
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ సాధించిన ఈ యువ కథానాయకుడు తన సొంత నిర్మాణ సంస్థలో మరో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్ నిర్ణయించారు. ఇటీవలే లాంచనంగా షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది.
ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహరీన్‌ను తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. తరువాత ఆమె స్థానంలో కిరాక్ పార్టీ ఫేం సిమ్రాన్ పరీన్జా పేరు వినిపించింది. తాజాగా మరో అందాల భామ పేరు తెర మీదకు వచ్చింది. అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో సినిమాతో పరిచయం అయిన కళ్యాణీ ప్రియదర్శన్ నర్తనశాల సినిమాలో హీరోయిన్‌గా నటించనుందట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఇంతవరకు అధికారిక ప‍్రకటన చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment