kashi vishwanath
-
కాశీలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న రాశీఖన్నా (ఫొటోలు)
-
వారణాసిలో జ్ఞానవాపీ విశ్వనాథ ఆలయం
గోరఖ్‌పూర్: వారణాసిలోని జ్ఞానవాపీని మసీదు అని పిలుస్తుండడం దురదృష్టకరమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అది మసీదు కాదని చెప్పారు. జ్ఞానవాపీ ప్రాంగణమంతా విశ్వనాథుడి ఆలయమని స్పష్టంచేశారు. ఆ విషయం విశ్వనాథుడే స్వయంగా చెప్పాడని తెలిపారు. శనివారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ యూనివర్సిటీలో ‘సామరస్య సమాజ నిర్మాణంలో నాథ్‌పంత్ పాత్ర’ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. జ్ఞానవాపీని మసీదుగా కొందరు పరిగణిస్తుండడం సరైంది కాదని పేర్కొన్నారు. పురాణాల ప్రకారం చూస్తే ఆది శంకరుడికి, కాశీ విశ్వనాథుడికి మధ్య సంవాదం జరిగిందని తెలిపారు. జ్ఞానవాపీ తన ప్రాంగణమేనని ఆది శంకరుడితో విశ్వనాథుడు చెప్పినట్లు వెల్లడించారు. జ్ఞానవాపీ వ్యవహారంపై హిందువులు, ముస్లింల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
త్వరలో కొడుకు పెళ్లి.. కాశీలో సందడి చేసిన 'నీతా అంబానీ' (ఫొటోలు)
-
మహిళల నేపథ్యంలో...
విశ్వ కార్తికేయ, ఆయుషీ పటేల్ జంటగా దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. కె. చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత కేఎస్ రామారావు క్లాప్ కొట్టారు. డైరెక్టర్ నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సుమన్ స్క్రిప్ట్‌ని అందించారు. ‘‘స్త్రీలకు తల్లవ్వడం అనేది అదృష్టం. ఆ లక్‌ని సరిగ్గా వినియోగించుకోక΄ోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కథ’’ అన్నారు. ‘‘జూలైలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు చంద్ర ఓబుల్ రెడ్డి, రమేష్. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: అజయ్ అరసాడ. -
వ్యూస్ కోసం అలాంటి థంబ్‌నైల్స్ పెట్టడం కరెక్ట్ కాదు
‘‘డిజిటల్ టెక్నాలజీ పెరగడంతో తంబ్‌నైల్స్, పైరసీ సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆరోపణలు వచ్చినప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. అంతేకానీ కొందరు లైక్‌లు, వ్యూయర్స్ కోసం నిర్మాతలు, నటులు, దర్శకులపై తంబ్‌నైల్స్ పెట్టి ఇబ్బంది పెట్టడం తగదు. యూట్యూబ్ తంబ్‌నైల్స్, పైరసీ చేసేవారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో చర్చిస్తాం.. పైరసీ సెల్‌ను యాక్టివ్ చేస్తాం’’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినీ ఇండస్ట్రీవారిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, పైరసీ వంటి విషయాలపై చర్చించేందుకు 24క్రాఫ్ట్స్ అధక్షులు, సెక్రటరీలు నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గురువారం సమావేశమయ్యారు. నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ– ‘‘ఓటీటీలపైనా సెన్సార్ ఉండాలి. ఓటీటీలో సినిమా వచ్చిన రోజు సాయంత్రానికల్లా సినిమా పైరసీ అవుతోంది. ఫిలిం చాంబర్ యాంటీ పైరసీ విభాగం డబ్బున్న వాళ్లకే పని చేస్తోంది.. పైరసీని అరికట్టడంలో ఫిలిం చాంబర్ పాత్ర శూన్యం’’ అన్నారు. ‘‘యూట్యూబ్‌కి కూడా సెన్సార్ విధానం తీసుకురావాలి’’ అని డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ అన్నారు. ‘‘మా కుటుంబంపై వచ్చే అసత్య వార్తల వల్ల 25ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాను. మా కష్టాలను అర్థం చేసుకోండి’’ అని నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ అన్నారు. ‘‘సోషల్ మీడియాలో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఉండదు.. వారికి ఇష్టమైంది రాసుకుంటున్నారు.. దీన్ని అరికట్టాలి’’ అన్నారు దర్శకుడు ఎన్. శంకర్. -
IPL 2022: ధోని అనూహ్య నిర్ణయం.. అతడు ఆడాలనే మేం కోరుకుంటున్నాం.. అయితే: సీఎస్కే
చెన్నై సూపర్‌కింగ్స్‌లో కెప్టెన్‌గా ఎంఎస్ ధోని శకం ముగిసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇన్నేళ్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా తొలిసారి నాయకుడిగా సీఎస్కేను ముందుకు నడిపించనున్నాడు. జట్టులో సభ్యుడిగానే ఉంటూ ఎంఎస్ ధోని మార్గనిర్దేశనం చేయనున్నాడు. చెన్నై: 213 మ్యాచ్‌లలో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం...130 మ్యాచ్‌లలో విజయాలు, 81 పరాజయాలు...4 సార్లు ఐపీఎల్ చాంపియన్...2 సార్లు చాంపియన్స్ ట్రోఫీ విజేత... కెప్టెన్‌గా ఎమ్మెస్ ధోని ఘనమైన రికార్డు ఇది. దీనికి ముగింపు పలుకుతూ ఎమ్మెస్ ధోని కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కే కెప్టెన్సీనుంచి అతను తప్పుకున్నాడు. ధోని స్థానంలో మరో సీనియర్ రవీంద్ర జడేజాను చెన్నై యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది. ధోని, రైనా (5 మ్యాచ్‌లు) తర్వాత చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహరించనున్న మూడో ఆటగాడు జడేజా. ‘2012నుంచి జడేజా మా జట్టులో అంతర్భాగం. అతను తన కెరీర్లో ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నాడు. అతనికి కెప్టెన్సీ ఇచ్చేందుకు సరైన సమయమిది. ఆటగాడిగా ధోని టీమ్‌లోనే ఉంటాడు. ధోని ఏం చేసినా జట్టు గురించే ఆలోచిస్తాడు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎలాగూ అతను మాకు అండగా ఉంటాడు. ఫిట్‌గా ఉన్నంత కాలం ధోని ఆడాలనే మేం కోరుకుంటున్నాం’ అని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. -(సాక్షి క్రీడా విభాగం) చదవండి: Womes WC 2022: 'జప్ఫా' బంతితో మెరిసిన బౌలర్.. వీడియో వైరల్ There’s nothing that could have prepared us for this! Let the Bigils take over! 🧊➡️🔥#Superfam #WhistlePodu 🦁💛 @msdhoni @imjadeja pic.twitter.com/sfu9xyclWw — Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022 -
సొంతూర్లో సంక్రాంతి.. ఆ కిక్కే వేరబ్బా ..!
సీతానగరం(తూర్పుగోదావరి): సంక్రాంతి పండగను సొంతూర్లో జరుపుకుంటే ఆ కిక్కే వేరబ్బా.. అని మండలంలోని పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన దర్శకుడు, నటుడు, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి సొంతూరు రాలేకపోవడం వెలితిగానే ఉందని ఆయనన్నారు. ‘సాక్షి’తో ఫోన్లో ఆయన మాట్లాడుతూ షూటింగ్లో బిజిగా ఉండడం వల్లే సొంతూరు రాలేకపోయానన్నారు. హైదరాబాద్‌లోని తన చిన్న కుమార్తె, అల్లుడు, తన భార్యతో సంక్రాంతి పండగ జరుపుకొన్నామన్నారు. చదవండి: 'హీరో' సినిమాకు నిధి రెమ్యునరేషన్ ఎంతంటే? సింగవరం సర్పంచ్ సంగన పోశియ్య పంపించిన భోగి పిడకలతో హైదరాబాద్‌లో భోగిమంట వేశామని చెప్పారు. తాను తొలి దర్శకత్వం వహించిన ‘నువ్వు లేక నేను లేను’ చిత్రం ఈనెల 14వ తేదీతో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్నామన్నారు. ప్రస్తుతం తాను కృష్ణవంశీ దర్శకత్వంలో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రంగ మార్తండతో పాటు చోరీ బజార్, రీసౌండ్, పోస్టల్, కిస్మత్, కల్యాణమస్తు అనే చిత్రాల్లో నటిస్తున్నానని తెలిపారు. -
కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
దర్శకుల సంఘం అధ్యక్షుడిగా కాశీ విశ్వనాథ్
తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం నూతన అధ్యక్షునిగా దర్శకుడు– రచయిత – నటుడు యనమదల కాశీ విశ్వనాథ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో నవంబర్ 14న (ఆదివారం) జరిగిన ఎన్నికల్లో కాశీ విశ్వనాథ్ ప్యానల్ జయకేతనం ఎగురవేసింది. సముద్ర, చంద్రమహేశ్ ప్యానల్స్ నుంచి ఇద్దరు చొప్పున ఈ ఎన్నికల్లో గెలుపొందారు. అధ్యక్షునిగా కాశీ విశ్వనాథ్, ప్రధాన కార్శదర్శిగా వీఎన్ ఆదిత్య, కోశాధికారిగా భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మేర్లపాక గాంధీ, జీ.ఎస్.రావు, సంయుక్త కార్యదర్శులుగా కృష్ణమోహన్ అనుమోలు, పెండ్యాల రామారావు, కార్యనిర్వహణ కార్యదర్శులుగా కొల్లి రాంగోపాల్, దొండపాటి వంశీ కృష్ణ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా గుంటూరు అంజిబాబు, అల్లాభ„Š , పీవీ రమేశ్ రెడ్డి, కాటూరి రాఘవ, ఇ. ప్రేమ్ రాజ్, నీలం సాయిరాజేశ్, ఎం. సాయి సురేంద్ర బాబు, కూరపాటి రామారావు ఎన్నికయ్యారు. మహిళల రిజర్వేషన్ కోటాలో సౌజన్య, ప్రవీణలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. -
గో కార్ట్ నిర్మాణాలను కూల్చేసిన జీవీఎంసీ అధికారులు
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ అధికారులు మంగమారి పేట వద్ద స్వాధీనం చేసుకున్న గో కార్ట్ ప్రదేశం అక్రమాలకు.. ఆక్రమణలకు కేరాఫ్‌గా చెప్పుకోవచ్చు. విశాఖ భీమిలి బీచ్ రోడ్లో ఉన్న గో కార్ట్ చిన్నారులు నుంచి యువత వరకు కార్.. గో కార్ట్ పోటీలు నిర్వహిస్తుంటారు. పదినిమిషాల రేస్‌కు 300 నుంచి వసూలు చేసేవారు. ఈ దశలో సముద్రతీరానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. నిజానికి వుడా పరిధిలో ఉన్న గో కార్ట్ గ్రూప్ నిర్మాణాలకు సంబంధించి జీవీఎంసీ అనుమతులు తీసుకోవాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే ఏళ్ళతరబడి కార్ట్ పోటీలు నిర్వహించడమే కాక అక్కడ రెస్టారెంట్ కూడా కొనసాగిస్తున్నారు. సర్వేనెంబర్ 299, 301 పరిధిలోని దాదాపు నాలుగు ఎకరాల 48 సెంట్ల భూమిలో అక్రమ వ్యవహారం కొనసాగుతున్నట్టు గతంలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ దశలో జీవీఎంసీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించారు. గేమ్ ఆడేందుకు వచ్చిన పర్యాటకుల కోసం అనధికారికంగా కొనసాగిస్తున్న టీ రెస్టారెంట్‌ను కూడా తొలగించారు. ఇదే రీతిన అనధికారిక నిర్మాణాలు అన్నిటినీ తొలగిస్తామని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్డీసీపీ అధికారి వెల్లడించారు. (ఆయన దారి.. జాతీయ రహదారి) కాగా.. గో కార్ట్ నిర్వాహకుడు కాశీవిశ్వనాథ్ వ్యవహారాలపై చాలా ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడిగా పలు అనధికారిక వ్యవహారాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అందులో భాగంగా గో కార్ట్‌తో పాటు రుషికొండ వద్ద టూరిజం ప్రదేశంలో రేవ్ పార్టీ నిర్వహించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ మేరకు రుషికొండ వద్ద జరిగిన ఓ పార్టీలో మద్యం సేవించిన వ్యవహారంపై 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో గో కార్ట్ నిర్వాహకులు కాశీ విశ్వనాథ్ తనయుడు కూడా ఉన్నాడు. ఆ పార్టీ సమయంలో డ్రగ్స్ కూడా వినియోగించిన వ్యవహారంపై ఆరీలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా ఉండగా గో కార్ట్ ప్రదేశంలో కూడా బెట్టింగ్‌లు జరిగినట్టు చాలా వరకూ ఆరోపణలున్నాయి ఈ దశలో ఈ నిర్మాణం తొలగించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
స్కామ్ ఆధారంగా...
చెంగ్, మైరా అమితి జంటగా విఘ్నేష్ కలగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓన్లీ నేను’. శ్రీనివాస్ శరకడం నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన దర్శకుడు, నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘ఓన్లీ నేను’ ట్రైలర్ బావుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ హైలైట్. శ్రీనివాస్‌గారు ఈ నెల 15న చేపట్టబోతున్న ‘ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్’ కొత్త డైరెక్టర్స్, కొత్త నిర్మాతలకు మంచి వేదిక అవుతుంది’’ అన్నారు. ‘‘ఔత్సాహికులు తమ ప్రతిభని నిరూపించుకోవడానికి ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్’ కార్యక్రమం ఓ మంచి ప్లాట్‌ఫామ్’’ అన్నారు తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ మామిడి హరికృష్ణ. ‘‘ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఔత్సాహిక దర్శకుల టీజర్స్, కాన్సెప్ట్‌లను ప్రదర్శిస్తాం. ఆడిషన్స్ ద్వారా నటీనటులు యాక్టింగ్ స్కిల్స్ చూపించుకోవచ్చు’’ అన్నారు శ్రీనివాస్ శరకడం. ‘‘ఒక స్కామ్ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాం. షూటింగ్ చివరి దశలో ఉంది. వేసవిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు విఘ్నేష్. -
గురువారం మార్చి ఒకటి.. అంటున్న నాగశౌర్య
ఛలో సినిమాతో మంచి విజయం అందుకున్న నాగశౌర్య స్పీడు పెంచాడు. ఇప్పటికే ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న కణం షూటింగ్ పూర్తి చేసిన ఈ యంగ్ హీరో మరిన్ని సినిమాలను లైన్లో పెడుతున్నాడు. గతంలో నువ్వు లేక నేను లేను, తొలిచూపులోనే లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కాశీ విశ్వనాథ్ తరువాత నటుడిగా బిజీ అయ్యారు. దాదాపు 15 ఏళ్ల తరువాత నాగశౌర్య సినిమాతో ఆయన తిరిగి మెగాఫోన్ పట్టనున్నారు. ఈ సినిమాకు మహేష్ బాబు సూపర్‌హిట్ సినిమా దూకుడులోని ‘గురువారం మార్చి ఒకటి’ పాట పల్లవిని టైటిల్‌గా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఛలో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ యంగ్ హీరో ఈ నెలాఖరున సాయి శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించనున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నర్తనశాల సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాతే కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో గురువారం మార్చి ఒకటి సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. -
200మంది.. రెండున్నరేళ్ల కష్టం
‘‘ఒక సినిమా చేయాలంటే 4 స్తంభాల్లాంటి వారి సపోర్ట్ కావాలి. ఆ నాలుగు స్తంభాలు నాకు ఉండటంతో ‘వానవిల్లు’ సినిమా చేయగలిగా. 200 మంది రెండున్నరేళ్ల కష్టమే ఈ సినిమా. ఈ నెలలోనే విడుదల చేయనున్నాం’’ అని లంకా ప్రతీక్‌ప్రేమ్ కరణ్ అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘వానవిల్లు’. శ్రావ్యా రావు, విశాఖ హీరోయిన్స్. లంకా కరుణాకర్ దాస్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని నటుడు కాశీ విశ్వనాథ్ రిలీజ్ చేశారు. కరుణాకర్ దాస్ మాట్లాడుతూ– ‘‘ఎన్‌హెచ్ 7’ సినిమా తర్వాత నా తనయుడు ప్రతీక్ చేసిన చిత్రమిది. సమాజానికి ఉపయోగపడేలా ఒక సినిమా చేయాలనుకొని ఈ చిత్రం చేశాం. ఫ్యామిలీ, యూత్, సమాజానికి ఏం కావాలో అన్ని అంశాలు మా సినిమాలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘తమిళ దర్శకుడు సుందర్ రాజేంద్రన్ క్వాలిటీస్ ప్రతీక్‌లో కనిపిస్తున్నాయి. చాలా క్లారిటీగా సీన్స్ తీశాడు. టైటిల్లో క్లాస్, ట్రైలర్లో మాస్ కనిపిస్తోంది’’ అన్నారు కాశీ విశ్వనాథ్. చిత్ర సంగీతదర్శకుడు ప్రభు, డైరెక్టర్ చిన్నికృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, నటి అనితా చౌదరి పాల్గొన్నారు. -
ఏడేళ్లు... వంద సినిమాలు
నటులు దర్శకులు కావడం కామన్. కానీ, దర్శకుడు పూర్తి స్థాయి నటుడు కావడం విశేషంగా చెప్పుకోవాలి. ‘నువ్వులేక నేను లేను’, ‘తొలి చూపులోనే’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వై.కాశీ విశ్వనాథ్ ‘నచ్చావులే’ చిత్రంతో నటుడిగా మారారు. అప్పటి నుంచి పలు పాత్రల్లో నటించిన ఆయన తాజాగా చేస్తున్న ‘వైశాఖం’తో వంద చిత్రాలు పూర్తి చేసుకున్నారు. హరీష్, అవంతిక జంటగా జయ బి. దర్శకత్వంలో ఆర్జే సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించారు విశ్వనాథ్. ఆయన మాట్లాడుతూ- ‘‘నటునిగా తొలి అవకాశం ఇచ్చిన రవిబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆరేడేళ్లలో నేను వంద చిత్రాలు చేశానంటే ఆ క్రెడిట్ దర్శకులు, నిర్మాతలు, రచయితలకు దక్కుతుంది. వారు అవకాశం ఇవ్వబట్టే ఇన్ని చిత్రాల్లో నటించగలిగాను. సీరియల్స్‌లో చేయమని అడిగారు, కానీ అందుకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం చేస్తున్న ‘వైశాఖం’లో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నా గెటప్, మేనరిజమ్స్ కొత్తగా ఉంటాయి. హీరోతో ఎక్కువ సన్నివేశాలుంటాయి. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఇది నా నూరవ సినిమా కావడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. -
అవి సజీవ పాత్రలు
సినీ రచయిత కాశీ విశ్వనాథ్ గురజాడ గిరీశం, చిలకమర్తి గణపతి, మునిమాణిక్యం బారిష్టరు పార్వతీశం..ఇలాంటి కొన్ని హాస్య పాత్రలు తెలుగు సాహిత్యంలో చిరంజీవులు. అలాగే మన సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు ఎప్పటికీ సజీవాలే. ఇలాంటి ఎన్నో అద్భుత హాస్య పాత్రలు ఆయా రచయితల ఆలోచనా మథనంలోంచి పుట్టినవే. నిజానికి ఆలాంటి క్యారక్టర్స్ మన మధ్య మసిలే మనుషుల నుంచి సృష్టించినవే. చేయి తిరిగిన సీనియర్ సినిమా రచయిత కాశీ విశ్వనాథ్ కూడా ఎన్నో చక్కని పాత్రలను వెండితెరపై పండించి నేటికీ వాటి గురించి స్మరించుకునేలా చేసిన ప్రతిభావంతుడు. ఆయన సృష్టించిన ప్రసిద్ధ క్యారక్టర్ల పుట్టుపూర్వోత్తరాలు ఆయన మాటల్లోనే.. ..:: శ్రీనివాసరావు కిలారి ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది..’ అంటూ నూతన్ ప్రసాద్ తనదైన అద్భుతమైన మాడ్యులేషన్‌తో పలికే డైలాగ్ ఇప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకులు మరచిపోలేరు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమాలో నూతన ప్రసాద్ పోషించిన ఇన్స్పెక్టర్ పాత్ర పలికే ఆ సంభాషణలు ఇప్పటికీ మన చెవుల్లో మార్మోగుతూ ఉంటాయి. అదే సినిమాలో రావుగోపాలరావు పోషించిన మాలిష్ పాత్ర కూడా అలాంటిదే. ఆ పాత్ర ప్రవర్తన గురించి ఇప్పటికి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. ఆ సినిమా విజయంలో వీరి పాత్రల ద్వారా పండిన హాస్యం చాలా ముఖ్యపాత్ర వహించింది. ఆ పాత్రల పరిచయం గురించి చెప్పాలంటే దాని వెనుక ఉన్న కథ గురించి చెప్పుకోవాలి. అప్పటికి విజయ బాపినీడు నిర్మాణంలో చిత్రం స్క్రిప్టు వర్క్ మొత్తం పూర్తయింది. అయితే ఇంకా కథలో ఏదో కొద్దిగా వెలితి కనిపించడంతో అప్పటికే నేను నాటకాల్లో భాగంగా సృష్టించింది ఇన్స్పెక్టర్. అప్పుడు నేను వర్క్ చేసే ఆఫీస్‌లో ఓ గుమస్తా ఉండేవాడు. ఆఫీస్ వర్క్ మొత్తం తానే చేస్తున్నాననే ఫీల్ అవుతూ.. ఎవరైనా మాట్లాడించేందుకు ప్రయత్నిస్తే ఆఫీస్ వర్క్ సార్ ఈ సమయంలో మాట్లాడటం కుదరదనేవాడు. ఆఫీస్ పని మొత్తం తనే చేస్తున్నానే ఫీలింగ్ అతనిలో కనిపించేది. అతన్ని స్పూర్తిగా తీసుకుని దానిని ఇన్స్పెక్టర్ పాత్రకు ఆపాదించాను. అలాగే రావుగోపాలరావు చేసిన మాలిష్ పాత్ర కూడా నాకు తారసపడిన ఒక వ్యక్తి ధోరణి నుంచి తీసుకున్నదే. నేను రాజమండ్రి వెళ్లినప్పుడు అక్కడ నాకో మాలిష్ ఎదురయ్యాడు. ఎంత సేపు పొగుడుతూనే ఉన్నాడు. అతని మాటలు వింటే ఎలాంటి వారైనా ముగ్ధులైపోవాల్సిందే..అలాంటి వ్యక్తి తాగిన తర్వాత ఎలా మాట్లాడుతాడో ఊహించుకుని అతని పాత్ర తయారు చేసుకున్నా.. దానిని రావుగోపాలరావు పోషించారు. ఈ పాత్రల గురించి చెప్పిన తర్వాత విజయ బాపినీడు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి కథలో భాగంగా పెట్టడంతో ఆ పాత్రలు అనుకున్నట్లే మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆ పాత్రలకు ప్రాణం.. నటుల గొప్పతనం.. నటన అంటే ఏదో సెట్లోకి వచ్చి డెరైక్టర్ ఇచ్చిన స్క్రిప్టు తీసుకుని టేకుల మీదు టేకులు తీసుకొని చెప్పడం కాదు. దానిలో చాలా గొప్పతనం ఉంది. అలాంటి గొప్పతనం అప్పటి నటులకే సాధ్యం. ఎందుకంటే అప్పుడు చాలా మంది రంగస్థలం నుంచి వచ్చివారే కావడం వలన పాత్ర తాము అనుకున్న దానికంటే గొప్పగా వచ్చేంత వరకు అసలు విశ్రమించే వారు కాదు. పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర గురించి నూతన్ ప్రసాద్‌తో చెప్పే సమయంలో ఆయన నేరుగా మా ఇంటికి వచ్చారు. ఆయన బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్లు పాత్రను నటించి చూపిస్తే దానిని మూడు రోజుల పాటు ప్రాక్టీస్ చేసి ఆయన నేర్చుకొచ్చి మరల చేసి చూపించారు. రావుగోపాలరావు పోషించిన మాలిష్ పాత్ర గురించి ఆయన నన్ను ఇంటికి పిలిపించుకొని ప్రాక్టీస్ చేశారు. అలా రెండు పాత్రలు పూర్తిగా న్యాయం చేస్తామని అనుకున్న తర్వాత వాటి షూటింగ్ మొదలుపెట్టారు. షూటింగ్ సమయంలో కూడా నన్ను పక్కనే ఉంచుకుని నేను అనుకున్న విధంగా వచ్చిందో రాలేదో అడిగి, రాకుంటే మరోసారి చేస్తామని చెప్పి మరి చేసేవారు. అది అప్పటి నటుల్లో ఉండే డెడికేషన్. నూతన్ ప్రసాద్ కోసం క్రియేట్ చేసిన ఆ ఇన్స్పెక్టర్ పాత్రను 11 సినిమాల్లో సీక్వెల్‌గా కొనసాగించి, చిన్న చిన్న మార్పులు చేసి నవ్వించడం అంటే మామూలు విషయం కాదు.