
నాగశౌర్య, మాళవికా నాయర్, అవసరాల శ్రీనివాస్
నాగశౌర్య హీరోగా దర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు వీరిద్దరు హ్యాట్రిక్ పై గురిపెట్టారు. అవును... నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా ఓ సినిమా రూపొందనుంది. ఇందులో మాళవికా నాయర్ కథానాయికగా నటిస్తారు. నాగశౌర్య, మాళవిక జంటగా ‘కల్యాణ వైభోగమే’లో నటించిన విషయం తెలిసిందే. తాజాచిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మిస్తారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఇక తాజా సినిమా షూటింగ్ ఈనెల రెండో వారంలో స్టార్ట్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment