‘‘తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన హారర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ‘మా పిండం’ ఉంటుంది. భయపెట్టాలని హారర్ సీన్స్ పెట్టలేదు. బలమైన కథ ఉంది. ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు సాయికిరణ్ దైదా. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్ కానుంది. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుండి నాకు రాయడం అంటే ఇష్టం.
అమెరికాలో వ్యాపారం చేస్తున్నా స్క్రిప్ట్‌లు రాసేవాడిని. కోన వెంకట్‌గారు అమెరికాలో పరిచయమయ్యారు. నేను రాసుకున్న ఓ క్రైమ్ కామెడీ కథ ఆయనకు నచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఆ సినిమా డల్లాస్‌లోనే షూటింగ్ జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా కుదరలేదు. నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకుని ‘పిండం’ తీశాను. ఇది హారర్ సినిమా కాబట్టి భయపెట్టే సీన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నెక్ట్స్ ‘కృష్ణుడి లంక’ టైటిల్‌తో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment