆయనతో మిమ్మల్ని పోల్చినప్పుడు మీకెలా అనిపిస్తుంటుంది? ఫ్రస్ట్రేషన్‌గా... ఒక్క విషయం ఓపెన్‌గా చెప్పాలంటే.. నాన్నగారిలా నేను డైలాగ్స్ చెబితే ‘మిమిక్రీ ఆర్టిస్ట్‌నో.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌నో’ అవుతాను. అప్పుడు నా సొంత స్టయిల్ నాకుండదు కదా. నటుడిగా మీ రియల్ పొటెన్షియల్ ఇంకా బయటికి రాలేదేమో అంటే ఒప్పుకుంటారా? తప్పకుండా ఒప్పుకుంటాను. ఏదైనా సినిమా సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆ దేవుడి దయ వల్ల నాకు ఈ మధ్యకాలంలో మూడు మంచి సినిమాలు వచ్చాయి. అవి ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’. ఆ మూడు సినిమాలు 40, 50 కోట్లు కలెక్ట్ చేయలేదు కానీ, నేను పెట్టిన డబ్బుకి రెట్టింపు వచ్చింది. మార్కెట్ పెరిగింది.. ఈసారైనా కొత్తగా ఏదైనా చేద్దాం అనుకుని ‘అనుక్షణం’ చేశాను. జనరల్‌గా నా సినిమాలు ఏడు వందల నుంచి ఎనిమిది వందల థియేటర్లలో విడుదలవుతాయి. కానీ, ఈ చిత్రాన్ని 70 థియేటర్లలోనే విడుదల చేశాను. అది ప్రయోగాత్మక చిత్రం కాబట్టి, మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్న ఏరియాల్లోనే విడుదల చేశాను. అది కూడా డబ్బు తెచ్చిపెట్టింది. నటుడిగా కూడా సంతృప్తినిచ్చింది. ఇప్పుడు ట్వంటీ ప్లస్, ఫార్టీ ప్లస్ హీరోలు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మీలా మిడిల్ బాస్కెట్లో ఉన్న హీరోలు ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది? నాకిప్పుడు 32 సంవత్సరాలు. ఓ 48, 50 ఇయర్స్ వచ్చేవరకూ నా బాడీని ఫిట్‌గా పెట్టుకోవాలి. ఆ వయసులో కాలేజ్ స్టూడెంట్ రోల్ వస్తే, దానికి సూట్ కావాలి. ఆమిర్ ఖాన్‌గారు ‘3 ఇడియట్స్’ చేసినప్పుడు యాభయ్యో, యాభై రెండేళ్లో ఉంటాయ్. కానీ, ఆ సినిమాలో ఆయన కాలేజ్ స్టూడెంట్‌గా చేస్తే మనం అంగీకరించాం. ఆమిర్ అలా ఫిట్‌గా ఉన్నారు కాబట్టే, సూట్ అయ్యారు. నేను ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోవడానికి పూర్తిగా ట్రై చేస్తా. మీరు చేసే సినిమాల కథలను మీ నాన్నగారికి చెప్పి ఆయన సలహా తీసుకుంటారా? ప్రతి కథ చెబుతాను. ఆయన ‘సలీమ్’ చేయొద్దన్నారు. కానీ, నేను మొండిగా చేశాను. ఆయన ‘దేనికైనా రెడీ’ బ్రహ్మాండంగా ఉంటుంది. చేయమన్నారు. చేశాను. అది పెద్ద హిట్టయిన విషయం తెలిసిందే. నాన్నగారి జడ్జిమెంట్‌ని గుడ్డిగా నమ్ముతాను. మీరు నటించి, నిర్మించే సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ కావట? అది నిజమే. బడ్జెట్ హద్దులు దాటకపోవడానికి కారణం ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాను. ‘డైనమైట్’ని తీసుకుందాం. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్‌గా విజయన్ని తీసుకున్నాను. ‘మాస్టర్ లొకేషన్స్ అన్నీ ఫైనలైజ్ చేసుకోండి. ఆ తర్వాత కొంత రిహార్సల్ చేద్దాం’ అని చెప్పాను. వంద రూపాయలవుతుందని ఆయన తొంభై రూపాయల్లోనే చేశారు. ‘డైనమైట్’ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. టాటూలు వేసుకున్నారు. ఆ స్థాయిలో శ్రమపడేంత అర్హత ఈ కథకు ఉందా? ఉంది. ఫైట్ మాస్టర్ విజయన్ ఏమన్నారంటే ‘షూటింగ్ ఆరంభించే నాలుగైదు నెలల ముందే లెగ్స్ ఫ్రీ చేసుకోవాలి. ఇంకా ఫిట్‌గా ఉండాలి. టఫ్‌గా ఉంటుంది’ అన్నారు. ‘‘బ్రదర్ నువ్వు చొక్కా విప్పి, బాడీ చూపించి వీడు కొడతాడు అని నిరూపించుకోవాల్సిన అవసరంలేదు. టీ షర్ట్‌లో కనిపించినా ‘వీడు కొడతాడు రా’ అనేట్లుగా ఫిజిక్ ఉండాలి’’ అని దేవా కట్టా అన్నారు. అందుకే ఫిజికల్ ఫిట్నెస్ కోసం వర్కవుట్ చేశా. మార్షల్ ఆర్ట్స్‌లో ‘ఊషూ’ నేర్చుకున్నాను. మోహన్‌బాబుగారి అబ్బాయిగా ‘ఇంత టఫ్ ఫైట్ చేయనని, ఇలాంటి డ్యాన్సులు చేయను’ అని చెప్పే స్కోప్ ఉంది కదా? నా టెక్నీషియన్స్‌ని నేను ఒబే చేయకుండా నా ఇష్టానుసారం నేను చేసుకుంటే ఉపయోగం ఏం ఉంటుంది? కొత్తవాళ్లను పెట్టుకుని ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు. విజయన్ మాస్టర్ అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఆయన చెప్పినట్లు చేశాను. మిమ్మల్ని పూర్తిగా వాడుకునే స్వేచ్ఛ ఇచ్చానంటారు? నేనా ఫ్రీడమ్ ఇవ్వకపోతే నా పొటెన్షియల్ ఎలా బయటకు వస్తుంది? దేవా కట్టా, విజయన్ మాస్టర్ని అడిగితే నేనెంత ఫ్రీడమ్ ఇచ్చానో తెలుస్తుంది. ఓకే.. మనోజ్ కరెంటు తీగలాంటి అబ్బాయి.. మరి మీరు? ఏమో నా గురించి నేనేం చెప్పగలను? వేరే వాళ్లు చెబితే బాగుంటుంది. మీ మిసెస్ విరానికా మీ సినిమాల గురించి ఏమంటారు? విన్నీ బెస్ట్ క్రిటిక్. సినిమా చూడగానే ‘భయంగా ఉంది.. సినిమా అంత లేదు’ అని చెప్పేస్తుంది. నేను చేసిన వాటిలో విన్నీ ఇబ్బందిపడిన సినిమా ‘రౌడీ’. అందులో ‘నీ మీద ఒట్టు...’ పాట చూసి చాలా సిగ్గుపడిపోయింది. ‘ఈ పాటను పిల్లలకు ఎలా చూపిస్తాం’ అంది. యాక్చువల్‌గా ఆ పాటలో హీరోయిన్ని కిస్ చేయడం వంటివి ఉండవు. కానీ, నేనిచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కి అలా చెప్పింది. ఒక నటుడిగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెంచిన చిత్రం ‘రౌడీ’. ఎందుకలా అంటున్నారు? ‘నీ మీద ఒట్టు...’ పాటలో నా ఎక్స్‌ప్రెషన్స్‌ని రామూగారు చాలా బాగా క్యాప్చర్ చేశారు. కేవలం నా ఎక్స్ప్రెషన్స్ వల్ల ఆ పాట సెన్సువస్గా ఉంటుంది. ఆ పాటలో హీరోయిన్ నడుము పట్టుకుని, ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తాను. దాన్ని కట్ చేయమని సెన్సార్ బోర్డ్ వారు అన్నారు. ‘ఏం.. నా ఎక్స్ప్రెషన్ వల్గర్‌గా ఉందా?’ అంటే లేదన్నారు. మరెందుకు? కట్ చేయాలంటే... వాళ్లు చెప్పలేకపోయారు. ఆ ఎక్స్ప్రెషన్ అంత ఎఫెక్టివ్‌గా ఉంది. ఆ రోజు నటుడిగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. రొమాంటిక్ సాంగ్స్, రొమాంటిక్ సీన్స్‌లో నటించినప్పుడు మీ విన్నీ ఏమీ అనరా? ఏమీ అనదు. నన్ను గాలికి వదిలేసింది. నీ ఇష్టం ఎక్కడైనా తిరుగు.. ఇంటికి రా అంటుంది. నన్ను అంత ట్రస్ట్ చేయడం ఆ అమ్మాయి తప్పు. తర్వాత తర్వాత తెలుస్తుంది (అక్కడే ఉన్న విన్నీని చూసి, కన్ను గీటుతూ). మీ నాన్నగారికి మీరు, మనోజ్ కన్నా లక్ష్మీప్రసన్న అంటేనే ఇష్టం అనుకుంటా కదా? మరి.. మీ అమ్మగారికి..? నా చిన్నప్పుడు అమ్మకి నేనే ఫేవరెట్. నేను కొంచెం పెద్దయ్యాక మనోజ్ చిన్నవాడు కదా అని ఆమెకు ఫేవరెట్ అయ్యాడు. అమ్మకి మనోజ్ పెట్. మా అక్క ఎంత అల్లరి చేసినా, దబాయించినా మా నాన్నగారికి కోపం రాదు. మా అక్క చేసిన అల్లరిలో పది శాతం నేను, మనోజ్ చేసి ఉంటే మమ్మల్ని తలకిందులుగా వేలాడదీసి వాయించేసేవారు. మరి.. అక్క ఏం చేసినా ఎందుకు ఊరుకున్నారో? ఇప్పుడు నాకు ఇద్దరు కూతుళ్లు పుట్టాక అర్థమవుతోంది. మీరు కూడా మనోజ్‌ని చాలా ప్యాంపర్ చేస్తారేమో? బాధ్యతలు మోయడానికి మనం ఉన్నాం కదా.. చిన్నోడు ఎందుకులే అనిపిస్తుంది. నాకు ఓ 90ఏళ్లు వయసొచ్చినప్పుడు మనోజ్ కూడా ఓల్డ్ అవుతాడు. అప్పుడు కూడా మనోజ్ చిన్నోడనే అనుకుంటాను. ఫైనల్లీ... విరానికా మీ ఇంట్లోవాళ్లతో బాగా కలిసిపోయారు. అందువల్ల జాయింట్ ఫ్యామిలీగా ఉండటానికి కుదిరింది. మరి.. మనోజ్ వైఫ్ ప్రణతి సంగతేంటి? ఆ అమ్మాయి విరానికా ఫ్రెండ్ కాబట్టి, మా ఇంటి పద్ధతులు బాగా తెలుసు. చక్కగా అడ్జస్ట్ అవుతోంది. డైనమైట్ వర్కవుట్స్... డైట్ జనవరిలో షూటింగ్ కాబట్టి, డిసెంబర్లో బ్యాంకాక్ వెళి,్ల ఫైట్ మాస్టర్ విజయన్ ఫైట్స్ నేర్చుకోమన్నారు. నవంబర్‌లో ఇక్కడే ప్రాక్టీస్ మొదలుపెడితే, ఎవరో ఒకరు కథలు చెబుతామంటూ వచ్చేవారు. ఇలా అయితే ప్రాక్టీస్ సాగదనిపించి సంపత్ అని ఇక్కడి ట్రైనర్‌ని తీసుకుని, బ్యాంకాక్ వెళ్లాను. ఉదయం నాలుగున్నరకు నిద్రలేచి ఓ రెండు గంటలు జిమ్ చేసేవాణ్ణి. ఆ తర్వాత తొమ్మిది గంటల ప్రాంతంలో మార్షల్ ఆర్ట్స్ చేసేవాణ్ణి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాణ్ణి. సాయంత్రం ఆరుగంటల నుంచి ఓ గంట సేపు జిమ్ చేసేవాణ్ణి. డిసెంబర్ 26 తర్వాత నేను ఇండియా వచ్చేశాను. నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన మేరకు లాస్ వేగాస్ నుంచి ఓ ట్రైనర్‌ని పిలిపించుకున్నాను. ‘డైనమైట్’ షూటింగ్ మొదలుపెట్టినప్పట్నుంచి పూర్తయ్యేవరకు ఆయన నాతో పాటే ఉన్నారు. హీరోకి దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విజయన్ మాస్టర్ అన్నీ తీసుకున్నారు. అయినప్పటికీ ఓ ఫైట్ చేస్తున్నప్పుడు నా కుడి చేయి బొటనవేలు ఫ్రాక్చర్ అయ్యింది. మూడో టేక్‌కి ఆయన ఓకే అంటే, ఇంకోసారి చేస్తానంటూ చేశాను. అప్పుడు ఫ్రాక్చర్ అయ్యింది. దాంతో నాన్నగారు ‘ఫైట్ మాస్టర్ టేక్ ఓకే అన్న తర్వాత మళ్లీ చేయొద్దు’ అని క్లాస్ తీసుకున్నారు. ఈ సినిమాకి చేసినంత వర్కవుట్ ఇప్పటివరకూ ఏ సినిమాకీ చేయలేదు. నేను చిరుతిండి ఎక్కువగా తింటాను. అది బ్యాడ్ హ్యాబిట్. ట్రైనర్స్‌కి మోహన్‌బాబుగారు, విష్ణు ఎవరైనా సరే ఒకటే. ‘ఇంత దూరం వచ్చింది మీ ఫిట్నెస్ కోసమే’ అంటూ పక్కనే ఉండి కంట్రోల్ చేస్తుంటారు. ఈ సినిమా చేసినన్ని రోజులూ ఉదయం ప్రొటీన్ షేక్ తాగేవాణ్ణి. పది ఎగ్ వైట్స్ తినేవాణ్ణి. నాలుగు బాదంపప్పులు తినేవాణ్ణి. పది గంటలకు ఒక ఫ్రూట్, లంచ్‌కి చికెన్ లేక ఫిష్ తీసుకునేవాణ్ణి. సాయంత్రం నాలుగు గంటలకు ఫ్రూట్స్ లేదా నట్స్ తీనేవాణ్ణి. డిన్నర్ కూడా లైట్‌గా తీసుకునేవాణ్ణి. - డి.జి. భవాని