బంజారాహిల్స్ (హైదరాబాద్): బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సైదాబాద్ సింగిరేణి కాలనీకి చెందిన సాయికిరణ్ (26) మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో విధులకు హాజరయ్యేందుకు బైకుపై వెళ్తుండుగా తెలంగాణ భవన్ వద్ద సిగ్నల్ పడటంతో ఆగాడు.
ఆయన ముందున్న డీసీఎం వ్యాన్ బ్రేకులు ఫెయిల్ కావడంతో వెనక్కి వచ్చింది. బైక్‌పై ఉన్న సాయికిరణ్‌ను ఢీకొట్టి ఆ వెనుకాలే ఉన్న మరో రెండు కార్లను కూడా ఢీ కొట్టడంతో కార్లు, బైకు పూర్తిగా దెబ్బతిన్నాయి. సాయికిరణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. డీసీఎం వ్యాను డ్రైవర్ రంగయ్యను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
డీసీఎం బీభత్సం.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు గాయాలు
Published Fri, Sep 4 2015 8:47 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM
Advertisement
Advertisement