మెగా బ్యానర్‌లో నాగశౌర్య..! | Geetha Arts To Bankroll Young Hero Next | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 28 2018 10:37 AM | Last Updated on Fri, Sep 28 2018 10:37 AM

Geetha Arts To Bankroll Young Hero Next - Sakshi

ఛలో సినిమాతో మంచి ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత తడబడ్డాడు. వరుసగా కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల సినిమాలు బోల్తా పడటంతో ఈ యంగ్ హీరో కెరీర్‌ మరోసారి గాడి తప్పింది. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్న  ఈ యువ కథానాయకుడు మెగా బ్యానర్‌లో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇటీవల గీత గోవిందం సినిమాతో సూపర్‌ హిట్ కొట్టి గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో నాగశౌర్య హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఓ యువ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలోనే ఈప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement