dcm van accident
-
అరటి పండ్లను ఎత్తుకెళ్లిన స్థానికులు..
చివ్వెంల(సూర్యాపేట) : వేగంగా వస్తున్న డీసీ ఎం అదుపు తప్పి బోల్తాపడంది. ఈ సంఘటన చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామశివారులో సూర్యాపేట-ఖమ్మం రహదారిపై ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి సూర్యాపేటకు అరటి పండ్ల లోడుతో వస్తున్న డీసీఎం బీబీగూడెం గ్రామ శివారులో అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో అరటి పండ్ల ట్రేలు కిందపడడంతో గమనించిన స్థానికులు, రహదారిపై వెళ్తున్న వాహనచోదకులు ట్రేలతో సహా అరటి పండ్లను తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బి.ప్రవీణ్‌కుమార్ వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పండ్ల విలువ రూ.లక్ష వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. తమకు ఇంతవరకు ఎవరు ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు. -
లారీ- డీసీఎం వ్యాను ఢీ,ఒకరి మృతి
-
క్యాబిన్లో ఇరుక్కుని... నరకం...
సాక్షి, నల్గొండ : జిల్లాలోని ఐటిపాముల శివారు ఎన్టీఆర్ నగర్ వద్ద నేషనల్ హైవే 65 పై ఆగి ఉన్న లారీని.. కోళ్ల లోడుతో వెళుతున్న డీసీఎం వ్యాను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం క్యాబిన్లో ముగ్గురు ఇరుక్కుపోయారు. క్యాబిన్లో చిక్కుకుపోయినవారిని క్రేన్ల సాయంతో బయటకు తీశారు. కాగా వీరిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం జరగడంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డీసీఎం బీభత్సం.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు గాయాలు
బంజారాహిల్స్ (హైదరాబాద్): బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సైదాబాద్ సింగిరేణి కాలనీకి చెందిన సాయికిరణ్ (26) మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో విధులకు హాజరయ్యేందుకు బైకుపై వెళ్తుండుగా తెలంగాణ భవన్ వద్ద సిగ్నల్ పడటంతో ఆగాడు. ఆయన ముందున్న డీసీఎం వ్యాన్ బ్రేకులు ఫెయిల్ కావడంతో వెనక్కి వచ్చింది. బైక్‌పై ఉన్న సాయికిరణ్‌ను ఢీకొట్టి ఆ వెనుకాలే ఉన్న మరో రెండు కార్లను కూడా ఢీ కొట్టడంతో కార్లు, బైకు పూర్తిగా దెబ్బతిన్నాయి. సాయికిరణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. డీసీఎం వ్యాను డ్రైవర్ రంగయ్యను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కంటెయినర్, డీసీఎం వ్యాన్ ఢీ: ఇద్దరి మృతి
తూప్రాన్ (మెదక్): తూప్రాన్ మండల కేంద్రానికి సమీపంలోని బైపాస్ మార్గం వద్ద ఆగి ఉన్న కంటెయినర్‌ను స్నేహ చికెన్ సెంటర్‌కు చెందిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. గురువారం ఉదయం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో సైదులు (30), ఎల్లయ్య (28) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. డీసీఎం, కంటెయినర్‌ను ఢీకొట్టడంతో భయపడ్డ కంటెయినర్ డ్రైవర్ తన కంటెయినర్‌తో అక్కడి నుంచి వెళ్లి పోయేందుకు ప్రయత్నించాడు. అలా రెండు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత కంటెయినర్‌కు డీసీఎం అతుక్కుపోయిన విషయం తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.