Nagashowrya
-
అలా సిద్ధమయ్యాకే సినిమా చేస్తా: హీరో శర్వానంద్
Sharvanand Interesting Comments In Lakshya Pre Release Function: యంగ్ హీరో నాగశౌర్య, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం 'లక్ష్య'. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ సినిమా డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. క్రీడా నేపథ్యంతో వస్తోన్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం (డిసెంబర్ 5) జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్, దర్శకుడు శేఖర్ కమ్ముల, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపించద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శర్వానంద్ 'క్రీడా నేపథ్యంతో సినిమా చేయడానికి, తీయడానికి చాలా ధైర్యం కావాలి. ఈ జోనర్లో వచ్చిన సినిమాలు ఎక్కువగా విజయాల్నే అందుకున్నాయి. ఇలాంటివి చేస్తున్నప్పుడు నటుడికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. నాగశౌర్య పడిన కష్టం కనిపిస్తోంది. నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక నాగశౌర్యలా సిక్స్‌ప్యాక్‌తో సిద్ధమయ్యాకే మరో సినిమా చేస్తా. అఖండ విజయం సీజన్‌కు మంచి సంకేతం. నాగశౌర్యకు మరిన్ని విజయాలు రావాలి. బాలీవుడ్‌కు కూడా వెళ్లిపోవాలి.' అని తెలిపారు. లక్ష్య సినిమా చేస్తూ ఎంతో నేర్చుకున్న అని హీరో నాగశౌర్య అన్నారు. ఏ సమస్య వచ్చినా సరే నిర్మాతలు తనకోసం నిలబడ్డారని తెలిపారు. ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయని దర్శకుడు శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. ఆర్చరీ అనేది ప్రేక్షకులకు కొత్త, అందులోనే విజయం ఉందన్నారు. భారతీయ క్రీడా సినిమాల్లో నిలిచిపోయే మరో చిత్రం 'లక్ష్య' కావాలని కోరుకుంటున్నా అని పుల్లెల గోపించంద్ అన్నారు. 'నా తొలి సినిమా సుబ్రమణ్యపురం. తర్వాత సునీల్ నారంగ్ నన్ను పిలిచి ఈ అవకాశమిచ్చారు. ఏడున్నర గంటలు కథ విని ఈ సినిమా చేశారు నాగశౌర్య. సినిమా అనేది కళారూపం. దానికి ఆక్సిజన్ థియేటర్ వ్యవస్థ. ఆ ఆక్సిజన్ అందజేసే వ్యక్తి నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్.' అని లక్ష్య చిత్రం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సమాజంలో మహిళలకు రక్షణ లేదు
నాగశౌర్య హీరోగా నటించి, కథను అందించిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్ కథానాయిక. రమణ తేజ దర్శకత్వం వహించగా శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించారు. జనవరి 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్ చెప్పిన విశేషాలు. ► తప్పు జరుగుతున్నప్పుడు అది తçప్పని చెప్పగలిగి, దాన్ని ఆపేవాడే అశ్వథ్థామ. సినిమాలో హీరో పాత్ర అలానే ఉంటుంది. మనందరిలోనూ ఒక అశ్వథ్థామ ఉంటాడు. ► ముంబైలో జరిగిన వాస్తవ సంఘటనతో నాగశౌర్య ఈ కథ రాశారు. సెట్లో కామ్‌గా ఉంటాడు శౌర్య. కెమెరా ఆన్ చేయగానే వేరే మనిషిలా మారిపోతాడు. ► రమణ తేజ ఈ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. సమాజంలో జరుగుతున్నది కూడా ఇదే. ప్రస్తుతం సమాజంలో మహిళలకు రక్షణ లేదు. అప్పుడే పుట్టిన పాప నుంచి వందేళ్ల బామ్మగారి వరకూ ఎవ్వరికీ సురక్షితమైన వాతావరణం లేదు. సినిమా శక్తివంతమైన మాద్యమం. ఇలాంటి కథలను ప్రేక్షకులకు చెప్పాలి. ► ఇప్పటి వరకూ నేను ఇలాంటి పాత్ర చేయలేదు. నాగశౌర్య కూడా ఇంత సీరియస్ రోల్ చేయలేదు. మా ఇద్దరికీ ఇది కొత్త జానర్. సినిమా చాలా స్పీడ్‌గా, సీరియస్‌గా సాగుతుంది. కామెడీ, కమెడీయన్స్ ఎవ్వరూ ఉండరు. హీరో ప్రయాణంలో సహాయపడే పాత్ర నాది. ► జనవరిలో నా నుంచి వస్తున్న మూడో చిత్రం ‘అశ్వథ్థామ’. పండక్కి ‘ఎంత మంచివాడవురా!’, పటాస్ (తమిళం) విడుదలయ్యాయి. నెలాఖరుకి విడుదల కాబోతున్న ‘అశ్వథ్థామ’ మంచి విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను. -
‘అశ్వథ్థామ’ టీజర్ లాంచ్
-
లవర్ బాయ్ ఇమేజ్ అంటే చిరాకు
‘‘ఛలో’ సినిమా టీజర్ ఇక్కడే(రామానాయుడు ప్రివ్యూ థియేటర్) విడుదల చేశాం.. బ్లాక్ బస్టర్ అయింది. ‘నర్తనశాల’ టీజర్ కూడా ఇదే ప్లేస్‌లో రిలీజ్ చేశాం.. ఫ్లాప్ అయింది. ఇప్పుడు ‘అశ్వథ్థామ’ టీజర్‌ని కూడా ఇక్కడే రిలీజ్ చేస్తున్నాం.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని గర్వంగా చెప్పగలను. నా తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకునేలా ఈ సినిమా చేశాను’’ అని నాగశౌర్య అన్నారు. రమణ తేజని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ నాగశౌర్య, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 31న విడుదలవుతోంది. ఈ సినిమా టీజర్‌ని హీరోయిన్ సమంత ట్విట్టర్లో విడుదల చేశారు. అలాగే రామానాయుడు స్టూడియోలో జరిగిన టీజర్ విడుదల కార్యక్రమంలో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఢిల్లీ, ముంబైలలో అమ్మాయిలపై జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ‘అశ్వథ్థామ’ కథను రాశా. ‘ఛలో’ కథ నేనే రాసినా పేరు వేసుకోలేదు. నాకు కథలు రాయడం, చెప్పడం ఇష్టం. నాకు లవర్ బాయ్ ఇమేజ్ అంటే చాలా చిరాకు.. అందుకే ఈ చిత్రంలో దాని నుంచి పూర్తీగా బయటికి వచ్చి రఫ్‌గా ఉండే పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘నాగశౌర్య మంచి కథ రాశారు. ఈ చిత్రంలో నాగశౌర్య విశ్వరూపం చూస్తారు’’ అన్నారు రమణ తేజ. ‘‘కథని నమ్మి ఈ సినిమా తీశాం’’ అన్నారు శంకర్ ప్రసాద్ ముల్పూరి. ‘‘ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‌కి మంచి స్పందన వస్తోంది. మా సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు ఉషా ముల్పూరి. ఈ కార్యక్రమంలో లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ మనోజ్ రెడ్డి, డైరెక్టర్ బి.వి.యస్.రవి తదితరులు పాల్గొన్నారు. -
మరో లేడీ డైరెక్టర్‌తో సినిమా
వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు ఓ సినిమాను తీసుకురావడానికి ప్లాన్ రెడీ చేసుకున్నారు నాగశౌర్య. ఈ కొత్త చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణల వివరాలను కొన్ని రోజుల్లో ప్రకటిస్తాం. ఈ సినిమాను వచ్చే ఏడాది మేలో విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఇదిలా ఉంటే లైడీ డైరెక్టర్ నందినీరెడ్డితో ‘కళ్యాణ వైభోగమే’ అనే సినిమాలో నటించారు నాగశౌర్య. ఇప్పుడు మరో లేడీ డైరెక్టర్ సినిమాకి సైన్ చేశారు. ఇది కాకుండా ప్రస్తుతం రమణ తేజ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తోన్న సినిమా చేస్తున్నారు నాగశౌర్య. అలాగే నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ దర్శ కత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు శౌర్య. -
మంచి సినిమాలే చేయాలనుకున్నా
‘‘సురేశ్ ప్రొడక్షన్స్ స్థాపించిన 55ఏళ్లలో తొలిసారి ఓ మహిళా డైరెక్టర్‌తో సినిమా చేశాం. నందినీతో ఎప్పుడో సినిమా చేయాల్సింది కానీ చేయలేకపోయాం. ఇప్పుడు కూడా నలుగురు నిర్మాతలు యూనిట్ అయ్యి ‘ఓ బేబీ’ సినిమా తీశాం’’ అని డి.సురేశ్‌బాబు అన్నారు. సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్య తారలుగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. సురేశ్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా జూలై 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఓ బేబి’ సినిమాకి ఎక్కువగా లేడీ యూనిట్ పనిచేశారు. ఫస్ట్ టైమ్ నా బంధువు, నా ఫ్యామిలీ మెంబర్‌తో(సమంత) ఈ సినిమా చేశా. ఇంతకుముందు మా ఇంట్లో అబ్బాయిలు మాత్రమే సినిమాలు చేసేవారు ఇప్పుడు అమ్మాయి కూడా చేసేసింది. వెంకటేశ్, చైతన్య, రానా.. ఇప్పుడు సమంత. ఈ సినిమాని కొరియా హక్కులు కొని రీమేశాం. మన సినిమాలు కూడా తొందర్లో కొని ఫారిన్లో రీమేక్ చేస్తారు. ఇది మంచి ట్రెండ్’’ అన్నారు. నందినీ రెడ్డి మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్‌గా నాకు ఫస్ట్ చెక్ ఇచ్చింది సురేశ్సారే.. సురేశ్ ప్రొడక్షన్లో నా తొలి సినిమా రావాల్సింది కానీ జరగలేదు. నా నాలుగో సినిమా ఈ ప్రొడక్షన్లో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది యూనివర్శల్ స్టోరీ. ఇప్పటి వరకూ సమంత చేసిన పాత్రలకంటే ‘ఓ బేబి’ లో ఎక్కువ షేడ్స్ కనిపిస్తాయి’’ అన్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘అదృష్టం అనేది ఉండొచ్చు. అయితే ‘మంచి సినిమాలు చేయాలి.. లేకపోతే ఇంట్లో కూర్చోవాలి’ అని నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. దాని తర్వాత వచ్చిన సినిమాలే ‘రంగస్థలం, మహానటి, సూపర్ డీలక్స్, మజిలీ’. నాకు ఓ చిన్న బాధ ఉండేది. నేను రిటైర్ అయ్యేలోపు ఓ పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా చేయాలని. ‘ఓ బేబీ’ ద్వారా నాకు ఆ ఆశ తీరింది. ఈ సినిమా సురేశ్ ప్రొడక్షన్లో చేయడం సంతోషంగా ఉంది. సురేశ్‌గారు ఫోన్ చేసి సీన్స్ ఎలా వచ్చాయి అని అడిగేవారు. దీంతో నాకు ఓ బాధ్యత అనిపించి ఎడిటింగ్ రూమ్‌కి వెళ్లి రషెస్ చూసుకునేవాణ్ణి. ఈ సినిమా నాకు ఓ పాఠం నేర్పింది. ఈ సినిమా నా కెరీర్లో ఓ స్పెషల్ అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సునీత, నటుడు తేజ పాల్గొన్నారు. -
హ్యాట్రిక్ లక్ష్యంగా!
నాగశౌర్య హీరోగా దర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు వీరిద్దరు హ్యాట్రిక్ పై గురిపెట్టారు. అవును... నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా ఓ సినిమా రూపొందనుంది. ఇందులో మాళవికా నాయర్ కథానాయికగా నటిస్తారు. నాగశౌర్య, మాళవిక జంటగా ‘కల్యాణ వైభోగమే’లో నటించిన విషయం తెలిసిందే. తాజాచిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మిస్తారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఇక తాజా సినిమా షూటింగ్ ఈనెల రెండో వారంలో స్టార్ట్ కానుంది. -
స్నేహితుల సాయంతో...
శివ కంఠంనేని టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె. శివశంకర్ రావు, రావుల వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు. శ్రీపాద విశ్వక్ దర్శకుడు. రామ్ కార్తీక్, శివ హరీశ్, అలేఖ్య, రసజ్ఞ దీపికా హీరో, హీరోయిన్లు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ట్రైలర్‌ను ప్రముఖ హీరో నాగశౌర్య విడుదల చేయగా, ఈ చిత్రంలోని ‘ఆడి పాడి గడిపేద్దాం..’ అనే పాటను ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు విడుదల చేశారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి’’ అన్నారు నాగశౌర్య. ‘‘టైటిల్ పాత్రలో శివ కంఠంనేని బాగా ఒదిగిపోయారు’’ అన్నారు కేయస్ రామారావు. ‘‘డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే అనర్థాలను మా చిత్రంలో చూపిస్తున్నాం’’ అన్నారు శివ కంఠంనేని. శ్రీపాద విశ్వక్ మాట్లాడుతూ– ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ప్రేమజంటకు స్నేహితుల సహాయం అందే సమయంలో మరో అపాయం ఎదురవుతుంది. ఆ ప్రేమ జంట ఎలా బయటపడుతుందనే అంశంతో లె రకెక్కిన చిత్రమిది. త్వరలోనే సినిమాలోని అన్ని పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. -
ఏక్ దో తీన్...
ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే సెకండ్ సినిమా చాన్స్ కొట్టేస్తే లక్కీ అంటాం. సెకండ్ సినిమా కూడా పూర్తి కాకముందే మూడో, నాలుగో సినిమాలకూ ఆఫర్స్ దక్కించుకుంటే? సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అంటాం. ప్రస్తుతం అదే ఎక్స్‌ప్రెస్ స్టీరింగ్ దగ్గర కూర్చొని ఎక్సలేటర్ని అమాంతం తొక్కేస్తున్నారు నిధీ అగర్వాల్. ‘సవ్యసాచి’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నిధీ ఆ సినిమా రిలీజ్ కాకముందే అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ లో హీరోయిన్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉన్న నిధి నెక్ట్స్ నాగశౌర్య సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యారని సమాచారం. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్గా నిధీని ఎంపిక చేసింది చిత్రబృందం. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్రం జనవరిలో మొదలు కానుంది. అలాగే సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందే సినిమాలోనూ నిధీ అగర్వాల్ పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. -
నచ్చితే పది మందికి చెప్పండి
‘‘శంకర్‌గారు, ఉషాగారిలాంటి తల్లిదండ్రులు ఉండటం నాగశౌర్య అదృష్టం. డైరెక్టర్ శ్రీనివాస్ నా కుటుంబంలోని వ్యక్తి. తనకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను. ‘నర్తనశాల’ అనే టైటిల్ పెట్టి సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలి’’ అన్నారు వంశీ పైడిపల్లి. ‘ఛలో’ వంటి హిట్ చిత్రం తర్వాత నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన చిత్రం ‘నర్తనశాల’. శంకర ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. కష్మిరీ పరదేశి, యామినీ భాస్కర్ హీరోయిన్స్. ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. వంశీ పైడిపల్లి ఆడియో సీడీలను విడుదల చేసి మాట్లాడుతూ – ‘‘ఒక క్లాసిక్ సినిమాను తీసుకుని అందులోని క్యారెక్టర్స్‌ను కాంటెంపరరీగా డిజైన్ చేసి ఎంటర్టైన్ చేస్తూ తీసిన సినిమా ఇది. ‘గీత గోవిందం’తో ఎంటర్టైన్మెంట్ వేవ్ స్టార్ అయింది. అది ‘నర్తనశాల’కు కంటిన్యూ కావాలి’’ అన్నారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ – ‘‘వంశీ పైడిపల్లిగారు మొదటి నుండి మా సినిమాకు తన సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. అజయ్, శివాజీరాజాగారు, యామినీ, కష్మీరి అందరూ చక్కగా సపోర్ట్ చేశారు. సాగర్ మహతి మంచి సంగీతం అందించారు. డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి సినిమాను చాలా బాగా తీశారు. చెప్పింది చెప్పినట్లు తీశారు. మా అమ్మానాన్నలకు చాలా థ్యాంక్స్. వాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మా ఫ్యామిలీకి ఎప్పుడూ సపోర్ట్ చేసే బుజ్జి అంకుల్, శ్రీనివాస్‌రెడ్డి అంకుల్‌కు థాంక్స్. డెఫినెట్‌గా సినిమా అందరికీ నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోతే చూడొద్దు. నచ్చితే పది మందికి చెప్పండి’’ అన్నారు. ‘‘శౌర్య, శంకర్‌గారికి, ఉషాగారికి థాంక్స్. సినిమా చాలా ప్లెజంట్‌గా, కామిక్‌గా ఉంటుంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’అన్నారు దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి. ‘‘ఒక మనసు’ చిత్రం కోసం మా బ్యానర్లో శౌర్య పనిచేశాడు. హార్డ్‌వర్కర్. తనకు మంచి పేరెంట్స్ ఉండటంతో.. కెరీర్ చక్కగా వెళుతోంది. ఐరా బ్యానర్‌ను స్టార్ట్ చేసి మంచి సినిమాలు చేస్తున్నారు’’ అన్నారు మధుర శ్రీధర్ రెడ్డి. ‘‘శంకర్‌గారు, బుజ్జిగారు, గౌతమ్, ఉషాగారే.. ఈ సినిమాకు మూల స్తంభాలు. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నందినీ రెడ్డి. శివాజీ రాజా మాట్లాడుతూ – ‘‘ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నా కోసమే ఈ సినిమా చేశారా? అనిపించేలా ఉంటుంది. సాగర్ మహతి చాలా మంచి సంగీతం ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు. -
అమ్మమ్మ గుర్తుకు రావడం ఖాయం
‘‘సుందర్‌గారు ‘అమ్మమ్మగారిల్లు’ వంటి మంచి కథ చెప్పడమే కాదు.. చెప్పినట్లు తీశారు కూడా. ఈ సినిమా చూస్తే కచ్చితంగా అమ్మమ్మ గుర్తుకు వస్తుంది’’ అని నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, బేబి షామిలీ జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. స్వప్న సమర్పణలో కె.ఆర్ సహ నిర్మాతగా రాజేష్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘సుమిత్రగారు అమ్మమ్మగారి పాత్రకు అతికినట్లు సరిపోయారు. రసూల్‌గారు సినిమాను అద్భుతమైన విజువల్స్‌తో చూపించారు. ఆయనతో ‘ఒకరికి ఒకరు’ లాంటి సినిమా చేయాలని ఉంది. బేబి షామిలీ చిన్నప్పుడు చేసిన సినిమాలు చూశాను. ఇప్పుడు హీరోయిన్గా తను ఈ సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని చాలామంది నటీనటులు అనుభవం ఉన్నవారే. నాకు చక్కటి సహకారం అందించారు. షామిలీగారికి స్టోరీ చెప్పగానే నచ్చడంతో ఆలోచించకుండా చేస్తానన్నారు. నాగశౌర్యగారు లేకపోతే ఈ సినిమా లేదు’’ అన్నారు సుందర్ సూర్య. ‘‘నాగశౌర్య, షామిలి సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారం వల్లే ఇంత మంచి సినిమా చేశాం. సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు సహ నిర్మాత కె.ఆర్. ‘‘మా అమ్మమ్మగారితో మంచి అనుబంధం ఉంది. అదే వాతావరణాన్ని ఈ సినిమా షూటింగ్ సమయంలో చూశాను’’ అన్నారు బేబి షామిలీ. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కెమెరామెన్ రసూల్, సంగీత దర్శకుడు సాయికార్తీక్, నటీనటులు మధుమణి, హేమ, గౌతంరాజు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మమ్మకు నో కట్స్
నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్లో రాజేష్ నిర్మించారు. కె.ఆర్ సహ నిర్మాత. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ సింగిల్ కట్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సందర్భంగా రాజేష్, కె.ఆర్. మాట్లాడుతూ –‘‘చక్కని కుటుంబ కథా చిత్రమిది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. ప్రేక్షకులందరికీ మా సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘కుటుంబ కథా చిత్రం కావడం, స్వచ్ఛమైన తెలుగు టైటిల్ మూవీ కావడంతో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. పలువురు సినీ పెద్దలు టీజర్ బాగుందని చెప్పడం సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సెన్సార్ వారు మా సినిమాని మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సుందర్ సూర్య. -
సినిమా నుంచి నేను కోరుకునేది ఆనందమే
‘ఫిదా, ఎంసీఏ’ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సాయిపల్లవి ‘కణం’ సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు. నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎ.ఎల్ విజయ్ దర్శకత్వంలో ఎన్.వి.ఆర్ సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘కణం’. ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ–‘‘కణం’ సినిమా ద్వారా ‘ఒకటి ఫీల్ అవుతూ మరో ఎమోషన్ ఎలా ఎమోట్ చేయాలో’ అనే విషయం నేర్చుకున్నాను. ‘ప్రేమమ్’లో లవ్, ‘ఫిదా’లో ఇండిపెండెంట్ అమ్మాయిగా ఇలా ఒకే షేడ్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశాను. ఈ సినిమాలో అమ్మ పాత్ర పోషించాను. అమ్మ పాత్రకు చాలా షేడ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ అన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. లోపల ఎంత బాధ ఉన్నా బయటకు కనిపించకుండా ఉండగలగటం కేవలం ‘అమ్మ’కు మాత్రమే సాధ్యం. ఈ సినిమా ద్వారా చాలా పరిణితి చెందాను అని అనుకుంటున్నాను. ఇలాంటి రోల్స్ ఎప్పుడూ వచ్చేవి కావు. దర్శకుడు విజయ్ సార్ చాలా స్వీట్. నేను ఇప్పటి వరకూ పనిచేసిన దర్శకులు నాకు ఏదో ఒకటి నేర్పించారు. ఇందులో యాక్ట్ చేసిన పాప వెరోనికాతో అటాచ్మెంట్ చాలా పెరిగిపోయింది. ఒకానొక టైమ్‌లో దత్తత తీసుకోవాలన్నంతగా క్లోజ్ అయిపోయాను. సినిమాలో నా పాత్ర నిడివి కంటే ఎంత ఇంపార్టెన్స్ అన్నది ముఖ్యంగా ఆలోచిస్తాను. సినిమా నుంచి నేను కోరుకునేది కేవలం ఆనందమే. ‘ఆ పాత్రను చాలా బాగా చేసింది’ అని ఆడియన్స్ ఫీల్ అయితే చాలు. ఈ సినిమా చూశాక స్క్రీన్ మీద ఒక అమ్మను ఆడియన్స్ చూడగలిగితే నేను సక్సెస్ అయినట్టే’’ అని పేర్కొన్నారు. -
మా అమ్మమ్మగారి ఊరు గుర్తొచ్చింది
‘‘కొన్ని రోజుల క్రితం ‘అమ్మమ్మగారిల్లు’ యాడ్ చూడగానే నా బాల్యంలోని మా అమ్మమ్మగారి ఊరు గుర్తొచ్చింది. మేమంతా వేసవి సెలవులకు వెళ్లినప్పుడు అక్కడ ఆడుకోవడం అన్నీ గుర్తుకొచ్చాయి. ఆ రోజంతా నేను చాలా మంచి ఫీలింగ్‌లో ఉండిపోయాను. అలాంటి ఫీలింగ్ ఇచ్చినందుకు యూనిట్‌కి థ్యాంక్స్. ‘అమ్మమ్మగారిల్లు’ మంచి హిట్‌తో పాటు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆశిస్తున్నా’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. స్వప్న సమర్పణలో కె.ఆర్, రాజేష్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని వినాయక్ ఆవిష్కరించారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘అమ్మమ్మగారిల్లు’ ఒక గుడిలాంటిది. గుడికి వెళ్లినప్పుడు శత్రువులు ఎదురైనా తగాదాలు పడం. అలాగే అమ్మమ్మగారి ఇంటికెళ్లినప్పుడు కుటుంబంలోని వ్యక్తుల మధ్య మనస్పర్థలున్నా అమ్మమ్మ బాధపడకూడదని బయటికి నవ్వుతూ ఉంటాం. ఇది రేటింగ్ ఇచ్చే సినిమా కాదు. దయచేసి ఎవరూ ఈ సినిమాకు రేటింగ్స్ ఇవ్వొద్దని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నాకు తొలి చిత్రమిది. నా జీవితంలో చోటు చేసుకున్న కొన్ని జ్ఞాపకాలతో ఈ సినిమా చేశా. నాగశౌర్య లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన పాత్ర కన్నీరు పెట్టిస్తుంది. మా నిర్మాతలు చక్రపాణి–నాగిరెడ్డిగార్లలా కలిసి ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు సుందర్ సూర్య. ‘‘ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా ఇది’’ అన్నారు నిర్మాత రాజేష్. సహ నిర్మాత కుమార్, ఛాయాగ్రాహకుడు రసూల్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మమ్మగారింటికి వేసవిలోనే...
నాగశౌర్య, బేబి షామిలి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. సుందర్ సూర్య దర్శకత్వంలో స్వాజిత్ మూవీస్ బ్యానర్లో రాజేష్, కె.ఆర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. స్వచ్ఛమైన తెలుగు టైటిల్ పెట్టడంతో సినిమాకు మంచి క్రేజ్ వస్తోంది. ఇటీవలే సినిమా శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. తాజాగా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ నెల 22న టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వేసవి కానుకగా సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: స్వప్న. -
సాయిపల్లవి చిత్రానికి లైన్ క్లియర్
తమిళసినిమా: నటి సాయిపల్లవి నటించిన తొలి తమిళ చిత్రమే ఆటంకాలను ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. మాలీవుడ్‌లో ప్రేమమ్‌తోనూ, టాలీవుడ్లో ఫిదా చిత్రంతోనూ అనూహ్య క్రేజ్‌ను సంపాదించుకున్న నటి సాయిపల్లవికి కోలీవుడ్ ఎంట్రీ మాత్రం కాస్త ఆలస్యంగానే జరిగింది. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు విజయ్ దర్శకత్వం వహించిన కరు చిత్రం ద్వారా సాయిపల్లవి కోలీవుడ్‌కు పరిచయం కానుంది. టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో చిత్ర టైటిల్ వివాదంలో చిక్కుకుంది. కురు చిత్ర టైటిల్ హక్కులు తనకు చెందినవి అంటూ స్థానికి ఎంజీఆర్ నగర్‌కు చెందిన జేఎస్.స్క్రీన్ సంస్థ అధినేత మణిమారన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో సాయిపల్లవి చిత్రం చిక్కుల్లో పడింది. న్యాయస్థానం ఈమె చిత్రానికి కరు టైటిల్‌ను నిషేధించింది. దీంతో లైకా సంస్థ మద్రాసు హైకోర్టులో ఈ చిత్ర టైటిల్‌పై అప్పీల్ చేసుకుంది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తుల బెంచ్ విచారణ చేపట్టింది. ఈ విచారణకు లైకాసంస్థ తరఫు న్యాయవాది హాజరై కరు చిత్రం టైటిల్‌ను తాము ప్రకటించిన తరువాత జేఎస్.స్క్రీన్ సంస్థ అధినేత మణిమారన్ ఈ టైటిల్ తనదంటూ కోర్టును ఆశ్రయించారని, తాము కరు టైటిల్ పేరుతో ఇప్పటికే ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకున్నామని, ఇప్పుడు టైటిల్‌పై నిషేధం విధిస్తే చాలా నష్టపాతామని వాధించారు. ఇరుతరఫు వాదనలు పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తుల బెంచ్ కురు చిత్ర టైటిల్‌పై నిషేధాన్ని తొలగిస్తూ లైకా సంస్థకు అనుకూలంగా తీర్పును వెల్లడించింది. దీంతో అడ్డంకులు తొలగడంతో సాయిపల్లవి కరు చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సన్నాహాలు జరుపుకుంటోందని సమాచారం. ఇందులో సాయిపల్లవి ఒక బిడ్డకు తల్లిగా నటించిందన్నది గమనార్హం. -
లేఛలో నుంచి ఛలో వచ్చింది
‘‘గతంలో నా సినిమాల విషయంలో ఇన్వాల్వ్ అయ్యేవాణ్ణి కాదు. అయితే సినిమా పోతే ముందు నన్నే క్వొశ్చ చేస్తున్నారు. అందుకే కొంచెం ఎక్కువ బాధ్యత తీసుకుని ఈ కథ కోసం వెంకీతో కలిసి ఏడెనిమిది నెలల పాటు కష్టపడ్డాం. నాకు ఏదైనా నచ్చకపోతే వెంకీకి చెప్పి మార్పించుకునేవాణ్ణి. అయితే షూటింగ్ స్టార్ట్ చేశాక ఇన్వాల్వ్ కాలేదు’’ అన్నారు నాగశౌర్య. వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య, రష్మికా మండన్న జంటగా శంకర్‌ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి, నిర్మించిన ‘ఛలో’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు. ► అమ్మానాన్న ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలు చూసుకున్నారు. నిర్మాతలుగా ఫస్ట్ టైమ్ కాబట్టి, మొదట్లో కాస్త ఇబ్బందిపడినా ఆ తర్వాత ఈజీ అయింది. ఎక్కడా రాజీపడలేదు. అమ్మ దగ్గరుండి క్వాలిటీగా వచ్చేట్లు చూసుకుంది. అనుకున్నట్లుగా బాగా తీయగలిగాం. సినిమా బిజినెస్ పూర్తయింది. నైజాం మాత్రం మేం ఉంచుకుని మిగతా ఏరియాలు అమ్మేశాం. హిందీ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి. ► మా బేనర్‌కి ‘ఐరా’ అని పేరు పెట్టడానికి కారణం నాకు ఏనుగులంటే ఇష్టం. ఇంద్రుడు వాహనం ఐరావతం వచ్చేట్లు ఐరా క్రియేషన్స అని పెట్టాం. నా ఇష్టదైవం వినాయకుడు. మా బుజ్జి అంకుల్, శ్రీనివాసరెడ్డిగారు బ్యాక్‌బోన్ లా నిలబడ్డారు. కెమెరామేన్ సాయిశ్రీరామ్ బాగా సహకరించారు. సాగర్ మహతి మంచి పాటలిచ్చారు. ► రామ్‌చరణ్ ‘బ్రూస్లీ’ సినిమా చూస్తున్నప్పుడు ‘లేఛలో..’ పాట చూసి, అదే టైటిల్‌గా పెడితే? అనుకున్నాం. లేఛలోని కుదించి, ఛలో అని పెట్టాం. కథకు తగ్గ టైటిల్ ఇది. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని ఒక ఊరు తెలుగు, తమిళ్ అని రెండుగా విడిపోతుంది. రెండు ఊళ్లకు మధ్యన ఉన్న కంచెను ఎవరైనా దాటితే రూల్ ప్రకారం చంపేస్తారు. అలాంటి ఊళ్లోకి నేనెందుకు వెళ్లాను? అనేది మెయిన్ థీమ్. హీరోయిన్‌తో చేసిన సీన్స్ మినహా మిగతా అన్ని సీన్స్‌లోనూ నేను రియల్ లైఫ్‌లో ఉన్నట్లే ఉంటాను. ► వెంకీ కుడుములకు డైరెక్టర్‌గా మంచి పేరు వస్తుంది. ‘జాదూగాడు’ సినిమా అప్పుడు ఏర్పడిన మా పరిచయం మంచి స్నేహంగా మారింది. తను నన్ను ‘చిట్టి’ అని పిలుస్తాడు. నాతో సినిమా చేయాలని ఉన్నా, చెప్పలేదు. అది గ్రహించి, స్టోరీ రెడీ చేయమన్నాను. ‘సినిమా కన్నా స్నేహం ముఖ్యం’ అంటే.. కథ రెడీ చేసుకోమన్నాను. ఓ రెండు లైన్స్ అనుకున్నాక.. అవి కాదనుకుని ‘ఛలో’ స్టోరీ బాగుందనిపించి, ఫైనలైజ్ చేశాం. నిహారికతో పెళ్లా? నటుడు నాగబాబు కుమార్తె నిహారికతో మీ పెళ్లి అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి? అని అడిగితే –‘‘ఆ వార్తలకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఓ న్యూస్ స్ప్రెడ్ అవుతోందని మంగళవారం నా ఫ్రెండ్స్ చెబితే నాకు తెలిసింది. ఇప్పుడు పెళ్లి ఆలోచనే లేదు. మరో మూడు నాలుగేళ్ల తర్వాత అమ్మ బలవంతపెడితే అప్పుడు చేసుకుంటా. ∙ -
ఊహించని క్లైమాక్స్ ఉంటుందట
'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్. కొంత గ్యాప్ తరువాత 'జ్యో అచ్యుతానంద' పేరుతో ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని తెరకెక్కించాడు. జ్యో, అచ్యుత్, ఆనంద్‌ల ప్రేమకథే ఈ 'జ్యో అచ్యుతానంద'. నారా రోహిత్, రెజీనా, నాగ శౌర్యలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఆ ఇద్దరు హీరోల్లో ఆమె మనసు ఎవరు గెలుచుకుంటారనేదే ప్రశ్న. అయితే ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం అనే టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకులు ఊహించని విధంగా ముగింపు ఉంటుందని, కచ్చితంగా థ్రిల్‌కు గురవుతారని చిత్ర యూనిట్ చెబుతున్న మాట. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందట. వారాహి చలన చిత్ర బ్యానర్‌ఫై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణ రమణ సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది.