
విశ్వ కార్తికేయ, ఆయుషీ పటేల్ జంటగా దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. కె. చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత కేఎస్ రామారావు క్లాప్ కొట్టారు. డైరెక్టర్ నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సుమన్ స్క్రిప్ట్‌ని అందించారు.
‘‘స్త్రీలకు తల్లవ్వడం అనేది అదృష్టం. ఆ లక్‌ని సరిగ్గా వినియోగించుకోక΄ోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కథ’’ అన్నారు. ‘‘జూలైలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు చంద్ర ఓబుల్ రెడ్డి, రమేష్. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: అజయ్ అరసాడ.
Comments
Please login to add a commentAdd a comment