sriram
-
'హరి కథ: సంభవామి యుగే యుగే' ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్‌గా 'హరి కథ'.. స్ట్రీమింగ్కు రెడీ
టాలీవుడ్లో ఇప్పటి వరకు చాలా సినిమాలను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుంచి మొదటిసారి ఒక వెబ్ సిరీస్ వస్తుంది. హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న 'హరి కథ: సంభవామి యుగే యుగే' వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఒక ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. డిసెంబర్ 13న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు.మిస్టరీ థ్రిల్లర్ జానర్‌గా 'హరి కథ: సంభవామి యుగే యుగే' వెబ్ సిరీస్‌ను దర్శకుడు మగ్గీ తెరకెక్కించారు. 3 రోజెస్ వెబ్ సిరీస్‌తో ఆయన గుర్తింపు పొందారు. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ వంటి వారితో పాటు బిగ్‌బాస్‌తో గుర్తింపు పొందిన దివి, అంబటి అర్జున్ తదితరులు నటిస్తున్నారు. శుక్రవారం (డిసెంబర్ 13) నుంచి 'హరికథ' వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ప్రభుత్వ పెద్దలను మెప్పించేందుకే..
సాక్షి, అమరావతి : ప్రభుత్వ పెద్దలను సంతోష పెట్టేందుకు రాష్ట్రంలో పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాం హైకోర్టుకు తెలిపారు. ఇలా చేయడంలో ప్రభుత్వ విధానమే అణచివేత ధోరణిలా ఉందని, దానినే పోలీసులు అనుసరిస్తున్నారన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఇష్టమొచ్చినట్లు కేసులు నమోదుచేసి అరెస్టుచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా పోలీసులు ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్నారని, ఈ విషయంలో పోలీసులపై విచారణకు ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు పోలా విజయ్‌బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. మతం, కులం, లింగం, పుట్టిన ప్రాంతం తదితరాల ఆధారంగా వర్గాల మధ్య శతృత్వం సృష్టిస్తూ సెక్షన్–153ఏ కింద కేసులు పెడుతున్నారన్నారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చెల్లదని.. ఇదే హైకోర్టు గతంలో తీర్పునిచ్చిందన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రజల విమర్శలను తట్టుకోలేక సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతున్నారని శ్రీరాం వివరించారు. ప్రజల హక్కులను కాలరాస్తున్నారు..ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. కేసులపై అభ్యంతరం ఉంటే దానిపై న్యాయపోరాటం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించింది. ఆ పనే చేస్తున్నారని, పోలీసుల అక్రమ నిర్బంధాలపై హేబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని శ్రీరాం తెలిపారు. తప్పుడు కేసుల ద్వారా ప్రజల హక్కులను పోలీసులు హరిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రజలు భయపడేలా చేస్తున్నారని వివరించారు. ప్రతీ దశలోనూ పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ దన్నుతోనే పోలీసులు ఇంత అరాచకానికి పాల్పడుతున్నారని ఆయన ధర్మాసనానికి వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించడాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో తప్పుపట్టిందన్నారు. ఈ పిల్ దాఖలు చేసిన తరువాత పోలీసులు నిర్ధిష్టంగా ఒకే తరహా కేసులు పెడుతున్నారని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసుల నమోదు తప్పుకాదు..ధర్మాసనం స్పందిస్తూ.. సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేయడం తప్పుకాదని హైకోర్టు అభిప్రాయపడింది. తమపై (న్యాయమూర్తులు) కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని గుర్తుచేసింది. ఇలాంటి వారిపై కేసులు పెట్టకుండా పోలీసులను నియంత్రించలేమని తెలిపింది. సోషల్ మీడియా ఉన్నది ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి, పోస్టులు పెట్టడానికి కాదని వ్యాఖ్యానించింది. అలాంటి పోస్టులు పెట్టే వారిని చట్టం ముందు నిలబెట్టడంలో తప్పేముందని ప్రశ్నించింది. కేసులపై అభ్యంతరం ఉంటే వాటిని కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలని సూచించింది. అంతేతప్ప.. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఈ విషయంలో తగిన ఉత్తర్వులు జారీచేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వెదిరె శ్రీరామ్‌కు ‘కమిషన్’ పిలుపు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బరాజ్‌లపై విచారణలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ నుంచి సాక్ష్యాధారాలు సేకరించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. వచ్చే శుక్రవారం లేదా సోమవారం కమిషన్ కార్యాలయానికి వచ్చి తన వద్ద ఉన్న సమాచారాన్ని అందించాలని ఆయన్ను కోరింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మడిహట్టి వద్ద బరాజ్ నిర్మించాల్సి ఉండగా, అక్కడ 165 టీఎంసీల నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) తెలపడం వల్లే బరాజ్‌ను మేడిగడ్డ వద్దకు మార్చినట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొంది. అయితే వెదిరె శ్రీరామ్ ఇటీవల విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ వాదనను తోసిపుచ్చారు. తమ్మడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ ప్రతిసారీ చెప్పిందని పేర్కొన్నారు.తన వాదనలను బలపర్చే కీలక పత్రాలను సైతం ఆయన ప్రజెంటేషన్‌లో పొందుపరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుమతులు, మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి సంబంధించిన పత్రాలు ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని సైతం సాక్ష్యాధారాలుగా సేకరించాలని జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నిర్ణయించింది. సోమవారం కమిషన్ ముందుకు రఘు తెలంగాణ జేఏసీ చైర్మన్, విద్యుత్ రంగ నిపుణుడు కె.రఘు నుంచి సైతం సాక్షా్యధారాలను సేకరించాలని కమిషన్ నిర్ణయించింది. సోమవారం కమిషన్ ఎదుట హాజరై వివరాలను అందించాలని ఆయనకు లేఖ రాసినట్టు తెలిసింది. తమ్మడిహెæట్టికి బదులు మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన గతంలో అఖిలపక్ష సమావేశాలు, సదస్సులు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భారీ ఇంజనీరింగ్ తప్పిదమని, ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల పథకమని పేర్కొంటూ ఆయన ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కమిషన్ ఆయన్ను సైతం పిలిచింది. రఘు గతంలో ట్రాన్స్‌కో సివిల్ విభాగం సీఈగా వ్యవహరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విభేదించారనే కారణంతోనే రఘును రెండు హోదాలు కిందికి డిమోట్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో లోపాలను తప్పుబడుతూ తన ఉద్యోగాన్ని మానేసిన ఓ నిర్మాణ సంస్థ కీలక మాజీ ఉద్యోగి ఒకరు త్వరలో కమిషన్ ముందు హాజరై తన వద్ద ఉన్న సమాచారాన్ని సాక్ష్యాధారాలుగా సమర్పించనున్నట్టు తెలిసింది. త్వరలో సీడబ్ల్యూసీ ఇతర అధికారులకు కబురు కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను రూపొందించిన వ్యాప్కోస్ సంస్థ అధికారులతో పాటు హైడ్రాలజీ, ఫైనాన్షియల్ అనుమతులు జారీ చేసిన సీడబ్ల్యూసీ, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధికారులను సైతం విచారణకు పిలిపించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ణయించింది. ఇక మూడు బరాజ్‌ల వైఫల్యాలపై అధ్యయనాకికి ఏర్పాటైన నిపుణుల కమిటీని సైతం త్వరలో కమిషన్ విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాలు తీసుకున్న సమయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య/ప్రత్యేక ప్రధా న కార్యదర్శులుగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్‌లు శైలేంద్ర కుమార్ జోషి, రజత్‌కుమార్‌ను త్వరలో కమిషన్ పిలిపించి విచారించనుంది.20 మంది డీఈఈల విచారణకాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లు, పంప్‌హౌస్‌ల నిర్మాణంలో పాల్గొన్న 20 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను మంగళవారం కమిషన్ విచారించింది. నిబంధనల మేరకే బరాజ్‌ల పనులు జరిగాయా? ఏమైనా పనులను విస్మరించారా? బరాజ్‌లు ఎందుకు విఫలమయ్యాయి? వాటి పునరుద్ధరణకు ఏం చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై వారిని ప్రశ్నించింది. నేడు ఏఈలు, ఏఈఈలను విచారించనుంది. -
సాయి రాజేశ్ మోసం చేశాడు.. అందుకే బేబీ లీక్స్ రాశా: టాలీవుడ్ డైరెక్టర్
నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్ బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్ శ్రీరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాలతో సహా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బేబీ లీక్స్ పేరిట బుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్లో చర్చనీయాశంగా మారింది. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ విషయాలన్నీ శిరీన్ శ్రీరామ్ ప్రస్తావించారు.శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వర్షన్ జూన్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో శిరీన్ శ్రీరామ్ తనకు సాయి రాజేష్ చేసిన అన్యాయం, తన కథను కాపీ కొట్టి బేబీ సినిమా తీయడంపై మరోసారి స్పందించాడు. సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందుంచారు.ఈ సందర్భంగా శిరీన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. 'రవి కిరణ్ అనే వ్యక్తిని 2015లో కలిశాను. తరువాత రవి కిరణ్ ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ చూసి ఓ పాయింట్ అనుకున్నా. ఓ అమ్మాయిని ఇద్దరబ్బాయిలు కలిసి చంపారనే పోస్ట్ చూసి కథ అనుకున్నాం. దాన్ని ఓ బస్తీ అమ్మాయి పాత్రతో లింక్ చేసి కథ రాసుకున్నా. ఆ టైంలో నిర్మాత సాయి రాజేశ్‌తో ఏడాది ప్రయాణం చేశా. నాకు దర్శకుడిగా అవకాశం ఇస్తూ.. ఆయనే సినిమాను నిర్మిస్తానని అన్నారు. అయితే ఆలస్యం అవుతూ వచ్చింది. కారణాలేమైనా ఉండొచ్చేమో అనిపించి.. ఆయన సినిమా నిర్మించడం లేదని నేను బయటకు వచ్చేశా. అప్పుడు మాకేం గొడవ జరగలేదు.' అని అన్నారు.ఆ తర్వాత మాట్లాడుకూ..'నాకు దర్శకత్వం అవకాశం ఇస్తానన్నవాడు.. నా కథను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో బేబీ అనే సినిమా తీశాడు. 2023 జూలైలో సినిమా రిలీజ్ అయినప్పుడు రచ్చ చేయలేదు. నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సాక్ష్యాలు అన్నీ సంపాదించి లాయర్ నిఖిలేశ్‌ను కలిశాను. కాపీరైట్ లీగల్ నోటీస్ పంపాం. కానీ నాకే ఆయన ఆ కథను చెప్పాడని ఆ నోటీసులో రిప్లై ఇచ్చాడు. హృదయ కాలేయం సినిమాకు ఫ్రీగా టీజర్ డైరెక్ట్ చేసి, ఎడిట్ చేసి ఇచ్చా. కానీ నన్నే మోసం చేశాడు. ఫిబ్రవరిలో రాయదుర్గంలో కేసు ఫైల్ చేశా. నన్ను బద్నాం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదులు చేశాడు. అందుకే ఆయన మీద బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశా. ఇవాళ దాన్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నా. https://babyleaks2023.blogspot.com/ అనే ఆన్ లైన్లో మాధ్యమంలో పీడీఎఫ్, వెబ్ సైట్ కూడా ఉంది.' అని అన్నారు. -
సైంటిఫిక్ థ్రిల్లర్
శ్రీకాంత్ (శ్రీరామ్) ప్రధాన పాత్రలో సుగి విజయ్, రూపాలీ భూషణ్ జంటగా రూపొందిన చిత్రం ‘మాత్రు’. జాన్ జక్కీ దర్శకత్వంలో శ్రీ పద్మినీ సినిమాస్‌పై బి. శివప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్పోస్టర్ని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.‘‘యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మాత్రు’.పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం’’ అన్నారు మేకర్స్. అలీ, ఆమని ఇతర కీలక పాత్రలుపోషించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: రాహుల్ శ్రీవాస్తవ్. -
నా కుమార్తెను వ్యభిచారంలోకి దించేందుకు నా ఫ్రెండ్ ప్రయత్నిస్తోంది
సాక్షి, అమరావతి: తన కుమార్తెను తన స్నేహితురాలు డబ్బు కోసం వ్యభిచార వృత్తిలో దించేందుకు ప్రయత్నిస్తోందని, తన కుమార్తెను తనకు అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొంతకాలం క్రితం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆ బాలికను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు ఆ బాలికను కోర్టు ముందు హాజరుపరచగా.. మంగళగిరి వద్ద ఉన్న ఉజ్వలా హోంలో ఉంచాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఆ బాలిక వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరిపి, బాధ్యులపై కేసు నమోదు చేయాలంది. అంతేకాక ఈ కేసులో సదరు జిల్లా ఎస్పీని ప్రతివాదిగా చేర్చింది. అలాగే పిటిషనర్ తన స్నేహితురాలిగా పేర్కొన్న మహిళ కూడా కోర్టు ముందు హాజరయ్యారు. తాను కుట్టుపని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటానని, ఆ బాలికను తాను అక్రమంగా నిర్భంధించలేదని ఆ మహిళ తెలిపారు. ఆ బాలిక తన వద్దకు వచ్చి మూడు నెలలు ఉందని, ఆ సమయంలో ఆ బాలికకు టైలరింగ్ నేర్పించానని తెలిపారు. అనంతరం హైకోర్టు ఈ వ్యవహారంలో ప్రభుత్వ వాదన వినాలని నిర్ణయించి అప్పుడు విచారణను వాయిదా వేసింది. విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి.. ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హాజరయ్యారు. ఆ బాలికను వ్యభిచార వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. బాధిత బాలిక సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, నిస్సహాయ బాలికలు, మహిళలను మానవ అక్రమ రవాణాదారుల నుంచి కాపాడాలని, ఈ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అలాగే మానవ అక్రమ రవాణాదారుల ఉచ్చులో నుంచి బయటపడిన బాలికలు, మహిళల పునరావాసం కోసం కూడా చర్యలు తీసుకోవాలంది. ప్రస్తుతం చట్టంలో విటులను బాధితులుగా పేర్కొన్నారని, వాస్తవానికి వారిని నిందితులుగా పేర్కొనాల్సిన అవసరం ఉందని తెలిపింది. దీనిపై ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ, మానవ అక్రమ రవాణాదారుల నుంచి బాలికలు, మహిళలను కాపాడే విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే పునరావాసం విషయంలో అన్ని చర్యలు తీసుకుంటామని నివేదించారు. సమగ్ర వివరాలతో విధానపరమైన నివేదిక సమర్పిస్తామన్నారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి దర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
బీజేపీలో చేరకపోతే రాముడికి శిక్ష పడేది
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ భగవాన్ శ్రీరాముడు ఇప్పుడు బతికి ఉండి బీజేపీలో చేరకపోతే ఆయన ఇంట్లో సోదాలు చేయడానికి ఈడీ, సీబీఐలను పంపించేవారని అన్నారు. బీజేపీలో చేరుతావా? లేక జైలుకు వెళ్తావా? అంటూ బీజేపీ పెద్దలు బెదిరించేవారని చెప్పారు. బీజేపీలో చేరకపోతే రాముడికి కచి్చతంగా జైలుశిక్ష పడేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ శాసనసభలో 2024–25 బడ్జెట్‌ను ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బడ్జెట్‌పై సభలో శనివారం జరిగిన చర్చ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు. -
వచ్చేవారం మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీపై విచారణ కోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కొత్త చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వచ్చేవారం రానుందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు, కేంద్ర నదుల అనుసంధాన టాస్‌్కఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్ తెలిపారు. మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్ఏ కోరి న పూర్తి సమాచారాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే గాకుండా.. ›ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ డేటా ఇస్తేనే.. జియో సిస్మిక్, క్వాలిటీ చెక్ వంటి అంశాలపై అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని స్ప ష్టం చేశారు. గురువారం పీఐబీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. గోదావరి నదిపై వివిధ తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి, మేడి గడ్డ సమస్య, కేఆర్ఎంబీ అధికార పరిధి, కేఆర్ఎంబీ–2కు సంబంధించి కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫెరెన్స్‌లపై శ్రీరామ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి పరిశీలన తర్వాతే తేలేది.. ఎన్డీఎస్ఏ జియో సిస్మిక్, జియో ఫిజికల్, సాంకేతిక అంశాలు, ఇతర నాణ్యత ప్రమాణాల పరిశీలన జరిపాకే.. బ్యారేజీల విషయంలో స్పష్టత వస్తుందని వెదిరె శ్రీరామ్ వివరించారు. ఆయా అంశాల పరిశీలన కోసం కమిటీకి నాలుగు నెలల సమయం ఇచ్చామని, నెల రోజుల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరామని తెలిపారు. మేడిగడ్డలో పియర్స్, కాంక్రీట్ బ్లాకులు కుంగిపోయినందున.. ఈ ప్రాజెక్టులో ఇతర చోట్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయిలో పరిశీలన జరిపాకే మేడిగడ్డను పునరుద్ధరించవచ్చా? దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటన్న దానిపై స్పష్టత వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటిలభ్యత, అంతర్రాష్ట్ర అంశాల ప్రాతిపదికనే ఆమోదం కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపిందని చెప్పారు. డిజైన్ లోపాలు తెలంగాణ నీటిపారుదలశాఖ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లవేనని.. సీడబ్ల్యూసీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికే కేంద్రం ప్రయత్నం.. తెలంగాణ, ఏపీ మధ్య జల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం, కేఆర్ఎంబీ ప్రయత్నిస్తున్నాయని.. దీనివెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని శ్రీరామ్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)లో గణాంకాలు ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నందున పరిశీలించే అవకాశం లేదని సీడబ్ల్యూసీ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాకుండా అదనపు (మూడో టీఎంసీ) పనులకు ఆమోదం లేదని కూడా స్పష్టం చేసిందని.. ఆ క్రమంలోనే ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఇతర వాణిజ్య సంస్థలు రాష్ట్రానికి రూ.28వేల కోట్ల రుణాలను నిలిపివేశాయని చెప్పారు. కేంద్రం కూడా ఈ పనులను 2021 జూలైలోనే అనుమతి లేని జాబితాలో చేర్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాల కోసం బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్‌లో.. ఎకరాకు వంద క్వింటాళ్ల పంట పండుతుందని పేర్కొందని చెప్పారు. దీనితోపాటు ప్రజలకు సరఫరా చేసే మంచినీటికి ఇంత అని, సాగునీటికి ఫీజులు, సెస్సుల వసూలు ద్వారా ఇంత అని ఆదాయం లెక్కలు చూపిందన్నారు. ప్లంజ్‌పూల్‌తో ప్రమాదం శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ప్లంజ్‌పూల్ తొలిచినట్టు అయి.. దాని పగుళ్లు డ్యాం కిందివరకు వెళ్లడం ప్రమాదకరమేనని శ్రీరామ్ పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌ల భద్రతకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇటీవలి నివేదికలు కూడా ఈ ప్రాజెక్టులకు తీవ్రమైన నిర్వహణ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే డ్యామ్‌ల స్థిరత్వానికి ప్రమాదమన్నారు. -
అమాయకుడేమి కాదు..రఘురామకు హైకోర్టు చురకలు
-
శ్రీరాముని పాటకు విద్యార్థుల నృత్యం.. వీడియో వైరల్!
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోధ్య, నూతన రామాలయం గురించే చర్చ జరుగుతోంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజూ వైరల్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కొంతమంది చిన్నారులు శ్రీరాముని పాటకు నృత్యం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో చాలా మంది సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంటారు. అయితే తాజాగా చిన్నారుల నృత్యానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారి, అందరి హృదయాలను హత్తుకుంటోంది. ఈ వీడియోలో ‘మేరీ రామ్ జీ సే కహ్ దేనా జై సియా రామ్’ అనే పాట వినిపిస్తుంటుంది. ఈ పాటకు అనుగుణమైన నృత్యాన్ని ఒక గురువు అక్కడున్న చిన్నారులకు నేర్పిస్తుంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. ఈ వీడియో @desimojito అనే పేరుతో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేశారు. ‘నా దేశం మారుతోంది’ అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటి వరకు తొమ్మి వేల మందికి పైగా వీక్షించారు. వీడియోను చూసిన యూజర్స్ కామెంట్ బాక్స్‌లో ‘జై శ్రీరాం’ అని రాస్తున్నారు. Mera desh badal raha hai ❤️❤️ pic.twitter.com/BCBjphqROn — desi mojito 🇮🇳 (@desimojito) January 2, 2024 -
‘పిండం’ మూవీ రివ్యూ
టైటిల్: పిండం నటీనటులు: శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు నిర్మాణ సంస్థ: కళాహి మీడియా బ్యానర్ నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి దర్శకత్వం: సాయికిరణ్ దైదా సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ: సతీష్ మనోహర్ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. క్రైస్తవ మతానికి చెందిన ఆంథోని(శ్రీరామ్) రైస్ మిల్లులో ఓ అకౌంటెంట్. భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివాసం ఉంటాడు. అది పురాతమైన ఇల్లు. తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు ఆంథోని. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆంథోని ప్యామిలీకి ఉహించని సంఘటనలు ఎదురవుతాయి. గర్భవతిగా ఉన్న భార్య మేరి ఆస్పత్రి పాలవుతుంది. మూగదైన చిన్నకూతురు తారను ఓ ఆత్మ ఆవహిస్తుంది. ఆ ఫ్యామిలీని చంపేందుకు క్షుద్రశక్తులు ప్రయత్నిస్తాయి. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి అన్నమ్మ(ఈశ్వరీరావు) రంగంలోకి దిగుతుంది. ఆంథోని ఫ్యామిలీని వేధిస్తుంది ఒక ఆత్మ కాదని..ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని అన్నమ్మ గుర్తిస్తుంది. అసలు ఆ ఆత్మల కథేంటి? వాళ్లు ఎలా చనిపోయారు? ఆంథోని ఆ పురాతన ఇంటిని ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆ ఇంట్లో అంతకు ముందు ఏం జరిగింది? ఆ ఇంటి నుంచి ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ ఏం చేసింది? చిన్న కూతురు తారను ఆవహించిన ఆత్మను విదిలించేక్రమంలో అన్నమ్మకు ఎదురదైన సమస్యలు ఏంటి? చివరకు ఆంథోని ఫ్యామిలీని అన్నమ్మ ఎలా రక్షించింది? 1932లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకునేందుకు లోక్‌నాథ్(అవసరాల శ్రీనివాస్)ఎందుకు ఆసక్తి చూపాడు? అనేది తెలియాలంటే ‘పిండం’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హారర్ చిత్రాలు అంటే భయపెట్టాలి. కానీ ఈ మధ్యకాలంలో హారర్ అంటే కామెడీనే అనేలా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. హారర్ జానర్ అని చెప్పి కామెడీ, రొమాన్స్, సాంగ్స్ ను ఇరికిస్తూ ప్రేక్షకులను భయపెట్టడం పక్కకి పెట్టి నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా రోజుల తర్వాత ఓ ట్రూ హారర్ ఫిల్మ్‌గా పిండం వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, హరర్ ఎలిమెంట్స్‌తో పాటు చైల్డ్ సెంటిమెంట్ అంశాలతో దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. అలా అని ఇది కొత్త కథ కాదు.. చాలా సన్నివేశాలు ఇతర హారర్ సినిమాల్లో చూసినవే ఉంటాయి. కానీ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు కట్టిపడేశాడు. ఈ కథ 1992లో ప్రారంభమై.. 1932లో సాగుతుంది. ఓ భయంకరమైన సన్నివేశంతో అన్నమ్మ పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కేస్ స్టడీ అంటూ లోక్‌నాథ్ రావడం..అన్నమ్మ గురించి తెలుసుకునే క్రమంలో కథ 1932లోకి వెళ్తుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆంథోనీ ఫ్యామిలీ ‘నాయుడమ్మ’ఇంట్లోకి రావడంతోనే ఇంట్లోనే దెయ్యం ఉంటుందని ప్రేక్షకులను అర్థమై పోతుంది. అయితే అసలు ఆ దెయ్యం కథేంటి? అది ఎవరిని ఆవహించదనే సస్పెన్స్ మాత్రం ఇంటర్వెల్ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆంథోని ఫ్యామిలోని ప్రతి వ్యక్తిపై అనుమానం కలిగించేలా సన్నివేశాలను రాసుకున్నాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో చాలా చోట్ల భయపెట్టే సన్నివేశాలు ఉంటాయి. ఇక్కడ ఏదో జరగబోతుంది అనే విషయం ప్రేక్షకుడికి తెలిసినప్పటికీ.. సీన్ ఎండింగ్లో భయపడిపోతాడు. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం రొటీన్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో మాత్రం కథనం సాగదీతగా అనిపిస్తుంది. అలాగే ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ చేసే ప్రయత్నాలు కూడా అంతగా ఆకట్టుకోలేవు. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మాత్రం గుండెలను పిండేస్తుంది. దర్శకుడి సాయి కిరణ్‌కి ఇది తొలి సినిమానే అయినా.. కొన్ని సన్నివేశాలను మాత్రం ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్లా తీర్చిదిద్దాడు. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి పిండం నచ్చుతుంది.కథ రొటీన్‌గా ఉన్నా.. కొన్ని సన్నివేశాలను మాత్రం భయపెడతాయి. ఎవరెలా చేశారంటే.. డిఫరెంట్ లుక్, బాడీ లాంగ్వేజ్‌తో శ్రీరామ్ ఆకట్టుకున్నాడు. అయితే ఇందులో ఆయన హీరోయిజం చూపించే సన్నివేశాలేవి లేవు. ఎమోషన్ సీన్లను చక్కగా నటించాడు. ఇక మేరీగా ఖుషి రవి ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించింది. సినిమా మొత్తం గర్భవతిగానే కనిపిస్తుంది. అయితే ఆమెకు కథలో బలమైన సన్నివేశాలేవి లేవు. అన్నమ్మగా ఈశ్వరిరావు అద్భుతంగా నటించింది. కథ మొత్తం ఈమె చుట్టే తిరుగుతుంది. సోఫియా, తారలుగా నటించిన ఇద్దరు చిన్న పిల్లలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తారగా నటించిన చిన్నారి నటన భయపెడుతుంది. లోక్‌నాథ్‌గా అవసరాల శ్రీనివాసరావు తన పాత్ర పరిధిమేర నటించాడు. టెక్నికల్ విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ భయం లేదు!
‘‘లాక్డౌన్ తర్వాత ప్రేక్షకులు వినోదాన్ని ఆస్వాదించే విధానం మారింది. కథ, నటీ నటుల పాత్రల్లో కొత్తదనం ఉంటేనే చూస్తున్నారు. అందుకే ప్రయోగాత్మక, కొత్త తరహా పాత్రలే చేయాలనుకుంటున్నాను. కథ నచ్చి, అందులో నా పాత్ర బలంగా ఉంటే గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా రెడీ’’ అన్నారు ఖుషీ రవి. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన హారర్ చిత్రం ‘పిండం’. ఈ చిత్రం ఈ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఖుషీ రవి మాట్లాడుతూ– ‘‘నటిగా కన్నడంలో ‘దియా’ నా తొలి చిత్రం. ఆ చిత్రం తర్వాత పెళ్లి చేసుకున్నాను. నాకో పాప ఉంది. ఇక ‘పిండం’ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాలో నేను మేరీ పాత్రలో నటించాను. కథ రీత్యా ఇద్దరు కుమార్తెలు నాకు. మూడో ప్రసవం కోసం గర్భిణిని. కెరీర్‌ప్రారంభంలోనే తల్లి పాత్రæచేస్తే నా కెరీర్ ఏమౌతుందోననే భయం, అభద్రతాభావం నాకు లేవు. నా మరో చిత్రం ‘రుద్ర’లో ట్రాన్స్‌జెండర్ పాత్ర చేస్తున్నాను. సవాల్ అనిపించే పాత్రలు చేయడం నాకు ఇష్టం’’ అని చెప్పుకొచ్చారు. -
నాతో నేనే ప్రయోగాలు చేయాలనుకుంటున్నాను: అవసరాల శ్రీనివాస్
‘‘దర్శకత్వం, నటనల కంటే నాకు రైటింగ్ అంటే ఎక్కువ ఇష్టం. నేను ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా తీసినప్పుడు ఆ తరహా చిత్రాలు అప్పుడు రాలేదు. అలానే ‘జో అచ్యుతానంద’ కూడా. ఇలా నా కథలతో నాతో నేనే ప్రయోగాలు చేయాలనుకుంటున్నా’’ అని అన్నారు రచయిత, దర్శక–నటుడు అవసరాల శ్రీనివాస్. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన హారర్ ఫిల్మ్ ‘పిండం’లో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. సాయికిరణ్ దైదా దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘సాయికిరణ్ చేసిన ‘స్మోక్’ షార్ట్ ఫిల్మ్ చూసి, తనలో రచన, దర్శకత్వ ప్రతిభ ఉందని గ్రహించాను. తను చెప్పిన ‘పిండం’ కథ నచ్చింది. ఈ సినిమాలో అతీంద్రియ శక్తులపై పరిశోధనలు చేసే లోక్‌నాథ్ పాత్ర చేశాను. ‘ప్రేమకథా చిత్రమ్’ చూసినప్పుడు కొంచెం భయపెడితే ప్రేక్షకులు సినిమాను శ్రద్ధగా చూస్తారని అర్థమైంది. కానీ కథలో హారర్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉండాలి. అప్పుడే కనెక్ట్ అవుతారు. ఇక ప్రస్తుతం ‘ఈగల్’, ‘కిస్మత్’, ‘కన్యాశుల్కం’ సినిమాల్లో నటిస్తున్నాను. రైటర్‌గా, దర్శకుడిగా ఓ మర్డర్ మిస్టరీ సినిమా స్క్రిప్ట్ రాస్తున్నాను. నా తర్వాతి చిత్రం ఇదే కావొచ్చు. అలాగే ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ సీజన్ 2 ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. -
రన్నరప్ ఆదర్శ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–13 చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో తెలంగాణ కుర్రాడు ఉప్పల ఆదర్శ్ శ్రీరామ్ రన్నరప్‌గా నిలిచాడు. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత వీరేశ్ శరణార్థి (మహారాష్ట్ర), ఆదర్శ్ శ్రీరామ్ 9.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. వీరేశ్ విజేతగా అవతరించాడు. ఆదర్శ్ శ్రీరామ్ రన్నరప్‌గా నిలిచాడు. తమిళనాడుకు చెందిన రాఘవ్ తొమ్మిది పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. బాలికల విభాగంలో మహారాష్ట్రకు చెందిన శ్రేయ విజేతగా నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత శ్రేయ 9.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నైనా గొర్లి ఏడో స్థానాన్ని పొందింది. తెలంగాణకు చెందిన కీర్తిక ఎనిమిదో స్థానంలో, దీక్షిత పదో స్థానంలో, శివాంశిక 12వ స్థానంలో నిలిచారు. -
ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు – దర్శకుడు సాయికిరణ్ దైదా
‘‘తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన హారర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ‘మా పిండం’ ఉంటుంది. భయపెట్టాలని హారర్ సీన్స్ పెట్టలేదు. బలమైన కథ ఉంది. ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు సాయికిరణ్ దైదా. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్ కానుంది. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుండి నాకు రాయడం అంటే ఇష్టం. అమెరికాలో వ్యాపారం చేస్తున్నా స్క్రిప్ట్‌లు రాసేవాడిని. కోన వెంకట్‌గారు అమెరికాలో పరిచయమయ్యారు. నేను రాసుకున్న ఓ క్రైమ్ కామెడీ కథ ఆయనకు నచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఆ సినిమా డల్లాస్‌లోనే షూటింగ్ జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా కుదరలేదు. నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకుని ‘పిండం’ తీశాను. ఇది హారర్ సినిమా కాబట్టి భయపెట్టే సీన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నెక్ట్స్ ‘కృష్ణుడి లంక’ టైటిల్‌తో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు. -
'పిండం' చూసి భయపడతారు: డైరెక్టర్ సాయి కిరణ్ దైదా
‘నల్లగొండ జిల్లాలో ఒక ఘటన జరిగింది. అది మా నాయనమ్మ చెప్పడం వల్ల నాకు బాగా గుర్తుండిపోయింది. దాని చుట్టూ కథ అల్లుకొని, ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుందని ఆలోచించాను.దీనిని హారర్ జానర్ లో చెప్తే బాగుంటుంది అనే ఆలోచనతో పిండం సినిమా మొదలుపెట్టాను. ఇప్పటి వరకు తెలుగులో చాలా హారర్ మూవీస్ వచ్చాయి. అవన్ని ఒకెత్తు.. మా పిండం మూవీ మరో ఎత్తు. హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. బలమైన కథ ఉంటుంది. స్క్రీన్ కి అతుక్కొని మరీ చూస్తారు’అని అన్నారు దర్శకుడు సాయి కిరణ్ దైదా. శ్రీరామ్, ఖుషి రవి జంటగా నటించిన తాజా చిత్రం ‘పిండం’.'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు సాయికిరణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► యదార్థ ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకొని ‘పిండం’సినిమాను తెరకెక్కించాం. ప్రేక్షకులు హారర్ జానర్ సినిమాలు చూడటానికి వచ్చేది భయపడటం కోసమే. ఆ హారర్ అనుభూతిని కలిగించి, భయం ఇవ్వాలి. ఇది నా మొదటి సినిమా కాబట్టి భారీ తారాగణం ఉండదు. కథ బలంగా ఉండాలి. దానిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ని ఎంతో శ్రద్ధతో రాసుకోవడం జరిగింది. హారర్ సినిమా కాబట్టి ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. సినిమా మొత్తం పూర్తయ్యాక, సినిమా చూసుకొని విజయం పట్ల మరింత నమ్మకం కలిగింది. ► పిండం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు పిండాకారం అంటారు. అలాగే ఒక మనిషి చనిపోయాక పెట్టేది కూడా పిండం అనే అంటాం. అసలు అది ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కథలో కోర్ పాయింట్ అదే. నేను కథ రాసుకున్నప్పుడే పిండం టైటిల్ అనుకున్నాం. ఇలాంటి నెగటివ్ టైటిల్ ఎందుకు, అసలే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ అని నా టీమ్ మెంబర్స్ కూడా పిండం టైటిల్ మార్చమన్నారు. అయితే ఒక మూఢ నమ్మకాన్ని పట్టుకొని, కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ ని కాదని వేరే టైటిల్ పెట్టడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది. ►ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్ చదివాను. సబ్జెక్ట్ లోకి మరింత లోతుగా వెళ్ళడం కోసం అంతగా రీసెర్చ్ చేశాను. ఎప్పుడూ వచ్చే హారర్ సినిమాల్లాగా కాకుండా, కొత్తగా ఎలా చూపించాలి అనే దానిపై ఎంతో వర్క్ చేశాము. క్లైమాక్స్ సన్నివేశంలో.. వివిధ భాషల్లో ఉండే నిజమైన మంత్రాలను తెలుసుకొని పెట్టడం జరిగింది. ► టీజర్ కి, ట్రైలర్ కి రెండింటికీ మంచి స్పందన వచ్చింది. కేవలం టీజర్ తోనే మా సినిమా బిజినెస్ అయిపోయింది. ట్రైలర్ చూసి ఎందరో అభినందించారు. మీరు టీజర్, ట్రైలర్ లో చూసిన దానికంటే ఎన్నో రెట్ల కంటెంట్ సినిమాలో ఉంటుంది. ► ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన హారర్ సినిమాలన్నీ ఒక ఎత్తు. మా పిండం సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏదో భయపెట్టాలని ఒక హారర్ సీన్ పెట్టడం అలా ఉండదు. బలమైన కథ ఉంటుంది. స్క్రీన్ కి అతుక్కొని మరీ చూస్తారు. సినిమా అంత ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రలకు మనం ఎంతలా కనెక్ట్ అయితే, భయం అనేది అంత బాగా పండుతుంది. ఊరికే ఏదో హారర్ పెట్టాలి అన్నట్టుగా ఉండదు. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అప్పుడే భయం ఇంకా ఎక్కువ పండుతుంది. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ సినిమాలకి ట్రెండ్ కూడా బాగుంది. మాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాం. ►ఈ సినిమాలో సంగీతానికి చాలా మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. ►త్వరలో కృష్ణుడి లంక అనే క్రైమ్ కామెడీ సినిమా చేయబోతున్నాను. హీరో పేరు కృష్ణ, అతను శ్రీలంకలో ఉంటాడు. ఎందుకు అక్కడ ఉంటున్నాడు? అతని సమస్య ఏంటి? అనేది కథ. ఇంకా హీరో ఎవరు అనేది అనుకోలేదు. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాను. -
ముఖ్యమంత్రి గురించి ఇష్టమొచ్చినట్లు రాస్తారా?
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష నిమిత్తం విశాఖపట్నంలో ప్రభుత్వ క్యాంప్ కార్యాలయాల ఏర్పాటుకు ప్రదేశాలను గుర్తిస్తూ ఐఏఎస్‌ల కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 2283ని సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన రాజధాని రైతులు అందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి ఇష్టమొచ్చినట్లు రాయడంపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డికి కులాన్ని ఆపాదించడాన్ని తప్పుపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ.. మీడియా దృష్టిని ఆకర్షించడానికే పిటిషనర్లు ఇలా చేస్తున్నారన్నారు. ఇలా ఏది పడితే అది రాసి పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని, ఇలాంటి వ్యాజ్యాలను విచారించడానికి వీల్లేదని అన్నారు. వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలతో నిర్లక్ష్యపూరితంగా దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలకు విచారణార్హత లేదని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందని వివరించారు. ఇలా చేయడం కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వ్యవహారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నందున, ఈ వ్యాజ్యం కూడా ఆ ధర్మాసనానికే వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ విషయం స్పష్టంగా తెలిసి కూడా రిట్ పిటిషన్ దాఖలు చేయడం ‘ఫోరం షాపింగ్’ కిందకే వస్తుందని వివరించారు. ఈ వ్యాజ్యం విచారణ నుంచి తప్పుకోవాలని మిమ్మల్ని (జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లును) అడగటంటంలేదని, వ్యాజ్యం ధర్మాసనం ముందుకు మాత్రమే వెళ్లాలని చెబుతున్నామని చెప్పారు. ఒకవేళ విచారణ నుంచి మిమ్మల్ని తప్పుకోవాలని కోరితే (రెక్యూజ్) దాన్ని రాతపూర్వకంగానే కోరతామన్నారు. రాజధాని విషయంలో పిటిషనర్ల వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలనే చూడాలన్నారు. ఉద్దేశపూర్వకంగానే రిట్ పిటిషన్ వేశాం అంతకు ముందు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. తాము ఉద్దేశపూర్వకంగానే రిట్ పిటిషన్ వేశామన్నారు. ఈ వ్యవహారంలో తమ వ్యక్తిగత ప్రయోజనాలు, ఆస్తి హక్కు ముడి పడి ఉన్నాయని, అందువల్లే పిల్ కాకుండా రిట్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. కార్యాలయాల తరలింపుపై గతంలో పిల్ దాఖలు చేసిన పిటిషనర్లు వేరని, వారికీ ప్రస్తుత వ్యాజ్యంలోని పిటిషనర్లకు సంబంధం లేదని తెలిపారు. రాజధాని విషయంలో త్రిసభ్య ధర్మాసనం తీర్పు అమల్లో ఉందని, దాని ప్రకారం కార్యాలయాలను రాజధాని నుంచి తరలించడానికి వీల్లేదన్నారు. ఆ తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 2283 జారీ చేసిందన్నారు. క్యాంప్ ఆఫీస్ అంటే టెంట్ (గుడారం)లో ఉండాలని, బంగళాల్లో ఉండకూడదని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
'మరణించిన తర్వాత అసలేం జరుగుతుంది?'.. ఆసక్తిగా ట్రైలర్!
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం పిండం. ఈ చిత్రానికి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. హారర్ ఫిల్మ్‌గా తెరకెక్కించిన ఈ మూవీ ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనేది ఉప శీర్షిక. ఆరోహి దైదా సమర్పణలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూడగానే ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా సినిమా తీసినట్లు తెలుస్తోంది. నిజంగానే దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? అనే కోణంలోనే చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం అందించారు. ఈనెల 15న మిమ్మల్ని భయపెట్టేందుకు వస్తోంది. -
ఇది కచ్చితంగా ఫోరం షాపింగే
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష నిమిత్తం విశాఖపట్నంలో ప్రభుత్వ క్యాంప్ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తిస్తూ ఐఏఎస్‌ల కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 2283ని సవాలు చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేయడం వెనుక రాజధాని రైతుల దురుద్దేశాలను అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టు ముందుంచారు. ఈ జీవోపై రిట్ పిటిషన్ దాఖలు చేయడం ఫోరం షాపింగ్ (కావాల్సిన న్యాయమూర్తి వద్దకు కేసు వచ్చేలా చేయడం) కిందకే వస్తుందని కోర్టుకు నివేదించారు. నీతి లేని వ్యక్తులే ఇలాంటి తప్పుడు మార్గాలను అనుసరిస్తారని తెలిపారు. జీవో 2283ని రద్దు చేయాలని, అప్పటివరకు జీవో అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యంపై రిజిస్ట్రీ ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా నంబరు కేటాయించడంపై శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపు జరుగుతోందంటూ ధర్మాసనం ముందు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలు చేసిన అమరాతి పరిరక్షణ సమితి, మరికొందరు.. ఇప్పుడు అదే అంశంపై రిట్ పిటిషన్ వేయడం ఆశ్చర్యకరమని ఏజీ అన్నారు. కార్యాలయాల తరలింపు వ్యవహారం రాజధాని అంశంతో ముడిపడి ఉందని, అలా తరలించడం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునకు విరుద్ధమని పిటిషనర్లు వారి వ్యాజ్యంలో స్వయంగా పేర్కొన్నారని, వారికి ఎలాంటి దురుద్దేశాలు లేకుంటే పిల్ దాఖలు చేసి ఉండే వారని తెలిపారు. పిల్ దాఖలు చేస్తే ఈ వ్యవహారం మొత్తం ధర్మాసనం ముందుకే వస్తుందని తెలిసి రిట్ దాఖలు చేశారన్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారంలో కూడా ఇలానే ఫోరం షాపింగ్‌కు పాల్పడ్డారని, దీంతో ధర్మాసనమే ఆ వ్యాజ్యాలను తెప్పించుకుని విచారణ జరిపిందన్నారు. రాజధాని వ్యవహారం కేవలం పిటిషనర్లకు మాత్రమే సంబంధించింది కాదని, పెద్ద సంఖ్యలో ప్రజలకు సంబంధించిందన్నారు. అందువల్ల పిల్ మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కార్యాలయాల తరలింపు విషయంలో అభ్యంతరాలుంటే తమ వద్దకు రావాలని పిటిషనర్లకు గతంలోనే ధర్మాసనం స్వేచ్ఛనిచ్చిందని, ఈ విషయం వారికీ తెలుసునన్నారు. అయినా ధర్మాసనం ముందుకు వెళ్లకుండా సింగిల్ జడ్జి వద్దకు వచ్చారని వివరించారు. చాలా తెలివిగా పిటిషన్‌ను తయారు చేశారని, అంతే తెలివిగా ధర్మాసనం ముందుకు రాకుండా చేశారన్నారు. వారి అంతిమ ఉద్దేశం ఫోరం షాపింగేనని చెప్పారు. ఫోరం షాపింగ్ విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఆయన కోర్టు ముందుంచారు. అసలు ఈ పిటిషన్ విచారణార్హతపైనే ఏజీ అభ్యంతరాలు లేవనెత్తారు. దాదాపు గంటసేపు వాదనలు వినిపించిన ఏజీ.., తదుపరి వాదనలకు సమయం లేకపోవడంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
ముప్పైకి పైగా భయపడే సీన్లు ఉన్నాయి
‘‘నా 30 ఏళ్ల వయసులోనే ఐటీ కంపెనీలను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేశాను. దాంతో సినిమా తీయడం సులభం అనుకున్నాను. కానీ వంద కాదు.. వెయ్యి కోట్లు ఉన్నా సినిమా చేయడం అంత సులభం కాదని తెలుసుకున్నాను. వందల మంది కలిసి పని చేస్తూ, అన్నీ కలిసి వస్తేనే ఓ సినిమా పూర్తవుతుంది. లేదంటే ఎన్ని కోట్లు డబ్బులున్నా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’’ అన్నారు యశ్వంత్ దగ్గుమాటి. శ్రీరామ్, ఖుషీ జంటగా ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన హారర్ ఫిల్మ్ ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా యశ్వంత్ దగ్గుమాటి మాట్లాడుతూ– ‘‘నాకు యూఎస్‌లో ఐటీ కంపెనీలున్నాయి. సాయికిరణ్‌కు సినిమాలపై ఆసక్తి. ఓ సినిమా చేద్దామని ఇండియా వచ్చాం. సిద్ధు జొన్నలగడ్డతో మేం చేయాల్సిన ‘డల్లాస్ దేశీ దొంగలు’ సినిమా లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత మరో కథ అనుకున్నాం. అది కూడా కుదర్లేదు. ఆ నెక్ట్స్ ‘పిండం’ కథను రెడీ చేశారు సాయికిరణ్. ఓ సందర్భంలో సాయికిరణ్ వాళ్ల నాన్నమ్మ ఓ భవంతిని చూపించి, ఓ కథ చె΄్పారట. ఆ కథకు కొన్ని కల్పిత అంశాలు జోడించి ‘పిండం’ కథ రాశారు. ఈ సినిమాలో ముప్పైకి పైగా భయపడే సన్నివేశాలు ఉన్నాయి. 1930, 1990, 2023.. ఇలా మూడు కాలమానాల్లో స్క్రీన్‌ప్లే ఉంటుంది. ఇక మా సంస్థలో మొదలైన తొలి చిత్రం ‘డల్లాస్‌లో దేశీ దొంగలు’ ఉంటుంది. మరికొన్ని కథలు ఉన్నాయి’’ అన్నారు. -
ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్మడమే రఘురామ ధ్యేయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదిస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. సంక్షేమ పథకాల్లో అక్రమాలు జరిగాయని, పలువురికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ వ్యాజ్యంలో ముఖ్యమంత్రి జగన్, ఎంపీ వి.విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేయడంపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. దురుద్దేశాలతోనే వీరందరినీ వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారని నివేదించారు. ప్రభుత్వంపై, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై రఘురామ విషం చిమ్మడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. వ్యక్తిగత కక్షతోనే ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను తప్పుబడుతూ వ్యాజ్యం దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్న రఘురామ అందులో సంబంధం లేని వారిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారన్నారు. ఈ పిల్ దాఖలు చేసిన తరువాత సీఎంను వదిలేదిలేదంటూ మీడియా సమావేశాలు నిర్వహించి ప్రకటనలు చేశారని నివేదించారు. అందుకు అనుమతించొద్దు ప్రజా ప్రయోజనం పేరుతో వ్యాజ్యం దాఖలు చేసిన రఘురామ వాస్తవాలను కోర్టు ముందు ఉంచలేదని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను పిల్లో పేర్కొన్నట్లు డిక్లరేషన్ ఇచ్చిన రఘురామ వాస్తవానికి పలు కీలక విషయాలను తొక్కిపెట్టారన్నారు. ఆయన చైర్మన్, ఎండీగా వ్యవహరించిన కంపెనీ పలు రుణ సంస్థలకు రూ.700 కోట్లకు పైగా రుణాలను ఎగవేసిందన్నారు. పిటిషనర్ సీబీఐ కేసు కూడా ఎదుర్కొంటున్నారని శ్రీరామ్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వివరాలను ఆయన వ్యాజ్యంలో పేర్కొనలేదన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో రఘురామపై నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేయాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు అందిన విషయాన్ని కూడా దాచి పెట్టారని తెలిపారు. వ్యక్తిగత, రాజకీయ అజెండాతో.. వ్యక్తిగత, రాజకీయ అజెండాతో రఘురామ ముందుకెళుతున్నారని, అందుకు ఈ వ్యాజ్యమే ఉదాహరణ అని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై విషం చిమ్మేందుకు కోర్టులను వేదికగా చేసుకుంటున్నారని తెలిపారు. ఇందుకు ఎంత మాత్రం అనుమతించొద్దని కోర్టును ఏజీ అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం విచారణార్హతపై తమకు అభ్యంతరం ఉందన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే ముందు రఘురామకృష్ణరాజు దురుద్దేశాలను, ఆయనకెంత విశ్వసనీయత ఉందో పరిశీలించాలని కోరారు. ముందు దీన్ని తేల్చిన తరువాతే ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణను చేపట్టాలన్నారు. పిల్ నిబంధనల ప్రకారం ప్రతివాదుల జాబితా నుంచి ఎవరినైనా తొలగించే అధికారం ధర్మాసనానికి ఉందన్నారు. ఆ విచక్షణాధికారాన్ని ఇప్పుడు వినియోగించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న వారిని ప్రతివాదుల జాబితా నుంచి తొలగించవచ్చన్నారు. అంతేకాక వారికి నోటీసులు కూడా అవసరం లేదన్నారు. ముందు విచారణార్హతపై తేలుస్తాం.. వాదనలు విన్న హైకోర్టు తొలుత రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఈ వ్యాజ్యం విచారణార్హతపై తేలుస్తామని స్పష్టం చేసింది. ఆ తరువాతే తదుపరి ప్రక్రియ చేపడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రతివాదులందరూ విచారణార్హతపై అభ్యంతరాలు తెలియచేయాలని, అందువల్ల వారందరికీ నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. రేపు ఎవరూ తమకు వాదనలు వినిపించే అవకాశం రాలేదని అనకూడదని పేర్కొంది. న్యాయ ప్రయోజనాల నిమిత్తం అందరికీ నోటీసులు జారీ చేస్తున్నామంది. నోటీసులు జారీ చేయడం అందరికీ మంచిదని హైకోర్టు స్పష్టం చేసింది. పలువురికి నోటీసులు జారీ... ఈమేరకు వ్యక్తిగత ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలు కంపెనీలకు, డైరెక్టర్లకు కూడా నోటీసులు ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ, గనులు, పరిశ్రమలు, సమాచార పౌర సంబంధాలు, వైద్య, ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు సైతం నోటీసులు జారీ చేసింది. మొత్తం 41 మందికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు వారందరినీ రఘురామకృష్ణరాజు వ్యాజ్యం విచారణార్హతపై అభ్యంతరాలను తెలియచేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదు.. మధ్యంతర ఉత్తర్వుల కోసం తాము అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని, దాన్ని అనుమతించాలని రఘురామకృష్ణరాజు తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు కోరారు. ఇసుక, మద్యం పాలసీలకు సంబంధించిన రికార్డులను జాగ్రత్త చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఆ పాలసీలకు సంబంధించిన రికార్డులను ధ్వంసం చేస్తున్నారని, వాటిని సీజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ ప్రభుత్వ హయాంలో కోర్టులో రికార్డులను మాయం చేసిన ఘటన కూడా చోటు చేసుకుందని వ్యాఖ్యలు చేయడంపై అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. కోర్టులో రికార్డులు మాయం అయిన ఘటనను ప్రభుత్వానికి ఆపాదించడం తగదన్నారు. ఇలా ఏదిపడితే అది మాట్లాడితే తాము కూడా అదే విధంగా మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రతివాదులకు తాము వ్యక్తిగతంగా నోటీసులు అందచేసేందుకు అనుమతినివ్వాలని మురళీధరరావు కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు రిజిస్ట్రీనే నోటీసులు పంపుతుందని తేల్చి చెప్పింది. -
ప్రివిలేజ్ ఫీజు తొలగింపుతో టీడీపీ నేతలు లబ్ధి పొందారు
సాక్షి, అమరావతి: మద్యం ప్రివిలేజ్ ఫీజు రద్దు వల్ల టీడీపీ నేతలు పైనుంచి కింది వరకు లబ్ధి పొందారని సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు వివరించారు. అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వారి పార్టీ నేతలకు, కావాల్సిన వారికి ఆయాచిత లబ్ధి చేకూర్చారనేందుకు ఆధారాలున్నాయని తెలిపారు. డబ్బు లావాదేవీల వ్యవహారాలు తదుపరి దర్యాప్తులో బయటకు వస్తాయన్నారు. ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆయన డిస్టిలరీకి లబ్ధి చేకూర్చారని తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు కొల్లు రవీంద్ర దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గురువారం మరోసారి విచారణ జరిపారు. ఏజీ ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు తొలగింపు నోట్ ఫైల్‌ను సిద్ధం చేశారని, దీనికి అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆమోదముద్ర వేశారని తెలిపారు. దీనివల్ల ఖజానాకు రూ.1,299 కోట్ల మేర నష్టం కలిగిందన్నారు. ఈ నష్టాన్ని కాగ్ సైతం ధ్రువీకరించిందని చెప్పారు. ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపలేదని, మంత్రి మండలిలో, అసెంబ్లీలో చర్చించలేదని తెలిపారు. ప్రివిలేజ్ ఫీజు తొలగింపు పూర్తిగా రాజకీయ నిర్ణయమని చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు తదితరులకు పీసీ యాక్ట్‌లోని సెక్షన్ 17ఏ వర్తించదన్నారు. 2018 జూలైకి ముందు నేరం జరిగినందున గవర్నర్ అనుమతి అవసరం లేదన్నారు. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. దర్యాప్తు అధికారులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని, దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ దశలో పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తు ముందుకెళ్లదన్నారు. అంతేకాక 31–10–23న పిటిషనర్లపై సీఐడీ కేసు నమోదు చేసిందని, ఆ వెంటనే వారిద్దరూ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారన్నారు. దర్యాప్తును కొనసాగనివ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అనంతరం చంద్రబాబు, రవీంద్రల తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రివిలేజ్ ఫీజు తొలగింపు ఫైల్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరనేలేదన్నారు. అప్పటి ఎక్సైజ్ మంత్రి, కమిషనర్ స్థాయిలోనే నిర్ణయం జరిగిందని తెలిపారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో జరిగిన పొరపాట్లను క్రిమినల్ చర్యలుగా చిత్రీకరించడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. రాతపూర్వక వాదనలను సమర్పించిన తరువాత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేయనుంది. -
భూమికను చంపేయాలన్నంత కోపం వచ్చింది: హీరో శ్రీరామ్
శ్రీరామ్.. ఈయన అసలు పేరు శ్రీకాంత్. కానీ తెలుగులో ఈ పేరుతో ఇదివరకే ఓ నటుడు ఉండటంతో శ్రీరామ్‌గా వెండితెరపై అడుగుపెట్టాడు. తండ్రి బ్యాంకు ఉద్యోగి. తల్లి కేంద్రప్రభుత్వ ఉద్యోగి. తండ్రి మొదట్లో నాటకాలు వేసి కళాకారుడిగా గుర్తింపు పొందాడు. అలా చిన్నతనంలోనే శ్రీరామ్‌కు నటన మీద ఆసక్తి ఏర్పడింది. మొదట్లో నాటకాలు వేసిన ఇతడికి కెరీర్ ప్రారంభంలో సినిమా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయి. హీరోగా ఛాన్సులిస్తామన్నవాళ్లు చివర్లో ఇతడిని తీసేసి వేరేవాళ్లతో షూటింగ్ మొదలుపెట్టేవాళ్లు. తెలుగులో ఎంట్రీ అలా వరుస షాకుల అనంతరం రోజా కూటం అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఒకరికి ఒకరు మూవీతో తెలుగు వారికీ దగ్గరయ్యాడు. తమిళంలో హీరోగా కొనసాగిన ఇతడు తెలుగులో మాత్రం సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న శ్రీరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ పరిస్థితిలో లేను.. అందుకే! 'నేను ఒకరికి ఒకరు, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి.. రెండు సినిమాలకు ఒకేసారి సంతకం చేశాను. రెండు సినిమాలు ప్రకటించారు. అయితే అప్పుడు నేను ఆస్పత్రిపాలై ఉన్నాను. ఫైట్స్ చేసే పరిస్థితిలో లేను. నా కోసం పోరాట సన్నివేశాలను తగ్గించడం అస్సలు కరెక్ట్ కాదు. అలా నేను నటించి సినిమాకు న్యాయం చేయలేను అనే ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాను. పారిపోయింది.. అందుకే హీరోయిన్ భూమికతో గొడవలు కూడా జరిగాయి. సగం పాట అయిపోయాక సెట్ నుంచి పారిపోయింది. ఆ తర్వాత ఓ రోజు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించినప్పుడు షూటింగ్ ఎలా జరిగింది? అని అడిగింది. కత్తి తీసుకుని అక్కడే పొడిచేయాలనిపించింది. ఈ మధ్యే మేమిద్దరం మాట్లాడుకున్నాం.. అప్పటి సంఘటన తలుచుకుని నవ్వుకున్నాం. ఇప్పుడంటే నవ్వుకుంటున్నాం కానీ ఆ రోజు మాత్రం చాలా కోపమొచ్చింది' అని చెప్పుకొచ్చాడు శ్రీరామ్. చదవండి: లగ్జరీ లైఫ్ వదిలి ఇండియాకు.. హీరోగా సూపర్ సక్సెస్.. కానీ.. -
భయపెట్టే పిండం!
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన హారర్ ఫిల్మ్ ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఆరోహి దైదా సమర్పణలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ‘‘ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా ఈ సినిమా తీశాం. స్క్రీన్ ప్లే హైలైట్‌గా ఉంటుంది. డిసెంబరు 7న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం అందించారు. -
చంద్రబాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కనుసన్నల్లోనే అప్పటి మద్యం కుంభకోణం జరిగిందని సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. మంత్రి మండలిలో చర్చలేకుండానే వరుసగా జీవోలు జారీ చేశారని, తద్వారా పలు డిస్టిలరీలకు, బార్లకు లబ్ధి చేకూర్చారని ఆయన వివరించారు. ఇందులో చంద్రబాబుతో పాటు అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర నిందితులకు సైతం సంబంధం ఉందన్నారు. వీరి చర్యల వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్ సైతం తేల్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్వలాభం కోసం, డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చేందుకే నిర్ణయాలు తీసుకున్నారని ఆయన వివరించారు. అప్పటి అధికార పార్టీకి చెందిన నేత డిస్టిలరీకి సైతం ఇదే రీతిలో లబ్ధి చేకూర్చారని శ్రీరామ్ తెలిపారు. మద్యం కుంభకోణంలో కొల్లు రవీంద్రకు డబ్బు అందిన వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని వాస్తవాలు దర్యాప్తులో బయటపడుతాయని చెప్పారు. ఎఫ్ఐఆర్లో అన్ని అంశాలను పేర్కొనాల్సిన అవసరం లేదన్నారు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఆయన కోర్టును అభ్యర్థించారు. ముందస్తు బెయిల్ పేరుతో దాఖలు చేసిన ఈ పిటిషన్.. క్వాష్ పిటిషన్ రీతిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తిస్తుందా? లేదా అన్న విషయాన్ని తేల్చాలన్నారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు సహకారం మద్యం కుంభకోణం కేసులో రెండో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు. రవీంద్ర తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదులో ఎక్కడా పిటిషనర్ పేరు లేదన్నారు. సీఐడీ మాత్రం కొల్లు రవీంద్రను రెండో నిందితుడిగా చేర్చిందని తెలిపారు. మంత్రి మండలి నిర్ణయం మేరకే పిటిషనర్ వ్యవహరించారన్నారు. ఈ నిర్ణయాల వల్ల ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తారని ఆయన తెలిపారు. అడ్వొకేట్ జనరల్ తన వాదనల సమయంలో 17ఏ గురించి ప్రస్తావించడంతో దానిపై వాదనలు వినిపిస్తానని, విచారణను వాయిదా వేయాలని పోసాని కోరారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. -
చంద్రబాబుపై తొందరపాటు చర్యలుండవు
సాక్షి, అమరావతి: అస్మదీయుల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై నమోదు చేసిన కేసులో నిందితుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోబోమని సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేయడంతో పాటు క్విడ్ ప్రోకోకు పాల్పడినందుకు సీఐడీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి మంత్రులు నారాయణ, లోకేశ్ తదితరులను నిందితులుగా చేర్చింది. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మల్లికార్జునరావు మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్న నేపథ్యంలో ఆ బెయిల్ ఇచ్చిన ఉద్దేశం నెరవేరేంత వరకు ఆయన విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు ఉండవని తెలిపారు. మద్యం కుంభకోణం కేసులోనూ ఇలాంటి హామీనే ఇచ్చానని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు సైతం అదే హామీ ఇస్తున్నానని తెలిపారు. కంటిశస్త్ర చికిత్స నిమిత్తం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ముందుకెళ్లే ఉద్దేశం తమకు లేదన్నారు. అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన హామీని నమోదు చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ రకంగానూ ముందుకెళ్లొద్దంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆదేశిస్తూ గతంలో తానిచ్చిన ఉత్తర్వులను ఈ నెల 28 వరకు హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక కుంభకోణం.. ముందస్తు బెయిల్‌పై నేడు విచారణ ఉచిత ఇసుక విధానం పేరుతో ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం కలిగించినందుకు సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు బుధవారం విచారణ జరపనున్నారు. తనను రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం తనపై కేసుల మీద కేసులు పెడుతోందన్నారు. వేధింపులకు గురి చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ కేసు నమోదు చేసిందన్నారు. తాను ఏ అంశంపై ప్రశ్నిస్తే ఆ అంశానికి సంబంధించి కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అక్రమాలపై గళం విప్పకుండా చేసేందుకే ప్రభుత్వం తనపై తప్పుడు కేసు నమోదు చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. -
అనుకున్నవన్నీ జరగవు
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటించిన చిత్రం ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’. జి. సందీప్ దర్శకత్వంలో శ్రీ భరత్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం పోస్టర్‌ను హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన సందీప్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. జి. సందీప్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘నరేశ్‌గారు క్రైమ్, కామెడీ జానర్ చిత్రాలు ఎన్నో చేశారు. మా టైటిల్ లాంచ్ చేయడానికి ఆయనే కరెక్ట్ అనిపించింది’’ అన్నారు శ్రీరామ్ నిమ్మల. ఈ చిత్రానికి కెమెరా: చిన్నా రామ్, జీవీ అజయ్, సంగీతం: గిడియన్ కట్ట, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: బీవీ నవీన్. -
సినిమాలు లేక షార్ట్ ఫిల్మ్ చేస్తున్న: ఎల్. బి. శ్రీరామ్
-
చంద్రబాబు కనుసన్నల్లోనే ‘ఫైబర్ గ్రిడ్’ అక్రమాలు
సాక్షి, అమరావతి : ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అక్రమాలన్నీ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కనుసన్నల్లోనే జరిగాయని హైకోర్టుకు సీఐడీ నివేదించింది. ప్రాజెక్టు రూపకల్పన మొదలు అమలు వరకు ప్రతి దశలో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వివరించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.333 కోట్లకు పెంచారని చెప్పారు. ఈ విషయాన్ని పలువురు వాంగ్మూలాల్లో స్పష్టంగా చెప్పారన్నారు. ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టులో అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ జరిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇరుపక్షాలు పోటాపోటీగా వాదనలు వినిపించాయి. వాదనలు పూర్తవడంతో తీర్పును రిజర్వ్ చేస్తూ జస్టిస్ సురేష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. టెండర్ నిబంధనలు, ఒప్పందంలో నిర్దేశించిన ప్రమాణాలకు భిన్నంగా కాంట్రాక్టు సంస్థ నాసిరకం సామగ్రిని ఉపయోగించిందని, దీనివల్ల ఖజానాకు రూ.115 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. ఈ మొత్తాన్ని టెరాసాఫ్ట్ అధినేత, చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి హరిప్రసాద్ తొలుత తన కుటుంబ సభ్యుల ఖాతాలకు, అక్కడి నుంచి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించారన్నారు. ఈ విషయంలో మరిన్ని వివరాలను రాబట్టేందుకు చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అసలు వేమూరి హరిప్రసాద్ చంద్రబాబు సిఫారసుతోనే గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడు అయ్యారన్నారు. టెరాసాఫ్ట్‌కు లబ్ధి చేకూర్చేందుకే ఎలాంటి కారణం లేకుండా టెండర్ గడువును పొడిగించారని తెలిపారు. చంద్రబాబు కార్యాలయం మౌఖిక ఆదేశాలతో టెండర్ గడువు చివరి తేదీకి ముందు రోజు టెరాసాఫ్ట్‌ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారని కోర్టుకు నివేదించారు. సంబంధిత శాఖకు ఇన్చార్జ్గా ఉన్న ఓ ఉన్నతాధికారి టెరాసాఫ్ట్‌కు ప్రాజెక్టు అప్పగించడంపై అభ్యంతరం తెలిపారని, దీంతో ఆయన్ని బదిలీ చేసి, నామమాత్రపు పోస్టు ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు పాత్రకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభించలేదని, ఆ తరువాత సీఐడీ పలువురు వాంగ్మూలాలను నమోదు చేసి, లోతైన దర్యాప్తు చేసిందన్నారు. దీంతో చంద్రబాబు పాత్రపై పలు ఆధారాలు లభించాయని, ఆయన్ని నిందితునిగా చేర్చామని అన్నారు. చంద్రబాబు కుమారుడు రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చాలా పలుకుబడి కలిగిన వ్యక్తే కాక, బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసి, సాక్ష్యాలను తారుమారు చేయగల సమర్థత ఉన్న వ్యక్తి కూడానని కోర్టుకు వివరించారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందువల్ల ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. చంద్రబాబుపై కేసు నమోదు వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు. చంద్రబాబు లబ్ధి పొందినట్లు ఒక్క ఆధారం చూపలేదు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. సీఐడీ ఈ కేసు నమోదు చేసి రెండేళ్లయిందని, ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి చేయలేదని, చార్జిషీట్ దాఖలు చేయలేదని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం పెంపు పూర్తిగా సంబంధిత శాఖ అంతర్గత విషయమన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా చంద్రబాబు లబ్ధి పొందినట్లు సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపడంలేదన్నారు. ఈ రెండేళ్లు చంద్రబాబు బయటే ఉన్నారని, ఒక్క సాక్షిని కూడా ప్రభావితం చేయలేదని చెప్పారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వ ప్రోద్బలంతో సీఐడీ ఈ కేసు నమోదు చేసిందన్నారు. ప్రతి కేసులో చంద్రబాబును జైలులోనే ఉంచాలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోందన్నారు. -
సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ఏజీ శ్రీరామ్
-
బాబు కనుసన్నల్లోనే ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు
సాక్షి, అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్లో మార్పులు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. అలైన్మెంట్ ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి, దానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు దక్కించుకున్న సంస్థ చేత అలైన్‌మెంట్‌ను తయారు చేయించారని వివరించారు. ఈ మార్పుల ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌కు చంద్రబాబు లబ్ధి చేకూర్చారని చెప్పింది. అందుకు ప్రతిఫలంగా రమేష్ కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇది క్విడ్ ప్రోకోయేనని వెల్లడించింది. ఇప్పటికే స్కిల్ కుంభకోణం కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు.. ఐఆర్ఆర్ ముసుగులో జరిగిన భూ దోపిడీ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. అలైన్మెంట్ మార్పు వల్ల రమేశ్ భూములను కాపాడటమే కాక, వాటి విలువ ఎంతో పెరిగేలా చేశారని ఆయన వివరించారు. రమేశ్ బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున డబ్బు కూడా జమ చేశారని, అందుకు లెక్కలు కూడా చూపలేదన్నారు. దానిని ఇంటి అద్దెగా చంద్రబాబు తదితరులు చెబుతున్నారని తెలిపారు. రెండేళ్ల తరువాత అద్దె చెల్లించడంలో అంతరార్థం ఏమిటో తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఇందుకోసం చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అమలు వెనుక అవినీతి జరిగింది కాబట్టే అవినీతి నిరోధక చట్టం కింద కూడా చంద్రబాబుపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ ప్రాజెక్టును నామినేషన్ పద్ధతిలో అప్పగించడాన్ని అప్పటి సీఆర్డీఏ అధికారులు వ్యతిరేకించారని, వాటిని పట్టించుకోకుండా చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దురుద్దేశంతో అర్హత నిబంధనలు కుదించేశారన్నారు. అలైన్మెంట్ పరిధిలోకి కావాల్సిన వారి భూములు రాకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ను సైతం అలాగే రూపొందించారని వివరించారు. ప్రాజెక్టు రూపకల్పన, అమలు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలను చూడాలని కోర్టును కోరారు. ఈ ప్రాజెక్టు వెనుక క్విడ్ ప్రో కో ఉందన్నారు. ఐఆర్ఆర్ పేరుతో ఆస్తులు అమ్ముకుని, డబ్బు గడించారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ కేసులో కూడా ఆయన అరెస్ట్ అయినట్లు భావించడానికి వీల్లేదన్నారు. అలా భావిస్తే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని చెప్పారు. అందువల్ల ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. లింగమనేనికి చెల్లించిన అద్దెపై సీఐడీకి అనుమానాలుంటే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి వివరణ కోరితే పూర్తి వివరాలు సమర్పించే వారిమని అన్నారు. ఇంత చిన్న దానికి కస్టోడియల్ విచారణ అవసరం ఏముందన్నారు. తాము చెల్లించిన డబ్బుకు రమేశ్ లెక్కలు చూపకుంటే అది చంద్రబాబు తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో సీఐడీ వాస్తవాలను కప్పిపుచ్చుతోందన్నారు. సీఐడీ దర్యాప్తు మొత్తం పక్షపాతంతో సాగుతోందన్నారు. కోర్టు సమయం ముగియడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేశారు. -
పరిటాల వారి నకిలీ ఓట్ల రాజకీయం
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయతీలో ఇంటి నంబరు 8–63లో 12 ఓట్లు ఉన్నాయి. అందులో ఆరుగురు స్థానికులే. మరో ఆరుగురు కర్ణాటకకు చెందిన వారు. వాళ్లంతా పోలింగ్ రోజునే ఇక్కడికి వస్తారు. ఓటు వేసి వెళ్లిపోతారు. మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు ఓట్లేయడానికే తప్ప ఇటు వైపు కన్నెత్తి కూడా చూడరు. కర్ణాటకకు చెందిన కె.ప్రతాప్ (48), బి.రమేశ్‌కుమార్ (49), వి.నాగయ్య (73), డి.వెంకటస్వామి (71), డి.వెంకటప్ప (48), వి.వెంకటస్వామి (68) పేర్లు రామగిరి మండలం నసనకోట పంచాయతీ ఓటరు జాబితాలో ఉన్నాయి. వీళ్లందరూ ఎన్నికల రోజు మినహా మిగతా రోజుల్లో ఆంధ్రలో కనిపించరు. ...రామగిరి మండలంలో ఇలాంటి నకిలీ ఓట్లు చాలా పంచాయతీల్లో ఉన్నాయి. ప్రతి పంచాయతీలో కర్ణాటక వాసులను, ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి పేర్లను ఓటరు జాబితాలో ఎక్కించి దొంగ ఓట్లు వేయించుకోవడమే పరిటాల కుటుంబం పని. సాక్షి, పుట్టపర్తి: గత ఎన్నికల్లో ఓటమి, వచ్చే ఎన్ని కల్లో గెలిచే అవకాశాల్లేవని అర్థమవడంతో ‘పరి టాల’ కుటుంబం దొంగ ఓట్లను కాపాడుకోవడానికి శతధా ప్రయత్నిస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో తాజా ఓటర్ల జాబితాపై లేనిపోని రాద్ధాంతం చే స్తోంది. పరిటాల రవీంద్ర టీడీపీలో ప్రవేశించినప్పటి నుంచి నకిలీ ఓట్లపైనే ఆధారపడ్డారు. అదే తరహాలో ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా దొంగ ఓట్ల రాజకీయం చేయాలని చూస్తు న్నట్లు తెలుస్తోంది. స్థానికంగా లేని వారి ఓట్ల తొల గింపును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.రవీంద్ర హయాంలోనే పెనుకొండ (ప్రస్తుతం రాప్తాడు) నియోజకవర్గంలో ఉన్న రామగిరి, కనగానపల్లి మండలాల్లో వేల సంఖ్యలో నకిలీ ఓట్లను చేర్చించింది పరిటాల కుటుంబం.రవీంద్రకు భయపడి అధికా రులు ఎదురు మాట్లాడేవారు కాదు. దశాబ్దాలుగా దొంగ ఓట్లతో పాటు రిగ్గింగ్, దౌర్జన్యాలతో అమాయక ప్రజల ఓట్లను వారే వేసుకొనేవారు. ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతోంది.ఫలితంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ఆంధ్రలో ఓటరు కార్డులు ఇచ్చేందుకు టీడీపీ నేతలు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. దొంగ ఓట్ల తొలగింపుపై పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అవి దొంగ ఓట్లే అని ఒప్పు కోలేక, కాదనీ చెప్పలేక రోజుకోరకంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక.. నేరుగా ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక నకిలీ ఓట్లపై పరిటాల కుటుంబం ఆధారపడింది. రవీంద్ర చేసిన హత్యాకాండను ప్రజలు మరువలేదు. నేడు వైఎస్సా ర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సంపూర్ణంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాయితీగా గెలవలేక దొంగ ఓట్లపై మాజీ మంత్రి పరిటాల సునీత గతంలో నమోదు చేయించిన దొంగ ఓట్లను కాపాడుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ ఓట్లలో అధిక శాతం పరిటాల సునీత సొంత పంచాయతీ నసన కోటలోనే ఉన్నాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా.. తమ పార్టీ ఓట్లు తొలగిస్తున్నారంటూ హంగామా సృష్టిస్తున్నారు. -
‘రిజిస్ట్రేషన్ ’ వికేంద్రీకరణ వైఎస్ జగన్ ఘనతే
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): రాష్ట్ర చరిత్రలో రిజిస్ట్రేషన్ శాఖ సేవలను గ్రామ స్థాయి వరకు వికేంద్రీకరించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ జి.శ్రీరామ్‌కుమార్ చెప్పారు. సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆన్లైన్ విధానంలో ‘రిజిస్ట్రేషన్–విధి విధానాలు’ అనే అంశంపై అవగాహన సదస్సు శనివారం జరిగింది. శ్రీరామ్‌కుమార్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కొనుగోలు, అమ్మకం దారుల ఇష్టం మేరకు గ్రామ సచివాలయాలు లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ చేయించుకోవచ్చునని శ్రీరామ్‌కుమార్ స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునీకరించడంలో భాగంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసే విధానంలో 2.ఓ సాంకేతిక టెక్నాలజీని ప్రవేశ పెట్టిందన్నారు. ఇది నూటికి నూరు శాతం ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేదిగా ఉంటుందని చెప్పారు. ఈ నెల 15 తేదీ నుంచి అమలయ్యే ఈ పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు ఇక పై ఈ–స్టాంప్ విధానాన్ని అమలు చేయనున్నామని, ఈ విధానం వల్ల ముందు తేదీలతో రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా వివాదాస్పద డాక్యుమెంట్లు సృష్టించడం సాధ్యం కాదని చెప్పారు. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. జర్నలిజం డిప్లొమో కోర్సు డైరెక్టర్ ఎల్వీకే.రెడ్డి, వర్కింగ్ జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు. -
ఎర్ర చీర చిత్రం దీపావళికి నవంబర్ 9న రిలీజ్
శ్రీరామ్, అయ్యప్ప పి. శర్మ, అజయ్ కీలక పాత్రల్లో బేబీ డమరి సమర్పణలో రూపొందిన చిత్రం ‘ఎర్ర చీర’. సుమన్ బాబు, ఎన్వీవీ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రం దీపావళికి నవంబర్ 9న రిలీజ్ కానుంది. సుమన్ బాబు దర్శకత్వం వహించారు. ‘‘అమ్మ సెంటిమెంట్, హారర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూ΄పొందించాం. 36 నిమిషాల గ్రాఫిక్స్, లక్షలాది మంది అఘోరాలతో తీసిన క్లైమాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు ఎన్వీవీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు. -
శ్రీరామ్ కార్తీక్ హీరోగా కొత్త ప్రేమ కథా చిత్రం..!
కన్ని మేడమ్ చిత్రం ఫేమ్ శ్రీరామ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అజయ్ అర్జున్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ అర్జున్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయన్ బాలా కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన 20 ఏళ్లుగా కథకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా పలు చిత్రాలకు పని చేశారు. అదేవిధంగా 2017లో విడుదలైన ఆరు అధ్యాయం చిత్రంలో ఒక భాగానికి దర్శకత్వం వహించారు. (ఇది చదవండి: ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్..‘సలార్’పై ప్రభాస్ కీలక నిర్ణయం) కాగా.. ఈ చిత్రంలో నటి క్రిష్ గురూప్ నాయకిగా నటిస్తుండగా యోగిబాబు, మునీష్ కాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి సిద్ధం కుమార్ సంగీతాన్ని, చెళియన్ ఛాయాగ్రహణం అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది కొండ ప్రాంతంలో సాగే హృదయాన్ని హత్తుకునే అందమైన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. తమిళసినిమాపై ఆసక్తి, ప్రతిభ కలిగిన యూనిట్‌తో కలిసి చేస్తున్న చిత్రం ఇది అన్నారు. కథను మాత్రమే నమ్మి రూపొందిస్తున్న ఈ చిత్రం టైటిల్, ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. తనకీ అవకాశాన్ని కల్పించిన నిర్మాత అర్జున్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. (ఇది చదవండి: రజనీకాంత్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా? బడ్జెట్లో సగం సూపర్‌స్టార్‌కే! ) -
జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై మొదటి హక్కు రాష్ట్రానికే
సాక్షి, అమరావతి : జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికే మొదటి హక్కు అని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. డిపాజిటర్ల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకే ఆస్తులపై రెండు దర్యాప్తు సంస్థల జప్తు ఉత్తర్వుల వల్ల డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్నారు. ఆస్తులను విక్రయించి డిపాజిటర్లకు ప్రయోజనం చేకూర్చాలన్న ప్రభుత్వ ప్రయత్నాల్లో తీవ్ర జాప్యం జరిగి బాధితులు నష్టపోతారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులను తిరిగి మనీలాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేయడం ఎంత వరకు సమంజసమో తేల్చాలని కోర్టును అభ్యర్థించారు.మనీలాండరింగ్, దివాలా చట్టాల కింద చేసిన జప్తులకు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన జప్తునకు మధ్య వైరుద్ధ్యం లేదని తెలిపారు.డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అగ్రిగోల్డ్ ఎగవేసిన మొత్తాలను తిరిగి చెల్లిస్తోందని నివేదించారు. రూ.20 వేలు, అంతకన్నా తక్కువ డిపాజిట్లు చేసిన వారికి ఇప్పటికే రూ.900 కోట్ల మేర తిరిగి చెల్లించినట్లు చెప్పారు. మనీలాండరింగ్, దివాలా చట్టాలు డిపాజిటర్ల పరిరక్షణకు ఉద్దేశించినవి కావని చెప్పారు. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఈడీ గానీ, బ్యాంకులు గానీ నీరుగార్చలేవని అన్నారు. అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణంలో నిందితులు వారిని వారు రక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు తిరిగి చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని ఇతర ఏ దర్యాప్తు సంస్థా నిరోధించలేదని తేల్చి చెప్పారు. ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర ఉందని చెప్పారు.అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి కొన్న తమ ఆస్తులను ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే బ్యాంకులు నిర్వహించిన వేలంలో కొన్న అగ్రిగోల్డ్ ఆస్తులను కూడా ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ మరికొన్ని కంపెనీలు, వ్యక్తులు, కుంభకోణానికి ముందే అగ్రిగోల్డ్ నుంచి కొన్న భూముల్లో నిర్మించుకున్న అపార్ట్మెంట్లను సైతం సీఐడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ప్లాట్ల యజమానులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కొద్ది రోజులుగా విచారణ జరుపుతున్నారు. గురువారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు. -
పల్లెటూరి వినోదం
తెలంగాణ నేపథ్యంలో రూపొందిన పల్లె కథా చిత్రం ‘తురుమ్ ఖాన్లు’. శివ కల్యాణ్ దర్శకత్వంలో ఎండీ ఆసిఫ్ జానీ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని ‘రంగు రంగుల చిలక...’ అంటూ సాగే తొలి పాటను దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేశారు. ‘‘పల్లెటూరి పగ, ప్రతీకారాలతో వినోదాత్మకంగా, మహబూబ్ నగర్ స్లాంగ్‌లో రూపొందిన చిత్రం ఇది’’ అని యూనిట్ తెలిపింది. నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, రియాన్. ∙ఆసిఫ్ జానీ, నక్కిన త్రినాథరావు, శ్రీరామ్ -
‘తమ్ముళ్లే’ ఆ గంజాయి బాబులు!
సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక.. ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ములేక టీడీపీ నేతలు విష సంస్కృతికి తెరలేపారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలో గంజాయి సేవించి హల్చల్ చేసిన యువకులు టీడీపీ కార్యకర్తలు అయినప్పటికీ వారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనుచరులని తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌కు సన్నిహితంగా ఉండే కార్తీక్.. ఈ నెల 23న తన స్నేహితులతో కలిసి గంజాయి సేవించి వాహనాలతో రోడ్లపై హడావుడి చేశారు. అడ్డొచ్చిన వాహనాలను ఢీకొట్టారు. ఎదురు మాట్లాడిన వ్యక్తిని చితకబాదారు. పోలీసులు పట్టుకుంటే ‘వైఎస్సార్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి’ స్టిక్కర్ చూపించారు. తాము చేసిన అరాచకాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపైకి నెట్టేందుకే ఈ స్టిక్కర్’ చూపించినట్లు తెలుస్తోంది. బురద జల్లేందుకే.. నిజానికి.. 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఘోరంగా ఓడిపోయిన పరిటాల శ్రీరామ్.. రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై బురదజల్లేందుకు ఆకతాయిలను రోడ్లపై వదిలినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. గంజాయి మత్తులో వీరంగం చేయడంతో పాటు అధికార పార్టీ నేతలను లాగాలని చూడటం తెలుగు తమ్ముళ్లకు సరికాదని వైఎస్సార్సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చాయి. ఇక ముదిగుబ్బ పోలీసుల అదుపులో ఉన్న కార్తీక్ గురించి వైఎస్సార్సీపీ నేతలు ఆరా తీయగా పరిటాల శ్రీరామ్‌కు అత్యంత సన్నిహితుడిగా తేలింది. అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో దిగిన అతని ఫొటోలూ సేకరించారు. -
ముగ్గురు పల్లెటూరి పిల్లగాళ్ల కథే తురుమ్ ఖాన్ సినిమా
నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి హీరోలుగా, పులి సీత, విజయ, శ్రీయాంక హీరోయిన్లుగా నటించిన పల్లెటూరి రివెంజ్ కామెడీ డ్రామా ఫిల్మ్ ‘తురుమ్ ఖాన్లు’. శివకల్యాణ్ దర్శకత్వంలో ఆసిఫ్ జానీ నిర్మించిన చిత్రం ఇది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శివకల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఆధునిక యుగంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్ అనే ముగ్గురు యువకులు ఒకే ఊరిలో పుట్టి, పెరిగి సరదాగా ఒకరినొకరు ఎలా ఆటపట్టించుకుంటారు? ఒకర్ని ఒకరు ఎలా ఏడిపించుకుంటారు? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘తురుమ్ ఖాన్లు’ చిత్రం చిన్న సినిమాగా విడుదలైనా రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు నిర్మాత ఆసిఫ్. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, సహనిర్మాత: కె. కల్యాణ్ రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్. -
శ్రీరామ్ చేతికి సువిలాస్ రియల్టీస్
న్యూఢిల్లీ: సుమారు రూ. 400 కోట్ల విలువైన హౌసింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న సువిలాస్ రియల్టీస్ సంస్థను సొంతం చేసుకున్నట్లు రియల్టీ రంగ కంపెనీ శ్రీరామ్ ప్రాపర్టీస్ పేర్కొంది. పూర్తి అనుబంధ సంస్థ శ్రీప్రాప్ బిల్డర్స్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా 100 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు తెలియజేసింది. సువిలాస్ ప్రస్తుతం 0.65 మిలియన్ చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. బెంగళూరులోని జలహళ్లిలో శ్రీరామ్ సువిలాస్ పామ్స్ బ్రాండుతో 6.9 ఎకరాలలో ఈ ప్రాజెక్టును చేపట్టింది. శ్రీరామ్ ప్రాపర్టీస్‌తో కుదుర్చుకున్న అభివృద్ధి నిర్వహణా కాంట్రాక్టు ద్వారా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. అయితే ప్రాజెక్టు ప్రస్తుత ప్రమోటర్లు తొలి దశలోనే మానిటైజ్‌కు తెరతీసింది. ఈ ప్రాంతానికున్న అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే బాటలో శ్రీరామ్ ప్రాపర్టీస్ ప్రాజెక్టును కొనుగోలు చేసింది. కాగా.. మరోపక్క సువిలాస్కే చెందిన మరో ప్రాజెక్టు శ్రీరామ్ సువిలాస్ గార్డెన్ ఆఫ్ జాయ్‌ను సైతం విడిగా చేజిక్కించుకున్నట్లు శ్రీరామ్ ప్రాపర్టీస్ వెల్లడించింది. 152 యూనిట్లతో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టుకు 0.2 మిలియన్ చదరపు అడుగుల విక్రయ అవకాశమున్నట్లు తెలియజేసింది. -
యువతరం ఆలోచనలతో...
శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నాగ ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మది’. రామ్ కిషన్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని నటుడు సుమన్, నటి ఆమని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగ ధనుష్ మాటాడుతూ– ‘‘యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా వినూత్నరీతిలో ఈ కథ సాగుతుంది’’ అన్నారు. ‘‘నటుడు కావాలని వచ్చిన నేను.. నా ఫ్రెండ్ బాధ చూడలేక ఈ చిత్రంతో నిర్మాతగా మారాను’ అన్నారు రామ్ కిషన్. ‘‘ఈ చిత్రంలో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది’’ అన్నారు శ్రీరామ్. కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, దర్శకుడు జై శంకర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ ఠాగూర్, సంగీతం: పీవీఆర్.రాజా. -
అమెజాన్‌లో దూసుకుపోతున్న ‘టెన్త్ క్లాస్ డైరీస్’
శ్రీరామ్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా ఇటీవల నటించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై అచ్యుత రామారావు. పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గత నెల జూలై 1వ విడుదలైన మంచి విజయం సాధించింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఇటివలె ఓటీటీకి వచ్చిన ఈ సినిమా అక్కడ సైతం ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటోంది. చదవండి: ఆ ఉసురు ఊరికే పోదు.. అనసూయ సంచలన ట్వీట్ ప్రస్తుతం ఆమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికీ మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో అవికా గోర్ శ్రీరామ్ కెమిస్ట్రీ, లవ్ స్టోరీకి అందరూ కనెక్ట్ అయ్యారు. ఇక శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజల కామెడీ టైమింగ్‌తో సినిమా ఆసాంతం వినోదభరితంగా సాగింది. కాగా ప్రముఖ- ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమైన సంగతి తెలిసిందే. సురేష్ బొబ్బలి ఈ సినిమాకు పాటలు అందించారు. -
రివ్యూనా.. ఎస్ఎల్పీనా.. పరిశీలిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరునెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ హైకోర్టు ముందు రివ్యూ పిటిషన్ లేదా సుప్రీంకోర్టు ముందు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలుచేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు కొందరు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ పెండింగ్‌లో ఉండగా రాజధాని వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాల్లో తాము విచారణ జరపడం సమంజసం కాదని స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పులపై ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు కోర్టు ధిక్కారమన్న ప్రశ్న తలెత్తదని చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసింది. ఈలోపు పిటిషనర్లు దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూద్దామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరునెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును సీఎం, మంత్రులు, అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వారిచర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి శిక్షించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు దాఖలు చేసిన కోర్టుధిక్కార పిటిషన్లు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. వీటితోపాటు రాజధాని అంశంపై వ్యాజ్యాలు కూడా విచారణకు వచ్చాయి. వీటన్నింటిని సీజే ధర్మాసనం విచారించింది. -
లైన్ చెప్పి అడ్వాన్స్ ఇచ్చేస్తే సినిమా చేయను
‘‘ఈ రోజుల్లో మానవ సంబంధాలకు చాలామంది విలువ ఇవ్వడం లేదు. కనీసం సహాయం చేసినవారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు. ఒకవేళ చెప్పినా మొక్కుబడిగా చెప్పినట్లు కనిపిస్తోంది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ‘థ్యాంక్యూ’ లాంటి సినిమా రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ‘థ్యాంక్యూ’ మాటకు ఎంత విలువ ఇవ్వాలో తెలుస్తుంది’’ అని ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ అన్నారు. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ కథానాయికలు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా కెమెరామేన్ పీసీ శ్రీరామ్ చెప్పిన విశేషాలు.. ► నేను ఓ సినిమా ఒప్పుకునే ముందు కథ మొత్తం వింటాను. ఆ కథ నా మనసుకి ఎమోషనల్‌గా నచ్చితేనే సినిమా చేసేందుకు అంగీకరిస్తాను. అంతేకానీ స్టోరీ లైన్ చెప్పి అడ్వాన్స్ చేతిలో పెడితే సినిమా ఒప్పుకోను. కథ పూర్తిగా విన్నప్పుడే దర్శకుడి విజన్ ఏంటో తెలుస్తుంది. అప్పుడే ఆ కథని ఎలా చూపించాలో నాకు అర్థం అవుతుంది. ► ‘థ్యాంక్యూ’ అనే పదంలోనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన హృదయంలోని భావాలను స్వచ్ఛంగా వ్యక్తం చేయగలం. నా తల్లితండ్రులకు నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం వారే. నా వ్యక్తిగత, సినీ ప్రయాణంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సినవారెందరో ఉన్నారు.. ఈ సినిమా చేశాక వారందరకీ థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ► ప్రతి రంగంలో టెక్నాలజీలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. అలాగే సినిమాటోగ్రఫీలోనూ సాంకేతిక పరంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. రోజురోజుకీ వందల రకాలుగా టెక్నాలజీ అప్డేట్ అవుతుంటుంది. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా మన క్రియేటివ్ విజన్‌ని బట్టే అది తెరపై కనిపిస్తుంది. దర్శకుడు చెప్పిన కథని నా కోణంలో తెరపైన ఆవిష్కరించడానికే ప్రయత్నిస్తాను. నేను ఏ సినిమా చేసినా, నా వర్కే డామినేట్ చేస్తుందని అనుకోవడంలో నిజం లేదు. కథకి ఏం కావాలో అదే ఇస్తాను. ఎవరైనా అభద్రతా భావంలో ఉంటే నేను డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ► డైరెక్షన్, సినిమాటోగ్రఫీ రెండూ వేర్వేరు. ఈ విభాగాల పని తీరు వేరుగా ఉంటుంది. దర్శకత్వం నా వృత్తి కాదు. అందుకే డైరెక్టర్ (తమిళ చిత్రాలు ‘మీరా, కురుది పునల్, వానమ్ వసప్ప డుమ్’కి దర్శకత్వం వహించారు) గా సక్సెస్ కాలేకపోయాను. భవిష్యత్తులో మెగాఫోన్ పట్టాలన్న ఆలోచన లేదు. -
స్కూల్ డేస్‌ను గుర్తు చేసే 'టెన్త్ క్లాస్ డైరీస్' రివ్యూ
టైటిల్: టెన్త్ క్లాస్ డైరీస్ నటీనటులు: శ్రీరామ్, అవికా గోర్, శ్రీనివాస్ రెడ్డి, అచ్యుత రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, నాజర్ తదితరులు దర్శకత్వం, సినిమాటోగ్రఫీ: 'గరుడవేగ' అంజి నిర్మాతలు: అచ్యుత రామారావు, రవితేజ మన్యం, రవి కొల్లిపార సంగీతం: సురేష్ బొబ్బిలి విడుదల తేది: జులై 1, 2022 అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు. పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి అజయ్ మైసూర్ సమర్పకులు. ప్రముఖ- ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అయ్యారు. 'టెన్త్ క్లాస్ డైరీస్' చిత్రం శుక్రవారం (జులై 1) ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ: మిడిల్ క్లాస్ అబ్బాయి సోమయాజ్ (శ్రీరామ్) బాగా చదువుకుని అమెరికాలో బిజినెస్ మ్యాన్‌గా స్థిరపడతాడు. డబ్బు, అమ్మాయిలు, లగ్జరీతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ తన జీవితంలో ఏదో చిన్న అంసతృప్తి. ఈ వెలితీతో జీవిస్తున్న అతనికి ఆనందం లేదు. అతని భార్య కూడా వదిలేస్తుంది. తను ఏది మిస్ అవుతున్నాడో తెలుసుకునేందుకు ఒక సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తాడు. ఈ క్రమంలోనే అతని ఆనందం టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ప్రేమించిన తన ఫస్ట్ లవ్ చాందినీ (అవికా గోర్) దగ్గర ఉందని. దీంతో టెన్త్ క్లాస్ రీ యూనియన్‌కు ప్లాన్ చేస్తాడు. మరీ ఆ రీ యూనియన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయింది ? చాందినీని కలుసుకున్నాడా ? అసలు చాందినీకి ఏమైంది ? అనే తదితర విషయాలను తెలుసుకోవాలంటే కచ్చితంగా ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్'కు వెళ్లాల్సిందే. విశ్లేషణ: యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు మనసులు హత్తుకునేలా ఉంటాయి. కానీ అలాంటి కథలతో వచ్చే సినిమాలు కాస్తా అటు ఇటు అయిన తేడా కొడుతుంటాయి. అలాంటిదే ఈ కథ. నిర్మాత అచ్యుతరామారావు జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమ కారణంగా ఒక అమ్మాయి జీవితం ఎలా మారిందనే అంశంతో ఈ కథను రూపొందించారు. ప్రేమికుడి నిర్లక్ష్యం, తండ్రి అతి ప్రేమ ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేశాయో ఈ సినిమా ద్వారా చూపించారు. నిజానికి ఇలాంటి ఒక మంచి కథను ఎంచుకున్నందుకు దర్శకనిర్మాతలను మెచ్చుకోవాల్సిందే. కానీ వారు ఎంచుకున్న కథను పక్కాగా వెండితెరపై ఆవిష్కరించలేకపోయారు. ప్రేమించిన అమ్మాయి కోసం వెతికేందుకు చేసిన రీ యూనియన్, దానిలో భాగంగా వచ్చే సీన్లు ఇంతకుముందు వచ్చిన కొన్ని సినిమాలను గుర్తు చేస్తాయి. హాఫ్ బాయిల్ (శ్రీనివాస్ రెడ్డి), గౌరవ్ నిర్మాత (అచ్యుత రామారావు) మధ్య వచ్చే సీన్లు మాత్రం చాలా ఆకట్టుకుంటాయి. వీరిద్దరి నటనతో ప్రేక్షకులను తెగ నవ్వించారు. కానీ సోమయాజ్, చాందినీ ప్రేమ సన్నివేశాలు కొంచెం రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. ఈ లవ్ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు. అయితే సెకండాఫ్‌లో హీరోయిన్ కోసం వెతికే ట్రాక్ బాగుంటుంది. ఓవైపు నవ్విస్తూనే అమ్మాయిల జీవితంలో కోరుకునే విషయాలు, వారు ఎదుర్కొనే సమస్యలను బాగా చూపించారు. ఊహించని విధంగా ఉండే క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలిస్తుంది. మూవీ మొత్తం ఎలా ఉన్న క్లైమాక్స్‌కు వచ్చేసరికి మాత్రం ఆడియెన్స్‌కు ఒక మంచి సినిమా చూశామనే అనుభూతిని కలిగిస్తుంది. ఎవరెలా చేశారంటే? తన ఫస్ట్ లవ్‌ను దక్కించుకోవాలనే ప్రేమికుడిగా, ఆనందం మిస్ అయిన బిజినెస్ మ్యాన్‌గా శ్రీరామ్ పర్వాలేదనిపించాడు. అయితే ఇంతకుముందు 'రోజాపూలు' సినిమాలో చూసిన శ్రీరామ్ నటన, ఆ ఈజ్ ఎక్కడో మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఇక అవికా గోర్ నటన కూడా పర్వాలేదనిపించింది. ఆమె పాత్ర నిడివి కాస్త తక్కువగా ఉంది. హీరో ఫ్రెండ్స్‌గా చేసిన శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత అచ్యుత రామారావు కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. వీరి కాంబినేషన్లో వచ్చే సీన్లు నవ్వు తెప్పిస్తాయి. కమెడియన్‌గా అచ్యుత రామారావుకు మంచి భవిష్యత్తు ఉందనే చెప్పవచ్చు. వీరితోపాటు హిమజ, అర్చన, శివ బాలాజీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నాజర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రి పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక సినిమాలోని బీజీఎం '96' మూవీని తలపిస్తుంది. ఇక 'గరుడవేగ' అంజికి ఇది మొదటి సినిమా కావడంతో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. కానీ సినిమాను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. రీ యూనియన్ సీన్లు ఇంకొంచెం బాగా రాసుకోవాల్సింది. సినిమాలోని డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఆలోచింపజేసేలా ఉంటాయి. మొత్తంగా ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్' మీ స్కూల్ డేస్ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. చాలవరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పవచ్చు. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
నటుడిగా నాకు ఇది పునర్జన్మ: హీరో
Sriram Speech About Tenth Class Diaries In Pre Release Event: ‘‘టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమాలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ మూవీ పెద్ద హిట్టవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో నిఖిల్ పేర్కొన్నారు. శ్రీరామ్, అవికా గోర్ జంటగా ‘గరుడవేగ’ అంజి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అజయ్ మైసూర్ సమర్పణలో అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదలవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ– ‘‘సహాయ దర్శకుడు కావాలనుకున్న నేను ముందు కెమెరా విభాగంలో చేశాను. సినిమాటోగ్రాఫర్ అంజి ఈ సినిమాతో దర్శకుడు కావడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘టెన్త్ క్లాస్ డైరీస్’లో ఎమోషన్‌తో పాటు కామెడీ కూడా ఉంది’’ అన్నారు అచ్యుత రామారావు. ‘‘కథలో మార్పులు చేశాక బడ్జెట్ డబుల్ అయింది. అయినా నిర్మాతలు రాజీ పడలేదు’’ ‘గరుడవేగ’ అంజి పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా చూశాక పదో తరగతి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు’’ అని రవితేజ మన్యం చెప్పుకొచ్చారు. ‘‘ఒకరికి ఒకరు’ తర్వాత నేను చేసిన మంచి చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. నటుడిగా ఇది నాకు పునర్జన్మ అనాలి’’ అని హీరో శ్రీరామ్ తెలిపారు. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. 'ఐ లవ్ యూ సాన్' అంటూ సూసైడ్ నోట్ స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! -
కామంతో కళ్లు మూసుకుపోతే.. 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: రెక్కీ (వెబ్ సిరీస్) నటీనటులు: శ్రీరామ్, శివ బాలాజీ, 'ఆడు కాలమ్' నరేన్, సమ్మెట గాంధీ, ఎస్తేర్ నోరోన్హా, ధన్యా బాలకృష్ణ, తోటపల్లి మధు, శరణ్య ప్రదీప్ తదితరులు నిర్మాత: శ్రీరామ్ కొలిశెట్టి కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పోలూరు కృష్ణ సంగీతం: శ్రీరామ్ మద్దూరి సినిమాటోగ్రఫీ: రామ్ కె. మహేష్ విడుదల తేది: జూన్ 17, 2022 (జీ5) ఇటీవలే 'గాలివాన' వెబ్ సిరీస్‌తో అలరించిన జీ5 తాజాగా 'రెక్కీ' అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ముందుకు వచ్చింది. శ్రీరామ్, శివ బాలాజీ, 'ఆడు కాలమ్' నరేన్, ధన్యా బాలకృష్ణ, ఎస్తేర్ నోరోన్హా, సమ్మెట గాంధీ నటించిన ఈ వెబ్ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. 1992లో తాడిపత్రిలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు డైరెక్టర్ కృష్ణ తెలిపారు. 7 ఎపిసోడ్లుగా వచ్చిన 'రెక్కీ' వెబ్ సిరీస్ జీ5లో జూన్ 17న విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: తాడిపత్రికి వరదరాజులు ('ఆడు కాలమ్' నరేన్) మున్సిపల్ ఛైర్మన్. అదే పట్టణంలో రంగ నాయకులు (రామరాజు) మాజీ మున్సిపల్ ఛైర్మన్. వీరిద్దరి మధ్య రాజకీయ పోరాటం జరుగుతుంది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఛైర్మన్ వరదరాజులు హత్యకు గురవుతాడు. తర్వాత 6 నెలలకు వరదరాజులు కుమారుడు చలపతి (శివ బాలాజీ) కూడా చంపబడతాడు. ఈ హత్యలు చేసింది ఎవరు ? ఎవరు ప్లాన్ చేశారు ? వాటి వెనుక ఉన్నది ఎవరు ? వారిని ఎస్సై లెనిన్ (శ్రీరామ్) కనిపెట్టాడా ? అతను తెలుసుకున్న నిజాలు ఏంటీ ? ఈ రెండు హత్యలతో వారి ఇంట్లోని ఆడవాళ్లు ఏం నిర్ణయించుకున్నారు ? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'రెక్కీ' వెబ్ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: ఒక మహిళ వల్ల కురుక్షేత్రమే జరిగిందని చెప్పుకుంటాం. అలాంటి వనితపై వ్యామోహం పెరిగితె ఎలాంటి పరిణామాలకు తావిస్తుందో ఈ వెబ్ సిరీస్ ద్వారా తెలియజేశారు. కథ చూస్తే రాజకీయ నేపథ్యమున్నట్లు అనిపించినా కామ వాంఛ, మహిళా పాత్రను ప్రధానంగా చూపించారు. అనుకున్న కథ ప్రకారం ఆద్యంతం ఆసక్తికరంగా ఆవిష్కరించారు డైరెక్టర్ పోలూరు కృష్ణ. అధికారం, రాజకీయం కథలతో అనేక సిరీస్‌లు ఇదివరకు వచ్చాయి. కానీ వీటికి కాస్త భిన్నంగా కామ వాంఛను జోడించి సక్సెస్ అయ్యారు దర్శకుడు. బంధాలు, అక్రమ సంబంధాల గురించి చక్కగా చూపించారు. సిరీస్‌లో వచ్చే మలుపులు ఊహించని విధంగా చాలా బాగా ఆకట్టుకున్నాయి. అలాగే మహిళళ పాత్రలను బలంగా చూపించారు. కానీ అక్కడక్కడ కొంతమేర అడల్ట్ సన్నివేశాలు ఉన్నాయి. ఎవరెలా చేశారంటే? సిరీస్ ప్రారంభం నుంచి చివరి వరకు నటీనటుల నటన అద్భుతంగా ఉంది. ఆద్యంతం వారి నటనతో సిరీస్‌ను రక్తి కట్టించారు. శ్రీరామ్, శివ బాలాజీ, ఆడు కాలమ్ నరేన్, సమ్మెట గాంధీ, ఎస్తేర్ నోరోన్హా పాత్రలు హైలెట్‌గా నిలిచాయి. శరణ్య ప్రదీప్, రాజశ్రీ నాయర్ పాత్రలు చివర్లో ఆకట్టుకుంటాయి. అలాగే మరో కీలక పాత్రలో నటించిన తోటపల్లి మధు పూర్తి న్యాయం చేశారు. ఇక సాంకేతిక అంశాల విషయానికొస్తే 1990వ దశకంలోని వాతావరణాన్ని బాగా చూపించారు. రామ్ కె మహేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక సంగీత దర్శకుడు శ్రీరామ్ మద్దూరి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఉంది. 'రెక్కీ' వెబ్ సిరీస్‌కు ఈ బీజీఎం ప్రాణం పోసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే మిమ్మల్ని కదలనివ్వకుండా థ్రిల్‌కు గురిచేసే వెబ్ సిరీస్ 'రెక్కీ'. -సంజు (సాక్షి వెబ్ డెస్క్) -
ఇకపై అటువంటి రోల్స్ చేయను: హీరో శ్రీరామ్
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశా. కానీ ఇప్పుడు అటువంటి రోల్స్ వస్తే రిజెక్ట్ చేస్తున్నా. నాకు క్లోజ్ అయినవాళ్లు అడిగితే మాత్రం చేస్తా. నాకు తెలుగులో వరసగా సినిమాలు చేయాలని ఉంది. మంచి కథలు వస్తే ఇక్కడే సినిమాలు చేస్తా. లేదంటే తమిళంలో చేసుకుంటా. అక్కడ నా చేతిలో ఇప్పుడు ఆరు సినిమాలు ఉన్నాయి’అని హీరో శ్రీరామ్ అన్నారు. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖ- ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీరామ్ మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు... ఆయన టెన్త్ బ్యాచ్ రీ యూనియన్ కథే ‘టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమాటోగ్రాఫర్ అంజితో నాకు పరిచయం ఉంది. తమిళంలో నాతో ఒక ప్రాజెక్ట్ చేయాల్సింది. అప్పుడు నా డేట్స్ కుదరలేదు. సినిమా చేయలేదు. అప్పుడు అంజితో ‘ర్శకుడిగా చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ నా దగ్గరకు తీసుకు రావాలి'అని చెప్పాను. ఒక కథ ఉందని చెబితే... హైదరాబాద్ వచ్చి కలిశా. ఫర్ ఎ చేంజ్... దర్శకుడు కథ చెప్పలేదు. నిర్మాత అచ్యుత రామారావు గారు కథ చెప్పారు. ఆ తర్వాత తెలిసింది... ఆయనే కథ రాశారని! కథ విన్న వెంటనే 'మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా?' అని అడిగా. అప్పుడు రామారావు ఎమోషనల్ అయ్యారు. మా బ్యాచ్ లో జరిగిందని చెప్పారు. ఆయన టెన్త్ బ్యాచ్ రీ యూనియన్ తర్వాత జరిగిన సంఘటనలే ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్'. అయితే, కొంత ఫిక్షన్ ఉంది. సినిమాలో క్యారెక్టర్లు ఎవరో ఒకరు రిలేట్ చేసుకునేలా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్ డేస్ మెమొరబుల్ మూమెంట్స్. అటువంటి మూమెంట్స్ ను పిక్చరైజ్ చేశాం. రియాలీటీగా తీశాం మూవీ బేసిక్ కంటెంట్... రీ యూనియన్. హరిశ్చంద్రుడు అయినా, రాముడు అయినా ఇంకొకరి జీవితంలో విలన్ అనుకోవచ్చు. ఏదో ఒక తప్పు జరిగి ఉంటుంది. మన జీవితంలో కరెక్టుగా ఉన్నా ఇంకొకరి జీవితంలో చెడ్డోళ్లు అవుతాం. తెలిసో తెలియకో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అటువంటి ఒక తప్పు వల్ల ఎంత మంది జీవితం ఎలా మారుతుందనేదే ఈ మూవీ కాన్సెప్ట్ . రియాలిటీగా తీశాం. ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా చూసుకున్నాం. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా ఎంటర్టైనింగ్ రోల్స్ కావడంతో ఈజీ అయ్యింది. ఒక మనిషి అఘోర అయ్యారు. ఆయన రీ యూనియన్ కి అలాగే వచ్చారు. అన్ని చూపించాం రీ యూనియన్స్ లో చాలా మంది స్నేహితులు కలుస్తారు. అయితే, అందరూ తమ ప్రయివేట్ లైఫ్ షేర్ చేసుకోరు. బావున్నానని చెబుతారు. క్లోజ్ అయిన వాళ్ళ దగ్గర మాత్రమే ఓపెన్ అవుతారు. మా సినిమాలో అన్నీ చూపించాం. అయితే, కొంత లైటర్ వీన్ లో చూపించాం.చాందిని పాత్రలో అవికా గోర్ నటించారు. చాందిని కోసం అన్వేషించడమే సినిమా. ఎప్పుడు కలుస్తామో మీరు ఊహించుకోవచ్చు. 'ఒకరికి ఒకరు'తర్వాత సంతృప్తి ఇచ్చిన చిత్రమిది సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అయితే కమర్షియల్ సినిమా తీయాలి. ఆరు నుంచి అరవై ఏళ్ల వ్యక్తి దాకా అందరూ చూసే సినిమా చేయమని వాళ్ళను కోరుతున్నా. కామెడీ, ఎమోషన్, ఫీలింగ్స్... అన్నీ ఉండాలి. అంజి నైస్ ఎంటర్టైనింగ్ కమర్షియల్ సినిమాతో వచ్చారు. ఇదొక ఫీల్ గుడ్ ఫిల్మ్. ఇందులో లవ్, ఫ్రెండ్షిప్, హ్యూమర్... అన్నీ ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్స్ కూడా! 'టెన్త్ క్లాస్ డైరీస్' అనేది పర్ఫెక్ట్ ప్యాకేజీ ఉన్న కమర్షియల్ సినిమా. 'ఒకరికి ఒకరు' తర్వాత నాకు సంతృప్తి ఇచ్చిన చిత్రమిది.తెలుగులో అంజితో మరో సినిమా డిస్కషన్స్ జరుగుతున్నాయి. రసూల్ కూడా ఓ స్క్రిప్ట్ రెడీ చేశాడు. -
హైకోర్టులో జీపీలు, ఏజీపీల నియామకం
సాక్షి, అమరావతి: హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకుగాను పలువురిని ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ), ప్రభుత్వ సహాయ న్యాయవాదులు(ఏజీపీ)గా నియమిస్తూ అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. జీపీగా నియమితులైన వారిలో గోడ రాజాబాబు, ఎల్వీఎస్ నాగరాజు, టీఎంకే చైతన్య, వేగి కొండయ్య నాయుడు, జీఎల్.నర్సింహారెడ్డి ఉన్నారు. వీరిలో టీఎంకే చైతన్య సీఐడీ స్టాండింగ్ కౌన్సిల్‌గా, రాజాబాబు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. జీఎల్ నర్సింహారెడ్డి ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేయగా, ఆయనకు ఇప్పుడు జీపీ పోస్టు ఇచ్చారు. ఏజీపీలుగా నియమితులైన వారిలో కుంచె ఆనందరావు, బొల్లవరపు సత్యేంద్ర మణికుమార్, గటల రాజశ్రీ, టి.రాధారాణి, కరగంజి హేమంత్ కుమార్, వై.సుబ్బారావు, బి.ధరణీ కుమార్, షేక్ ఆసిఫ్, తాయి లక్ష్మీ పద్మజ, జి. ప్రశాంతి, విశ్వనాధ శక్తిధార్, వేలూరి భరత్ సురేందర్‌రెడ్డి ఉన్నారు. వీరు మూడేళ్ల పాటు ఆయా పోస్టుల్లో కొనసాగుతారు. జీపీలకు నెలకు రూ.1 లక్ష, ఏజీపీలకు రూ.44 వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తారు. కాగా, జీపీలకు శాఖలను కేటాయిస్తూ ఏజీ ఎస్.శ్రీరామ్ బుధవారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో రెవెన్యూ, హోం శాఖలను రెండుగా విభజించారు. కొన్ని జిల్లాలకు చెందిన హోం శాఖ కేసులను మహేశ్వర్‌రెడ్డికి, మరికొన్ని జిల్లాలను చైతన్యకు అప్పగించారు. రెవెన్యూ అసైన్మెంట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆంధ్ర ప్రాంతం నాగేశ్వరరావుకు, రాయలసీమ ప్రాంతాన్ని నర్సింహారెడ్డికి కేటాయించారు. రెవెన్యూ జనరల్ ఆంధ్ర ప్రాంతాన్ని సుభాష్‌కు, రాయలసీమ ప్రాంతాన్ని బాలస్వామికి అప్పగించారు. వేగి కొండయ్యనాయుడికి వ్యవసాయం, సహకార శాఖ, రాజాబాబుకు గ్రామ, వార్డు సచివాలయాలు, నాగరాజుకు పాఠశాల విద్యాశాఖను కేటాయించారు. -
షూటింగ్లో ప్రమాదం.. శరీరమంతా కాలిపోయింది : హీరో శ్రీరామ్
Hero Sriram Shares His Fire Accident In Shooting: రోజాపూలు సినిమాతో కెరీర్ ప్రారంభించిన హీరో శ్రీరామ్ తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత మాత్రం ఆశించినంత స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. దీంతో సరైన హిట్స్ లేక సైడ్ క్యారెక్టర్లు సైతం చేశాడు. ఆ క్రమంలోనే ఆయన నటించిన ఆడవారు మాటలకు అర్థాలే వేరులో, స్నేహితుడు సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా ఓ షోకి హాజరైన శ్రీరామ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఓ సినిమా షూటింగ్ టైంలో ఆర్ట్ అసిస్టెంట్‌కి తెలియకుండా ఎక్కువ రబ్బర్ పోసేసాడు. దీని వల్ల పెద్ద ఫైర్ జరిగింది. ఈ ప్రమాదంలో షర్ట్‌తో సహా శరీరం ఊడిపోయి వచ్చింది చెవులు, జుట్టు ఉండేది కాదు. అలా కాలిపోయి హాస్పిటల్లో కదల్లేని స్థితిలో ఉండేవాడిని అంటూ ఎమోషనల్ అయ్యాడు. -
పరిటాల బాగోతాన్ని బట్టబయలు చేస్తానని వార్నింగ్.?
-
సినిమా టికెట్ల ఖరారుకు కమిటీ వేశాం
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ రేట్ల ఖరారుకు హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ కమిటీ ఇప్పటికే ఓసారి సమావేశమైందని, త్వరలో మరోసారి సమావేశమవుతుందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఫిబ్రవరి మొదటి వారంలో రేట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున, విచారణను అప్పటికి వాయిదా వేయాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. సినిమా టికెట్ రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 35తో సంబంధం లేకుండా, అంతకు ముందున్న విధంగానే ధరలు ఖరారు చేసుకోవచ్చంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై గత వారం విచారణ జరిపిన సీజే ధర్మాసనం జాయింట్ కలెక్టర్లను సంప్రదించిన తరువాతే టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలని థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించింది. సోమవారం ఈ అప్పీళ్లపై ధర్మాసనం మరోసారి విచారణ జరపగా.. ఏజీ శ్రీరామ్ టికెట్ రేట్ల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు ధర్మాసనానికి తెలిపారు. జాయింట్ కలెక్టర్లను సంప్రదించిన తరువాత టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలన్న కోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని న్యాయవాది వీవీ సతీష్ చెప్పగా.. దరఖాస్తులు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్లకు సూచిస్తామని ఏజీ బదులిచ్చారు. -
అర్హులను నిర్ణయించేది ప్రజా ప్రభుత్వాలే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటాయని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పరిధి న్యాయస్థానాలకు చాలా పరిమితమని తెలిపారు. ఓ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనే విషయాలు ప్రభుత్వాల పరిధిలోనివని వివరించారు. 60 ఏళ్లు దాటిన వారు వైఎస్సార్ చేయూత పథకానికి అనర్హులని, అయితే అలాంటి వారు పెన్షన్ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకం లబ్ధిదారుల వయో పరిమితి ఎంత ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయమని, ఈ విషయాలను న్యాయస్థానాలు ఎంతమాత్రం నిర్ణయించజాలవన్నారు. ఇలాంటి పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటుందని తెలిపారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, పిటిషనర్లలో వైఎస్సార్ చేయూత కింద ఎంతమందికి చెల్లింపులు చేశారు? చెల్లించకుంటే ఎందుకు చెల్లించలేదు? పిటిషనర్లలో ఎవరికైనా షోకాజ్ నోటీసులు ఇచ్చారా? తదితర వివరాలను తమ ముందుంచాలని ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సదుద్దేశంతో ప్రవేశపెడుతున్నా.. వైఎస్సార్ చేయూత పథకం కింద లబ్ధి పొందేందుకు తాము అర్హులైనప్పటికీ అధికారులు ఆ ప్రయోజనాలను వర్తింపచేయడం లేదంటూ కృష్ణా జిల్లా చందర్లపాడుకు చెందిన వేల్పుల విమలమ్మ, మరో 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ వారికి ఆ పథకం కింద ప్రయోజనాలను వర్తింప చేయాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే ఆ ఆదేశాలను అమలు చేయలేదంటూ పిటిషనర్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఫించన్ చెల్లింపుల నిలుపుదలపై మరికొందరు పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తాజాగా విచారణ జరిపారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పథకాలను ప్రవేశపెడుతున్నా కొందరు అధికారుల తీరు వల్ల వాటి ఫలాలు అర్హులకు అందడం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందక 90 శాతం మంది అర్హులు ఇబ్బందులు పడుతున్నారని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఒకసారి ఓ పథకానికి అర్హులుగా నిర్ణయించిన తరువాత మధ్యలో ఆ పథకం ప్రయోజనాలను నిలుపుదల చేయడం సరికాదన్నారు. అధికారుల అలసత్వం వల్ల పథకాలు సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదన్నారు. అర్హులందరికీ దక్కాలన్నదే సీఎం సంకల్పం.. దీనిపై ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ పథకం అర్హతలు, అర్హులను న్యాయస్థానాలు నిర్ణయించజాలవన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు దక్కాలన్నదే ముఖ్యమంత్రి కృత నిశ్చయమన్నారు. ఆ దిశగానే పథకాల రూపకల్పన జరుగుతోందని, గతంలో ఏ ప్రభుత్వం కూడా చేపట్టనన్ని వాటిని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ విధానాలకు సంబంధించి పత్రికా కథనాలను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టును కోరారు. ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలుకు అధికారులతో మాట్లాడతామని తెలిపారు. ఈ కేసులో అర్హులకు వైఎస్సార్ చేయూత ప్రయోజనాలను వర్తింప చేశామన్నారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
కేసుల సత్వర పరిష్కారానికి రాష్ట్ర వ్యాజ్య విధానం
సాక్షి, అమరావతి: నూతనంగా తీసుకురానున్న రాష్ట్ర వ్యాజ్య విధానాన్ని (స్టేట్ లిటిగేషన్ పాలసీ) సమర్థవంతంగా అమలు చేస్తే కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో వ్యాజ్యాల అంశంపై న్యాయాధికారులు, కార్యదర్శులతో సమావేశం జరిగింది. సీఎస్ మాట్లాడుతూ స్టేట్ లిటిగేషన్ పాలసీని నిరంతరం పర్యవేక్షిస్తూ పటిష్టంగా అమలు చేస్తే కేసుల్లో జాప్యాన్ని నివారించవచ్చన్నారు. ఈ విధానం వల్ల కేసుల వివరాలు ప్రభుత్వ న్యాయవాదులకు, ప్రభుత్వ శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు తెలుస్తాయని, తద్వారా సకాలంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉం టుందని చెప్పారు. తద్వారా కోర్టులపై ప్రభుత్వ వ్యాజ్యాల భారాన్ని కూడా తగ్గించవచ్చన్నా రు. అదేవిధంగా రాష్ట్ర విచారణ సేవల (స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్)ను మరింత బలోపేతం చేసేందుకు వ్యాజ్య విధానం దోహదం చేస్తుం దని చెప్పారు. అందుకే ఏపీ ఆన్లైన్ లీగల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశ పెట్టనున్నట్టు తెలి పారు. దీనివల్ల జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులకు సంబంధించిన వివిధ వ్యాజ్యాల సమగ్ర డేటాబేస్ అందుబాటులో ఉంటుందన్నారు. సమన్వయంతోనే సత్వర పరిష్కారం సమావేశంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ న్యాయవాదులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే కేసుల సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాజ్య విధానం, ప్రభుత్వ శాఖల విధానాలు, నిబంధనల ఫ్రేమ్‌వర్క్, వ్యాజ్యాల దాఖలు స్థాయిలోనే సవాల్ చేసేలా తీసుకోవాల్సిన చర్యలు, వ్యాజ్యాలపై నిర్ణీత కాల వ్యవధిలో సమీక్ష, వైఫల్యాలపై జవాబుదారీతనం తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఆన్లైన్ కేస్ లోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు సమీక్షించారు. ప్రతి ప్రభుత్వ శాఖలో లైజన్ అధికారులు, లీగల్ ఆడ్వైజర్లను నియమించుకునే అంశంపై చర్చించారు. రాష్ట్ర ఆదనపు అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్‌రెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి వి.సునీత, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, న్యాయాధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ అప్పీల్‌పై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ యాజమాన్య నిర్వహణ బాధ్యతలకు సంబంధించి ఇటీవల సింగిల్ జడ్జి జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సంగం డెయిరీ యాజమాన్య నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ గత నెల 27న జారీచేసిన జీవో 19 అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఈ నెల 7న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి అసలు సంగం డెయిరీ ఎలా ఏర్పాటైందన్న కీలక అంశాన్ని తేల్చ కుండా మధ్యంతర ఉత్తర్వులిచ్చారన్నారు. డెయిరీ యాజ మాన్య హక్కుల గురించి తేల్చేదిశగా విచారణ జరపాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. సంగం డెయిరీ మోసపూరిత చర్యలను తేల్చకుండా ప్రభుత్వ అధికారంపై ఉత్తర్వులిచ్చారని వివరించారు. అన్ని రకాలుగా సింగిల్ జడ్జి ఉత్తర్వులు తప్పు అని పేర్కొన్నారు. -
అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయంతో సుమోటో విచారణా?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులను మూసివేస్తూ ఆయా కోర్టుల మేజిస్ట్రేట్లు ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబడుతూ హైకోర్టు పాలనాపరమైన అధికారం ద్వారా ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ జరపడంపై రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. నేర శిక్షా స్మృతి (సీఆర్పీసీ) సెక్షన్లు 397, 401, 482, 483ల కింద ఉన్న అధికారాలను ఉపయోగించి హైకోర్టు పాలనాపరంగా సుమోటో చర్యలను ప్రారంభించడానికి వీల్లేదని నివేదించారు. హైకోర్టు పాలనాపరంగా తీసుకున్న నిర్ణయం ఆధారంగా సుమోటో చర్యలకు ఉపక్రమించడం న్యాయ చరిత్రలో ఇదే తొలిసారని వివరించారు. అసలు హైకోర్టు పాలనాపరంగా నిర్ణయం తీసుకోవడానికి, సుమోటో చర్యలకు దారి తీసిన పరిస్థితులు ఏమిటో రిజిస్ట్రీ ఇప్పటి వరకు తమకు తెలియ చేయలేదన్నారు. దేని ఆధారంగా సుమోటో చర్యలకు ఉపక్రమించారో చెప్పాలని రిజిష్ట్రార్(జుడీషియల్)ను కోరామని, అయితే ఆయన అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం ఆధారంగా సుమోటో చర్యలకు ఉపక్రమించారని చెప్పారే తప్ప, ఆ కమిటీ నివేదికను తమకు ఇవ్వలేదన్నారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం తాలూకు అన్నీ వివరాలను తెలుసుకునే హక్కు తమకు ఉందన్నారు. ఆ వివరాలను తమకు అందుబాటులో ఉంచే వరకు ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న పోలీసులు, ఫిర్యాదుదారులు, వైఎస్ జగన్మోహన్రెడ్డి తదితరులకు నోటీసులు ఇవ్వవద్దని హైకోర్టును కోరారు. ఏజీ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, నోటీసుల జారీ విషయంలో తన నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారులు అభ్యంతరం లేదంటనే మూసేశారు... ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2016లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే అమరావతి భూముల కుంభకోణం గురించి మాట్లాడారు. ఇందుకు గాను వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనంతపురం, గుంటూరు జిల్లాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచారణ జరిపిన పోలీసులు సాక్ష్యాలు లేకపోవడంతో వాటిపై ఆయా కోర్టుల్లో ఫైనల్ రిపోర్టులు దాఖలు చేశారు. దీంతో మేజిస్ట్రేట్లు ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేశారు. కేసులను మూసివేసేందుకు తమకు అభ్యంతరం లేదని ఫిర్యాదుదారులు ఆయా కోర్టులకు నివేదించారు. దీంతో ఆయా కోర్టుల మేజిస్ట్రేట్లు ఆ కేసులను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చారు. వీటిని హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ తప్పుబట్టింది. ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ జరపాలని పాలనాపరంగా నిర్ణయించింది. అందులో భాగంగా హైకోర్టు 11 సుమోటో పిటిషన్లను రిజిష్టర్ చేసింది. ఈ పిటిషన్లపై తాజాగా న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అసాధారణం.. చట్ట ప్రకారం ఆమోదయోగ్యం కాదు విచారణ ప్రారంభం కాగానే ఈ సుమోటో వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న పోలీసులు, ఫిర్యాదారులు, వైఎస్ జగన్మోహన్రెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేస్తానని జస్టిస్ లలిత ప్రతిపాదించారు. దీనిపై ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులపై సుమోటోగా విచారణ జరపాలన్న అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం అసాధారణమన్నారు. ఇలా చేయడం హైకోర్టు సంప్రదాయం కాదన్నారు. గతంలో ఇలా జరిగిందా? అని తనకన్నా పెద్దలైన న్యాయవాదులను అడిగి తెలుసుకున్నానని, ఎన్నడూ హైకోర్టు ఇలా వ్యవహరించలేదని వారంతా తనకు చెప్పారన్నారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఈ వ్యవహారాన్ని నివేదించినప్పుడు హైకోర్టు న్యాయపరంగా దానిని పరిశీలించి ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ జరపాలని నిర్ణయం తీసుకుని ఉంటే అది వేరే విషయమని, కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందన్నారు. చట్ట ప్రకారం ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. నివేదిక మాకు ఇవ్వలేదు.. ఓ పత్రికలో మాత్రం వచ్చాయి సుమోటో విచారణకు దారి తీసిన కారణాలు, అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నివేదికను హైకోర్టు తమకు ఇవ్వనేలేదని ఏజీ శ్రీరామ్ తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు తప్పన్న నిర్ణయానికి రావడానికి గల కారణాలను, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను తమకు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అసలు హైకోర్టు తన సుమోటో పిటిషన్లలో ఎక్కడా అడ్మినిస్ట్రేటివ్ కమిటీ గురించి ప్రస్తావించలేదన్నారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వివరాలు తెలుసుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తుందన్నారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ గురించి ఓ పత్రికలో మాత్రం అన్ని వివరాలు ప్రచురితమయ్యాయని, ఓ టీవీ చానల్ ఏకంగా 45 నిమిషాల పాటు చర్చా కార్యక్రమమే నిర్వహించిందన్నారు. మేజిస్ట్రేట్లపై అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చర్యలకు ఉపక్రమించిందని ఆ పత్రిక రాసిందన్నారు. దీన్ని బట్టి ఆ పత్రిక, టీవీ ఛానెల్ వద్ద అన్నీ వివరాలు ఉన్నట్లున్నాయన్నారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం ఆధారంగా హైకోర్టు సుమోటో చర్యలు ప్రారంభించడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. జస్టిస్ రాకేశ్ ప్రస్తావించిన కేసులపైనే ఇప్పుడు విచారణ... గత ఏడాది ఓ కేసులో తీర్పు సందర్భంగా అప్పటి న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ అందులో వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. వైఎస్ జగన్‌పై సీబీఐ కోర్టులో ఉన్న కేసులను ప్రస్తావించారని, అదే సమయంలో హైకోర్టు ప్రస్తుతం విచారణ జరుపుతున్న సుమోటో కేసుల గురించి ప్రస్తావించారని శ్రీరామ్ కోర్టు దృష్టికి తెచ్చారు. జస్టిస్ రాకేశ్ కుమార్ ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని ఈ విషయాలను ఆయన చదివి వినిపించారు. జస్టిస్ రాకేశ్ కుమార్ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిదన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇది పెండింగ్‌లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు చేపట్టిన ఈ సుమోటో విచారణ సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. అంతేకాకుండా హైకోర్టు గత 60 ఏళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయాలను ఉల్లంఘించడమే అవుతుందని నివేదించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసే ముందు ఈ వివరాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అనంతరం దీనిపై నిర్ణయాన్ని న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు. -
‘ధూళిపాళ్ల నరేంద్ర జైల్లో ఉంటేనే అది సాధ్యమవుతుంది’
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ కార్యాలయాల్లో విచారణ నిమిత్తం ఇంకా సోదాలు నిర్వహించాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొన్నారు. చాలా మంది సాక్షులను విచారించి, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలని ఆయన తెలిపారు. సంగం డెయిరీ అక్రమాల కేసులో అరెస్టు అయిన తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ తమ వాదనలు వినిపించారు. సంగం డెయిరీలో అక్రమాల గురించి ఎవరిని ప్రశ్నించినా అంతా చైర్మన్‌కే తెలుసు అంటున్నారని, ఏ1 ముద్దాయి ధూళిపాళ్ల నరేంద్ర జైల్లో ఉంటేనే ఇది సాధ్యమవుతుందని కోర్టుకు తెలిపారు. ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి ఇవ్వమని కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసిందని, ఈ సందర్భంలో రిమాండ్ కొట్టివేస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్నారు. సంగం డైయిరీ లో 74 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ప్రభుత్వం యాజమాన్యాన్ని మార్చిదే తప్పా.. భూమిపై హక్కులు వదులుకోలేదని అన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని హైకోర్టుకు విన్నపించారు. కాగా 2010 నుంచి ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీకి ఛైర్మన్‌గా ఉన్నారు. సంగం డైయిరీలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ధూళిపాళ్లతోపాటు సంగం డెయిరీలో ఎండీ గోపాలకృష్ణ, ప్రకాశం జిల్లా సహకార శాఖలో రిజిస్ట్రార్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మేళం గురునాథంను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వీరిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా కోర్టు పూర్తి అదనపు ఇన్చార్జి న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించారు. చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల అరెస్ట్ -
బురదజల్లడానికే నిమ్మగడ్డ పిటిషన్
సాక్షి, అమరావతి: గవర్నర్‌కు తాను రాసిన లేఖలు లీక్ అయ్యాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ యంత్రాంగంపై బురదజల్లడమేనని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ప్రతి ప్రభుత్వ యంత్రాంగం ప్రతిష్టను అపఖ్యాతి పాల్జేసేందుకే ఈ వ్యాజ్యం దాఖలు చేశారన్నారు. ఈ పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారించారు. ఈ సందర్భంగా ఏజీ తన వాదనలు వినిపిస్తూ.. లేఖల లీక్ జరిగిందంటున్న నిమ్మగడ్డ, అలా లీక్ కావడం ఏ చట్ట ప్రకారం నేరమో చెప్పడం లేదన్నారు. ఏ కేసులో పడితే ఆ కేసులో, ఎలా పడితే అలా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి వీల్లేదని, న్యాయస్థానాలు అధికరణ 226 కింద తమ విచక్షణాధికారాలను చాలా జాగ్రత్తగా, అరుదుగా ఉపయోగించాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. తాను హైకోర్టు జడ్జితో సమానమంటూ చెప్పుకొన్న నిమ్మగడ్డ.. అదే రీతి హుందాతనాన్ని ప్రదర్శించలేకపోయారన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కార పిటిషన్ వేశారని, ఇప్పుడు గౌరవ ప్రదమైన గవర్నర్ కార్యాలయంపై కూడా ఆరోపణలు చేస్తూ వివాదంలోకి లాగారని తెలిపారు. నిమ్మగడ్డ గతంలో కేంద్రానికి రాసిన లేఖ వాస్తవానికి ఓ రాజకీయ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిందని, దీనిపై ఓ ఎంపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు చేశారని చెప్పారు. దీనిపై నిమ్మగడ్డ, ఎన్నికల కమిషన్ కార్యాలయ ఉద్యోగి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరఫు న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. గవర్నర్‌కు రాసిన లేఖలు బయటకు రావడాన్ని ఏ చట్టం అడ్డుకుంటుందో నిమ్మగడ్డ ఎక్కడా చెప్పడం లేదన్నారు. గతంలో న్యాయశాఖ మంత్రి, ఢిల్లీ హైకోర్టు సీజే, సుప్రీంకోర్టు సీజేకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు బహిర్గతం అయ్యాయని, అప్పుడు సుప్రీంకోర్టు ఇలాంటి వాటికి ఎలాంటి రక్షణ ఉండదంటూ తీర్పునిచ్చిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. లేఖల లీక్ వల్లే హక్కుల ఉల్లంఘన నోటీసులు వచ్చాయని నిమ్మగడ్డ చెబుతున్నారుగా? దీనిపై ఏమంటారని ప్రశ్నించారు. ప్రస్తుత కేసుకూ దానికి ఏ మాత్రం సంబంధం లేదని ప్రశాంత్ తెలిపారు. గవర్నర్‌కు రాసిన లేఖలే హక్కుల ఉల్లంఘన నోటీసులకు దారి తీశాయా? అన్న అంశంపై తాను తన కౌంటర్లో స్పష్టతనిస్తానని చెప్పారు. ప్రతివాదులైన మంత్రి బొత్స సత్యనారాయణ, మెట్టు రామిరెడ్డి తరఫు న్యాయవాదుల వాదనల నిమిత్తం విచారణ ఈ నెల 6కి వాయిదా వేస్తూ జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఉత్తర్వులు జారీచేశారు. అదేరోజున నిమ్మగడ్డ తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు తిరుగు సమాధానం ఇచ్చేందుకు సైతం అనుమతి ఇచ్చారు. చదవండి: చంద్రబాబు సర్కారులో వైద్య పరికరాల స్కామ్ -
60 వేల నాణేలతో శ్రీరాముడు
సాక్షి బెంగళూరు: అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా రామ నామం మారుమోగుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని ఓ కళాకారుడు నాణేలతో శ్రీరాముని కళాకృతిని తయారు చేశాడు. రూపాయి, ఐదు రూపాయల విలువ కలిగిన అరవై వేల నాణేలను ఉపయోగించి శ్రీరాముని కళాకృతిని తీర్చిదిద్దారు. నాణేల విలువ సుమారు రూ.2 లక్షలు. రాజధాని బెంగళూరులోని లాల్బాగ్ పశ్చిమ ద్వారం వద్ద కళాకృతిని సిద్ధం చేశాడు. -
‘పుర’ఎన్నికల ప్రక్రియ కొనసాగనివ్వాలి
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల నిర్వహణ విషయంలో తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయ మూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా కారణం గా గత ఏడాది పురపాలక ఎన్నికలు ఏ దశలో వాయిదా పడ్డాయో, తిరిగి ఆ దశ నుంచే మొదలవుతాయంటూ ఈ నెల 15న ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌ను రాజ్యాంగ విరుద్ధంగా, పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నక్కా యశోద, కంచు మధుసూధన్, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన చిప్పిడి విష్ణువర్ధన్‌రెడ్డి, మరో ఆరుగురితో పాటు మరి కొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై మంగళవారం జస్టిస్ సోమయాజులు మరోసారి విచారణ జరిపారు. ఈ వ్యాజ్యాలకు విచారణార్హతే లేదు.. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరఫు న్యాయ వాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఏ దశలో ఎన్నికలు ఆగిపోయాయో, అక్కడి నుంచి ఎన్నికలను పెట్టాలన్న నిర్ణయంపై దాఖలైన వ్యాజ్యాలకు అసలు విచారణార్హతే లేదన్నారు. కరోనా కారణంగానే గత మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేశామని, దీన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగింపులో భాగంగానే అప్పుడు నిలిచిపోయిన ఎన్నికలను ఇప్పుడు పూర్తిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఎన్నికల కమిషన్‌ది ఏకపక్ష నిర్ణయం కాదు.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వంతో సంప్రదించిన తరువాతే పురపాలక ఎన్నికల ప్రక్రి యను పునరుద్ధరిస్తూ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రక్రియను కొనసాగనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. గత ఏడాది ఎన్నికలను వాయిదా వేసేటప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినప్పుడు తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పిం దని గుర్తుచేశారు. ఈ ఉత్తర్వులను పిటిషనర్లు సవాలు చేయలేదన్నారు. ఎన్నికల్లో పోటీచేయడం, పాల్గొనడం చట్టబద్ధ హక్కు మాత్రమేనని తెలిపారు. గతంలో ఆపిన చోటునుంచే ఎన్నికలను కొనసాగించాలన్న కమిషన్ నిర్ణయం ఏకపక్షం ఎంతమాత్రం కాదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో తన నిర్ణయాన్ని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
అయ్యో... రామ‘చంద్ర’!
దేవుడంటే భయం లేదు. పాప భీతి అసలే లేదు. రావణాసురుడి పదితలలను కూల్చిన రాముడి విగ్రహం తలనే ఏకంగా నరికేశారు. భక్తుల మనోభావాలతో ఆటలాడుకునేందుకు యత్నించారు. దీనికి చారిత్రక నేపథ్యం కలిగిన రామతీర్థంలోని బోడికొండను వేదికగా చేసుకున్నారు. దానిని రాజకీయ లబ్ధికోసం ఆయుధంగా మలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా... పోలీసు ఉన్నతాధికారులపైనా... తుదకు స్వామీజీలపైనా వారు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు వెగటు పుట్టిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో డిసెంబర్ 28వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులెవరో శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించారు. దానిని కాస్తా సీతమ్మవారి కొలనులో పడేసి పోయా రు. 29వ తేదీ ఉదయం 7.30గంటలకు ఆలయ పూజారి ఎప్పటిలానే స్వామివారికి నిత్య కైంకర్యాల కోసం వెళ్లారు. ఆలయం తలుపులు తెలిచి ఉండటం చూసి కంగారు పడి లోపలికి వెళ్లకుండానే గర్భగుడి పైపు చూడగా శ్రీరాముడి విగ్రహం మొండెం మాత్రమే కనిపించింది. వెంటనే ప్రధాన ఆలయంలోని పూజారులకు విషయం తెలియజేశారు. ఉదయం 7.30 గంటల సమయంలోనే దుర్ఘటనను గుర్తించిన పూజారులు 10.30 గంటల వరకూ గుట్టుగా ఉంచారు. పూజారుల్లోనే కొందరు ఎట్టకేలకు సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారు. ప్రజలకు విషయం తెలిసిన తరువాత గానీ వారు పోలీసులను ఆశ్రయించలేదు. సాధారణంగా ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే ఈ కొండపై పూజారులుంటారు. ఆ తరువాత సందర్శకులు కొండపైకి వెళ్లినా గుడి బయటి నుంచే దర్శనం చేసుకుంటారు. నిఘా లేదని నమ్మకంతోనే... రాత్రయితే అక్కడ ఎలాంటి నిఘా ఉండదు. అందుకే దుండగులు ఆ సమయాన్ని ఎంచుకున్నారు. కొండపైకి వారు వెళ్లినపుడు సెల్‌ఫోన్ కూడా తమ వెంట తీసుకెళ్లకుండా జాగ్ర త్త పడ్డారు. సెల్‌ఫోన్ తీసుకువెళ్లి ఉంటే ఆ సమయంలో ఏ నెట్ వర్క్ టవర్ నుంచి సిగ్నల్స్ వచ్చాయో కనిపెట్టడం పోలీసులకు సులభమవుతుంది. ఖండించిన శిరస్సును దేవాల యం నుంచి వెలుపలికి తెచ్చి సీతమ్మకొలనులో పడేయడం చూస్తే విషయం పెద్దది చేయాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. కేవలం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను పాడుచేయాలని, పట్టా పంపిణీ కార్యక్రమం నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని, హిందుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమనీ జనాన్ని నమ్మించేందుకు ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం బోడికొండ ఘటనపై దర్యాప్తును సీరియస్‌గా తీసుకున్న రా ష్ట్ర ప్రభుత్వం డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. దేవదాయశాఖ ఆర్జేసీ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించింది. ఆలయానికి విద్యుత్ సౌకర్యం వచ్చిందని, సీసీ కెమెరాలు పెడుతున్నారని తెలుసుకుని మరీ దుండగులు ముందుగానే తమ కుట్రను అమలు చేస్తున్నారన్న అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ఆరా తీస్తున్నారు. గైడ్లమని చెప్పుకుని తిరిగే ఇద్దరు యువకులను ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు. మరో ఇద్దరు టీడీపీ గ్రామస్థాయి నాయకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలయాల పరిరక్షణకు సర్కారు చర్యలు ఈ సంఘటనపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 571 ఆలయాలు ఉన్నాయి. దేవదాయశాఖ ఆధీనంలో సుమారు 10 వేల ఎకరాల భూములున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో ధూపదీప నైవేద్యాలకు 57 ఆలయాలకు మాత్రమే నిధులందేవి. అర్చకులెవరికీ కనీస వేతనాలు ఇచ్చేవారు కాదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అర్చక వెల్ఫేర్ ఫండ్ నుంచి ధూపదీప నైవేద్యాల కోసం సుమారు 250 మంది పూజారులకు నెలకు రూ.5వేలు నుంచి రూ.10వేల వరకూ ఇస్తూ ఆలయాలకు మళ్లీ జీవం పోస్తున్నారు. కరోనా సమయంలోనూ పూజారులకు రూ.5 వేలు చొప్పున సాయం అందించారు. అధికారంలోకి రాగానే ఆలయాల్లో దీపం వెలిగించారు. అర్చ కుల ఆకలి తీర్చి ఆదుకున్నారు. దేవాలయాల భద్రత కోసం ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రామతీర్ధంలోనూ అడుగడుగునా సీసీ కెమెరాలు పెట్టి, కొండపైన ఒకటి రెండు రోజుల్లో అమర్చడానికి సిద్ధం చేశారు. రాజకీయ లబ్ధికోసం ఆందోళనలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలు ప్రజల్లో టీడీపీపై ఏహ్య భావాన్ని కలిగిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ అధికారులపైనా టీడీపీ నేతలు నోరుపారేసుకుంటున్నారు. స్వామీజీలు, హిందూ ధర్మ సంస్థలపైనా దుర్భాషలాడుతున్న ఆ పార్టీ నేతల్లో దేవుడిపై భక్తి కంటే రాజకీయ స్వలాభమే ఎక్కువగా కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దుర్ఘటన జరిగిన రోజే టీడీపీ ముఖ్య నేతలు జిల్లాలో వాలిపోయారు. మరునాడు మరోనేత వచ్చి పిచ్చివాడిలా అందరినీ తిట్టేసి వెళ్లిపోయారు. ఇప్పడు ఏకంగా టీడీపీ జాతీయాధ్యక్షుడైన చంద్రబాబు నాయుడే దిగుతున్నారు. ముందే అనుకున్నట్లుగా, చాలా వేగంగా స్పందిస్తున్న తీరు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎన్నికల తరువాత ఏనాడూ జిల్లా ప్రజల బాగోగులు చూడని, ఒక్కసారి కూడా జిల్లాలో అడుగుపెట్టని చంద్రబాబు శనివారం రామతీర్థంలో పర్యటించి మరో డ్రామాకు తెరతీస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం ఆందోళన చేస్తున్న బీజేపీ నేత కూడా గతంలో టీడీపీలోనే ఉండేవారు. ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ నిరసన తెలుపుతుండటం, జిల్లా బీజేపీ నేతలెవరూ నాయకత్వం వహించకుండా కేవలం శిబిరాన్ని సందర్శించడానికే పరిమితమవ్వడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక ప్రతిపక్షానికి చెందిన ‘పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్’ హస్తం ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. దర్యాప్తునకు అవరోధం జరిగిన సంఘటనను నాయకులుతమ రాజకీయ లబ్ధికే వాడుకుంటూ దర్యాప్తునకు అవరోధంగా మారుతున్నారని పోలీసులే అంటున్నారు. టీడీపీకి చెందిన కొందరి కుట్ర ఇందులో ఉన్నట్టు తాము ఇప్పటికే నిర్ధారణకు వచ్చామని, బలమైన సాక్ష్యాలను సేకరించి త్వరలోనే నిందితులను బయటపెడతామని చెబుతున్నారు. కొండపై గల కోదండరామ స్వామి దేవాలయాన్ని జిల్లా ఎస్పీ సంఘటన జరిగిన రోజునే గాకుండా శుక్రవారం కూడా వెళ్లి, నేరం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆందోళనలవల్ల అడుగుపడట్లేదు బోడికొండ సంఘటనపై రాజకీయ పార్టీల లబ్ధికోసం ధర్నాలు చేస్తుండటం వల్ల దర్యాప్తునకు విఘాతం కలుగుతోంది. గత ప్రభుత్వంలో కూడా రోడ్ల విస్తరణ సందర్భంలో అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ఇటువంటి సున్నిత అంశాలపై ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం వల్ల దర్యాప్తునకు ఇబ్బందిగా ఉంది. ధర్నాలు, నిరసనల బందోబస్తుకే విలువైన సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ చర్యను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించింది. సంఘటనపై సమగ్రమైన దర్యాప్తు ఇప్పటికే చేపట్టింది. ఛేదించేందుకు అయిదు ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. – బి.రాజకుమారి, జిల్లా ఎస్పీ -
రాజధాని నిర్ణయం భూముల కొనుగోళ్ల వెనుక భారీ కుట్ర
సాక్షి, అమరావతి: రాజధాని నిర్ణయం, అమరావతిలో భూముల కొనుగోళ్ల వ్యవహారం వెనుక భారీ కుట్ర ఉందని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ పునరుద్ఘాటించారు. ఈ కుట్ర వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యుల పాత్రపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టుకు నివేదించారు. అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంలో సీఐడీ ఇటీవల నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితులు కిలారు రాజేశ్, ఆయన భార్య శ్రీహాస తది తరులు హైకోర్టులో వేర్వేరుగా క్రిమినల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపి తీర్పు వాయిదా వేశారు. అయితే అమరావతి భూ కొనుగోళ్ల కుంభకోణం కేసులో కొందరు ఉద్యోగులు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారని, ఆ వివరాలను కోర్టు ముందుంచుతామని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సీఐడీ అదనపు ఎస్పీ వాసంశెట్టి గోపాలకృష్ణ అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ రాయ్ కేసును తిరిగి ఓపెన్ చేయడంతో మంగళవారం సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఆ జీవోలు ఆ శాఖ ఉద్యోగులు తయారు చేయలేదు అమరావతిలో భూముల కొనుగోళ్ల కుంభకోణానికి సం బంధించి పలు కీలక విషయాలను ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఆర్డీఏ చట్టం తీసుకురావడం, సీఆర్డీఏ ఏర్పాటు చేయడం, దాని పరిధి నిర్ణయించడం, అభివృద్ధి పనుల కొనసాగింపు బాధ్యతలు సీఆర్డీఏకి అప్పగించడం తదితరాలపై అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఆరు జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లు ఏవీ కూడా పురపాలకశాఖలో తయారు కాలేదని తెలిపారు. ఈ జీవోలను ఆ శాఖ ఉద్యోగులు తయారు చేయలేదని పలువురు ఉద్యోగులు సంబంధిత మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాలు ఇచ్చారని వివరించారు. దర్యాప్తును కొనసాగించాల్సిన అవసరం ఉంది రాజధానిని ప్రకటించడానికి ముందే రాజధాని ఎక్కడ ఉందో తమకు కావాల్సిన వ్యక్తులు, కంపెనీలకు సమాచారం ఇచ్చారని, తద్వారా రాజధాని చుట్టుపక్కల వారంతా కూడా నామమాత్రపు ధరలకే భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. ఇంత తీవ్రమైన వ్యవహారంలో దర్యాప్తును కొనసాగించాల్సిన అవసరం ఉం దని ఏజీ చెప్పారు. రాజధానికి సంబంధించిన జీవోల తాలూకు నోట్‌ఫైళ్లను సీఎం హోదాలో చంద్రబాబు ఆమోదించి, వాటిపై సంతకం చేశారని వివరించారు. ఏ నిర్ణయాలపై జీవోలను జారీ చేశారో, ఆ నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో కుట్ర కోణంలో చంద్రబాబు, అప్పటి ఆయన మంత్రివర్గ సభ్యుల పాత్రపై దర్యాప్తు చేయాల్సి ఉందని వివరించారు. పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేయాలని కోర్టును కోరారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పిటిషనర్ల భూ కొనుగోళ్లన్నీ కూడా చట్ట నిబంధనలకు లోబడే జరిగాయన్నారు. పిటిషనర్ల తరఫున పలువురు ఇతర న్యాయవాదులు కూడా వాదనలు విన్పించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. ఈ అంశాలన్నీ కుట్రను నిర్ధారిస్తున్నాయి రాష్ట్రంపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపే కీలక నిర్ణయాలను గురించిన వివరాలను నోట్ ఫైళ్లలో చేర్చలేదని తెలిపారు. రికార్డుల్లో చేర్చకుండా ఈ విధంగా కీలక నిర్ణయాలను ఎందుకు తీసుకున్నారో దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. 30.12.2014 న ఒకేరోజు ఆ ఆరు జీవోల జారీకి తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని సంబంధిత ఉద్యోగులు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. ఇవన్నీ కూడా రాజధాని నిర్ణయం, భూముల కొనుగోళ్ల వెనుక భారీ కుట్ర ఉందన్న విషయాన్ని నిర్ధారిస్తున్నాయని చెప్పారు. అలాగే అప్పటి సీఎం చంద్రబాబునాయుడుకు, తెలుగుదేశం పార్టీకి సన్నిహితులైన కొందరు వ్యక్తులు, కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా అమరావతి రాజధాని నిర్ణయం జరిగిందన్న దానిని కూడా ఆ ఉద్యోగుల వాంగ్మూలాలు నిర్ధారిస్తున్నాయని కోర్టుకు నివేదించారు. -
ఆర్థిక పరిపుష్టి కలిగిన కొందరి కోసమే అమరావతి
సాక్షి, అమరావతి: అమరావతిని రాజధానిగా నిర్ణయించడం వెనుక గత పాలకులకు ఏమాత్రం సదుద్దేశం లేదని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. గత పాలకులు తీసుకున్న నిర్ణయాలు అహేతుకం, ఏకపక్షం, నిజాయితీ లోపించినవైతే, వాటిని తదుపరి పాలకులు కొనసాగించాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. ఆర్థిక పరిపుష్టి కలిగిన కొంత మంది వ్యక్తులు అమరావతిలోని వనరులన్నింటినీ నియంత్రిస్తున్నారని తెలిపారు. వాళ్లే ఇప్పుడు రాజధాని అంశంలో కోర్టుల్లో పిటిషన్లు వేశారన్నారు. అమరావతి అందరి రాజధాని కాదని, ఆర్థిక పరిపుష్టి కలిగిన కొందరిది మాత్రమేనన్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులకు మరింత లబ్ధి చేకూర్చేందుకే అమరావతిని రాజధానిగా నిర్ణయించారే తప్ప, అందులో ఏ మాత్రం ప్రజాప్రయోజనాలు లేవని శ్రీరామ్ కోర్టు దృష్టికి తెచ్చారు. 40 శాతం మంది రైతులు తమ ప్లాట్లను ఆ ఆర్థిక పరిపుష్టి కలిగిన వ్యక్తులకు అమ్మేసుకున్నారని, వారే ఇప్పుడు రైతుల ముసుగులో ఆందోళన చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. నిజమైన రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా కాపాడుతోందన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాల నిమిత్తం పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. పిటిషనర్లు ఈ వ్యాజ్యాలు దాఖలు చేయడం ద్వారా గత పాలకుల తప్పులను ఈ ప్రభుత్వం కొనసాగించాలని ఒత్తిడి చేయదలిచారని వివరించారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించడం వెనుక జరిగిన వ్యవహారాలన్నింటినీ ముందు కోర్టు తెలుసుకోవాలని, ఆ తర్వాత ఈ వ్యాజ్యాలను విచారించాలని కోరారు. గత ప్రభుత్వ అక్రమాలను పునరుద్ధరించేందుకు కోర్టు తన పరిధిని ఉపయోగించరాదన్నారు. ప్రజల రాజధానికి ఉండాల్సిన లక్షణాలేవీ అమరావతికి లేవని వివరించారు. తమకు నచ్చిన నగరాన్ని రాజధానిగా ప్రకటించాలని, నిర్ణయించాలని పిటిషనర్లు కోరజాలరని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను కొట్టేయాలని కోరారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. -
రామమందిర ట్రస్ట్ నుంచి భారీగా సొమ్ము మాయం
లక్నో: అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ ఆలయ నిర్మాణానికి భారీగా విరాళాలు కూడా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ జన్మభూమి ట్రస్టుకు చెందిన అధికారిక బ్యాంకు ఖాతాల నుంచి భారీగా సొమ్ము మాయమైంది. సెప్టెంబర్ 1వ తేదీన లక్నోలోని బ్యాంకు నుంచి రూ.6 లక్షల రూపాయలు, మరో రెండు రోజుల తరువాత మూడున్నర లక్షల రూపాయలను ట్రస్ట్ చెక్ పేరుతో విత్‌డ్రా చేసుకున్నారు. అయితే ముచ్చటగా మూడోసారి ఏకంగా 9.86 లక్షల రూపాయలకు టోకరా వేశారు. అయితే అంత పెద్ద మొత్తం డబ్బు కావడంతో బ్యాంకు అధికారులకు సందేహం వచ్చి ట్రస్ట్ వారికి ఫోన్ చేయగా విషయం బయటపడింది. (రాముడిపై సినిమాకు ఇదే సరైన సమయం: రాజమౌళి) ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయోధ్య పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు సెప్టెంబర్ 17 తర్వాత ప్రారంభమవుతాయని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మందిర నిర్మాణం కోసం ముంబై, హైదరాబాద్ సుమారు 100 మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటారని.. వారందరికీ ముందే కరోనా పరీక్షలు చేయిస్తామని అధికారులు వెల్లడించారు. థర్మల్ స్రీనింగ్ తర్వాతే విధుల్లోకి అనుమతిస్తామని తెలిపారు. (అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు) -
‘ఫైబర్ నెట్’లో భారీ అక్రమాలు
సాక్షి, అమరావతి: గత సర్కారు చేపట్టిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. వీటిని నిర్థారిస్తూ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపినట్లు తెలిపారు. అర్హతలు లేకున్నా కావాల్సిన వారికి టెండర్లు కట్టబెట్టి నాణ్యత, అనుమతులు పట్టించుకోకుండా గత సర్కారు ముందుకు వెళ్లిందన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించారని కోర్టుకు నివేదించారు. ఏజీ ఏమన్నారంటే.. ► గతంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తేనే ఇలాంటి అక్రమాలు వెలుగులోకి వచ్చి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చు. ► ఈ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశాం. సిట్ నమోదు చేసే కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వం ఫిబ్రవరి 28న లేఖ రాసింది. హైకోర్టు దీనిపై ఇప్పటివరకు పాలనాపరమైన నిర్ణయం వెలువరించలేదు. ఈ నేపథ్యంలో సిట్ ఎలాంటి కేసులను దర్యాప్తు చేయడం లేదు. ఫిర్యాదులపై సీఐడీ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తోంది. అమరావతి భూ కుంభకోణం విషయంలో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) కూడా నమోదు చేసింది. ఈ కేసులో కేంద్రం, సీఐడీ తదితరులను ప్రతివాదులుగా చేర్చి వాదనలు వినాలి. ► గత సర్కారు నిర్ణయాలను సమీక్షించే కార్యనిర్వాహక అధికారం ప్రభుత్వానికి ఉంది. న్యాయసూత్రాల ప్రకారం దర్యాప్తు ఫలానా విధంగా జరగాలని నిర్ణయించే అధికారం నిందితుడికి లేదు. నిందితులుగా భావిస్తున్న వ్యక్తుల తరఫున పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత లేదు. ► గత సర్కారు నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ జారీ చేసిన జీవో 1411, సిట్ ఏర్పాటు చేస్తూ జీవో 344 జారీ చేయటాన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ► దీనికి సంబంధించి అడ్వొకేట్ జనరల్ తన వాదనలను ముగించడంతో న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు విచారణను బుధవారానికి వాయిదా వేశారు. -
కంగనా ఉందని సినిమా నుంచి తప్పుకున్నా
‘‘కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటిస్తోందని తెలిసి నేను ఓ సినిమా నుంచి తప్పుకున్నా’’ అని ప్రముఖ కెమెరామేన్ పీసీ శ్రీరామ్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘‘కంగనాతో కలిసి పని చేయడం నాకు అసౌకర్యంగా అనిపించింది. ఈ విషయాన్ని చిత్రబృందానికి చెబితే వాళ్లు అర్థం చేసుకున్నారు. కొన్నిసార్లు మన మనసుకు ఏది మంచిదనిపిస్తే అది చేయాలి. ఈ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’’ అన్నారాయన. ఇది నిజంగా నాకు నష్టమే – కంగనా కంగనాతో నేరుగా పీసీ శ్రీరామ్‌కు ఏ వివాదం లేకపోయినా.. ప్రతిదాన్నీ వివాదంగా మార్చే ఆమె తీరు నచ్చకే ఆయన తప్పుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఏ విషయాన్నయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే కంగనా బాలీవుడ్లో నెలకొన్న నెపోటిజమ్ (బంధుప్రీతి) గురించి విమర్శనాస్త్రాలు సంధించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో బాలీవుడ్లో వివక్ష గురించి సంచలన వ్యాఖ్యలు చేశారామె. ఇక తాను నటిస్తున్న సినిమా నుంచి పీసీ శ్రీరామ్ తప్పుకోవడం గురించి కంగనా ఓ ట్వీట్ చేశారు. ‘‘మీలాంటి లెజెండ్‌తో పని చేసే అవకాశాన్ని మిస్సయ్యాను. ఇది నిజంగా నాకు నష్టమే. మీకు నా విషయంలో ఎక్కడ అసౌకర్యంగా అనిపించిందో తెలియడంలేదు. ఏది ఏమైనా మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు. విష్ యు ఆల్ ది బెస్ట్’’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు కంగనా రనౌత్. -
‘కేవలం కంగనా వల్లే ఈ సినిమాను తిరస్కరించాను’
ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ సినిమాను తాను తిరస్కరించినట్లు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ సోషల్ మీడియాలోప్రకటించాడు. ఈ సినిమాను తిరస్కరించడానికి కాస్తా ఇబ్బంది పడ్డానని, కానీ తప్పలేదని చెప్పాడు. కేవలం కంగనా లీడ్ రోల్ చేస్తున్నందునే ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని మంగళవారం ఆయన ట్విటర్ వేదికగా స్ఫష్టం చేశాడు. అయితే శ్రీరామ్ తన ట్వీట్లో సినిమా పేరు వెల్లడించలేదు. ‘కంగనా రనౌత్ కథానాయకిగా నటిస్తున్న సినిమాను నేను తిరస్కరించాల్సి వచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో ఉన్నందున నేను అసౌకర్యానికి గురయ్యాను. నా వైఖరిని దర్శక-నిర్మాతులకు వివరించాను. వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్న’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. (చదవండి: మహారాష్ట్ర ప్రభుత్వానికి కంగనా సవాల్) Had to reject a film as it had Kangana Ranaut as the lead .Deep down i felt uneasy and explained my stand to the makers and they were understanding. Some times its only abt what feels right . Wishing them all the best. — pcsreeramISC (@pcsreeram) September 8, 2020 అయితే కొన్ని సార్లు మన భావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం ముఖ్యంమని, అదే సరైనదని శ్రీరామ్ తెలిపాడు. అదే విధంగా చిత్ర యూనిట్‌కు శుభకాంక్షలు కూడా తెలిపాడు. అయితే కంగనా ఇటీవల ముంబైకి, మహరాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరస వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన కొంతమంది నెటిజన్లు, అభిమానులు ఆయన నిజాయితికి ప్రశంల జల్లు కురిపిస్తుంటే.. కంగనా అభిమానులు మాత్రం ఇది వృత్తిపరమైన నిర్ణయంగా పేర్కొన్నారు. (చదవండి: కంగనా నివాసానికి ఐబీ, పోలీసు అధికారులు) -
‘మూడు తీర్పులను పరిగణలోకి తీసుకోవాలి’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై ఏపీ హైకోర్టు గురువారం విచారణ చెపట్టింది. విచారణలో భాగంగా.. ప్రభత్వుం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలను వినిపించారు. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెడుతూ జారీచేసిన జీవో విద్యాహక్కు చట్టంలోని 29వ నిబంధనను ఉల్లంఘించలేదని తెలిపారు. భాషాపరంగా అల్ప సంఖ్యాకుల కోసం కొన్ని చర్యలను, వారి మాతృభాషా పరిరక్షణకోసం భద్రతా చర్యలను మాత్రమే రాజ్యాంగంలోని ఆర్టికల్ 350 నిర్దేశిస్తుందని ఆయన చెప్పారు. ఇలాంటి అంశాల్లో ఆచరించదగ్గ మూడు తీర్పులను కోర్టు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ముసాదా విధానాన్ని పరిశీలించాల్సిందిగా ఏజీ శ్రీరామ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సాధ్యాసాధ్యాలను మాత్రమే ఈ ముసాదా విధానం చర్చించిందని ఏజీ శ్రీరామ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30లో పేర్కొన్న సంస్థలు (మైనార్టీ విద్యాసంస్థలు), ప్రైవేటు సంస్థలు ఎక్కడా ప్రభావితం కాలేదని శ్రీరామ్ కోర్టుకు చెప్పారు. తమకు ఇంగ్లిషు మీడియమే కావాలంటూ.. విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీల్లో 97శాతం కోరుతున్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన రికార్డులను కోర్టు ముందు ఉంచుతున్నామని ఆయన చెప్పారు. తమ పిల్లలు తెలుగు మీడియంలోనే చదువుతున్నారంటూ పిటిషనర్లు కోర్టు ముందు చెప్పడం లేదు.. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. పాఠ్య ప్రణాళకలో తెలుగును తప్పనిసరి చేస్తూ, మాతృభాషను అభివృద్ధి చేసే చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వం తాజా జీవో జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారిచేత ఎన్నికైన ప్రభుత్వం తగిన రీతిలో విధానాలను రూపొందిస్తుందన్నారు. విధానాలను నిలువరించే అప్పిలేట్ అథారిటీ లా కోర్టులు వ్యవహరించజాలవని ఆయన అన్నారు. ఈ విధానం సరైందని.. మరొక విధానం కాదని కోర్టులు నిర్దేశించలేవని ఆయన తెలిపారు. విధానాల విషయంలో కోర్టులకు పరిమితమైన పాత్ర ఉంటుందని ఏజీ శ్రీరామ్ అన్నారు. -
కొందర్ని నమ్మి మోసపోయాం
శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉత్తర’. రవికుమార్ మాదారపు సమర్పణలో శ్రీపతి గంగదాస్, తిరుపతి యస్.ఆర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపతి యస్.ఆర్ మాట్లాడుతూ–‘‘ఉత్తర’ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. కానీ, థియేటర్స్ సమస్య ఇబ్బంది పెడుతోంది. ఇందులో మా తప్పులూ లేకపోలేదు. సినిమా రిలీజ్, ప్రచార విషయాల్లో కొందర్ని నమ్మి మోసపోయాం. పాజిటివ్ టాక్ వస్తున్నప్పటికీ థియేటర్స్ కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. ఇండస్ట్రీలో కొందరి నిజస్వరూపాలు తెలిశాయి. మంచి సినిమాలను బతికించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మా సినిమా చూసినవారు బాగాలేదనలేదు. మా సినిమాను ఇండస్ట్రీ పెద్దలు చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు శ్రీరామ్. -
నా నమ్మకం నిజమైంది
ఈషారెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో..’. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి కాస్త నిరాశకు లోనయ్యాం. కానీ శనివారం మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు హౌస్‌ఫుల్ అవ్వడం, అన్ని చోట్ల కలెక్షన్స్ కూడా బాగుండటంతో చాలా హ్యాపీ ఫీలయ్యాం. సినిమా చూసినవాళ్లు బాగుంది చూడమని ఇంకో పదిమందికి చెబుతున్నారు. నేను ఏదైతే నమ్మి సినిమాను తీశానో అది నిజమైంది. బుధవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ ప్లాన్ చేశాం. ఈషా, సత్యదేవ్ బాగా నటించారు. శ్రీనివాస్ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. ఆయన బ్యానర్లోనే ‘భార్యదేవోభవ’ అనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాను. ఓ ప్రముఖ హీరో నటిస్తారు. పదిమంది హీరోయిన్లు ఉంటారు’’ అన్నారు. ‘‘విద్య’ పాత్రను బాగా చేశానని చెబుతుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు ఈషా రెబ్బా. ‘‘థ్రిల్లర్ సినిమాని బాగా గ్రిప్పింగ్‌గా తీశాడని కె.రాఘవేంద్రరావుగారు ఫోన్ చేసి చెప్పడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు శ్రీనివాస్ కానూరి. సత్యదేవ్, సంగీత దర్శకుడు రఘు కుంచె, గణేష్ వెంకట్రామన్, రవివర్మ, ముస్కాన్, కెమెరామన్ అంజి మాట్లాడారు. -
నిర్మాతే నా హీరో
‘‘నేను గతంలో చేసిన సినిమాలన్నీ కామెడీ టచ్ ఉన్నవి. ‘రాగల 24 గంటల్లో..’ సినిమాతో మొదటిసారి పూర్తిస్థాయి థ్రిల్లర్ జానర్లో సినిమా చేశా. స్క్రీన్‌ప్లే ప్రధానమైన సినిమా ఇది. తర్వాత ఏం జరుగుతుంది? అనే సస్పెన్స్‌లో ప్రేక్షకుడు ఉంటాడు’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. ఈషారెబ్బా ప్రధాన పాత్రలో సత్యదేవ్, శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, కృష్ణభగవాన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో..’. కానూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది. చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి పంచుకున్న విశేషాలు... ► నేను, కృష్ణభగవాన్ రెండు స్క్రిప్ట్స్ తయారు చేస్తున్నాం. ఆ సమయంలో ‘రాగల 24 గంటల్లో..’ కథను శ్రీనివాస్ వర్మ తీసుకొచ్చారు. మా అందరికీ నచ్చడంతో ఈ సినిమాని ప్రారంభించాం. 24గంటల్లో జరిగే కథ ఇది. ► హీరోయిన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈషారెబ్బా నటన చూశాక నయనతారలా చేసింది అంటారు. సత్యదేవ్ నట విశ్వరూపం చూస్తారు. శ్రీరామ్ ఏసీపీ పాత్ర చేశారు. ఈ సినిమాలో కామెడీ చొప్పించాలనే ప్రయత్నం చేయలేదు. ► ‘ఢమరుకం’ తర్వాత నాగచైతన్యతో ‘హలో బ్రదర్’ రీమేక్ చేయాలనుకున్నాం. సమంత, తమన్నా హీరోయిన్లు. 10 నెలలు స్క్రిప్ట్ వర్క్ చేశాం. అది సెట్స్ మీదకు వెళ్లలేదు. చైతన్యతోనే ‘దుర్గా’ అనే సినిమా అనుకున్నాం. హన్సిక హీరోయిన్గా. అదీ వర్కౌట్ కాలేదు. అక్కడ నాకు రెండేళ్ల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ‘మామ మంచు అల్లుడు కంచు’ చేశా. ఆ సినిమా చేసిన రెండేళ్లకు ఈ సినిమాతో వస్తున్నాను. ► శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ డైరెక్టర్ కావడం స్వామికి సేవ చేసుకునే అవకాశం వచ్చిందనుకుంటున్నాను. త్వరలోనే యస్వీబీసీ చానల్ హెచ్డీ ప్రసారాలు అందించనున్నాం. కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చానల్ని విస్తరించాలనుకుంటున్నాం. దర్శకుడన్నాక ఎలాంటి సినిమా అయినా డీల్ చేయాలి. కోడి రామకృష్ణగారు, ఈవీవీగారు అన్ని రకాల సినిమాలు చేశారు. నేను కూడా వారిలా అన్నీ చేయాలనుకుంటున్నాను. ► నేను ఫామ్‌లో లేకపోయినా నన్ను నమ్మి ఈ సినిమా తీశాడు కానూరి శ్రీనివాస్. నా నిర్మాతే నా హీరో. సినిమా అంటే తనకు చాలా ప్యాషన్. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా మా సినిమా రిలీజ్ అవుతోంది. శ్రీనివాస్ కానూరి ప్రొడక్షన్లోనే మరో రెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తాను. -
ట్యూన్ కడుతున్నారు
సిడ్ శ్రీరామ్ ‘ఇంకేం ఇంకేం కావాలే..’ అని పాడితే, ప్రేక్షకులు పదే పదే పాట విన్నారు. ఆ తర్వాత ‘మాటే వినదుగ వినదుగ’ అని పాడితే అదీ విన్నారు. ఈ మధ్యకాలంలో పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు సింగర్ సిడ్ శ్రీరామ్. ఇప్పుడు ఈ పాటగాడు కాస్తా కంపోజర్ అయ్యారు. మణిరత్నం ‘కడల్’ సినిమాతో సింగర్‌గా మారిన సిడ్ ఇప్పుడు మణిరత్నం నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమా ద్వారానే సంగీత దర్శకుడిగా మారనున్నారు. విక్రమ్ ప్రభు, ఐశ్వర్యా రాజేశ్ జంటగా ధన దర్శకత్వంలో మణిరత్నం నిర్మించనున్న చిత్రం ‘వానమ్ కొట్టట్టుమ్’. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం కానున్నారు సిడ్ శ్రీరామ్. తొలుత ఈ సినిమాకు ‘96’ ఫేమ్ గోవింద్ వసంత సంగీత దర్శకుడు. డేట్స్ క్లాష్ కావడంతో సిడ్ శ్రీరామ్ ట్యూన్స్ అందించడానికి రెడీ అయ్యారు. -
ప్రమాదంలో గాయపడ్డ ఎన్నారై శ్రీరామమూర్తి
కాన్ టౌన్షిప్ (పెన్సిల్వేనియా) : ప్రముఖ సైక్లిస్టు శ్రీరామమూర్తి కయ్యలముడి (48) కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. జూన్ 29న జరిగిన ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక పోలీసులు వాషింగ్టన్‌లోని పావోలి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడుకు, వెన్నముకు, ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలయ్యాయని.. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్లు తెలిపారు. తెలుగు వాడైన శ్రీరామమూర్తి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. స్వతహాగా సేవా దృక్పథం కలిగిన వ్యక్తం కావడంతో.. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనేవారు. అరోగ్యకరమైన జీవితం కోసం అందరూ జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్ చేయాలని అందరినీ ప్రోత్సహిస్తుండేవారని సన్నిహితులు చెబుతున్నారు. శ్రీరామమూర్తి స్వయంగా పాల్గొని ఎన్నో ప్రతిష్టాత్మకమైన మారథాన్లు కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే అందరికీ ఆదర్శంగా ఉండే శ్రీరామమూర్తి ఇలా ప్రమాదానికి గురికావడంతో.. ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఇటువంటి ఉన్నతమైన వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వైద్య చికిత్స కోసం ఎన్నారై సంస్థలు ఫండ్ రైజింగ్ చేపట్టారు. ఫండ్ రైజింగ్ కోసం.... https://www.gofundme.com/f/help-murthy-to-run-again -
ఏపీ అడిషనల్ ఏజీగా పొన్నవోలు నియామకం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అడిషనల్ ఏజీ (అడ్వొకేట్ జనరల్)గా సీనియర్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పొన్నవోలు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. అడిషనల్ ఏజీగా తనకు బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు పలువురు పొన్నవోలుకు అభినందనలు తెలిపారు. కాగా రాష్ట్ర నూతన అడ్వొకేట్ జనరల్‌గా సుబ్రహ్మణ్య శ్రీరామ్ బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. -
ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా సుబ్రమణ్యం శ్రీరామ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన అడ్వొకేట్ జనరల్‌గా సుబ్రమణ్యం శ్రీరామ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. న్యాయవ్యవస్థలో అడ్వొకేట్ జనరల్(ఏజీ) పోస్టుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులు, వివిధ కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిళ్లుగా వ్యవహరిస్తున్న న్యాయవాదులు తమ తమ పోస్టులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వీరి స్థానంలో కొత్త అడ్వొకేట్ జనరల్ అవసరాన్ని బట్టి ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులను నియమించుకుంటారు. ఈ నియామకాల విషయంలో అడ్వొకేట్ జనరల్‌కు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిసింది. ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ఏజీకి జగన్మోహన్రెడ్డి దిశా నిర్ధేశం చేసినట్లు సమాచారం. -
ఏపీ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా సుబ్రమణ్యం శ్రీరామ్
సాక్షి, అమరావతి: కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా సుబ్రమణ్యం శ్రీరామ్, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)గా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలిసింది. నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా వీరి పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత వీరి నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు అడ్వొకేట్ జనరల్‌ను గవర్నర్ నియమిస్తారు. న్యాయవ్యవస్థలో అడ్వొకేట్ జనరల్ పోస్టుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ పోస్టు రాజ్యాంగబద్ధమైంది. ఏజీ నియామకం పూర్తయిన తరువాత ఆయన సొంత టీంను ఏర్పాటు చేసుకుంటారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులు, వివిధ కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిళ్లుగా వ్యవహరిస్తున్న న్యాయవాదులు తమ తమ పోస్టులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వీరి స్థానంలో కొత్త అడ్వొకేట్ జనరల్ అవసరాన్ని బట్టి ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులను నియమించుకుంటారు. జూన్ 3వ తేదీ నుంచి హైకోర్టు వేసవి సెలవులు పూర్తి చేసుకుని తన కార్యకలాపాలను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో, కేసుల విచారణ సందర్భంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆ లోపు ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్ల నియామకాలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియామకాల విషయంలో అడ్వొకేట్ జనరల్‌కు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిసింది. ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ఏజీకి జగన్మోహన్రెడ్డి దిశా నిర్ధేశం చేసినట్లు సమాచారం. -
వంద రోజుల చాలెంజ్!
‘‘సవాళ్లను స్వీకరించడం నా జాబ్ హక్కు. అందుకు ఎందాకైనా వెళ్తాను’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. అనడమే కాదు ఆ చాలెంజ్‌కు గడువు కూడా ఫిక్స్ చేసేశారు. విషయమేంటంటే వంద రోజుల్లో ఫిట్‌గా మారిపోవాలని కాజల్ నిశ్చయించుకున్నారు. అందుకే ఈ చాలెంజ్ కూడా టేకప్ చేశారు. ఈ చాలెంజ్ గురించి కాజల్ మాట్లాడుతూ – ‘‘యాక్టర్సే కాదు అందరూ ఫిట్‌గా ఉండాలి. నా శరీరాన్ని నేను అద్భుతంగా తయారు చేసుకోవాలనుకుంటున్నాను. అందులో భాగంగా ఈ చాలెంజ్ తీసుకుంటున్నాను. నా కోచ్ శ్రీరామ్ పర్యవేక్షణలో దీన్ని మొదలుపెడుతున్నాను. ఏం తినాలి? ఏ ఎక్సర్సైజ్లు చేయాలి? అనేవి చాలా శ్రమతో కూడుకున్న పనులు. వాటిని కూడా చాలా తేలిక చేస్తున్నారు ఆయన. ఈ చాలెంజ్‌లో అసహజత్వానికి చోటే లేదు. కేవలం న్యాచురల్‌గా లభించే న్యూట్రిషన్స్తోనే ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నాను. ఎలాంటి మార్పు కనిపిస్తుందో వంద రోజుల్లో చూద్దాం’’ అని పేర్కొన్నారు. -
హారర్.. సెంటిమెంట్
సీహెచ్ సుమన్‌బాబు నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. శ్రీరామ్, కారుణ్య, కమల్ కామరాజు, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్, సురేష్ కొండేటి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న రాజేంద్రప్రసాద్ మనవరాలు, ‘మహానటి’ ఫేమ్ సాయి తుషిత టైటిల్ లోగో ఆవిష్కరించారు. దర్శక–నిర్మాత సుమన్‌బాబు మాట్లాడుతూ– ‘‘మదర్ సెంటిమెంట్, హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. కన్నడలో రెండు చిత్రాలు చేసిన నేను తెలుగులో తొలిసారి నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాను. కారుణ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇందులో ఓ ప్రత్యేక పాత్రను పోషించడానికి సరైన వ్యక్తిగా సురేష్ కొండేటిని అనుకున్నాం. త్వరలో ఆయనపై చిత్రీకరణ చేయనున్నాం’’ అన్నారు. ‘‘మా తాతగారితో ‘మహానటి’లో నటించాను. ఆ చిత్రం ఎంతో పేరు తెచ్చింది. ఈ సినిమాలోనూ మంచి పాత్ర చేస్తున్నా’’ అని సాయి తుషిత చెప్పింది. ‘‘ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు కారుణ్య. నటుడు భద్రం, రచయిత గోపీవిమలపుత్ర, కెమెరా చందు, ఎడిటర్ వెంకట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
ఏం జరిగింది?
ప్రేమ ఉంది. సస్పెన్స్ ఉంది. యాక్షన్ ఉంది.. అన్నీ ఉన్నాయి. అసలేం జరిగింది? అంటే ఇప్పుడు కాదు.. మేలో తెలుస్తుంది. శ్రీరాం, సంచితా పదుకునే జంటగా ఎక్సోడస్ మీడియా నిర్మిస్తున్న ‘అసలేం జరిగింది’. షూటింగ్ పూర్తయింది. ‘‘దాదాపు 40 రోజులు చేసిన షూటింగ్లో టాకీ, పాటలు, ఫైట్లు తీశాం. ఫైట్ మాస్టర్ శంకర్ తెరకెక్కించిన భారీ ఫైట్స్ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. అలాగే కొత్త కొరియోగ్రాఫర్ ఈశ్వర్, మరో కొరియోగ్రాఫర్ హరి పాటలకు అద్భుతమైన స్టెప్స్ సమకూర్చారు. ఓ మాస్ సాంగ్‌లో దాదాపు రెండు వందల మంది, మరో పాటలో నాలుగు వందల మంది పాల్గొన్నారు. ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. 8కె రెజల్యూషన్ గల రెడ్ మాన్‌స్ట్రో కెమెరాను ఈ సినిమా చిత్రీకరణ కోసం వినియోగించాం. దర్శకుడు ఎన్వీఆర్ అద్భుతంగా తెరకెక్కించారు. మే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.