
బ్యాచిలర్ వదినగారు!
శుక్రవారం సమంత పుట్టినరోజు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్... ముగ్గురిలో ఒక్కరంటే ఒక్కరు కూడా త్వరలో అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టనున్న ఈమెకు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ చెప్పలేదు. డైరెక్ట్‌గా కలసి చెప్పారో.. ఫోనులో చెప్పారో... ప్రేక్షకులకు తెలీదు కదా! లైఫ్‌లో ఇటువంటి ఇంపార్టెంట్ డేస్‌ను కాబోయే భర్త అక్కినేని నాగచైతన్యతో సెలబ్రేట్ చేసుకోవడం... వెంటనే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సమంత సై్టల్. శుక్రవారం ఇలాంటివి ఏమీ కనిపించలేదు.
అనాథ బాలలతో కలసి ‘బాహుబలి–2’ చూశారు. మంచి విషయమే అయినా... ఇదంతా చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించింది. అసలు మేటర్ ఏంటంటే... శుక్రవారం సాయంత్రం అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో సమంత స్పెషల్‌గా బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. కాబోయే వదినతో దిగిన బర్త్‌డే ఫొటోలను అఖిల్ ట్వీట్ చేసి, విషెస్ చెప్పారు. ‘‘కొత్త అక్కినేనితో నేను. డార్లింగ్ వదినకు హ్యాపీ బర్త్‌డే. ఈ ఏడాది నీకు అంతా మంచే జరుగుతుంది’’ అని అఖిల్ పేర్కొన్నారు. చైతూతో పెళ్లి ఫిక్స్ అయ్యింది కదా! సో, సమంతకు బ్యాచిలర్‌గా ఇదే చివరి బర్త్‌డే కావొచ్చు.