హలో అవినాష్ అని పలకరించడానికి నాగార్జున, అమల, సమంత రెడీ అయ్యారని సమాచారం. అవినాష్ ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖిల్ అక్కినేని పేరే అవినాష్. ‘హలో’లో తను చేస్తోన్న క్యారెక్టర్ పేరిది. సినిమాలో అవినాష్‌కి నాగ్, అమల, సామ్ హలో చెబుతారట. అంటే.. గెస్టులుగా కనిపిస్తారని సమాచారం. ఆల్రెడీ ‘మనం’ అక్కినేని ఫ్యాన్స్‌కు మంచి పండగ.
‘హలో’లో గెస్ట్ రోల్స్ నిజమైతే ఫ్యాన్స్‌కు మరోసారి ఐ–ఫీస్ట్ గ్యారంటీ అని చెప్పొచ్చు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి కథానాయికగా నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున నిర్మిస్తోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి, టీజర్‌కి విశేష స్పందన వచ్చింది. డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment