
సిడ్ శ్రీరామ్ ‘ఇంకేం ఇంకేం కావాలే..’ అని పాడితే, ప్రేక్షకులు పదే పదే పాట విన్నారు. ఆ తర్వాత ‘మాటే వినదుగ వినదుగ’ అని పాడితే అదీ విన్నారు. ఈ మధ్యకాలంలో పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు సింగర్ సిడ్ శ్రీరామ్. ఇప్పుడు ఈ పాటగాడు కాస్తా కంపోజర్ అయ్యారు. మణిరత్నం ‘కడల్’ సినిమాతో సింగర్‌గా మారిన సిడ్ ఇప్పుడు మణిరత్నం నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమా ద్వారానే సంగీత దర్శకుడిగా మారనున్నారు. విక్రమ్ ప్రభు, ఐశ్వర్యా రాజేశ్ జంటగా ధన దర్శకత్వంలో మణిరత్నం నిర్మించనున్న చిత్రం ‘వానమ్ కొట్టట్టుమ్’. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం కానున్నారు సిడ్ శ్రీరామ్. తొలుత ఈ సినిమాకు ‘96’ ఫేమ్ గోవింద్ వసంత సంగీత దర్శకుడు. డేట్స్ క్లాష్ కావడంతో సిడ్ శ్రీరామ్ ట్యూన్స్ అందించడానికి రెడీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment