
కుటుంబ సభ్యులతో ‘నువ్వులేక నేనులేను’ చిత్రం 20 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న కాశీ విశ్వనాథ్
సీతానగరం(తూర్పుగోదావరి): సంక్రాంతి పండగను సొంతూర్లో జరుపుకుంటే ఆ కిక్కే వేరబ్బా.. అని మండలంలోని పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన దర్శకుడు, నటుడు, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి సొంతూరు రాలేకపోవడం వెలితిగానే ఉందని ఆయనన్నారు. ‘సాక్షి’తో ఫోన్‌లో ఆయన మాట్లాడుతూ షూటింగ్‌లో బిజిగా ఉండడం వల్లే సొంతూరు రాలేకపోయానన్నారు. హైదరాబాద్‌లోని తన చిన్న కుమార్తె, అల్లుడు, తన భార్యతో సంక్రాంతి పండగ జరుపుకొన్నామన్నారు.
చదవండి: 'హీరో' సినిమాకు నిధి రెమ్యునరేషన్ ఎంతంటే?
సింగవరం సర్పంచ్ సంగన పోశియ్య పంపించిన భోగి పిడకలతో హైదరాబాద్‌లో భోగిమంట వేశామని చెప్పారు. తాను తొలి దర్శకత్వం వహించిన ‘నువ్వు లేక నేను లేను’ చిత్రం ఈనెల 14వ తేదీతో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్నామన్నారు. ప్రస్తుతం తాను కృష్ణవంశీ దర్శకత్వంలో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రంగ మార్తండతో పాటు చోరీ బజార్, రీసౌండ్, పోస్టల్, కిస్‌మత్, కల్యాణమస్తు అనే చిత్రాల్లో నటిస్తున్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment