ఆర్కుట్ సృష్టికర్త ఆర్కుట్ బ్యూకుక్టన్
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ డేటా బ్రీచ్ నేపథ్యంలో కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫాం రంగంలోకి వస్తోంది. ఆర్కుట్ ఫౌండర్ ఆర్కుట్ బ్యూకుక్టన్ ఈ సంచలన ప్రకటన చేశారు. 'హలో' పేరుతో భారతీయ సోషల్ మీడియా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించారు. బ్రెజిల్లో దీన్ని 2016,జూలైలో ప్రారంభించాము ..భారత మార్కెట్లో సుమారు 35,000 మంది వినియోగదారులు తమ బీటా టెస్టింగ్లో భాగంగా ఉన్నారనీ ఆయన ప్రకటించారు. మరోసారి భారతదేశానికి హలో చెప్పడానికి ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. హలో యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లేలలో డౌన్ లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. అంతేకాదు ఆదాయం పొందడానికి యూజర్ డేటాని విక్రయించాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. థర్డ్ పార్టీ పార్టీలకు తమ యూజర్ల డాటా షేర్ చేయమని హామీ ఇచ్చారు.
2014 లో ఆర్కుట్ మూసివేసిన ఇపుడు మళ్లీ రంగంలోకి వస్తోంది. 2004లో సామాజిక మాధ్యమ విప్లవానికి తెరలేపిన ‘ఆర్కుట్ ’ సృష్టికర్త ఆర్కుట్ బ్యూకుక్టన్. టర్కీకి చెందిన అతను గూగుల్‌లో పనిచేస్తున్న సమయంలోనే ‘ఆర్కుట్’ను రూపొందించారు. అప్పట్లో ఆర్కుట్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇదే తరహాలో అదే ఏడాదిలో ప్రారంభమైన ఫేస్‌బుక్ ఎంతలా దూసుకెళిపోతోందో చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ మాజీ ఉద్యోగులైన కొంత మంది స్నేహితులతో కలిసి ఇప్పటికే ‘హలో’ని కెనడా, న్యూజీలాండ్, బ్రెజిల్.... ఇలా 12 దేశాల్లో ప్రారంభించారు.
కాగా సోషల్ నెట్వవర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌కు దేశంలో దాదాపు 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయితే కేంబ్రిడ్జ్ ఎనలిటికాలో పాల్గొన్న గ్లోబల్ డేటా ఉల్లంఘన వల్ల దేశంలోని దాదాపు 5.62 లక్షల మంది డేటా లీక్ అయిందని స్వయంగా జుకర్ బర్గ్ ఒప్పుకున్నారు. మరోవైపు అమెరికా కాంగ్రెస్‌ముందు విచారణకు హాజరైన జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ నిర్వహణలో చాలా తప్పులు జరిగాయనీ, క్షమించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment