Orkut
-
ఫేస్‌బుక్‌కు షాక్: కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ డేటా బ్రీచ్ నేపథ్యంలో కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫాం రంగంలోకి వస్తోంది. ఆర్కుట్ ఫౌండర్ ఆర్కుట్ బ్యూకుక్టన్ ఈ సంచలన ప్రకటన చేశారు. 'హలో' పేరుతో భారతీయ సోషల్ మీడియా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించారు. బ్రెజిల్లో దీన్ని 2016,జూలైలో ప్రారంభించాము ..భారత మార్కెట్లో సుమారు 35,000 మంది వినియోగదారులు తమ బీటా టెస్టింగ్‌లో భాగంగా ఉన్నారనీ ఆయన ప్రకటించారు. మరోసారి భారతదేశానికి హలో చెప్పడానికి ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. హలో యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లేలలో డౌన్ లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. అంతేకాదు ఆదాయం పొందడానికి యూజర్ డేటాని విక్రయించాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. థర్డ్ పార్టీ పార్టీలకు తమ యూజర్ల డాటా షేర్ చేయమని హామీ ఇచ్చారు. 2014 లో ఆర్కుట్ మూసివేసిన ఇపుడు మళ్లీ రంగంలోకి వస్తోంది. 2004లో సామాజిక మాధ్యమ విప్లవానికి తెరలేపిన ‘ఆర్కుట్ ’ సృష్టికర్త ఆర్కుట్ బ్యూకుక్టన్. టర్కీకి చెందిన అతను గూగుల్‌లో పనిచేస్తున్న సమయంలోనే ‘ఆర్కుట్’ను రూపొందించారు. అప్పట్లో ఆర్కుట్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇదే తరహాలో అదే ఏడాదిలో ప్రారంభమైన ఫేస్బుక్ ఎంతలా దూసుకెళిపోతోందో చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ మాజీ ఉద్యోగులైన కొంత మంది స్నేహితులతో కలిసి ఇప్పటికే ‘హలో’ని కెనడా, న్యూజీలాండ్, బ్రెజిల్.... ఇలా 12 దేశాల్లో ప్రారంభించారు. కాగా సోషల్ నెట్వవర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌కు దేశంలో దాదాపు 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయితే కేంబ్రిడ్జ్ ఎనలిటికాలో పాల్గొన్న గ్లోబల్ డేటా ఉల్లంఘన వల్ల దేశంలోని దాదాపు 5.62 లక్షల మంది డేటా లీక్ అయిందని స్వయంగా జుకర్ బర్గ్ ఒప్పుకున్నారు. మరోవైపు అమెరికా కాంగ్రెస్ముందు విచారణకు హాజరైన జుకర్‌బర్గ్ ఫేస్బుక్ నిర్వహణలో చాలా తప్పులు జరిగాయనీ, క్షమించాలని కోరారు. -
గుడ్‌బై Google Orkut
ఆర్కుట్‌ను గూగుల్ త్వరలోనే శాశ్వతంగా మూసేయనుందట! అయినా ఆర్కుట్‌ను గూగుల్ మూసేయడం ఏమిటి? నెటిజన్లు ఏనాడో దాన్ని క్లోజ్ చేశారు కదా! లాగిన్ కావడం అత్యంత అరుదైపోయింది కదా! ఆర్కుట్ మొదలైన ఏడాదిలోనే ప్రారంభమైన ఫేస్బుక్ ప్రభావంతో ఆర్కుట్ అడ్రస్ గల్లంతయింది కదా! అయితే ఆర్కుట్‌ను మరీ అంతా చీప్‌గా తీసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్కుట్ అపురూపమైనది. ప్రత్యేకించి భారతీయులకు సోషల్నెట్వర్కింగ్ మజాను పరిచయం చేసింది ఆ వెబ్‌సైటే. ఆర్కుట్ భారతీయ నెటిజన్లకు తొలి రచ్చబండ. ఫేస్‌బుక్‌కు ప్రాభవానికి ముందే ఒక వెలుగు వెలిగిన వెబ్సైట్! కాబట్టి అది కాలం కౌగిలిలో ఒదిగిపోతుండటం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అంశమే. టర్కీదేశానికి చెందిన ఆ యువకుడు చాలా కాలం కిందట దూరమైన తన స్నేహితురాలి ఆచూకీ తెలుసుకోవాలని అనుకొన్నాడు. అందుకు అనేక మార్గాల గురించి ఆలోచించగా అప్పుడప్పుడే విస్తృతం అవుతున్న ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ఆమెను కలుసుకొనే అవకాశం ఉందని గ్రహించాడు. అందుకోసం ఒక వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించాడు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న తన స్నేహితులందరినీ అందులోకి చేరమని కోరాడు. వారి ద్వారా మరి కొందరిని అందులోకి చేర్చే ప్రయత్నం చేశాడు. ఆ విధంగా ఆ పోర్టల్ నెట్వర్క్ విస్తృతమైంది. మూడు సంవత్సరాలు గడిచే సరికల్లా ఆ పోర్టల్ టర్కీలో బాగా పాపులర్అయ్యింది. సోషల్ నెట్వర్కింగ్ అనేమాట పాపులర్ కావడానికి కారణమైంది. ఆ పాపులర్ నెట్‌వర్క్‌ను గూగుల్ కొనుగోలు చేయడంతోనే దాని పేరు మార్మోగింది. అప్పటికే పేరుపొందిన ఆ సెర్చ్ ఇంజన్ ఆ సైట్‌ను కొనుగోలు చేసి మరింత పాపులర్ చేసింది. సోషల్ నెట్వర్కింగ్ అనే మాటకు నిర్వచనంగా మార్చింది. ఆర్కుట్ బమొక్కొటెన్ అనే ఆ యువకుడు స్థాపించి, గూగుల్ చేత టేకోవర్ చేసిన ఆ వెబ్సైట్ ‘ఆర్కుట్ డాట్ కామ్’ భారత్, బ్రెజిల్‌లలో దుమ్మురేపింది! అదేం విచిత్రమో కానీ గూగుల్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఆర్కుట్‌ను పాపులర్ చేసినా అది బాగా నచ్చింది మాత్రం బ్రెజిల్, భారతదేశాలకు మాత్రమే. ఆర్కుట్ యూజర్లలో దాదాపు 50 శాతం మంది బ్రెజిల్‌కు చెందిన వాళ్లే. వారి తర్వాత 20 శాతం యూజర్లు మన దేశానికి చెందినవాళ్లు. మనదేశంలో కూడా కేరళలో ఆర్కుట్ వినియోగం ఎక్కువగా ఉండేది. ఆర్కుట్ సందడి అంతా ఇంతా కాదు! సినిమా హీరోల ఫ్యాన్ కమ్యూనిటీల దగ్గర, సినిమా పేర్ల మీద ఏర్పాటు చేసి ఆ సినిమా ఫ్యాన్స్‌ను ఒక వేదికపైకి తెచ్చే కమ్యూనిటీలతో మొదలు... కులాల పేర్లతో ఏర్పాటు అయిన కమ్యూనిటీల వరకూ అనేకం ఆర్కుట్లో సందడి చేశాయి. చాట్‌రూమ్ ఆప్షన్లుకూడా ఆకట్టుకొన్నాయి. ఫేస్బుక్ దెబ్బతో ఫేడవుటయ్యింది! ఎంత తొందరగా విస్తృతమైందో అంతే త్వరగా పతనావస్థకు చేరుకొంది ఆర్కుట్. అప్పటికే అమెరికా వంటి దేశాలను ఉర్రూతలెక్కించిన ఫేస్బుక్ మనదేశంలోనూ తన పంథాను కొనసాగించింది. దీంతో ఆర్కుట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. విస్తృతం అయిన మూడు సంవత్సరాల్లోనే ఫేస్బుక్ జనాలను ఆర్కుట్‌కు దూరం చేసింది. దాదాపు రెండేళ్ల నుంచి ఆర్కుట్లో అకౌంట్ కలిగిన వారు కూడా దాంట్లోకి లాగిన్ కావడం పూర్తిగా మానేశారు. అంత వరకూ స్క్రాప్లతోనూ, చాట్రూమ్లతోనూ ఆర్కుట్లో యాక్టివ్‌గా ఉన్నవారు కూడా ఫేస్బుక్ మాయలో పడిపోయారు. గూగుల్ అప్పుడే గుర్తించింది! ‘గూగుల్ ప్లస్’ను ప్రారంభించి జనాలను ఫేస్బుక్ వైపు నుంచి తనవైపుకు తిప్పుకోవాలని ప్రయత్నించింది గూగుల్. ఆ కొత్త సైట్ ప్రారంభంతోనే ఆర్కుట్‌కు ప్రాధాన్యం తగ్గించేసింది. ఇప్పుడు కూడా తమ ఇతరసైట్లపై దృష్టిపెట్టడానికి గూగుల్ ప్లస్, యూట్యూబ్‌లను మరింత విస్తృతం చేసుకోవడానికి ఆర్కుట్‌ను మూసివేస్తున్నట్టుగా గూగుల్ ప్రకటించడం విశేషం! ఇప్పుడెలా?! ఆర్కుట్లో ప్రతి యూజరూ కొన్ని వందల కొద్దీ ఫోటోలను షేర్ చేసుకొని ఉంటాడు, లాగిన్కాకపోయినా ఆ ఫోటోలు, ఆ జ్ఞాపకాలు విలువైనవే, దాన్ని దృష్టిలో ఉంచుకొనే వాటన్నింటినీ బ్యాకప్‌లో ఉంచుతామని, ఆర్కీవ్స్‌లో అవి లభ్యమవుతాయని గూగుల్ వివరించింది. మరి ఆ ఆర్కీవ్స్ ఎలా తీసుకోవాలి? అనేదానిపై ఇంకా పూర్తి వివరణ లభ్యం కావడం లేదు. అప్పట్లోనే షేర్ చేసుకొమ్మంది! గూగుల్ ప్లస్‌ను ప్రారంభించిన కొత్తలో తన యూజర్ల చేత తప్పనిసరిగా ఆ సోషల్సైట్లో అకౌంట్ మొదలు పెట్టించింది. అలా ప్రారంభించిన అకౌంట్లోకి ఆర్కుట్‌లోని ఫోటోలను ఒకే క్లిక్‌తో షేర్ చేసుకొనే అవకాశాన్ని ఇచ్చింది. ఒకవేళ అప్పుడే అలా క్లిక్ చేసి ఉంటే.. బ్యాకప్ గురించి బెంగపెట్టుకోనక్కర్లేదు. మరి ఇప్పుడు కూడా గూగుల్ తన గూగుల్ప్లస్ను పాపులర్ చేసుకొనే ఉద్దేశంతో ఆర్కుట్బ్యాకప్ను అందులోకి షేర్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వొచ్చని అంచనా! పీఎస్: ఆర్కుట్ త్వరలో శాశ్వతంగా మూతబడుతోందనే విషయాన్ని నెటిజన్లు తమ ఫేస్బుక్ వాల్‌పై షేర్ చేస్తుండటం విశేషం! ఏదేమైనా టెక్నాలజీ విస్తృతం కావడంతో దూరమైన టేప్రికార్డర్లు, వీసీపీలు ఎంత అపురూపమైనవనిపిస్తాయో.. సోషల్నెట్వర్కింగ్ విషయంలో ఆర్కుట్కూడా వాటిస్థాయిలోనే అపురూపమైనదనడంలో అతిశయోక్తి లేదు! - జీవన్‌రెడ్డి. బి -
ఆర్కుట్కి వీడ్కోలు
-
ఫేస్బుక్లో ఇవీ ఉండాల్సింది..!
గూగుల్ వాళ్ల సోషల్నెట్వర్కింగ్ సైట్ ఆర్కుట్లో ఒక ఫీచర్ ఉండేది. మన ప్రొఫైల్‌ను చూసిన రీసెంట్ విజిటర్లు ఎవరో తెలుసుకోవచ్చు దాని ద్వారా. పేరు ద్వారా అకౌంట్‌ను సెర్చ్ చేసి, మన పేజ్‌లోకి వచ్చి, మన ఇష్టాల ఇష్టాలను పరిశీలించి వెళ్లిన వారెవరో చూడటానికి అవకాశం ఉండేది ఆర్కుట్లో. మనం లాగిన్ కాగానే ‘రీసెంట్ విజిటర్స్’ జాబితా ప్రత్యక్షం అయ్యేది. అయితే ఫేస్బుక్లో ఆ సదుపాయం లేదు. మన ప్రొఫైల్‌ను చూసి వెళుతున్నదెవరో మనకు తెలీదు! సోషల్స్నేహాల్లో మన పేజ్‌ను చూసి వెళుతున్నది ఎవరో తెలుసుకోవడం నిజంగా ఒక చక్కటి ఫీలింగ్. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా తమ పేజ్‌ను తరచూ ఎవరెవరు చూస్తున్నారో చూడటం నిజంగా హ్యాపీనే కదా! అలాంటి హ్యాపీనెస్ ప్రస్తుతానికి ఫేస్బుక్లో లేదు. నెటిజన్లకు పట్టకుండా పోయిన ఆర్కుట్లో ఉన్నా ఉపయోగం లేదు. ఆఫ్‌లైన్‌లో ఉండి ఆడుకోలేం... జీమెయిల్లో ఒక సదుపాయం ఉంది. మనం అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఆఫ్‌లైన్ మోడ్‌లోకి వెళ్లొచ్చు. అలా ఆఫ్‌లైన్ మోడ్‌లోనే ఉంటూ ఎవరెవరు ఆన్లైన్లో ఉన్నారో చూడవచ్చు. కానీ ఎఫ్బీలో మాత్రం మనం ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉండి అందరితోనూ ఆడుకోవడానికి అవకాశం లేదు!ఒక్కసారి ఆఫ్‌లైన్‌లోకి వెళితే ఆన్లైన్లో ఉన్నదెవరో అర్థం చేసుకోవడం కుదరదు! ఇంకా జీమెయిల్లో బిజీ మోడ్‌లో ఉంచడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫేస్బుక్లో ఆ సదుపాయం లేదు. ఫేస్బుక్ సర్ఫింగ్‌లో మరింత మజా రావాలంటే ఇలాంటి ఫీచర్ల అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు నెటిజన్లు. ఈ విషయంలో ఎఫ్బీ గ్రేట్... ఫేస్బుక్లో ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు అవతలి వారు మనం పంపిన మెసేజ్‌ను చూశారా లేదా అనే విషయం అర్థమైపోతోంది. అవతలి వారు చాట్‌బాక్స్‌లో క్లిక్ చేయగానే ‘సీన్’ అంటూ ఒక టిక్ మార్క్ డిస్ప్లే అవుతుంది. అలా చూసిన వ్యక్తి మెసేజ్‌కు స్పందిస్తూ టైప్ చేయడం మొదలుపెడితే ఆ విషయం కూడా ఇవతల వారికి సులభంగా అర్థమైపోతోంది. ఫేస్బుక్లో మాత్రమే ఉన్న సదుపాయం ఇది. అయితే జీమెయిల్లో చాట్ చేసేటప్పుడు ఈ అవకాశం లేదు. జీమెయిల్ లేదా అర్కుట్చాట్ బాక్స్‌లో అవతలి వారు స్పందిస్తే తప్ప మనం పంపిన మెసేజ్ వారు చూశారో లేదో తెలుసుకొనే అవకాశమే లేదు! ఇలాంటి సదుపాయాన్ని అందించడంతో ఫేస్‌బుక్‌కు మంచి మార్కులు పడతాయి. గూగుల్ ఇలాంటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. -
సోషల్ సునామీలో...ఆర్కుట్ గల్లంతు..!
ఆర్కుట్.. ఈ పేరు వింటే ఒక పాతస్నేహితుడిని గుర్తు చేసుకున్న ఫీలింగ్... మనదేశంలో వ్యాపించిన తొలి సోషల్నెట్వర్కింగ్ సుగంధమిది. హద్దులు తెలిసిన స్నేహానికి, అంతులేని ఆనందానికి వేదిక అది. అయితే ఇప్పుడు ఆర్కుట్‌కు అంజలి ఘటించాల్సిన సమయం వచ్చింది. ఒకనాడు నెటిజన్లు తీరిక లేకుండా గడిపిన సైట్‌కు ఇప్పుడు ట్రిబ్యూట్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఈ విధంగానైనా... మనకూ ఒక ఆర్కుట్ అకౌంట్ ఉంది అని గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ నేపథ్యంలో సోషల్నెట్వర్కింగ్ సామ్రాజ్యంలో ఆర్కుట్ పతనావస్థ గురించి... ఇతర సైట్ల పోరాటాల గురించి... సోషల్నెట్వర్కింగ్ విషయంలో ఎక్కువ మంది భారతీయులు ఓనమాలు దిద్దుకుంది ఆర్కుట్‌లోనే. ఇప్పుడు ఫేస్బుక్లో పండితులుగా మారిన చాలా మంది సోషల్నెట్వర్కింగ్స్టడీస్ను ప్రారంభించింది ఆర్కుట్‌లోనే. మరి ఇప్పుడు ఆర్కుట్ ఎవరికీ పట్టనిది అయ్యింది. అరుదుగా కూడా అందులోకి లాగిన్ అయ్యేవారు కనపడటం లేదు. సోషల్నెట్వర్కింగ్ సామ్రాజ్యానికి ఫేస్బుక్ సోలో రాజుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్కుట్ ఔట్‌డేటెడ్ అనిపించుకుంటోంది. మరి ఆర్కుట్ ఎందుకు ఔట్‌డేటెడ్ అయ్యింది. ఎందుకు పోటీలో లేకుండా పోయింది? అలనాటి వైభవం... గూగుల్ మానస పుత్రిక ఆర్కుట్..2004లో ప్రారంభమైంది. 2006 నుంచి ఇండియాలో పాగా వేసింది. అప్పటికే కొన్ని సోషల్నెట్వర్కింగ్సైట్లు ఉన్నప్పటికీ, పాశ్చాత్య దేశాలయూత్కు ఫేస్బుక్ ఫీవర్ చే సినప్పటికీ.. మన దేశంలో మాత్రం ఆర్కుట్ దూసుకు వెళ్లింది. జీమెయిల్ అకౌంట్ ఉన్న వారికి ఒకే క్లిక్‌తో ఆర్కుట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇంకే ముంది.. ఫ్రెండ్షిప్లు, స్క్రాప్స్, వీడియోలు, విషెష్లు, కమ్యూనిటీలు, చాటింగ్‌లు... ఇవన్నీ ఆర్కుట్ అందించిన అద్భుతమైన సదుపాయాలు! క్లాస్రూమ్ స్నేహాలను మించి ఆకట్టుకున్నాయి ఆర్కుట్ చాట్‌రూమ్ స్నేహాలు. సరదా చాటింగ్‌కు ఆర్కుట్ ఒక అద్భుతమైన మార్గంగా కనిపించింది. ఇక ఆర్కుట్లో అదుర్స్ అనిపించిన ఫీచర్లలో ‘కమ్యూనిటీ’లు ముఖ్యమైనవి. అభిరుచులకు అనుగుణంగా కొన్ని వేలమంది ఈ కమ్యూనిటీస్‌లో సభ్యులుగా చేరేవారు. అభిప్రాయాలను పంచుకునే వారు. కొన్ని లక్షలమంది సభ్యులుగా కలిగిన కమ్యూనిటీలు కూడా ఉన్నాయి. నేడు నో అప్డేట్స్..! ఒకనాడు వేలాదిమందితో అలరారిన ఆర్కుట్ చాట్ రూమ్స్ ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కమ్యూనిటీల్లో కదలిక లేదు. కొత్తగా చేరేవారు లేరు. కొత్త పోస్టులు లేవు, కొత్త ఫ్రెండ్షిప్రిక్వెస్ట్లు లేవు. వీడియో షేరింగ్ లేదు, విషెష్ చెప్పే వారూ లేరు. గూగుల్ తన హోమ్‌పేజ్ నుంచి ఆర్కుట్ లింక్‌ను తప్పించేసేంత వరకూ వచ్చింది వ్యవహారం! ఒకప్పుడు గూగుల్ హోమ్‌పేజ్ నుంచి ఒకే క్లిక్‌తో ఆర్కుట్‌లోకి సైన్ ఇన్ అయ్యే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు గూగుల్ డ్రైవ్, ఇమేజెస్, యూట్యూబ్, గూగుల్‌ప్లస్, మ్యాప్స్, ప్లే.. వంటి తన సేవలను హోమ్ పేజ్‌లో డిస్ప్లే చేసిన గూగుల్ ఆర్కుట్‌ను వెనక్కు నెట్టేసింది! క్రేజ్ తగ్గిపోతున్న తన సోషల్నెట్వర్కింగ్ సైట్‌ను మరింతగా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేయాల్సిన గూగుల్ ఆర్కుట్ ప్రాణాన్ని స్వహస్తాలతోనే ఎందుకు తీస్తోందోనని ఆర్కుట్‌ను అమితంగా అభిమానించే ఫ్యాన్స్ లోని సందేహం! ఫేస్‌బుక్‌తోనే పెద్ద ప్రమాదం... 2010 వరకూ ఇండియాలో ఆర్కుట్‌కు తిరుగేలేదు. అయితే ఫేస్బుక్ అందుబాటులోకి రావడంతోటే పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆర్కుట్ కన్నా ఫేస్బుక్లో ఫ్రెండ్స్ యాడ్ అవ్వడం చాలా సులభతరంగా కనిపించింది! ఫేస్బుక్ ఫీచర్స్‌లో ఆర్కుట్ కన్నా డెవలప్మెంట్ కనిపించింది. ఇది కాక ఆర్కుట్లో 50 మంది కొత్త స్నేహితులను సంపాదించుకోవడానికి కనీసం ఒకటిన్నర సంవత్సరం టైమ్ పట్టేది. అయితే ఫేస్బుక్లో ఆ పని మీద ఉండాలి కానీ.. స్నేహితులను యాడ్ చేసుకోవడం పెద్ద విషయం కానే కాదు! కాబట్టి ఆర్కుట్ కన్నా ఫేస్బుక్ అద్భుతమనిపిస్తోంది! అందుకే నెట్ ఫ్లోటింగ్ ఆర్కుట్ నుంచి ఫేస్బుక్ వైపుకు మళ్లింది! ఇక అంతమైనట్టేనా? దాదాపుగా... అంతమైనట్టే! ఆర్కుట్‌ను మెయింటెయిన్ చేయడానికి కొత్త సెర్వర్లను ఏర్పాటు చేయడం ఎప్పుడో ఆపేసింది గూగుల్. ఆర్కుట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఆపేసింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఏ సైట్లో లేని ఒక సదుపాయం ఆర్కుట్‌లోనే ఉండేది. ‘ఇటీవలి కాలంలో మీ పేజ్‌ను విజిట్ చేసిన వారు..’ అని రీసెంట్ విజిటర్స్ లిస్టును ఇచ్చేది ఆర్కుట్. అయితే కొంతకాలంగా ఈ ఫీచర్‌ను కూడా ఆపేసింది. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఆర్కుట్‌లోకి లాగిన్ అయితే.. రీసెంట్ విజిటర్స్‌లో ఏడాది కిందటి లిస్టు కనిపిస్తుంది తప్ప...ఆ లిస్టులో రీఫ్రెష్కు అవకాశమే లేకుండా పోయింది. దీన్నిబట్టి ఆర్కుట్ సర్వర్లు దాదాపు స్ట్రక్ అయిపోయాయని అనుకోవచ్చు. - జీవన్ రెడ్డి.బి గూగుల్ నిర్లక్ష్యమే ఎక్కువ! వస్తూ వస్తూనే ఎఫ్బీ ఆర్కుట్‌ను ఛిద్రం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్కుట్లో కొత్త సదుపాయాలను తీసుకురాకుండా గూగుల్ సంస్థ ‘గూగుల్‌ప్లస్’ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో ‘సర్కిల్స్’ పేరుతో ఫ్రెండ్స్‌ను యాడ్ చేస్తూ సందడి చేయడానికి యత్నించింది. అయితే.. గూగుల్ ప్లస్ ఫేస్‌బుక్‌కు ఏ విధంగానూ పోటీ కాకుండా పోయింది. జీమెయిల్, బ్లాగర్ల ప్రభావంతో గూగుల్ప్లస్కు అంతో ఇంతో గుర్తింపు వచ్చింది కానీ.. లేకపోతే గూగుల్ ప్లస్ ఒక అత్యంత సాధారణ సోషల్నెట్వర్కింగ్ సైట్‌గా మిగిలిపోయేది. బ్లాగర్, జీమెయిల్లోని కంటెంట్‌ను గూగుల్ప్లస్లోకి షేర్ చేసుకోండని జనాలను గూగుల్ మొహమాటపెడుతోంది. అటు ఆర్కుట్ పోయి, గూగుల్‌ప్లస్ క్లిక్ కాకపోవడంతో గూగుల్ తలపట్టుకుంది. టాప్‌టెన్ సోషల్సైట్లు ఇవే.. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విటర్, లింక్డిన్, పింట్రెస్ట్, మైస్పేస్, గూగుల్ ప్లస్, డివైన్ఆర్ట్, టంబ్లర్, ఆర్కుట్.. తొలి స్థానం నుంచి పదోస్థానానికి వచ్చింది ఆర్కుట్ ! పారంభమే ఆసక్తిదాయకం... పుడుతూనే సోషల్ సామ్రాజ్యాన్ని ఏలేద్దాం అనే ఉద్దేశంతో ఆర్కుట్ ప్రారంభం కాలేదు. ఈ సైట్ప్రారంభించిన ఉద్దేశం వేరు, అది ఫేమస్ అయిన విధానం వేరు. దీన్ని రూపకర్త పేరు ఆర్కుట్ బయోక్కొటిన్. ఇతడు టర్కీకి చెందిన వాడు. దూరమైన తన ప్రియురాలి జాడను తెలుసుకునేందుకు తన పేరు మీద ఈ సైట్‌ను ప్రారంభించాడు. ఇంటర్నెట్ వినియోగదారులందరినీ ఒక వేదిక మీదకు తీసుకు వచ్చి తన ప్రియురాలి జాడను కనుక్కునేందుకు మొదలైంది ఇతడి ప్రయత్నం. అనూహ్యంగా ఈ సైట్ గుర్తింపుకు నోచుకుంది. వేలాదిమంది ఇందులోకి లాగిన్ అయ్యారు. ఈ పరిణామంతో ఆర్కుట్ గూగుల్ కంట పడింది. భారీ డీల్‌తో ఆర్కుట్‌ను కొనుగోలు చేసింది గూగుల్. ఈ డీల్‌తో ఆర్కుట్ పేరు మార్మోగడంతోపాటు అతని ప్రియురాలు కూడా దగ్గరైంది.