saikiran
-
ఒకే వ్యక్తికి మూడు ఉద్యోగాలు
దండేపల్లి: దండేపల్లి మండల కేంద్రానికి చెందిన పెండ్యాల సత్యనారాయణ–శకుంతల కుమారుడు పెండ్యాల సాయికిరణ్ మూడు ఉద్యోగాలు సాధించాడు. సాయికిరణ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్, మహారాష్ట్రలోని దపోలీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ, గ్రూప్–4, ఇండియన్బ్యాంక్, మండల వ్యవసాయ అధికారి ఉద్యోగాల కోసం పరీక్షలు రాశాడు.. ఇందులో గ్రూ ప్–4లో జిల్లా 14వ ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇండియన్ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. ఇటీవల విడుదలైన మండ ల వ్యవసాయ అధికారి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 42వ ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యా డు. సాయికిరణ్ మూడు ఉద్యోగాలకు ఎంపికవ్వడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏవో ఉద్యోగానికి ఎంపిక..జన్నారం: మండలంలోని పొనకల్ గ్రామానికి చెందిన జాడి రాజలింగం–రేణుక దంపతుల కూతురు స్పందన మండల వ్యవసాయ అధికారి ఉద్యోగానికి ఎంపికైంది. ఆమెను జగిత్యాల డిప్యూటీ కలెక్టర్ చిత్రుపటేల్ ఆదివారం పొనకల్లో అభినందించా రు. 2022లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసిన స్పందన, 2023 జనవరిలో భారత ఆహార సంస్థ నిర్వహించిన ఉద్యోగ పరీక్షలో టెక్నికల్ అసెస్టింట్ ఉద్యోగం సాధించి మంచిర్యాలలో ఉద్యోగం చేస్తున్నారు. 2023 మేలో నిర్వహించిన మండల వ్యవసాయ అధికారిగా ఉద్యోగ పరీక్షల ఫలితాలు తాజా గా విడుదల కాగా ఏవో ఉద్యోగం సాధించింది. తమ కూతురు ప్రభుత్వ కొలువులు సాధించినందుకు సంతోషంగా ఉందని స్పందన తల్లిదండ్రులు తెలిపారు. -
తెలంగాణ అథ్లెట్ సాయికిరణ్‌కు స్వర్ణం
దుద్యాల్: జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన అల్వాల్ సాయికిరణ్ పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో విజేతగా నిలిచాడు. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం జరిగిన ఈవెంట్లో వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల సాయికిరణ్ ఇనుప గుండును 18.36 మీటర్ల దూరం విసిరాడు. గచ్చి»ౌలి స్టేడియంలో ‘ద్రోణాచార్య’ అవార్డు గ్రహీత, కోచ్ నాగపురి రమేశ్ వద్ద సాయికిరణ్ శిక్షణ తీసుకుంటున్నాడు. -
దేశసేవకు మించింది లేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘దేశ సేవకు మించింది లేదు.. సమాజానికి మేలు చేసే పనితో పోలిస్తే డబ్బుకు నా దృష్టిలో ప్రాధాన్యం లేదు.. అందుకే, మూడు రెట్ల అధిక జీతం వదులుకొని సివిల్ సర్వీస్‌లో చేరబోతున్నాను.. పేదలు, సమాజం కోసం పాటుపడేందుకు, వారిని ఆదుకునేందుకు సివిల్స్ గొప్ప వేదిక.. ఐదేళ్ల క్రితం మొదలైన సివిల్స్ వేట మొన్నటి ఫలితాలతో పూర్తయింది. పేదరికం, కుటుంబ సమస్యలు సివిల్స్ సాధనలో అసలు ఆటంకాలే కావు.. ప్రణాళిక ప్రకారం చదివితే సాధించడం కష్టమేమీ కాదు’ అన్నారు సివిల్స్ ఆలిండియా 27వ ర్యాంకర్ నందాల సాయికిరణ్. తాను సివిల్స్‌కు ఎంపికై న తీరు, విజయం సాధించిన క్రమాన్ని బుధవారం తన స్వగ్రామం రామడుగు మండలంలోని వెలిచాలకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. కల కోసం శ్రమించాను.. సివిల్ సర్వీసెస్‌లో చేరాలన్న నా కల కోసం చాలా శ్రమించాను. చిన్నప్పటి నుంచి సమాజానికి ఏదైనా చేయాలన్న కోరిక ఉండేది. కానీ, ఏ ఉద్యోగం చేయాలన్నది మాత్రం అప్పుడే నిర్ణయించుకోలేదు. ఆర్ఈసీ వరంగల్‌లో ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాను. మంచి ప్యాకేజీతో ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. అయినా, ఏదో వెలితి. ఆ సమయంలో ఐఏఎస్ అయితే దేశానికి ఎలా సేవ చేయవచ్చో ఆలోచించాను. నా సివిల్స్ కలకు అక్కడే బీజం పడింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. మా నాన్న కాంతారావు చేనేత కార్మికుడు, అమ్మ లక్ష్మి బీడీలు కార్మికురాలు. మాది మధ్య తరగతి కుటుంబం అని నేను ఏనాడూ కలత చెందలేదు. వారి శక్తి మేరకు నన్ను, నా సోదరిని బాగా చదివించారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజు నా సివిల్స్ లక్ష్యాన్ని చేరుకోగలిగాను. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం.. నేటి యువతకు సివిల్స్ కష్టమేమీ కాదు. కాకపోతే క్రమశిక్షణతో ప్లాన్ ప్రకారం చదువుకుంటూ పోవాలి. పేదరికం, కుటుంబ సమస్యలపై దిగులు పడొద్దు. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తప్పకుండా దరిచేరుతుంది. బోలెడంత మెటీరియల్ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. మాక్ ఇంటర్వ్యూలు కూడా ఆన్లైన్లో అటెండ్ అవ్వొచ్చు. సాధిస్తానన్న నమ్మకంతో చదివా.. సివిల్ సర్వీసెస్ చదవడమంటే చాలా కష్టపడాలి. అందులోనూ కోచింగ్ లేకుండా, మరోవైపు ఉద్యోగం చేస్తూ చదవడమంటే మాటలు కాదు. కానీ, సాధిస్తానన్న నమ్మకంతో ప్రణాళిక ప్రకారం చదివా. సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నాను. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నాను. కొంచెం ఇంటర్నెట్ నుంచి తీసుకునేవాడిని. ఉద్యోగానికి వెళ్లేవాడిని. రోజూ 3 నుంచి 4 గంటలు క్రమం తప్పకుండా చదివేవాడిని. వారాంతాల్లో మాత్రం పూర్తి సమయం చదివేందుకే కేటాయించేవాడిని. అలా క్రితం సారి సివిల్స్‌లో ఇంటర్వ్యూ వరకు వెళ్లా. అక్కడ కేవలం 18 మార్కులతో సివిల్స్ మిస్సయ్యాను. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. జరిగిన పొరపాట్లు పునరావతం కాకుండా మరింత కట్టుదిట్టంగా చదివాను. ముఖ్యంగా నేను రాసిన పేపర్లను థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ చేయడం వల్ల నా సామర్థ్యం ఎప్పటికప్పుడు అంచనా వేసుకోగలిగాను. ఆన్లైన్లోనే మాక్ ఇంటర్వ్యూలకు ప్రిపేరవడం కలిసి వచ్చింది. సివిల్స్ ప్రిపేరవుతున్నా సోషల్ మీడియాకు దూరంగా లేను. నాకు ఎంత కావాలో అంత పరిమితి మేరకు వాడుకున్నాను. -
సాయికిరణ్ 27.. సహన 739..
సాక్షిప్రతినిధి,కరీంనగర్/రామడుగు: ప్రతిభకు పేదరికం అడ్డు కానే కాదని మరోసారి రుజువైంది. తల్లిదండ్రులు కార్మికులైనా తాను కలెక్టర్ కావాలనుకున్న కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు.. పేదరికం కారణంగా కొలువు చేయాల్సి రావడం, కోచింగ్ తీసుకోకుండా సొంతంగానే ప్రిపేరయి రెండో ప్రయత్నంలోనే లక్ష్యం చేరుకున్నారు. సివిల్స్ ర్యాంకు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన నందాల సాయికిరణ్ విజయగాథను ఆయన సోదరి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ స్రవంతి ‘సాక్షి’కి వివరించారు. సాయికిరణ్ స్వగ్రామం రామడుగు మండలంలోని వెలిచాల. తల్లిదండ్రులు లక్ష్మి–కాంతారావు, సోదరి స్రవంతి ఉన్నారు. తండ్రి చేనేత కార్మికుడు, తల్లి బీడీ కార్మికులిగా పని చేస్తూ పిల్లల్ని పెంచారు. కుటుంబాన్ని బాగా చూసుకునేందుకు కాంతారావు మహారాష్ట్రలోని భీవండిలో చేనేత కార్మికుడిగా పని చేశారు. సాయికిరణ్ చిన్ననాటి నుంచి చదువులో ముందుండేవారు. ఐదో తరగతి వరకు సరస్వతి పాఠశాలలో చదివారు. ఆయన ప్రతిభను గుర్తించిన ఆ పాఠశాల కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ కరీంనగర్‌లోని తేజస్విని పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించారు. 2012లో పదోతరగతి, ట్రినిటీ జూనియర్ కళాశాలలో 2014లో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారు. ఎన్ఐటీ వరంగల్‌లో సీటు సాధించిన సాయికిరణ్ 2018లో ఇంజినీరింగ్ పూర్తి చేయడంతోనే క్యాల్‌కమ్ కంపెనీలో ఉద్యోగం సాధించారు. తండ్రి మరణించినా.. తల్లి అండతో.. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగానే సాయికిరణ్ తండ్రి 2016లో కేన్సర్ బారిన పడి మృతిచెందారు. దీంతో తల్లి లక్ష్మి కష్టపడి బీడీలు చుట్టి, తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. కూతురు స్రవంతి బీటెక్ పూర్తి చేసి, ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పని చేస్తున్నారు. సాయికిరణ్ 2018 నుంచి ఉద్యోగం చేస్తూనే ఆన్లైన్లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటూ పరీక్షలకు సిద్ధమయ్యారు. గతేడాది విఫలమైనా రెండోసారి ఆలిండియా 27వ ర్యాంకు సాధించారు. వీరి తల్లి లక్ష్మి ఇప్పటికీ బీడీలు చుడుతుందని గ్రామస్తులు తెలిపారు. కాగా, సివిల్స్ ర్యాంకర్ సాయికిరణ్‌ను ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. ప్రత్యేకత చాటుకున్న వెలిచాల.. గత పదేళ్లుగా ఉత్తమ గ్రామపంచాయతీగా పేరు పొందిన వెలిచాలకు ఇక్కడి అభివృద్ధి పనులపై స్టడీ టూర్ చేయడానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పలువురు సివిల్ సర్వీస్ ప్రతినిధులు వచ్చి, వెళ్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకున్న సాయికిరణ్ కష్టపడి చదివి, సివిల్స్ ర్యాంకు సాధించడంతో ఈ గ్రామం ప్రత్యేకత చాటుకుంది. ఢిల్లీలో కోచింగ్... కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కొలనుపాక గీత–అనిల్ దంపతుల కూతురు సహన సివిల్స్ ఫలితాల్లో 739వ ర్యాంకు సాధించారు. ఆమె స్థానిక కెన్ క్రెస్ట్ స్కూల్లో పదోతరగతి, శ్రీగాయత్రి జూనియర్ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నారు. ప్రిలిమినరీ, మెయిన్స్ ఫలితాల్లో క్వాలిఫై అయ్యాక ఢిల్లీలో పలు మాక్ ఇంటర్వూ్యలకు అటెండయ్యారు. సహన తండ్రి అనిల్ కరీంనగర్లో పాత్రికేయుడిగా పని చేస్తున్నారు. స్మితా సబర్వాల్ స్ఫూర్తి.. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ కలెక్టర్‌గా పని చేసిన స్మితా సబర్వాల్ తనకు స్ఫూర్తి అని సహన తెలిపారు. తాను పాఠశాలలో చదువుతున్నపుడు స్మితా మేడంలా కలెక్టర్ అవ్వాలని ఆ రోజుల్లోనే ఫిక్స్ అయ్యానని, ఆ కల నెరవేర్చుకునేందుకు తాను సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. దీనికి తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారన్నారు. పేదలకు సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. -
ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు – దర్శకుడు సాయికిరణ్ దైదా
‘‘తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన హారర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ‘మా పిండం’ ఉంటుంది. భయపెట్టాలని హారర్ సీన్స్ పెట్టలేదు. బలమైన కథ ఉంది. ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు సాయికిరణ్ దైదా. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్ కానుంది. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుండి నాకు రాయడం అంటే ఇష్టం. అమెరికాలో వ్యాపారం చేస్తున్నా స్క్రిప్ట్‌లు రాసేవాడిని. కోన వెంకట్‌గారు అమెరికాలో పరిచయమయ్యారు. నేను రాసుకున్న ఓ క్రైమ్ కామెడీ కథ ఆయనకు నచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఆ సినిమా డల్లాస్‌లోనే షూటింగ్ జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా కుదరలేదు. నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకుని ‘పిండం’ తీశాను. ఇది హారర్ సినిమా కాబట్టి భయపెట్టే సీన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నెక్ట్స్ ‘కృష్ణుడి లంక’ టైటిల్‌తో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు. -
భయానక చిత్రం
శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ (భయానక చిత్రం) అనేది ఉపశీర్షిక. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీ విష్ణు ఆవిష్కరించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ–‘‘పూర్తి స్థాయి హారర్ నేపథ్యంలో ‘పిండం’ ఉంటుంది. ఈ చిత్ర కథ ప్రస్తుతం, 1990, 1930.. ఇలా మూడు కాలాల్లో జరుగుతుంది. స్క్రీన్ ప్లే హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్‌ను ఈ నెల 30న రిలీజ్ చేస్తాం. నవంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు యశ్వంత్ దగ్గుమాటి. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ మనోహర్, సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి. -
పుట్టినరోజునే ప్రాణాలు కోల్పోయి..
ఊర్కొండ/ కల్వకుర్తి టౌన్: కుమారుడి పుట్టినరోజు నాడే ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు, కుమారుడు విగతజీవులుగా మారారు. నాగర్‌కర్నూ ల్ జిల్లాలోని కల్వకుర్తి పద్మశ్రీ నగర్ కాలనీకి చెందిన టేకులపల్లి వెంకటయ్య(45), అనిత(42) దంపతులకు కుమార్తె అంకిత, కుమారుడు సాయికిరణ్(5) సంతానం. శనివారం సాయికిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఊర్కొండపేట అభయాంజనేయస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ఊర్కొండ సమీపంలోని జడ్చర్ల– కల్వకుర్తి ప్రధాన రహదారిపై ఎదురుగా వేగంగా వచ్చిన ఓ కారు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వెంకటయ్య, సాయికిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, అనిత, అంకిత తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వెల్దండలోని ఎన్నమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనిత మరణించింది. కుమారుడి కోసమే.. వెంకటయ్య మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు అయిన తర్వాత వారసుడి కోసం వెంకటయ్య అనితను రెండో పెళ్లి చేసుకున్నాడు. అనితకు సైతం మొదటి కాన్పులో కూతురే పుట్టింది. చాలాకాలానికి సాయికిరణ్ జన్మించాడు. -
గుండెపోటుతో ఆర్మీ మేజర్ మృతి
పరకాల: పండుగ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు వారం క్రితం సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆర్మీ మేజర్ దూడపాక సాయికిరణ్ (31)గుండెపోటుతో మృతిచెందాడు. హనుమకొండ జిల్లా పరకాలలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పరకాల పట్టణంలోని మల్లారెడ్డి కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి దూడపాక పోశయ్య, సుశీల దంపతులకు సాయికృష్ణ, సాయికిరణ్‌లు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరినీ చిన్నప్పుడే తండ్రి గోల్కొండ సైనిక్ స్కూల్లో చేర్చారు. ప్రస్తుతం సాయికిరణ్ అమృత్సర్ లో మేజర్‌గా విధులు నిర్వహిస్తుండగా సోదరుడు సాయికృష్ణ జోధ్‌పూర్‌లో పనిచేస్తున్నాడు. సాయికిరణ్‌కు 5 ఏళ్ల క్రితం అపూ ర్వతో వివాహం జరిగింది. వీరికి రెండున్నర సంవత్సరాలు కుమారుడు ఉన్నాడు. సంక్రాంతి పండుగ కోసం ఈ నెల 7న సాయికిరణ్ పరకాలకు చేరుకున్నాడు. అంతకన్నా ముందే సోదరు సాయికృష్ణ కూడా సెలవుల్లో ఇంటికి వచ్చాడు. కాగా, సాయికిరణ్ శనివారం బూత్‌రూమ్‌కు వెళ్లి వచ్చిన కొద్ది సేపటికే గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు పరకాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. ఆదివారం సాయికిరణ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పరకాల సీఐ పుల్యాల కిషన్ తెలిపారు. -
అతడెవడు.. సస్పెన్స్
సాయికిరణ్ హీరోగా, వికాసిని రెడ్డి, జ్యోతిసింగ్ హీరోయిన్లుగా వెంకట్‌రెడ్డి నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అతడెవడు’. ఎస్ఎల్ఎస్ సమర్పణలో తోట సుబ్బారావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, మొదటి సన్నివేశానికి తోట నాగేశ్వర్ రావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘డిఫరెంట్ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు తోట సుబ్బారావు. ‘‘క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌స్టోరీ ఇది’’ అన్నారు నంది వెంకట్‌రెడ్డి. ‘‘ఈ సినిమాలో చిరంజీవిగారి అభిమానిగా నటిస్తున్నాను’’ అన్నారు సాయి కిరణ్. ఈ చిత్రానికి సంగీతం: డమ్స్ర్ రాము, కెమెరా: డి. యాదగిరి. -
నందికొండ వాగుల్లోన...
‘గీతాంజలి’ చిత్రంలోని ‘నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లోన’ పాట ఎంత సూపర్‌హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడా పాట ప్రస్తావన ఎందుకంటే.. ‘నందికొండ వాగుల్లోన’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. లక్కీ ఏకరీ, పూజశ్రీ జంటగా షఫీ, సాయికిరణ్ ముఖ్య తారలుగా సత్యనారాయణ ఏకరీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రఘు.హెచ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సాయి వెంకట్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని దర్శకుడు తేజ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నా వద్ద పనిచేసిన యువకులు చేసిన తొలి సినిమా పోస్టర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నా మొదటి సినిమా ‘చిత్రం’ నాకెంత పేరు తెచ్చి పెట్టిందో...‘ నంది కొండ వాగుల్లోన’ సినిమా ద్వారా వీరు అంతకన్నా ఎక్కువ విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘మా గురువు తేజగారు మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసి, మమల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు’’ అన్నారు సత్యనారాయణ ఏకరీ. ‘‘ఈ నెల 25న పాటలు విడుదల చేసి, మార్చిలో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత రఘు.హెచ్. లక్కీ ఏకరీ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి. -
నందికొండ వాగుల్లోన...
సాయికిరణ్, షఫి, పూజశ్రీ, జ్యోతిక యాదవ్ ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. ఏకారి సత్యనారాయణ దర్శకత్వంలో బీచుపల్లి రఘు నిర్మించారు. భరత్‌సింహా రెడ్డి సమర్పకుడు. నందికొండ వాగుల్లోన ఏం జరిగింది? ఎవర్నైనా మర్డర్ చేశారా? లేదా ప్రేమికులు హాలీడే ట్రిప్‌కు వెళ్లారా? లేక అక్కడేమైనా మిస్టరీ దాగుందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ‘‘సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. లవ్, సెంటిమెంట్, కామెడీలతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీతాచారి. -
యువకుడి అనుమానాస్పద మృతి
- లాడ్జీలో ఉరికి వేలాడుతుండగా గుర్తించిన సిబ్బంది - రెండ్రోజుల కిందట మృతి చెందినట్లు అనుమానం అనంతపురం సెంట్రల్ : అనంతపురం ఆర్టీసీ బస్టాండు రోడ్డులోని ప్రశాంతి లాడ్జీలో కదిరి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన సాయికిరణ్(27) అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉండగా గురువారం కనుగొన్నారు. త్రీటౌన్ ఎస్ఐ జైపాల్‌రెడ్డి కథనం మేరకు... బీటెక్ పూర్తి చేసిన సదరు యువకుడు వారం రోజుల కిందట లాడ్జీలో అద్దెకు దిగాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఇటీవలే అతనికి ఉద్యోగం వచ్చింది. 15 రోజుల కిందట కదిరి నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన అతను హైదరాబాద్ వెళ్లొచ్చినట్లు కూడా ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే తిరిగి ఇంటికి వెళ్లకుండా బస్టాండ్ సమీపంలో లాడ్జీలో అద్దెకు దిగాడు. ప్రతి రోజూ లాడ్జీ నిర్వాహకులతో మాట్లాడేవాడు. రెండ్రోజులుగా అతను కనిపించకపోవడంతో గదికి రాలేదేమోనని అనుకున్నారు. గురువారం పరిశీలించగా.. గది తలుపులు వేసి ఉన్నా టీవీ ఆన్‌లో ఉండడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి తొంగిచూడగా ఉరికి వేలాడుతుండడాన్ని చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ జైపాల్‌రెడ్డి తమ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గది తలుపులను బలవంతంగా తెరిపించారు. ఎన్నెన్నో అనుమానాలు సాయికిరణ్ మృతి చెంది ఒక రోజు అవుతోందని లాడ్జీ నిర్వాహకులు అంటుండగా, మృతదేహాన్ని పరిశీలిస్తే రెండ్రోజుల క్రితమే చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు బలం చేకూరేలా మృతదేహం కూడా పూర్తిగా ఉబ్బిపోయి దుర్వాసన కొడుతోంది. రక్తస్రావం కూడా జరిగి ఉండడాన్ని గుర్తించారు. అసలేం జరిగిందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా సాయికిరణ్ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని తెలిసింది. ఇప్పుడు సాయికిరణ్ మృతి వెనుక ప్రేమవ్యవహారం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ విచారణ సాగిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలొ ఇంజనీరింగ్ విద్యార్ధి మృతి
హైదరాబాద్: వనస్ధలిపురంలో గురువారం తెల్లజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న బైకు డీసీఎంను ఢీ కొట్టడంతో ఇంజనీరింగ్ విద్యార్ధి సాయికిరణ్ మృతి చెందాడు. సాయి కిరణ్ తో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రికార్డుకెక్కిన చెస్‌బోర్డు!
కాచిగూడ: నారాయణగూడలోని హెచ్ఆర్డీ కళాశాల ఎమ్మెస్సీ విద్యార్థి ముస్లోజు సాయికిరణ్ తయారు చేసిన సూక్ష్మ చెస్‌బోర్డుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. 3 సెంటీమీటర్ల చెస్‌బోర్డుతో పాటు బోనం ఆకృతి, అమరవీరుల స్థూపం, వరల్డ్ కప్ నమూనా, 0.3 మిల్లీగ్రాముల బంగారంతో చేసిన ఈగ, పెన్సిల్ మొనపై జాతీయ జెండా, బియ్యం గింజపై జాతీయ జెండా సూక్ష్మ వస్తువులను తయారు చేశాడు. సోమవారం హెచ్ఆర్డీ కళాశాలలో ప్రదర్శించాడు. కళాశాల వైస్ ప్రెసిడెంట్æపి.అనురాధ, ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి అభినందించారు. -
పులకించిన పున్నవల్లి
ఐసీడబ్ల్యూఏలో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన పున్నవల్లి విద్యార్థి పున్నవల్లి(చందర్లపాడు) : మండలంలోని పున్నవల్లి గ్రామానికి చెందిన ఉడత వెంకట సాయికిరణ్ ఐసీడబ్ల్యూఏ ఫైనల్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు వెంకట సాయికిరణ్‌కు అభినందనలు తెలిపారు. వెంకటసాయి కిరణ్ సీఏ–సీపీటీలో జాతియ స్థాయిలో 6వ ర్యాంకు, ఐపీసీసీలో 12వ ర్యాంకు, ఐసీడబ్ల్యూఏ ఫౌండేషన్‌లో ప్రథమ ర్యాంకు, ఇంటర్లో 5వ ర్యాంకు సాధించాడు. మారుమూల గ్రామానికి చెందిన వెంకట సాయికిరణ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి అత్యుత్తమ ర్యాంకులు సాధించడం అభినందనీయమని స్థానిక ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వాసిరెడ్డి వంశీ పేర్కొన్నారు. -
సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డ బాలుడు
తాడెపల్లిగూడెం(పశ్చిమగోదావరి): ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడెపల్లిగూడెం మండలం మొదుగుకుంట గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఎం. సాయికిరణ్(7) అనే బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డాడు. ఇది గమనించిని స్థానిక మహిళ వెంటనే గుంటలో దూకి బాలుడిని బయటకు తీసి రక్షించింది. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
డీసీఎం బీభత్సం.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు గాయాలు
బంజారాహిల్స్ (హైదరాబాద్): బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సైదాబాద్ సింగిరేణి కాలనీకి చెందిన సాయికిరణ్ (26) మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో విధులకు హాజరయ్యేందుకు బైకుపై వెళ్తుండుగా తెలంగాణ భవన్ వద్ద సిగ్నల్ పడటంతో ఆగాడు. ఆయన ముందున్న డీసీఎం వ్యాన్ బ్రేకులు ఫెయిల్ కావడంతో వెనక్కి వచ్చింది. బైక్‌పై ఉన్న సాయికిరణ్‌ను ఢీకొట్టి ఆ వెనుకాలే ఉన్న మరో రెండు కార్లను కూడా ఢీ కొట్టడంతో కార్లు, బైకు పూర్తిగా దెబ్బతిన్నాయి. సాయికిరణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. డీసీఎం వ్యాను డ్రైవర్ రంగయ్యను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేరింతా మూవీ ఓపెనింగ్