IPL 2022: ఫీల్డ్‌ సెట్‌ చేసిన ధోని.. వైరల్‌ | MS Dhoni sets field for CSK even after leaving captaincy in almost every over | Sakshi
Sakshi News home page

IPL 2022: ఫీల్డ్‌ సెట్‌ చేసిన ధోని.. వైరల్‌

Published Fri, Apr 1 2022 11:15 AM | Last Updated on Fri, Apr 1 2022 11:25 AM

MS Dhoni sets field for CSK even after leaving captaincy in almost every over - Sakshi

Courtesy: IPL Twitter/BCCI

చెన్నైసూపర్‌ కింగ్స్‌ కెప్టెన్సీ నుంచి ఎంఎస్‌ ధోని తప్పుకున్నప్పటికీ ఫీల్డ్‌లో తన వ్యూహాలను అమలు చేస్తూనే ఉన్నాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా గురువారం( మార్చి 31)  లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని.. ప్రతీ ఓవర్‌కు ఫీల్డ్‌ను మారుస్తూ కనిపించడం విశేషం. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లోను కీలక మార్పులు చేశాడు. ఇందుకు సం‍బంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్‌-2022 ఆరంభానికి ముందు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే.

అతడి స్ధానంలో రవీంద్ర జడేజా చెన్నై కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో ధోని బ్యాట్‌తో దుమ్ముదులిపాడు. ​కేవలం 6 బంతుల్లో 16 పరుగులు సాధించి అద్భుతమైన ఫినిషింగ్‌ ఇచ్చాడు. అయితే, చెన్నై ఓటమి మాత్రం తప్పలేదు. మ్యాచ్‌ విషయానికి వస్తే.. చెన్నైసూపర్‌ కింగ్స్‌పై లక్నో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో ఊతప్ప 50, శివమ్‌ దూబే 49, మొయిన్‌ అలీ 35 పరుగులతో రాణించారు. అనంతరం 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  సూపర్‌ జెయింట్స్‌ నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో డికాక్‌ (61) కేఎల్‌ రాహుల్‌ (40) లూయిస్‌(55) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు.

చదవండిIPL 2022: భారీ సిక్సర్‌ బాదిన సీఎస్కే బ్యాటర్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement