త్వరలో కొడుకు పెళ్లి.. కాశీలో సందడి చేసిన 'నీతా అంబానీ' (ఫొటోలు) | Nita Ambani Visits Kashi Vishwanath Temple, Offers First Wedding Invitation Of Anant Ambani-Radhika Merchant Photos | Sakshi
Sakshi News home page

త్వరలో కొడుకు పెళ్లి.. కాశీలో సందడి చేసిన 'నీతా అంబానీ' (ఫొటోలు)

Published Tue, Jun 25 2024 7:07 PM | Last Updated on

Nita Ambani Visit Kashi Vishwanath Temple Viral Photos1
1/11

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ సోమవారం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు.

Nita Ambani Visit Kashi Vishwanath Temple Viral Photos2
2/11

జులై 12న జరగబోయే తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ ఆహ్వాన పత్రికను స్వామివారి ముందుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Nita Ambani Visit Kashi Vishwanath Temple Viral Photos3
3/11

అనంతరం దేవాలయం ముందున్న దుకాణంలో చాట్‌ తింటూ స్థానికులతో కాసేపు ముచ్చటించారు.

Nita Ambani Visit Kashi Vishwanath Temple Viral Photos4
4/11

రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్ల ప్రివెడ్డింగ్‌ వేడుకలను ఇప్పటికే ఘనంగా నిర్వహించారు.

Nita Ambani Visit Kashi Vishwanath Temple Viral Photos5
5/11

మొదటిసారి వేడుకలను జామ్‌నగర్‌లో జరిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ వేడుకలో అలరించారు.

Nita Ambani Visit Kashi Vishwanath Temple Viral Photos6
6/11

ఇటీవల రెండోసారి ఏకంగా సముద్రంలో దాదాపు 4000 కిలోమీటర్లు క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు.

Nita Ambani Visit Kashi Vishwanath Temple Viral Photos7
7/11

జులై 12న వివాహ ముహుర్తం నిర్ణయించడంతో ప్రముఖులను ఆహ్వానించాల్సి ఉంటుంది.

Nita Ambani Visit Kashi Vishwanath Temple Viral Photos8
8/11

దానికంటే ముందు నీతా అంబానీ తన ఇష్టదైవమైన కాశీ విశ్వనాథున్ని దర్శించుకుని కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను స్వామివారి చెంత ఉంచేందుకు సోమవారం వారణాసి చేరుకున్నారు.

Nita Ambani Visit Kashi Vishwanath Temple Viral Photos9
9/11

స్వామివారికి మొక్కులు చెల్లించిన అనంతరం దేవాలయం ముందు ఉన్న చాట్‌ దుకాణంలో చాట్‌ తింటూ ఆడంబరాలు లేకుండా స్థానికులతో కాసేపు ముచ్చటించారు.

Nita Ambani Visit Kashi Vishwanath Temple Viral Photos10
10/11

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘కాశీ విశ్వనాథుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ నావెంట ఉంటాయి.

Nita Ambani Visit Kashi Vishwanath Temple Viral Photos11
11/11

అనంత్-రాధికల వివాహ ఆహ్వాన పత్రికను పరమశివుడికి సమర్పించి స్వామివారి దీవెనలు కోరేందుకు వచ్చాను. పదేళ్ల తర్వాత స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది’ అన్నారు. ఈ మేరకు తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement