నాగశౌర్య
‘‘గతంలో నా సినిమాల విషయంలో ఇన్వాల్వ్ అయ్యేవాణ్ణి కాదు. అయితే సినిమా పోతే ముందు నన్నే క్వొశ్చ చేస్తున్నారు. అందుకే కొంచెం ఎక్కువ బాధ్యత తీసుకుని ఈ కథ కోసం వెంకీతో కలిసి ఏడెనిమిది నెలల పాటు కష్టపడ్డాం. నాకు ఏదైనా నచ్చకపోతే వెంకీకి చెప్పి మార్పించుకునేవాణ్ణి. అయితే షూటింగ్ స్టార్ట్ చేశాక ఇన్‌వాల్వ్ కాలేదు’’ అన్నారు నాగశౌర్య. వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య, రష్మికా మండన్న జంటగా శంకర్‌ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి, నిర్మించిన ‘ఛలో’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు.
► అమ్మానాన్న ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలు చూసుకున్నారు. నిర్మాతలుగా ఫస్ట్ టైమ్ కాబట్టి, మొదట్లో కాస్త ఇబ్బందిపడినా ఆ తర్వాత ఈజీ అయింది. ఎక్కడా రాజీపడలేదు. అమ్మ దగ్గరుండి క్వాలిటీగా వచ్చేట్లు చూసుకుంది. అనుకున్నట్లుగా బాగా తీయగలిగాం. సినిమా బిజినెస్ పూర్తయింది. నైజాం మాత్రం మేం ఉంచుకుని మిగతా ఏరియాలు అమ్మేశాం. హిందీ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి.
► మా బేనర్‌కి ‘ఐరా’ అని పేరు పెట్టడానికి కారణం నాకు ఏనుగులంటే ఇష్టం. ఇంద్రుడు వాహనం ఐరావతం వచ్చేట్లు ఐరా క్రియేషన్స అని పెట్టాం. నా ఇష్టదైవం వినాయకుడు. మా బుజ్జి అంకుల్, శ్రీనివాసరెడ్డిగారు బ్యాక్‌బోన్ లా నిలబడ్డారు. కెమెరామేన్ సాయిశ్రీరామ్ బాగా సహకరించారు. సాగర్ మహతి మంచి పాటలిచ్చారు.
► రామ్‌చరణ్ ‘బ్రూస్‌లీ’ సినిమా చూస్తున్నప్పుడు ‘లేఛలో..’ పాట చూసి, అదే టైటిల్‌గా పెడితే? అనుకున్నాం. లేఛలోని కుదించి, ఛలో అని పెట్టాం. కథకు తగ్గ టైటిల్ ఇది. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని ఒక ఊరు తెలుగు, తమిళ్ అని రెండుగా విడిపోతుంది. రెండు ఊళ్లకు మధ్యన ఉన్న కంచెను ఎవరైనా దాటితే రూల్ ప్రకారం చంపేస్తారు. అలాంటి ఊళ్లోకి నేనెందుకు వెళ్లాను? అనేది మెయిన్ థీమ్. హీరోయిన్‌తో చేసిన సీన్స్ మినహా మిగతా అన్ని సీన్స్‌లోనూ నేను రియల్ లైఫ్‌లో ఉన్నట్లే ఉంటాను.
► వెంకీ కుడుములకు డైరెక్టర్‌గా మంచి పేరు వస్తుంది. ‘జాదూగాడు’ సినిమా అప్పుడు ఏర్పడిన మా పరిచయం మంచి స్నేహంగా మారింది. తను నన్ను ‘చిట్టి’ అని పిలుస్తాడు. నాతో సినిమా చేయాలని ఉన్నా, చెప్పలేదు. అది గ్రహించి, స్టోరీ రెడీ చేయమన్నాను. ‘సినిమా కన్నా స్నేహం ముఖ్యం’ అంటే.. కథ రెడీ చేసుకోమన్నాను. ఓ రెండు లైన్స్ అనుకున్నాక.. అవి కాదనుకుని ‘ఛలో’ స్టోరీ బాగుందనిపించి, ఫైనలైజ్ చేశాం.
నిహారికతో పెళ్లా?
నటుడు నాగబాబు కుమార్తె నిహారికతో మీ పెళ్లి అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి? అని అడిగితే –‘‘ఆ వార్తలకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఓ న్యూస్ స్ప్రెడ్ అవుతోందని మంగళవారం నా ఫ్రెండ్స్ చెబితే నాకు తెలిసింది. ఇప్పుడు పెళ్లి ఆలోచనే లేదు. మరో మూడు నాలుగేళ్ల తర్వాత అమ్మ బలవంతపెడితే అప్పుడు చేసుకుంటా.
∙
Comments
Please login to add a commentAdd a comment