
చెన్నై సూపర్‌కింగ్స్‌లో కెప్టెన్‌గా ఎంఎస్ ధోని శకం ముగిసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇన్నేళ్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా తొలిసారి నాయకుడిగా సీఎస్‌కేను ముందుకు నడిపించనున్నాడు. జట్టులో సభ్యుడిగానే ఉంటూ ఎంఎస్ ధోని మార్గనిర్దేశనం చేయనున్నాడు.
చెన్నై: 213 మ్యాచ్‌లలో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం...130 మ్యాచ్‌లలో విజయాలు, 81 పరాజయాలు...4 సార్లు ఐపీఎల్ చాంపియన్...2 సార్లు చాంపియన్స్ ట్రోఫీ విజేత... కెప్టెన్‌గా ఎమ్మెస్ ధోని ఘనమైన రికార్డు ఇది. దీనికి ముగింపు పలుకుతూ ఎమ్మెస్ ధోని కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే కెప్టెన్సీనుంచి అతను తప్పుకున్నాడు. ధోని స్థానంలో మరో సీనియర్ రవీంద్ర జడేజాను చెన్నై యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది.
ధోని, రైనా (5 మ్యాచ్‌లు) తర్వాత చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహరించనున్న మూడో ఆటగాడు జడేజా. ‘2012నుంచి జడేజా మా జట్టులో అంతర్భాగం. అతను తన కెరీర్‌లో ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నాడు. అతనికి కెప్టెన్సీ ఇచ్చేందుకు సరైన సమయమిది. ఆటగాడిగా ధోని టీమ్‌లోనే ఉంటాడు. ధోని ఏం చేసినా జట్టు గురించే ఆలోచిస్తాడు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎలాగూ అతను మాకు అండగా ఉంటాడు. ఫిట్‌గా ఉన్నంత కాలం ధోని ఆడాలనే మేం కోరుకుంటున్నాం’ అని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. -(సాక్షి క్రీడా విభాగం)
చదవండి: Womes WC 2022: 'జప్ఫా' బంతితో మెరిసిన బౌలర్.. వీడియో వైరల్
There’s nothing that could have prepared us for this! Let the Bigils take over! 🧊➡️🔥#Superfam #WhistlePodu 🦁💛 @msdhoni @imjadeja pic.twitter.com/sfu9xyclWw
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022
Comments
Please login to add a commentAdd a comment