chalo
-
రైతుల ‘చలో ఢిల్లీ’.. హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఫిబ్రవరి 13న రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు పిలుపునివ్వడాన్ని దృష్ట్యాలో పెట్టుకుని పంజాబ్ నుండి ఢిల్లీ వరకు హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్‌లోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు ఇప్పటికే తమ ట్రాక్టర్లపై నిరసన ప్రదర్శనకు బయలుదేరారు. అయితే వారిని ఢిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు ఆ దారిలోని ప్రతి కూడలిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు హర్యానా పోలీసులు. హర్యానా ప్రభుత్వం చౌదరి దల్బీర్ సింగ్ ఇండోర్ స్టేడియం, సిర్సా, గురుగోవింద్ సింగ్ స్టేడియం, దబ్వాలిని తాత్కాలిక జైళ్లుగా మార్చింది. ఆందోళనకు దిగుతున్న రైతులను వీటిలో పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే హర్యానాలోని 15 జిల్లాల్లో సెక్షన్ 144 విధించారు. ఏడు జిల్లాల్లో ఫిబ్రవరి 13 వరకు ఇంటర్నెట్ బంద్ చేశారు. డ్రోన్ల ద్వారా అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానా, పంజాబ్ సరిహద్దులను మూసివేయడానికి భారీ కాంక్రీట్ బారికేడ్లను ఏర్పాటు చేసి, పదునైన ముళ్ల తీగలను అమర్చారు. #WATCH | Ambala, Haryana: Shambhu border sealed ahead of the farmers' call for march to Delhi on 13th February. pic.twitter.com/9jbrddosnV — ANI (@ANI) February 12, 2024 మరోవైపు రైతుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు పలికింది. పంజాబ్‌లో జరిగిన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రైతుల ఉద్యమానికి మద్దతునిస్తున్నట్లు తెలిపారు. ఇదేసమయంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరుపుతోంది. గురువారం జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఫిబ్రవరి 13 న నిరసనకు దిగుతున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. అయితే ఈరోజు(సోమవారం) ముగ్గురు కేంద్ర మంత్రులు రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. -
చలో చేతికి షటిల్
న్యూఢిల్లీ: ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన టెక్నాలజీ ప్లాట్‌ఫాం ’చలో’ తాజాగా ఉద్యోగులకు యాప్ ఆధారిత బస్సు సర్వీసులు అందించే షటిల్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించినదీ మాత్రం వెల్లడించలేదు. దేశీయంగా తమ కార్యకలాపాలు లేని పెద్ద నగరాల్లోను, అంతర్జాతీయంగానూ విస్తరించేందుకు షటిల్ కొనుగోలు ఉపయోగపడగలదని పేర్కొంది. షటిల్ సర్వీస్ ఇకపై కూడా అదే బ్రాండ్ పేరుతో కొనసాగుతుందని వివరించింది. షటిల్‌కు చెందిన 60 మంది సిబ్బంది తమ సంస్థలో చేరతారని చలో సహ వ్యవస్థాపకుడు, సీఈవో మోహిత్ దూబే తెలిపారు. రెండు సంస్థలు కలిస్తే నెలకు 2.5 కోట్ల పైచిలుకు ట్రిప్‌లను నమోదు చేయవచ్చని వివరించారు. కోవిడ్–19కి పూర్వం షటిల్ హైదరాబాద్ సహా ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలతో పాటు బ్యాంకాక్ వంటి అంతర్జాతీయ సిటీల్లోనూ కార్యకలాపాలు సాగించేది. 2,000 బస్సులతో రోజూ దాదాపు 1,00,000 ట్రిప్‌లు నమోదు చేసేది. అయితే, కోవిడ్–19 దెబ్బతో వర్క్ ఫ్రం హోమ్ విధానం ప్రాచుర్యంలోకి వచ్చి, కార్యాలయాలకు ఉద్యోగులు ప్రయాణించడం తగ్గడంతో వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. దీంతో కొనుగోలుదారు కోసం షటిల్ కొంతకాలంగా అన్వేషిస్తోంది. చదవండి: బ్లాక్‌చైన్ టెక్నాలజీతో యువత బంగారు భవిష్యత్‌కు భరోసా -
వీరి గాత్రం.. వేసింది మంత్రం..
రంగమ్మ మంగమ్మ అంటూ మానసి.. శ్రోతలను ఫిదా చేశారు. దారి చూడు అంటూ పెంచల్ దాస్ దుమ్ము లేపారు. చూసి చూడంగానే నచ్చేశావే అని అనురాగ్ కులకర్ణి అంటే... వినీ వినంగానే ఎక్కేసిందే అంటూ శ్రోతలు వంతపాడారు. ఇంకేం ఇంకేం కావాలే అని సిద్‌శ్రీరామ్ అంటే.. ఇకపై ఈ పాటనే వింటామే అంటూ సంగీత ప్రియులు బదులిచ్చారు. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని మోహన భోగరాజు చెప్పగా.. అంతే శ్రద్దగా చెవులురిక్కించి విన్నారు ఆడియెన్స్. ఈ ఏడాది గాయనీగాయకులు తమ గాత్రాలతో చేసిన మ్యాజిక్‌ను ఓసారి చూద్దాం. రంగమ్మ మంగమ్మ.. అంటూ మానసి రంగస్థలం సినిమాను చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. లెక్కల మాష్టారే పరీక్ష రాస్తే నూటికి నూరు మార్కులు వచ్చినట్టు.. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా.. మాస్ సూత్రాలను సరిగ్గా పాటిస్తూ.. సుకుమార్ తీసిన రంగస్థలం అంతా ఒక ఎత్తైతే.. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ అందించిన సంగీతం మరో ఎత్తు. ఈ చిత్రంలోని ప్రతీపాట ప్రేక్షకులను కట్టిపడేసింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవల్సింది రంగమ్మ మంగమ్మ పాట గురించే. ఈ పాటకు సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ వచ్చేసింది. ఈ పాటలో సమంత అభినయం, డ్యాన్సులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇక ఈ పాటపై సోషల్ మీడియాలో లెక్కలేని వీడియోలను రీక్రియేట్ చేసేశారు అభిమానులు. ఈ పాట జనాల్లోకి వెళ్లడానికి దేవీ అందించిన ట్యూన్ ఒక కారణమైతే.. మానసి గాత్రం మరో కారణం. ఈ పాటతో ఒక్కసారిగా ఎనలేని క్రేజ్‌ను సంపాదించేశారు గాయని మానసి. ఈ వీడియోసాంగ్‌ను ఇప్పటివరకు 129మిలియన్ల మంది వీక్షించారు. దారి చూపి దుమ్ము లేపిన దాస్.. ఈ ఏడాదిలో వచ్చిన పాటలన్నింటిలో మాస్‌ను ఊపేసిన పాట ఇది. నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్దం సినిమా మిశ్రమ ఫలితాన్నిచ్చినా.. ఈ చిత్రంలోని ఈ పాట మాత్రం పాపులర్అయింది. ఎక్కడ ఎలాంటి ప్రొగ్రామ్స్ అయినా ఈ పాట ప్లే అవ్వాల్సిందే. చిందులు వేయాల్సిందే. హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా.. రాయలసీమ రచయిత పెంచల్ దాస్ అందించిన గాత్రం ఈ పాటకు అదనపు ఆకర్షణ అయింది. ఆ గాత్రంలో ఉన్న మ్యాజిక్కే.. ఈ పాటను ఇంతలా వైరల్ చేసింది. ఇప్పటికే ఈ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో 38మిలియన్ల మంది వీక్షించారు. వినీ వినంగానే నచ్చేసిందే... ఈ ఏడాది యూత్‌ను ఊపేసిన పాటల లిస్ట్‌లో మొదటి వరుసలో ఉండేది ఛలో సాంగ్. చూసి చూడంగానే అంటూ నాగశౌర్య రష్మిక మాయలో పడిపోతే.. ఈ పాటను వినీ వినంగానే నచ్చేసిందే అనేలా చేసేశారు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్.. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి. ఎక్కడ చూసిన ఈ పాటే కాలర్‌ట్యూన్.. రింగ్‌టోన్‌గా మారిపోయింది. ఈ పాటను 94మిలియన్ల మంది వీక్షించారు. ఈ ఏడాదిలో అనురాగ్ అందరికీ గుర్తుండియో పాటలు పాడి శ్రోతలకు మరింత దగ్గరయ్యారు. మహానటి టైటిల్ సాంగ్.. ఆర్ఎక్స్ 100 పిల్లా రా వంటి సాంగ్‌లను పాడి అనురాగ్ కులకర్ణి ఫుల్ ఫేమస్ అయ్యారు. వీటిలో పిల్లా రా సాంగ్‌ను యూత్‌ను కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను 140మిలియన్ల మంది చూశారు. ఇంకేం ఇంకేం కావాలే.. ఇంకేం ఇంకేం కావాలే.. అని సిద్ శ్రీరామ్ అంటే ఈ ఏడాదికి ఇదే చాలే అని ప్రేక్షకుల బదులిచ్చారు. గీతగోవిందంలోని ఈ పాటే సినిమాపై హైప్‌ను క్రియేట్ చేసింది. ఒక్కపాట సినిమాపై అంత ప్రభావం చూపుతుందని చెప్పడానికి ఈ పాటే ఓ ఉదహరణ. అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం ఈ పాటకు బలాన్నిచ్చింది. గోపి సుందర్ అందించిన బాణీకి, సిద్‌శ్రీరామ్ తన గాత్రంతో ప్రాణం పోయగా.. సంగీత ప్రియులను ఈ పాట ఉక్కిరిబిక్కిరి చేసేసింది. భాషలతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులకు అందరికీ ఈ పాట ఎక్కేసింది. రికార్డు వ్యూస్లతో యూట్యూబ్‌లో ఈ పాట దూసుకెళ్తోంది. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని గంభీరంగా చెప్పిన మోహన.. అరవింద సమేత.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో సంగీతం ప్రధాన ప్రాత పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని రెడ్డమ్మ సాంగ్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. సినిమా ముగింపులో వచ్చే ఈ పాట.. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని వివరించగా.. ఆ గాత్రంలోని తెలియని ఆకర్షణకు అందరూ ముగ్దులయ్యారు. మోహన భోగరాజు ఈ పాటతో అందరికీ సుపరిచితురాలయ్యారు. పెంచల్ దాస్ తన రాయలసీమ యాసలో అందించిన సాహిత్యం ఈ పాటపై మరింత ప్రభావాన్ని చూపింది. ఇలా ఈ ఏడాది తమ గాత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన యువతరంగాలు.. వచ్చే ఏడాది కూడా తమ హవాను కొనసాగించాలని మరిన్ని మంచి పాటలను ఆలపించాలని ఆశిద్దాం. -
‘భీష్మా’ జోడిగా రష్మిక
ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన టాలెంటెడ్ బ్యూటీ రష్మిక మందన్న. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. గీత గోవిందం సినిమాకు ఏకంగా వంద కోట్ల వసూళ్లు రావటంతో రష్మిక కూడా లక్కీ గర్ల్ అన్న ముద్ర పడిపోయింది. అయితే యంగ్ హీరోలు, దర్శకులు రష్మిక కోసం క్యూ కడుతున్నారు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రష్మికను ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. రష్మికను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. నితిన్ హీరోగా భీష్మా పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు కూడా రష్మికనే హీరోయిన్గా కన్ఫమ్ చేశాడు వెంకీ. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించనున్నాడు. -
మెగా బ్యానర్లో నాగశౌర్య..!
ఛలో సినిమాతో మంచి ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత తడబడ్డాడు. వరుసగా కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల సినిమాలు బోల్తా పడటంతో ఈ యంగ్ హీరో కెరీర్ మరోసారి గాడి తప్పింది. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్న ఈ యువ కథానాయకుడు మెగా బ్యానర్లో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ కొట్టి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో నాగశౌర్య హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఓ యువ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలోనే ఈప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
యంగ్ హీరో ఇన్నాళ్లకు..!
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెల్‌ఫోన్ నిత్యావసరాల్లో ఒకటైపోయింది. అలాంటిది ఈ జనరేషన్లో కూడా ఇంతవరకు సెల్‌ఫోన్ వాడకుండా ఉన్న హీరో ఉన్నాడటే నమ్మలేం. కానీ అలాంటి హీరో కూడా ఒకడు ఉన్నాడు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య తరువాత కెరీర్ లో కాస్త ఇబ్బంది ఎదురైనా ఛలో తిరిగి నిలదొక్కకున్నాడు. తాజాగా ఈ హీరో మరో బిగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇన్నేళ్లు స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉన్న నాగశౌర్య మొబైల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘ఇన్నేళ్ల తరువాత నా చేతిలో మొబైల్ ఫోన్. నేను కూడా విషపూరిత ప్రపంచంలోకి అడుగుపెడుతున్నానా..?’ అంటూ ట్వీట్ చేశారు. A smartphone in my hand after all these years.. Did I enter a vicious world?🙃 pic.twitter.com/uQvSqfSTRg — Naga Shaurya (@IamNagashaurya) 25 September 2018 -
సొంత బ్యానర్లో మరో సినిమా
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఛలో తరువాత అమ్మమ్మగారిల్లు లాంటి ఫ్లాప్ వచ్చినా అది నాగశౌర్య కెరీర్ మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న నర్తనశాల సినిమాలోనటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా తరువాత భవ్య క్రియేషన్స్ బ్యానర్లో నారి నారి నడుమ మురారి సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఆ తరువాత చేయబోయే సినిమాకు కూడా ఓకె చెప్పాడట ఈ యంగ్ హీరో. అంతేకాదు ఈ సినిమాను నాగశౌర్య మరోసారి తన సొంతం నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నాడు. శేఖర్ కమ్ముల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన తేజ ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈసినిమాకు గణ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
పే...ద్ద..చిన్న సినిమాలు
సినిమాల్లో పెద్దా చిన్న ఉండదు. కానీ చిన్న సినిమా ఒక్కోసారి పెద్దగా కనబడుతుంది.కథా వస్తువు గొప్పదనమే అనలేం! ఇవ్వాళ చిన్న సినిమా పెద్దగా కనబడటానికి కారణం కథ కంటే పెద్ద కథనమే! నిజానికి చిన్న సినిమాలకు పెద్ద సినిమాల మధ్య వెంట్రుక వాసంత సందు కూడా దొరికేది కాదు.ఊపిరాడక డబ్బాల్లోనే చచ్చిపోయేవి. కానీ టైమ్ మారింది. కాదు.. కాదు.. సినిమా మారింది. కాదు.. కాదు.. కాదు.. ఆడియన్స్ మారారు. సినిమాను మారుస్తున్నారు. 2018లో వచ్చిన ఆరు పే...ద్ద.. చిన్న సినిమాల దర్శకులతో మీకోసం ‘సాక్షి ఫన్డే’ స్పెషల్..! ఛలో విడుదల తేదీ: ఫిబ్రవరి 2, 2018 దర్శకుడు: వెంకీ కుడుముల నటీనటులు: నాగశౌర్య, రష్మిక మందన్న నిర్మాత: ఉష ముల్పురి సంగీతం: మహతి స్వరసాగర్ ‘ఛలో’.. ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే వచ్చిన ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద బ్లాక్‌బస్టర్. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు వెంకీ కుడుముల. ‘ఛలో’తో పాపులర్ అయిన ఈ దర్శకుడి ఫ్యూచర్ ప్లాన్ గురించి.. ఆయన మాటల్లోనే... ∙ ఇంట్లో వాళ్లను ముందే ప్రిపేర్ చేశా! మాది భద్రాద్రి జిల్లా. హైదరాబాద్‌లో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివాను. చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. సినిమాల్లో కెరీర్‌ను బిల్డ్ చేసుకోబోతున్నట్లు ఇంట్లో నేరుగా చెప్పకుండా ముందు అమ్మానాన్నల్ను ప్రిపేర్ చేశా. చదువు కొనసాగిస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తానని చెప్పా. ఆ తర్వాత ‘పై చదువులు చదువుతావా?’ అని అడిగారు. లేదన్నాను. సినిమా ఫీల్డ్‌లోనే కెరీర్ అని నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వడంతో వాళ్లూ నో చెప్పలేదు. ∙ సోషల్ మీడియా పరిచయాలతో ఇండస్ట్రీలోకి..! కాలేజీ డేస్‌లోనే సినిమా ఫీల్డ్‌లో ఉన్న వాళ్లకు సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టేవాడ్ని. డైలాగ్స్‌ను స్టేటస్‌లుగా పెడుతుండేవాడ్ని. హీరో శివబాలాజీ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి, ‘అదుర్స్’ రవి వీరందరూ నాకు ఇలానే పరిచయం. అలా ‘ఇంకోసారి’ సినిమా దర్శకుడు సుమన్ పాతూరి పరిచయం అయ్యారు. ఆయన దగ్గర నాకు రైటర్ బలభద్రపాత్రుని రమణిగారు పరిచయం అయ్యారు. ఆవిడ నన్ను దర్శకుడు తేజగారికి పరిచయం చేశారు. నిజానికి నేను యాక్టర్ అవుదామని వెళ్లాను. కానీ తేజగారు నాలో డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి ఆ దిశగా ప్రోత్సహించారు. ఆ టైమ్‌లో డైరెక్షన్‌పై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. ఆ తర్వాత డైరెక్టర్ యోగిగారి దగ్గర, నాగశౌర్య ‘జాదుగాడు’ సినిమాకు పనిచేశా. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారి దగ్గర కూడా వర్క్ చేశా. ∙ ‘ఛలో’ అలా మొదలైంది! ‘అజ్ఞాతవాసి’ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నప్పుడు, ఈ సినిమా తర్వాత డైరెక్షన్ ప్రయత్నాలు స్టార్ట్ చేయమన్నారు త్రివిక్రమ్‌గారు. ‘జాదుగాడు’ సినిమా టైమ్‌లో హీరో నాగశౌర్య పరిచయం అయ్యారు. ‘మనం సినిమా చేద్దాం కథ రెడీ చేయ్!’ అన్నారు. నేను చెప్పిన కథ ఆయనకు నచ్చింది. ఓ నిర్మాతకు కథ చెప్పాం. ‘కథ కమర్షియల్‌గా ఉంది. వేరే హీరోకి వెళ్దామా?’ అన్నారు. శౌర్యతో ఇంకో లవ్‌స్టోరీ చేయవచ్చు కదా అని ఆయన అభిప్రాయం. ‘నేను శౌర్యతోనే చేస్తాను’ అని చెప్పా. ఆ సమయంలోనే శౌర్య తన పేరెంట్స్‌కు నేను చెప్పిన కథ చెప్పాడు. వాళ్లు ఎగై్జట్ అయ్యారు. అలా ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్లో నా తొలి సినిమా ‘ఛలో’ మొదలైంది. ∙ ‘ఛలో’ కథ అప్పుడే పుట్టింది! ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా మా ఊరు అశ్వరావుపేట తెలంగాణ బోర్డర్లోకి వచ్చింది. అంటే మా ఇంటి దగ్గర్నుంచి మూడు కిలోమీటర్లు వెళితే ఇప్పుడు ఆంధ్ర వస్తుంది. ఓకే.. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ కాకుండా.. ఆంధ్ర, తమిళనాడు బోర్డర్ అయితే ఎలా ఉంటుంది? హీరో తమిళనాడు అమ్మాయిని లవ్ చేస్తే? ఈ బ్యాక్‌డ్రాప్‌లో స్క్రీన్‌ప్లే వర్కౌట్ అవుతుంది కదా అనిపించింది. అలా ‘ఛలో’ సబ్జెక్ట్‌ను టేకప్ చేశాను. ∙ నితిన్‌తో చేస్తున్నా! నితిన్‌తో ఓ సినిమా చేయబోతున్నా. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. తొలిప్రేమ విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2018 దర్శకుడు: వెంకీ అట్లూరి నటీనటులు: వరుణ్‌తేజ్, రాశిఖన్నా నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ సంగీతం: ఎస్. థమన్ వరుణ్‌తేజ్‌కు హీరోగా ఫస్ట్ మేజర్ బాక్సాఫీస్ హిట్ ‘ఫిదా’ తర్వాత వచ్చిన ‘తొలిప్రేమ’ కూడా అంతే పెద్ద హిట్. వెంకీ అట్లూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఒక సింపుల్ ప్రేమకథనే రిఫ్రెషింగ్ కథనంతో నడిపించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారాయన. నటుడిగా కెరీర్ మొదలుపెట్టి దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి తన కెరీర్ గురించి చెప్పిన విశేషాలు... ∙ యాక్టింగ్ నుంచి డైరెక్షన్‌కి! నాది హైదరాబాద్. ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచే సినిమాల్లో కెరీర్‌ను బిల్డ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు రైటింగ్‌పై ఆసక్తి కలిగింది. ముందు ‘స్నేహగీతం’ సినిమాలో నటించాను. ఆ తర్వాత నాకు యాక్టింగ్ కన్నా, రైటింగ్ అండ్ డైరెక్షన్ అంటేనే మక్కువ ఏర్పడింది. అందుకే ‘స్నేహగీతం’ సినిమా చేసిన తర్వాత రైటింగ్ అండ్ డైరెక్షన్‌పై ఫోకస్ పెట్టాను. దాదాపు ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. ఫైనల్లీ ‘తొలిప్రేమ’తో డైరెక్టర్ అయ్యాను. నిజానికి ‘తొలిప్రేమ’ సినిమా సక్సెస్.. టీమ్ వర్క్ అని చెబుతా. ∙ ‘తొలిప్రేమ’కు నో చెప్పారు! మొదట్లో ‘తొలిప్రేమ’ కథకు చాలా మంది ఓకే చెప్పలేదు. ఆ తర్వాతే అది దాని దారి వెతుక్కొని ఇలా వచ్చింది. మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఎవరి పని వాళ్లని చేయనిస్తే ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది 95 పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఒక ఫైవ్ ఫర్సెంట్ లక్ ఉండాలి. ‘తొలిప్రేమ’ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. ∙ పొలిటికల్ డ్రామా చేస్తా! లవ్‌స్టోరీస్‌తో పాటు నాకు ఫ్యామిలీ డ్రామాలంటే ఆసక్తి ఎక్కువ. పొలిటికల్ డ్రామాలన్నా ఇష్టమే. భవిష్యత్‌లో నానుంచి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమాను ఆశించవచ్చు. ∙ అఖిల్‌తో సినిమా చేస్తున్నా! ప్రస్తుతం అఖిల్‌తో సినిమా చేస్తున్నాను. ఇప్పుడు దృష్టంతా ఈ సినిమాపైనే. ఒక సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడు మరో సినిమా గురించి ఆలోచించను. ఎఫర్ట్ అంతా సినిమా మీదనే పెడతా. ప్యారలల్‌గా మరో సినిమా చేయడం నాకు కంఫర్ట్‌గా అనిపించదు. ఏకాగ్రత తగ్గుతుందేమోనని నా భయం. మణిరత్నం, త్రివిక్రమ్ నా ఫేవరైట్ డైరెక్టర్స్. వాళ్ల నుంచి ఎక్కువ ఇన్‌స్పయిర్ అయ్యాననే చెప్తా. అ! విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2018 దర్శకుడు: ప్రశాంత్ వర్మ నటీనటులు: కాజల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, నిత్యామీనన్ నిర్మాతలు: నాని, ప్రశాంతి త్రిపురనేని సంగీతం: మార్క్ కె. రాబిన్ హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన సినిమా ‘అ!’తో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రశాంత్ వర్మ. ఒక మంచి ప్రయోగంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు అర్బన్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ కథల్ని తెరకెక్కించాలన్న డ్రీమ్‌తో ముందుకెళ్తానంటున్న ప్రశాంత్ వర్మ తన గురించి చెప్పిన కొన్ని విశేషాలు.... ∙ సినిమాలను పిచ్చిగా చూసేవాడ్ని! మాది భీమవరం దగ్గర పాలకొల్లు. సినిమాలంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ సినిమాల్లోకి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. స్కూల్లో మంచి స్టూడెంట్‌ని. చిన్నప్పుడు ప్రతి సినిమా చూసేవాణ్ని. అయితే డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అవి కూడా బాగా వైరల్ అయ్యాయి. తర్వాత ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సినిమా గురించి తెలుసుకోవడం, చదవడం మొదలెట్టాను. ఆ తర్వాత యాడ్స్ చేశాను. ∙ ‘అ!’ నా 33వ కథ... ‘అ!’.. ఫ్రస్ట్రేషన్‌తో రాసిన కథ. 2017 న్యూ ఇయర్‌కు నా కొత్త సినిమా స్టార్ట్ కావల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. అప్పుడు ఈ కథ రాశాను. ఆడియన్స్ ఎప్పుడూ చూడని ఒక కొత్త కథ చెబుదాం అన్న ఉద్దేశంతోనే ఈ పాయింట్ పిక్ చేసుకున్నాను. ఇది నేను రాసిన 33వ కథ. అలా అని ముందు 32 కథలు రిజెక్ట్ అయ్యాయని అనను. ఏవేవో కారణాలతో సినిమా ఫైనలైజ్ కాలేదు. ‘అ!’ సినిమా నా సొంత ప్రొడక్షన్లోనే చిన్న సినిమాలా కొత్త వాళ్లతో చేద్దాం అనుకున్నాను. మెల్లిగా కాజల్, నాని వచ్చి పెద్ద ప్రాజెక్ట్ అయింది. ∙ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ లేవు! మన దగ్గర మాత్రమే ‘నా కథతో నేనే సినిమా తీస్తాను’ అనుకుంటాం. హాలీవుడ్లో ఒకరు కథ రాస్తారు. మరొకరు స్క్రీన్‌ప్లే. ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ కంపెనీ ఒక డైరెక్టర్ని నియమించుకుంటుంది. ఇలాగే బాలీవుడ్ ‘క్వీన్’ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’ నా దగ్గరికొచ్చింది. ‘అ!’ పనుల్లో బిజీగా ఉండి చేయడం కుదర్లేదు. ఆ సినిమా మధ్యలో ఆగిపోతే, మిగతా భాగమంతా వెళ్లి పూర్తి చేసి వచ్చాను. డైరెక్షన్ అనేది ఒక జాబ్ అని అనుకుంటాను నేను. అలానే వెళ్లి ఆ సినిమా చేసి వచ్చాను. నా తర్వాతి సినిమా వేరే అతని కథతో చేస్తున్నాను. ‘కథ’ అని అతనికి టైటిల్ వేస్తాను. నాకెలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ లేవు. ∙ ఆ బ్రాండ్ నా డ్రీమ్! ‘స్క్రిప్ట్ విల్లా’ అనే కంపెనీ ద్వారా మంచి కథల కోసం వెతికే ప్రొడక్షన్ హౌస్‌లకు, యాక్టర్స్‌కు మా సంస్థ నుంచి కథలను అందించే ప్రయత్నం మొదలుపెడుతున్నా. వీలైనన్ని కొత్త కథలు ఆడియన్స్‌కు చెప్పడమే నా డ్రీమ్. ‘వీడు ఇప్పటివరకూ మనం అనుకున్నట్టుగా కాకుండా, కొత్తగా కథలు చెబుతాడ్రా!’ అనే బ్రాండ్‌ని క్రియేట్ చేసుకుంటే చాలు. ఆర్ఎక్స్ 100 విడుదల తేదీ: జూలై 12, 2018 దర్శకుడు: అజయ్ భూపతి నటీనటులు: కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ నిర్మాత: అశోక్‌రెడ్డి సంగీతం: చైతన్ భరద్వాజ్ 2018లో చిన్న సినిమాల్లో అతిపెద్ద సెన్సేషన్ ‘ఆర్ఎక్స్100’. కొత్త దర్శకుడు అజయ్ భూపతి కొత్త నటీనటులతో చేసిన ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి. ఫ్యూచర్లో ఎంత పెద్ద హీరోలతో సినిమా చేసే అవకాశం వచ్చినా వాళ్లను తన స్టైల్లోకి తీసుకొచ్చుకొని సినిమా చేస్తానంటున్న అజయ్ ఫ్యూచర్ ప్లాన్ గురించి.. ఆయన మాటల్లోనే.. ∙ సినిమాలో మా ఊరే! మాది ఆత్రేయపురం. సినిమాలో మీరు చూసిందే. నా ఆరో తరగతి నుంచి డిగ్రీ దాకా మా ఊర్లోనే చదువుకున్నాను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సినిమాల్లోకి వెళ్తా అన్నప్పుడు మా నాన్న గారు ‘నీకు నేనేం ఆస్తులు ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే నువ్విలా ఉండు. అలా ఉండు అని చెప్పొచ్చు. నీకు నచ్చింది నువ్వు చెయ్’ అన్నారు. ∙ అప్పుడే ఫిక్స్ అయ్యా! నా పదో తరగతిలోనే ఫిక్స్ అయ్యా, సినిమా డైరెక్టర్ అవ్వాలని. ఆ తర్వాత చదువుకోవడం కూడా టైమ్ వేస్ట్‌లా ఫీల్ అయ్యాను. ఎవ్వరైనా సరే వాళ్లేమవ్వాలనుకుంటున్నారు అనే చిన్న క్లారిటీ ఉంటే చాలు.. అది ఎంత కష్టమైనా చేసేయొచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా నాని ‘రైడ్’, రవితేజ ‘వీర’ సినిమాలకు పని చేశాను. ఆ తర్వాత మా బాస్ రామ్‌గోపాల్ వర్మ ‘అటాక్’, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వంగవీటి’ సినిమాలకు వర్క్ చేశాను. ∙ ఎన్నో అవమానాలు.. చీదరింపులు... సినిమాల్లోకి రావాలనుకున్నాక అవమానాలు, చీదరింపులు, పస్తులు ఉండటాలు... అన్నీ ఉన్నాయి. కానీ ‘ఆర్ఎక్స్ 100’ కథను చాలామందికి చెప్పా. ఎవ్వరూ రిజెక్ట్ చేయలేదు కానీ, వాళ్ల వాళ్ల కారణాల వల్ల సినిమా చేయడం కుదర్లేదు. కార్తికేయకి బాగా నచ్చేసింది. తర్వాత నిర్మాత అశోక్ వచ్చారు. నాకు రియలిస్టిక్ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ పాయింట్ బావుంటుందని గట్టి నమ్మకం ఉండేది. నేను తప్ప ఎవ్వరూ పెద్దగా నమ్మలేదు ఈ సబ్జెక్ట్‌ని. ‘ఆర్ఎక్స్ 100’లో మీరు చూసిన హీరో క్యారెక్టర్ మన ఊర్లో కనబడే రెబల్ కుర్రాడిలానే ఉంటుంది, పంచాయతీ ప్రెసిడెంట్, రాంకీగారి పాత్ర.. ఇలా ప్రతీ పాత్రను ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలా డిజైన్ చే శాను. ∙ నెక్ట్స్ మల్టీస్టారర్... ‘ఆర్ఎక్స్100’ సక్సెస్ తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటివరకైతే ఏదీ ఫైనల్ చేయలేదు. కానీ నెక్ట్స్ సినిమా మాత్రం మల్టీస్టారర్ ఉంటుంది. రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరి వ్యక్తుల కథ. స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. రెండు నెలల్లో ఫుల్ డీటైల్స్ అనౌన్స్ చేస్తాను. ఏ కథ చెప్పినా రియలిస్టిక్ అప్రోచ్‌తో చెప్పడమే నా లక్ష్యం. అలాగే ప్రభాస్, రామ్ చరణ్‌తో సినిమా చేయడం నా డ్రీమ్. ఒకవేళ మా స్టైల్లో సినిమా కావాలని వాళ్లు అడిగినా స్టోరీ సిట్టింగ్స్‌లో వాళ్లను నా దారిలోకి తెచ్చేసి నా స్టైల్లో సినిమా తీసేస్తా! చి.ల.సౌ విడుదల తేదీ: ఆగస్టు 3, 2018 దర్శకుడు: రాహుల్ రవీంద్రన్ నటీనటులు: సుశాంత్, రుహాని శర్మ నిర్మాతలు: నాగార్జున, జశ్వంత్ నడిపల్లి సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి ‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’. జనరల్‌గా చాలా మంది నటీనటులు చెప్పే మాట ఇది. అయితే రాహుల్ రవీంద్రన్ మాత్రం ‘డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ అంటున్నారు. హీరోగా సినిమాలతో మెప్పిస్తూనే ఉన్న రాహుల్, దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘చి.ల.సౌ.’ సినిమా ఈ నెల్లోనే విడుదలై సూపర్ హిట్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. డైరెక్టర్‌గా మారిన ఈ యాక్టర్ సినిమా గురించి, తన ఫ్యూచర్ ప్లాన్ గురించి చెప్పిన విశేషాలు... ∙ చిన్నప్పట్నుంచీ కథలంటే ఇష్టం! నేను పుట్టి, పెరిగిందంతా చెన్నైలోనే! నాన్న ఎన్.రవీంద్రన్, అమ్మ వసుమతి. నాన్న బిజినెస్‌మేన్. చిన్నప్పట్నుంచీ అమ్మ రామాయణం, మహాభారతం కథలు చెబుతూ, యాక్టింగ్ చేసి చూపించేది. అప్పుడే నాకు కథలంటే ఇష్టం పెరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మణిరత్నంగారి ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) సినిమాను టీవీలో చూశా. చాలా కొత్తగా, ఫ్రెష్‌గా అనిపించింది. ఓ సినిమాని ఇలా కూడా తీయొచ్చా? అనిపించింది. అప్పట్నుంచి సినిమా, డైరెక్షన్ సైడ్ ఇష్టం పుట్టింది. ఇంటర్‌కి వచ్చాక ఫిల్మ్‌మేకర్ అవ్వాలనుకుని డిసైడ్ అయ్యా. నటుడవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ∙ అసిస్టెంట్‌గా చాన్స్ దొరకలేదు.. హీరో అయ్యా! మా ఫ్యామిలీలో ఎవరూ సినిమా ఇండస్ట్రీలో లేరు. మాది ఆ నేపథ్యం కాదు. అందుకే ఫస్ట్ చదువు పూర్తి చేసి తర్వాత ప్రయత్నిద్దామనుకుని అహ్మదాబాద్‌లో ‘మైకా’ కళాశాలలో ఎంబీఏ మార్కెటింగ్ చేశా. తర్వాత బాంబేలో ఏడాదిన్నర పాటు రేడియో సిటీలో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్‌గా చేశా. 2007లో చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవ్వాలనుకున్నా. కానీ, ఎవరి వద్దా అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఓ రోజు ఆడిషన్స్‌కి రమ్మని కాల్ వచ్చింది. వెళ్లగానే యాక్టింగ్ రోల్ అన్నారు. ఏ పాత్ర అంటే.. హీరో అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాన్స్ రాలేదు. హీరోగా వచ్చింది. చేస్తే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవచ్చు. డబ్బులు కూడా వస్తాయని చేశా. రవివర్మన్ డైరెక్షన్లో ‘మాస్కోవిన్ కావేరి’ చిత్రం చేశా. ∙ ‘అందాల రాక్షసి’ మొత్తం మార్చేసింది! ‘అందాల రాక్షసి’ చిత్రా నికి ఇద్దరు హీరోలు కావాలి. నవీన్ చంద్ర ఓ హీరోగా ఓకే. రెండో హీరో సెట్ అవడం లేదు. మీకు తెలిసినవారు ఎవరైనా ఉన్నారా? అని పాటల రచయిత లక్ష్మీ భూపాల్‌గారు అహ్మదాబాద్‌లో నాతోపాటు చదువుకున్న ఫ్రెండ్ దీప్తిని అడిగారు. తను నా గురించి చెప్పింది. తెలుగు రాదు అంది. పర్లేదు ఫొటోలు పంపమన్నారు. దీప్తికి పంపా. హను రాఘవపూడిగారు ఆడిషన్స్ చేసి ఓకే చేశారు. ఆ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యా. సాయి కొర్రపాటిగారు బాగా ప్రమోషన్ చేశారు. నాకు, నవీన్ చంద్ర, లావణ్యా త్రిపాఠికి మంచి లైఫ్ వచ్చింది. ఆ సినిమా విడుదలై ఆరేళ్లయింది. ∙ డైరెక్షన్ ట్రయల్స్.. హీరో అయినా, ఆ వెంటనే దర్శకుడిగానూ ప్రయత్నాలు మొదలుపెట్టా. నాలుగున్నరేళ్ల క్రితం ఓ హీరోకి ‘చిలసౌ’ కథ చెప్పా. అప్పుడది వర్కవుట్ అవ్వలేదు. ఈలోగా మళ్లీ హీరోగా బిజీ. తర్వాత సుశాంత్‌కి చెప్పా. ఓకే. నచ్చింది అన్నాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరీష్‌కి చెప్పాడు. ఆయన నిర్మాతలు భరత్, జశ్వంత్‌లకు చెప్పారు. వారు కథ విని ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. ఇప్పుడు సినిమా విడుదలై ఇంత పెద్ద హిట్ అయిందంటే చాలా హ్యాపీగా ఉంది. ∙ చిన్మయి హ్యాపీ! ‘అందాల రాక్షసి’ టైమ్‌లో పరిచయమైన సింగర్ చిన్మయి కొద్దిరోజుల్లోనే మంచి ఫ్రెండయింది. తను నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుందని నేనే ప్రపోజ్ చేశా. తను కొద్దికాలం ఆలోచించి ఓకే చెప్పింది. తను నాకు, నేను తనకు బలం. ‘చి.ల.సౌ.’ రిలీజయ్యాక, నేను నా కలను సాధించినందుకు తను ఎంతో హ్యాపీ! ∙ యాక్టింగ్, డైరెక్షన్ రెండూ చేస్తా! తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్‌ను నిర్మాతలు బాగా ఎంకరేజ్ చేస్తారు. ‘చిలసౌ’ రిలీజ్‌కి ముందే చాలామంది కలిసి సినిమాలు చేయమన్నారు. అయితే రెండో సినిమా అన్నపూర్ణ బ్యానర్లో చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నా. ఇకపై డైరెక్షన్‌కే నా మొదటి ప్రాధాన్యత. మంచి సినిమాలు తీస్తా. అయితే యాక్టింగ్ వదులుకోను. ప్రస్తుతం ‘యూ టర్న్’, ‘దృష్టి’ సినిమాలు చేశా. త్వరలో రిలీజ్ కానున్నాయి. గూఢచారి విడుదల తేదీ: ఆగస్టు 3, 2018 దర్శకుడు: శశికిరణ్ తిక్క నటీనటులు: అడివిశేష్, శోభిత దూళిపాల, మధుశాలిని నిర్మాతలు: అభిషేక్ నామ, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంగీతం: శ్రీచరణ్ పాకాల హీరో అడివి శేష్ ‘క్షణం’ సినిమాతో రెండేళ్ల క్రితం న్యూ వేవ్ సినిమా అంటూ రవికాంత్ పేరు అనే ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. మళ్లీ రెండేళ్లకు అదే న్యూ వేవ్ అంటూ ‘గూఢచారి’తో మరో కొత్త దర్శకుడు శశికిరణ్ తిక్కను పరిచయం చేశారు. ఆగస్టు 3న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. రిఫ్రెషింగ్ స్పై థ్రిల్లర్‌గా, లో బడ్జెట్లో తెరకెక్కిన బెస్ట్ విజువల్స్‌తో మెప్పిస్తోన్న ఈ సినిమా గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి శశికిరణ్ మాటల్లో.... ∙ కేరాఫ్ అమలాపురం నేను పుట్టింది అమలాపురంలో. అమ్మానాన్న రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. నాన్న గతంలో కొబ్బరి, కన్స్ట్రక్షన్ బిజినెస్‌లు చేసేవారు. ఇప్పుడు రిటైర్ అయ్యారు. అన్నయ్య రాజమండ్రిలో బిజినెస్ చూసుకుంటున్నారు. ∙ 15 మంది నిర్మాతలకు కథ చెప్పా! నాకు మొదట్నుంచీ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. డైరెక్టర్ కావాలనే అమెరికాలో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్, రైటింగ్‌లో రెండేళ్లపాటు శిక్షణ తీసుకున్నా. ఇండియాకొచ్చి శేఖర్ కమ్ములగారి దగ్గర ‘లీడర్’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశా. ‘లీడర్’కు పనిచేసిన తర్వాత కొన్ని కథలు రాసుకొని దాదాపు 15మంది నిర్మాతలకి చెప్పా. కొందరు చేద్దామన్నా రకరకాల కారణాల వల్ల కుదర్లేదు. ఓ సినిమా అయితే రేపు లాంచ్ అనగా ఆగిపోయింది. ఈ గ్యాప్‌లో ఫ్రెండ్స్‌కి రైటింగ్ సైడ్ హెల్ప్ చేశా. అడివి శేష్ ‘కర్మ’ సినిమాకి ప్రమోషన్స్ విషయంలో హెల్ప్ చేశా. ∙ ‘గూఢచారి’ అలా పుట్టిందే! ‘కర్మ’ సినిమా అప్పుడే అడివి శేష్‌తో మంచి స్నేహం కుదిరింది. శేష్ రాసిన స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ కథను ఆయనతో కలిసి నేను, రాహుల్ పాకాల (రైటర్) ఎనిమిది నెలలు కష్టపడి పూర్తి స్క్రిప్ట్‌గా రెడీ చేశాం. కథని అబ్బూరి రవిగారికి వినిపించాం. ఆయన సలహాలు మాకు బాగా ఉపయోగపడ్డాయి. ∙ ఇంత పెద్ద సక్సెస్ ఊహించలేదు! ‘గూఢచారి’ హిట్ అవుతుందనుకున్నా. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందనుకోలేదు. ఈ సినిమా సక్సెస్ కాగానే చాలా మంది నిర్మాతలు అడిగారు. ఇంకా ఎవరి వద్దా అడ్వాన్సులు తీసుకోలేదు. ఎవరితో చేయాలన్నది నిర్ణయించుకోలేదు. నాకు డబ్బు ముఖ్యం కాదు, పని సంతృప్తినివ్వడమే ముఖ్యం. నావల్ల నిర్మాతలు హ్యాపీగా ఉండాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. ∙ అన్ని జానర్స్ చెయ్యాలి! స్పై థ్రిల్లర్‌తో డెబ్యూట్ ఇచ్చినా నాకు కామెడీ అంటే ఇష్టం. ఫ్యూచర్లో అన్ని జానర్స్‌లో సినిమాలు చేయాలనుంది. నాకిష్టమైన దర్శకుల నుంచి ఇన్స్పైరై ఇంకా బాగా పని చేయాలనుకుంటా. – సాక్షి సినిమా డెస్క్ -
రష్మిక మందన్న.. ఇప్పుడొక సెన్సేషన్!
రష్మిక మందన్న. సౌతిండియన్ సినీ పరిశ్రమలో ఈ పేరు ఇప్పుడొక సెన్సేషన్. తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో సూపర్‌హిట్ సినిమాలతో దూసుకుపోతోన్న ఈ స్టార్‌కు ముఖ్యంగా యూత్‌లో తిరుగులేని క్రేజ్ ఉంది. తెలుగు సినిమాకు పరిచయం కాకముందు రష్మికకు ‘కర్ణాటక క్రష్’ అనే పేరుంది. ఇప్పుడైతే ఆమె పాపులారిటీ సౌతిండియా మొత్తం పాకేసింది కాబట్టి, రష్మికను ‘యూత్ క్రష్’ అని చెప్పేసుకోవచ్చు. ఈ స్టార్ గురించి కొన్ని విశేషాలు... చిన్నప్పట్నుంచీ యాక్టివ్... రష్మిక సినిమాల్లో ఎంత హుషారుగా కనిపిస్తుందో, నిజజీవితంలోనూ అంతే యాక్టివ్! టీనేజ్‌లో ఉన్నప్పట్నుంచే సినిమాలంటే పిచ్చి. అలా పద్దెనిమిదేళ్లకే మోడలింగ్‌లోకి వచ్చి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు చాలా కమర్షియల్ యాడ్స్‌కు రష్మిక టాప్ ప్రయారిటీగా ఉండేది. మోడలింగ్‌లో ఆ క్రేజే ఆమెకు సినిమా అవకాశాన్ని తెచ్చిపెట్టింది. కిరాక్ ఆఫర్ 2016. కన్నడలో ‘కిర్రిక్ పార్టీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. అందులో హీరోయిన్ పాత్రకు ఒక ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని నిర్మాతలు అనుకుంటున్న టైమ్‌లో రష్మికను ఒక యాడ్‌లో చూశారు మేకర్స్. ఆడిషన్స్ చేసి, రష్మికను సెలెక్ట్ చేసి, సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించి, అదే ఏడాది చివరికి రిలీజ్ చేశారు. సినిమా పెద్ద హిట్. అందులో హీరోయిన్ రష్మిక అయితే ఒక్కసారే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ‘కర్ణాటక క్రష్’ అన్న పేరు సంపాదించుకునేంతగా యూత్ మనసు దోచేసుకుంది. ఛలో తెలుగు ‘కిర్రిక్ పార్టీ’ సక్సెస్‌తో రష్మికకు తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలైంది. అలా వచ్చిందే నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఛలో’! ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా చిన్న బడ్జెట్ సినిమాల్లో బ్లాక్‌బస్టర్. ఈ సక్సెస్‌తో కన్నడ సినిమాలకు కూడా నో చెప్పేంతగా తెలుగులో బిజీ అయిపోయింది రష్మిక. ప్రస్తుతం ఆమె ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘దేవదాస్’ సినిమాల్లో హీరోయిన్గా కనిపించనుంది. రిలేషన్షిప్ స్టేటస్:ఎంగేజ్డ్ రష్మిక వయస్సు ఇప్పుడు 22 ఏళ్లు. మామూలుగా అయితే హీరోయిన్గా పేరొస్తున్న వాళ్లు పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటారు. రష్మిక ఇవేవీ పట్టించుకోకుండా చిన్న వయసులోనే పెళ్లికి రెడీ అయిపోయింది. ‘కిర్రిక్ పార్టీ’లో తన కో స్టార్ రక్షిత్ శెట్టితో గతేడాది రష్మిక ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. గీత మేడమ్! ‘ఛలో’ సినిమా రిలీజ్ అయి హిట్టయ్యాక రష్మిక పాపులర్ అయితే, ‘గీత గోవిందం’ అనే సినిమా విడుదల కాకముందే ఇందులో ఆమె చేసిన పాత్ర పాపులర్ అయింది. ‘గీతా మేడమ్.. గీతా మేడమ్..’ అని పిలుస్తూ ట్రైలర్లో హంగామా చేస్తోన్న విజయ్‌దేవరకొండ ఈ సినిమాలో హీరో. ఈ సినిమాలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ పాట గత నెల రోజులుగా ఆన్లైన్లో బాగా పాపులర్ అయిన పాట. ఇందులో గీత మేడమ్‌కు.. అదే రష్మికకు.. ఆమె ఫ్యాన్స్ ఇప్పటికే ఫిదా అయిపోయారు. -
త్వరలో సెట్స్ మీదకు ‘భీష్మ’
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు భీష్మ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం పనుల్లో బిజీగా ఉన్న నితిన్ ఈ సినిమాతో త్వరలో ప్రారంభించనున్నాడట. ఇప్పటికే వెంకీ ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఉండటంతో ఆగస్టు మొదటి వారంలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరితో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సింగిల్ ఫర్ ఎవర్ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న శ్రీనివాస కళ్యాణంలో నితిన్ రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తుండగా శతమానంభవతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. -
బాలయ్యని మళ్లీ వాడేస్తున్నాడు!
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే అమ్మమ్మగారిల్లు సినిమాతో మరో డిసెంట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో సొంత బ్యానర్లో మరో సినిమా చేస్తున్నాడు. నాగశౌర్య ఇటీవల భవ్య క్రియేషన్స్ బ్యానర్లో మరో సినిమాను ప్రారంభించాడు. సొంత బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్‌తో నందమూరి బాలకృష్ణ ఓ సినిమాను ప్రారంభించి సౌందర్య మరణంతో మధ్యలో ఆపేశారు. ఇప్పుడు భవ్య క్రియేషన్స్ సినిమాకు కూడా బాలయ్య టైటిల్‌నే ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. నాగశౌర్య లవర్‌బాయ్‌గా కనిపించనున్న ఈ సినిమాకు నారి నారి నడుమ మురారి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. బాలయ్య సూపర్ హిట్ సినిమాల్లో నారి నారి నడుమ మురారి ఒకటి. నాగశౌర్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న కొత్త సినిమాకు ఈ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నాడు. -
భవ్య క్రియేషన్స్‌లో నాగశౌర్య..!
పైసా వసూల్ తరువాత సినిమా కాస్త గ్యాప్ తీసుకున్న భవ్య క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కొత్త సినిమా ప్రారంభించారు. ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్యతో రాజా కొలుసును దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా తెరకెక్కిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో తొమ్మిదవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ రోజు (శనివారం) ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
ఆజన్మ బ్రహ్మచారిగా నితిన్
టాలీవుడ్ లో పెళ్లికాని ప్రసాదులు చాలా మందే ఉన్నారు. ప్రభాస్, రానా దగ్గుబాటి లతో నితిన్ కూడా వయసు పెరుగుతున్న సినిమాలతోనే కాలం గడిపేస్తున్నారు. తాజాగా నితిన్ సింగిల్ ఫర్ఎవర్ అనే స్టేట్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. అయితే ఇది రియల్ లైఫ్‌లో మాత్రం కాదు. రీల్ లైఫ్‌లోనే. ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటిస్తున్న నితిన్ తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పాడు. ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు భీష్మా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు సింగిల్ ఫర్ఎవర్ అనేది ట్యాగ్ లైన్. ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్మా పేరుతో లవ్ స్టోరి తెరకెక్కిస్తుండటంతో భీష్మాపై ఆసక్తి నెలకొంది. -
మెగా బ్యానర్లో యువ దర్శకుడు
ఇటీవల టాలీవుడ్లో ఒక్క సినిమాతో సెన్సేషన్‌గా మారిన దర్శకులు చాలా మందే ఉన్నారు. ఛలో సినిమాతో ఈ జాబితాలో చేరిన దర్శకుడు వెంకీ కుడుముల. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన వెంకీ తొలి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్నాడు. దీంతో పెద్ద బ్యానర్ల నుంచి కూడా వెంకీకి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే నితిన్, సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరోలతో వెంకీ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వెంకీ కుడుముల ఓ బడా బ్యానర్లో సినిమా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. స్టార్ హీరోలతో బిగ్ బడ్జెట్ సినిమాలతో పాటు యంగ్ హీరోలతో మీడియం రేంజ్ సినిమాలను రూపొందిస్తున్న గీతా ఆర్ట్స్ బ్యానర్లో వెంకీ కుడుముల ఓ సినిమా చేయనున్నాడు. సాయి ధరమ్ తేజ్ తో రూపొందించబోయే సినిమా ఇది అన్న టాక్ వినిపిస్తోంది. ఛలో తరువాత వెంకీ తన తదుపరి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఇంతవరకు చేయలేదు. -
మెగా హీరోతో ఛలో డైరెక్టర్
నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఛలో. నాగశౌర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించటంతో బడా నిర్మాణ సంస్థల దృష్టిలో పడ్డాడు వెంకీ. తాజాగా ఈ యువ దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యు సినిమా చేస్తున్న సాయి ధరమ్ తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంతవరకు ప్రకటించలేదు. కిశోర్ తిరుమల, చంద్రశేఖర్ ఏలేటి, గోపిచంద్ మలినేని లాంటి దర్శకులతో చర్చలు జరగుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో వెంకీ కుడుమల కూడా చేరాడు. వీరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాను గీతా ఆర్ట్స్‌లో తెరకెక్కించనున్నారు. -
‘ఛలో’ హీరోతో ‘హలో’ హీరోయిన్..!
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ సాధించిన ఈ యువ కథానాయకుడు తన సొంత నిర్మాణ సంస్థలో మరో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్ నిర్ణయించారు. ఇటీవలే లాంచనంగా షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా మెహరీన్‌ను తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. తరువాత ఆమె స్థానంలో కిరాక్ పార్టీ ఫేం సిమ్రాన్ పరీన్జా పేరు వినిపించింది. తాజాగా మరో అందాల భామ పేరు తెర మీదకు వచ్చింది. అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో సినిమాతో పరిచయం అయిన కళ్యాణీ ప్రియదర్శన్ నర్తనశాల సినిమాలో హీరోయిన్గా నటించనుందట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఇంతవరకు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. -
నాగశౌర్యకు జోడీగా సిమ్రాన్..?
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ సాధించిన ఈ యువ కథానాయకుడు తన సొంత నిర్మాణ సంస్థలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా నిఖిల్ కిరాక్ పార్టీ ఫేం సిమ్రాన్ పరీన్జాను ఫైనల్ చేశారట. హిందీ సీరియల్స్‌తో పాపులర్ అయిన సిమ్రాన్.. కిరాక్ పార్టీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. నాగశౌర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన కణం త్వరలో రిలీజ్ అవుతుండగా మరిన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. -
‘ఛలో’ దర్శకుడి కొత్త సినిమా అప్డేట్
నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఛలో. నాగశౌర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించటంతో బడా నిర్మాణ సంస్థల దృష్టిలో పడ్డాడు వెంకీ. తాజాగా ఈ యువ దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రేమమ్, బాబు బంగారం లాంటి సినిమానలు తెరకెక్కించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమాను నిర్మిస్తోంది. త్వరలో ఇదే బ్యానర్లో సుదీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా మరో సినిమా ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తోంది సితార ఎంటర్టైన్మెంట్స్. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించే అవకాశం ఉంది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - ఛలో
-
సినిమా హిట్.. కారు గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్ : నాగశౌర్య, రష్మిక నటించిన ఛలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రెండు వారాల్లో సుమారు రూ.23.5 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. శాటిలైట్, రీమేక్ హక్కులతో మరో ఆరు కోట్లవరకూ బిజినెస్ చేసి 2018లో బ్లాక్‌బస్టర్‌గా నిలించింది. ఈ సందర్భంగా నిర్మాతలు శంకర్ ప్రసాద్, ఉషా ముల్పూరి సినిమాకు పనిచేసిన 24 రంగాలకు చెందిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ సినిమా ప్రారంభం రోజునే అనుకున్నామని, హిట్ అవగానే సినిమాకు కష్టపడి పని చేసిన వారిని సత్కరించాలని అనుకున్నామని తెలిపారు. సినిమా కోసం కష్టపడి పనిచేసిన వారికి తాము ఇచ్చే చిరుకానుక అని అన్నారు. ఐరా బ్యానర్ ప్రారంభించడానికి కారణమైన వెంకీ కుడుములకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుములకు నిర్మాతలు కారు బహుమతిగా ఇచ్చారు. దర్శకుడు వెంకీ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి సినిమా నిర్మించిన నిర్మాతల రుణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ సినిమా చేసే అవకాశం ఇవ్వడం గిఫ్ట్ అయితే, హిట్ అవడం డబుల్ గిఫ్ట్ అని, ఇక నిర్మాతలు కారు బహుమతిగా ఇవ్వడం జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్‌గా భావిస్తున్నానని తెలిపారు. నాగ శౌర్యలేకపోతే తాను లేనని, తన హీరోను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని అన్నారు. -
ఆ కష్టం ‘ఛలో’తో తెలిసింది – నిర్మాత ఉష
‘‘మేం గతంలో మా ఫ్యామిలీతో సినిమాలు చూసేవాళ్లం. సినిమా తీయాలంటే హీరో, హీరోయిన్, దర్శకుడు ఉంటే చాలనుకునేవాళ్లం. కానీ మా ‘ఐరా క్రియేషన్స్ బ్యానర్’ ప్రారంభించాక ఓ విషయం అర్థమైంది. తెరమీద కనిపించే వారి వెనక వందలాది శ్రామికుల కష్టం ఉంటుందని’’ అన్నారు నిర్మాత ఉష మూల్పూరి. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఆమె నిర్మించిన చిత్రం ‘ఛలో’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయపథంలో దూసుకెళుతోందని ఉష తెలిపారు. ఈ సందర్భంగా ‘ఛలో’ చిత్రానికి పని చేసిన 24 క్రాఫ్ట్స్ వాళ్లని సత్కరించారు. అనంతరం ఉష మాట్లాడుతూ– ‘‘వెంకీ చెప్పిన కథ నచ్చటంతో వెంటనే మేం ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. ఐరా క్రియేషన్స్ మొదలు పెట్టడానికీ, ఇంత మంచి హిట్ సినిమా ఇచ్చిన వెంకీకి కృతజ్ఞతగా కారు గిఫ్ట్‌గా ఇచ్చాం. తను మరిన్ని విజయాలు సాధించాలి’’ అన్నారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘సినిమాకి వెళతానంటే నా తల్లిదండ్రులు డబ్బులిచ్చారు. నాగశౌర్య తల్లిదండ్రులు డబ్బులిచ్చి సినిమా తీసారు. వారి రుణం మరచిపోను. ఈ చిత్రం చేసే అవకాశం ఒక గిఫ్ట్ అయితే.. ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ హిట్ చేయటం డబుల్ గిఫ్ట్... ఇప్పుడు నాకు కారు గిఫ్ట్ ఇవ్వటం జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్‌గా ఫీలవుతున్నా. నాగశౌర్య పరిచయం కాకపోతే నాకు ఈ జీవితం లేదు’’ అన్నారు. శంకర్ ప్రసాద్, నాగశౌర్యలతో పాటు ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. -
‘అమ్మమ్మగారిల్లు’ ఫస్ట్ లుక్
శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్ లో నాగశౌర్య, బేబి షామిలి జంటగా కె.ఆర్ మరియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. ఈ సినిమాకు సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ, ‘తొలిసారి చక్కని కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నా. షూటింగ్ చేస్తున్నంత సేపు సెట్ లో పండగ వాతావారణంలా కోలాహాలంగా ఉంది. కుటుంబ అనుబంధాలు..ఆప్యాయతలు..అనురాగాలు.. అందులో వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలు.. ఆవేదన ఎలా ఉంటుందనేది దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. కథను నమ్మి సినిమా చేశాం. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా ఉంటాయి. క్వాలిటీగా సినిమా చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమాతో నేను మరింత దగ్గరవుతాను` అని అన్నారు. హీరోయిన్ షామిలి మాట్లాడుతూ, ‘‘ఓయ్’ సినిమా తర్వాత సరైన కథ కుదరకపోవడంతోనే మరో సినిమా చేయలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ‘అమ్మమ్మగారిల్లు’ కథ నచ్చడంతో సినిమాకు వెంటనే ఒప్పుకున్నాను. నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. నాగశౌర్య తో సినిమా చేయడం సంతోషంగా ఉంది. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని అన్నారు. దర్శకుడు సుందర్ సూర్య మాట్లాడుతూ, ‘రిలేషన్ నెవెర్ ఎండ్ అనే కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకుని రాసిన కథ ఇది. దర్శకుడిగా నాకిది తొలి సినిమా. తెరపై సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కు థియేటర్ లో ఉన్నామన్నా ఫీలింగ్ కాకుండా పండగ వాతావరణంలో తమ కుటుంబంతో గడుపుతున్న అనుభూతి కలుగుతుంది. నాగశౌర్య అద్భుతంగా నటించాడు. ఎమోషన్ సన్నివేశాల్లో ఒదిగిపోయాడు. మిగతా నటీనటులంతా కూడా తమ పాత్రల ఫరిది మేర అద్భుతంగా నటించారు. ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చి నిర్మాతలు రాజేష్, ఆర్ .కె గారికి కృతజ్ఞతలు’ అని అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, ‘సినిమా బాగా వచ్చింది. దర్శకుడు ప్రతీ సన్నివేశాన్ని హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు. అలాగే నాగశౌర్య నటన సినిమాకు హైలైట్ గా ఉంటుంది. నటనపై ఆయన కమిట్ మెంట్.. డెడికేషన్ చాలా బాగున్నాయి. భవిష్యత్ లో పెద్ద స్టార్ అవుతాడు. మేము సినిమా నిర్మించి ఎంత అనుభూతి పొందామో....సినిమా చూసిన తర్వాత అంతే అనుభూతి ప్రేక్షకులు పొందుతారు’ అని అన్నారు. -
విశాఖలో ఛలో సినిమా సక్సెస్ మీట్
-
గురువారం మార్చి ఒకటి.. అంటున్న నాగశౌర్య
ఛలో సినిమాతో మంచి విజయం అందుకున్న నాగశౌర్య స్పీడు పెంచాడు. ఇప్పటికే ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న కణం షూటింగ్ పూర్తి చేసిన ఈ యంగ్ హీరో మరిన్ని సినిమాలను లైన్లో పెడుతున్నాడు. గతంలో నువ్వు లేక నేను లేను, తొలిచూపులోనే లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కాశీ విశ్వనాథ్ తరువాత నటుడిగా బిజీ అయ్యారు. దాదాపు 15 ఏళ్ల తరువాత నాగశౌర్య సినిమాతో ఆయన తిరిగి మెగాఫోన్ పట్టనున్నారు. ఈ సినిమాకు మహేష్ బాబు సూపర్‌హిట్ సినిమా దూకుడులోని ‘గురువారం మార్చి ఒకటి’ పాట పల్లవిని టైటిల్‌గా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఛలో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ యంగ్ హీరో ఈ నెలాఖరున సాయి శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించనున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నర్తనశాల సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాతే కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో గురువారం మార్చి ఒకటి సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. -
అత్తారింట్లో సరదాగా...
రష్మికా మండన్నా.. లేటెస్ట్ తెలుగు సినిమా సెన్సేషన్. ‘ఛలో’ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత తెలుగు యూత్ అందరి నెక్ట్స్ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయారామె. కానీ ఆవిడ సింగిల్ కాదండోయ్. కన్నడంలో ‘కిరిక్ పార్టీ‘ సినిమా సూపర్ హిట్ అవ్వగానే అందులో హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారీ కన్నడ బ్యూటీ. ఎంగేజ్ అయిన తర్వాత ఎవరి కెరీర్లో వాళ్లు బిజీ అయిపోయారు. వీలున్నప్పుడల్లా రష్మికా, రక్షిత్ శెట్టి కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్నారట. ఈ మధ్యన రక్షిత్ శెట్టి వాళ్ల ఫ్యామిలీ ట్రెడిషన్ అయిన ‘భూత కోల’ అనే ఆటను రష్మికా చూశారట. భూత కోల కూడా మన జాతరలలో అమ్మవారి ముందు చేసే నృత్యం లాంటిదే. తులు మాట్లాడే కన్నడ వాళ్ల సాంప్రదాయం ఈ ‘భూత కోల’. కన్నడంలో ‘భూత’ అంటే ‘స్పిరిట్’ అని ‘కోల’ అంటే ఆట అని అర్ధం. ఈ ట్రిప్ గురించి మాట్లాడుతూ – ‘‘ఇది నా ఫస్ట్ ‘భూత కోల’ ఎక్స్పీరియన్స్. చాలా ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఇంతకు ముందు రక్షిత్ ద్వారా దీని గురించి విన్నాను. ఈ ఆచారాలను ఇంకా ఎంతోమంది ఫాలో అవుతున్నారంటే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ తర్వాత కూడా ‘భూత కోల’ లాంటి మరో సంప్రదాయ నృత్యాన్ని చూశాం. ఈ ట్రిప్ నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. వెంటనే మా పనుల మీద బెంగళూర్ వెళ్లిపోవాల్సి ఉంది. ఉన్న ఆ కొద్ది టైమ్‌లో రక్షిత్ శెట్టి వాళ్ల ఇంట్లో కొద్దిసేపు గడిపాము. వాళ్ల ఫ్యామిలీ, కిడ్స్ అందరితో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాను. నా ఫేవరెట్ ఫిష్ ఫ్రై కుడా సెర్వ్ చేశారు’’ అని కాబోయే అత్తారింటి విశేషాలను పేర్కొన్నారు రష్మికా.