గురువారం మార్చి ఒకటి.. అంటున్న నాగశౌర్య | Naga shourya Next Guruvaram march Okati | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 11 2018 10:56 AM | Last Updated on Sun, Feb 11 2018 11:47 AM

Naga shourya Next Guruvaram march Okati - Sakshi

ఛలో సినిమాతో మంచి విజయం అందుకున్న నాగశౌర్య స్పీడు పెంచాడు. ఇప్పటికే ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న కణం షూటింగ్ పూర్తి చేసిన ఈ యంగ్‌ హీరో మరిన్ని సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. గతంలో నువ్వు లేక నేను లేను, తొలిచూపులోనే లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కాశీ విశ్వనాథ్ తరువాత నటుడిగా బిజీ అయ్యారు. దాదాపు 15 ఏళ్ల తరువాత నాగశౌర్య సినిమాతో ఆయన తిరిగి మెగాఫోన్‌ పట్టనున్నారు. ఈ సినిమాకు మహేష్ బాబు సూపర్‌హిట్ సినిమా దూకుడులోని ‘గురువారం మార్చి ఒకటి’ పాట పల్లవిని టైటిల్‌గా పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం ఛలో సక్సెస్‌ ను ఎంజాయ్ చేస్తున్న ఈ యంగ్ హీరో ఈ నెలాఖరున సాయి శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించనున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి సొంత బ్యానర్‌ ఐరా క్రియేషన్స్ లో శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నర్తనశాల సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాతే కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో గురువారం మార‍్చి ఒకటి సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement