ఖుషీ రవి
‘‘లాక్‌డౌన్ తర్వాత ప్రేక్షకులు వినోదాన్ని ఆస్వాదించే విధానం మారింది. కథ, నటీ నటుల పాత్రల్లో కొత్తదనం ఉంటేనే చూస్తున్నారు. అందుకే ప్రయోగాత్మక, కొత్త తరహా పాత్రలే చేయాలనుకుంటున్నాను. కథ నచ్చి, అందులో నా పాత్ర బలంగా ఉంటే గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా రెడీ’’ అన్నారు ఖుషీ రవి. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన హారర్ చిత్రం ‘పిండం’.
ఈ చిత్రం ఈ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఖుషీ రవి మాట్లాడుతూ– ‘‘నటిగా కన్నడంలో ‘దియా’ నా తొలి చిత్రం. ఆ చిత్రం తర్వాత పెళ్లి చేసుకున్నాను. నాకో పాప ఉంది. ఇక ‘పిండం’ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాలో నేను మేరీ పాత్రలో నటించాను. కథ రీత్యా ఇద్దరు కుమార్తెలు నాకు. మూడో ప్రసవం కోసం గర్భిణిని.
కెరీర్‌ప్రారంభంలోనే తల్లి పాత్రæచేస్తే నా కెరీర్ ఏమౌతుందోననే భయం, అభద్రతాభావం నాకు లేవు. నా మరో చిత్రం ‘రుద్ర’లో ట్రాన్స్‌జెండర్ పాత్ర చేస్తున్నాను. సవాల్ అనిపించే పాత్రలు చేయడం నాకు ఇష్టం’’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment