IPL 2022: జడేజాకు ఎలాంటి నాయకత్వ అనుభవం లేదు.. మరి ఎలా? | IPL 2022: CSK Fans Big Question On Ravindra Jadeja Leadership Skills Captain | Sakshi
Sakshi News home page

IPL 2022- Ravindra Jadeja: జడేజాకు ఎలాంటి నాయకత్వ అనుభవం లేదు.. మరి ఎలా?

Published Fri, Mar 25 2022 10:43 AM | Last Updated on Fri, Mar 25 2022 10:55 AM

IPL 2022: CSK Fans Big Question On Ravindra Jadeja Leadership Skills Captain - Sakshi

IPL 2022- CSK New Captain Ravindra Jadeja: చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌, పెద్దన్నగా వ్యవహరించిన ఎంఎస్‌ ధోని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. తన స్థానంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, సీఎస్‌కే సీనియర్‌ ప్లేయర్‌ రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించాడు. చెన్నైని విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దిన తలైవా వారసత్వాన్ని జడ్డూ కొనసాగించగలడా అన్నది అభిమానుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. అయితే, ధోని సారథిగా తప్పుకొన్నా ఆటగాడిగా కొనసాగడం ఇక్కడ సానుకూలాంశం.

జడేజా చుట్టూ జట్టును నిర్మించి.. అతడికి అండగా తలైవా ఉంటాడనడంలో సందేహం లేదు. జడ్డూ పూర్తిస్థాయి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టినా.. ధోని మార్గనిర్దేశనంలోనే సీఎస్‌కే ముందుకు వెళ్తుందనడంలో  అతిశయోక్తి లేదు. సీఎస్‌కే కొత్త కెప్టెన్‌ జడేజా కూడా ఇదే మాట అన్నాడు. కెప్టెన్సీ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదని, జట్టులో పెద్దన్న పాత్ర పోషించే ధోని సలహాలను తాను ఉపయోగించుకుంటానని స్పష్టం చేశాడు. ఏదేమైనా ఐపీఎల్‌-2022 ఆరంభానికి రెండు రోజుల ముందు ధోని ఇచ్చిన షాక్‌ నుంచి అభిమానులు ఇంకా తేరుకోలేకపోతున్నారు.

కెప్టెన్‌గా తొలిసారి జడేజా... 
2007లో భారత అండర్‌–19 జట్టు కెప్టెన్‌గా వ్యవహరించడం తప్ప సీనియర్‌ స్థాయిలో జడేజాకు ఎలాంటి నాయకత్వ అనుభవం లేదు. అయితే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా అతను సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా గత రెండేళ్లుగా జడేజా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.

2020, 2021 ఐపీఎల్‌లలో ‘ఫినిషర్‌’గా అతను జట్టును గెలిపించాడు. 30 మ్యాచ్‌లలో 57.37 సగటు, 157.73 స్ట్రైక్‌రేట్‌తో అతను 459 పరుగులు చేశాడు. 7.78 సగటుతో తీసిన 19 వికెట్లతో పాటు అద్భుత ఫీల్డింగ్‌ ప్రదర్శన దీనికి అదనం. ధోని సారథ్యంలో చెన్నైకి 131 మ్యాచ్‌లలో ఆడిన అనుభవం జడేజాకు ఉపయోగపడనుంది.

చదవండి: World Cup 2022: సెమీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్‌ చేరాలంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement