Hello
-
ఇండస్ట్రీలోనే అలాంటి తొలి చిత్రం.. అవార్డ్ కైవసం!
కావ్య కీర్తి కీలక పాత్రలో నటించిన చిత్రం హలో బేబీ. ఈ మూవీ తాజాగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రానికి రామ్ గోపాల్ రత్నం దర్శకత్వం వహించారు. ఎస్‌కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మించారు. తాజాగా ఈ అవార్డును తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో నిర్మాత ఆదినారాయణకు అందించారు. కాగా.. ఈ సినిమా ఇండస్ట్రీలోనే మొదటి హ్యాకింగ్ చిత్రంగా నిలిచింది. కేవలం సోలో క్యారెక్టర్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాల్లో 200కి పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన మేకర్స్ హిందీలో కూడా రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుని యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్ అందుకుంది. ఇండస్ట్రీలో తొలి హ్యాకింగ్ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుందని సెన్సార్ అధికారులు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు సుకుమార్ పమ్మి సంగీతమందించారు. -
హలో బదులు.. వందేమాతరం చెప్పండంటూ అధికారుల ఆదేశం.. ఎక్కడంటే!
సాక్షి, ముంబై: విధుల్లో ఉన్న సమయంలో వచ్చే ఫోన్ కాల్స్‌కు హలో.. బదులుగా వందేమాతరం.. అని చెప్పాలంటూ మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆదేశాలు జారీ చేసింది. ‘అటవీ శాఖలోని అధికారులు, సిబ్బంది అందరూ విధుల్లో ఉన్న సమయంలో పౌరులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను తీసుకునేటప్పుడు హలోకు బదులుగా వందేమాతరం అని అని చెప్పాలని కోరుతున్నాం’ అని అందులో ఉంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు హలో బదులుగా వందేమా తరం అని చెప్పాలని తమ శాఖ అధికారులను కోరినట్లు అటవీ శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సుధీర్ ముంగంటివార్ అంతకుముందు మీడియాతో అన్నారు. చదవండి: జార్ఖండ్ సీఎంకు షాక్.. శాసనసభ సభ్యత్వం రద్దు -
‘హలో’ కోలీవుడ్..!
అక్కినేని వారసుడు అఖిల్‌కు కాలం కలిసిరావడం లేదు. ‘అఖిల్’ సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకుంటే.. అది కాస్తా బెడిసికొట్టింది. రెండో సినిమాకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. ‘హలో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే.. అందరినీ ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆచితూచి చేస్తున్న మూడో చిత్రం ‘మిస్టర్. మజ్ను’తోనైనా సక్సెస్ కొట్టాలని అఖిల్ ఆశపడుతున్నాడు. అయితే ఇప్పడు ‘హలో’ సినిమాకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాను డబ్చేసి తమిళనాట రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి ఇక్కడే మెప్పించలేకపోయిన సినిమా అక్కడ ఎలాంటి మ్యాజిక్ చేయనుందో చూడాలి. -
అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ!
అక్కినేని నట వారసుడిగా భారీ అంచనాల మధ్య సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అఖిల్. తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్, రెండో ప్రయత్నంగా తెరకెక్కిన హలోతో పరవాలేదనిపించాడు. ప్రస్తుతం తొలి ప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే అఖిల్ తదుపరి చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అఖిల్ తన నెక్ట్స్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. నటుడు ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్ దర్శకత్వంలో అఖిల్ సినిమా చేస్తున్నాడన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. మలుపు సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య ప్రభాస్ తన నెక్ట్స్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. అఖిల్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కింగ్ నాగార్జున, కరణ్ జోహర్లు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించనున్నారట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా, అఖిల్ బాలీవుడ్ ఎంట్రీపై జోరుగా ప్రచారం జరుగుతోంది. -
అఖిల్ 3 టైటిల్ ఇదేనా..?
అక్కినేని వారసుడిగా వెండితెరకుపరిచయం అయిన యువ కథానాయకుడు అఖిల్. తొలి సినిమా అఖిల్‌తో నిరాశపరిచిన ఈ యంగ్ హీరో, రెండో సినిమాగా తెరకెక్కిన ‘హలో’తో పరవాలేదనిపించాడు. అయితే స్టార్ వారసుడిగా ప్రూవ్ చేసుకునే స్థాయిలో కమర్షియల్ హిట్ మాత్రం సాధించలేకపోయాడు. దీంతో అఖిల్ మూడో సినిమాపై ఆసక్తి నెలకొంది. తొలిప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎక్కువ భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కు మిస్టర్ మజ్ను అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన మజ్ను అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ అఖిల్ సినిమాకు మిస్టర్ మజ్ను అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
బాలీవుడ్ బ్యూటీతో అఖిల్..!
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ ప్రస్తుతం తన మూడో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. హాలో పరవాలేదనిపించిన ఈ యంగ్ హీరో మూడో సినిమాతో ఎలాగైన మంచి విజయాన్ని సాధించాలని కష్టపడుతున్నాడు. తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో బాలీవుడ్ నటి ఫరా కరిమీ ఆడిపాడనుందట. ధృవ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించిన ఈ బ్యూటి అఖిల్ సరసన స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంగ్లాండ్‌లో జరుగుతోంది. -
ఆ యాప్స్‌ను మూసేస్తున్న ఫేస్బుక్
న్యూఢిల్లీ : సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ మూడు యాప్స్‌ను మూసేస్తోంది. హలో, మూవ్స్, టీబీహెచ్ అనే యాప్స్‌ను మూసేస్తున్నట్టు ఫేస్బుక్ ప్రకటించింది. తక్కువ వాడకం కారణంతో ఈ యాప్స్‌ను తీసేస్తున్నామని కంపెనీ తెలిపింది. బ్రెజిల్, అమెరికా, నైజిరియాలోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 2015లో హలో యాప్‌ను ఫేస్బుక్ లాంచ్చేసింది. ఇది యూజర్ల ఫేస్బుక్ సమాచారాన్ని, ఫోన్లోని కాంటాక్ట్ సమాచారంతో కలుపుతూ ఉంటుంది. మరికొన్ని వారాల్లోనే కంపెనీ హలో యాప్‌ను తీసేయబోతుంది. ఇక రెండో యాప్ మూవ్స్. ఈ ఫిట్నెస్ యాప్‌ను 2014లో ఫేస్బుక్ కొనుగోలు చేసింది. యూజర్ల రోజువారీ కార్యకలాపాలు వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్ వంటి వాటిని రికార్డు చేయడం కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. జూలై 31 నుంచి ఈ యాప్‌ను ఫేస్బుక్ మూసేస్తుంది. ఇక చివరి యాప్ టీబీహెచ్. గతేడాదే దీన్ని ఫేస్బుక్ కొనుగోలు చేసింది. అమెరికాలోని హైస్కూల్ విద్యార్థులకు ఈ సోషల్ మీడియా యాప్ సుపరిచితమే. ప్రస్తుతం తొలగిస్తున్న ఈ యాప్స్‌లోని యూజర్ల డేటాను 90 రోజుల్లో తొలగిస్తామని కంపెనీ చెప్పింది. తరుచూ తమ యాప్స్‌పై సమీక్ష చేపడుతూ ఉంటామని, ఈ సమీక్షలో తక్కువగా వాడే యాప్స్‌ను తొలగించేలా నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. కొంతమంది యూజర్లు ఇంకా ఈ యాప్స్‌ను వాడుతున్నారని, వారికి ఇది నిరాశ కలిగించే అంశమని, మీ సపోర్టు తమకు అందించినందుకు కృతజ్ఞతలని కంపెనీ తెలిపింది. తాజాగా ఫేస్బుక్ మరో కొత్త ఫీచర్ స్నూజ్ను పరిశీస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఫీచర్ ద్వారా కొన్ని పోస్టులను 30 రోజుల పాటు మ్యూట్‌లో పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ టెస్టింగ్‌ను ఫేస్బుక్, టెక్‌క్రంచ్‌కు ధృవీకరించింది. కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను ఫేస్బుక్ ఆవిష్కరించనుంది. -
శర్వా సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా..!
హాలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ కల్యాణి ప్రియదర్శన్. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన కల్యాణి ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. స్వామి రారా ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో శర్వానంద్ 80ల కాలం నాటి డాన్ పాత్రలో కనిపించనున్నాడట. కల్యాణి కూడా ఆ కాలం నాటి పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. తొలి సినిమాలో ట్రెండీగా కనిపించిన ఈ భామ ఇప్పుడు పల్లె పడుచులా కనిపించేందుకు చాలా హోం వర్క్ చేసినట్టుగా తెలుస్తోంది. స్టైలిస్ట్ అశ్విన్, దర్శకుడు సుధీర్ వర్మలు కళ్యాణీని పూర్తిగా పల్లెటూరి అమ్మాయిగా మార్చేశారు. ఇప్పటికే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగా, మరో షెడ్యూల్‌ను త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. -
‘ఛలో’ హీరోతో ‘హలో’ హీరోయిన్..!
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ సాధించిన ఈ యువ కథానాయకుడు తన సొంత నిర్మాణ సంస్థలో మరో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్ నిర్ణయించారు. ఇటీవలే లాంచనంగా షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా మెహరీన్‌ను తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. తరువాత ఆమె స్థానంలో కిరాక్ పార్టీ ఫేం సిమ్రాన్ పరీన్జా పేరు వినిపించింది. తాజాగా మరో అందాల భామ పేరు తెర మీదకు వచ్చింది. అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో సినిమాతో పరిచయం అయిన కళ్యాణీ ప్రియదర్శన్ నర్తనశాల సినిమాలో హీరోయిన్గా నటించనుందట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఇంతవరకు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. -
ఫేస్‌బుక్‌కు షాక్: కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ డేటా బ్రీచ్ నేపథ్యంలో కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫాం రంగంలోకి వస్తోంది. ఆర్కుట్ ఫౌండర్ ఆర్కుట్ బ్యూకుక్టన్ ఈ సంచలన ప్రకటన చేశారు. 'హలో' పేరుతో భారతీయ సోషల్ మీడియా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించారు. బ్రెజిల్లో దీన్ని 2016,జూలైలో ప్రారంభించాము ..భారత మార్కెట్లో సుమారు 35,000 మంది వినియోగదారులు తమ బీటా టెస్టింగ్‌లో భాగంగా ఉన్నారనీ ఆయన ప్రకటించారు. మరోసారి భారతదేశానికి హలో చెప్పడానికి ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. హలో యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లేలలో డౌన్ లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. అంతేకాదు ఆదాయం పొందడానికి యూజర్ డేటాని విక్రయించాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. థర్డ్ పార్టీ పార్టీలకు తమ యూజర్ల డాటా షేర్ చేయమని హామీ ఇచ్చారు. 2014 లో ఆర్కుట్ మూసివేసిన ఇపుడు మళ్లీ రంగంలోకి వస్తోంది. 2004లో సామాజిక మాధ్యమ విప్లవానికి తెరలేపిన ‘ఆర్కుట్ ’ సృష్టికర్త ఆర్కుట్ బ్యూకుక్టన్. టర్కీకి చెందిన అతను గూగుల్‌లో పనిచేస్తున్న సమయంలోనే ‘ఆర్కుట్’ను రూపొందించారు. అప్పట్లో ఆర్కుట్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇదే తరహాలో అదే ఏడాదిలో ప్రారంభమైన ఫేస్బుక్ ఎంతలా దూసుకెళిపోతోందో చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ మాజీ ఉద్యోగులైన కొంత మంది స్నేహితులతో కలిసి ఇప్పటికే ‘హలో’ని కెనడా, న్యూజీలాండ్, బ్రెజిల్.... ఇలా 12 దేశాల్లో ప్రారంభించారు. కాగా సోషల్ నెట్వవర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌కు దేశంలో దాదాపు 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయితే కేంబ్రిడ్జ్ ఎనలిటికాలో పాల్గొన్న గ్లోబల్ డేటా ఉల్లంఘన వల్ల దేశంలోని దాదాపు 5.62 లక్షల మంది డేటా లీక్ అయిందని స్వయంగా జుకర్ బర్గ్ ఒప్పుకున్నారు. మరోవైపు అమెరికా కాంగ్రెస్ముందు విచారణకు హాజరైన జుకర్‌బర్గ్ ఫేస్బుక్ నిర్వహణలో చాలా తప్పులు జరిగాయనీ, క్షమించాలని కోరారు. -
మెట్రో ట్రైన్లో నాని, రష్మిక
హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రారంభమైన తరువాత మొట్ట మొదటిసారి షూటింగ్ జరుపుకుంటున్న సినిమా నాగార్జున, నానిల మల్టీ స్టారర్. ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ పతాకంపై మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనిదత్ , శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది (మార్చి 18) రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్ లో మియాపూర్ స్టేషన్ లో మెట్రో ట్రైన్ లో కొన్ని చిత్రీకరించారు. గతంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో సినిమా చిత్రీకరణ మెట్రో ట్రైన్లో జరిగినా అప్పటికీ మెట్రో ప్రారంభం కాలేదు. హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రారంభమైన తరువాత చిత్రీకరణ జరుపుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ షెడ్యూల్ అందులో నాని, రశ్మిక మందన్న లతో పాటు సంపూర్ణేష్ బాబు పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. -
శర్వాకు ‘హలో’ చెబుతోందా..!
హలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల భామ కళ్యాణి ప్రియదర్శన్. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన కళ్యాణి తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అఖిల్ లాంటి స్టార్ హీరో సరసన పరిచయం కావటం కూడా కళ్యాణికి కలిసొచ్చింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో క్రేజ్ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్లో వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న శర్వానంద్ తదుపరి చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించనుంది. స్వామి రారా ,కేశల లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం కళ్యాణిని హీరోయిన్ గా సంప్రదించారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
వర్మ శిష్యుడితో అఖిల్ కొత్త సినిమా
అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తొలి సినిమాతో అభిమానులను నిరాశపరిచాడు. తరువాత హలో అంటూ పలకరించినా.. కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో మూడో సినిమా విషయంలో అఖిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అఖిల్ తదుపరి చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. అఖిల్ తన తదుపరి చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మంజునాథ్ అనే యువ దర్శకుడి డైరెక్షన్లో చేయనున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రయల్ షూట్ కూడా చేశారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ ట్రయల్ షూట్ లో వర్మ కూడా పాల్గొన్నట్టుగా వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫొటోలు అఖిల్ తో వర్మ తెరకెక్కిస్తున్న షార్ట్ ఫిలింకు సబంధించినవన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
అఖిల్ నెక్ట్స్ ఎవరితో..?
అక్కినేని నటవారసుడిగా వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో అఖిల్, తొలి సినిమాతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఎలర్ట్ అయిన అక్కినేని ఫ్యామిలీ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కింగ్ నాగార్జున దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ రెండో సినిమా హలోకు మంచి టాక్ రావటంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో తదుపరి చిత్రంపై చర్చ మొదలైంది. తాజాగా అఖిల్ నెక్ట్స్ సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అఖిల్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అక్కినేని ఫ్యామిలీ త్వరలో నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నారు. అఖిల్ తదుపరి చిత్రానికి బోయపాటి శ్రీను లేదా సుకుమార్‌ల దర్శకత్వం వహించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో ఒకరికి అఖిల్ ఓకె చెప్తాడా..? లేక మరో దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా..? చూడాలి. -
అమల నా చుట్టూ డ్యాన్స్ చేసింది
‘‘జనరల్‌గా నాకు సినిమాలు తీయాలంటే ప్రేమ. ‘హలో’ అఖిల్ సినిమా కాబట్టి ఆ ప్రేమ ఇంకొంచెం పెరిగింది. ‘రాజన్న’ సినిమాకి 18 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఇంత బడ్జెట్ ఎందుకని ఎవరూ అడగలేదు. ‘హలో’ సినిమాకి ఎక్కువ బడ్జెట్ అయిందట కదా? అంటున్నారు. అవును.. అఖిల్ సినిమా కాబట్టే అంత ఖర్చు పెట్టా. గ్రాండ్‌గా సినిమా తీశా’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. అఖిల్, కల్యాణీ ప్రియదర్శన్ జంటగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ సమర్పణలో నాగార్జున నిర్మించిన ‘హలో’ ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున పలు విశేషాలు పంచుకున్నారు. ► అఖిల్‌తో ఓ సినిమా చేసిపెట్టమని ‘మనం’ చిత్రం తర్వాత విక్రమ్‌ని అడిగా. సూర్యతో ‘24’ సినిమా తర్వాత చేస్తానని, ఇప్పుడు ‘హలో’ చేశారు. నాన్నగారికి (నాగేశ్వరరావు) ‘మనం’ వంటి అద్భుతమైన సినిమా ఇచ్చిన విక్రమ్ అఖిల్‌కి ‘హలో’ వంటి అందమైన ప్రేమకథా చిత్రాన్ని అందించినందుకు థ్యాంక్స్. ► అఖిల్‌కి ఎలాగైనా ఓ మంచి హిట్ ఇవ్వాలనే తపనతో ‘హలో’ సినిమా స్టార్ట్ చేశాం. తొలి సినిమాతో దెబ్బ తిన్న అఖిల్ కూడా ఎలాగైనా రెండో సినిమాతో హిట్ సాధించాలనే కసితో ఈ సినిమా చేశాడు. వాడి కష్టం ఈ చిత్రంలో కనిపిస్తుంది. సినిమా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ► ‘హలో’ సినిమా విషయంలో అన్నిట్లోనూ నేను ఇన్వాల్వ్ అవుతున్నానంటూ సోషల్ మీడియాలో రాశారు. అది అవాస్తవం. కథ ఫైనల్ అయ్యేవరకూ, సినిమా పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్ష¯Œ లో మాత్రమే నేను జోక్యం చేసుకుంటా. డైరెక్షన్లో నా జోక్యం ఉండదు. విక్రమ్‌కే పూర్తిగా వదిలేశా. అయితే క్రియేటివ్ జీనియస్‌కి టైమ్ సెన్స్ ఉండదు. అప్పుడప్పుడు అది మనం వారికి గుర్తు చేస్తుండాలి అంతే. ► అమల డ్యాన్స్ చేయడం మానేసింది (నవ్వుతూ). అయితే ‘హలో’ సినిమా చూసిన తర్వాత ఇంటికొచ్చి నా చుట్టూ డ్యాన్స్ చేసింది (నవ్వుతూ). సినిమా తనకు అంత బాగా నచ్చింది. అమల అమ్మకి తెలుగు రాకున్నా ‘హలో’ మూడుసార్లు చూసింది. ‘ఏంటి ఇన్నిసార్లు చూస్తున్నారు?’ అని నేనడిగితే ‘నా గ్రాండ్ సన్ కదా’ అన్నారావిడ. ► ‘హలో’ సినిమా చూసిన చిరంజీవిగారు భావోద్వేగంతో అఖిల్‌ని రెండు నిమిషాలపాటు హత్తుకున్నారు. అంత బాగా నచ్చింది ఆయనకు. కల్యాణీని నటుడు ప్రియదర్శన్ కూతురనో, విక్రమ్ గురువుగారమ్మాయి అనో హీరోయిన్గా తీసుకోలేదు. ఆడిషన్స్, స్క్రీన్‌టెస్ట్ చేశాక ఓకే చేశాడు విక్రమ్. ► నేను ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని హిట్లు వచ్చినా ‘గీతాంజలి, శివ’ చిత్రాల్లో నాగార్జున బాగా చేశాడంటారు. ఆ పాత్రలు నాకు సూట్ అయినట్లు ‘హలో’లో అఖిల్ పాత్రని విక్రమ్ తీర్చిదిద్దారు. ► అఖిల్ పాడతాడని మాకు తెలియదు. మాకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు మూణ్ణెళ్ల పాటు ప్రాక్టీస్ చేసి ‘ఏవేవో కలలు కన్నా’ పాట పాడాడు. ఆ పాట నాకు వినిపించగానే షాక్ అయ్యా. వాడిలో సగం బెంగాలీ బ్లడ్ ఉంది కదండీ అందుకే పాడుంటాడు. బెంగాలీ వాళ్లు ఎక్కువగా పాటలు పాడుతుంటారని అమల నాకు చెప్పింది. ► నేను, విక్రమ్, అఖిల్ కూర్చొని ఫైట్స్ హాలీవుడ్‌లా ఉండాలని డిస్కస్ చేసుకున్నాం. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ బాబ్ బ్రౌన్‌తో పార్క్ ఓవర్ ఫైట్స్ తీశాం. పైగా అఖిల్ అథ్లెటిక్ కావడంతో బాగా చేయగలిగాడు. ► అఖిల్‌కి తల్లి పాత్రలో రమ్యకృష్ణ కరెక్ట్‌గా సరిపోతారని చేయమన్నా. మరీ అమ్మ రోల్ ఏంటి నాగ్? అంది. ‘నీ పాత్రకి చప్పట్లు కొడతారు’ అంటే చేసింది. ఇటీవల నెగెటివ్ పాత్రలు చేస్తున్న జగపతిబాబు ఇందులో నాన్న పాత్రలో ఒదిగిపోయారు. తండ్రి పాత్ర మీరే చేసి ఉండొచ్చు కదా? అన్న ప్రశ్నకు నాకింకా అంత వయసు రాలేదు అన్నారు (నవ్వుతూ). ► తెలుగు ప్రేక్షకులు చాలా మంచివారు. సినిమా బాగుంటే తెలుగు సినిమా అయినా డబ్బింగ్ సినిమా అయినా ఆదరిస్తారు. బయటి ప్రొడక్షన్లో విక్రమ్ ఓ సినిమా చేశాక నాగచైతన్యతో మా బ్యానర్లో మూడో సినిమా చేస్తాడు. నేను–నాని నటించే సినిమా కథని శ్రీరామ్ ఆదిత్య వినిపించాడు. -
హలో... ఆల్ క్లాస్ మూవీ – చిరంజీవి
‘‘హలో’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్ మా సొంత కుటుంబ సభ్యుల ఫంక్షన్‌లా ఫీల్ అయ్యి సోదరుడు నాగార్జునగారు పిలవగానే ఇది నా బాధ్యత అని వచ్చా. తల్లిదండ్రులు, అన్నావదిన, కుటుంబ సభ్యులు అఖిల్ గురించి ఎంత ఆనందపడుతున్నారో అంతకంత ఆనందం నాకూ ఉంది’’ అని చిరంజీవి అన్నారు. అఖిల్, కల్యాణీ ప్రియదర్శన్ జంటగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన ‘హలో’ రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘హలో’ సినిమా చూశా. రిలీజ్‌కి ముందు సినిమా చూడటం ఓ చిన్న పరీక్షలాంటిది. బాగుందా? బాగోలేదా? అనే మీమాంసలో ఏం చెప్పాలో తెలియని అయోమయం ఉంటుంది. అబద్ధం ఆడలేం. లేనివి కల్పించి చెప్పలేం. హృదయం ఏం చెబితే అదే మాట్లాడే తత్వం ఉన్న మనకి చాలా కఠిన పరీక్షలా ఉంటుంది. కానీ, సినిమా చూసిన తర్వాత చెబుతున్నా.. ఇదొక ఫెంటాస్టిక్ లవ్‌స్టోరీ. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకూ క్లీన్‌గా ఉంటుంది. అందుకు దర్శకుడు విక్రమ్‌కి నా అభినందనలు. ఇది ఆల్ క్లాస్ సినిమా అవుతుందనడంలో సందేహం లేదు. ‘హలో’తో అఖిల్ నటుడిగా మరో మెట్టు ఎదిగిపోయాడనడంలో సందేహం లేదు. నటన, డ్యాన్సుతో పాటు పాట పాడిన అఖిల్ తన తాత, నాన్న, అన్నకంటే ఓ మెట్టు పైకి ఎదిగాడు’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘మనం’ వంటి హిట్‌తో పాటు ‘హలో’ వంటి చక్కటి, బ్యూటిఫుల్ మూవీ ఇచ్చినందుకు విక్రమ్‌కి థ్యాంక్స్. చిరంజీవిగారి ఇంటికెళ్లి ఫంక్షన్‌కి వచ్చి అఖిల్‌ని బ్లెస్ చేయాలంటే ఎక్కడికి రావాలో చెప్పండి అన్నారు. ‘హలో’ సినిమా చూసి ఇక్కడికొచ్చి మాట్లాడమన్నాను. రామ్‌చరణ్ వయసులో అఖిల్కంటే పెద్ద. నాకంటే చిరు వయసులో పెద్ద. కానీ మాకు మంచి స్నేహం కుదిరింది. కొత్త కోడలు (సమంత) వచ్చింది ఇంటికి. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉంటుంది. చైకి (నాగచైతన్య) ఉన్నంత మంచి మనసు నాకూ లేదూ ఎవరికీ లేదు. అఖిల్ నటన, డ్యాన్సులు, పాట పాడటం చూస్తుంటే కడుపు నిండిపోయింది’’ అన్నారు. ‘‘మీలాగా నేనూ 22వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నా’’ అన్నారు అమల. ‘‘ఈ చాన్స్ ఇచ్చిన నాగ్‌సార్‌కి, అమల మేడమ్‌కి థ్యాంక్స్. ‘హలో’ మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు విక్రమ్ కె.కుమార్. ‘‘అఖిల్ మంచి టెక్నీషియన్స్‌తో పని చేశారు. ‘హలో’తో అఖిల్ మరో లెవల్‌కి వెళతారు. ఈ సినిమా చూసిన నాన్నగారు లంచ్ టైమ్‌లోనూ సినిమా గురించే మాట్లాడారు. నేను చూసేందుకు వెయిట్ చేస్తున్నా’’ అన్నారు రామ్‌చరణ్. ‘‘అఖిల్‌ని ఓ బ్యూటిఫుల్ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీలో చూడాలని ఉండేది. ‘హలో’ చూశాక సంతోషంగా ఇంటికెళ్లా. అఖిల్‌ని ఇంత బాగా చూపించిన నాన్నగారికి, విక్రమ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు నాగచైతన్య. ‘‘అఖిల్ చాలా లక్కీ. మీ నాన్న అందం, స్టైల్, అమ్మ గ్రేస్ నీలో ఉన్నాయి. ఓ ఫ్యాన్‌గా ‘హలో’ సినిమా చూడాలని వెయిట్ చేస్తున్నా’’ అన్నారు సమంత. హీరో సుమంత్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, కెమెరామెన్ íపీఎస్ వినోద్, నిర్మాత కేకే రాధామోహన్ తదితరులు పాల్గొన్నారు. రెండో కొడుకు లేని లోటు అఖిల్ తీర్చాడు ‘‘చరణ్‌ని కలిసేందుకు అఖిల్ మా ఇంటికి వస్తుంటాడు. కింద ఫ్లోర్లో ఉన్న నన్ను, సురేఖ (చిరు సతీమణి)ను కలిసి, యోగక్షేమాలు తెలుసుకుని గానీ పై ఫ్లోర్‌లోని చరణ్ వద్దకు వెళ్లడు. తను పలకరించే విధానం చూస్తుంటే ఒక్కోసారి సురేఖ చిన్న ఎమోషన్‌కి లోనై.. ‘చరణ్, అఖిల్ అన్నదమ్ముల్లా కలిసి మాట్లాడుకుంటుంటే.. చరణ్‌కి మనం ఓ తమ్ముణ్ని కనుంటే ఎంత బాగుండేది.. వాళ్లూ ఇలాగే ఉండేవారు కదా’ అని అంటుంది. ‘నాగార్జునగారు, అమలగారు ఒప్పేసుకుంటే అఖిల్‌నే పెంచుకుందాం. వాళ్లు ఒప్పుకుంటారా (నవ్వుతూ). అఖిల్ ఉన్నాడు కదా.. మనకి మరో బిడ్డ లేడనే లోటుండదు. అఖిల్ ఆ లోటు తీరుస్తాడు’ అని నేను అంటుంటా. తన సంస్కారం, పెద్దలంటే గౌరవం చూస్తుంటే ఆ మంచి క్వాలిటీస్ తల్లిదండ్రుల పెంపకం నుంచి వచ్చాయి. బంగారంలాంటి అఖిల్‌ని కన్నందుకు మిమ్మల్ని (నాగ్–అమల) అభినందిస్తున్నా. మా బిడ్డలాంటి అఖిల్‌కి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, విజయోత్సవం జరగాలని, గెస్ట్‌గా నన్ను పిలవాలని కండిషన్ పెడుతున్నా’’ అన్నారు చిరంజీవి. -
‘హాలో’ అఖిల్ అమెరికా టూర్
-
‘హలో’ మూవీ స్టిల్స్
-
వస్తున్నాం.. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం.. ఇది ఫిక్స్
‘‘తెలుగు ప్రేక్షకులకు, అభిమాన దేవుళ్లందరికీ హలో. అఖిల్‌తో సినిమా తీస్తానంటూ గత ఏడాది మీకు ప్రామిస్ చేశా. నాగచైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ తీశా. వస్తున్నాం.. హిట్ కొడుతున్నాం అన్నాం.. కొట్టాం. ఆ చిత్రం తర్వాత అఖిల్ ‘హలో’ సినిమా పనిమీదే ఉన్నా’’ అని హీరో అక్కినేని నాగార్జున అన్నారు. అఖిల్, కల్యాణీ ప్రియదర్శన్ జంటగా ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ‘హలో’ ఈనెల 22న విడుదలవుతోంది. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను వైజాగ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాకు ఇష్టమైన, మనసుకి దగ్గరైన డైరెక్టర్ విక్రమ్. తెలుగు ప్రేక్షకుల్లో ఒక లెజెండ్‌గా నిలిచిపోయిన మా నాన్నగారి(అక్కినేని నాగేశ్వరరావు) ఆఖరి సినిమా ఎలా తీయాలనుకుంటుంటే దేవుడిలా వచ్చిన విక్రమ్ ‘మనం’ వంటి సినిమా తీసి నాన్నగారిని ఎంత గొప్పగా సాగనంపాడో. అఖిల్‌ని రీ లాంచ్‌లో నేను ఎలాగైతే చూడాలనుకున్నానో విక్రమ్‌తో చెప్పా. తను ‘హలో’ తో అలాగే రీలాంచ్ చేశాడు. ఈ మధ్య నా పాత సినిమాలు కొన్ని చూశా. ‘హలో’ సినిమాలో వీణ్ణి(అఖిల్) చూస్తుంటే నాకు అర్థం కావడం లేదు. మేం ఏం చేశాం.. ఇప్పుడు ఈ సినిమాలో వీడేం చేస్తున్నాడని. తెలుగు చిత్ర పరిశ్రమకు డ్యాన్సు, గ్రేసు నేర్పింది నాన్నగారు. ఆయన అచ్చు గుద్దినట్టు వీడిలో కనిపిస్తున్నారు నాకు. వైజాగ్‌కి రావాలని గంటా శ్రీనివాసరావుగారు అడుగుతున్నారు. వైజాగ్‌కి మేం ఎప్పుడో వచ్చాం. నా తొలి సినిమా ‘విక్రమ్’, ‘మాస్’ ఇక్కడే తీశాం. అరకులో ఎన్ని సినిమాలు తీశాను. వైజాగ్ అంటే మాకు ప్రాణం. ఇక్కడి కొస్తాం షూటింగ్ చేస్తాం. చైతూ(నాగచైతన్య)తో మరో సినిమా చేయమని విక్రమ్‌ని అడిగా. తను ఒప్పుకున్నాడు. మూడు రోజుల కిత్రం ‘హలో’ పూర్తి సినిమా హాయిగా చూశా. ‘వస్తున్నాం.. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం.. ఇది ఫిక్స్.. ఓకే’ అన్నారు. ‘‘ఏడాదిగా ఎమోషనల్ జర్నీ చేస్తున్నా. ఇంత కాన్ఫిడెంట్‌గా నేను ఇక్కడ మాట్లాడటానికి కారణం అమ్మ. నాన్న. వారు నా లైఫ్‌లో లేకపోతే ఏమైపోయేవాడినో. వారికి థ్యాంక్స్ మాత్రమే చెప్పగలను. విక్రమ్‌ని కలిసినప్పుడు నాలో ఎనర్జీ, కాన్ఫిడెన్స్ లెవల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ‘హలో’ తో పెరిగాయి. నేను హిట్ కొట్టడానికి రెడీ. మీరు(ఫ్యాన్స్) రెడీయా.. హిట్ కొడుతున్నాం’’ అన్నారు అఖిల్. ‘‘నాగార్జునసార్ ప్రొడక్షన్లో విక్రమ్సార్ డైరెక్షన్లో చేయడం ఆనందంగా ఉంది. అఖిల్ నైస్ కో స్టార్’’ అన్నారు కల్యాణీ ప్రియదర్శన్. తెలుగు సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, విక్రమ్ కె.కుమార్, అనూప్ రూబెన్స్, అక్కినేని అమల, దర్శకుడు ప్రియదర్శన్, నటుడు అలీ, పాటల రచయితలు చంద్రబోస్, అలేఖ్య పాల్గొన్నారు. -
హలో ట్రైలర్ వచ్చేసింది
-
అఖిల్ తదుపరి చిత్రం అతనితోనా..!
అఖిల్ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్, ఈ ఏడాది చివర్లో హలో అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తొలి సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవటంతో రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాగార్జున దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్న ఈ సినిమాకు మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకుడు. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో కన్ఫమ్ గా సక్సెస్ సాధిస్తారన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమా తరువాత అఖిల్ చేయబోయే సినిమాపై చర్చమొదలైంది. ప్రస్తుతం హలో ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న అఖిల్ తన తదుపరి చిత్రాన్ని మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేను సినిమాను తెరకెక్కిస్తున్న కొరటాల ఆ తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లలో ఒకరితో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ లు రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమాకు రెడీ అవుతుండటంతో ఇప్పట్లో వారి డేట్స్ దొరికే అవకాశం లేదు. ఈ గ్యాప్ లో అఖిల్ హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట కొరటాల శివ. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన లేకపోయినా.. వరుస సక్సెస్ లతో దూకుపోతున్న కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తే అఖిల్ కెరీర్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. -
హలో... గెస్ట్స్!
హలో అవినాష్ అని పలకరించడానికి నాగార్జున, అమల, సమంత రెడీ అయ్యారని సమాచారం. అవినాష్ ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖిల్ అక్కినేని పేరే అవినాష్. ‘హలో’లో తను చేస్తోన్న క్యారెక్టర్ పేరిది. సినిమాలో అవినాష్‌కి నాగ్, అమల, సామ్ హలో చెబుతారట. అంటే.. గెస్టులుగా కనిపిస్తారని సమాచారం. ఆల్రెడీ ‘మనం’ అక్కినేని ఫ్యాన్స్‌కు మంచి పండగ. ‘హలో’లో గెస్ట్ రోల్స్ నిజమైతే ఫ్యాన్స్‌కు మరోసారి ఐ–ఫీస్ట్ గ్యారంటీ అని చెప్పొచ్చు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి కథానాయికగా నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున నిర్మిస్తోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి, టీజర్‌కి విశేష స్పందన వచ్చింది. డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
'నో రొమాన్స్, ఓన్లీ యాక్షన్'
కింగ్ నాగార్జున, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. నాగ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన హీరోయిన్ ఉండదట. రొమాంటిక్ హీరోగా తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న కింగ్ పై ఈ సినిమాలో ఒక్క రొమాంటిక్ సీన్ కూడా ఉండదట. గతంలో గగనం సినిమాలో నాగ్ ఈ తరహా పాత్రలో కనిపించాడు. ఇప్పుడు వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా పూర్తి యాక్షన్ మోడ్ లో సాగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 1నుంచి బ్రేక్ తీసుకోనుంది. తిరిగి అఖిల్ 'హలో' రిలీజ్ అయిన తరువాత రెండో షెడ్యూల్ ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అప్పుడే హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసి ప్రకటిస్తారని తెలుస్తోంది. -
అక్కినేని వారసుడితో ఢీ అంటున్న అల్లు వారబ్బాయి
తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని వారసుడు అఖిల్, తన రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇన్నాళ్లు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమాపై టీజర్ రిలీజ్ తరువాత మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అఖిల్ చేసిన పోరాట సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. మరో వారసుడు అల్లు వారబ్బాయి శిరీష్ కూడా ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ ఆసక్తికరమైన సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమైరా దస్తర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఒక్క క్షణం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇటీవల శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న శిరీష్, ఒక్క క్షణంతో బిగ్ హిట్ మీద కన్నేశాడు. డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా క్రిస్టమస్ బరిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇద్దరు స్టార్ వారసులు ఒకేసారి బరిలో దిగిటంపై టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. -
హలో.. అవినాష్!
‘ఎ’ ఫర్ అఖిల్. ఇది రియల్ లైఫ్‌లో. ‘ఎ’ ఫర్ అవినాష్.. ఇది రీల్ లైఫ్‌లో. యస్.. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో మనం ఎంటర్ప్రైజెస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున నిర్మిస్తోన్న చిత్రం ‘హలో’. ఇందులో అఖిల్ పాత్ర పేరు అవినాష్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయాలనుకుంటు న్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. -
హలో టీజర్ వచ్చేసింది
-
హలో... వెనక్కి తిరిగి చూసేది లేదు!
ఎంతో దూరంలో లేదు... డిసెంబర్ 22వ తేదీ! ఈలోపు ముందుకు దూసుకెళ్లడమే తప్ప... వెనక్కి తిరిగి చూసేది లేదంటున్నారు అఖిల్ అక్కినేని. ‘మనం, 24’ సిన్మాల ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ‘హలో’. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ సంస్థలపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న విడుదలవుతోంది. అయితే... అఖిల్ ఇప్పట్నుంచి సందడి షురూ చేశారు. మంగళవారం ‘హలో!’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ రోజు సిన్మా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ‘‘ఇదొక యాక్షన్ లవ్‌స్టోరీ. టీజర్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు దర్శకుడు విక్రమ్. ‘‘మాకింత కంటే ఎక్కువ థ్రిల్ ఏమీ లేదు. ఈ నెల 16న (ఈ రోజే) టీజర్ మీ (ప్రేక్షకులు) ముందుకు వస్తోంది. ఇక్కణ్ణుంచి వెనక్కి తిరిగి చూసేది లేదు (నో లుక్కింగ్ బ్యాక్!)’’ అని అఖిల్ పేర్కొన్నారు. నవ్వాం! ఏడ్చాం! ఇప్పుడు... ఆదివారం నాగచైతన్య–సమంతల రిసెప్షన్ జరగడంతో అక్కినేని కుటుంబంలో సందడి నెలకొంది. ఎక్కడ చూసినా... సంతోషమే, నవ్వులే నవ్వులు! అయితే... అనూహ్యంగా సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ‘మనం’ సెట్ అగ్ని ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం నాగార్జున చేసిన ట్వీట్లో ఈ రెంటినీ ఉదహరించినట్టు అర్థమవుతోంది! ‘‘హలో మై ఫ్రెండ్స్... ఎమోషనల్ వీక్ ఇది!! మేము నవ్వాం (రిసెప్షన్)! ఏడ్చాం (‘మనం’ సెట్ అగ్ని ప్రమాదం)! ఇప్పుడు ‘హలో’ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం’’ అని ట్వీట్లో పేర్కొన్నారు నాగార్జున. -
హలో.. అక్కినేని సర్ప్రైజ్ ఇదే..!
త్వరలో ‘హలో’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న అక్కినేని వారసుడు అఖిల్, తన రెండో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టేశాడు. మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ ‘హలో’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణీ హీరోయిన్గా పరిచయం అవుతోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 16న రిలీజ్ చేయనున్నారు. టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఓ ఆసక్తికర పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు. And November 16th it is! The teaser is headed your way and we can’t be more thrilled. No looking back. #HelloTeaserOnNov16 #HelloOnDec22 pic.twitter.com/jf1dW3kC0S — Akhil Akkineni (@AkhilAkkineni8) 14 November 2017 -
నవ్వుకున్నాం.. ఏడ్చాం : నాగార్జున
వరుస రెండు రోజుల్లో కొన్ని ఆనందకరమైన క్షణాలు, మరికొన్ని బాధాకరమైన విషయాలు జరగటంపై హీరో నాగార్జున స్పందించారు. ఇటీవల ఒక్కటైన నాగచైతన్య, సమంత రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో అక్కినేని కుటుంబసభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే వేడుకలు ముగిసి 24 గంటలు గడవక ముందే ఓ విషాదకర సంఘటన జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం మనం షూటింగ్ జరిగిన సెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించిన ఈ సెట్ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. తన తండ్రి గుర్తుగా ఉంచిన సెట్ కాలిపోవటంతోపై నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఏమీ జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెండు సంఘటనపై స్పందించిన నాగ్, ‘ ఈ వారం ఎంతో భావోద్వేగంగా గడిచింది. నవ్వుకున్నాం.. ఏడ్చాం.. ప్రస్తుతం ఈ రోజు మద్యాహ్నం నుంచి హలో సినిమా ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. తొలి సినిమా అఖిల్ తో నిరాశపరిచిన అక్కినేని వారసుడు, రెండో ప్రయ్నతంగా ‘హలో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఈ రోజు మద్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించనున్నారు. Hello my friends, it’s been a emotional week!! We laughed and we cried and now we are ready to kickstart #Hello promotions this afternoon 2 pm😄 — Nagarjuna Akkineni (@iamnagarjuna) 14 November 2017 -
మిడిల్ క్లాస్ అబ్బాయి ముందే వస్తున్నాడు..!
వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎమ్సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ మూడోవారంలో క్రిస్టమస్ కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘హలో’ రిలీజ్ కూడా ఉండటంతో నాని రేసు నుంచి తప్పుకున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వారం ముందుగానే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ముందుగా అనుకున్నట్టుగా డిసెంబర్ 21న కాకుండా డిసెంబర్ 15నే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో నాని తన విజయపరంపర కొనసాగిస్తాడని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. అందుకే ఎలాంటి రిస్క్ లేకుండా వారం ముందుగానే థియేటర్లలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఇట్స్ డ్యాన్సింగ్ టైమ్..!
... అంటున్నారు అఖిల్. డ్యాన్స్ ఇరగదీయడానికి ట్రైనింగ్ తీసుకుని మరీ రిహార్సల్స్ కూడా కంప్లీట్ చేశారట అఖిల్. ఇక చెప్పేదేముంది? రాకింగ్ స్టెప్స్‌తో ఈ సాంగ్ ప్రేక్షకులకు ఐఫీస్ట్‌గా ఉంటుందని ఊహించవచ్చు. కె. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘హలో’. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి కథానాయిక. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. గత శుక్రవారం ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. కొన్ని కీలక సన్నివేశాలను కంప్లీట్ చేసిన తర్వాత, సాంగ్ షూట్ మొదలుపెట్టారు. ‘‘ఇట్స్ టైమ్ టు షేక్ లెగ్’ అని అఖిల్ పేర్కొన్నారు. ఈ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయాలనుకుంటున్నారు. -
హలో... అప్పుడు రావడం పక్కా!
ఏడు నెలల క్రితం ఎంతో ఎగై్జటింగ్‌గా అఖిల్ ‘హలో... కొత్త సినిమా స్టార్ట్ చేశా గురూ’ అన్నారు. ఏడు నెలల తర్వాత ఇప్పుడూ అంతే ఎగై్జటింగ్‌గా ‘హలో.. లాస్ట్ షెడ్యూల్లోకి ఎంటరయ్యా’ అంటున్నారు. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎంత ఎగై్జటెడ్‌గా ఉన్నారో... ఎండింగ్‌కి వచ్చేసరికి అంతే ఎగై్జటెడ్‌గా ఉన్నారు అఖిల్. దాన్ని బట్టి షూటింగ్‌ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఊహించవచ్చు. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘హలో’ చివరి షెడ్యూల్ జరుగుతోంది. ముందుగా ప్రకటించినట్లుగానే డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అఖిల్ తలకిందులుగా ఉన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత గాల్లో ఎగురుతున్నట్లు ఉన్న సెకండ్ స్టిల్ కూడా సూపర్ అనిపించుకుంది. హిట్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. అక్కినేని కుటుంబానికి కలిసొచ్చిన నెల డిసెంబర్. నాగార్జున నటించిన పలు చిత్రాలు ఈ నెలలోనే విడుదలై, మంచి హిట్టయ్యాయి. ఆ సెంటిమెంట్‌ని బట్టి చూస్తే.. ‘హలో’ కూడా హిట్టే అని ఫిక్సయ్యారు అక్కినేని అభిమానులు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ‘‘ముందు చెప్పినట్లే డిసెంబర్ 22న సినిమా విడుదలవుతుంది. త్వరలో మరిన్ని ఆసక్తికర విషయాలు చెబుతా’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు అఖిల్. -
అఖిల్ సినిమాలో సీనియర్ హీరో..!
తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్, తన రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కింగ్ నాగార్జున దగ్గరుండి సినిమాకు సంబంధించిన పనులన్ని చూసుకుంటున్నారు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ స్టార్ వెంకటేష్ అతిథి పాత్రలో అలరించనున్నారట. ఇటీవల నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ప్రేమమ్ సినిమాలో వెంకీ నటించాడు. ఆ సినిమా ఘనవిజయం సాధించటంతో అదే సెంటిమెంట్ ను అఖిల్ హలో కోసం ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి వెంకటేష్ అతిథి పాత్రపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేయకపోయినా.. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
అఖిల్ తరువాత నానితో..!
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని, రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో ఎమ్సీఏ సినిమాతో పాటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నాడు. వీటిలో ఎమ్సీఏ ముందుగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న నాని, మరో సినిమాకు కమిట్ అయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. 24, మనం చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నాడట. ప్రస్తుతం అఖిల్ హీరోగా హలో సినిమాను రూపొందిస్తున్న విక్రమ్, డిసెంబర్ లో ఆ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. అఖిల్ సినిమా తరువాత నాని హీరోగా సినిమాను పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నాడు విక్రమ్ కుమార్. -
'హలో' అంటున్న మరో భామ..!
అఖిల్ సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నటవారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాతో కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించనుందట. ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతున్న మగలిర్ మట్టుమ్ సినిమాలో కీలక పాత్రలో నటించిన నివేదితా సతీష్, అఖిల్ హాలోలో మరో హీరోయిన్ గా నటిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నివేదిత షూటింగ్ లో కూడా పాల్గొంటుందన్న టాక్ వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడు. -
హలో... న్యూస్టిల్ ఇదిగో!
అఖిల్ హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ మనం ఎంటర్ప్రైజెస్ సమర్పణలో అక్కినేని నాగార్జున నిర్మి స్తున్న సినిమాకు ‘హలో’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు నిన్న సాయంత్రం ప్రకటించారు. టైటిల్‌తో పాటు మీరు చూస్తున్న కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ ‘హలో’ అయ్యుంటుందని సోమవారమే ‘హలో... టైటిల్ ఇదే!?’ పేరుతో ‘సాక్షి’ వార్తను ప్రచురించింది. -
హలో... టైటిల్ ఇదే!?
హలో... హలో... హలో... అక్కినేని అభిమానుల్లో ఇప్పుడీ సౌండ్ ఎకోలో వినిపిస్తోంది. ఎందుకంటే... అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న సినిమా టైటిల్ ‘హలో’ అట! నేడు ఈ సిన్మా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే... రెండు రోజుల క్రితం ‘నిర్ణయం’లోని ‘హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం...’ పాటను ట్వీట్ చేసిన నాగార్జున... ‘‘ఇందులో అఖిల్ సినిమా టైటిల్ ఉంది. కనుక్కోండి’’ అన్నారు. ఆదివారం నాగచైతన్య ‘ఏ మాయ చేసావె’లో ‘ఈ హృదయం’ పాట ర్యాప్‌ను పోస్ట్ చేసి సెకండ్ క్లూ ఇచ్చారు. రెండిటిలోనూ కామన్‌గా ఉన్నది ‘హలో’ అనే పదం ఒక్కటే. సో, అదే అఖిల్ సినిమా టైటిల్ అయ్యుంటుందని అక్కినేని అభిమానులు, ప్రేక్షకులు ఫిక్సయ్యారు. వాళ్ల అంచనా నిజమో? కాదో? ఈ రోజు తెలుస్తుంది. -
శ్రేయోభిలాషి.. ఉద్యమం పేరెత్తితే ఊరుకోడు!
జేఏసీ నేత ఇళ్లకు ఓ కాంగ్రెస్ నేత ఫోన్లు ఉద్యమాన్ని వీడకపోతే నష్టమంటూ బెదిరింపులు కర్నూలు: ‘హలో.. నేనమ్మా. మీ శ్రేయోభిలాషిని. మీకో విషయం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అందుకే మీ వారికి కాకుండా నేరుగా మీకు ఫోన్ చేశాను. ఏమీ లేదమ్మా. మీ వారు ఇటీవల రెండు నెలల పాటు జీతం లేకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన సమ్మెలో పాల్గొన్నందుకు ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి. రెండు నెలల జీతం పోయింది. ఎండలో నిల్చొని గొంతుచించుకుని అరిచారు. ఆ రెండు నెలలు మీరూ మనశ్శాంతిగా లేరు. ఎందుకు మీకీ ఇబ్బందులు చెప్పండి. మీ శ్రేయోభిలాషిగా ఒకటి చెప్పదలచుకున్నాను. మీ వారిని ఇకపై సమ్మెలో పాల్గొనకుండా చూసుకోండి. ఎందుకిదంతా చెబుతున్నానంటే.. రేపు కేసులు గీసులు పెడితే మీ వారు.. ఆయనతోపాటు మీరు కోర్టుల చుట్టూ తిరగాలి. రెండు నెలల జీతం పోయినా ఫర్వాలేదు. ఇన్నాళ్లు సంపాదించుకున్న ఆస్తులో.. కూడబెట్టుకున్న డబ్బో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దయచేసి మీ వారిని ఇకపై ఉద్యమంలోకి వెళ్లకుండా జాగ్రత్తపడింది. మీకేదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఉంటానమ్మా.’’ ఇదంతో ఎవరో బంధువులో, స్నేహితులో చెప్పారనుకుంటే పొరబాటు. అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత ఒకరు మంగళవారం ఉద్యమ వీరుల నివాసాలకు ఫోన్ చేసి మాట్లాడిన తీరు. ఉద్యమాల్లో పాల్గొనే ముఖ్య జేఏసీ నాయకులకు ఇలాంటి ఫోన్లు చేసి బెదిరించటంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పెట్టేలా వ్యవహరించడం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత తాను కరుడుగట్టిన సమైక్యవాదినంటూ ఇటీవల ఆవేశంతో ఊగిపోయారు. పదవికి రాజీనామా చేయమని పలుమార్లు సమైక్యవాదులు ఆయనను డిమాండ్ చేశారు. అందుకు ఆయన ‘మీరు చెప్పినా.. చెప్పకపోయినా నేను సమైక్యవాదినే’ అంటూ ప్రకటించారు. తాజాగా ఆయనే జేఏసీ నాయకుల నివాసాలకు ఫోన్ చేసి హెచ్చరిక తరహాలో మాట్లాడటాన్ని సమైక్యవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా ‘విభజనకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న ఉద్యమకారులపైనా అక్రమ కేసులు బనాయించి బొక్కలో తోస్తే వారంతట వారే సమ్మె విరమించుకుంటారు’ అంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు కొందరు పోలీసులే వాపోతున్నారు. ఇటీవల కాలంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు ఆయన ఆదేశాలే కారణంగా తెలుస్తోంది. ‘మాకున్న ఒత్తిళ్లు మాకున్నాయి. మీరూ మాకు సహకరించండి’ అంటూ పోలీసులు ఉద్యమకారులను కోరడం ఆ నేత ఉద్యమాన్ని ఏ స్థాయిలో అణచివేస్తున్నాడో తెలియజేస్తోంది.