
నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయిక. ప్రస్తుతం ఈ మూవీ లండన్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ హీరోహీరోయన్లపై కీలక సన్నివేశాలతో పాటు పాటలను చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు ప్రధాన తారాగణం కూడా ఈ షూటింగ్ షెడ్యూల్ పాల్గొంది. గతంలో నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన కళ్యాణ వైభోగమే ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.
అలాగే శ్రీనివాస్ అవసరాల, నాగశౌర్య కాంబినేషన్‌లో రూపొందిన ఊహలు గుసగుసలాడే, జో అచ్చుతానంత చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగశౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇలాంటి విజయవంతమైన చిత్రాల నాయకనాయికలు, దర్శకుడుతో పాటు ప్రతిభ కలిగిన సాంకేతిక వర్గంతో మా ఈ చిత్రం నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment