'మరణించిన తర్వాత అసలేం జరుగుతుంది?'.. ఆసక్తిగా ట్రైలర్! | Sri Ram and Khushi Ravi Tollywood Movie Pindam Official Trailer Release | Sakshi
Sakshi News home page

Pindam Official Trailer: 'అత్మలు నిజంగానే ఉంటాయా?'.. ఆసక్తిగా ట్రైలర్!

Published Thu, Dec 7 2023 7:57 PM | Last Updated on Thu, Dec 7 2023 8:10 PM

Sri Ram and Khushi Ravi Tollywood Movie Pindam Official Trailer Release - Sakshi

శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం పిండం. ఈ చిత్రానికి సాయికిరణ్‌ దైదా దర్శకత్వం వహించారు.  హారర్‌ ఫిల్మ్‌గా తెరకెక్కించిన ఈ మూవీ‌  ది స్కేరియస్ట్‌ ఫిల్మ్‌ అనేది ఉప శీర్షిక. ఆరోహి దైదా సమర్పణలో యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రైలర్‌ చూడగానే ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా సినిమా తీసినట్లు తెలుస్తోంది. నిజంగానే దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? అనే కోణంలోనే చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కృష్ణ సౌరభ్‌ సూరంపల్లి సంగీతం అందించారు. ఈనెల 15న మిమ్మ‍ల్ని భయపెట్టేందుకు వస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement