
నవంబర్ 23న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
మంచు విష్ణు (హీరో), నాగచైతన్య (హీరో)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల వివాహ యత్నాలు ఫలిస్తాయి. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులకు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతుంది. అలంకరణ సామగ్రికి లేదా ఆభరణాల కొనుగోలుకు వెచ్చిస్తారు. అందరితోనూ మంచి సంబంధ బాంధవ్యాలు నెరపుతారు. కళాకారులకు, సినీనటులకు, సంగీతకారులకు, మీడియా రంగంలోని వారికీ, సినీ నిర్మాతలకు, నగల వ్యాపారులకు ఈ సంవత్సరం శుక్రుని శుభదృష్టి వల్ల చాలా బాగుంటుంది. విదేశీ ప్రయాణం చేయాలనే కోరిక తీరుతుంది. గ్రీన్ కార్డు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. పుట్టిన తేదీ 23. ఇది బుధునికి సంబంధించినది కావడం వల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తితో చాకచక్యంగా పనులు చక్కబెడతారు. ఎల్లప్పుడూ ప్రభుత్వ పరమైన సహకారం లేదా ప్రభుత్వోద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రశాంతంగా గడుపుతారు. గౌరవం, పేరుప్రఖ్యాతులు పొందుతారు. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయం లభిస్తుంది. లక్కీ నంబర్స్: 2,3,5,6,9; లక్కీ కలర్స్: వైట్, గ్రీన్, సిల్వర్, పర్పుల్, రెడ్, ఆరంజ్, రోజ్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్ర వారాలు. సూచనలు: అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలో అన్నదానం, సేవాకార్యక్రమాలు చేయడం, పేద కన్యలకు వివాహ ఖర్చులు భరించడం, ఆవులకు ఆహారం పెట్టడం, తల్లిని, తత్సమానురాలైన వారిని ఆదరించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్