సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్
సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్
Published Tue, Apr 15 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM
‘‘మనం జీవితంలో తెలిసో తెలియకో చేసిన తప్పులు ఎదుటివారి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ ఇది’’ అని దర్శకుడు అంజన్ ఆర్య (లక్ష్మణ్) చెప్పారు. విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సీహెచ్ సతీష్‌కుమార్ నటించి నిర్మించిన చిత్రం ‘ఆర్య చిత్ర’. చాందిని కథానాయిక. సురేష్ యువన్ స్వరాలందించిన ఈ సినిమా పాటల్ని మంగళవారం హైదరాబాద్‌లో పాత్రికేయుడు శ్రీరామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ -‘‘అంతా కొత్తవాళ్లు చేసిన ఈ చిత్రాన్ని ఈ 18న విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చాందిని, రచ్చ రవి, సుడిగాలి సుధీర్ తదితరులు మాట్లాడారు.
Advertisement
Advertisement